మంచాల: హాస్టల్‌లో వడ్డించిన అల్పాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బీసీ బాలికల వసతి గృహంలో మొత్తం 94 మంది విద్యార్థినులు ఉన్నారు. శనివారం ఉదయం వీరికి అల్పాహారంగా పులిహోర పెట్టారు. అందులో పురుగులు వచ్చాయని విద్యార్థినులు చెబుతున్నా రు. అల్పాహారం తిన్నవారిలో ఒకరి తర్వాత ఒకరు తలనొప్పి, కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
పదుల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంట వ్యవధిలోనే 30 మందికి పైగా విద్యార్థినులు వాంతులు చేసుకుని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని వాపో యారు. వారికి ఆస్పత్రి వైద్యుడు శ్రావణ్ కుమా ర్‌రెడ్డి చికిత్స చేశారు.
కాగా, తీవ్ర అస్వస్థతకు గురై న కె.అనిత (7వ తరగతి), కె.అఖిల (8), వి.వైష్ణవి (5), ఎం.శిరీష (5), పి.అక్షర (3), ఎం.పూజ (7), ఆర్.త్రిష (10), ఎం.శ్రీనిధి (4వ తరగతి)ని మెరు గైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇందులో నలు గురిని వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తీసు కెళ్లారు. విద్యార్థుల విషయంలో వార్డెన్‌తో పాటు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment