illness
-
గుట్టు వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్లో గ్రామం
శ్రీనగర్: అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు. ఈ నేపధ్యంలో తాజాగా చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) బృందం రాజౌరి జిల్లాలోనిబుధల్ గ్రామాన్ని సందర్శించింది.ఈ సందర్భంగా డాక్టర్ అమర్జిత్ సింగ్ భాటియా మాట్లాడుతూ ఈ అంతుచిక్కని వ్యాధికిగల కారణం వెల్లడయ్యిందని, బాధితులకు మెరుగైన చకిత్స అందిస్తామని, వారంతా త్వరలోనే కోలుకుంటారని అన్నారు. మరోవైపు స్థానిక వైద్యాధికారులు గ్రామాన్ని క్వారంటైన్ చేశారు. రాజౌరి పరిపాలన అధికారులు 150 పడకల తాత్కాలిక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటలూ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం ఈ మరణాలకు బాధితుల మెదడుకు హాని జరగడమే ప్రధాన కారణం. ఫలితంగా వారి నాడీ వ్యవస్థ దెబ్బతింది. తాజగా ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన తొమ్మదిమందిలో ఐదుగురు కోలుకున్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడి జనం ఆహార పదార్థాలను పరస్పరం పంచుకోవద్దని సూచిస్తున్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పోషకాహారం అందిస్తున్నారు. దుస్తులు, మందులు, పరిశుభ్రతా పరికరాలను అందిస్తున్నారు. ఈ కేంద్రంలో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు పోలీసుశాఖ గ్రామంలో చోటుచేసుకున్న మరణాలకు నేరపూరత చర్యలేవైనా కారణమై ఉండవచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు! అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు! నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి. సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లిది ప్రాణం కాదా..
చేవెళ్ల: ‘ప్రాణం ఎవరిదైనా ఒకటే.. పిల్లిది అయితే ప్రాణం కాదా.. అల్లారు ముద్దుగా ఐదునెలలుగా పెంచుకుంటున్నాం.. అది ఇప్పుడు ఇంట్లో లేదంటే ఎంతో బాధగా ఉంది.. ఏమీ తినడం లేదని ఆస్పత్రికి వస్తే ఏవో మందులు ఇచ్చి చంపేశారు’ అంటూ ఓ మహిళ కంటతడిపెట్టుకుంది. ఈ సంఘటన చేవెళ్లలో మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన పౌజియా బేగం పిల్లలతో కలిసి కొంతకాలంగా చేవెళ్లకు వచ్చి స్థిరపడింది. ఐదు నెలల కిత్రం ముచ్చటపడి పిల్లిపిల్లను తెచ్చుకుంది. ఇంటిల్లిపాదీ దానిని అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు రోజులుగా అది ఏమీ తినకపోవడంతో చేవెళ్లలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చి, ఓ మందు తాగించి పంపించారు. ఇంటికి వెళ్లిన కాసేపటికి పిల్లి ఫిట్స్ వచి్చనట్లు కొట్టుకుంటూ అడ్డం పడిపోయింది. మళ్లీ ఆస్పత్రికి తీసుకురాగా వైద్య సిబ్బంది వైద్యం అందిస్తుండగా అది మృతి చెందింది. దీంతో పౌజియా బేగం, ఆమె కుమారుడు అక్బర్ సిబ్బందితో గొడవకు దిగారు. అల్లరుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి వైద్యం వికటించి మృతి చెందిందని.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సరైన వైద్యం చేయకపోవడంతోనే పిల్లి చనిపోయిందని వైద్యం చేసిన సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశం పిల్లికి అనారోగ్యంగా ఉండడంతో నయం చేసేందుకు వైద్యసిబ్బంది ప్రయతి్నంచారని చేవెళ్ల వెటర్నరీ వైద్యుడు తిరుపతిరెడ్డి తెలిపారు. ముందుగా వచ్చినప్పుడు ఆస్పత్రిలో ఉండే కాంట్రాక్ట్‌పై పనిచేసే సబార్డినేట్ దేవేందర్ నట్టల మందు, జ్వరం మందు వేసి పంపించాడని.. తరువాత మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని రాగా చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషయంపై జేడీ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించామని ఆయన ఆలూరు వైద్యులతో బుధవారం పోస్టుమార్టం చేయించాలని.. ఏం జరిగిందో విచా రణ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా తనపై దాడి చేశారని దేవేందర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో అమానుషం
జగిత్యాల: అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటోంది. ఓ చేయికి గాయం అయినా భర్త ఆస్పత్రిలో ఉండటంతో ఆయనకు సపర్యలు చేసేందుకు వెంట వచ్చింది. వారం రోజులుగా దవాఖానాలోనే ఉన్న ఆమె హైబీపీతో తన భర్తకు ఇచ్చిన బెడ్‌పై పడిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డు పక్కన దింపడంతో భర్త కూడా బయటకు వచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురవడంతో వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్దాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తోంది అతని భార్య మల్లవ్వ. అయితే, ఆమె చేతికి గాయమైనప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి, సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోతోంది. తన భర్తకు ఆస్పత్రిలో కేటాయించిన బెడ్‌పై ఉన్న మల్లవ్వను శుక్రవారం గమనించిన వైద్య సిబ్బంది వీల్‌చైర్‌పై బయటకు తీసుకెళ్లి, రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు. అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండటాన్ని గమనించిన రాజనర్సు తనకు వైద్యం వద్దని బయటకు వచ్చి, రోడ్డు పక్కన పడుకొని ఉన్న భార్య వద్దకు చేరుకున్నాడు. ఈ దంపతులను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్ఎంవో నవీన్‌ను వివరణ కోరగా ఇలాంటి సంఘటన జరగలేదని, ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.గతంలోనూ ఇలాంటి ఘటనలు..జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని పాత్ బస్‌స్టేషన్‌లో దింపి పోగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరి గి ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఓ గర్భిణి కడుపులో వస్త్రాలు మరిచిపోయిన ఘటన వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా గా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆస్పత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.చర్యలు తీసుకున్నా మారని తీరు..జగిత్యాల ఆస్పత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సూపరింటెండెంట్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ధ దంపతుల విషయంలో కఠిన వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా దవాఖానా సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టాలంటున్నారు. -
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత
ఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురువారం రాత్రి హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆసుపత్రిలో ఏ అనారోగ్య సమస్య కారణంగా చేరారో తెలియరాలేదు.అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్.. 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.ఇదీ చదవండి: అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన -
భార్యను వదిలేసి పరారీ..
బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడొక భర్త. తనకోసం భర్త వస్తాడని ఆ అభాగ్యురాలు ఆరు రోజులుగా నిరీక్షిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌కు చెందిన లక్ష్మణ్ బిచ్కుందలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కూలీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈనెల 18న రాత్రి లక్ష్మణ్ తన భార్య జ్యోతిని తీసుకుని బాన్సువాడలోని సరస్వతి మందిరం సమీపానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఇసుక డంప్‌పై ఆమెను పడుకోబెట్టి, తెల్లారి వస్తానని చెప్పి, మూడు నెలల బాబును మాత్రం తీసుకుని వెళ్లాడు. తెల్లారి వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి.. చలిలో ఇసుకపైనే గడుపుతోంది. అక్కడ ఉన్న స్థానికులు దీనిని గమనించి రోజూ అన్నం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయతి్నంచామని, కానీ వైద్యులు చేర్చుకోలేదని తెలిపారు. మంగళవారం కొందరు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జ్యోతిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త వచ్చి తనను తీసుకెళ్తాడని జ్యోతి ఆశతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది. -
బిల్ క్లింటన్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు.నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు. -
కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం పూట ఆడుకుంటున్న సమయంలో కేజీబీవీ సమీపంలోకి ఒక అంబులెన్స్ రాగా.. విద్యార్థినులు ఆందోళనతో స్పృహ తప్పారు. వీరిలో పదో తరగతి చదువుతున్న మమత, కృష్ణవేణి, వైశాలి, ప్రథమ సంవత్సరం చదువుతున్న నిహారిక, 7వ తరగతి చదువుతున్న తేజస్విని, 9వ తరగతి చదువుతున్న మమత మొత్తం ఆరుగురు విద్యార్థినులు ఉన్నారు. గ్రహించిన సిబ్బంది సారంగాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జగిత్యాలలోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. జగిత్యాల వైద్యులు బాలికలకు చికిత్స నిర్వహించి ప్రమాదం ఏమీ లేదని, విద్యార్థులు టెన్షన్‌కు లోనై ప్యానిక్ కావడంతో ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచుతామని, ఇబ్బందులు లేకుంటే డిశ్చార్జి చేస్తా మని వెల్లడించారు. సారంగాపూర్ మండల కేంద్రం అటవీ ప్రాంతం కావడంతో అక్కడ చలితీవ్రత ఎక్కువ కావడం.. హాస్టల్లో దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది జగిత్యాల మాతాశిశు సంక్షేమ కేంద్రం పరిస్థితి. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ కాలం చెల్లిన మందులు బయటపడ్డాయి. విద్యార్థులకు ఇవే గ్లూకోజ్‌లు పెట్టారా అన్నది సందిగ్ధంలో ఉంది. వైద్యులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు లోనుకావడంతో ఎంఈవో కిశోర్, జె డ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, ఆస్పత్రి ఆర్ఎంవో విజయ్‌రెడ్డి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. -
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలి మృతి
యాలాల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల పరిధిలోని బెన్నూరు ఉన్నత పాఠశాలలో దూది సవిత(47) స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ బోధిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె 20 రోజులుగా పాఠశాలకు సెలవు పెట్టి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందారు. సవిత భర్త శివప్రసాద్ పెద్దేముల్ మండలం కందనెల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలో సవిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అకాల మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు అన్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు!
బొమ్మనహళ్లి: కష్టసుఖాలలో భర్తకు వెన్నంటి ఉండేది భార్య, భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుండి ఊరడిస్తుంది. అదే రీతిలో భర్త తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనిని కళ్ళలో పెట్టుకొని చూసుకొన్న భార్యను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటణ మంగళూరులో జరిగింది. వివరాలు.. స్థానిక యువతి సయాజ్ సైజ్వాని అనే యువతికి, మలేషియాలో నివాసం ఉంటున్న వ్యక్తితో 2016లో పెళ్లయింది. రెండేళ్ల తరువాత ఓ ప్రమాదంలో అతనికి పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు.ఈ సమయంలో సైజ్వాని భర్తకు సహాయంగా నిలిచింది. అన్నం తినిపించ డం, మందులు ఇవ్వడం తదితరాల సేవలు చేసే ది. భార్య చేసిన సేవల వలన పూర్తిగా కోలుకున్న భర్త అసలు బుద్ధిని చూపించాడు. భార్యకు విడాకులు ఇచ్చిన అతడు మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. సైజ్వాని సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తకు రెండవ పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, అతని కథ తెలుసుకున్న నెటిజన్లు బంగారం లాంటి భార్యను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడని శాపనార్థాలు పెట్టారు. -
ఖమేనీ ఆరోగ్యం విషమం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు. -
శంషాబాద్‌లో గవర్నర్ హరిబాబుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, హుటాహుటిన ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలిలోకి స్టార్ ఆసుపత్రికి తరలించారు.కాగా, మిజోరం గవర్నర్ హరిబాబు సోమవారం ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో, హరిబాబును ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఎమర్జెన్సీగా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుíÙత ఆహారం కారణంగా 79 మంది గిరిజన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోడి గుడ్డు, రసంతో భోజనం తిన్న కొద్ది సేపటికే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వీరిలో 61 మందిని హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న సౌజన్య, 6వ తరగతి చదువుతున్న ఎస్.దీవెన, 8వ తరగతి చదువుతున్న జెస్సీల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 520 మంది గిరిజన విద్యార్థినులు ఉన్నారు. ప్రాంతీయ ఆస్పత్రిలో 61 మంది వైద్యసేవలు పొందుతుండగా, జామిగుడ ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన విద్యార్థినులకు కిల్లోగుడ పీహెచ్సీ వైద్య బృందం వైద్యసేవలు అందిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులకు అందిస్తున్న వైద్యసేవలను సమీక్షించారు. -
అనారోగ్యం బారిన పడిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందో? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే.. ఆయనది స్వల్ప అస్వస్థతేనని వైద్యులు ప్రకటించారు. ప్రసాద్ ల్యాబ్‌లో ఉండగానే నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. అయితే నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారు. (చదవండి: గాయం వల్ల షూటింగ్స్‌కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్)ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ..‘పీపుల్ స్టార్’గా ఎదిగారు నారాయణ మూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు..కథ- కథనం, దర్శకత్వం, సంగీతం, గానం.. ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. (చదవండి: సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి)అయితే గత కొంతకాలంగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సీటీ’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. -
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థత కు గురయ్యారు. మంగళవారం ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో జైలు అధికారులు ఢిల్లీలోని హరినగర్ లో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రభుత్వ ఆస్ప త్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రక్త పరీక్షలు, గైనిక్ సంబంధ సమస్యల టెస్టులు చేయించి.. తిరిగి జైలుకు తరలించారు. నిజానికి కవితకు మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొన్నాళ్లుగా గైనిక్ సమస్యతో సతమతంఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న కవితను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యు డీషియల్ కస్టడీపై జైలులో ఉన్నారు. ఇటీవల ఆమె పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రా థోడ్ తదితరులు జైలులో కవితను పరామర్శించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అయితే కవిత గైనిక్ (స్త్రీ సంబంధిత) సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. మంగళవారం దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు సంబంధిత వైద్య పరీక్షలు చేశారని.. బుధవారం ఉదయానికల్లా రిపోర్టులను జైలు అధికారులకు పంపనున్నారని సమాచారం. తనకు గైనిక్ సమస్య ఉందని, బెయిల్ ఇవ్వాలని కవిత గతంలోనే పిటిషన్లు వేసినా.. కోర్టుల నుంచి సానుకూల తీర్పురాలేదు.ఇంటి ఫుడ్ తినట్లేదంటున్న బీఆర్ఎస్ వర్గాలుతిహార్ జైలులో ఉన్న కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నాలుగైదు రోజులపాటు ఇంటి భోజనం చేసిన కవిత.. తర్వాత భోజనం తీసుకురావొద్దని కుటుంబ సభ్యులకు, తమ న్యాయవాదికి చెప్పారు. జైలులో అందరు ఖైదీలకు పెట్టే ఆహారాన్నే కవిత తీసుకుంటున్నారు.కవిత కోసం ఇంటి నుంచి తీసుకొస్తున్న భోజనాన్ని తనిఖీ పేరుతో నలుగురైదుగురు చేతులు పెట్టి పరిశీలిస్తున్నారని.. అలా చేస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉండటంతోనే ఆమె ఇంటి భోజనం వద్దన్నారని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ఇంటి భోజనం తినకపోవడం, గతంలో ఉన్న గైనిక్ సమస్యల కారణంగా.. కవిత అస్వస్థతకు గురైనట్టు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. -
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్ జైలుకు..
ఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
బెంగాలీ కూలీలకు అస్వస్థత
కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్‌రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపటి ముండ్, ఫ్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు. పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు. వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్‌రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాండ్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్‌రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. -
ఇంజక్షన్ వికటించి 17 మందికి అస్వస్థత
-
అల్పాహారం తిని 20 మందికి అస్వస్థత
రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్లో అల్పాహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్నారు. ఇంతలో ఓ విద్యార్థిని బల్లి పడటం చూశానని ఆరోపిస్తుండగా అప్పటికే తిన్న వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్టల్ వార్డెన్ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో 20 మందికి గ్లూకోజ్ ఎక్కించి వైద్యసేవలు అందించగా కోలుకున్నారు. సమాచారం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, తహసీల్దార్ రజనీకుమారి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంజా విజయకుమార్ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం ఆర్డీఓ, డీఈఓ, తహసీల్దార్ హాస్టల్‌కు వెళ్లి వండిన అన్నాన్ని పరిశీలించారు. వంటపాత్రలను, బియ్యాన్ని, ఇతర స్టాక్‌ను కూడా పరిశీలన చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్లోనే భోజనం చేశారు. వంట చేస్తున్న క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. -
పరిసరాలను పట్టించుకుంటున్నారా?
చాలామంది ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటారు కానీ మన చుట్టూ ఎలా ఉంటే ఏమవుతుందిలే అన్నట్లు ఉంటారు. అయితే ఇల్లు, ఇంటిలోని మనుషులు మాత్రమే శుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉంటే ఏం ప్రయోజనం? అనారోగ్యం, అంటువ్యాధులు పోంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దామా?ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, చుట్టుపక్కల ఉండే హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం కూడా అంతేముఖ్యం. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. ఒక సర్వే మేరకు అపరిశుభ్రమైన పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని తెలిసింది. అందువల్ల ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.బ్యాక్టీరియా ఎలాపోతుంది?ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను,రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి క్లాత్‌కు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి.ఎలా శుభ్రం చేయాలి? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే మురికితో΄ాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటురోగాల వ్యాప్తిని తగ్గించొచ్చు. తద్వారా మన పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించొచ్చు. ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్ చేయాలి లేదా చేయించాలి. కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు నిలయాలుగా మారతాయి. అందువల్ల చొరవ తీసుకుని క్లీన్ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి. పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇంటిలోని చెత్తను, తడిచెత్త, పోడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకుల వంటి వాటిని విడిగానూ వేరు చేసి పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.ఏయే పరిసరాలు?⇒వంటశాలలు, భోజన శాలలు ∙మరుగుదొడ్లు, ⇒ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ⇒పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు ⇒చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు ⇒అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత ΄ాటించడం అత్యవసరం ⇒మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. అలాగే, కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగాలి ⇒ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్పైన చాలా దుమ్ము పట్టినట్లు ఉంటుంది. వాటిని కూడా శుభ్రం చేయాలి. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
హజ్ యాత్ర మృతుల్లో... 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో 98 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో మొత్తం 187 మంది భారతీయులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ వివరించారు. ‘ఈ ఏడాది మే 9 నుంచి జూలై 22వ తేదీ వరకు జరగాల్సిన హజ్ యాత్రలో 1.75 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 98 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలన్నీ దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో సంభవించినవే. అరాఫత్ రోజున ఆరుగురు మరణించారు. ప్రమాదాల్లో మరో నలుగురు చనిపోయారు’’ అని జైస్వాల్ మీడియాకు వివరించారు. -
Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు. నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. -
‘న్యూరాలజీ’ బాధితులకు భరోసా
సాక్షి, అమరావతి: మణికంఠ, యోగేంద్ర తరహాలో అనారోగ్యం బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండానే పూర్తి ఉచితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి జబ్బుల బాధితులతో పాటు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందుతున్నాయి. న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1.46 లక్షల మందికి మేలు 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1,46,345 మంది ఉచితంగా చికిత్సలు పొందారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.572.23 కోట్లు వెచ్చించింది. ఇందులో 77,190 మంది న్యూరాలజీ, 69,155 మంది న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్సలు అందుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పథకం బలోపేతంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందుబాటులోకొచ్చాయి. దీంతో న్యూరో, న్యూరో సర్జరీ సమస్యల బాధితులు ఆయా నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు చికిత్స అనంతరం ఆస్పత్రులకు డిశ్చార్జ్ అయిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద భృతిని సైతం ప్రభుత్వం అందిస్తోంది. దీంతో విశ్రాంత సమయంలో రోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతున్నాయి. జబ్బుల బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలను ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. 2019కు ముందు బాబు పాలనలో నీరుగారిపోయిన పథకాన్ని సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేశారు. రూ.25 లక్షలకు వైద్య సేవల పరిమితిని పెంచడంతో పాటు.. 1059 నుంచి 3257కు ప్రొసీజర్లనూ పెంచారు. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తరించారు. దీంతో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 44.78 కోట్ల మంది రూ.13,004 కోట్ల విలువ చేసే వైద్య సేవలు పొందారు. 22 లక్షల మందికి పైగా బాధితులకు చికిత్స అనంతరం రూ.1,300 కోట్లకు పైగా ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందించింది. 3.67 లక్షల మంది గుండె జబ్బు, 3.03 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లెకు చెందిన వెంకటరామయ్యది నిరుపేద వ్యవసాయ కుటుంబం. 2021లో రామయ్య దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు యోగేంద్ర ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగిపడిపోయాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే గుంటూరుకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ అరుదైన జబ్బుకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స చేయించింది. ఈ ఫోటోలో వైద్యుల మధ్య బెడ్‌పై ఉన్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ ఆటోడ్రైవర్. కొంతకాలంగా మూర్చ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆటోను సక్రమంగా నడపలేక జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గతేడాది డిసెంబర్ 29న ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరులోని బ్రింద న్యూరో సెంటర్‌కు తీసుకెళ్లారు. మెదడులో కుడి వైపు, కుడిచెయ్యి, గొంతు, నాలుక, దంతాలు, దవడ, మాటలు వచ్చే భాగం, ముఖానికి నరాలు సరఫరా చేసే మెదడులోని భాగంలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. దానిని తొలగించ కుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల ఖరీదైన అరుదైన ఆపరేషన్‌ను పూర్తి ఉచితంగా ఆస్పత్రిలో నిర్వహించారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ల్యాప్‌ట్యాప్‌లో చూపిస్తూ డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి నిర్వహించిన అరుదైన సర్జరీ అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతం మణికంఠ ఆరోగ్యంగా ఉన్నాడు. -
Fact Check: మీ రాతలే కల్తీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అన్న చందంగా ఒక అబద్ధాన్ని పదేపదే రాసి నిజం చేయాలనే రామోజీ తాపత్రయం ఈనాడులో అడుగడుగునా కొట్టొచ్ఛినట్లు కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతమంది మృతిచెందారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కల్తీ సారా మరణాలని విష ప్రచారం మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులు ప్రతి మరణంపై సమగ్ర విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం సాధారణ మరణాలని, కల్తీ సారా మరణాలు కావని తేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడి అనారోగ్య మరణాలను చిల్లర రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని పచ్చ మీడియా గోబెల్స్‌ను తిప్పికొట్టారు. అయినా తన ఎల్లో మీడియా ‘ఈనాడు’లో కల్తీ రాతలు రామోజీ ఆపలేదు. ‘సారాక్షసి మింగినా సాయం అందలేదు’ అంటూ విషపు కథనాన్ని వండివార్చారు. ఆరోపణ: కల్తీ సారా వల్ల మరణాలు. వాస్తవం: 2022 మార్చి 6 నుంచి 12 మధ్య అనారోగ్య కారణాలు, వృద్ధాప్య కారణాలతో జంగారెడ్డిగూడెంలోని నాలుగు శ్మశాన వాటికల పరిధిలో 18 మంది మృతిచెందారు. మృతుల్లో కొందరికి మద్యం అలవాటు ఉంది. అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో మరణాలు సంభవించాయి. 25 వేల మందికి పైగా జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నెలకు సగటున 20 నుంచి 25 మరణాలు అధికారిక లెక్కల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో కల్తీ సారా తాగి ఇద్దరు మరణించారంటూ 2022 మార్చి 4న సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 12న 25 మందికి పైగా మృతి.. అంటూ పోస్టులు పెట్టారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో డోర్ టు డోర్ హెల్త్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన నలుగురు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి మృతికి కారణాలు తెలుసుకోవడంతోపాటు వైద్యుల నివేదికలు పరిశీలించారు. ఈ విచారణలో అన్నీ అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలేనని, మరణించిన వారిలో కొందరికి మద్యం అలవాటు ఉందని, అయితే మృతికి మద్యం కారణం కాదని తేలింది. చంద్రబాబు వెంటనే శవ రాజకీయాలకు తెరతీశారు. 2022 మార్చి 14న చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో పరామర్శ యాత్ర పేరుతో రాజకీయ యాత్ర నిర్వహించారు. 26 మంది చనిపోయారని ప్రతి ఇంటికీ వెళ్లి పరామర్శిస్తానని నానా యాగీ చేశారు. చివరకు సెంటర్లో సభ పెట్టి సభా వేదిక వద్దకే మృతుల కుటుంబాలను పిలిచి చేతిలో కొంత డబ్బు పెట్టి.. సారా తాగి చనిపోయారని చెప్పమని కోరినా.. వారినుంచి స్పందన రాలేదు. బుట్టాయగూడెంలో సత్యనారాయణ (73) పదేళ్ల నుంచి ఆస్తమాతో బాధపడుతూ మృతి చెందితే జంగారెడ్డిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరణాన్ని కూడా సారా మరణమని ప్రచారం చేశారు. దీనిపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణ: ఇంతవరకూ సంక్షేమం అందలేదు. వాస్తవం: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం గాని, ఎలాంటి సంక్షేమ పథకాలు గాని అందలేదని, వారు బాగా ఇబ్బందిపడుతున్నారంటూ అడ్డగోలు కథనం ప్రచురించారు. దీనిపై మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పరిహారంతో పాటు పలు సంక్షేమ పథకాలు తమకు అందాయని వారు తెలిపారు. రూ. లక్ష బీమాతో పాటుపింఛన్ నా భర్త చింతపల్లి సూరిబాబు మృతిచెందాక బీమా రూ.లక్ష ఇచ్చారు. నాకు వితంతు పింఛన్ రూ.3 వేలు వస్తోంది. పట్టణంలో జగనన్న లేఅవుట్లో ఇచ్చిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తయి ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. మా పెద్దబ్బాయి రమేష్ ఐటీఐ చదివాడు. రెండేళ్లు జగనన్న విద్యాదీవెన అందింది. చిన్న కొడుకు కౌశిక్‌కి గతేడాది 10వ తరగతి పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి అందించారు. – చింతపల్లి రత్నకుమారి, జంగారెడ్డిగూడెం అన్ని విధాలా ‘చేయూత’ నా భర్త బంకూరు రాంబాబు మృతిచెందాక నాకు రూ.3 వేలు పింఛను వస్తోంది. చేయూత పథకంలో నాలుగు విడతలుగా ఏటా రూ.18,750 చొప్పున వస్తోంది. డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. – బంకూరి నాగేశ్వరమ్మ, జంగారెడ్డిగూడెం పథకాలతో ఆదుకున్నారు నా భర్త మృతిచెందే నాటికి నేను, నా భర్త విడిగా ఉంటున్నాం. అప్పటి నుంచి నాకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. నా తండ్రి బంకూరి రాంబాబు, నా భర్త ఆనంద్ అదే సమయంలో మృతిచెందారు. నాకు ప్రస్తుతం రూ.3 వేలు పింఛన్ వస్తోంది. నా కొడుకు బీటెక్ చదువుకుంటున్నాడు. మూడేళ్లుగా వరుసగా విద్యా దీవెన అందుతోంది. నాకు డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. – తలారి రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
Alexey Navalny: నిరసన గళం మూగబోయింది
మాస్కో: రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మూగబోయింది. మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల అలెక్సీ నవాల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ‘‘ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయతి్నంచినా, తక్షణం అంబులెన్సు రప్పించినా లాభం లేకపోయింది’’ అని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణమేమిటో బయట పెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కచి్చతంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో పోటీ పడేందుకు విఫలయత్నం చేసిన నవాల్నీ, నాటినుంచీ ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. పలు స్థాయిల్లో పెచ్చరిల్లిన అవినీతిని బయటపెడుతూ సంచలనం సృష్టిస్తూ వచ్చారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాల్నీని మాస్కో సమీపంలోని జైలు నుంచి గత డిసెంబర్లో దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఇది కచి్చతంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నమేనని అభిమానులు అప్పుడే ఆందోళనలకు దిగారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌ను సవాలు చేసే గట్టి ప్రత్యర్థి లేకపోయినా ‘నవాల్నీ ఫ్యాక్టర్’ ఆయన్ను బాగా చీకాకు పరుస్తోంది. నవాల్నీ అనుయాయులతో పాటు నానాటికీ పెరిగిపోతున్న అభిమాన గణం సోషల్ మీడియా ద్వారా పుతిన్ వ్యతిరేక ప్రచారంతో దేశమంతటా హోరెత్తిస్తోంది. దేశ విదేశాల్లోని పుతిన్ అపార ఆస్తుల చిట్టాను కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా విప్పుతూ ఫొటోలు, వీడియోలతో సహా బయట పెడుతూ వస్తోంది. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్‌లు వచ్చి పడుతున్నాయి! ఈ నేపథ్యంలో నవాల్నీ ‘మృతి’ పుతిన్ పనేనని భావిస్తున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాలన్నీ స్పందించాయి. పుతిన్ అణచివేతను నవాల్నీ ఆజన్మాంతం అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించారంటూ పలు దేశాధినేతలు కొనియాడారు. విషప్రయోగం జరిగినా... మూడున్నరేళ్ల క్రితం ప్రాణాంతక విషప్రయోగం జరిగినా వెరవని గుండె ధైర్యం నవాల్నీది! ఆయన 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ‘నొవిచోక్’ దాడికి గురయ్యారు. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని నవాల్నీ లో దుస్తులపై చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బ తీసే నొవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్‌పై ‘అండర్‌ప్యాంట్స్ (లో దుస్తుల) పాయిజనర్’ అంటూ చెణుకులు విసిరారు. దాంతో అండర్‌ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులరైంది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నవాల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగీ దిగగానే ఆయన్ను నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూనే కన్పించారు... నవాల్నీ చివరిసారిగా గురువారం బయటి ప్రపంచానికి కన్పించారు. ఓ కేసు విచారణలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండటమే గాక సరదాగా నవ్వుతూ, విచారణ సందర్భంగా జడ్జితోనూ జోకులు వేస్తూ గడిపారు. సాహసమే శ్వాస... మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జని్మంచిన నవాల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయట పెట్టారు. 2008 నుంచీ ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నవాల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసినా పుతిన్ బలపరిచిన అభ్యరి్థకి గట్టి పోటీ ఇవ్వడంతో నవాల్నీ పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. చివరికి 2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించడంతో ప్రజల దృష్టిలో నవాల్నీ మళ్లీ హీరోగా మారారు. రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్‌ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో ‘విమాన ప్రమాదం’లో మరణించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. నవాల్నీ మాత్రం పుతిన్‌ను గట్టిగా సవాలు చేస్తూ ప్రబల ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్కచేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. నిరసనలు... ఆగ్రహావేశాలు నవాల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుతిన్ పనేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. నవాల్నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎవరినైనా అంతమొందించడం పుతిన్ నైజమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. ఆయన సర్వం కోల్పోవడంతో పాటు తన తప్పిదాలకు బాధ్యునిగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. నవాల్నీ తన అసమాన ధైర్యసాహసాలకు జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావడం బాధాకరమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కొల్జ్ ఆవేదన వెలిబుచ్చారు. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉన్నా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించడం నవాల్నీకే చెల్లిందంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. ఆయన్ను రష్యా ప్రభుత్వమే క్రూరంగా పొట్టన పెట్టుకుందని లాతి్వయా అధ్యక్షుడు రింకేవిక్స్ ఆరోపించారు. తాను అత్యంత బలహీనుడినని ఈ చర్యతో పుతిన్ రుజువు చేసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రష్యాలో స్వేచ్చా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్‌ను విపరీతంగా వణికిస్తోందని మరోసారి రుజువైందని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే నవాల్నీ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పుతినే బాధ్యుడు: భార్య నవాల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవాల్నయా అనుమానాలు వెలిబుచ్చారు. శుక్రవారం మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అన్నారు. సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితర నేతలు ఆమెను ఓదార్చారు. -
అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్(70) అనారోగ్యంతో గత సోమవారం నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆయన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు పెంటగాన్ తెలిపింది. స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయన్ను మెడికల్ సెంటర్లో చేరి్పంచినట్లు పెంటగాన్ ప్రతినిధి ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ శుక్రవారం(స్థానిక కాలమానం ప్రకారం) చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, ఈ రోజే ఆయన విధుల్లో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, వైద్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఆస్టిన్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు. అవసరమైన పక్షంలో సహాయ మంత్రి కాథ్లీన్ హిక్స్ ఆయన స్థానంలో బాధ్యతలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. -
వారం రోజుల్లో 200 మంది విద్యార్థినులకు అస్వస్థత
జిన్నారం(పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం శివారులోని నారా యణ కళాశాలలో విద్యార్థినులు వాంతులు, విరోచ నాలతో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. నారాయణ బాలికల కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు ఉన్నారు. నెలరోజుల నుంచి విద్యార్థినులు విరోచనాలు, వాంతులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని యాజ మాన్యం గుట్టుగా ఉంచటంతోపాటు రహస్యంగా విద్యార్థినులను ఇంటికి పంపిస్తోంది. వారంరోజు ల్లో 200 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలు కావ టంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భారీ సంఖ్యలో కళాశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. కలు షిత నీరు, ఆహారం వల్లే ఇబ్బందులు పడుతున్నా మని విద్యార్థినులు వాపోయారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రి వెంక టేశ్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది మూడుసార్లు ఇలాగే జరిగిందని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నదే తప్ప విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యం దృష్టి సారించటంలేదని విమర్శించారు. సంక్రాంతి పండుగ పేరిట విద్యార్థినులకు పది రోజులపాటు యాజమాన్యం సెలవులు ప్రకటించిందన్నారు. -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్‌కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్‌బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్‌బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్‌బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
ఆమె వ్యాధి 'మెడికల్ మిస్టరీ'! ఏ భావోద్వేగాన్ని వ్యక్తం చేసినా ఇక అంతే..!
కొన్ని రకాల వ్యాధులు వైద్యానికి అంతు చిక్కని మిస్టీరియస్ వ్యాధుల్లా ఉంటాయి. బాబోయ్ ఇదేం వ్యాధి! అనేలా జుగుప్సకరంగా ఉంటాయి. ఆ వ్యాధిని ఫేస్ చేస్తున్న బాధితులకే కాదు చూస్తున్న వాళ్లను కూడా హడలెత్తిస్తాయి. అలాంటి అంతు చిక్కని విచిత్రమైన వ్యాధిని ఎందుర్కొంటోంది 20 ఏళ్ల బెత్ త్సంగరైడ్స్. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన బెత్ త్సంగరైడ్స్ అనే 20 ఏళ్ల అమ్మాయి వైద్య విధానానికి అందని ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎలాంటి భావోద్వేగాలకు స్పందించిందా ఇక అంతే!.. ఆమె శరీరీం యాసిడ్ పోసినట్లు భగభగమని మండిపోతుంటుంది. వెంటనే చర్మంపై దద్దుర్లతో కూడిన ర్యాషస్ వచ్చేస్తాయి. అవి అచ్చం కాలిన గాయాల మాదిరిగా దారుణంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఆమెకు సరిగ్గా 15 ఏళ్ల ప్రాయం నుంచి ఫేస్ చేస్తోంది. వైద్యులు సైతం ఆమె వ్యాధిని 'మెడికల్ మిస్టరీ'గా వ్యవహరించారంటే.. అది ఎంత విచిత్రమైన వ్యాధో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని వైద్య భాషలో 'చలనశీత సమస్యలని' అంటారు. నవ్వడం దగ్గర నుంచి ఏడుపు వరకు ప్రతిదానికి ఆమె ముఖంపైన చర్మం రియాక్షన్ ఇచ్చేస్తుంది. దీంతో ఆమె ఆ బాధను భరించలేక బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోయింది. అదీ కూడా ఓ గదిలో ఒంటిరిగా ఉండటమే. కనీసం బయటకు వెళ్లి గడిపే అవకాశం కూడా లేదు. వీచే గాలులకు, మంచి సుగంధభరితమైన వాసనలకు ఆమె చర్మం వెంటనే రియాక్షన్ చెంది ర్యాషస్ వచ్చేయడం మొదలైపోతుంది. ఈ అసాధారణ దీర్ఘకాలిక వ్యాధి కారణంగా సరిగా స్కూల్ ఎడ్యుకేషన్ సాగలేదు, స్నేహితులు కూడా లేకుండా పోయారని ఆవేదనగా చెబుతోంది. ఈ వింత వ్యాధిని టాచీకార్డియో సిండ్రోమ్(పీవోటీఎస్)గా నిర్థారించారు వైద్యులు. అమెరికా నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం..ఈ పీవోటీఎస్ వ్యాధికి సాధారణంగా మైకము, మూర్ఛ, దడ, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి కానీ ఆమెకు మాత్రం అసాధారణమైన లక్షణాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా అరుదుగా కొద్దిమందిలోనే కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి కారణంగా ఆమె ప్రేగులు, మూత్రపిండాలు సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధి కారణంగా ఆమె మొత్తం ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. ఆమె ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏదీపడితే అది తినేందుకు కూడా వీలులేదు. కనీసం బయట ఫుడ్‌ని కూడా ఆస్వాదించలేదు. ఒకవేళ తినాలనుకున్నా చాలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ చెఫ్‌లకు తనకు ఇచ్చే ఆహారం ప్రిపరేషన్‌కి సంబంధించిన జాగ్రత్తలు వివరించాలి. ఇంత తతంగం ఉంటేనేగానీ బయటకీ రాలేని స్థితి ఆ అమ్మాయి పరిస్థితి. ఈ రియాక్షన్లతో ఆమె ముఖం మచ్చలు మచ్చలుగా అసహ్యంగా తయారయ్యింది. కనీసం అద్దంలో చూసుకుంటేనే ఒక విధమైన ఇబ్బందికి అనిపిస్తుంది ఆమెకు. అయినప్పటికీ ఆ ఇబ్బందులన్నింటిని తట్టుకుని నూతన ఉత్సహాంతో గడిపేయత్నం చేస్తోంది. తన పరిస్థితి ఇంతే..! తానే బాగుండటానికి ప్రయత్నించాలని సమస్యతో పోరాడేలా తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే యత్నం చేస్తోంది. పైగా ముఖానికి మేకప్ వేసుకుని ఆకర్షణీయంగా కనిపించే యత్నం కూడా చేస్తోంది. . అయితే వైద్యులు ఈ మేకప్‌ని కూడా అస్సలు వినియోగించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే 'ఆమెకు ఆమె ఎలర్జీ' కదా!. ఐతే బెత్ త్సంగరైడ్స్కి మేకప్ వేసుకోవడమంటే చాలా ఇష్టమంటా..!. అలా మేకప్ వేసుకుని తనను తాను చూసుకోవడం ఇష్టం అని చెబుతుంది బెత్ త్సంగరైడ్స్. నిజానికి ఇలాంటి వ్యాధి పగవాడికి రాకూడదనిపిస్తోంది. అసలు ఎలాంటి భావోద్వేగం చెందించలేని స్థితి అంటే.. ఎంతటి దారుణమైన స్థితి. ఒకరకంగా చెప్పాలంటే జీవనమే స్థంబించనట్లు ఉంటుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి తనలో ఆత్మవిశ్వాసాన్ని కూడగొట్టుకుని బతికే యత్నం చేస్తున్నందుకు హ్యాట్సాప్ అని చెప్పాలి కదూ..!. View this post on Instagram A post shared by Beth Tsangarides (@bethtsangarides) (చదవండి: జస్ట్ హెయిర్ డ్రైయర్ వాడినందుకు.. ఏకంగా రూ. 78 వేలు వసూలు చేసిన హోటల్ యాజమాన్యం!) -
అనారోగ్యమంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారా?
కాంతిమతి ఒక ఐఏఎస్ ఆఫీసర్. మంచి కలెక్టర్‌గా ప్రజల గుర్తింపు పొందింది. ప్రస్తుతం సెక్రెటేరియట్‌లో కీలక స్థానంలో పనిచేస్తోంది. సమర్థమైన అధికారిగా మంత్రుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఆమెకు తన ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ. ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్రంగా ఆందోళన చెందుతుంది. మొహంపై చిన్న మచ్చ కనపడగానే తనకు స్కిన్ క్యాన్సర్ వచ్చిందేమోనని అన్ని పరీక్షలు చేయించుకుంది. అలాంటిదేం లేదని డాక్టర్లు చెప్పినా సమాధానపడలేదు. ఒకరోజు ఓ ముఖ్యమైన మీటింగ్‌లో ఉండగా గుండెలో ఏదో బరువుగా అనిపించింది. అంతే.. తనకు గుండెపోటు వచ్చిందని హడావుడిగా బయల్దేరి ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు చేసి అలాంటిదేమీ లేదని నిర్ధారించినా ఆమె మనసు శాంతించలేదు. మరో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అక్కడ కూడా అదే మాట చెప్పినా.. డాక్టర్లు ఏదో మిస్ అవుతున్నారంటూ తన లక్షణాల గురించి ఇంటర్నెట్లో విపరీతంగా బ్రౌజ్ చేస్తుండేది. మరోసారి కడుపునొప్పికే నానా హంగామా చేసింది. అత్యవసరమైతే వైద్యులు అందుబాటులో ఉండరని క్యాంప్‌లకు వెళ్లడం మానేసింది. ఇదంతా ఆమె కెరీర్ పై కూడా దుష్ప్రభావం చూపుతోందని భర్త ఆనంద్ చెప్పినా పట్టించుకోవడం లేదు. తన సమస్యను అర్థం చేసుకోవడం లేదంటూ వాదిస్తోంది. దీంతో వాళ్ల మధ్య తరచూ గొడవలవుతున్నాయి. ఈ విషయమై మాట్లాడేందుకు సైకాలజిస్ట్‌ని సంప్రదించారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత కాంతిమతి (ఐఏడీ) లేదా హెల్త్ యాంగ్జయిటీతో బాధపడుతోందని అర్థమైంది. చిన్న చిన్న లక్షణాలను కూడా పెద్ద పెద్ద జబ్బులుగా ఊహించుకోవడమే ఈ రుగ్మత ప్రధాన లక్షణం. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె సమస్యను నిర్ధారించుకున్నాక సైకోథెరపీ ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఆమె తన సమస్యను అధిగమించింది. అనారోగ్యం గురించే ఆలోచనలు.. ఐఏడీతో బాధపడుతున్న వ్యక్తులు కాంతిమతిలానే తీవ్రమైన అనారోగ్యం వస్తుందని భయపడుతూ ఉంటారు. ఈ అనారోగ్యం ఒక్కోసారి ఒక్కోటిగా ఉండవచ్చు. దీని లక్షణాలు.. ►జబ్బు బారిన పడతామనే ఆందోళనతో వ్యక్తులను కలవడం, వేరే ప్రాంతాలకు వెళ్లడం మానేయడం. వ్యాధులు, వాటి లక్షణాల గురించి నిరంతరం తెలుసుకోవడం, గుండె వేగం, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రతలను పదే పదే చెక్ చేసుకోవడం.చిన్న లక్షణం కనిపించగానే పెద్ద జబ్బు వచ్చిందని అనుకోవడం. ఉదాహరణకు దగ్గు రాగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ అని అనుకోవడ. తన లక్షణాల గురించి ఇతరులతో పంచుకోవడం, భరోసా కోరడం. తన జబ్బేమిటో తెలుసుకునేందుకు పదే పదే వైద్యులను కలవడం.ఏ జబ్బూ లేదని డాక్టర్ చెప్పినా, పరీక్షల్లో తేలినా ఉపశమనం పొందకపోవడం బాల్యానుభవాలూ కారణం.. ఐఏడీకి కచ్చితమైన కారణం స్పష్టంగా లేదు. ఇది సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమై వయసుతో పాటు తీవ్రతరమవుతుంది. సాధారణంగా ఈ కింది కారకాలు ఐఏడీకి దారితీస్తాయి. ►తమ ఆరోగ్యం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందే తల్లిదండ్రులుంటే పిల్లలకూ ఐఏడీ రావచ్చు · బాల్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడితే, ఆ తర్వాత చిన్న లక్షణం కూడా తీవ్రంగా భయపెడుతుంది · విపరీతమైన ఒత్తిడి, యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు · బాల్యంలో ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్ ఎబ్యూజ్కు గురైనప్పుడు · ఆరోగ్యం విషయంపై నిరంతరం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడం. ఏం చెయ్యాలి? ►మొదట ఫ్యామిలీ డాక్టర్‌ను కలసి ఎలాంటి జబ్బు లేదనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. వారు చెప్పేది నమ్మాలి. పదే పదే ఇతర డాక్టర్లను కలవడం ఆపేయాలి. ► ఒత్తిడిని అధిగమించేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి. జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ► శారీరక చురుకుదనం మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. ► పనిలో నిమగ్నమవ్వాలి. కుటుంబ, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. ► మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ► ఆందోళన కలిగించే లక్షణాల గురించి డాక్టర్‌తో మాత్రమే మాట్లాడాలి. ► జబ్బుల గురించి, వాటి లక్షణాల గురించి ఇంటర్నెట్లో వెతకడం మానుకోవాలి. అతిగా సమాచారాన్ని సేకరిస్తే అది గందరగోళానికి గురిచేసి ఆందోళన కలిగిస్తుంది. ► అప్పటికీ ఆందోళన తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ► కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) ద్వారా ఆందోళనను తగ్గించుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. ► బాడీ సెన్సేషన్స్ విషయంలో భయాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను థెరపీలో తెలుసుకోవాలి. -సైకాలజిస్ట్ విశేష్ - psy.vishesh@gmail.com -
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల: పేదల పక్షపాతినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నామని ఆయన దగ్గరికి వచ్చిన బాధితులకు తక్షణ సాయం అందజేసి మంచి మనసును చాటుకున్నారు. సీఎం జగన్ గురువారం అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన్ని కొంతమంది అభాగ్యులు కలిశారు. అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నామని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన సీఎం జగన్ వారిలో ఒకరికి రూ.లక్ష, మరొకరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో 15 నిమిషాల్లోనే బాధితులకు కలెక్టర్ చెక్కులు అందజేశారు. జీవితాంతం రుణపడి ఉంటాం అనంతపురం జిల్లా నార్పల మండలం బొమ్మకుంట గ్రామానికి చెందిన నారా పుల్లారెడ్డి (53) ఒక్క కిడ్నీతోనే పుట్టారు. ప్రస్తుతం ఆ కిడ్నీ కూడా సరిగా పనిచేయడం లేదు. కిడ్నీ ల్యాడర్ మందుల కోసమే నెలకు రూ.26 వేల వరకు ఖర్చవుతోంది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మందులు కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన బాధను సీఎం జగన్‌కు తెలియజేశారు. తక్షణం స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితునికి సాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశించిన నిమిషాల్లోనే కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బాధితునికి రూ.5 లక్షలు అందజేశారు. తన సమస్య విన్న వెంటనే సీఎం జగన్ స్పందించి, సాయం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని పుల్లారెడ్డి చెప్పారు. ఆర్థిక సాయం కోసం ఎంతో మందిని వేడుకున్నా ఉపయోగంలేకపోయిందని, వెంటనే సాయం చేసిన సీఎం జగన్ దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మా పాపకు కొత్త జీవితాన్ని ఇచ్చారు నంద్యాల జిల్లా అవుకు మండలం గోకులదిన్నె గ్రామానికి చెందిన గుర్రప్ప, సౌమ్య దంపతులకు ఇద్దరు సంతానం. గుర్రప్ప ఆటో డ్రైవర్. వీరికి రెండో సంతానంగా పాప హర్షిత జన్మించింది. పాపకు మూడు నెలలున్నప్పుడు అనారోగ్యానికి గురైంది. గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి పాపను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ప్రస్తుతం పాపకు 20 నెలలు. ఆపరేషన్ చేయిస్తే నయమవుతుందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సాయం కోసం ఆ తల్లిదండ్రులు తిరగని చోటు లేదు. చివరికి గురువారం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వారి బాధను వివరించారు. స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ తక్షణ సాయం కింద రూ.లక్ష చెక్కును బాధితులకు అందజేశారు. తమ చిన్నారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జీవితాన్ని ఇచ్చారని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. తమ బాధను పూర్తిగా విని వెంటనే సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?
జానకి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది. అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్‌కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. అలవాటు కాదు.. జబ్బు జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. తిడితే సరిపోదు.. చికిత్స అవసరం.. మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వివిధ దశల్లో చికిత్స మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. మద్యపాన వ్యసనం లక్షణాలు మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్‌గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం · తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం కారణాలు.. మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..) -
దివికేగిన దిగ్గజం
టి20 క్రికెట్ మాయలో పడి, సత్తా ఉన్నా... ఐదు రోజుల ఆటకు బైబై చెప్పేసి... జస్ట్ నాలుగు ఓవర్లేసే లీగ్‌లకు జైకొట్టే బౌలర్లున్న ఈ రోజుల్లో సంప్రదాయ టెస్టులకే సర్వం ధారపోసిన స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ. ఆయన మునివేళ్లతో బంతిని సంధిస్తే వికెట్. ఆయన స్పిన్ ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి ఆలౌట్. అంతలా... భారత క్రికెట్లో తన స్పిన్‌తో వికెట్లను దున్నేసిన దిగ్గజం బేడీ. ఎరాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్లతో కలిసి దుర్బేధ్యమైన స్పిన్ త్రయంగా ప్రత్యర్థి జట్లను విలవిలలాడించాడు. ఈ త్రయానికి తర్వాత శ్రీనివాస్ వెంకటరాఘవన్ జతయ్యాక బ్యాటర్లకు చిక్కులు, చుక్కలే కనిపించేవంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ జగాన్ని స్పిన్ మాయాజాలంతో ఊపేసిన బిషన్ సింగ్ ఆఖరి శ్వాస విడిచి దివికేగాడు. భారత క్రికెట్‌ను కన్నీట ముంచాడు. న్యూఢిల్లీ: భారత క్రికెట్లో స్పిన్‌కే వన్నెలద్దిన బౌలింగ్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. స్పిన్ శకాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నెల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగింది. అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోకాలు శస్త్రచికిత్స అనంతరం సోకిన ఇన్ఫెక్షన్ క్రమంగా పెరగడంతోనే మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఈ పంజాబీ క్రికెట్ స్టార్ 1946లో సెపె్టంబర్ 25న అమృత్‌సర్‌లో జన్మించారు. తదనంతరం క్రికెట్లో చెరగని ముద్ర వేసి ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్ బేడీ (సినీనటుడు) ఉన్నారు. అంగద్ భార్య నేహ ధూపియా బాలీవుడ్ హీరోయిన్. మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కుమార్తె గిలిందర్ ఉన్నారు. స్పిన్నర్లు ఉపఖండానికే పరిమితమనే విమర్శల్ని తన స్పిన్ మంత్రతో విదేశీ గడ్డపై తిప్పిగొట్టిన ఘనత బిషన్ సింగ్‌ది. తన కెరీర్ అనంతరం కూడా క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు విశేష సేవలందించారు. విరాట్ కోహ్లి సహా ఎంతో మంది కుర్రాళ్లకు ఫిట్నెస్ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కోహ్లి తను ఫిట్నెస్ను కాపాడుకోవడానికి బేడీనే కారణమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇదీ చరిత్ర... సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి లాంటి బ్యాటర్లు అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాటేనని ఘంటాపథంగా చెప్పే సంప్రదాయ క్రికెట్లో స్పిన్నర్‌గా బేడీ ఓ వెలుగు వెలిగాడు. ఈ తరం క్రికెటర్లు మెరుపుల టి20లకు అలవాటు పడి టెస్టు క్రికెట్‌ను పక్కన బెడుతున్నారు. మరి బిషన్ సింగ్ ఐదు రోజుల టెస్టుల్లో, నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుదీర్ఘకాలం దేశానికి, రాష్ట్రానికి సేవలందించాడు. 1967 నుంచి 1979 వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులాడిన స్పిన్ లెజెండ్ 266 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 14 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/98. ఇక 370 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 1,560 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్ సింగ్ పేరిటే ఇంకా రికార్డు ఉండటం విశేషం. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్లో బిషన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను ఏకంగా 106 సార్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లను 20 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/5. వన్డే ఫార్మాట్లో తక్కువగా 10 మ్యాచ్‌లే ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 1975 తొలి వన్డే వరల్డ్‌కప్‌లో, 1979 రెండో వన్డే వరల్డ్‌కప్‌లో బేడీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1975 వరల్డ్‌కప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బిషన్ 12 ఓవర్లు వేసి 8 మెయిడెన్లు తీసుకొని కేవలం 6 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అంతేకాదు...‘బేడీ సాబ్’ విజయవంతమైన సారథి కూడా! 22 టెస్టులకు నాయకత్వం వహించి 6 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. ఇందులో మూడైతే విదేశీ గడ్డపై సాధించిన ఘనవిజయాలున్నాయి. బేడీ కెప్టెన్సీలోనే భారత జట్టు 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 403 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు 27 ఏళ్ల పాటు (2003 వరకు) చరిత్ర పుటల్లో నిలిచింది. 1970లో కేంద్ర ప్రభుత్వంనుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న బిషన్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2004లో ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఇదీ ఘనత... ఈ భారత స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అంటే అరివీర ఆజానుబాహులైన విండీస్ బ్యాటర్లకు వణుకే! ముఖ్యంగా 1970వ దశకంలో ప్రపంచ క్రికెట్‌ను తన స్పిన్ తో శాసించాడు. 1969–70 సీజన్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్టు సిరీస్‌లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972– 73 సీజన్లో ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్ బ్యాటర్లను వారి సొంతగడ్డపై గడగడలాడించిన బౌలర్ ఎవరైన ఉన్నారంటే అది బేడీనే! 1975–76 సీజన్లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్లో న్యూజిలాండ్‌ను తిప్పేసి 13.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ 1976–77 సీజన్లోనే ఇంగ్లండ్ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1977–78 సీజన్లో ఈసారి ఆ్రస్టేలియా పనిపట్టాడు. 23.87 సగటులో 31 వికెట్లు తీశాడు. అరుణ్ జైట్లీ పేరుపెడితే నొచ్చుకున్నారు! ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని స్టాండ్‌కు బిషన్ సింగ్ బేడీ పేరు పెట్టారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మృతి అనంతరం ఆ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. క్రికెటేతరుడి పేరు పెట్టడాన్ని సహించలేక స్టాండ్‌కు తన పేరు తొలగించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర బిషన్ సింగ్ మరణ వార్తను తట్టుకోలేకపోయా. స్పిన్‌పై ఆయనకున్న పట్టు, ఆటపై కనబరిచే పట్టుదల అసాధారణం. భావి క్రికెటర్లకు, భవిష్యత్ తరాలకు అతని అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. –ప్రధాని నరేంద్ర మోదీ బేడీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. –ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అలర్డైస్ స్పిన్ బౌలింగ్‌తో క్రికెట్ పుటల్లోకెక్కారు. భారత క్రికెట్లో స్పిన్‌కు మూలస్తంభంలా ఉన్నారు. అలాంటి దిగ్గజం మనమధ్య లేకపోవడం బాధాకరం. –బీసీసీఐ కార్యదర్శి జై షా బేడీ మార్గదర్శనం వల్లే ఇంగ్లండ్‌లో నా తొలి శతకం సాకారమైంది. అలాంటి లెజెండ్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. –బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పిన్నర్లందరికి ఆయనే స్ఫూర్తి. యువతరానికి దిక్సూచి. బిషన్‌సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. –మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బిషన్ సింగ్ లేరన్న వార్త జీర్జించుకోలేనిది. భారత క్రికెట్‌కోసం ఎంతో చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు స్థయిర్యాన్ని ఇవ్వాలి. –మాజీ ఓపెనర్ గంభీర్ చాలా బాధగా ఉంది. ముమ్మాటికీ బిషన్‌సింగ్ గ్రేటెస్ట్ క్రికెటర్. యువ క్రికెటర్లు ఎదిగేందుకు ఎంతో పాటుపడ్డారు. –సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బేడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. –మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అంత్యక్రియలకు హాజరైన కపిల్, సెహ్వాగ్ ‘సర్దార్ ఆఫ్ స్పిన్’ బిషన్ సింగ్ బేడీ పార్థివ దేహానికి 1983 ప్రపంచకప్ కెప్టెన్ , దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, 2011 ప్రపంచకప్ విజేత సభ్యుడు సెహ్వాగ్ తదితర మేటి, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. స్థానిక లోధి స్మశానవాటికలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు కీర్తి ఆజాద్, మదన్‌లాల్, నెహ్రా, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, జహీర్, అజహరుద్దీన్ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానులు, జూనియర్ క్రికెటర్ల అశ్రునయనాల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. -
కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థత
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 5న గ్రామానికి చెందిన ముండే బలిరామ్ ఇంట్లో పెద్దల పేర్లతో పితృపక్ష పూజలు నిర్వహించి అన్నం, పప్పు, బూరెలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం 5గంటల తర్వాత భోజనం చేసిన వారిలో కొందరు శుక్రవారం సాయంత్రం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని మండల కేంద్రంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. పక్క శనివారం తెల్లవారు జాము నుంచి ఒక్కొక్కరిగా సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న కనరే రాధాబాయి, ముండే సుగంధ, సింధుబాయి, బలిరామ్, అంజలి, యమునాబాయి, మానే సునీత, ఊర్మిళ, ముండే జ్యోతిలను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కాడే డిగంబర్, కాడే సాక్షి, కాడే అనిత, కాడే కార్తీక్, కాడే నానేశ్వర్, శిరశాట్ ఊర్మిళ, ముండే ఐశ్వర్యం, రాములును అంబులెన్స్‌లో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. భోజన కార్యక్రమం నిర్వహించిన ముండే బలిరామ్ ఇంటి బోరు బావి తాగునీరు, అస్వస్థతకు గురైన వారి మూత్రం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు వైద్యుడుశ్రీకాంత్ తెలిపారు. -
సీఎం కేసీఆర్‌కు ఛాతీలో ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం బారినపడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్రమంగా కోలుకుంటున్నారని మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం వైరల్ జ్వరం బారినపడిన కేసీఆర్‌కు తర్వాత బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. ఛాతీలో ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని వివరించారు. దీంతో కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు అనుకున్న సమయం కంటే ఎక్కువకా లం పట్టే అవకాశం ఉందని తెలిపారు. వైరల్ జ్వరం బారిన పడిన సీఎం కేసీఆర్ దాదాపు మూడు వారాలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కేటీఆర్ వెల్లడించారు. చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. -
అరుదైన చర్మ వ్యాధి..ఒకేసారి వందలాది చీమలు
చర్మ వ్యాధులకు సంబంధించి చాలా భయనకమైనవి చూశాం. మరికొన్ని చర్మ వ్యాధులు పుండ్లు, గాయాలుగా మారి ప్రాణాలు కోల్పోయేలా చేయడం గురించి కూడా విన్నాం. ఈ చిన్నారికి వచ్చిన వ్యాధి అత్యంత అరుదైనది, వర్ణించలేనంత బాధకరమైనది. తీవ్రమైన దురద తోపాటు బహిరంగ గాయంలా మారి తట్టుకోలేని నరకయాతన అనుభవిస్తున్నాడు ఆ తొమ్మిదేళ్ల చిన్నారి. వివరాల్లోకెళ్తే..యూకేలోని నార్తాంప్టన్కి చెందిన థియోడర్ మోరార్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి అరుదైన చర్మ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దీని కారణంగా అతని చర్మం కింద వందలాది చీమలు పాకినంత దురదగా ఉండి, చర్మం పగిలి రక్తస్రావం అవుతుంది. ఆ తర్వాత విపరీతమైన దురద. ఒక పక్క రక్తంకారడంతో దాన్ని గోకలేనంత దారుణమైన స్థితి. ఆ యాతన అనుభవించలేక ఆ చిన్నారి చనిపోతాను నా వల్ల కాదు అంటుంటే.. ఆ తల్లిదండ్రుల ఆ ఆవేదన వర్ణానాతీతం. కళ్లముందే కన్న కొడుకు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ చిన్నారి పుట్టుకతోనే ఈ పరిస్థతితో జన్మించాడు. అది క్రమంగా పెరిగిపోడం జరిగింది. కొంతకాలం తగ్గినట్లు తగ్గి మళ్లీ విజృంభించింది. దీంతో ఆ చిన్నారి శరీరం గాయాలతో రక్తం కారి పగుళ్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి కారణంగా చేతులు కాళ్లు కదిలించలేదు. తట్టుకోలేని దురదను భరించలేక ఎన్నో రాత్రుళ్లు ఏడుస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితిని న్యూరోడెర్మాటిటిస్ అని అంటారు. ఏంటీ న్యూరోడెర్మాటిటిస్ అంటే.. వైద్య పరిభాషలో దీర్ఘకాలికంగా వచ్చే దురద లేదా స్కేలింగ్ ద్వారా వచ్చే ఒక విధమైన చర్మ పరిస్థితి. చర్మంపై వచ్చే దురద ప్రాంతాలను గమనిస్తే.. సాధారణంగా మెడ, మణికట్టు, ముంజేతులు, కాళ్లు లేదా గజ్జలపై ఎక్కువగా ఇలా ఉంటుంది. అయితే న్యూరోడెర్మాటిటిస్కి అసలు ప్రధాన కచ్చితమైన కారణం ఏంటన్నది నిపుణులకు కూడ తెలియదు. కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలు లేదా నిరాశ కారణంగా ఈ దురద వస్తుంటుందని చెబుతుంటారు. ఇతర కారణాలు .. నరాలలో గాయాలు పురుగు కాట్లు బిగుతైన దుస్తులు ధరించటం సోరియాసిస్ వంటి ఇతర చర్మ వ్యాధులు లక్షణాలు చర్మంపై విపరీతమైన దురద, పొడిగా మారడం విపరీతమైన నొప్పి జుట్టు ఊడిపోవటం బహిరంగ గాయాలు, రక్తస్రావం ఇన్ఫెక్షన్లు, పసుపు రంగు చీము కారడం చికిత్స దీన్ని దీర్ఘకాలిక చికిత్స ద్వారానే నయం చేయగలం చర్మ లేపనాలతో ఎరుపు రంగులోని వాపు, దురద, సున్నితత్వాన్ని తగ్గించడంలో సహయపడతాయి అలెర్జీని పెంచకుండా యాంటీహిస్టామైన్లు ఇస్తారు పొడిబారటం, దురద లేకుండా ఉండేలా మాయిశ్చరైజ్ క్రీములు కూల్ కంప్రెస్తో చర్మాన్ని మృదువుగాచేసి, మాయిశ్చరైజర్ క్రీములు చొచ్చుకునిపోయేలా చేసి త్వరిత గతిన కోలుకునేలా చేస్తారు. (చదవండి: ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?) -
Father of Green Revolution: ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు. భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్‌ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్‌లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్‌పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
మంచాల: హాస్టల్లో వడ్డించిన అల్పాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బీసీ బాలికల వసతి గృహంలో మొత్తం 94 మంది విద్యార్థినులు ఉన్నారు. శనివారం ఉదయం వీరికి అల్పాహారంగా పులిహోర పెట్టారు. అందులో పురుగులు వచ్చాయని విద్యార్థినులు చెబుతున్నా రు. అల్పాహారం తిన్నవారిలో ఒకరి తర్వాత ఒకరు తలనొప్పి, కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. పదుల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంట వ్యవధిలోనే 30 మందికి పైగా విద్యార్థినులు వాంతులు చేసుకుని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని వాపో యారు. వారికి ఆస్పత్రి వైద్యుడు శ్రావణ్ కుమా ర్‌రెడ్డి చికిత్స చేశారు. కాగా, తీవ్ర అస్వస్థతకు గురై న కె.అనిత (7వ తరగతి), కె.అఖిల (8), వి.వైష్ణవి (5), ఎం.శిరీష (5), పి.అక్షర (3), ఎం.పూజ (7), ఆర్.త్రిష (10), ఎం.శ్రీనిధి (4వ తరగతి)ని మెరు గైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇందులో నలు గురిని వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తీసు కెళ్లారు. విద్యార్థుల విషయంలో వార్డెన్‌తో పాటు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. -
కోనసీమ జిల్లా: ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థత
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే అస్వస్థతకు గురికావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. వెంటనే అంబులెన్సులో హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తనయుడు వికాస్ తెలిపారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
చిన్నారులు పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
చిన్నారులు తీసుకున్న ఆహారం అరగకపోతే వారి తల్లిదండ్రులు హైరానా పడతారు. ఆఘమేగాల మీద ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. పిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులి పురుగులే అని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కడుపులో నులి పురుగుల ఉన్నట్టు గుర్తిస్తే సులభ పద్ధతిలో వైద్యం చేయించవచ్చు. తగిన చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా పరిగణిస్తాయని హెచ్చరిస్తున్నారు. నులి పురుగులు హెల్మెంత్ అనే పరాన్నజీవి జాతికి చెందినవి. ఇవి మూడు రకాలు. 1.రౌండ్ వారమ్స్ 2.పిన్ వారమ్స్ 3.ప్లూక్స్. వాటిలో రౌండ్ వారమ్స్ జాతికి చెందిన పురుగులు సాధారణంగా కనిపిస్తాయి. పిన్ వారమ్స్, ప్లూక్స్ వారమ్స్ జాతి పురుగులు ముఖ్యంగా పిల్లల పేగుల్లో జీవిస్తాయి. రౌండ్ వారమ్స్ జాతి పురుగులు 2 నుంచి 5 అంగుళాల పొడవుంటాయి. ఇవి పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లుల్లోనే గాకుండా మట్టిలో కూడా నివశిస్తాయి. పెంపుడు జంతువులతో చిన్నారులు సన్నిహితంగా ఉండడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా చిన్నారులకు నులి పురుగుల సంక్రమిస్తాయి. వ్యాప్తి ఇలా.. హుక్ వారమ్స్, పిన్ వారమ్స్ అనే జీవులు లార్వా రూపంలో మట్టిలో ఉంటాయి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలో తిరిగేటపుడు ఈ జీవులు వారి కాళ్ల చర్మం ద్వారా రక్తంలో ప్రవేశించి వారి ఊపిరితిత్తులలోకి చేరతాయి. అక్కడ నుంచి శ్వాస నాళంలోకి చేరి పురుగులుగా వృద్ధి చెందుతాయి. అక్కడే గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి. ఆ గుడ్లు పిల్లల మలము ద్వారా బయటకు వచ్చి తిరిగి మట్టిలో లార్వాగా వ్యాప్తి చెందుతాయి. నులి పురుగుల లక్షణాలు నులి పురుగుల బారిన పడ్డ చిన్నారుల్లో ప్రాథమిక దశలో కొద్దిగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లార్వా ఊపిరితిత్తులలోకి వెళ్ళడంతో కడుపులో నొప్పి, వాంతులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. హుక్ వార్మ్ జాతి పురుగులకు చిన్న దంతాలు వంటివి ఉంటాయి. వాటి సాయంతో అవి ఆమర నాళాల గోడలకు అతుక్కుని ఉంటూ క్రమంగా రక్తాన్ని పీల్చుకుంటాయి. చిన్నారుల జీర్ణ కోశంలో రక్త శ్రావం ఏర్పడుతుంది. దీంతో చిన్నారుల్లో రక్త హీనత, పోషకాహార లోపాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత కలిగిన పిల్లల్లో ఆయాసం ఉంటుంది. అలాగే శరీరం పాలిపోయినట్టుగా, నీరసంగా ఉంటారు. మట్టి తినే అలవాటు కనిపిస్తుంది. భారత్‌లో 22 కోట్ల చిన్నారులు .. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో జరిపిన సర్వే ప్రకారం భారత్‌లో 22 కోట్ల చిన్నారులు నులి పురుగుల బారిన పడినట్టు అంచనా. దేశంలో ప్రతి 10 మందిలో ఏడుగురు పిల్లలు నులి పురుగుల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులు ఎక్కువ మంది నులి పురుగులు బారిన పడుతున్నారు. మాత్రలు ఉచితంగా వేస్తారు బయట ఆహారం తినడం, మట్టిలో ఆడడం, కలుషిత నీరు తాగడం వల్ల పిల్లలకు నులిపురుగుల సమస్యలు వస్తాయి. పిల్లలకు ఈ వ్యాధి రాకుండా తల్లిదండ్రులు ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. గర్భిణులు కూడా మాత్రలు తీసుకోవచ్చు. ప్రధానంగా పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కో వడం నేర్పించాలి. పిల్లలకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరు గుతోంది. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సోమవారం పిల్లలకు ఉచితంగా ఈ మాత్రలు వేస్తారు. –డాక్టర్ హేనా, అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(35) గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. మూడురోజుల క్రితం గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా కామెర్లు సోకాయి. వైద్యులు డయాలసిస్ కూడా చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఇక్కడ నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, జగ్గారెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వెన్నవరం భూపాల్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత
మణికొండ: ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాసరచయిత, సినిమాగా వచ్చిన మిథునం కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీరమణ (71) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా గెటెడ్ కమ్యూనిటీలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.1952 సెపె్టంబర్ 21న ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో అనసూయ, సుబ్బారావు దంపతులకు జని్మంచిన శ్రీరమణ అసలుపేరు కామరాజ రామారావు. కానీ ఆయన రచయిత శ్రీరమణగానే అందరికీసుపరిచితం.ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన కథలు మానవత్వం, విలువలతో కూడి ఉంటాయని జగన్ గుర్తుచేసుకున్నారు. -
‘అన్న’లకు అనారోగ్యం!
ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన ‘అన్న’లకు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తోంది. దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు లెక్క చేయక గడిపిన ఎందరో నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు మారిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. వైద్యం కోసం అడవులు వదిలితే ఎక్కడ పోలీస్ బలగాలకు చిక్కుతామన్న భయంతో తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇప్పుడు వారిని మరింతకుంగదీస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే.. అనారోగ్య కారణాలతోనే మావోయిస్టు అగ్రనాయకులైన ఆర్కే, హరిభూషణ్‌లు సైతం మృతిచెందారు. అలాగే ఇటీవలే మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మావోయిస్టు కేంద్ర కమిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నేతలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో అరెస్టయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. మంచానికే పరిమితమైన గణపతి? మావోయిస్టు ఉద్యమం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటైన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక నేతగా ఉన్న గణపతి వయస్సు 73కు చేరింది. బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న గణపతి ప్రస్తుతానికి మంచానికే పరిమితమైనట్టు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు అయిన గాజర్ల రవి సైతం కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీలోని రామచంద్రారెడ్డి, మొడెం బాలకృష్ణ, పోతుల కల్పన, దండాకరణ్యం స్పెషల్ జోన్ కమిటీలోని నూనె నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న వెన్ను నొప్పితో , తెలంగాణ డివిజనల్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ అధిక రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర కీలక నాయకులు సైతం చాలా మంది షుగర్ , బీపీ, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో సతమతవుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి సహకారం తగ్గుతోందా? మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గుతోందనీ, అందుకే సకాలంలో మందుల రవాణా, ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కటకం సుదర్శన్ మృతిపై ప్రకటన జారీ సందర్భంగా మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఇవే ఆరోపణలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మేం చూసుకుంటామంటున్న ఖాకీలు పోలీసు అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది..అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంటున్నారు. మావోయిస్టు నాయకులు, కేడర్ లొంగిపోతున్న సందర్భాల్లో, అరెస్టుల సందర్భంగా నిర్వహించే పత్రికా సమావేశాల్లోనూ లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
జెర్రి పడిన బిరియాని తిన్న నలుగురికి అస్వస్థత
తమిళనాడు: ఊటీలో శుక్రవారం జెర్రి పడిన బిరియాని తిన్న నలుగురు అస్వస్థతకు గురయ్యారు. నీలగిరి జిల్లా ఊటీ పక్కనే వున్న ఎం.పాలాడా పరిసర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో క్యారెట్ సాగవుతోంది. రెండువేల మందికి పైగా కార్మికులు అక్కడే వుంటూ పనిచేస్తున్నారు. ఎం.పాలాడ సమీపంలోని నరికుజియాడ ప్రాంతానికి చెందిన కృష్ణస్వామి శుక్రవారం మధ్యాహ్నం మమ్మీ మెస్ నుంచి నాలుగు బిరియానీలు కొన్నాడు. కృష్ణస్వామి, అతని సహచరులు కలిసి దీనిని తింటున్నారు. అందులో జెర్రి మృతి చెంది ఉంది. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఎం.పాలాడాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందించారు. దీనిపై ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నీలగిరి జిల్లా ఫుడ్ సేప్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ సురేష్, అధికారులు నందకుమార్, శివరాజ్ నేతృత్వంలోని బృందం రెస్టారెంట్లో పరిశీలించారు. అక్కడ అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. వారికి రూ.2000 జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. -
అవినాశ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి కర్నూలు, పులివెందుల: ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మికి ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్‌రెడ్డి పర్యవేక్షణలో శ్రీలక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. రక్త పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి రావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు. మానవత్వం లేకుండా వెంటాడిన వైనం శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌లోని నివాసం నుంచి బయల్దేరిన ఎంపీ అవినాశ్‌రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం గురించి తెలియడంతో దర్యాప్తు అధికారులకు న్యాయవాది ద్వారా సమాచారం అందచేసి హుటాహుటిన ప్రయాణమయ్యారు. అవినాశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద నిరీక్షిస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. ఎల్లో మీడియా ప్రతినిధులు చెక్‌పోస్టు వద్దే కాపుకాసి అవినాశ్ కాన్వాయ్‌ను వెంటాడారు. మధ్యాహ్నం 1.12 గంటల సమయంలో అవినాశ్ చెక్‌పోస్టు దాటి పులివెందుల మార్గంలో వెళ్లారు. అనంతరం తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్ద అంబులెన్స్‌లో తల్లిని చూసి అవినాశ్ కంటతడి పెట్టారు. పులివెందుల వెళ్లకుండా తిరిగి తల్లితో పాటు హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే శ్రీలక్ష్మి పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెర తీసింది. శ్రీలక్ష్మి ఆరోగ్యంగానే ఉన్నారని, సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ ప్రయత్నిస్తున్నారంటూ మానవత్వం లేకుండా చానళ్లలో చర్చలు నిర్వహించింది. పరిస్థితి ఆందోళనకరం శ్రీలక్ష్మి అనారోగ్యంపై భిన్న కథనాల నేపథ్యంలో విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణుడు హితేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఛాతీలో నొప్పి వచ్చి శ్రీలక్ష్మి కిందపడిపోయారు. లో బీపీ అని భావించి పులివెందుల ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత కర్నూలు తీసుకొచ్చారు. ఈసీజీ చేస్తే మార్పులు కనిపించాయి. కొన్ని పరీక్షలు చేశాం. రిపోర్టులు రాలేదు. కార్డియాక్ ఎంజైమ్స్‌లో మార్పులు వచ్చాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆందోళనకర పరిస్థితి. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. ఎంజైమ్స్ పెరుగుతూ ఉన్నందున ప్రతి రెండు గంటలకు ఒకసారి పరీక్షలు చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’ అని పేర్కొన్నారు. చదవండి: ‘రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’ -
అమ్మ ఆరోగ్యం కోసం..70 కి.మీ.
రాయికల్(జగిత్యాల): నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య తన తల్లి ఆరోగ్యం బాగుకోసం ఆమెను ఓ చెక్కబండిలో కూర్చోబెట్టుకుని సుమారు 70.కిలోమీటర్లు ప్రయాణించాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకోవడంతోపాటు అక్కడ కొద్దిరోజులు గడిపితే తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకంతో సోమవారం ఖానాపూర్ నుంచి కర్రలతో తయారుచేసిన చెక్కబండిలో తల్లిని ఉంచి ప్రయాణం సాగించాడు. తన తల్లి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, కొండగట్టుకు తీసుకెళ్తే కుదుటపడుతుందని భావిస్తున్నట్లు మల్లయ్య చెప్పాడు. తనవద్ద డబ్బులు లేకున్నా..తల్లి ఆరోగ్యం ముఖ్యమని, ఇందుకోసం తల్లిని ఎక్కడికైనా తీసుకెళ్తానని తెలిపాడు. -
ఈనాడు రాతలు ఇంత దుర్మార్గమా!?
కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన సీహెచ్ జనార్దనరెడ్డి (42) నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన ఉదంతంపై ఈనాడు వక్రభాష్యం ఇస్తూ దుష్ప్రచారం చేయడంపై మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ఘటనకు కారణమైతే ఈనాడు పత్రిక మాత్రం ప్రభుత్వం నుంచి బిల్లులు రాక అతను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచురించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనార్దనరెడ్డి గ్రామంలో సచివాలయన్ని నిర్మించాడు. దాని తాలూకా రూ.27 లక్షలు అతనికి ప్రభుత్వం చెల్లించేసింది. ఇంకా రూ.6 లక్షలు మాత్రమే బకాయి ఉంది. అయితే, అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. భార్య దూరమైంది. పైగా అతనికి ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రితోపాటు ఉంటున్న జనార్దనరెడ్డి ఈనెల 16వ తేదీన మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో మేడపై ఉన్న తన గదిలోకి వెళ్లి పురుగుమందు తాగి బయటకు వెళ్లాడు. అతను పురుగుమందు తాగినట్లు గ్రామస్తులు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు హుటాహుటిన కావలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండి ఇంటికొచ్చిన జనార్థనరెడ్డికి చాలా ఏళ్లుగా ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. దీంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ జనార్దనరెడ్డి శనివారం మరణించాడు. వాస్తవం ఇలాగుంటే.. ‘ఈనాడు’ మాత్రం సచివాలయం -
శరత్‌బాబుకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు
ప్రముఖ నటుడు శరత్‌బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరులో చికిత్స పొందిన ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశామని వైద్యులు తెలిపారు. కాగా 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. -
టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. జానారెడ్డికి యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి యశోదా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చదవండి: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే! -
Hyderabad:హోటల్ ఫుడ్ తిని 16 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మాషా అల్లా హోటల్లో ఆహారం తిని 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కోలుకోగా మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌లోని మాషా అల్లా హోటల్లో బుధవారం రాత్రి 16 మంది మటన్ మండీ తిన్నారు. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు. వివరాలు సేకరిస్తున్న ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీవెంకాలు దీంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శ్రీవెంకాలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను సీజ్ చేశారు. -
ఏకలవ్య పాటశాల విద్యార్థులకు అస్వస్థత
-
మితిమీరిన వాయు కాలుష్యం.. 2 లక్షల మంది ఆస్పత్రి పాలు!
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం మితిమీరిపోయింది. కలుషిత గాలిని పీల్చి సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో సుమారు 2 లక్షల మంది గతవారం ఆస్పత్రుల్లో చేరారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో దేశంలో గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. బ్యాంకాక్‌లోని 50 వరకు జిల్లాల్లో గాలి నాణ్యత సురక్షితం కాని 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించి పోయింది. ఈ స్థాయిలో గాలి కణాలు రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయి. -
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
సాక్షి, హైదరాబాద్/గచ్చి బౌలి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఉదయం హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపు నొప్పితోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. సాధారణ పరీక్షల్లో భాగంగానే ముఖ్యమంత్రి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చి నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్టిక్ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చి నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి మరికొందరు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రిని పరీక్షించిన తర్వాత ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఉదయం పొత్తికడుపులో అసౌకర్యంగా ఉందని చెప్పారని, దీంతో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చి సీటీ, ఎండోస్కోపీ పరీక్షలు చేశామని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కడుపులో ఒక చిన్న అల్సర్ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అయితే దీనిని మందుల ద్వారా నయం చేయవచ్చని వివరించారు. ఇతర అన్ని రకాల పరీక్షలు సాధారణంగానే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రికి అవసరమైన మందులు ఇచ్చామని చెప్పారు. కాగా, రాత్రి 7.15 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్ ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. సీఎం సత్వరంగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సత్వరం కోలుకోవాలని, స్వస్థత చేకూరాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. -
ఆమె ప్రతి అక్షరం స్త్రీ పక్షం
తెలుగు సాహిత్యలోకం నుంచి రచయిత్రి కె.రామలక్ష్మి (92) వీడ్కోలు తీసుకున్నారు. రచయిత్రిగా, ఆరుద్ర సతీమణిగా, మద్రాసు (చెన్నై) నగరంలో తెలుగువారి ప్రతినిధిగా, నాటి సాహితీ సమూహాలలో కీలకమైన వ్యక్తిగా, సినిమా రంగంలో రచయిత్రిగా ఆమె సాగించిన యాత్ర సుదీర్ఘమైనది. ఆమె మరణంతో ఒక కాలపు తెలుగు సాహితీ చరిత్రకు మిగిలిన ఆఖరు సాక్షి లేకుండా పోయినట్టయ్యింది. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌లో ఉన్న నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కోటనందూర్‌లో 1930 డిసెంబర్ 31న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తిచేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు. 1954లో ప్రముఖ కవి ఆరుద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు. 1951 నుంచే రామలక్ష్మి రచనా ప్రస్థానం మొదలైంది. వివాహమైన తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు. మొత్తం 100 కు పైగా పుస్తకాలు రాశారు. ఆంధ్రపత్రికలో ఆమె సుదీర్ఘకాలం నిర్వహించిన ‘ప్రశ్న జవాబు’ శీర్షిక ప్రసిద్ధి చెందింది. విడదీసే రైలుబళ్లు, అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, ఆణిముత్యం, పెళ్లి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్లు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పాండురంగని ప్రతిజ్ఞ, నీదే నా హృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథా సంకలనాలను రామలక్ష్మి రచించారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకుగాను ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు... రామలక్ష్మి పలు సినిమాలకు కథలు అందించారు. 1975వ సంవత్సరంలో జీవనజ్యోతి సినిమా కథకు గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. కాసా సుబ్బారావు నిర్వహించిన స్వతంత్ర దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డు అందుకున్నారు. పలు స్త్రీ సంక్షేమ సంఘాల్లో సేవలు అందించి మహిళల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ రీజనల్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. రామలక్ష్మి ఆరుద్ర మృతిపట్ల పలువురు రచయితలు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రమే ఎస్ఆర్నగర్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. స్టెల్లా మేరీ స్టూడెంట్ స్వస్థలం కాకినాడ అయినా కె.రామలక్ష్మి చదువు చెన్నైలోనే సాగింది. స్టెల్లా మేరీ కాలేజీలో చదువుకుని ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించారు. ‘ఐ యామ్ ఏ స్టెల్లామేరియన్’ అని గర్వంగా చెప్పుకునేవారు. కాలేజీలో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రఖ్యాత జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ఇచ్చిన కె.రామలక్ష్మిని చూసి పరీక్షలు అయిపోయాక తనని కలవమని చెప్పారు. ‘స్వతంత్ర’ పత్రికలో ఇంగ్లిష్ విభాగంలో పాత్రికేయురాలిగా ఉద్యోగం ఇచ్చారు. ‘తెలుగు స్వతంత్ర’కు ఎడిటర్‌గా ఉన్న ఖాసా సుబ్బారావు కోరిక మేరకు ‘నడుస్తున్న చరిత్ర’ కాలమ్ రాశారు రామలక్ష్మి. ఆమె ఇంటిలో ప్రతి సాయంత్రం సాహితీచర్చలు జరిగేవి. వాటికి ఆరుద్ర, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ తదితరులు హాజరయ్యేవారు. ఆరుద్ర, రామలక్ష్మి పరస్పరం ఇష్టపడి ఆ రోజుల్లో అంటే 1954ఏప్రిల్30న రిజిస్టర్డ్ మేరేజీ చేసుకున్నారు. ఈ పెళ్లికి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి, శ్రీశ్రీ సాక్షి సంతకాలు చేశారు. శ్రీశ్రీ తన పెళ్లికి సాక్షి సంతకం చేయాలని ఆరుద్ర భావించడం వల్ల ఇది జరిగింది. శ్రీశ్రీ రామలక్ష్మిని ‘అత్తగారు’ అని సరదాగా పిలిచేవారు. అయితే శ్రీశ్రీ ధోరణిని రామలక్ష్మి చివరి వరకూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఆరుద్రకు అండా దండా ఆరుద్ర సినిమా రంగంలో కృషి చేయడానికి, ‘సమగ్రాం«ధ్ర చరిత్ర’ పరిశోధన పూర్తి చేయడానికి రామలక్ష్మి అందించిన అండదండలే కారణం. వీరికి ఐదుగురు కుమార్తెలు విజయ, త్రివేణి, కవిత, లలిత, వాసంతి. వీరి పెంపకం, చదువు బాధ్యతలకోసం ఆరుద్ర సమయాన్ని తీసుకోకుండా ఆమే తన సమయమంతా వెచ్చించారు. ‘ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కోసం విపరీతంగా సమయం ఇవ్వాలనుకునేవాడు. కాని ఇల్లు గడవాలి కదా. సినిమా రంగంలో పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అందుకని నేనేమి అనకుండా గబగబా కొన్ని పాటలు రాసేసి ఆ డబ్బు అప్పజెప్పి మళ్లీ పరిశోధనలో పడేవాడు’ అన్నారు రామలక్ష్మి. ఆరుద్రకు అనారోగ్యం వస్తే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూశారామె. ‘నేను మరణించినప్పుడు ఎటువంటి హంగామా చేయవద్దు’ అని ఆరుద్ర కోరడం వల్ల 1998లో ఆరుద్ర మరణించినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి ఆ తర్వాతే మరణవార్తను లోకానికి తెలియచేశారు. ఇది సాహిత్య ప్రియులను బాధించినా రామలక్ష్మి ధోరణి అలాగే ఉండేది. సినిమా రచయిత్రి కె.రామలక్ష్మికి సినిమా రంగంలో అందరూ సుపరిచితులు స్నేహితులు. వారిలో భానుమతి రామకృష్ణ, జయలలిత, వాణిశ్రీ తదితరులు ఉన్నారు. కె.విశ్వనాథ్ తీసిన ‘జీవనజ్యోతి’ సినిమాకు రామలక్ష్మి కథను అందించారు. ఈ సినిమా నిజానికి వాణిశ్రీ కోసమే రాశారు. కె.రామలక్ష్మి రాశారని వాణిశ్రీ నటించారు. దీని నిర్మాణ సమయంలో విశ్వనాథ్‌కు, రామలక్ష్మికి వాదోపవాదాలు నడిచాయి. దాంతో కె.విశ్వనాథ్ విజయవాడలో జరిగిన శతదినోత్సవంలో ‘ఇకపై ఇతరులు రాసిన కథలతో నేను సినిమాలు తీయను’ అని ప్రకటించారు. రామలక్ష్మి రాసిన మరో సినిమా ‘గోరింటాకు’. అయితే దీని మీద ఆ రోజుల్లో వివాదం చెలరేగింది. దాసరి నారాయణరావు స్టోరీ డిపార్ట్మెంట్లో తెర వెనుక ఉండి పని చేసిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు. ఆమె 1970లలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పని చేశారు. స్త్రీ పక్షపాతి రామలక్ష్మి నిత్య జీవితంలోనే కాదు రచనా జీవితంలోనూ ఆధునికురాలు. ఛాందసాలు లేని జీవనం గడపాలని, భార్యాభర్తలు స్నేహమయ జీవనాన్ని అనుభవించాలని, స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆ రోజుల్లోనే తన కథలలో చెప్పారామె. 1954లో ఆమె తన తొలి కథా సంపుటి ‘విడదీసే రైలుబళ్లు’ వెలువరించారు. ఈ సంపుటిలోని ‘చీలిన దారులు’ అనే కథలో ఒక జంట పెళ్లి చేసుకోకుండా సహజీవనం ప్రారంభిస్తారు. పెళ్లి ప్రేమను చంపేస్తుంది అని ఆ కథలో రాసి అప్పటికి తెలియని సహజీవనాన్ని ప్రతిపాదించారామె. ‘తొణికిన స్వప్నం’, ‘ఒక జీవికి స్వేచ్ఛ’, ‘అద్దం’ తదితరాలు ఆమె ఇతర కథా సంపుటాలు. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలని సూచిస్తూ 1970లలో ఆమె రాసిన ‘పార్వతి కృష్ణమూర్తి కథలు’ పాఠకాదరణ పొందాయి. ఇందులో భార్య అరమరికలు లేకుండా భర్తతో తన అభిప్రాయాలను చెబుతుంది. స్నేహాన్ని, చొరవను ప్రదర్శిస్తుంది. భార్యంటే భర్త చెప్పినట్టుగా పడుండాలనే నాటి ధోరణికి ఈ పాత్ర పూర్తి భిన్నం. రామలక్ష్మి రాసిన కథల్లో ‘అదెక్కడ’ విశిష్టమైనది. ఆ కథలో ముఖ్యపాత్ర తన పేరు మర్చిపోతుంది. దాని కారణం భర్త, పిల్లలు అందరూ ‘అది’ అని పిలుస్తూ ఉండటమే. చివరకు ఆమె ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. భర్త ‘అదెక్కడ’ అని ఎందరిని అడిగినా కనిపించదు. పురుషుడు మోసం చేస్తే స్త్రీ సింగిల్ మదర్‌గా జీవించగలదనే సందేశం ఇస్తూ కథలు రాశారు. బేలగా ఉండే స్త్రీలను అలాంటి పాత్రలను రామలక్ష్మి హర్షించలేదు. స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని కోరుతారు. ఆమె రచనలను ఈ తరానికి మళ్లీ చేరువ చేయాల్సి ఉంది. -
మంచిదేదో 'జంకు' లేకుండా చెప్పాలి!
జంక్ ఫుడ్‌తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజీ ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఇలా గుర్తించడం విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే, జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో భారతదేశాన్ని చిరుధాన్యాల ఎగుమతి కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సిరి ధాన్యాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికీ మేలు చేసేవి. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ పండించగలగడం ఇందుకు కారణం. నిజానికి చిరుధాన్యాలు వందల ఏళ్లుగా భారతీయ ఆహారంలో భాగంగానే ఉన్నాయి. జొన్న, సజ్జ, రాగి వంటివి 1960వ సంవత్సరం వరకూ నలుగురిలో ఒకరు తినేవారు. కానీ, హరిత విప్లవం తరువాత చిరుధాన్యాల వాడకం క్రమేపీ తగ్గిపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఈ చిరుధాన్యాలపై ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రమాదం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిరు ధాన్యాలను మళ్లీ మన ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు కొంత కాలంగా సూచిస్తున్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం తగ్గుతున్న క్రమంలోనే దేశంలో ఆహారపు అలవాట్లూ మారిపోయాయి. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్, ‘రెడీ టు ఈట్’ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మొదలైంది. అప్పట్లో వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ఉండేందుకు, ఆహార వృథాను అరికట్టేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించా రన్నది మరువరాదు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు ప్యాకేజ్డ్ ఫుడ్ వాడకం మరింత ఎక్కువయ్యేందుకు కారణమైంది. 1991 తరువాత చక్కెర లతో నిండిన పానీయాలు దేశీ మార్కెట్లను ముంచెత్తాయి. అలాగే జంక్ ఫుడ్ అని ఇప్పుడు మనం పిలిచే రకరకాల ఆహార పదార్థాలూ అందుబాటులోకి వచ్చాయి. చక్కెరలు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాస్తా ఊబకాయం, అసాంక్ర మిక వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాలను మళ్లీ ప్రధాన ఆహారంగా మార్చడం పెద్ద సవాలే. ఒక పక్క రైతులు తమ పంటలు, పద్ధతులు మార్చుకునేందుకు తగిన ప్రోత్సాహాలు అందించడం... ఇంకోవైపు వినియోగదారులను చైతన్యపరచడం, వారి ఆహారపు అలవాట్లను మార్చడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. భయం ఏమిటంటే... ఎక్కడ ఈ జంక్ ఫుడ్ పరిశ్రమ చిరుధాన్యాలపై ప్రస్తుతమున్న ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందో అని! అసాంక్రమిక వ్యాధులు ప్రబలేందుకు జంక్ ఫుడ్ ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడైతే స్పష్టం చేసిందో, వీటిని పిల్లలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల నియంత్రణకు సూచనలు జారీ చేసిందో... అప్పటినుంచీ జంక్ ఫుడ్ పరిశ్రమ తమ ఉత్పత్తులను ఆరోగ్య కరమైనవనీ, సహజమైనవనీ చెప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మల్టీ గ్రెయిన్ కుకీలు, చక్కెర తక్కువగా ఉన్న శీతల పానీయాలు, హృదయానికి దోస్తుల్లాటివని చెప్పే వంటనూనెలు, ‘పండ్ల’ రసాలు అని పేర్లు పెట్టి... ఇంట్లో వండుకునే ఆహారానికీ,పండ్లు, కాయగూరలకూ వీటిని ప్రత్యామ్నాయాలుగా చూపే ప్రయత్నం మొదలైంది. చిరుధాన్యాల ద్వారా కూడా ఈ మాయ చేసేందుకు కంపెనీలు కొన్ని ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ –నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వైపు పరుగులు పెడు తున్నాయి కూడా. జంక్ ఫుడ్ తయారీదారులు తమ ఉత్పత్తుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గొప్పగా చెప్పుకొంటూనే కీలక సమాచారాన్ని విని యోగదారుల కంటపడకుండా చూస్తాయి. ఆహారంలోని పదార్థాలు, హానికారక ‘అడిటివ్స్’(కలిపినవి) వివరాలు కనిపించకుండా చేస్తాయి. దేశ నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ ప్యాకెట్స్‌పై ‘పోషక సమా చారం’ తప్పనిసరిగా నిర్దిష్ట పద్ధతిలో ప్రచురించాలి. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలు ఎంత మోతాదుల్లో ఉన్నాయో తెలపాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి పుణ్యమా అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పుడు ‘ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబలింగ్’ను ప్రతిపాదించింది. సాధారణంగా ప్యాకెట్ వెనుకభాగంలో ఉండే సమాచారాన్ని ముందు కూడా ప్రచురించాలని ఈ ప్రతిపాదన ఉద్దేశం. దీనివల్ల వినియోగదారులకు మరింత సమాచారం అంది ఆరోగ్యకరమైన అల వాట్లు చేసుకుంటా రని అంచనా. శాకాహార, మాంసాహార ఉత్పత్తు లను వేరు చేసేందుకు వాడినట్లు ఇవి కూడా గుర్తుల రూపంలో ఉంటాయి. జంక్ ఫుడ్ కంపెనీలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ కావాలని కోరుకుంటున్న స్టార్ రేటింగ్‌ల విషయంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంత ఆరోగ్యకరం కాదని సూచించేందుకు రెండు స్టార్లను ఇచ్చినప్పుడు కూడా వినియోగదారులు వీటిని తీసుకునేందుకు మొగ్గు చూపు తున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసింది. పైగా ఈ స్టార్ రేటింగులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఇచ్చేవి కాబట్టి వాటిని పరిశ్రమ వర్గాలు తమకు అనుకూలంగా మర్చుకునే అవకాశముందని అంచనా. వీటికి భిన్నంగా వార్నింగ్ లేబుల్స్(హెచ్చరికలు) మాత్రం అందులో ఉన్న పదార్థాల ఆధారంగా తయారవుతాయి. కుకీలు, పాస్తా, నూడుల్స్ వంటివాటిల్లో కొంత మోతాదులో జొన్నలు, సజ్జలు కలిపి నంత మాత్రాన వాటికి ఆరోగ్యకరమైనవన్న ట్యాగ్ తగిలించాల్సిన అవసరమేమీ లేదు కదా! మరి పోషకాలపై మనకున్న అవగాహన ఎంత? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అంచనా ప్రకారం అది చాలా తక్కువ. ఫుడ్ లేబుల్లోని సమాచారం అప్పు డప్పుడూ చదువుతాము కానీ... కొనుగోళ్ల సమయంలో ఎక్కువగా తయారీ, ఎక్స్పైరీ డేట్లనే చూస్తూంటామని ఎన్ ఐఎన్ నిర్వ హించిన ఒక అధ్యయనంలో అధికులు తెలపడం ఇక్కడ ప్రస్తావ నార్హం. ఇదే సమయంలో శాకాహార, మాంసాహారాలను వేరు చేసేందుకు ఉపయోగించే గుర్తులు మాత్రం బాగా ఉపయోగపడుతున్నట్లు వారు ఒప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అనారోగ్యతను సూచించేందుకు ట్రాఫిక్ సిగ్నళ్ల మాదిరి గుర్తులను వాడాలని కొంతమంది సూచి స్తున్నారు. కానీ కంపెనీలు మాత్రం ‘హెల్త్ స్టార్ రేటింగ్’ ఉంటే మేలు అంటున్నాయి. అయితే స్టార్ గుర్తు సానుకూలతను సూచిస్తుంది. ఒకట్రెండు అధ్యయనాల ప్రకారం కొందరు బాగా శుద్ధి చేసిన ఆహారం ప్యాకెట్లపై ఎర్రటి గుర్తు పెట్టడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ కూడా ప్యాకేజీల ముందువైపు సమాచారం ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే జంక్‌ఫుడ్‌తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజి ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఈ లేబలింగ్ విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మీ పిల్లలు తరచు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
ఇది అటు చలికాలం కాదు, అలాగని పూర్తి వేసవి కాలమూ కాదు... అటూ ఇటూ కానీ సంధికాలం. ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రాంకైటిస్, అధిక జ్వరం, టాన్స్లైటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచు సోకుతుంటాయి. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు, అధిక తీపి, ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను తినిపించకూడదని వైద్యులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటితోపాటు క్యాండీలు, ఐస్ క్రీం, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే పావురాలు, ఇతర పెంపుడు జంతువులకు కొద్దిగా దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి. -
ఆస్పత్రిలో ప్రభు
ప్రముఖ నటుడు ప్రభు అనారోగ్యం బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన చెన్నై కోడంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాళ్లను తొలగించడానికి యుకిథ్రోస్ కోఫీ అనే లేజర్ శస్త్ర చికిత్సను మంగళవారం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. -
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రేణూ దేశాయ్
కొన్నేళ్లుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు నటి–దర్శకురాలు రేణూ దేశాయ్. తన అనారోగ్యం గురించి రేణు ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా అనారోగ్య సమస్యల గురించి నా సన్నిహితులకు తెలుసు. కానీ ఇప్పుడు నేనే అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు ధైర్యంగా ఉండాలని చెప్పడం కోసం... వారిలో జీవితం పట్ల సానుకూలమైన ఆలోచనలను రేకెత్తించడం కోసం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనలోని ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశను కోల్పోకూడదు. ఎందుకంటే మన కోసం ఎన్నో స్వీట్ సర్ప్రైజెస్ను కాలంప్లా న్ చేసి ఉండొచ్చు’’ అన్నారు రేణు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ, సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని రేణుదేశాయ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 2005–10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
‘నవోదయ’లో విద్యార్థులకు అస్వస్థత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా, శుక్రవారం వీరి సంఖ్య పెరగడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానిక వైద్య సిబ్బంది చికిత్స చేశారు. అయితే, విద్యార్థులు అస్వస్థతకు గురికావటానికి గల కారణాలు స్పష్టంగా తెలియడంలేదు. విద్యార్థులకు మెనూ ప్రకారం బుధవారం చికెన్ వడ్డించగా, అది తిన్నాక కడుపునొప్పి, వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఇటీవల విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చినప్పుడు తెచ్చుకున్న పిండి వంటలు తినడంతోనే ఇలా జరిగిందని ప్రిన్సిపాల్ చంద్రబాబు వివరణ ఇచ్చారు. విద్యార్థుల పరిస్థితిపై డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతి పాఠశాలకు వచ్చి మెడికల్ ఆఫీసర్ కిషోర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పిండివంటలతో పాటు భోజనం తయారీలో వాడే సరుకుల శాంపిళ్లను సేక రించారు. విద్యార్థులకు చికిత్స కొనసాగుతోందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని డీఎంహెచ్ఓ వెల్లడించారు. -
నారా లోకేష్ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత
సాక్షి, కుప్పం: నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. లక్ష్మిపురం మసీదు వద్ద అదుపు తప్పి వాహనంపై నుంచి కిందకిపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. -
పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు తీవ్ర అస్వస్థత
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉన్న బాలరాజు జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బాలరాజుకు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను రాజమండ్రిలోని సాయి ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెకు స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును లోక్‌సభలో వైఎస్సార్సీపీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తదితరులు పరామర్శించారు. చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన -
పిల్లల పాలిట శాపంగా మారిన గ్యాస్ స్టవ్‌లు.. బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజారోగ్యం దృష్ట్యా గ్యాస్ స్టవ్‌ల వినియోగంపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ స్టవ్‌ల నుంచి వెలువడే కాలుష్య కారకాలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెప్తున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం వాటిపై నిషేధానికి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 40 శాతానికిపైగా వీటిని వినియోగిస్తున్నారు. మిగతావారు విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. (చదవండి: Video: బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. 5 గంటలు శ్రమించి..) గ్యాస్ స్టవ్‌లు వినియోగించినప్పుడు ప్రమాదకర నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పార్టికల్స్ విడుదలవుతున్నాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇవి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్లను కలిగిస్తాయని తెలిపింది. చిన్నపిల్లల ఆస్తమా కేసుల్లో దాదాపు 12 శాతం గ్యాస్ స్టవ్‌ల వాటా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. గ్యాస్ స్టవ్‌ను ఆఫ్ చేసినప్పటికీ వెలువడే మీథేన్ లీకేజీలు పర్యావరణానికి కీడు చేస్తాయని ఇప్పటివరకు పలు నివేదికలు వెల్లడించగా తాజాగా వాటి వినియోగం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలియడం గమనార్హం. దేశవ్యాప్తంగా గ్యాస్ స్టవ్‌ల వినియోగంపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. (చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన) -
కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్లటౌన్: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు విద్యార్థులు వాంతులు, డీహైడ్రేషన్ బారిన పడ్డారు. బడిలో కొత్తగా నిర్మిస్తున్న సంపులో నింపిన నీటితో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థుల్లో 2 గంటలకు ఫుడ్‌పాయిజన్ లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒకటో తరగతిలో ఐరా, వర్షిణి, రిషిత, రెండో తరగతిలో వర్షిణి, శ్రీజ, లక్కీ, వేదిక, వినతి, వరుణ్, శ్రీలక్ష్మి, మూడో తరగతిలో చెఫాన్, వర్షిణి, రిషి, నాలుగో తరగతిలో సంజన, ధీరజ్, రిషివర్ధన్, నిశాంత్, శివ, చరణ్, గౌతమ్, అభిలాష్, ఐదో తరగతిలో రాంచరణ్, శ్రీజ, రిష్రిత్, లాస్య, శామన్‌లిల్లి, రిషివర్ధన్, దివ్య, రిషిత్, ఇందు ఉన్నారు. 29 మంది చిన్నారులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా డీఎంహెచ్‌వో సుమన్ మోహన్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం 25 మందిని డిశ్చార్జి చేయగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విచారణకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ పిల్లల పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. -
కేజీబీవీలో నాసిరకం ఆహారం
నేరడిగొండ: నాసిరకం భోజనం కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో 248 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం టిఫిన్ (చపాతి, పెసరపప్పు) చేసిన 11మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో మిగతా విద్యార్థులు కేజీబీవీ భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. ఇటీవల భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సెలవుదినం కావడంలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూడా సిబ్బందిని నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ జయశ్రీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సెక్టోరల్ అధికారి ఉదయశ్రీకి పలువురు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయగా, సోమవారం వచ్చి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపాల్‌ను ఈ విషయమై సంప్రదించగా.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. కాగా, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విద్యార్థినుల నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. -
ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 15 మందికి గుర్తుతెలియని వైరస్
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే ఊహించని షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లకు గుర్తుతెలియని వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హరీ బ్రూక్, జాక్ క్రాలీ, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 1 నుంచి రావల్పిండి వేదికగా జరగాల్సిన తొలి టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇప్పటివరకు పీసీబీ.. ఈసీబీలు మ్యాచ్ నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జట్టులో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కనీసం 11 మంది కూడా ఆడడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ ఆటగాళ్లకు సోకిన వైరస్ కరోనా కంటే ప్రమాదకరమని తెలిస్తే మాత్రం సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్ల రిపోర్ట్స్ వచ్చాకా అసలు విషయం బయటపడుతుంది. అయితే ఇంగ్లండ్ జట్టుకు సోకిన వైరస్‌కు కోవిడ్-19తో ఎలాంటి సంబంధం లేదని.. తీవ్రమైన కడుపు నొప్పితో మాత్రం బాధపడుతున్నట్లు తేలిందని వైద్యులు పేర్కొన్నారు. కాగా పాక్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు తమ వెంట మాస్టర్ చెఫ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా టి20 ప్రపంచకప్‌కు ముందు టి20 సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పాకిస్తాన్‌కు వచ్చింది. ఆ సిరీస్‌లో ఆహారం వల్ల కొంతమంది ఇంగ్లండ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈసారి అలా జరగకూడదని తమ వెంట మాస్టర్ చెఫ్‌ను వెంటబెట్టుకొని వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. సుమారు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. టి20 వరల్డ్ కప్ 2022కు ముందు పాకిస్థాన్ వెళ్లి 7 టీ20ల సిరీస్‌ను 4-3తో గెలిచి వచ్చిన ఇంగ్లండ్.. వరల్డ్ కప్ తర్వాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు మళ్లీ పాక్‌కు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో, మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరగనున్నాయి. ఇక 2005లో పాక్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టులో ఒక అండర్సన్ మాత్రమే ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్నాడు. We are in discussions with the PCB regarding the start of the first Test due to a viral infection within our camp.#PAKvENG https://t.co/EeHAN4jU63 — England Cricket (@englandcricket) November 30, 2022 చదవండి: జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
అస్వస్థతతో సమంత ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు.. మేనేజర్ ఏం చెప్పారంటే..
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్ ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్ కోరాడు. (చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!) కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. There is a news doing the rounds about @Samanthaprabhu2 and her health. Sources close to her confirm that she is absolutely fine and is doing good. Pl do not spread wrong information. pic.twitter.com/STtZOJVDta — sridevi sreedhar (@sridevisreedhar) November 24, 2022 -
కమల్ హాసన్‌కు అస్వస్థత..
స్టార్ హీరో కమల్‌హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కమల్‌హాసన్ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన ఆయన.. నిన్ననే(నవంబర్ 23) హైదరాబాద్‌కు వచ్చి తన గురువుగారు కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కలిసి వెళ్లారు. నిన్న రాత్రి చెన్నై చేరుకున్న తర్వాత ఆయనకు ఇలా జరిగినట్లు తెలుస్తుంది. రాత్రి కాస్త జ్వరంగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. కమల్ ప్రస్తుతం ఇండియన్-2 లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో షురూ కానుంది. -
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గుముఖం పడుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. మరోవైపు వాహన కాలుష్యం అనూహ్యంగా పెరుగుతుండడంతో సిటీజన్లు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారంలో పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు చేరుకోవడంతో నగరవాసులు గజగజలాడారు. నగరంలో కాలుష్యం,చలి కారణంగా రోగులు, వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు, ప్రయాణికులు, వాహనదారులు, చిరు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. చలి, కాలుష్య తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాహన కాలుష్య ఉద్గారాలు.. గ్రేటర్లో వాహనాలు వదులుతున్న కాలుష్యంతో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతో పాటు మంచు, సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో.. ► పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ►దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. ►చిరాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు తలనొప్పి, పార్శ్వపు నొప్పి వస్తుంటాయి. ►ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పంజా విసురుతున్న చలిపులి.. నగరంలో ఇటీవలికాలంలో కనిష్ట,గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో చలిపంజా విసురుతోంది. కిందిస్థాయి గాలుల ప్రభావంతో తరచూ కారుమబ్బులు కమ్ముకుంటుండడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల మేర నమోదవడంతో సిటీజన్లు గజగజలాడారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. -
జబ్బులు బాబోయ్!
సాక్షి, అమరావతి: దేశంలో జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 37 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 75వ జాతీయ నమూనా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అనారోగ్య ప్రాబల్యంపై 75వ జాతీయ నమూనా సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది. దేశంలో ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు జీవనశైలి జబ్బులు.. అంటే బీపీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు, నలుగురు గుండె, రక్తనాళాల జబ్బుల బారిన పడుతున్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కేరళ, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువ శాతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు వారు ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. బిహార్, అస్సోం, గోవా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారు బిహార్, ఉత్తరాఖండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జీవనశైలి జబ్బులతో పాటు గుండె, రక్తనాళాల జబ్బులు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారు కేరళలో అత్యధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత
-
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
-
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
కోల్‌కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో గురువారం హైవేల శంకుస్థాపనకు వెళ్లిన గడ్కరీ.. దగాపూర్ మైదానం వేదికపై ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. కేంద్ర మంత్రిని విశ్రాంతి కోసం పక్కనన్న గ్రీన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. సిలిగురి నుంచి డాక్టర్‌ను పిలిపించారు. ఈ మేరకు ఆయనను పరీక్షించిన వైద్యులు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు. వైద్యుల సూచనతో సెలైన్ ఎక్కించారు. డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని కారులో తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది. కాగా రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. ఈలోపే సిలిగురిలో అస్వస్థతకు లోనయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గడ్కరీ దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ రద్దు అయినట్లు తెలుస్తోంది. సిలిగురి నుండి అయన నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. చదవండి: తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్ -
20మంది జెడ్పీ హైస్కూలు విద్యార్థులకు అస్వస్థత
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 20 మంది సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుండగా, మధ్యాహ్న భోజనం కలుషితమైనట్లు అనుమానిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 111 మంది విద్యార్థులు భోజనం చేయగా, సాయంత్రం 20 మందికి పైగా విద్యార్థులు దగ్గు, గొంతు మంటతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో హెచ్ఎం జుంకీలాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి వారిని చండ్రుగొండ పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్న డాక్టర్ వెంకట్ ప్రకాష్ తెలిపారు. డీఎంహెచ్ఓ దయానందస్వామి వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. -
మధ్యాహ్న భోజనం వికటించి 89 మందికి అస్వస్థత
నవీపేట(బోధన్)/గాంధారి (ఎల్లారెడ్డి)/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మధ్యాహ్న భోజనం వికటించి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో శుక్రవారం మొత్తం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 188 మంది విద్యార్థులు మధ్యాహ్నం ఎప్పటిలాగే భోజనం చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పితో వరుసగా 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లతో చికిత్స చేశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఏడుగురు విద్యార్థులకు సెలైన్ ఎక్కించారు. అలాగే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 305 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా 25 నుంచి 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి సెలైన్ ఎక్కించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వీరికి వైద్య చికిత్సలు అందించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. -
ఏపీ సీఎప్ సమీర్‌శర్మకు అస్వస్థత
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్‌శర్మ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. -
సిరిసిల్ల టౌన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి మృతి
సాక్షి, సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని ఒబులాపూర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి 28 ఆగస్టు 1990న కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులతో ఎస్సై స్థాయికి ఎదిగారు. వేములవాడ ఆర్అండ్ఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో భార్య విజయతో ఉంటున్నారు. ఆయన రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైగా పని చేశారు. 2019లో ఎస్సైగా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. 8 నెలల క్రితం బదిలీపై డీపీవో కార్యాలయానికి వచ్చారు. ఉపేందర్‌రెడ్డి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల అవి ఎక్కువవడంతో పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు జరిపించారు. ఎస్సై మృతికి ఎస్పీ రాహుల్‌హెగ్డే సంతాపం ప్రకటించారు. -
ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరిన నటుడు
భువనేశ్వర్: ఒడియా చలనచిత్ర నటుడు బాబూసాన్ మహంతి శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో అనారోగ్యానికి గురై శుక్రవారం అసుపత్రిలో చేరారు. భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. బాబూ సాన్ ఆరోగ్యం క్రమంగా కోలుకోవడంతో ఆయన భార్య తృప్తి సత్పతి ఆసుపత్రికి చేరుకొని నటుడిని ఇంటికి తీసుకెళ్లింది. అయితే గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల కారణంగా బాబూషాన్, తృప్తి విడివిడిగా నివసిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆసుపత్రికి వచ్చి తన భర్తను అత్తవారింటికి తీసుకెళ్లింది. కాగా ధామన్ చిత్రం షూటింగ్ పురస్కరించుకుని బాబూసాన్ లడక్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక పోవడంతో ఆక్సిజన్ స్థాయి దిగజారి, అస్వస్థతకు గురయ్యారు. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
మాగనూర్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీ హెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మధ్యాహ్న భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. -
వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
-
కు.ని ఆపరేషన్ తర్వాత అనారోగ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత అనారోగ్యం పాలైన నలుగురు మహిళల్లో ఒకరు మరణించగా మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 25న వివిధ మండలాలకు చెందిన 37 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇద్దరు వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ల అనంతరం ఇంటికి వెళ్లిన వారిలో మాడ్గులకు చెందిన మమత (30) రెండు రోజుల క్రితం వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆమె మరణించింది. మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ ఆపరేషన్ చేయించుకున్న రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ ఈ నెల 27 ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లింది. సుష్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో ఇద్దరు మహిళలు కూడా వాంతులు, విరోచనాలతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసినప్పుడు బాగానే ఉన్నారు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సమయంలో అందరూ బాగానే ఉన్నట్లు తెలిసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్లు చేసిన ఇద్దరు వైద్యులు అనుభవం ఉన్నవారే. ఆపరేషన్ చేసిన చోట ఎలాంటి సమస్యలు రాలేదు. ఇప్పుడు అనారోగ్యానికి గురైన మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. వైద్యులతో సమీక్షించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. – నాగజ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఇబ్రహీంపట్నం -
తెరపైకి పుతిన్ బాడీ డబుల్ థియరీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో పాశ్చాత్య మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతోంది. ఉక్రెయిన్ యుద్ధం వంకతో వీలైనంత రీతిలో పుతిన్‌ను బద్నాం చేస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఎక్కువ కాలం బతకడంటూ వీడియో కథనాలతో ఊదరగొడుతోంది. ఇప్పుడు ఏకంగా మరో థియరీని తెరపైకి తెచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగోలేదని చాలాకాలం నుంచి వెస్ట్రన్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో 69 ఏళ్ల పుతిన్ తనకు బాడీ డబుల్‌ను తెరపైకి తెచ్చాడంటూ ఉక్రెయిన్ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. నిత్యం మెడికల్ చెకప్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే అధికారిక కార్యక్రమాలకు ఆయన తన బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నాడని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైర్య్లో బుడానోవ్ చెప్తున్నాడు. పుతిన్ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే.. చాలా భేటీల్లో ఆయన హైట్, వెయిట్, చెవుల భాగంలో తేడాలను పరిశీలించవచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మనిషి చేతి వేళ్లు యూనిక్‌గా ఉన్నట్లే.. చెవి భాగం సైతం యూనిక్‌గా ఉంటుంది. అలాంటిది పుతిన్‌లో ఆ భాగంలో తేడాను సులువుగా గమనించవచ్చు. బహుశా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. ప్రజలకు కనిపించేందుకు వీలుగా తన బాడీ డబుల్స్‌ను ఉపయోగించుకుంటున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్. అంతేకాదు ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్నే పంపించాడని, పైగా ఆ పర్యటనలో పుతిన్ బాగా జోష్‌లో కనిపించిన విషయం ఆ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని చెప్పాడాయన. మరోవైపు ఈ వాదనపై క్రెమ్లిన్ గప్‌చుప్‌గా ఉండిపోయింది. పుతిన్ బాడీ డబుల్ థియరీ ఇలా తెర మీదకు రావడం ఇదే కొత్త కాదు. 2018లో పుతిన్ లాగ ముగ్గురు ఉన్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఆ సమయంలో ట్విటర్లోనూ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మూడు భిన్నమైన రూపాలున్న పుతిన్ ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. బాడీ డబుల్ అంటే.. ఒక వ్యక్తి బదులుగా అలాంటి కవళికలు ఉన్న వ్యక్తి ఆ పనిని పూర్తి చేయడం. చరిత్రలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ లా మోంట్‌గోమెరీ, సద్దాం హుస్సేన్, జోసెఫ్ స్టాలిన్లు బాడీ డబుల్‌ను ఉపయోగించేవాళ్లన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదీ చదవండి:: గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్ -
మూడు రోజులుగా పురుగుల అన్నమే.. 43 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆదిలాబాద్‌టౌన్/బేల: ఆదిలాబాద్ జిల్లా బేల కేజీబీవీలో సోమవారం 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం చికెన్ అన్నం, రాత్రి ఉల్లిగడ్డ కూరతో భోజనం పెట్టినట్టు విద్యార్థినులు తెలిపారు. అయితే మధ్యాహ్నం, రాత్రి వడ్డించిన పురుగుల అన్నంతోనే అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు. పాఠశాలలో ఆదివారం ఏఎన్ఎం తప్ప ఇతర సిబ్బంది లేరు. సోమవారం ఉదయం వరకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఏఎన్ఎం, వాచ్‌మన్ కలిసి మొదట అస్వస్థతకు గురైన 28 మందిని బేల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మరో 15 మందికి పాఠశాలలోనే పీహెచ్సీ వైద్యాధికారి క్రాంతి వైద్య సేవలందించారు. సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులే వాటిని చేతుల్లో పట్టుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా సాక్షి ఫొటో తీశాకా అక్కడి సిబ్బంది హుటాహుటిన స్టాండ్లు తీసుకువచ్చి ఏర్పాటు చేయడం విశేషం. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మరికొందరు తల్లిదండ్రులు రిమ్స్‌కు చేరుకున్నారు. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. కాగా, మూడ్రోజులుగా పురుగుల అన్నమే పెడుతున్నారని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో డీఈవో ప్రణీత పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఉదయం ఏఎన్ఎం కావాలనే విద్యార్థులను టిఫిన్ తినకుండా అడ్డుకోవడంతో వారు నిరసించి, అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రత్యేక అధికారి గేడాం నవీన పేర్కొనడం గమనార్హం. ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, అడిషనల్ డీఆర్డీఏ రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్.. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. 13 క్వింటాళ్ల స్టాకు బియ్యంలో 3 క్వింటాళ్లలో పురుగులు ఉండటాన్ని గుర్తించారు. గుర్తించిన లోటుపాట్లపై కలెక్టర్‌కు నివేదిస్తామని వారు తెలిపారు. -
మారిన మందు.. బాలుడికి అస్వస్థత
పుత్తూరు రూరల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన డాక్టర్లకు చెమటలు పట్టించింది. స్థానిక గేటు పుత్తూరులోని శెంగుంధర్ వీధికి చెందిన రాజ్‌కుమార్.. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదేళ్ల తన కుమారుడు రోహిత్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు చూపించాడు. పరీక్షించిన డాక్టర్ సిరప్ రాసిచ్చాడు. తర్వాత చీటీ చూపించి మందు తీసుకెళ్లి 5 ఎంఎల్ తాగించాడు. కొద్ది సేపటికి రోహిత్ కడుపులో మంటగా ఉందని చెప్పడంతో, సిరప్‌ను పరిశీలించి అది ల్యాన్‌డన్ లోషన్‌గా గుర్తించాడు. వెంటనే రోహిత్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్ శంకర్‌నారాయణ పరీక్షించి కడుపులోని మందును వామ్టింగ్ చేయించడంతో పాటు తగిన చికిత్స అందించడంతో నిమిషాల్లోనే కోలుకొన్నాడు. మందు మారడానికి కారణాన్ని అన్వేషించగా.. ఫార్మసిస్ట్ సెలవులో ఉండటంతో సెక్యూరిటీ గార్డ్ (అవుట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న వసంత్ మందును మార్చి ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జరినా సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను తొలగించారు. రోహిత్‌ను మెరుగైన పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మందు మార్చి ఇచ్చిన వసంత్ అనే వ్యక్తి తప్పిదం వల్ల మా బాబు ఇబ్బంది పడ్డాడు గానీ ఇందులో డాక్టర్ల తప్పిదమేమీ లేదని బాలుడి తండ్రి రాజ్‌కుమార్ చెప్పారు. విచారణ జరిపిన ఇన్చార్జి డీసీహెచ్ఎస్ పుత్తూరు రూరల్ః పుత్తూరు ప్రభుత్వ మందు మార్పు–బాలుడి అస్వస్థతపై తిరుపతి డీసీహెచ్ఎస్ వేదసాయి విచారణ చేశారు. ఆదివారం రాత్రి ఆమె పుత్తూరు ఆసుపత్రికి వచ్చి జరిగిన సంఘటపై పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న రోహిత్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సిరప్‌ను ఇచ్చిన అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. జరిగిన మొత్తం సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ డాక్టర్ జరినాకు మెమో ఇచ్చినట్లు తెలిపారు. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించేది మరో రెండేళ్లే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడు. గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ -
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. జ్వరం కారణంగా నేటి అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్.. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో సోమవారం పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు -
ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే?
మలికిపురం(కోనసీమ జిల్లా): ఆ యువతి పట్టుదలతో చదివింది. ఎంఎల్‌హెచ్‌పీ పూర్తి చేసింది. ఆరోగ్య శాఖలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. అనుకున్నది సాధించింది. అంతలోనే విధి వక్రీకరించింది. స్వల్ప అనారోగ్యం తీవ్ర రూపం దాల్చి ఆ యువతిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్ఎం నల్లి విజయకుమారి (21) ఆకస్మిక మృతి చెందింది. ఇటీవలే ఆమెకు ఏఎన్ఎంగా ఉద్యోగం రావడంతో పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి పీహెచ్సీలో విధులలో చేరారు. చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ.. మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి.. విధులలో చేరి పది రోజులు కూడా కాలేదు. ఇటీవల ఆమెకు స్వల్ప అనారోగ్యం రావడంతో రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు బుధవారం విజయకుమారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె తండ్రి ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లిదాసును పరామర్శించారు. ఎంపీపీ కేతా శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు మట్ట అనంత లక్ష్మి, సర్పంచ్‌లు మందపాటి నాగేశ్వరావు యెనుముల నాగు, రాపాక ఆనందకుమార్ పరామర్శించిన వారిలో ఉన్నారు. -
మంత్రి సురేష్‌కు అస్వస్థత.. ఫోన్లో సీఎం పరామర్శ
సాక్షి, అమరావతి/యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన పలు సభల్లో మాట్లాడారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. గత నెల 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించి బుధవారం స్టెంట్ వేశారు. విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. మంత్రి సురేష్‌ను ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోలుకున్న ఆయన్ను శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. -
కేజీఎఫ్–2 చూసి.. రాఖీభాయ్‌లా సిగరెట్లు కాల్చి..
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్2 కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చిత్రంతో యశ్ గ్రాఫ్ అంతకముందు.. ఆ తరువాత అనేలా మారిపోయింది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి యశ్ హీరోయిజమే మెయిన్ అట్రాక్షన్.. సినిమాలో హీరో మాటలు, ఆటిట్యూడ్, అలవాట్లు ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాను పదే పదే చాడటానికి యువతి ఇష్టపడుతున్నారు. యష్ నటించిన కేజీఎఫ్–2 సినిమాలోని ‘రాఖీభాయ్’ పాత్రను చూసి తానూ అలాగే స్టైల్‌గా ఉండాలనుకున్న 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్ కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్–2 సినిమాను మూడుసార్లు చూశాడు. తర్వాత ఒకేసారి ఏకంగా ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు సెంచరీ ఆస్పత్రికి తరలించారు. థియేటర్లలో విడుదలైన రెండోవారం ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్ స్టైల్ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. కాగా ఈ కేసుపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ప్రేక్షకులు ముఖ్యంగా టీనేజర్లు ‘రాకీ భాయ్’ వంటి పాత్రలతో తొందరగా ప్రభావితమవుతరాని అన్నారు. ఈక్రమంలోనే మైనర్ ధుమపానానికి అలవాటు పడి ఒకే రోజు సిగరెట్ ప్యాకెట్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. మనుషులపై సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం అని, సిగరెట్లు తాగడం. పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత సినీ నిర్మాతలు, నటీనటులపై ఉంటుందన్నారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వ్యవసనాలకు అలవాటు పడుతున్నారో తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలు చెడు వ్యవసనాలకు బానిసలవ్వడకుండా అవగాహన కల్పించడంలో తల్లిదండ్రల పాత్ర ముఖ్యమంన్నారు. -
అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి..
సాక్షి, సిరిసిల్ల: అనారోగ్యం ఆ కుటుంబాన్ని వెంటాడింది.. విధి వెక్కిరించడంతో తల్లీకుమారుడు రెండు నెల వ్యవధిలో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన అల్లే పద్మ–బాలయ్య దంపతుల మూడో కూతురు ప్రీతికి 13 నెలల కిందట ముంబాయికి చెందిన అవినాష్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు బాబు జన్మించగా అవిష్ అని పేరు పెట్టారు. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్న ఆ చిన్నారి రెండు నెలల క్రితం చనిపోయా డు. అప్పటినుంచి తీవ్ర ఆవేదనకు గురవుతున్న ప్రీతి అనారోగ్యం పాలైంది. ముంబాయిలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కూతురు, మనవడి మృతితో వృద్ధులైన ప్రీతి తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని -
పుతిన్‌కు సర్జరీ?
మాస్కో: ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టి 70 రోజులు దగ్గర పడుతున్నా ఆశించిన ఫలితాలు సాధించలేక మథనపడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అనారోగ్యమూ వెంటాడుతోంది. ఏడాదిన్నరగా కేన్సర్, పార్కిన్సన్స్తో బాధపడుతున్న పుతిన్ కేన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ వారంలోనే ఆపరేషన్ జరగవచ్చని రష్యా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఇంగ్లండ్ మీడియా చెబుతోంది. సర్జరీ జరిగి కోలుకునే దాకా ఉక్రెయిన్‌తో యుద్ధ బాధ్యతలను ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్ఎస్బీ) మాజీ చీఫ్ నికోలాయ్ పత్రుషేవ్కు అప్పగించాలని పుతిన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 70 ఏళ్ల పత్రుషేవ్ యుద్ధ వ్యూహాలను పకడ్బందీగా రచిస్తారని పేరుంది. రెండో ప్రపంచ యుద్ధ విజయానికి గుర్తుగా మే 9న రష్యా విజయోత్సవం లోపే ఆపరేషన్ చేయించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. హెవీ డోసుల ప్రభావం కేన్సర్, పార్కిన్సన్స్, స్కిజోఫ్రేనియా వ్యాధులకు హెవీ డోస్ మందులు తీసుకోవడంతో పుతిన్ బాగా బలహీనపడ్డారని వార్తలు వస్తున్నాయి. తక్షణం కేన్సర్ సర్జరీ చేయించుకోవాలని ఆయనకు చికిత్స చేస్తున్న వ్యక్తిగత వైద్యులు సలహా ఇచ్చారు. తాజా వీడియోల్లో పుతిన్ ముఖంలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి. కూర్చునే, నడిచే తీరులోనూ తేడాలు కనిపిస్తున్నాయి. అతిథులతో కరచాలనం సందర్భంగా చేతులు వణుకుతున్న వీడియోలు వైరలయ్యాయి. ప్రధానిని కాదని.. రష్యా అధ్యక్షుడు అనారోగ్యం బారిన పడితే దేశ రాజ్యాంగం ప్రకారం ప్రధాని తాత్కాలికంగా అధికార బాధ్యతలు చేపట్టాలి. కానీ ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ (56)లో ప్రొఫైల్‌లో ఉంటారు. దేశ నిఘా వ్యవస్థ, సంబంధిత సమాచారంతో ఆయనకు పెద్దగా లింకులు లేవంటారు. యుద్ధం కీలక దశకు చేరిన నేపథ్యంలో దూకుడుగా ముందుకు తీసుకెళ్లేవారు కావాలన్న ఉద్దేశంలో పత్రుషేవ్ వైపు పుతిన్ మొగ్గారంటున్నారు. ఆయనకు ఉదర సంబంధ క్యాన్సరని కొన్ని పత్రికలు, థైరాయిడ్ క్యాన్సరని మరికొన్ని రాస్తున్నాయి. చికిత్స కోసం గతంలో పలుమార్లు పుతిన్ రోజుల తరబడి మాయమైనా రష్యా మీడియా దాన్ని రహస్యంగా ఉంచింది. కానీ ఇప్పుడు మాత్రం పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు పుతిన్ సర్జరీ చేయించుకుంటున్నారని తొలిసారిగా అనధికారిక సంభాషణల్లో చెప్పుకుంటున్నట్టు భోగట్టా. -
కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకి అస్వస్థత
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలల్లో వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న డెంటల్, నర్సింగ్ కాలేజీల్లో చదువుతోన్న విద్యార్థినులు బుధవారం వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కళాశాలల్లో గ్రాండ్ 9 అనే అవుట్ సోర్స్ ఏజెన్సీ ఇక్కడ మెస్ నిర్వహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు మెస్‌లో భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. 30 మంది బుధవారం రాత్రి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న కొందరిని నుంచి డిశ్చార్జి చేయడంతో తిరిగి హాస్టల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. కలుషిత ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. విద్యార్థులందరూ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారావు తెలిపారు. -
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత
సాక్షి, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కందమూరు గ్రామంలో బుధవారం ఉదయం ఆయన ‘జగనన్న మాట–గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట’ కార్యక్రమం నిర్వహిస్తుండగా కుడికాలు నొప్పిగా ఉండడంతో వెంట ఉన్నవారు నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులకు సమాచారం అందించారు. డాక్టర్లు మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని చికిత్స అందించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి చికిత్స చేస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించగా సాధారణంగా ఉన్నట్లు తేలింది. వైద్యుల సూచనను ఎమ్మెల్యే సున్నితంగా తిరస్కరించారు. తన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. మంగళవారం గత రాత్రి పాతవెల్లంటి గ్రామంలో కుండా మురళీరెడ్డి ఇంట్లో బసచేసిన ఆయన బుధవారం ఉదయం కందమూరులో చేవూరు పెంచలయ్య ఇంటి వద్ద నుంచి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి ఇంటింటికీ వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. చదవండి: (ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు) -
ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి..
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): శ్రీధరఘట్టలో పెళ్లి భోజనం వికటించి 50 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు, స్థానికుల వివరాల మేరకు.. మూడు రోజుల క్రితం గ్రామంలో ఓ వివాహం జరిగింది. వివాహంలో బంధుమిత్రులు తిన్న భోజనం వికటించి, వన్నూరుస్వామి, మహేష్, నిరంజన్, పార్వతి, భీమేష్ , నేమకల్లు చాకలి రవి, రామాంజి, హనుమక్క, శ్రీదేవి, మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. చదవండి: శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం -
అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్
Russian troops first sign of illness from radiation: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా దాడి సాగిస్తూనే ఉంది. రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన పేరుతో ఉక్రెయిన్ పై మరిన్ని వైమానిక బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక దాడుల కారణంగా ఉక్రెయిన్ ఊహించనట్లుగానే యూరప్ దేశాలకు పెనుముప్పు వాటిల్లనుంది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించినప్పుడే చెర్నోబిల్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంలో భాగంగా అణుకర్మాగారంపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ సేనలు అణుకర్మాగారంలో వ్యాపించిన మంటలను అదుపు చేసి పర్యవేక్షించారు. అంతేకాదు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ అణుకర్మాగారం అతిపెద్దదని గతంలో అది ఎంత పెను విధ్వంసం సృష్టించిందో కూడా వివరించారు. అయితే ఇప్పుడూ ఆ అణుకర్మాగారం నుంచి రేడియేషన్లు వెలువుడుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అందులో భాగంగానే చెర్నోబిల్ వద్ద రష్యా దళాలు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం బెలారస్‌లోని ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలి వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈమేరకు ఉక్రెనియన్ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్చుక్ కూడా రష్యన్లు రేడియేషన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. చెర్నోబిల్ వద్ద కార్మికులు నివసించే సమీపంలోని స్లావుటిచ్ పట్టణం నుంచి రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయమై యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో చెర్నోబిల్‌కు తన తొలి సహాయం అందించనున్నట్లు ఐఏఈఏ పేర్కొనడం విశేషం. (చదవండి: మా ఆంక్షలు నిర్వీర్యం చేయోద్దు!..హెచ్చరించిన యూఎస్) -
ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి
ఉక్రెయిన్ సంక్షోభం మరింత తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్న భారతీయులను తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్‌లో రష్యన్ షెల్లింగ్‌లో మెడిసిన్ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల ప్రకారం.. 21 ఏళ్ల చందన్ జిందాల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. అతను పంజాబ్‌లోని బుర్నాలాకు చెందినవాడు. అయితే ఇసెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతోన్న చందన్ జిందాల్‌ను ఫిబ్రవరి 2న వినిట్సియాలోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భారత్‌లో ఉంటున్న చందన్ తల్లిదండ్రులు ఫిబ్రవరి 7న ఉక్రెయిన్ చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చందన్‌కు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా చందన్ మరణించినట్లు మంగళవారం వైద్య అధికారలు తెలిపారు. (చదవండి: Russia-Ukraine War: రష్యాకు సపోర్ట్.. బెలారస్‌కు బిగ్ షాక్ ) -
హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది
కొందరికి పుట్టుకతోనే వైకల్యం ప్రాప్తిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు వైకల్యం బారిన పడతారు. వీరిలో చాలామంది ఈ జీవనం ‘శాపం’ అంటూ భారంగా రోజులు గడిపేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే అత్యంత అరుదుగా శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు 28 ఏళ్ల హీనా శర్మ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటున్న హీనా శర్మ అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే వీల్‌చెయిర్‌కి పరిమితమైంది. కానీ, పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని తనే మలుచుకుంది. వీల్‌చెయిర్‌లో కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంది. మోడల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీటితో పాటు మిస్ వీల్‌చెయిర్ ఇండియా 2022 ఫైనల్‌కి కూడా చేరింది. ‘వీల్ చెయిర్‌పై ఉండటమనేది విచారకరం కాదు. నిస్సహాయతతో కాకుండా సరదాగా జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను’ అంటోంది. ఇతరులపై ఆధారపడకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెబుతున్న హీనా శర్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలోని ఆటుపోట్లను ఈ విధంగా వివరిస్తోంది.. పాటలు పాడుతూ.. కండరాల క్షీణత ‘‘అందరు పిల్లల్లాగే తొమ్మిది నెలల వయసులోనే తొలి అడుగులు వేశానట. కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు అమ్మానాన్న. ఆరునెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. ‘వెన్నెముక బలహీనంగా ఉంది. కండరాల క్షీణత వల్ల నిటారుగా నిలబడలేదు’ అని చెప్పారు డాక్టర్లు. అప్పటినుంచి నా కాళ్లలో కదలిక లేదు. వెన్నెముక ‘సి’ ఆకారంలోకి మారిపోయింది. అయినా, ఆశచావక అమ్మానాన్నలు చికిత్స కోసం నన్ను దేశమంతా తిప్పారు. డాక్టర్ల సలహా మేరకు పదే పదే ఆపరేషన్లు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నా పాదాలకు శస్త్ర చికిత్స చేశారు. అటునుంచి గోరఖ్‌పూర్‌లో ఫిజియోథెరపీ చేయించారు. మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ, ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు డాక్టర్లు. అమ్మ భయపడి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో ఆగిపోయిన చదువు మళ్లీ మొదలుపెట్టాను. స్కూల్లో అందరూ ఇష్టపడేవారు. అందరూ సాయంగా ఉండేవారు. పదవ తరగతిలో ఆటోమేటిక్ వీల్‌చైర్ వచ్చింది. అప్పటినుంచి నా జీవితం చాలా సరళంగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకున్నా ఒంటరిగానే వెళ్లేదాన్ని. సంగీతం క్లాసులు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ బలంగా మారింది. దీంతో స్కూల్ టైమ్ అయ్యాక, మా అక్కను తీసుకొని సంగీతం క్లాసులకు వెళ్లేదాన్ని. పై అంతస్తు లో క్లాస్ ఉంటే ఎత్తుకునే తీసుకు వెళ్లేది. అలా నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నాను. అక్క పెళ్లవడంతో సంగీతం నేర్చుకోవడం మధ్యలోనే ఆగిపోయింది. కానీ, నాకు వచ్చినంతవరకు నేనే ఇంటి వద్ద సంగీతం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ట్యూషన్లు చెప్పడం కూడా ఆరంభించాను. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం, వీల్‌చెయిర్.. అన్నింటి వల్ల చదువు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతనే నిజమైన పోరాటం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఉద్యోగం ఓ సవాల్... ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే ఎదురయ్యింది. వెళ్లిన ప్రతిచోటా ‘ఎలా పనిచేస్తారు, ఎలా వస్తారు, ఎలా వెళతారు..’ ఇవే ప్రశ్నలు. చాలా నిరాశగా అనిపించేది. వికలాంగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే స్వచ్ఛంద సంస్థ ఉందని తెలిసి వారిని కలిసి, శిక్షణకు వెళ్లేదాన్ని. రోజూ ఘజియాబాద్ నుంచి నజాఫ్‌గడ్‌కు మూడు గంటలపాటు ఒంటరిగానే ప్రయాణించే దాన్ని. శిక్షణ సమయంలో రోజంతా సెంటర్లో కూర్చుంటే బాత్రూమ్కు తీసుకెళ్లేవాళ్లు లేక యూరిన్ బ్యాగ్ కూడా వీల్‌చెయిర్‌కు సెట్ చేసుకునేదాన్ని. రెండు నెలల శిక్షణ పెద్ద పోరాటమే అని చెప్పాలి. అయినా ఉద్యోగం రాలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినా పదవ తరగతి చదివేవారికి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వలేమన్నట్లే మాట్లాడేవారు. నన్ను నేను నమ్ముకున్నాను.. మళ్లీ ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. ఈసారి ఉద్యోగం కోసం పోరాటం కొనసాగించాను. వివిధ ఆన్లైన్ పోర్టళ్లలో నా పేరు నమోదు చేసుకున్నాను. దీంతో కొన్ని ఎన్జీవోలకు నా పూర్తి సమాచారం చేరింది. టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటినుండి పని చేసుకునే పర్మనెంట్ అవకాశం గల ఉద్యోగం కావడంతో సులభంగా చేయగలుగుతున్నాను. సంగీత పరిజ్ఞానం ఉండటంతో వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను. ‘రైజింగ్ స్టార్’ టీవీ షోస్‌లో పాల్గొన్నాను. ఆస్మాన్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో ఇళయరాజా పాట పాడటం నా జీవితంలో అతి ముఖ్యమైనది. అమితాబ్ బచ్చన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఆ పాటను రీట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందాను. ఈ యేడాది ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌కి చేరాను. కూర్చొని డ్యాన్స్ చేస్తాను. పాడతాను. రోజంతా హుషారుగా గడుపుతాను. నా జీవితంలో నేను జాలిపడేది ఏమీ లేదని నాకు అర్థమైంది. చాలామంది వికలాంగులతో నాకు పరిచయం ఉంది. జీవితం పట్ల వారిలో భయాందోళనలను గమనించాను. సానుభూతిని కోరుకోవడం చూశాను. బతికినంత కాలం నా మనసులో ఏముందో అదంతా చేసేస్తాను. ఎవరైనా తమను తాము ఉన్నట్లుగా అంగీకరించాలి. అప్పుడు మన జీవితాన్ని నిస్సహాయతతో కాకుండా సరదాగా గడపగలుగుతాం’’ అని చెబుతున్న హీనా శర్మ మాటలే కాదు చేతలు కూడా నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
అనారోగ్యంతో చెల్లి.. గుండెపోటుతో అక్క..
డిండి: అనారోగ్య కారణాలతో బాధపడుతున్న చెల్లి కన్నుమూసింది. ఆమె మృతిని జీర్ణించుకోలేక అక్క కూడా గుండెపోటుతో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరి«ధిలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి ఈశ్వరయ్యకు అదే గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(62)తో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో ఈశ్వరయ్య తన భార్య సోదరి ఈరమ్మ(57)ను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె జన్మించారు. వారికి వివాహాలు కావడంతో వేరుగా ఉంటున్నారు. పదిహేనేళ్ల క్రితం ఈశ్వరయ్య కాలం చేశాడు. దీంతో అక్కాచెల్లెళ్లు లక్ష్మమ్మ, ఈరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈరమ్మ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. అది తట్టుకోలేక అక్క లక్ష్మమ్మకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచింది. నిమిషాల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. చదవండి: రాజ్యసభలో టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి -
మొహాలీ ఆసుపత్రికి ప్రకాశ్‌సింగ్ బాదల్
చండీగఢ్: అనారోగ్యంతో బాధపడుతున్న శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్(94)ను ముక్తసర్ జిల్లా నుంచి మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశ్‌సింగ్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ గత నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. -
చావులోనూ నీతోనే!
మంచిర్యాలక్రైం: జీవితాంతం తోడుంటానని పెళ్లి నాడు అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. చావులోనూ భార్యకు తోడ య్యాడు. వయసు పైబడి అనారోగ్యంతో భార్య మరణించగా.. జీవిత చరమాంకంలో ఆమెలేని లోకంలో ఉండలేక.. పిల్లలకు భారం కాలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై తైసినొద్దీన్ కథనం ప్రకారం.. మంచిర్యాలలోని ఎడ్లవాడకు చెందిన మేర్గు శాంతయ్య(85), సుశీల(75) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు కావడంతో వేరేచోట ఉంటున్నారు. కుమా రుడు నెహ్రూ కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సుశీల కొన్నేళ్లుగా నరాల బలహీనతతో బాధపడుతూ ఇంటి వద్దనే వైద్యం చేయించుకుం టోంది. అనారోగ్యం తీవ్రం కావడంతో గత ఏడాది కోమాలోకి వెళ్లిపో యింది. సింగరేణిలో కార్మికుడిగా పదవీ విరమణ పొందిన శాంతయ్య సుశీలకు సే వలు చేస్తుండేవాడు. కాగా, ఇం టిపని సు శీల బాగోగులు చూసుకోవడానికి కుమారు డు నెహ్రూ, ఓ మహిళను నియమించాడు. రోజూమాదిరిగానే ఆమె శుక్రవారం ఉద యం పనులు చేసేందుకు ఇంటికి రాగా.. తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా శాంతయ్య వెంటిలేటర్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. పడక గదిలోకి వెళ్లి చూడగా సుశీల మృతిచెందినట్లు గుర్తించింది. పొరుగువారికి ఈ విషయం చెప్పడంతో వారు కుమారుడు నెహ్రూ, పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి
కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్‌కు దగ్గరలో నివాసం ఉంటున్న సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రతి సంక్రాంతికి కాశీబుగ్గలోని తన స్వగృహానికి రావడం, తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆయనకు అలవాటు. షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత అతనికి గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని, ఆ కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా, తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తా రిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: (సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్) -
రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు. (చదవండి: చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు) -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(69) కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్‌టౌన్‌లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. -
ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై వైద్యులు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల నవంబరు 18 న కోవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి నవంబరు 28న విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరిగి నిన్న (ఆదివారం) అస్వస్థతకు గురయ్యారు. -
ఏపీ గవర్నర్‌కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పట్లో కరోనా రిపోర్టు నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయి విజయవాడకు చేరుకున్నారు. కానీ, ఆదివారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్ వర్గాలు తిరిగి డాక్టర్లను సంప్రదించగా, అదనపు చికిత్స అవసరమని వారు సూచించినట్లు తెలిసింది. -
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్2 కు మరోసారి అనారోగ్యం
-
మళ్లీ వికటించిన భోజనం.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, బాన్సువాడ: మధ్యాహ్న భోజనం మళ్లీ వికటించింది. బీర్కూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కుళ్లిన గుడ్లు వడ్డించడంతో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటలో గత గురువారం మధ్యా హ్న భోజనం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా తిరక్కుండానే మళ్లీ మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 264 మంది బడికి వచ్చారు. రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. పిల్లలకు అన్నం, పప్పుతో పాటు గుడ్డు వడ్డించారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా భోజనం చేశారు. అయితే, అన్నం తిన్న తర్వాత కొద్ది సేపటికి విద్యార్థులు కడుపు నొప్పితో అల్లాడి పోయారు. ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు విద్యా శాఖ అధికారులకు, అలాగే, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బీర్కూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి అంబులెన్సులతో పాటు రెండు ప్రైవేటు వాహనాల్లో 70 మందిని చిన్నారులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందుగానే బాన్సువాడ ఆస్పత్రికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడా పడకలు అందుబాటులో ఉంచారు. చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు కుళ్లిన గుడ్లు..! మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. ఉడికించిన గుడ్డు కుళ్లిపోయిన వాసన వచ్చినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్రావు వంటశాలను, సామగ్రిని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ తెలిపారు. అయితే, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు: స్పీకర్ బాన్సువాడ టౌన్: విద్యార్థుల అస్వస్థతకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించారు. ఒక్కో విద్యార్థితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం అనంతరం గుడ్డు తినడంతోనే కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయని చిన్నారులు వివరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గుడ్డు తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బుధవవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం బలహీనంగా ఉండి, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది మొదట్లో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. చదవండి: Lakhimpur Kheri Incident: ఆ కేంద్ర మంత్రిపై వేటు వేయకపోతే అంతే సంగతా? జరిగేది అదేనా? -
అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క
-
అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, ములుగు: దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అక్కడ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని తహసీల్దార్‌కు మెమోరండం ఇచ్చిన అనంతరం అస్వస్థకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
67కు పెరిగిన విషాహార బాధితులు
నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం బండ్లపై గ్రామంలో శుక్రవారం రాత్రి విషాహారం తిని అనారోగ్యం బారినపడ్డ వారి సంఖ్య 67కి చేరుకుంది. ప్రతి మూడేళ్లకోసారి బండ్లపై హరిజనవాడ, దుర్గంవారిపల్లె, బండ్లపై కాలనీ, పారాశివారిపల్లె గ్రామస్తులు ఏకమై గంగజాతర నిర్వహిస్తారు. అందులో భాగంగా బండ్లపై గ్రామ ప్రజలు గురువారం రాత్రి అమ్మవారిని ఊరేగించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులు, స్థానికులు సామూహిక భోజనాలు చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత భోజనం చేసినవారు రాత్రి 10 గంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని 108లో నిమ్మనపల్లె, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సింగిల్ విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. అంతమంది ఆస్పత్రిలో చేరినా శుక్రవారం రాత్రి విధులకు హాజరుకాకపోవడంతో మెడికల్ ఆఫీసర్ జులేఖబేగంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విష ఆహారం ఘటనపై మదనపల్లె డివిజన్ ఆహార కల్తీ నియంత్రణాధికారి రాముడు విచారణ చేపట్టారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
సుకుమార్‌కు అస్వస్థత.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్‌కు వారామం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కోలుకున్న వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ఈ ఏడాదిలో పుష్ప మొదటి పార్ట్‌ను రిలీజ్ చేసి రెండో భాగం ఆరు నెలలు గ్యాప్ విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇందులో బన్నీబన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
చిట్టి తల్లికి పెద్ద కష్టం.. 5 నెలల పాపకు లివర్ ఇన్ఫెక్షన్
సాక్షి, కామారెడ్డి: పిల్లలు పుట్టారన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎక్కువ కాలం లేకుండా పోయింది. తొలి సొంతానంగా పుట్టిన కొడుకును వింత వ్యాధి పీడిస్తోంది. తర్వాత జన్మించిన కూతుర్ని అనారోగ్యం వేధిస్తోంది. తల్లి ఒడిలో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడింది. అమ్మ పాలు తాగుతూ ఆడుకోవాల్సిన చిన్న వయస్సులోనే లివర్ ఇన్ఫెక్షన్ సోకింది. గతంలో రూ.7 లక్షలు అప్పు చేసి పాపకు ఆపరేషన్ చేయించారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కాలేయ మార్పిడి కోసం రూ.25 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివలింగు సౌజన్య, నవీన్‌కు 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం కూతురు నిక్షిత పుట్టింది. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్న పాప తర్వాత అనారోగ్యం బారిన పడింది. దీంతో వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూయించారు. ఫలితం లేకపోవడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు లివర్ ఇన్ఫెక్షన్ ఉందని పిత్తాశయం ట్యూబ్ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో రూ.7లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. నెల రోజులు బాగానే ఉన్నా తీవ్ర జ్వరం రావడంతో మళ్లీ హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పాపకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని సూచించారు. పాప ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆపరేషన్‌కు రూ.25లక్షలకు వరకు ఖర్చవుతుందని తెలపడంతో దంపతులు ప్రస్తుతం విలవిలలాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌజన్య టీటీసీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పని చేసి బాబు పుట్టగానే ఇంటి పట్టునే ఉంటుంది. నవీన్ బీఈడీ చేసి ఉద్యోగం రాకపోవడంతో ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేదరికంలో ఉన్న తాము ఇప్పటికే అప్పులు చేసి చిన్నారికి ఆపరేషన్ చేయించామని.. ప్రస్తుతం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించడానికి దాతలు చేయూత అందించాలని కోరుతున్నారు. పాపకు లివర్ మారి్పడి కోసం తండ్రి నవీన్‌ను అన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం నవీన్ లివర్‌ను తన పాపకు మారి్పడి చేయడానికి ఆపరేషన్ అవసరం. మంచానికే పరిమితమైన కొడుకు ఐదేళ్ల క్రితం వీరికి జన్మించిన కొడుకు విలోహిత్ సైతం అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. బాబు పుట్టిన కొద్ది రోజులకే కదలిక, ఏడుపు లేకపోవడంతో చాలా ఆ్రస్పతులు చూపెట్టి లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. డౌన్ సిండ్రోమ్ వ్యాధి సోకడంతో రూ.ఐదు లక్షలకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆ బాబు మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిని తప్పా ఎవ్వరిని గుర్తుపట్టలేడు. ఫోన్ పే నంబర్: 9848793242 (సౌజన్య చెల్లి సంధ్యారాణి) బ్యాంక్ అకౌంట్ వివరాలు: శివలింగు సౌజన్య (పాప తల్లి) అకౌంట్ నంబర్: 49630100005080 ఐఎఫ్ఎస్సీ కోడ్: BARBOKAMARE ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు బోనకల్: ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సుగంధం మల్లికార్జునరావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను ఇంటర్ వరకు చదివించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పైచదువులకు వెళ్లలేదు. పెద్ద కుమారుడు వెంకటేష్ ఖమ్మంలోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కుటుంబానికి ఆపద వచ్చి పడింది. తీవ్ర జ్వరంతో వెంకటేష్ బాధ పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు కిడ్నీలు పని చేయడం లేదని, అవి ఉండాల్సిన దాని కంటే చిన్నవిగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వెంకటేష్ తల్లిదండ్రులు 6 నెలలుగా అనేక ఆస్పత్రులల్లో రూ.2 లక్షలు వరకు ఖర్చు చేశారు. మూడు రోజులకోసారి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వలేక రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు అందినకాడికి అప్పులు చేసి వైద్యం చేయించారు. ప్రస్తుతం వెంకటేష్ మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హస్తంకోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు 70322 13517 నంబర్‌ను సంప్రదించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. -
ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత
పాట్నా: దైవ ప్రసాదం తిని 170 మంది అస్వస్థతకు గురైన ఘటన బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా కోత్వన్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేశ్ కోడా అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఈ వ్రతానికి దాదాపు 250 మందిని ఆహ్వానించాడు. పూజాది కార్యక్రమాల అనంతరం అతిధులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్తుల్లో చాలా మంది కడుపునొప్పి, తలతిరగడం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడ్డారు. ఒక్కసారిగా ఇంత మందిలో లక్షణాలు బయటపడటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, మూడు అంబులెన్స్‌లను ఆ గ్రామానికి పంపింది. ప్రాధమిక చికిత్స అనంతరం బాధితుల్లో చాలా మంది కోలుకున్నట్లు జిల్లా కలెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మరో 80 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. అయితే, ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని ప్రకటించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాదమే అనారోగ్యానికి కారణంగా పేర్కొన్న అధికారులు ప్రసాదం శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం లేబోరేటరీకి పంపారు. -
హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారా? మీకీ విషయాలు తెలుసా?
Knowledge About Health Insurance: ఆర్థిక అంశాల విషయంలో కరోనా ఓ మేల్కొలుపు. జీవిత బీమా, ఆరోగ్య బీమాను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్న అవగాహన చాలా మందికి వచ్చింది. కష్టకాలంలో వాటి వల్ల కలిగే ప్రయోజనం తెలిసొచ్చింది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి. కరోనా కారణంగా ఆస్పత్రిలో తమకు అయిన వ్యయాల్లో హెల్త్ పాలసీ నుంచి వచ్చింది కొద్ది మొత్తమేనంటూ ఇటీవలే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది ఏకరువు పెట్టారు. ఆస్పత్రిలో చేరితే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థే భరిస్తుందని సాధారణంగా ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ, బీమా సంస్థ ఎంత మేరకు చెల్లిస్తుందన్నది పాలసీ నియమ, నిబంధనలు, షరతులు, మినహాయింపులపై ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. కోపేమెంట్, సబ్ లిమిట్స్, వెయిటింగ్ పీరియడ్ ఇలా ఎన్నో నిబంధనలను బీమా సంస్థలు అమలు చేస్తుంటాయి. ఆస్పత్రిలో వినియోగించే కొన్ని రకాల ఉత్పత్తులకు, సేవలకు చార్జీలను చెల్లించబోమంటూ పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొంటాయి కూడా. బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి అమలు చేసే నిబంధనలపై అవగాహన, స్పష్టతలేని కారణంగా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయంటూ బీమా అంబుడ్స్‌మెన్ 2019–20 వార్షిక నివేదిక సైతం స్పష్టం చేసింది. ఆస్పత్రి బిల్లును కంపెనీలు ఎందుకు పూర్తిగా చెల్లించవు? కొన్ని సందర్భాల్లో ఎందుకు అసలు క్లెయిమ్‌లను పూర్తిగా తిరస్కరిస్తాయి..? వీటి గురించి పాలసీదారులకు అవగాహన ఉండడం ఎంతో అవసరం. ఈ విషయాలపై సమాచారంతో కూడిన ‘ప్రాఫిట్‌ప్లస్ కథనమే’ ఇది.. ప్రాంతం సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆస్పత్రుల్లో ఉన్నన్ని రోజులకు వ్యయాలను చెల్లిస్తుంటాయి. ఇందులో కొన్ని నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు ఆస్పత్రి బిల్లులను పూర్తిగా చెల్లించకపోవడానికి అవకాశాలుంటాయి. పాలసీ కొనుగోలు చేసిన ప్రాంతం, చికిత్స తీసుకున్న ప్రాంతం(లొకేషన్) ప్రధాన పాత్ర పోషిస్తాయి. హైదరాబాద్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వంటి ప్రథమ శ్రేణి పట్టణాల్లో వైద్య చార్జీలు అధికంగా ఉంటాయి. చిన్న పట్టణాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ చార్జీలు కాస్త అధికంగా ఉంటాయి. కనుక పాలసీదారుల క్లెయిమ్‌లలో లొకేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని హైదరాబాద్‌లో కొనుగోలు చేసి, ముంబైలో చికిత్స తీసుకుంటే క్లెయిమ్ మొత్తం రాదు. పాలసీదారు తన వంతుగా కొంత భరించాల్సి వస్తుంది. లొకేషన్ మారితే కోపే షరతును బీమా కంపెనీలు అమలు చేస్తాయి. మరింత వివరంగా చూస్తే.. మ్యాక్స్‌బూపా గోయాక్టివ్ హెల్త్ పాలసీలో జోన్ 1 కింద (ముంబై, ఢిల్లీ) ప్రీమియం చెల్లిస్తే కనుక దేశవ్యాప్తంగా ఎక్కడ చికిత్స తీసుకున్నా కానీ కోపే అమలు కాదు. ఇదే పాలసీలో జోన్–2 కింద (బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే) పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే వారు.. జోన్–1 పరిధిలోని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే కనుక 20 శాతం కోపే నిబంధన అమలవుతుంది. అంటే వాస్తవ బిల్లులో 20 శాతాన్ని పాలసీదారు తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. పాలసీ తీసుకున్న జోన్, లేదా అంతకంటే దిగువ జోన్‌లోని ఆస్పత్రుల్లో కనుక చికిత్స పొందితే ఎటువంటి కోపే ఆప్షన్ అమలు కాదు. ఒకవేళ రూ.10లక్షల హెల్త్ కవరేజీని హైదరాబాద్ నివాసి తీసుకుని, ముంబైలో చికిత్స తీసుకుంటే అయిన వ్యయంలో బీమా సంస్థ 80 శాతమే చెల్లిస్తుందని గుర్తుంచుకోవాలి. అన్ని బీమా సంస్థల్లోనూ ఇదే మాదిరిగా ఉండాలని లేదు. కోపే శాతం బీమా సంస్థల మధ్య వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే ఏ సమయంలో ఎక్కడ చికిత్స తీసుకోవాల్సి వస్తుందోనన్న స్పష్టత లేనివారు కొనుగోలు సమయంలోనే జోన్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఎక్కువ కంపెనీలు అనుమతించడం లేదు. కొన్ని బీమా కంపెనీలు జోన్ వారీగా కోపేను అమలు చేయడం లేదు. కాకపోతే ఇటువంటి పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. రూమ్ రెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ముఖ్యంగా రూమ్‌రెంట్ పరిమితులు ఉన్నాయేమో చూడాలి. ఆస్పత్రిలో గది చార్జీలతో ముడిపెట్టి కొన్ని పాలసీలు మొత్తం మీద వ్యయాలు చెల్లిస్తుంటాయి. పాలసీలో రూమ్‌రెంట్ పరిమితి ఉంటే.. ఆ పరిమితికి మించి చార్జీతో కూడిన గదిలో రోగి చికిత్స తీసుకున్నట్టయితే.. అప్పుడు ఆ మేరకు మొత్తం బిల్లులో కోత పెడుతుంటాయి. దీంతో పాలసీదారుకు ఆస్పత్రిలో అయిన వాస్తవ వ్యయం మేరకు చెల్లింపులు రావు. రూ.5లక్షల పాలసీలో రూమ్రెంట్ను 1 శాతానికి పరిమితం చేస్తే.. అప్పుడు పాలసీదారు పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ రూపంలో పొందాలంటే రూ.5,000కు మించని గదిలోనే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు శ్రీను (30) రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడనుకుందాం. ఇందులో రూమ్ రెంట్ 1 శాతానికి పరిమితి విధించి ఉంటే అప్పుడు రోజువారీ రూ.10,000 వరకు క్లెయిమ్‌కు అర్హత ఉన్నట్టు. ఒకవేళ శ్రీను రూ.12,000 అద్దె ఉన్న గదిలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే అప్పుడు బీమా సంస్థ నుంచి రూ.10,000 వరకే పొందగలడు. మిగిలిన రూ.2,000ను రోజువారీగా అతడే చెల్లించుకోవాలి. అయితే ఇది రూమ్‌రెంట్ వరకే పరిమితం అనుకోవద్దు. ఆస్పత్రిలో చికిత్సకు మొత్తం మీద రూ.9లక్షల బిల్లు వచ్చిందనుకుంటే అప్పుడు బీమా సంస్థ రూ.9లక్షలనూ చెల్లించదు. రూమ్ రెంట్ వాస్తవ పరిమితి కంటే 20 శాతం అధిక చార్జీ ఉన్న దానిలో చేరి చికిత్స తీసుకున్నందున.. 20 శాతం మేర తగ్గించి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీదారు ఈ మేరకు తన పాకెట్ నుంచి చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే, రూమ్‌రెంట్ పరిమితుల్లేకుండా చాలా ప్లాన్లు నేడు అందుబాటులో ఉన్నాయి. టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్, ఐసీఐసీఐ లాంబార్డ్ కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బూపా రీఅష్యూర్, హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా రీస్టోర్ పాలసీల్లో రూమ్‌రెంట్‌పై పరిమితుల్లేవు. కానీ, రూమ్రెంట్కు సంబంధించి వాస్తవ నిబంధనను తెలుసుకోవాలంటే కచ్చితంగా పాలసీ నియమ, నిబంధనలు (వర్డింగ్స్) చూడాల్సిందే. ఎందుకంటే చాలా ప్లాన్లలో రూ.3లక్షల కవరేజీతో తీసుకుంటే రూమ్‌రెంట్‌పై కంపెనీలు పరిమితి విధిస్తున్నాయి. అదే ప్లాన్లను రూ.5లక్షలు అంతకుమించి తీసుకుంటే పరిమితులు విధించడం లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో.. ప్లాటినమ్ ప్రీమియర్ వేరియంట్లో రూమ్‌రెంట్‌పై పరిమితి లేదు. కానీ ఇదే ప్లాన్‌లో బేసిక్ వేరియంట్లపై రూ.3లక్షల కవరేజీ వరకు పరిమితులున్నాయి. షేర్డ్ రూమ్ లేదా సింగిల్ ప్రైవేటు రూమ్ (ఏసీసహా) పరిమితులను కంపెనీలు అమలు చేస్తున్నాయి. సింగిల్ ప్రైవేటు రూమ్ పరిమితితో కూడిన ప్లాన్ తీసుకుంటే సింగిల్ ఏసీ రూమ్ లేదా షేర్డ్ రూమ్‌ల్లో చికిత్స తీసుకోవడానికే పరిమితం కావాలి. డీలక్స్, సూట్లలో చేరితో పరిమితికి మించిన వాటిల్లో చేరడం వల్ల నిర్ణీత శాతం మేర క్లెయిమ్‌ను నష్టపోవాల్సి వస్తుంది. సింగిల్ రూమ్ నిబంధనతో పాలసీ తీసుకుని షేర్డ్రూమ్లో చేరితే క్లెయిమ్‌లో ఏమాత్రం నష్టపోవాల్సిన అవసరం ఉండదు. ఈ నింబంధనలను అడ్డుపెట్టుకుని బీమా సంస్థలు క్లెయిమ్‌ల్లో భారీ కోతలు పెడుతుండడం బీమారంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) దృష్టికి వచ్చింది. దీంతో ఫార్మసీ, కన్జ్యూమబుల్స్, ఇంప్లాంట్లు, మెడికల్ డివైజ్‌లు, డయాగ్నోస్టిక్స్ చార్జీలను రూమ్రెంట్తో ముడిపెట్టడానికి లేదని నిబంధనలు తీసుకొచ్చింది. ఐసీయూకు సైతం ఈ నిబంధన అమలు చేయరాదని ఆదేశించింది. వయసు కొన్ని పాలసీలు వయసు ప్రకారం క్లెయిమ్‌లకు పరిమితులు విధిస్తున్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి కోపే ఆప్షన్‌ను అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు కేర్ హెల్త్ ప్లాన్ అయితే 61 ఏళ్లు అంతకుమించినట్టయితే 20 శాతం కోపే నిబంధన అమలు చేస్తోంది. అయితే, అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కోపే ఆప్షన్‌ను తొలగించుకునే అవకాశం ఉంది. కొన్ని ప్లాన్లు 60 ఏళ్లు దాటిన తర్వాత పాలసీ తీసుకుంటే విధిగా కోపే ఆప్షన్‌ను అమలు చేస్తున్నాయి. అందుకనే ఈ తరహా నిబంధన తీసుకుంటున్న ప్లాన్‌లో ఉన్నదీ, లేనిదీ నిర్ధారించుకోవాలి. ఇతర పరిమితులు... కొన్ని రకాల చికిత్సలకు సంబంధించి ఉప పరిమితులను అమలు చేసే పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. మెటర్నిటీ, అంబులెన్స్, ఓపీడీ కవరేజీ, కంటి శస్త్రచికిత్సలు, దంత చికిత్సలు, ఇంటి వద్దే చికిత్స, మానసిక సమస్యలకు చికిత్స తదితర వాటికి ఉప పరిమితులను కంపెనీలు అమలు చేస్తున్నాయి. డోమిసిలరీ హాస్పిటలైజేషన్ కింద ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకునే సదుపాయాన్ని చాలా పాలసీల్లో భాగంగా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అంటే పాలసీదారును ఇంటి నుంచి ఆస్పత్రికి మార్చే పరిస్థితి లేకపోయినా లేదా ఆస్పత్రిలో పడక అందుబాటులో లేకపోయిన సందర్భాల్లోనే ఈ ఫీచర్ కింద చికిత్స తీసుకుని క్లెయిమ్ పొందొచ్చు. కొన్ని ప్లాన్లు గరిష్ట బీమా కవరేజీ వరకు డోమిసిలరీ హాస్పిటలైజేషన్ క్లెయిమ్‌కు అనుమతిస్తున్నాయి. కొన్ని మాత్రం బీమా కవరేజీలో 10–20 శాతం అంటూ పరిమితులు విధిస్తున్నాయి. అలాగే, కనీసం మూడు రోజుల పాటు ఇంటి నుంచి చికిత్స తీసుకుంటేనే క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత అంటూ నిబంధన విధిస్తున్నాయి. కరోనాతో ఆస్పత్రిలో కాకుండా ఇంటి నుంచి చికిత్స తీసుకునే వారికి ఈ సదుపాయం అక్కరకు వస్తుంది. ఇక అవుట్‌పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు ఓపీడీ కవరేజీ అనుకూలంగా ఉంటుంది. కానీ, కొన్ని ప్లాన్లు ఓపీడీ కవరేజీకి పరిమితులు పెడుతున్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్లాన్‌లో రూ.15లక్షలు అంతకుమించిన సమ్ ఇన్సూర్డ్ తీసుకున్న వారికే ఓపీడీ కవరేజీ లభిస్తుంది. అది కూడా ఒక ఏడాదికి రూ1,000 వరకే. ఓపీడీ ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. వైద్యుల కన్సల్టేషన్ ఫీజు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఫిజియోథెరపీ, ఔషధాలకు భారీగానే వ్యయమవుతోంది. కానీ, హెల్త్ పాలసీల్లో ఓపీడీ కింద వాస్తవానికి అయిన ఖర్చులన్నీ రాబట్టుకోవడం అసాధ్యం. టెలీమెడిసిన్‌ను కూడా ఓపీడీ భాగంగా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అంబులెన్స్ చార్జీలు, హాస్పిటల్ క్యాష్ (రోజువారీ నగదు చెల్లింపు) విషయంలోనూ పరిమితులున్నాయి. కనుక వీటి కోసం భారీ ప్రీమియం చెల్లించకుండా ఈ తరహా అసమగ్ర కవరేజీలను తీసుకోకుండా ఉండడమే మంచిది. ఈ సందర్భాల్లో క్లెయిమ్ పూర్తిగా రాదు.. జీవించి ఉండడం.. క్రిటికల్ ఇల్నెస్, టర్మినల్ ఇల్నెస్ కవరేజీలకు పాలసీదారు నిర్ణీత కాలం పాటు జీవించి ఉండాలన్న నిబంధన అమలవుతోంది. అంటే తీవ్ర వ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధి బయటపడిన తర్వాత నిర్ణీత రోజుల పాటు జీవించి ఉంటేనే క్లెయిమ్‌కు అర్హత లభిస్తుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అన్నది పాలసీలను బట్టి 7 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటోంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలన్నవి ఎక్కువ శాతం బెనిఫిట్ రూపంలో వస్తున్నాయి. అంటే సంబంధిత వ్యాధుల్లో ఏదేనీ నిర్ధారణ అయితే పూర్తి బీమా మొత్తాన్ని ఒకేసారి బీమా సంస్థ చెల్లించేస్తుంది. ఈ తరహా ప్రయోజనం చెల్లింపునకు కనీసం 30 రోజుల పాటు జీవించి ఉండాలని ఎ క్కువ కంపెనీలు నిబంధన అమలు చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో నిర్దేశిత తీవ్ర వ్యాధులకే కవరేజీ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో జాబితాను అమలు చేస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ ఉన్న ఏ ప్లాన్ అయినా అన్నింటికీ కవరేజీనిస్తుందని భావించొద్దు. సాధారణంగా 20 నుంచి 65 వరకు తీవ్ర వ్యాధులతో ఈ జాబితాలు ఉంటున్నాయి. జాబితాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం బీమా సంస్థలు ప్రధాన వ్యాధులకు కవరేజీనిస్తున్నాయి. అయితే ఈ జాబితాలోని వ్యాధుల్లో కొన్నింటికి తీవ్ర దశల్లోనే కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు కేన్సర్ విషయానికొస్తే మొదటిసారే కవరేజీనిస్తాయి. చికిత్సతో తగ్గి మళ్లీ తర్వాత తిరిగి విస్తరించినట్టయితే కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అప్పుడు పాలసీదారులే సొంతంగా వ్యయాలను భరించాల్సి ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ పాలసీ తీసుకున్న వెంటనే అన్నింటికీ కవరేజీ వచ్చేసినట్టుగా పొరపడొద్దు. ఎందుకంటే మూడు రకాల వెయిటేజీ పీరియడ్ (నిర్ణీత కాలం తర్వాతే కవరేజీ అమల్లోకి రావడం)లను కంపెనీలు అమలు చేస్తున్నాయి. ముందుగా మొదటి 30 రోజుల్లో ఎటువంటి క్లెయిమ్‌లకు అవకాశం ఉండదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్) కవరేజీ కోసం రెండు నుంచి నాలుగేళ్ల పాటు వేచిన తర్వాతే అవకాశం ఉంటుంది. అదే విధంగా కొన్ని రకాల సమస్యలకు ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు వెయిటింగ్పీరియడ్ ఉంటుంది. కరోనా కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలకు 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంది. మేటర్నిటీ కవరేజీ 2–4 ఏళ్ల తర్వాతే యాక్టివ్ అవుతుంది. అదే క్రిటికల్ ఇల్నెస్ కవరేజీకి 90–180 రోజుల వరకు వేచి చూడాల్సి రావచ్చు. -
అరగంట వ్యవధిలో తండ్రీకొడుకు మృతి..
సాక్షి, తూప్రాన్: అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతున్న తండ్రి, కుమారుడు అరగంట వ్యవధిలో మృతిచెందిన సంఘటన తూప్రాన్ మున్సిసల్ పరిధిలోని పడాల్‌పల్లి గ్రాంమలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పడాల్‌పల్లి గ్రామాలనికి చెందిన కాసుకుంట యాదగిరి(60) గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటూ చిక్సిత్స పొందుతన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందాడు. తన కుమారుడు కృష్ణ(37) కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో భాదపడుతున్నాడు. తూప్రాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మృతిచెందిన విషయం ఆప్పటికి కుమారునికి తెలియదు. అరగంట వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: శ్మశానాల్లో దుస్తులు దొంగిలించి.. మార్కెట్లో అమ్మకం.. -
విషాదం: విధి నిర్వహణలో.. కూర్చున్న కుర్చీలోనే..
జగ్గంపేట: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్న పాణింగపల్లి జయశంకర్ విధి నిర్వహణలో మృతి చెందారు. మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఉన్నట్టుండి మధ్యాహ్నం కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయి మృతి చెందారు. ఆయన మృతదేహానికి వైద్య సిబ్బంది పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ... అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. -
ఆదోనిలో ప్రబలిన అతిసారం
ఆదోని/అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అరుంజ్యోతినగర్‌లో బుధవారం అతిసారం ప్రబలింది. 50 మందికిపైగా అస్వస్థతకు గురికాగా.. ఒక మహిళ రంగమ్మ (50) మృతి చెందింది. బాధితుల్లో 20 మంది పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరికి స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యం చేస్తుండగా మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బాధితుల్లో పదేళ్లలోపు వయసు కలిగినవారు 8 మంది ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆర్డీఓతో పాటు మునిసిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రంగనాయక్, తహసీల్దారు రామకృష్ణ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించినట్లు ఆస్పత్రి చీఫ్ డాక్టర్ లింగన్న వారికి తెలిపారు. అనంతరం ఆర్డీవో తదితరులు అరుంజ్యోతినగర్‌లో పర్యటించి.. ఓవర్ హెడ్ ట్యాంకులు, మురుగుకాలువలను శుభ్రం చేయించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. తాగునీరు కలుషితం అవడంవల్లే అతిసారం ప్రబలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆర్డీవో చెప్పారు. మంగళవారం ఇక్కడ దేవర జరిగిందని, ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గోరుకల్లులో మరొకరు మృతి పాణ్యం: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో అతిసారవ్యాధికి మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మంగళవారం గ్రామానికి చెందిన ఉప్పరి ఎరబోయిన ఉసేని (65), సుంకరి ఎల్ల కృష్ణ (35) చనిపోగా.. బుధవారం తమ్మడపల్లె మద్దమ్మ (75) నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామంలో బుధవారం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. -
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం
చెన్నై : తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా కమెడియన్ తేపట్టి గణేశన్(కార్తీ) మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన సోమవారం..మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిల్లా-2, ఉస్తాద్ హోటల్, నీరపరై, కన్నే కలైమనే వంటి చిత్రాల్లో నటించిన గణేశన్‌కు గత కొంతకాలంగా అవకాశాలు రాలేదు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. అయితే కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో తన పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని గణేషన్...సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే పేదరికం, సినిమాలు అవకాశాలు లేక గత కొంతకాలం నుంచి గణేషన్..డిప్రెషన్లో ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో ఆరోగ్యం దెబ్బతిని మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, గుండెపోటు కారణంగా తుదిశ్వాస వదిలాడు. గణేశన్ మృతిపై పలువురు తమిళ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా చిన్నవయసులోనే గణేశన్ మృతిచెందడం తమిళ ఇండస్ట్రీకి తీరనిలోటు అని దర్శకుడు శ్రీను రామస్వామి ట్వీట్ చేశారు. ఈ వార్త వినగానే చాలా షాకయ్యానని, తన సినిమాల్లో నటించిన ఉత్తమ నటుల్లో గణేషన్ కూడా ఒకరని రామస్వామి అన్నారు. ఇక గణేషన్ చివరిసారిగా 2019లో రామసామి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నే కలైమనే చిత్రంలో నటించారు. చదవండి : ఆస్పత్రిలో సీనియర్ నటుడు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కన్నుమూత -
తండ్రికి అనారోగ్యం.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య!
వాంకిడి: తండ్రి అనారోగ్యంపై మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఇటన్కార్ వినోద్ (40) తండ్రి మారుతి రెండేళ్ల క్రితం పక్షవాతం బారిన పడి అనారోగ్యానికి గురి అయ్యాడు. అప్పటి నుంచి వినోద్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తూ వచ్చాడు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతూ వచ్చాయే కాని మారుతి ఆరోగ్యం కుదుటపడలేదు. దీనికి తోడు ఈ ఏడాది ఆశించినంతగా పంట దిగుబడి రాలేదు. కాగా, పత్తి అమ్మిన డబ్బులు సైతం తండ్రి చికిత్సకు ఖర్చయిపోయాయి. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన వినోద్ తన పత్తి చేనులోనే పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి నాగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వినోద్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. చదవండి: బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య -
బిర్యానీ తిన్న పదిమందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : ఆనంద్‌బాగ్‌లోని ఓ మండిలో బిర్యాని తిన్న ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాణక్యపురి కాలనీకి చెందిన ఓ కుటుంబం గత నెల 31 వ తేదీ మధ్యాహ్నం ఆనంద్‌బాగ్‌లోని మండిలో చికెన్ బిర్యానీ తిని ఇంట్లో ఉన్న వారికి తీసుకు వచ్చారు. రాత్రి మిగిలిన వారు కూడా తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, జ్వరం, విరేచనాలు కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పై కుటుంబసభ్యుల్లో ఒకరైన రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సంఘటనకు బాధ్యులైన హోటల్ నిర్వాహకులపై జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. -
టీకా వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి
యశవంతపుర: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి చెందిన ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో జరిగింది. 33 ఏళ్ల ఆశా కార్యకర్త జనవరి 22న కరోనా టీకా వేయించుకుంది. 30వ తేదీన ఆమెకు ఎక్కువగా వాంతులయ్యాయి. దీంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 3న ఆమె మృతి చెందారు. మెదడులో రక్తం గడ్డ కట్టడమే మరణానికి కారణమని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె తలనొప్పితో బాధపడుతూ తరచూ మందులను వాడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని వైద్యులు తెలిపారు. కలబురిగిలో ఆరుమంది ఆస్పత్రిపాలు .. కలబురిగిలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరుమంది వైద్యారోగ్య సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో రాత్రి 7 గంటలకు ఆరుమందినీ కలబురిగి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ సమస్య లేదని వైద్యులు తెలిపారు. -
ఫుడ్ పాయిజన్: జూనియర్ డాక్టర్లకు అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్‌లో పుడ్ పాయిజన్ కారణంగా జూనియర్ డాక్టర్లు అస్వస్థతకు గురయ్యారు. ఇరవై మూడు మందికి పుడ్ పాయిజన్‌తో వాంతులు, విరోచానాలు కావడంతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో నాసిరకం బోజనం తిని అస్వస్థత గురయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మెడికోలకు ప్రమాదం లేదని డాక్టర్ చెబుతున్నారు.. జూనియర్ వైద్యులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మెడికోలు చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ డెవిడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుడ్ పాయిజన్ కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థులు తిన్న ఆహారాన్ని ల్యాబ్ పంపించామని అన్నారు. నాణ్యత లోపాలు ఉంటే హస్టల్ నిర్వహకుల పై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. -
కరోనా వ్యాక్సిన్: స్టాఫ్ నర్సుకు తీవ్ర అస్వస్థత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)/అంబాజీపేట: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న స్టాఫ్ నర్సు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మచిలీపట్నం ఆంధ్రా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న పద్మజ శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో అదే ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఫిట్స్‌లా వచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయింది. శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఏర్పడింది. తీవ్ర అస్వస్థత పాలైన ఆమెను వెంటనే అదే ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని ఆరా.. కరోనా వ్యాక్సిన్‌తో అస్వస్థతకు గురైన స్టాప్ నర్సు, జి.కొండూరు అంగన్వాడీ వర్కర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆరా తీశారు. స్టాఫ్ నర్సు పద్మజ ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఎంవో డాక్టర్ సహాసినిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డీఎంహెచ్‌ఎంవో తెలిపారు. అంగన్వాడీ ఆయాకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారానికి ల్యాబ్ టెక్నీషియన్ మృతి ఇదిలా ఉండగా, వ్యాక్సిన్ తీసుకున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ వారం తరువాత మరణించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అంబాజీపేట మండలంలోని మాచవరం అగ్రహారం శివారు అంబేడ్కర్ నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సరెళ్ల శ్రీనివాస్(45) ఈ నెల 22న అమలాపురం ఏరియా ఆస్పత్రిలో కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఉన్నట్టుండీ శుక్రవారం అతను కన్నుమూశాడు. వ్యాక్సిన్ వికటించడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 24వ తేదీ నుంచి జ్వరంతోపాటు ఒంటిపై దద్దుర్లు వచ్చాయని చెప్పారు. దీనిపై అమలాపురం అడిషనల్ డీఎంహెచ్‌వో పుష్కరరావు, వైద్యాధికారి డీవీ సత్యంలు మృతుడి ఇంటికెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వ్యాక్సిన్ వల్ల చనిపోయాడా లేదా అనే విషయం తెలుస్తుందని వారు చెప్పారు. -
హమ్మయ్యా... ఆలియా!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆస్పత్రిలో చేరారనే వార్త ఆమె అభిమానులను కలవరపెట్టింది. అస్వస్థతకు గురైన ఆమె ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ‘హమ్మయ్యా..!’ అనుకున్నారు ఫ్యాన్స్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంలో నటిస్తున్నారు ఆలియా భట్. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్న ఆలియా హైపర్ అసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో వెంటనే ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన ఆలియా తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్నారట. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్‌కి జోడీగా ఆమె కనిపించనున్నారు. -
భారత మాజీ క్రికెటర్ చంద్రశేఖర్‌కు అస్వస్థత
సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్‌గా నిర్ధారించి చికిత్స చేశారు. మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్‌కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్‌సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది. -
నార్వేలో ‘టీకా’ విషాదం
ఓస్లో: కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. వీరితోపాటు అస్వస్థతకు గురైన 16 మందిలో 9 మంది టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన బాధతో ఇబ్బంది పడ్డారని, వీరికి అలెర్జీ లక్షణాలు, తీవ్ర జ్వరం కనిపించాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనతో టీకా భద్రతపై ఉన్న అనుమానాలు మరింత బలపడ్డట్టయిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, 80 ఏళ్లు పైబడి, వయో భారంతో బలహీనంగా ఉండటంతో వ్యాక్సిన్‌తో సాధారణంగా తలెత్తే దుష్పరిణామాలు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్లు పరీక్షల్లో తేలిందని ప్రభుత్వం తెలిపింది. మరణించిన 23 మందికిగాను 13 మందిలో వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ లక్షణాలే కనిపించాయంది. కోవిడ్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, వృద్ధులకు డిసెంబర్ నుంచి ఫైజర్–బయోఎన్‌టెక్ తయారీ టీకాను నార్వే ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటి వరకు 33 వేల మందికి మొదటి డోసుగా ఈ వ్యాక్సిన్ వేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో కోవిడ్ టీకా ఎవరికి ఇవ్వాలనే విషయంలో వైద్యులు మరింత జాగ్రత్తగా పరిశీలన జరపాలని, 80 ఏళ్లు పైబడిన వారి మిగిలిన జీవిత కాలం చాలా స్వల్పంగా ఉండటంతో, వారికి టీకా ఇవ్వడం ద్వారా పెద్దగా లాభమేమీ కూడా ఉండదని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసినట్లు ‘బ్లూమ్‌బర్గ్’తెలిపింది. యువజనులు, ఆరోగ్యంతో ఉన్న వారికి మాత్రం వ్యాక్సినేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో నార్వే ప్రభుత్వానికి సహకరిస్తామని సదరు టీకా తయారీ సంస్థ ఫైజర్ తెలిపింది. -
బాధితులను పరామర్శించిన ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థతకు గురై.. చికిత్స అనంతరం కొలుకున్న బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం పరామర్శించారు. ఏలూరు టూటౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని తెలిపారు. ఈ ఘటనకు కారణాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. (చదవండి: ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు) ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఉదయం నుండి రెండు అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 614 కేసులు నమోదయ్యాయి. 576 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. 35 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: టీడీపీ సెల్ఫ్‌గోల్: చీప్ ట్రిక్స్‌తో పోరాటం) -
ఏలూరు:ఈ రోజు ఒక్క కేసు కూడా లేదు
సాక్షి,పశ్చిమగోదావరి: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇక ఇప్పటి వరకు 612 మంది అనారోగ్యం పాలవ్వగా 569 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ఆస్పత్రిలో ఏడుగురు బాధితులు.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రత్యేక వార్డుల్లోని బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం) -
ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం
సాక్షి, ఏలూరు: అంతుబట్టని అనారోగ్యం బారి నుంచి ఏలూరు కోలుకున్నా వ్యాధి నిర్ధారణ ఇంకా చిక్కుముడిగానే ఉంది. దీనిపై కేంద్ర బృందాలు ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మరోవైపు ఆరో రోజు గురువారం ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 14కి పరిమితమైంది. నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నా నిర్థారణ పరీక్షల ఫలితాల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరులో బాధితులను పరామర్శించి అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్ర బృందాలతో కూడా చర్చించారు. బాధితుల్లో 24 గంటల అనంతరం సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల బృందం తెలిపింది. ఐఐసీటీ నిపుణులు కూడా వివిధ రకాల శాంపిళ్లు సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో) ప్రతినిధి బృందం ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేస్తూ నమూనాలు సేకరించింది. ఒకటి రెండు రోజుల్లో కచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిపుణుల బృందాలు చెబుతున్నాయి. ఏలూరులో తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, కలుషితం కాలేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, విమ్టా ల్యాబ్ నివేదికలో వెల్లడైంది. హాని కలిగించే స్థాయిలో లేదు.. ఇప్పటివరకు 604 మంది బాధితులు ఏలూరు ఆస్పత్రిలో చేరగా 536 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మందిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇద్దరు వింత వ్యాధితో చనిపోయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఖండించారు. ఏలూరు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే తాగునీటి విషయంలో పూర్తి స్పష్టత వచ్చిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తాగునీటిలో ఆర్గానో క్లోరిన్ ఉన్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై స్పందిస్తూ ‘వైద్య పరిభాషలో ఎంజీ అంటే మిల్లీ గ్రామ్ కాదు. మైక్రోగ్రామ్‌గా భావించాలి. బాధితుల రక్త నమూనాల్లో లభ్యమైన ఆర్గానో క్లోరిన్ హాని కలిగించే స్థాయిలో లేదు’ అని తెలిపారు. చదవండి: (బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్ నివేదిక) రక్త నమూనాల్లో సీసం, ఆర్గానో క్లోరిన్స్! ►పరీక్షల కోసం సీఎఫ్ఎస్ఎల్ సహాయం కోరిన ఢిల్లీ ఎయిమ్స్ సాక్షి, న్యూఢిల్లీ: ఏలూరులో వింత వ్యాధికి కారణమైన మూలాలను కనుగొనేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మరింత లోతుగా పరిశోధనలు చేస్తోంది. ఏలూరులో సేకరించిన మరిన్ని రక్త నమూనాలను ఎయిమ్స్ వైద్యులు విశ్లేషించారు. మొత్తం 37 రక్త నమూనాలను విశ్లేషించగా.. అందులో 21 నమూనాల్లో అధిక మోతాదులో సీసం (లెడ్) ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మిగతా నమూనాల్లోనూ సీసం, నికెల్ వంటి భార లోహాలతోపాటు ఆర్గానో క్లోరిన్స్ (క్రిమిసంహారకాలు) కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆర్గానో క్లోరిన్స్ పరీక్షల కోసం ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సహాయం కోరారు. అయితే ఈ పరిశోధనల కోసం కేంద్ర హోంశాఖ నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు కావాలని సీఎఫ్ఎస్ఎల్ తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో హోంశాఖ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆర్గానో క్లోరిన్స్ ఆనవాళ్ల కోసం సీఎఫ్ఎస్ఎల్ పరిశోధనలు చేస్తోంది. శుక్రవారం పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. -
ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయని సమాచారం. కాగా ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా.. ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఆస్పత్రికి సీఎస్ నీలం సాహ్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చేరుకునున్నారు. ఆసుపత్రిలోని భాదితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎస్ సమీక్షించనున్నారు. వింత వ్యాధితో చనిపోలేదు ఇతర ఆరోగ్య సమస్యలతో ఏలూరు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారిలో ఇద్దరు మృతి చెందారు. అప్పారావు అనే వ్యక్తి కోవిడ్‌తో, సుబ్బరావమ్మ అనే మహిళ టీబీతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి సుపరిండిండెంట్ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. ఏలూరు నుంచి వింత జబ్బుతో వచ్చిన వారు ఎవరూ విజయవాడలో చికిత్స పొందుతూ చనిపోలేదని స్పష్టం చేశారు. ఏలూరు నుంచి వింత జబ్బుతో 25 మంది పేషేంట్లు చేరారని, ఇందులో ఇద్దరని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. మిగిలిన 23 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఏలూరు నుంచి వేరే కారణాలతో ప్రతీ రోజూ రెగ్యులర్‌గా కేసులు వస్తుంటాయని.. అలా వచ్చిన వారిలో ఇద్దరు పేషెంట్లు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. వీరికి ఏలూరు వింతజబ్బుతో వచ్చిన పేషేంట్లకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వదంతులు నమ్మవద్దు గురువారం జిల్లా ఆసుపత్రి ఏవీఆర్ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 మంది బాదితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారన్నారు. డిశ్చార్జి అయిన వారిని ఎప్పటికప్పుడు గ్రామసచివాలయ సిబ్బంది, డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అన్ని విధాలుగా ఈ కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వదంతులు నమ్మదని కోరారు. ఎన్ సిడిసి,ఎన్ఐఎన్ అన్ని కోణలో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మనుషులతో పాటు జంతువల సాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. ఏలూరు చుట్టుపక్కల గ్రామాలలోను సాంపిల్స్ సేకరిస్తున్నారని. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల సాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. మూడో రోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ వైద్య నిపుణుల బృందం పర్యటించిందని, చికిత్స పొందుతున్న భాదితతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు. సచివాలయాల్లో మెడికల్ క్యాంపులు.. ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివా లయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనా రోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందిం చి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర బృందాలు ఏలూరులోనే.. కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే మకాం వేసి అంతు చిక్కని వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తు న్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు ప్రస్తుతం ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగ తులను తెలుసుకుంటున్నాయి. ఈ బృందాలు ఏలూరులో పరిశీలిస్తున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. -
అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు
లండన్: కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఫైజర్– బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న నేషనల్ హెల్త్ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది. ఏదైనా మందులకుగానీ, ఆహార పదార్థాలకు గానీ అలర్జీ వచ్చే వాళ్లు ఎవరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి రావద్దని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వచ్చిన వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. ఎవరికైనా అలర్జీలు ఉన్నాయని తేలితే వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు రావడం సర్వసాధారణమే. ఎందుౖనా మంచిదని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ చూడాలని చెప్పాము. ప్రస్తుతం ఆ హెల్త్ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం బాగుంది’’ అని అధికారులు చెప్పారు. -
ఏలూరు: అస్వస్థత కేసులు తగ్గుముఖం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 556 కేసులు నమోదవ్వగా, 458 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది గంటలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఎయిమ్స్ బృందం పేర్కొంది. ఆహారం, బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించామని, మంగళగిరిలో కొన్ని టెస్టులు, ఢిల్లీలో కొన్ని టెస్టులు చేశామని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి: ఏలూరు ఘటన: సీఎం జగన్‌తో మాట్లాడిన గవర్నర్) రిపోర్ట్స్‌ని బట్టి రక్తంలో ఫెస్టిసైడ్‌తో పాటు లెట్ మెటల్స్ గుర్తించామని, పూర్తి రిపోర్ట్స్ రాగానే కారణాలు తెలుస్తాయని వైద్య బృందం పేర్కొంది. కచ్చితంగా ఇన్ఫెక్షన్ అయితే కాదని.. ఇన్ఫెక్షన్ అయితే జ్వరం తగ్గదని, ఫిట్స్ వస్తున్నాయి కాబట్టి.. వేరే సమస్య అయి ఉండొచ్చని వెల్లడించారు. రేపు సాయంత్రానికి కారణం ఏంటనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి మరో బృందం రానుందని.. ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) -
ఏలూరు: డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు
సాక్షి, పశ్చిమగోదావరి: గత కొద్ది రోజులుగా ఏలూరు పరిసరాల్లో ప్రజలు అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి గాను దేశంలోని అనేక ఇన్స్టిట్యూట్ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలు చేరుకున్నాయని డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య తగ్గడమే కాక డిశ్చార్జిల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలోని పలు ఇన్స్టిట్యూట్ల నుంచి బృందాలు వచ్చి నమోదు అయిన కేసుల వివరాలు తెలుసుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. అంతేకాక డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు వచ్చారని తెలిపారు. ఇక్కడ నుంచి వాటర్, మిల్క్ శాంపిల్స్ సేకరించి న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు పంపుతామన్నారు. పూణె వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి నిపుణులు వస్తారని తెలిపారు మోహన్. (చదవండి: అనుక్షణం అప్రమత్తం ) ప్రస్తుతం ఇక్కడ బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు ఏవీఆర్ మోహన్. డిశ్చార్జి అయిన వారిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. అన్ని ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక వచ్చిందని.. కొత్తగా మరో 40 మంది బాధితుల శాంపిల్స్ సేకరించి పంపిచామన్నారు. పూర్తిగా నిర్దారణ లేకుండా నివేదికలు బయటకు వెల్లడించలేమన్నారు. భయాందోళనవల్ల కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు మోహన్. -
ఏలూరుకు రానున్న కేంద్ర బృందం
న్యూఢిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారం కేంద్ర బృందం రానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు ఎయిమ్స్ అధికారుల బృందాన్ని ఏలూరు పంపుతున్నాము. కేంద్ర బృందం రేపు ఏలూరుకు చేరుకుంటుంది. విచిత్ర వ్యాధితో జనం భయపడిపోతున్నారు. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తాం' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్) -
ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని.. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని.. ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిశ్చార్జ్ చేసిన వారు తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. వారికి ఆహారం, మందులు అందించాలని.. డిశ్చార్జ్ అయిన వారిని కూడా అబ్జర్వేషన్లో ఉంచాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏలూరులో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 104, 108కి కాల్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) ఆందోళన చెందవద్దు: పేర్ని నాని ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘డిశ్చార్జ్ చేసిన బాధితులను నెలపాటు పర్యవేక్షించాలని.. బాధితులకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అస్వస్థతకు గల కారణాలపై పరిశోధనకు కేంద్ర బృందాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం కూడా రాబోతుంది. బాధితులు ఆందోళన చెందవద్దు’ అని తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 425 కేసులు నమోదు కాగా.. 222 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 16మంది విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాము. అస్వస్థతకు గురైన వారికి అన్ని వైరల్ టెస్టులు చేశాం. నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం.. రిపోర్టులు రావాలి. సీఎంబీకి కూడా నమూనాలు పంపామని’ తెలిపారు. -
ఏలూరు: బాధితులను పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కాగా, ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. చదవండి: (సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎలాంటి భయాందోళన చెందొద్దు: సీఎం జగన్
-
ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, ఏలూరు: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి, బాధితులకు బాసటగా నిలిచి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్ అభినందించారు. రాత్రంతా మేల్కొని గవర్నమెంట్ ఆస్పత్రిలో బాధితులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: (ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్) కాగా, ఏలూరులో వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. వ్యాధి లక్షణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏలూరుకు వైద్యబృందాలను పంపిస్తున్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రత్యేక వైద్యబృందాలు ఈ ఉదయం ఏలూరుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్ జగన్ మంత్రి ఆళ్లనానికి భరోసా ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) -
ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్
సాక్షి, ఏలూరు: నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మోనిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంచార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఈ మేరకు వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జై ప్రకాష్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు. ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌లు, ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. కాగా, మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఎమ్మార్వో సోమశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. -
ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న బాధితులు
-
ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత
సాక్షి, ఏలూరు టౌన్ : ఏలూరు నగరం విచిత్రమైన వ్యాధితో శనివారం వణికిపోయింది. వన్‌టౌన్‌లోని దక్షిణపు వీధి, పడమరవీధి, టూటౌన్ ప్రాంతంలోని గన్‌బజార్, కొత్తపేట, అశోక్‌నగర్, రూరల్ ప్రాంతంలోని శనివారపుపేట ఏరియా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతూ ఉండడంతో నగరంలో జనం హడలెత్తిపోయారు. పలువురు ఫిట్స్ మాదిరి నోటి వెంట నురగతో పడిపోవడంతో కుటుంబీకులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహాగా వ్యాధి ఉండటంతో వైద్యులకు జబ్బు ఏమిటో అర్థంకాలేదు. వ్యాధితో పడిపోయిన వారు 10 నుంచి 20 నిమిషాల అనంతరం తిరిగి మామూలు స్థితికి చేరుతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పదుల సంఖ్యలో జనం కళ్లు తిరుగుతూ పడిపోగా.. రాత్రికి ఈ సంఖ్య 95 వరకు చేరింది. అంతుచిక్కని ఈ వ్యాధితో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా ఆకస్మికంగా పడిపోవటంతో ప్రజలు భయపడుతున్నారు. వ్యాధి ఏమిటో? ఏలూరు నగరంలో వారం రోజుల నుంచి దక్షిణపు వీధిలో ఫిట్స్‌లా వస్తూ 30 మంది వరకూ అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే నగరంలోని పడమరవీధి, కొత్తపేట, గన్‌బజార్, అశోక్‌నగర్, శనివారపుపేట ప్రాంతాలకు చెందిన 95 మంది ఇలా ఫిట్స్‌లా వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు స్కానింగ్ తీసినా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ కావటం సందేహాలకు తావిస్తోంది. ఇలా మూర్చపోయి పడిపోతున్న వ్యక్తులు కొంత సేపటికి తేరుకుని మామూలు స్థితికి వస్తున్నారు. ఇదంతా వైద్యులకే అంతుచిక్కటం లేదు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయటం, రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేస్తేగాని వ్యాధి ఏమిటనేది చెప్పలేమని వైద్యులు అంటున్నారు. బాధితుల్లో చిన్నారులే అధికం శనివారం ఏలూరులో మూర్చపోతూ అనారోగ్యం బారిన పడిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. కలుషితమైన వాతావరణం, గాలిలో మార్పులు, పరిసరాల పరిశుభ్రత వంటివి కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణపు వీధిలో మెడికల్ క్యాంపు ఏలూరు దక్షిణపు వీధిలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే సమాచారంతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునంద ఆ«ధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది దక్షిణపు వీధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. వెంటనే సాయంత్రానికి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సత్వరమే వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. పది 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. వైద్యులు నిత్యం హాస్పిటల్లో ఉండాలని డిప్యూటీ సీఎం నాని ఆదేశాలు జారీ చేశారు. భయపడాల్సిందేమి లేదు: నాని రోగులకు యుద్ధప్రాతిపదికన వైద్యం అందుతోందని ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఒక ఆరేళ్ల చిన్నారిని మాత్రం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించామన్నారు. ఆసుపత్రిలో వైద్యులు అన్నివేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. అందరూ క్షేమమే : జేసీ అందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని జేసీ హిమాన్షు శుక్లా చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితుల వెన్నుపూస నుంచి శాంపిల్స్ తీసి పరీక్షలకు విజయవాడ పంపించినట్లు చెప్పారు. -
సూపర్‌స్టార్ సూపర్‌గా ఉన్నారు
‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆరోగ్యం బాగాలేదు. తలైవా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు’ అనే వార్త ఆదివారం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స పొందుతున్నారు అన్నది ఆ వార్తల సారాంశం. అయితే రజనీకాంత్ పీఆర్వోను సాక్షి సంప్రదించగా ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. ‘‘సూపర్‌స్టార్ సూపర్‌గా ఉన్నారు. ఆయన తన నివాసంలోనే ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు’’ అని తెలిపారు. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే చిత్రం చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట రజనీకాంత్.