అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. | Mother Died Due To Depression After Child Death | Sakshi
Sakshi News home page

అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి..

Published Wed, May 11 2022 6:02 PM | Last Updated on Wed, May 11 2022 6:04 PM

Mother Died Due To Depression After Child Death - Sakshi

సాక్షి, సిరిసిల్ల: అనారోగ్యం ఆ కుటుంబాన్ని వెంటాడింది.. విధి వెక్కిరించడంతో తల్లీకుమారుడు రెండు నెల వ్యవధిలో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన అల్లే పద్మ–బాలయ్య దంపతుల మూడో కూతురు ప్రీతికి 13 నెలల కిందట ముంబాయికి చెందిన అవినాష్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు బాబు జన్మించగా అవిష్‌ అని పేరు పెట్టారు.

పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్న ఆ చిన్నారి రెండు నెలల క్రితం చనిపోయా డు. అప్పటినుంచి తీవ్ర ఆవేదనకు గురవుతున్న ప్రీతి అనారోగ్యం పాలైంది. ముంబాయిలోని ఓ ప్రై వేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కూతురు, మనవడి మృతితో వృద్ధులైన ప్రీతి తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చదవండి: పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement