Sircilla
-
ప్రయాణం ఫ్రీనే.. బస్సే లేదు
సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు. పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆ రూట్ మా పరిధిలో లేదుఆ రూట్ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్ రూట్‌ను కరీంనగర్–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి. – ప్రకాశ్‌రావు, సిరిసిల్ల డిపో మేనేజర్. Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు -
కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఐఏఎస్‌ల సంఘం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఖండించింది.సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుంది. కలెక్టర్ విధులను వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐపీఎస్‌ల సంఘం డిమాండ్ చేసింది. -
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం కోసం .. ఆందోళన..!
-
రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా!
సాక్షి, నల్లగొండ: తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ధర్నాకు దిగారు. నల్లగొండలో ఎస్ఐను సస్పెండ్ చేయాలని బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేయగా.. సిరిసిల్లలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ పోలీసులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి ఆందోళన దిగారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సిబ్బంది ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో సిబ్బంది బయటకు రాకుండా ఆగిపోయారు. ప్రతీకార బాంబులు అణుబాంబులు మిరపకాయ బాంబులుతాటాకు బాంబులు కాదుతెలంగాణకు కావాల్సింది.. !మీ..మాయ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎలాగో మంచి చేయలేదు.. !కనీసం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులనైనా మనుషులుగా చూడండి.. !ఒక సంవత్సరంలోనే ఇంత చెండాలమైనా ప్రభుత్వం బహుశా..ఈ ప్రపంచంలోనే… pic.twitter.com/0x7DDbFRpy— Mallaiah Yadav Bollam (@BollamMallaiah) October 26, 2024 మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు నిరసన, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మాకు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మాతో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్బంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్ వద్దకు జిల్లా ఎస్పీ అఖిల్ చేరుకొని పోలీసులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఎస్పీ కాళ్లపై పడి తమ బాధను తీర్చాలని కానిస్టేబుల్ వేడుకున్నారు. పోలీస్ లే కార్మికుల తరహాలో స్లొగన్స్.. సమ్మె కానీ సమ్మె ఇది!#CongressFailedTelangana pic.twitter.com/00v54OZsLb— Harish Rao Thanneeru (@BRSHarish) October 26, 2024 సంచలనం.. యూనిఫాం వేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ https://t.co/HvAS9vFfGe pic.twitter.com/9NyrTl0JBr— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 Video Credit: Telugu scribe -
కేసులకు భయపడం.. ఏం చేస్తారో చేస్కోండి
సిరిసిల్ల: ‘మహా అయితే.. ఏం చేస్తారు.. ఏవో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతారు.. ఏం కేసులు పెడుతారో పెట్టుకోండి. ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంతకు వందరెట్లు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. వచ్చేది మేమే.. నేనే.. ’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. విద్యుత్ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో త్వరలో రాజకీయ బాంబులు పేలతాయనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముందు ఆయనపై జరిగిన ఈడీ దాడులు, బీజేపీ వాళ్లతో రహస్య ఒప్పందాలు, సీఎం బామ్మర్దితో కాంట్రాక్టు ఒప్పందాలు ఇవన్నీ చూసుకోవాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.4,500 కోట్ల వ్యవహారం చూసుకోవాలి. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడం. చంద్రబాబునాయుడు వంటి వాళ్లతోనే కొట్లాడినం.ఈ చిట్టినాయుడు ఎంత..’అని అన్నారు. తానింకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌లో చేరలేదంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, మరి సీఎం రేవంత్‌రెడ్డితో ఎందుకు కండువా కప్పించుకున్నారని, బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్‌తో కలవడమంటే రాజకీయంగా వ్యభిచారం చేసినట్టేనని అన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వారంతా రాజకీయ వ్యభిచారులేనని వ్యాఖ్యానించారు. పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు పెంచలేదు ఈఆర్సీ బహిరంగ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు కూడా పెంచకుండా నెలకు రూ.వెయ్యి కోట్లు భరిస్తూ పాలన అందించామని కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల వాతలు పెడుతోందని విమర్శించారు. పెద్ద పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను ఒకే గాటన కట్టి, కుటీర పరిశ్రమకు రాయితీలను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అదానీతో సమానంగా సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమల యజమానులు ఎలా విద్యుత్ చార్జీలు చెల్లిస్తారని ప్రశ్నించారు.విద్యుత్ చార్జీలు పెంచే ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామని, డిస్కంలపై రూ.18,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపే ప్రయత్నాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి సబ్సిడీ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నేతన్నల సంక్షేమం కోసం 10 హెచ్‌పీల వరకు ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీని 30 హెచ్‌పీల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు మహావీర్రాజు, కృష్ణయ్య, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. దద్దమ్మ పాలనలో దద్దరిల్లుతున్న రాష్ట్రం దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని కేటీఆర్ విమర్శించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కూమొక్కూ లేకుండా తయారయ్యాయని శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. ‘అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు ధర్నాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మొదలుకుని రైస్ మిల్లర్ల వరకు, కారి్మకులు మొదలు కాంట్రాక్టర్ల వరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.టీచర్ల నుంచి పోలీస్ కుటుంబాల దాకా, అవ్వతాతలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు , ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రజాపతినిధులు, ప్రతిపక్ష నాయకుల నుంచి వృద్దులు, బడి పిల్లలు కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళనలకు దిగుతున్నారు. కాంగ్రెస్ పాలన వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది..’అని కేటీఆర్ మండిపడ్డారు. -
పొంగులేటి.. బాంబులు అంటే ఈడీ సోదాల గురించేనా?: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో కేసీఆర్ పాలన విద్యుత్ రంగానికి స్వర్ణయుగమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందనా కేటీఆర్ తెలిపారు. అలాగే, ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ..‘2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో పారిశ్రామికవేత్తలు పవర్ హాలీడే వద్దని రోడ్డెక్కారు. నేతన్నలు పవర్ లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ మళ్లీ పది నెలల నుంచి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను మేం వ్యతిరేకిస్తున్నాం. మధ్యతరగతి నడ్డి విరిచే నిర్ణయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం వివిధ విద్యుత్ సంస్థలు 12 వందల కోట్ల రాబడి కోసం చేసిన ప్రతిపాదనను మేం ఖండిస్తున్నాం.మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల విద్యుత్ భారాన్ని నాడు ప్రభుత్వం భరించిందే తప్ప ప్రజలపై భారం వేయలేదు. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే 50 రూపాయలు యూనిట్‌కు పెంచడం దుర్మార్గం. 300 యూనిట్లు 70 శాతం ప్రజలు దాటడం ఖాయం. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలన్నింటినీ ఒకే మాదిరిగా లెక్క కట్టడం సరికాదు. దీంతో కుటీర పరిశ్రమలు ఇంకా కుంటుపడే అవకాశం ఉంది. రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ పదేళ్ల పాలనలో రూపాయి ఛార్జీలు పెంచలేదు. కానీ, ఈ ప్రభుత్వం పది నెలల్లోనే 18 వేల కోట్ల అదనపు భారాన్ని ఎందుకు మోపుతున్నారో ఈ సర్కారు సమాధానం చెప్పాలి. బాధ్యతాయుతమైన ఈఆర్సీ ప్రజాకోణంలో యోచించాలి. ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలి. తెలంగాణలో సహకార విద్యుత్ సంస్థ ఒకే ఒక్కటి మన సిరిసిల్ల జిల్లాలో ఉంది. డిస్కంలతో పోలిస్తే మా సెస్ ఎంతో బెటర్. కాబట్టి సెస్‌ను కాపాడాలని కోరుతున్నాను. సెస్‌లో డిమాండ్‌కు తగ్గట్టు ఏడు హెచ్‌పీ మోటార్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను. సెస్ కోసం వచ్చే సబ్సిడీ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. రైతులే నడిపించే సంస్థ సెస్. ఈ పది నెలల్లోనే పదిమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం.బాంబులు అంటే పొంగులేటి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో బహుశా?. మామీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి. చిట్టినాయుడు బెదిరింపులకి మేము భయపడం. ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడం. మళ్ళీ మేము వస్తాం. ఒక్కొక్కడి సంగతి చెబుతాం. జగిత్యాల ఎమ్మెల్యే గాడిదలు కాయడానికి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకున్నాడా?. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచారి. రాజకీయ వ్యభిచారం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులనే చంపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ కలకలం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త పేరుతో కట్టిన పోస్టర్ తీవ్ర కలకలం సృష్టించింది. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాయమాటలు చెబుతోంది. రేషన్ కార్డులు ఇస్తామని ఇంకా ఇవ్వడం లేదు. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే రేషన్ కార్డుల విషయంపై ఆలోచించాలని రాశారు.వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్లో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తాయని అనుకున్నాం. రేషన్ కార్డు లేక, లేబర్ కార్డ్ రావడం లేదు. ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్నాం. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే ముందుగా రేషన్ కార్డు సమస్యను తీర్చండి. గత ప్రభుత్వం మాదిరిగానే మాయమాటలు చెప్పి, ప్రజలకు నమ్మక ద్రోహాన్ని చేయకండి. ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్.. అని పోస్టర్ కట్టారు. దీంతో, ఈ పోస్టర్‌పై ప్రజల్లో చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్ఎస్ నేతలే ఇలా పోస్టర్లు కట్టారంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
మగ్గానికి మంచి రోజులు ఎప్పుడు ?
-
అక్కరకురాని సుట్టాలెందుకు.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తనకు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అలాగే, రాముడు అందరి వాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నాం. సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించింది. మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో గెలిచింది.ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి?. అబద్ధాలు చెబితే డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నామో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాక ఒక లెక్క అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు. కేసీఆర్ మళ్లీ కావాలనుకుంటే మే 13వ తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి.. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది.బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాముడు అందరివాడు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలు బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు వేసి మోదీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మళ్లీ అబ్కీ బార్ 420 అంటున్నాడు. అక్కరకురాని చుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకో జోడీ దారు దొరికితే.. రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
సీతమ్మకు బంగారు చీర..
-
రైతు బంధు కోసం పెట్టిన రూ. 7 వేల కోట్లు ఏమయ్యాయి: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్.. ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తుందని ఊహించలేదని.. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని మండిపడ్డారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టామని అయితే రైతుబంధు ఇవ్వొద్దంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీకి రేవంత్ లేఖ రాయాలి రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని సీఎం, మంత్రులు చెబుతున్నారని.. పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలని అన్నారు. ఇందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. చదవండి: నేడు కాంగ్రెస్ జనజాతర సభ.. తుక్కుగూడ నుంచే సమర శంఖం కాంగ్రెస్ తెచ్చిన కరువు కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకినాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు. కేసీఆర్ వస్తున్నారని నీళ్లు వదిలారు ‘300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగాయి. కేసీఆర్‌ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో వచ్చే తప్పుడు వార్తలు చూసి ఆగం కావొద్దు. కేసీఆర్ వస్తున్నారని అన్నారం, సుందిళ్ల నీళ్లు వదిలారు. హరీశ్‌రావు హెచ్చరిస్తే కూడవెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వలేదని అర్థమైంది కదా.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామని మోసం చేసింది. రూ. వరికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. రైతుల హక్కుల తరుపున కొట్లడుదాం. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్‌పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం. మిషన్ భగీరథ అప్పగించినా నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్‌కు లేదు. వండిన అన్నం వడ్డించే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించాలి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు: కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్లో 4 సజీవ జలధారలను సృష్టించామని కేసీఆర్ తెలిసారు. తాము గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేస్తే.. నాలుగు నెలల్లో జలధారాలు ఎండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం అనేక అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యమే కారణం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా.. సిరిసిల్ల తెలంగాణా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా.. మంత్రులు తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. నీటిని వాడే విధానం తెలియని ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శించారు. పంటలు ఎండటానికి కరెంట్ కోతలు కూడా కారణమని దుయ్యబటారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం క్వాలిటీ కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం కాలం గడిపేస్తుందని మండిపడ్డారు కేసీఆర్. ‘వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని చెప్పాను. చనిపోయిన 209 మంది రైతుల జాబితాను 4 గంటల్లోనే ప్రభుత్వానికి పంపించాను. లిస్ట్ ఇస్తే సాయం చేస్తామన్న సీఎం.. ఉలుకు, పలుకు లేకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలి. పరిహారం ఇవ్వకుంటే వాళ్లందరి ఉసురు తగులుతుంది. ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టం. తప్పించుకులేరు. వీపు విమానం మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ సంక్షోభం వచ్చింది ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదు. బ్యాంకర్లతో ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు. పంటలకు బోనస్ ఇస్తామన్నారు. జొన్నపంట కొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. రుణమాఫీపై తెలంగాణలో పెద్ద సంక్షోభం వచ్చేలా ఉంది. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోమం వచ్చింది. ఈ సంక్షోభానికి జబాబుదారీ ఎవరూ?. దళితబంధు 12 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైంది? మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే రోజులు దాపురించాయని నేతన్నలు చెబుతున్నారు. నేతన్నలను ఆదుకోవాలని అప్పట్లో మొర పెట్టుకున్నా. 14 ఏళ్ల కిందట చేనేత కార్మికుల బతుకు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాంటి పరిస్థితే తెచ్చారు. నాలుగు నెలల్లోనే విధ్యుత్ కొరత దళితబంధు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇంట్లో ఇద్దరికి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. 30 లక్షల కుటుంబాలకు నెలకు రూ. 6 వేల బాకీ ఉన్నారు. డిసెంబర్లో చేస్తామన్న రుణమాఫీ ఏమైంది? కళ్యాణలక్ష్మికి తులం బంగార కలిపి ఇస్తామన్నారు.. ఏమైంది? ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వలేదు. గతంలో కంటే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 9 ఏళ్లు వచ్చిన నిరంతర కరెంట్ ఇప్పుడెందుకు రావడం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో విద్యుత్ కొరత ఎందుకొచ్చింది. ఇది మనుషులు సృఫ్టించిన కృత్రిమ కరువు. మేం కేసులు పెట్టి జైల్లో వేయలేమా? కాళేశ్వరం ఎంత త్వరగా పూర్తైతే అంత మంచిదని భావించాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఉన్నవాళ్లకు తోక కూడా తేలీదు. అన్ని బరాజ్‌ల మీద దాదాపు 200పైగా గగేట్లు ఉంటాయి. మేడిగడ్డ బరాజ్‌లో గోదవారి పోంగే మూడు నెలలు గేట్లు ఎత్తి ఉంటాయి. కొట్టుకుపోయిన మిడ్‌మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ కాదా?. మేం అనుకుంటే అప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేవాళ్లం కాదా?. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలు. మేడిగడ్డ కుంగిందని కేసీర్‌ను బద్నాం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నదులు, బ్యారేజ్‌లు దగ్గర ఇసుక కుంగడం సహజం. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్. మీకు చేతకాకుండే 50 వేల మంది రైతులను తీసుకుపోతం. తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ నుంచి నీళ్లు తెస్తాం. కాళేశ్వరం పని అయిపోయిందన్నోళ్లు మొన్న నీళ్లు ఎలా పంపింగ్ చేశారు. ప్రజల గొంతులు ఎందుకు ఎండబెడుతున్నారు. ఇప్పటి వరకు ఊరుకున్నాం ఇకపై ఊరుకోం. రాష్ట్రం రణరంగం అయినా సరే’ అని కేసీఆర్ మండిపడ్డారు. -
కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Live Updates.. ► కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట ►కరీంనగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ ►జిల్లాలోని మొగ్దుంపూర్లో ఎండిపోయిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ► రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ►లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఫోన్ ట్యాపింగ్ హెడ్‌క్వార్టర్ ఎక్కడ అంటే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్‌లోని ఎస్ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్‌లో ఎస్ఐబీ పోలీసులు కొందరు వార్ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. వరంగల్‌లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. వార్ రూం ఎంతకాలం నడిచిందో? గత డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్‌రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్ రూంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్‌రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్ రికార్డ్ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్ చేసిన కాల్స్‌లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్‌రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం. సిరిసిల్లకే పరిమితం కాలేదా? వార్ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్‌కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్ పరికరాలను ఓ వ్యాన్‌లో పెట్టుకొని, టార్గెట్ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్ కూడా వినే వీలుంటుంది. 2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్ 2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్ కట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానించారు. -
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మూడోరోజూ కొనసాగుతున్న బంద్
సాక్షి, సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్‌తో సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్‌కు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో రూ. 35 కోట్ల రూపాయల పాలిస్టర్ బట్ట పేరుకు పోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కోటి మీటర్ల మేర పేరుకుపోయిన వస్త్ర నిల్వలు
-
కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. ఆడియో షేర్ చేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రచార ముగింపు వారం రోజులే ఉండటంతో అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 119 నియోజవర్గాల్లోని గల్లీగల్లీ తిరుగుతూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ వాడ, ఊరిలో చూసిన ప్రచార సభలు, రోడ్‌షోలే దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ కాల్లీక్ అయ్యిందంటూ కాంగ్రెస్ ఓ ఆడియో కలఇప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్ వాయిస్‌తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది. ఈ ఆడియోలో.. వారం రోజుల్లో ప్రచారం ముగిస్తుందని.. ఈ కొన్ని రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా.. కౌన్సిలర్లు, సర్వంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని, ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో, ఏ బూత్ వాళ్లు ఆ పరిధిలో పటిష్టంగా ఇంటింటా ప్రచారం చేయాలని సూచిస్తున్నట్లు వినిపిస్తుంది. గతంలో కాకుండా వచ్చే ఎన్నికల తర్వాత వారంలో కనీసంగా రెండు రోజులు సిరిసిల్లకు వచ్చి స్థానికంగా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాలంటూ, మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండంటూ పేర్కొన్నారు. ఇక కేటీఆర్ ఫోన్ కాల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్న కేడర్. ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి.#ByeByeKCR pic.twitter.com/PXOvRujqt4 — Telangana Congress (@INCTelangana) November 22, 2023 -
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్
-
సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డి
-
సిరిసిల్లలో సిఎం కేసీఆర్ పర్యటన
-
కేటీఆర్‌కు కాంగ్రాట్స్.. తనయుడిని పొగిడిన కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: తన జీవితంలో సిరిసిల్లాకు వందసార్లు వచ్చానని, ఇక్కడ తనకు బంధువర్గం ఎక్కువని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన సీఎం.. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కలలో ఊహించని అభివృద్ధి సిరిసిల్లలో జరిగిందని, వేసవిలో కూడా అప్పర్ మానేర్ ఉరకలేస్తోందన్నారు. అప్పర్ మానేరును చూస్తే ఆత్మ సంతృప్తి కలుగుతోందని కేసీఆర్ అన్నారు. ‘‘కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండటం సిరిసిల్ల అదృష్టం. చేనేత కార్మికుల అవసరాలన్నీ కేటీఆర్ తీర్చారు. చేనేతల బతుకులు మార్చిన కేటీఆర్‌కు అభినందనలు. సోలాపూర్ తరహాలో సిరిసిల్ల రూపుదిద్దుకోవాలి. చేనేతల కన్నీళ్లు తుడిచేందుకే బతుకమ్మ చీరలు తెచ్చాం. కొంతమంది దుర్మార్గులు చీరలను కాల్చేసి రాజకీయాలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లను పెంచుకుంటూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే అన్నం పెడుతోంది. వరిసాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంది. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి సాగువుతోంది. పేదల కడుపునిండేలా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం’’ అని సీఎం తెలిపారు. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి: కేటీఆర్ కలలో కూడా ఊహించని, కల్పన కూడా చేయని అభివృద్ధి ఇవాళ సిరిసిల్లలో కళ్లకు కనబడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా ఆప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. కన్నీరు చూసిన ఈ నేలలో కేసీఆర్ తాగు, సాగు నీరు అందుతోంది. ఇది చేతల, నేతన్నల ప్రభుత్వం.. ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రమై లెక్కకు మిక్కిలి విద్యా, వైద్య సంస్థలతో సిరిసిల్ల తులతూగుతోంది.. సిరిసిల్లలో మరోసారి జై కొట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం.. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
పార్టీ ఏదైనా..జెండా తయారయ్యేది అక్కడే
-
సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో రెండు పిల్లలు లభ్యం
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పిల్లను చిరుత తీసుకువెళుతుండగా పొలం పనులకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాల కోసం ఏడుస్తున్న చిరుత పిల్లలకు పాలు తాగించే యత్నం చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్‌కు తరలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. అయితే చిరుత పిల్ల లభ్యం కావడంతో శివంగులపల్లితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
స్కూటీలో దూరి.. చుక్కలు చూపించి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్‌ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు. స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్‌క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. -
నేను మెడిసిన్ సీటు పొందలేకపోయాను: మంత్రి కేటీఆర్
-
మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..?
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో తొమ్మిది మెడికల్ కాలేజీలను వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్‌రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభించినందుకు సెస్ కార్యాలయం నుంచి సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చైరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ.. 1993లో తాను కూడా బైపీసీ పూర్తిచేసినట్లు తెలిపారు. అమ్మ తనను డాక్టర్ చేయాలనుకుంటే.. నాన్న నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారని ఆనాటి రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు ఎంసెట్‌లో 1600 ర్యాంక్ వచ్చినా.. మెడికల్ సీటు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని.. తెలంగాణాలో 10000 మంది వైద్యులు ప్రైవేట్& ప్రభుత్వ కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు తెలంగాణలో వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పీజీ విద్య మన జిల్లాలోనే(సిరిసిల్ల) ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవని విమర్శించారు. చదవండి: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా? ‘మొన్నటి దాకా డాక్టర్ల కొరత వుండేది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వల్ల కేవలం సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లున్నారు. గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారు. వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలను ఏర్పాటు చేస్తాం. మోదీ లాంటి వాళ్ళు సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మాకు బాసులు ఎవరూ లేరు. ప్రజలే మాకు బాసులు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి? వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ వాళ్లనడగాలి.సిరిసిల్లలో నన్ను, వేములవాడలో లక్ష్మీనరసింహారావును మంచి మెజారిటీతో గెలిపించండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ తెలిపారు మంత్రి కేటీఆర్. -
తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది. వివిధ పథకాల ద్వారా నేతన్నకు అండగా నిలుస్తున్నామన్నారు. మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా అమలు చేస్తున్నమని తెలిపారు. సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందన్నారు. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. చదవండి: తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం: సీఎం కేసీఆర్ -
కోతుల వీరంగం.. బావిలోపడ్డ వృద్ధురాలు
సాక్షి, సిరిసిల్ల: ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగిపోయాయి. జనావాసాల్లోకి చొరబడి గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోతులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వృద్ధురాలు బావిలో పడింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన గంభీర్పూర్ రాజవ్వ (68) ఇంటి బయట కూర్చుని ఉండగా.. హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేశాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బావిలో పడి మధ్యలో ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో సమీప ఇళ్లలోని యువకులు వచ్చి బావిలో వేలాడుతున్న రాజవ్వను తాళ్ల సహాయంతో బయటకు లాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. చదవండి: ప్రగతి కాదు.. సర్పంచ్‌లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం -
అమెరికాకు సిరిసిల్ల వస్త్రాలు
సిరిసిల్ల: సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని గోకుల్దాస్ సంస్థలో గ్రీన్‌నీడిల్ యూ నిట్‌లో జిల్లా మహిళలు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వ్రస్తాలు సిరిసిల్ల బ్రాండ్‌తో అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం ట్విట్టర్లో పంచుకున్నారు. సిరిసిల్ల అపెరల్‌పార్క్‌లో రెండేళ్లుగా రెడీమేడ్ వస్త్రాలు తయారవుతున్నా సిరిసిల్ల కాకుండా.. బెంగళూర్ బ్రాండ్‌తో ఎగుమతి అయ్యేవి. ఇటీవల సిరిసిల్ల బ్రాండ్‌తో అమెరికాకు నేరుగా ముంబయి నుంచి నౌకలో వెళ్తున్నాయి. అపెరల్ పార్క్‌లో 3.25 ఎకరాల్లో 66 వేల చదరపు అడుగులతో రూ.24 కోట్లతో గోకుల్దాస్ రెడీమేడ్ వ్రస్తాల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 500 మంది స్థానిక మహిళలు ఉపాధి పొందుతుండగా.. మరో 500 మందికి త్వరలోనే ఉపాధి కలి్పస్తామని గ్రీన్‌నీడిల్ సంస్థ ప్రకటించింది. రెండు కంటైనర్లలో సిరిసిల్ల బ్రాండ్‌తో ముంబయికి రెడీమేడ్ వ్రస్తాలు ఎగుమతి కావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. -
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ధరణికి ఇక్కట్లు
-
మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం: కేటీఆర్
-
పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం, కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ హరితహారం కార్యక్రమం ఈ స్థాయిలో లేదు’ అని అన్నారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగదాంపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ముస్తాబాద్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇది కూడా చదవండి: ‘తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పోరాడారు’ -
మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో మంత్రి కాన్వాయ్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో పర్యటించేందుకువచ్చిన కేటీఆర్ వాహనాన్ని కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. కాగా రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అనేకచోట్ల చేతికొచ్చిన పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆరా తీశారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. చదవండి: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్‌భవన్ క్లారిటీ.. -
జీ-20 లోగోను వస్త్రంపై నేసిన హరిప్రసాద్
-
సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం: కేటీఆర్
సిరిసిల్ల: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంపదను సృష్టిస్తున్నామని, తిరిగి ఆ సంపదను పేదలకు పంచుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు భూముల ధరలు ఎంత ఉన్నాయని, ఇప్పుడు ఎంత ఉన్నాయో తేడాను ప్రజలు గమనించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు రైతుబంధు ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,117 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఏటా విద్యుత్ కొనుగోలుకు రూ. 10 వేల కోట్లు వెచి్చస్తున్నామని... రూ. 50 వేల కోట్లు వెచ్చించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు. రూ. 200 నుంచి రూ. 2,016కు పెన్షన్ పెంచాం.. పేదరికమే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఒకప్పుడు రూ. 200గా ఉన్న పెన్షన్‌ను రూ. 2,016కు పెంచామని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. ఏ ఊరికి వెళ్లినా వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇలా ఎక్కడాలేని సౌలత్లు కలి్పంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. నిత్యం తమ ప్రభుత్వాన్ని నిందించే ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందిస్తామన్నారు. అర్హులందరికీ డబ్బులిస్తామని కేటీఆర్ తెలిపారు. అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ... దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలో నాడు ఆరి్టకల్–3ని పొందుపరచడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కంటివెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబాలేమైనా ఉంటే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయాన్ని ఆయా కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రాష్ట్ర పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీ సక్కంగ లేడు... మన ఎంపీ (కరీంనగర్) బండి సంజయ్ సక్కంగ లేడని, ఆయన సక్కంగ ఉంటే ఇప్పటికే సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం వచ్చేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన హిందూ, ముస్లింల చిచ్చుపెట్టేలా మసీదులను కూలుస్తామని చెప్పడంతోపాటు పేపర్ లీక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ఈపాటికి జిల్లాకు రైలు వచ్చేదన్నారు. చదవండి: సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా? -
విషాదం: హెల్మెట్ పెట్టుకున్నా.. దక్కని టీచర్ ప్రాణం
సాక్షి, కరీంనగర్: మృతువు ఆమెను లారీ రూపంలో వెంటాడింది. భర్త ఇక లేడన్న ఆలోచనల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. అయితే, మరో 30 మీటర్లు దాటితే ఆమె తన గమ్యస్థానం చేరుతుందనగా అనుకోని విధంగా మృత్యువు కాటేసింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన రజిత.. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లందకుంట మండలం రహీమ్‌ఖాన్‌పేట మోడల్ స్కూల్లో గణితం టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, రజిత రోజు మాదిరిగానే శుక్రవారం కూడా విధులకు బయలుదేరింది. కాగా, స్కూటీపై ఓ ప్రైవేటు స్కూల్ వరకు వెళ్లి.. అక్కడే వాహనం పార్క్ చేసి ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూటీపై స్కూల్‌కు వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ రజిత స్కూటీకి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జు అయిపోయింది. లారీ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే టీచర్ రజిత మృతిచెందారు. అయితే, రజిత హెల్మెట్ ధరించినప్పటికీ ఆమె చనిపోయారు. ఇక, రజిత.. మరో 30 మీటర్ల దూరంలో స్కూటీ పార్క్ చేసే స్థలం ఉండటం గమనార్హం. ఇక, రజితకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆమె భర్త వినోద్ కుమార్ ఐదేళ్ల క్రితమే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో రజిత కూడా చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు.. రజిత డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు. -
Karimnagar: ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రావొద్దమ్మా.. కేసీఆర్ ఆదేశాలు?
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి నేటి వరకు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తున్నారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలకు గాను, 12 చొప్పున అసెంబ్లీ స్థానాలు సాధించి బలాన్ని చాటుకుంది. ఇప్పుడు కూడా పూర్వపు తరహాలోనే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రులు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా వారంలో కనీసం ఆరురోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు అత్యవసరమైతే తప్ప.. ఇకపై నుంచి చీటికి మాటికి రాజధానికి రావాల్సిన అవసరం లేదని, నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దరిమిలా.. ఈ మేరకు అందరు ఎమ్మెల్యేలకు సీఎం, పార్టీ అధిష్టానం నుంచి సందేశం అందినట్లు సమాచారం. ఎమ్మెల్యేలపై నిరంతర నిఘా..! పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? స్థానికంగా ప్రజలకు ఎన్నిరోజులు అందుబాటులో ఉంటున్నారు? హైదరాబాద్‌లో ఎన్నిరోజులు ఉంటున్నారు? అన్న విషయాలపై నిరంతరం సమాచారం తెప్పించుకుంటున్నారు. వీటి ఆధారంగా వాటి పనితీరును ఆయన బేరీజు వేస్తున్నారని తెలిసింది. ఇటీవల సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. గతవారం కొండగట్టు మాస్టర్ ప్లాన్ సందర్భంగా స్మితా సభర్వాల్ ఒకరోజు ముందే వచ్చారు. తాజాగా కరీంనగర్లో జరుగుతున్న తీగలవంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్‌సిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటలిజెన్స్, పార్టీ, ఇతర వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సీఎంవోకు రిపోర్టు అందుతూనే ఉంది. అందుకు అనుగుణంగా సీఎం నుంచి తగిన సూచనలు, సలహాలు వసూ్తనే ఉన్నాయి. అన్ని పార్టీలు వస్తున్న క్రమంలో..! రాష్ట్రంలో పాత కరీంనగర్‌కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, బీఎస్పీ, వైఎస్సార్ టీపీ తదితర పార్టీలు కొంతకాలంగా ప్రయత్నాలు సాగి స్తున్నాయి. తాజాగా వీటికి తోడుగా ఎంఐఎం కూడా చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం నుంచి సీనియర్ లీడర్ల ద్వారా ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీల సంఖ్య, రాజకీయ పోటీ పెరుగుతున్న దరిమిలా.. నిరంతరం ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే మొదలు.. జిల్లాలో మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ పరంగా జిల్లాల్లో వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. అటు కేబినెట్ ఇటు జిల్లా కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 13 సమావేశాల్లో హుజూరాబాద్, మంథని మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పార్టీ గెలిచింది. సీఎం ఆదేశాలతో దాదాపుగా ఎమ్మెల్యేలంతా స్పీడు పెంచారు. ►జగిత్యాల: డా.సంజయ్‌కుమార్ పల్లె నిద్రపేరుతో గ్రామాల్లో నిద్రిస్తున్నారు. ►కోరుట్ల: విద్యాసాగర్‌రావు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ►ధర్మపురి: ఈశ్వర్ నిరంతరం జిల్లా సమీక్షలు, లబ్ధిదారులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ►సిరిసిల్ల: కేటీఆర్ వేములవాడ మాస్టర్‌ప్లాన్ జిల్లాపై సమీక్షలు.. ►వేములవాడ: రమేశ్ కొద్దికాలంగా పెరిగిన పర్యటనలు. ►కరీంనగర్: గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్‌సిటీ పనులపై సమీక్ష ►చొప్పదండి: రవిశంకర్ కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌తో పెరిగిన స్పీడు.. ►మానకొండూరు: బాలకిషన్ పల్లెల్లో మార్నింగ్ వాక్‌లకు ప్లాన్ ►పెద్దపల్లి: మనోహర్‌రెడ్డి నిత్యం లబ్ధిదారులతో సమావేశాలు ►రామగుండం: చందర్ నిరంతరం సేవా, వసతుల కల్పనపై సమీక్షలు ►హుస్నాబాద్: సతీశ్‌బాబు స్థానిక సమస్యలపై ప్రజలతో సమావేశాలు. -
ఏంటీ, పెళ్లిలో నాన్‌వెజ్ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!
‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్లను చూసి అవాక్కయ్యారు. నాన్‌వెజ్ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్‌వెజ్ పెట్టరని, ఓన్లీ వెజ్ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు, మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’ సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు. సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి 1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు. రిసెప్షన్ వేడుకల్లో వారి ఇష్టం ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు. అందరూ తింటారు శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. – కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో.. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు ఇప్పటికీ అమలవుతోంది చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం. – గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల -
పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న మండలంలోని అల్మాస్పూర్, రాజన్నపేట గ్రామాలకు చెందిన 22 మంది విద్యార్థులు స్కూల్‌బస్సులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డిపేట శివారులోని రెండోబైపాస్ మూలమలుపు వద్ద కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు వెనుకభాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని వెనుకసీట్లో కూర్చున్న విద్యార్థులు విహాన్, ఆదిత్య, దినేశ్, వినయ్, శివ, శివారెడ్డి, శ్రీనివాస్, తనుశ్రీ, మల్లికార్జున్, కావ్య, ధరణి, వర్షిణి, మణిసూదన్, మణిదీప్, సిద్దేశ్తోపాటు బస్సు క్లీనర్ అజయ్‌లు గాయపడ్డారు. రక్తం కారుతుండడంతో పిల్లలు భయాందోళనకు గురై రోదించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి రోదనలతో మిన్నంటింది. ఫోన్లో ఆరా తీసిన మంత్రి కేటీఆర్ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో ఫోన్లో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే డీఈవో రాధాకిషన్‌ను అప్రమత్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి చేరుకున్న డీఈవో రాధాకిషన్ ప్రమాద సంఘటనపై వివరాలు సేకరించి, విద్యార్థులను పరామర్శించారు. -
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్‌కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్‌కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
అన్నంలో పురుగులు, వానపాములు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నంలో పురుగులొస్తున్నాయి.. భోజనంలో వానపాములు వస్తున్నాయి.. వాచ్‌మన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చేయి చేసుకుంటున్నాడు.. ప్రిన్సిపాల్, వార్డెన్,, చివరికి కుక్ కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కారు. దాదాపు 70 మంది హాస్టల్ నుంచి బయటకొచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పురుగుల అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారని, ఆ భోజనం తినలేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్‌మన్ రామస్వామి, భోజనం వండి పెట్టే భద్రమ్మ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనంలో వానపాములు వస్తున్నాయని విలపించారు. కాస్మోటిక్ డబ్బులను సైతం ప్రిన్సిపాల్ కాజేస్తోందని చెప్పారు. వాచ్‌మన్ రామస్వామి నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తమపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్మన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళన తెలుసుకున్న ఎస్సై శేఖర్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంఘటనపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. తక్షణమే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిని కూడా వెళ్లి అక్కడి పరిస్థితులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. ఆందోళన చెందొద్దని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. ప్రిన్సిపాల్, వాచ్‌మన్‌పై వేటు.. అదనపు ప్రిన్సిపాల్ రామారావుకు బాధ్యతలు కాగా, ఘటనపై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న స్పందించారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న రామారావుకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రామస్వామిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. మా మీదే ఫిర్యాదు చేస్తారా.. లోనికి ఎలా వస్తారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం తొలుత విద్యార్థినులపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. ఆందోళన ముగిసిన తర్వాత విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా.. గేటుకు తాళంవేసి లోనికి అనుమతించలేదు. ఎవరికి చెప్పి బయటకు వెళ్లారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు గేటు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, విద్యార్థినులను లోనికి పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న మాట్లాడి ప్రిన్సిపాల్‌తో పాటు వాచ్‌మన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
చందనాల చీరకు వెండిపోగుల వందనం
సిరిసిల్ల: వెండిపోగులతో మెరిసిపోతోంది. పరిమళాలు వెదజల్లుతోంది. సిరిసిల్ల నేత కళాకారుడి చేయి మరో అద్భుతాన్ని సృష్టించింది.. వెండితో పరిమళించే సిరి చందనం పట్టుచీర సో యగాలొలుకుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నాలుగు దశాబ్దాల కిందటే నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్.. తాజాగా వెండిపోగులతో పరిమళించే పట్టుచీరను మగ్గంపై నేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తల్లి జ్యోతి వెండిపోగుల సిరిచందనం పట్టు చీరను ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు విజయ్‌కుమార్ నెల పది రోజులపాటు శ్రమించి 90 గ్రాముల వెండితో పోగులను సిద్ధం చేసి, 27 రకాల పరిమళాలతో కూడిన నూలు పోగులతో పట్టుచీరను నేశాడు. 600 గ్రాముల బరువుతో, 48 ఇంచీల వెడల్పుతో ఐదున్నర మీటర్ల పొడవైన వెండిపోగుల చీరను సిద్ధం చేశాడు. కట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ చీర తయారీకి రూ.45 వేలు ఖర్చయినట్లు నల్ల విజయ్‌కుమార్ తెలిపారు. చీరను కలెక్టర్ తల్లి జ్యోతికి అందజేస్తానని ఆయన గురువారం తెలిపారు. -
ఆమె మనోస్థైర్యం ఎంతో అద్భుతం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి(42) మరణం పట్ల తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ కొనియాడారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి.. ఆశయానికి కాదని రాజేశ్వరి తన మనోస్థైర్యం నిరూపించిందన్నారు కేటీఆర్. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమన్న ఆయన.. రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం కమ్ముకుంది. కానీ, చెదరని గుండె నిబ్బరంతో కాళ్లనే చేతులుగా మలుచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారామె. ఆత్మవిశ్వాసంతో ఆమె రాసిన కవితలు మంచి ఆదరణ పొందాయి. ‘‘సంకల్పం ముందు వైకల్యం ఎంత!. ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత!. ఎదురీత ముందు విధిరాత ఎంత!. పోరాటం ముందు ఆరాటం ఎంత!.. అంటూ రాజేశ్వరి ఓ కవిత రాసిందామె. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకలనానికి ‘‘జీవితమే కవిత్వం..’’ అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే. కానీ అమె మాత్రం జీవిస్తుంది.. అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం అంటూ పేర్కొన్నారు. సంబంధిత వార్త: కాళ్లతో కవితలు రాసిన ‘సిరిసిల్ల’ రాజేశ్వరి ఇక లేరు -
Sircilla Rajeshwari: సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆమె వైకల్యాన్ని ఎదురించింది. కాలి వేళ్లు కలం పట్టాయి.. కవితలు రాశాయి. ఆ కవితలే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె గాథ.. మరికొందరిలో స్పూర్తి నింపింది కూడా. కానీ, దురదృష్టవశాత్తూ.. కాళ్లతో కవితలు రాసే కవయిత్రిగా దక్కించుకున్న ఆమె ఇక లేరు. కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లో ఓ పేద నేతన్న కుటుంబంలో మూడో సంతానంగా జన్మించింది బూర రాజేశ్వరి. పదిహేనవ ఏట దాకా ఆమె నడవలేదు. అయితే.. వైకల్యాన్ని చూసి ఏనాడూ ఆమె బాధపడలేదు. కసిగా కవితలు రాయడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు సాంబయ్య, అనసూయల ప్రోత్సాహంతో చదువుకుంది. తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచారామె. సుమారు 700ల దాకా కవితలు రాసి అందరినీ ఆకట్టుకున్నారామె.ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన పాటలు, మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయట. రాజేశ్వరి గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో కలిసి సిరిసిల్లకు వెళ్లి ఆమెను కలిశారు. తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కూడా ఆయన రాజేశ్వరికి బహుకరించారు. రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకువచ్చి, రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.ఈ విషయాన్ని కేవీ రమణాచారి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైనప్పటికీ సాహిత్యంలో ఆమె రాణించడం.. కేసీఆర్‌ను ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరపున ఆమె పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ చేయించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్ కాలనీలో ఆమెకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కేటాయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. దివ్యాంగురాలు కావడంతో.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను ఆమె కవిత రూపంలో రాశారు. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో రాజేశ్వరి జీవిథ గాధను చాలా టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు వెలువరించాయి. అయితే 42 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స అందినా ప్రాణం నిలవలేకపోయింది. రాజేశ్వరి మృతి పట్ల స్థానికంగా సంతాపం వెల్లడిస్తున్నారు. ఆమె మృతి వార్తను మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఆమె సాహిత్య ప్రయాణాన్ని.. మహారాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ సిలబస్‌లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించడం గమనార్హం. -
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
అయోధ్య తప్ప సయోధ్య ఎక్కడుంది.. ‘సెస్’ ఫుల్‌ఫామ్ చెబితే రాజీనామా!
సాక్షి, సిరిసిల్ల: ‘రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ‘సెస్’ ఎన్నికల్లో మా సీట్లు లాక్కున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అంటున్నారు. ఆయన ‘సెస్’ఫుల్‌ఫామ్ చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు, ‘సెస్’ గురించి ఆయనకు ఏం తెలుసని, అయోధ్య తప్ప రైతులతో ఆ పార్టీకి సయోధ్య ఎక్కడుందని ప్రశ్నించారు. పోరగాళ్లకు మతం మందు కలిపి తాగిస్తున్నారని, వాట్సాప్ గ్రూపుల్లో బీఆర్ఎస్పై వాళ్లతో తప్పు డు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చదవండి: ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
హామీలు అమలు చేస్తే చెప్పు దెబ్బకు సిద్ధం: బండి సంజయ్
సిరిసిల్ల: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ దివాలా కంపెనీ అని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేస్తే ప్రజల కోసం చెప్పుతో కొట్టించుకోవడానికి, తల నరుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాను డ్రగ్స్ వాడలేదని పరీక్షల్లో తేలితే చెప్పు దెబ్బలకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై బండి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడల్లో గురువారం బీజేపీ శ్రేణులతో సమావేశమై ‘సెస్’ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తానన్నడు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తుంటే ట్విట్టర్ టిల్లు (మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి) చెప్పుతో కొడతానంటూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నడు. డ్రగ్స్ వాడి మానేసిండు కదా..‘‘విత్ డ్రాయల్ సింప్టమ్స్’’తో బాధపడుతున్నాడు. కేసీఆర్ బిడ్డనేమో మా ఎంపీ అర్వింద్‌ను చెప్పుతో కొడతానంటోంది. కానీ మీలాగా సంస్కారహీనంగా మేం మాట్లాడలేం’అని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. \ కేంద్రాన్ని బద్నామ్ చేస్తున్నారు... తెలంగాణ లాగా దేశమంతటా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ అంటున్నారని, తెలంగాణ ఏ విషయంలో అభివృద్ధి చెందిందో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. ‘రైతు రుణాలు మాఫీ చేయలే. ఉద్యోగాలు భర్తీ చేయలే. నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, రైతులకు ఉచిత యూరియా, దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే. వడ్లు సరిగ్గా కొనుగోలు చేయట్లే. కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఆగలే’అని బండి సంజయ్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్... 15 గంటలే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారని దుయ్యబట్టారు. రైతులకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ బద్నామ్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఎంత భారమైనా రైతులకు సబ్సిడీపై ఎరువులను సరఫరా చేస్తోందని చెప్పారు. రైతులకు ఫసల్‌బీమా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే కలిసే ముఖం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. కేంద్రానికి సహకరించకుండా రోడ్లు, రైల్వేలేన్లు సహా అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని అపఖ్యాతిపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు, నియంత, రాక్షస పాలన అంతం కోసం ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నానని బండి సంజయ్ వివరించారు. రోడ్డుపై ఉరికించి కొట్టాలే.. రాష్ట్రంలో ఓ అధికారి (హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఉద్దేశించి) క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందంటడు. క్రైస్తవం వల్లే భారత్ అభివృద్ధి చెందిందంటడు. ఆయనకు సిగ్గుండాలె. మరి ఈ దేశంలో ఎందుకున్నవ్? దేశం విడిచి పో. ఈ దేశంలో పుట్టి పరాయి పాట పాడతవా? ప్రభుత్వ అధికారిగా ఉంటూ మతప్రచారం చేస్తవా?’అని బండి ప్రశ్నించారు. బరితెగించిన ఇలాంటి అధికారులను రోడ్లపై ఉరికించి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం కాళ్లు మొక్కే అధికారుల సంగతి చూస్తామని సంజయ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణిరుద్రమదేవి, టి.వీరేందర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, ఆవునూరి రామాకాంత్‌రావు, రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్‌లు పాల్గొన్నారు. -
సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
-
సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను జ్ఞానేశ్వర్ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది శాలిని. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొంది. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది. ‘జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది’ అని వీడియోలో తెలిపింది. కాగా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని అనే యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అవ్వగా .. మంగళవారం తెల్లవారుజామున తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసేందుకు వెళ్లిన శాలిని గుడి ముందే నలుగురు యువకులు అపహరించారు. అడ్డుకున్న యువతి తండ్రిని కొట్టి ఆమెను లాక్కెళ్లారు. యువతి కిడ్నాప్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటి వరకు యువతిని కిడ్నాప్ చేశారని అంతా భావిస్తుండగా.. తానే స్వయంగా అతనితో వెళ్లిన్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. చదవండి: రాజన్న సిరిసిల్ల: మాడపల్లి కిడ్నాప్ ఉదంతంపై కేటీఆర్ స్పందన -
సిరిసిల్ల నేతన్నలు అదుర్స్: అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు
సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జాఫ్. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు కైరా జాఫ్. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు. కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన.. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్‌కు వచ్చారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు -
‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి..
సాక్షి, సిరిసిల్ల: ‘సారీ అన్నయ్య.. మిస్ యూ’ అంటూ మెసేజ్ చేసి తంగళ్లపల్లి మండలం చింతలఠాణాకు చెందిన గొడుగు దినేశ్(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొడుగు అంజయ్య భార్య 15 ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు వెంకటేశ్, గణేశ్, దినేశ్‌లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకొడుకు వెంకటేశ్ వివాహం కాగా.. చిన్న కొడుకు దినేశ్‌కు మేనమామ కూతురితో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయిని దినేశ్ నిరాకరించారు. దీంతో దినేశ్, గణేశ్‌లకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి అంజయ్య సంబంధాలు చూస్తున్నాడు. మేనమామ కూతురికి శనివారం మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తాను నిరాకరించిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం.. తనకు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన దినేశ్ శనివారం మధ్యాహ్నం మేకలు కాసేందుకు గ్రామ శివారులోని కొడిషల్‌గుట్టకు వెళ్లాడు. అక్కడి నుంచి తన పెద్దన్న వెంకటేశ్‌కు ఫోన్‌చేసి తనకు బతకాలని లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంకటేశ్ తన తండ్రి అంజయ్యకు సమాచారం ఇవ్వగా శనివారం నుంచి దినేశ్ కోసం గాలించారు. ఆదివారం తెల్లవారుజామున కొడిషల్‌గుట్ట ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి అంజయ్య ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో సిరిసిల్ల టాప్
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్ స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్ కేటగిరిలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పాటు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు. అద్భుతాన్ని ఆవిష్కరించారు: మంత్రి కేటీఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ –2023 అవార్డుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కోరారు. తాజా అవార్డుపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి ట్వీట్ చేశారు. కాగా, ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం కారణంగానే ఇది సాధ్యమైందంటూ’కలెక్టర్ కూడా ట్వీట్ చేశారు. -
సంక్రాంతి నాటికి ‘డబుల్’ లబ్ధిదారుల గుర్తింపు
సిరిసిల్ల: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగులతో నిర్మించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అర్హులను సంక్రాంతి నాటికి గుర్తించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు 200 గురుకులాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి పెరిగిందని, ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నివేదికలను మార్చిలోగా రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని, జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరయ్యాయని వివరించారు. సంక్రాంతి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. సిరిసిల్ల మధ్యమానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు ట్రయల్ రన్ నిర్వహించాలని, రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, సొరంగంలో లైనింగ్ పనులు పూర్తి చేసి మధ్యమానేరు నీటితో మల్కపేటను నింపాలని సూచించారు. అనంతరం తనను కలిసిన గౌడ సంఘం జిల్లా నాయకులతో కేటీఆర్ మాట్లాడుతూ అర్హులైన గీత కార్మికులకు మోపెడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. -
సిరిసిల్ల చేనేత కళాకారుడికి మోదీ ప్రశంసలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్ (మనసులో మాట)లో ప్రధాని మోదీ సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ నైపుణ్యాన్ని అభినందించారు. ఇటీవల జరిగిన జీ–20 సదస్సు లోగోను హరిప్రసాద్ మగ్గంపై తయారు చేసి ప్రధాని మోదీకి పంపారు. ఈ విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ నేతకార్మికుల చేతిలోని అరుదైన కళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీవీలో కార్యక్రమాన్ని ఆలకించిన ఎంపీ బండి సంజయ్ చేనేత కళాకారుడు హరిప్రసాద్‌ను అభినందించారు. చేనేత కళ విస్తరణకు సహకరిస్తానని హామీ ఇచ్చి సత్కరించారు. అరుదైన కళ హరిప్రసాద్ సొంతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన వెల్ది హరిప్రసాద్ తన చేనేత కళాప్రతిభను పలుమార్లు ప్రదర్శించారు. ఇప్పటికే అగ్గిపెట్టెలో ఇమిడే చీరతోపాటు ఉంగరంలో దూరే చీరను, సూది రంధ్రంలోంచి దూరే చీరలను నేశారు. సూక్ష్మరూపంలో మరమగ్గాన్ని, కుట్టులేకుండా దుస్తులను తయారుచేశారు. మగ్గంపైనే రాష్ట్ర, జాతీయస్థాయి నాయకుల చిత్రాలను రూపొందించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల కోసం మహాత్ముడి నూలు వడికే చిత్రాన్ని రూపొందించారు. ఆజాద్‌కీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయగీతాన్ని, భారతదేశ చిత్రపటాన్ని కుట్టు లేకుండా నేసి అబ్బురపరిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాన్ని వస్త్రంపై నేసి అవార్డు అందుకున్నారు. -
కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో
సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. – మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు. ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ కరువు... ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్‌లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి -
పోడు సర్వే జాబితాలో పేర్లు లేవని ఆత్మహత్యాయత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం చేపట్టిన పోడుభూముల సర్వే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివరాలిలా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాలో పోడుభూముల సర్వేను సర్వే కమిటీ చైర్మన్ భూక్య శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోడుభూముల వ్యవహారంలో రాశిగుట్టతండా, భూక్యతండా మధ్య కొన్ని విభేదాలున్నాయి. జాబితాలో భూక్యతండాకు చెందిన బాదావత్ కమల(50), బాదావత్ శివరాం(30) పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. 2004 నుంచే తాము సాగుచేసు కుంటున్నా పేర్లు ఎందుకు లేవంటూ ఆవేదనకు లోనయ్యారు. వీరు సాగు చేసుకుంటున్న భూములు రాశిగుట్ట తండా పరిధిలోకి వస్తాయని.. జాబితాలో పేర్లు లేవని చెప్పగానే శివరాం తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కమల కూడా పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరినీ ఎల్లారెడ్డి పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల 1.20 ఎకరాలు, శివరాం రెండెకరాలు సాగు చేస్తున్నారు. -
గల్ఫ్ చట్టాలు తెలియక చిక్కుల్లో..
సిరిసిల్ల: దుబాయ్‌లోని చట్టాలపై అవగాహన లేక అక్కడ చిక్కుల్లో పడ్డ ఐదుగురు తెలంగాణ యువకులు మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు సొంతూళ్ళకు రానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన గుగులోత్ అరవింద్, పెద్దోళ్ల స్వామి, గొల్లపెల్లి రాము, అనిల్, నిజామాబాద్ జిల్లాకి చెందిన నరేందర్ ఐదు నెలల కిందట కంపెనీ వీసాలపై లైసెన్స్ ఏజెంట్స్ ద్వారా దుబాయ్‌కి వెళ్లారు. లేబర్క్యాంపులో వసతులు కల్పించి పని ఇచ్చినా.. వెళ్లేందుకు నిరాకరిస్తూ గొడవకు దిగారు. దాంతో లేబర్‌కోర్టు అధికారులు అక్కడి సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి వీరి ప్రవర్తన బాగా లేదని నిర్ధారించి, దేశం విడిచి పోకుండా పాస్‌పోర్టులపై ఆంక్షలు విధించారు. కాగా ఈ ఐదుగురు తిరిగి భారత్ వచ్చేందుకు దుబాయ్ ఎయిర్ పోర్టుకు వెళ్ళగా. ఆ పాస్‌పోర్టులపై ఆంక్షలు ఉండడంతో ఎయిర్‌పోర్టు అధికారులు వారిని వెనక్కి పంపారు. దీంతో వారు గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయామని కేటీఆర్ ఆదుకోవాలంటూ ఎయిర్‌పోర్టు ముందు నుంచి వీడియో తీసి వైరల్ చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో... వీడియో పై మంత్రి కేటీఆర్ స్పందించారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు లేఖ రాశా రు. దుబాయ్‌లోనే ఉండే గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్య క్షుడు గుండెల్లి నర్సింహులు ఎంబసీ అధికారులతో మాట్లా డి, కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఇందులో కంపెనీ తప్పిదం ఏమీ లేదని, ఉపాధి కోసం వచ్చిన సదరు యువకు ల పొరపాటుతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. మంత్రి కేటీఆర్ చొరవతో వారికి విమాన టికెట్లను సమకూర్చగా మూడు రోజుల్లో ఇండియాకు రానున్నారు. -
మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!
సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ దీనిని రూపొందించారు. పవర్లూమ్పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పట్టుపోగులకు సుగంధాలు అద్ది సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేందుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్‌కుమార్ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్‌కుమార్ చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్‌కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్‌కుమార్‌ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్‌కుమార్ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్: సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ) కొత్తగా ఏదైనా చేయాలని.. వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. – నల్ల విజయ్‌కుమార్, నేత కళాకారుడు -
రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ ఏజెంట్ల మోసంతో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకులు రెండు రోజుల్లో స్వగ్రామాలకు రానున్నారు. విమానాశ్రయంలో ఉన్న యువకులకు మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. దుబాయ్‌లో ఉన్న తెలంగాణకు చెందిన కొందరు మిత్రులను సంప్రదించి.. తన సొంత డబ్బులు వెచ్చించి వారికి వసతులు కల్పించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న గుగులోతు అరవింద్, బర్దిపురం నరేందర్, గొల్లపల్లి రాము, పెద్దొల్ల స్వామి, తిరుమలేశ్, అనిల్‌కు అక్కడి కంపెనీ ఎగ్జి ట్ వీసాలు రెండు రోజుల్లో అందేలా మంత్రి చర్యలు తీసు కున్నారు. దుబాయ్ రాయబార కార్యాలయానికి ప్రభు త్వం తరఫున సహాయం కోరుతూ కేటీఆర్ లేఖ రాశారు. -
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గోస
సిరిసిల్ల: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో కొందరు తెలంగాణ యువకులు మోసపోయారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కిన యువకులు ఆదివారం తమ గోడును వీడియో ద్వారా మీడియాకు పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగులోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన పెద్దోళ్ల స్వామి, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపెల్లి రాము, చందుర్తి మండలం ఎన్గల్‌కు చెందిన అనిల్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన నరేందర్‌లు ఐదు నెలల క్రితం కంపెనీ వీసాలపై దుబాయ్ వెళ్లారు. గల్ఫ్ ఏజెంట్లు ఇండియాలో వీసాకు ఇంటర్వ్యూలు చేసినప్పుడు చెప్పిన పని కాకుండా.. వేరే లేబర్ పని చేయిస్తున్నారని, చెప్పిన విధంగా జీతం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై కంపెనీలో గొడవ జరిగిందని, ఇటీవల కంపెనీ హెచ్ఆర్ అధికారులు ‘మీరు క్యాంపు నుంచి వెళ్లిపోండి’అంటూ.. పాస్‌పోర్టులు ఇచ్చారని బాధితులు తెలిపారు. పాస్‌పోర్టులు చేతికి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విమాన టికెట్‌కు డబ్బులు తెప్పించుకున్నామని వివరించారు. స్వస్థలాలకు వచ్చేందుకు విమాన టికెట్లు కొనుక్కొని ఎయిర్ పోర్టుకు వస్తే.. బోర్డింగ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు అధికారులు ‘మీ మీద కేసులు ఉన్నాయి.. మీరు తాగి క్యాంపులో గొడవ చేశారట.. వాటిని పరిష్కరించుకుని రావాలి’అని విమాన టికెట్లు చింపేసి, వెనక్కి పంపించారని వెల్లడించారు. తమ అందరి లగేజీ ఎయిర్ పోర్టులోనే ఉందని వాపోయారు. మూడురోజులుగా ఎయిర్ పోర్టులోనే.. ఎయిర్ పోర్టులోనే మూడు రోజులుగా ఉంటున్నామని బాధి తులు తెలిపారు. అయితే ఎవరూ స్పందించడం లేదని, తిండి, నీళ్లు లేక ఎయిర్ పోర్టు పరిసరాల్లో కట్టుబట్టలతో గడుపు తున్నట్లు వివరించారు. పోలీసులు వస్తే.. పక్కకు తప్పుకుంటూ.. భయం భయంగా ఉంటున్నామని వాపోయారు. మంత్రి కేటీఆర్‌కు వినతి ఏజెంట్ల మాటలతో మోసపోయామని, తమను ఇండియాకు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ సహకరించాలని వీర్నపల్లికి చెందిన యువకుడు అరవింద్ వీడియోలో కోరారు. దయచేసి తమను ఇంటికి చేరేలా చూడాలని, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామని బాధితులు మంత్రిని వేడుకున్నారు. దుబాయ్‌లో చిక్కిన తెలంగాణ యువకుల గోడు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రైతులను కూలీలుగా మార్చే కుట్ర!
సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రూ.25 వేల కోట్ల రుణాలిస్తామని కేంద్రం చెప్పిందని, అయినా సీఎం కేసీఆర్ రైతుల పక్షానే నిలబడ్డారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం వేర్వేరు కార్యక్రమాల్లో 6 వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లను, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైందని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో టన్ను బొగ్గు రూ.3 వేలకు లభిస్తుంటే.. రూ.35 వేలకు టన్ను విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం చెబుతోందని.. ఇదంతా ప్రధాని మోదీ కార్పొరేట్ మిత్రులకు ప్రయోజనం కలిగించేందుకేనని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ బిల్లు చట్టంగా మారితే రైతులకు ఉచిత కరెంటు, వివిధ వృత్తుల వారికి సబ్సిడీ విద్యుత్ పోతుందని పేర్కొన్నారు. పేదలకు ఉచితాలు రద్దు చేయాలంటున్న మోదీ.. తన కార్పొరేట్ మిత్రులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం ఏమిటని నిలదీశారు. తెలంగాణ వడ్లు కొనాలని కోరితే నాలుగేళ్ల వరకు నిల్వలు ఉన్నాయన్న కేంద్రం.. ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉందనడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు నాలుగు ఎన్నికల్లో పోటీ చేశానని, ఏనాడూ చుక్క మందు పంచలేదని.. పైసా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు సిరిసిల్ల కాలేజీ మైదానంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే 6 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇలా 2020లో రాష్ట్రవ్యాప్తంగా 120 అంబులెన్స్‌లు పంపిణీ చేశామని, 2021లో 1,200 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, స్కూటీలు అందించామని వివరించారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని తెలిపారు. ఇక సిరిసిల్లలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన కేటీఆర్.. వస్త్రోత్పత్తిలో సిరిసిల్ల తమిళనాడులోని తిరువూరుకు దీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేతన్నల సంక్షేమానికి త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని.. అర్హులకు పెన్షన్లు, సొంత స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు మంజూరు చేయనున్నామని చెప్పారు. బీజేపీ జోకర్లకు దమ్ము లేదు: కేటీఆర్ ‘మనకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి నిలదీసేందుకు తెలంగాణకు చెందిన ఒక్క బీజేపీ జోకర్‌కు కూడా దమ్ములేదు. గుజరాత్ బాస్‌ల చెప్పులు మోసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే వీరికి తెలంగాణ హక్కుల గురించి నిలదీసి డిమాండ్ చేసే ధైర్యం లేదు’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’మూలంగా తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలవలేకపోయిందని వచ్చిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ మోదీ నామస్మరణకు గుజరాత్ కేంద్రంగా నిలుస్తోందని ట్విట్టర్లో మండిపడ్డారు. ‘సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ది’అంటూ రెండురోజుల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ ట్విట్టర్లో మండిపడ్డారు. ‘లక్ష్మణ్ గారూ.. ఎవరి సొమ్ముతో మీరు సోకులు పడుతున్నారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర్‌ప్రదేశ్ సోకులు పడుతున్నది. దేశాభివృద్ధికి తెలంగాణ దోహద పడుతున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. లెక్కలు తెలుసుకోండి, ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం. కానీ, ప్రజలను మభ్యపెట్టకండి’అని వ్యాఖ్యానించారు. ‘కరువుపీడిత నేలగా ఉన్న తెలంగాణ ఈ రోజు 1.35 లక్షల ఎకరాల మాగాణం అయింది. నాడు సాగునీరు సరిపడాలేక నెర్రలు బారిన నేల నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ నూతన రికార్డులు సృష్టిస్తోంది. రైతుబంధు, నిరంతర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది’అని.. ‘పంటలు ఫుల్’శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
Telangana: కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చీరల పంపిణీ జరిగేలా చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ చీరల తయారీకి రూ.339.73 కోట్లు వెచ్చించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల జరీ అంచులతో (త్రెడ్ బోర్డర్) తెలంగాణ టెక్స్టైల్ విభాగం ఈ చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారంతో డిజైన్లను రూపొందించారు. అత్యుత్తమ ప్రమాణాలతో చీరలను ఉత్పత్తి చేశారు. రెండు విభిన్న పొడవుల్లో చీరలను తయారు చేయించగా, ఇందులో ఆరు మీటర్ల చీరలు 92 లక్షలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవైన చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి, 18 ఏళ్లు పైబడిన మహిళలకు అందజేయనున్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు: కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక ఇచ్చేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీతో భరోసా వచ్చిందన్నారు. నేతన్నల వేతనాలు రెట్టింపు కావడంతో పాటు కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. నేత కార్మికులు ఏడాది పొడవునా ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదం చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న నేత కార్మికులను ఆదుకునేందుకు సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ వంటి విధానాలతో వారి ఉపాధిని క్లిష్టతరం చేస్తోందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇదీ చదవండి: టెర్రర్ ఫండింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు -
కేటీఆర్ ఇలాకాలో సంచలనం.. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘టీఆర్ఎస్ నాయకులు వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లికి చెందిన మ్యాన పద్మ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు చావే శరణ్యమంటూ బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. వివరాల ప్రకారం.. బాధితురాలు పద్మ బద్దెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. స్థానిక టీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు ఆమె నుంచి పెట్రోల్ బాటిల్‌ను లాగేశారు. -
టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రవీణ్
సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ను తెలంగాణ పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా, సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) వైస్ చైర్మన్‌గా, ‘సెస్’పర్సన్ ఇన్చార్జిగా ఆయన పనిచేశారు. -
హమ్మాయ్యా! టెన్షన్ పోయింది.. కేసీఆర్ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం
సాక్ష, కరీంనగర్: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్ ఈనెల 3న తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్‌కిషోర్(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్ నుంచి శ్రీధర్‌బాబు, హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ లాంటి ఆశావహులు గులాబీ బాస్ ప్రకటనతో డీలాపడ్డారు. కరీంనగర్ జిల్లా! కరీంనగర్: కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్ ఖరారైంది. మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది. హుస్నాబాద్: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు. హుజురాబాద్: గతంలో ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా! సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా! ధర్మపురి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈ శ్వర్ «2014 «నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. జగిత్యాల: ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కనుంది. కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా! పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2018లో ఏఐఎఫ్బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి. మంథని: పుట్ట మధుకర్ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
నేతన్నల బీమాకు వీడిన చిక్కు
సిరిసిల్ల: రైతుల తరహాలో నేత కార్మికులకోసం ప్రకటించిన నేతన్నబీమా పథకంలో ఆంక్షలను తొలగించారు. నేతకార్మికులకు బీమా త్రిఫ్ట్(పొదుపు) పథ కంలో చేరితేనే వర్తిస్తుందనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. త్రిఫ్ట్‌లో చేరకున్నా అర్హులైన నేత కార్మికులకు, అనుబంధ రంగాల్లో పనిచేసేవారికి బీమా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులకిందట జీవో జారీ చేసింది. దీంతో త్రిఫ్ట్‌తో సంబంధం లేకుండా 18–59 ఏళ్ల మధ్య వయసు న్న కార్మికులకు నేతన్నబీమా స్కీం వర్తించనుంది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఏటా రూ.5,425 ప్రీమియాన్ని ఎల్ఐసీకి చెల్లించి బీమా కల్పించనుంది. ఎలాంటి కారణంతో మరణించినా, వారి కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షల బీమా సొమ్ము లభిస్తుంది. 2021 జూలై 4న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు. ‘సాక్షి’ మెయిన్‌లో ఆగస్ట్ 21న ప్రచురితమైన కథనం 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దీనికి మార్గదర్శకాలు జారీచేశారు. నేతన్నలకు బీమా పథకంతో రాష్ట్రంలోని సిరిసిల్ల, దుబ్బాక, నారాయణపేట, యాదాద్రి, నల్లగొండ, కరీంనగర్, భువనగిరి, జనగామ, గద్వాల, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని నేతన్నలకు లబ్ధి కలగనుంది. అయితే ఆంక్షలు అడ్డంకిగా మారాయని ‘సాక్షి’లో ఆగస్టు 21న ప్రచురితమైన ‘నేతన్నల బీమాకు నిబంధనల చిక్కు’ కథనంపై స్పందించిన కేటీఆర్ జౌళిశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి త్రిఫ్ట్‌తో లింకును తొలగించారు. తాజా ఆదేశాల నేపథ్యంలో అర్హతలున్న నేతన్నలందరికీ బీమా కల్పిస్తామని జౌళిశాఖ ఏడీ సాగర్ తెలిపారు. -
అధ్యాపకురాలి క్రూరత్వం.. ఆస్పత్రి పాలైన విద్యార్థిని
వేములవాడ అర్బన్: సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు ఆలస్యంగా వచ్చిందంటూ ఓ అధ్యాపకురాలు ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఐదు రోజులపాటు తరగతి గది బయట 8 గంటల చొప్పున నిలబెట్టడంతో నడవలేని స్థితికి చేరి, ఆదివారం ఆసుపత్రి పాలైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళాడిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిహారిక ఈ నెల 18న ఒకరోజు సెలవుపై ఇంటికెళ్లి 22న తిరిగొచ్చింది. ఆలస్యంగా వచ్చిందంటూ నిహారికపై అధ్యాపకురాలు మహేశ్వరి కఠినంగా వ్యవహరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు క్లాస్‌లోకి అనుమతించకపోగా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నిలుచోబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని నడవలేని స్థితికి చేరింది. ఈ విషయం హాస్టల్ ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఆదివారం ఉదయం వేములవాడ ఏరియా ఆస్పత్రికి నిహారికను తరలించి వైద్యసేవలు అందించారు. దీనిపై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్యామలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. కాగా, ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందిస్తూ అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్‌పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
తల్లిని చిత్రహింసలు చేస్తున్న తండ్రిపై ఫిర్యాదు చేసిన బాలుడు
-
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్‌బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
సార్.. మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నడు..
సాక్షి, ముస్తాబాద్ (సిరిసిల్ల):‘సార్ మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను, నన్ను, చెల్లిని కొడుతున్నడు.ఎందుకు కొడుతున్నడో ఏమో..’ అమ్మే పనికి పోతది.. మాకు బువ్వ పెడుతది. అమ్మ దగ్గరున్న పైసలు గుంజుకుని రోజూ పొద్దున్నే తాగుతున్నడు.. ఇంటికొచ్చి కొడుతున్నడు..’ అంటూ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం భరత్ (8) అంబేడ్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. తన తండ్రి తీరుకు విసిగిపోయి గురువారం ఉదయం ఒక్కడే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ భరత్ తల్లిదండ్రులు దీపిక, బాలకిషన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. బాలకిషన్‌కు తెలిసిన డ్రైవింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలకిషన్ వేధింపులను భార్య దీపిక కూడా కన్నీటిపర్యంతమవుతూ ఎస్ఐకి వివరించింది. పిల్లలను బాగా చదివించాలని, తాము అండగా ఉంటామని ఎస్ఐ భరోసా ఇచ్చారు. భరత్‌ను హాస్టల్లో చేర్పిస్తాననగా.. తాను గురుకులంలో సీటు సాధిస్తానని.. పోలీస్ కావడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం. చిన్న వయస్సులోనే సమస్య పరిష్కారానికి వచ్చిన బాలుడిని ఎస్సైతో పాటు అక్కడున్న సిబ్బంది అభినందించారు. చదవండి: హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య -
మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వండి
సిరిసిల్ల: సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రధాని, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కేటీఆర్ ప్రసంగించారు. టెక్స్టైల్ రంగంపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. నేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, చేనేత, పవర్లూమ్ కార్మికులు ఏ కారణంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందుతుందని అన్నారు. రాష్ట్రంలో 80 వేలమంది నేత, పవర్లూమ్ కార్మికులకు బీమాసౌకర్యం లభిస్తుందని తెలిపారు. పవర్లూమ్ కార్మికులకు రూ.2,500 కోట్ల బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, స్కూల్ యూనిఫారాల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆర్డర్లతో నేత కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారని, వారికి పొదుపు(త్రిఫ్ట్) పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని వివరించారు. సిరిసిల్ల శివారుల్లోని 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో నిర్మిస్తున్న అపెరల్ పార్క్ పూర్తయితే గార్మెంట్ రంగంలో 8 వేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. మధ్యమానేరు జలాశయంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో 10 వేలమందికి ఉపాధినిచ్చేలా 367 ఎకరాల్లో ఆక్వాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. 12 రాష్ట్రాలకు సిరిసిల్ల జెండాలు స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రెండు వేలమంది సిరిసిల్ల నేతన్నలు ఐదువేల మగ్గాలపై కోటి 20 లక్షల జాతీయజెండాలను తయారు చేశారని కేటీఆర్ అన్నారు. రూ.5 కోట్ల విలువైన జాతీయ జెండాలను 12 రాష్ట్రాలకు అందించారని అభినందించారు. మండెపల్లి వద్ద 12 బ్యాచ్‌ల్లోని 332 మందికి అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి 139 మందికి ప్లేస్మెంట్ కల్పించినట్లు తెలిపారు. కాలునొప్పితోనే మంత్రి కేటీఆర్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. కుర్చిలో కూర్చునే ప్రసంగించారు. మంత్రి ప్రయాణిస్తున్న వ్యాన్ మొరాయించడంతో నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా సిరిసిల్లకు చేరుకున్నారు. అనంతరం సిరిసిల్ల నేతకార్మికులు మంత్రి కేటీఆర్‌ను నూలుపోగుల దండతో సత్కరించారు. మూడు అంశాలతో ముందుకు... తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు వేదికైందని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇంక్లుజివ్ గ్రోత్ అనే మూడు అంశాలపై ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2022ను కేటీఆర్ ప్రారంభించారు. 33 జిల్లాల ఆవిష్కర్తలతో జరిగిన గూగుల్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. టీ–హబ్, వీ–హబ్, అగ్రీ–హబ్, కే–హబ్, బీ–హబ్ వంటి అనేక కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తుందని కేటీఆర్ వివరించారు. -
చీర్లవంచ వద్ద భారీ వారధి! రాజమండ్రి తరహాలో డబుల్ వంతెనకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు మీదుగా భారీ వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరినదిపై రాజమండ్రి వద్ద నిర్మించిన భారీవంతెనను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించతలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ నిర్మాణ బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం.. వంతెన నిర్మాణ డిజైన్లను ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు చూపించడం, ఆయన కొన్నిటికి సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రాజెక్టు పనిని ప్రారంభించారు. డబుల్ వంతెన, ఆకట్టుకునే రూపం! ఈ వంతెన రాష్ట్రంలో మిగిలిన వంతెనల కంటే భిన్నంగా, నాణ్యమైనదిగా, డిజైన్‌లో ఆకట్టుకునేలా ఉంటుందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వంతెన రెండు అంతస్తులుగా ఉంటుందని, పైభాగంలో బస్సులు, లారీలు తదితరాలు వెళ్లేందుకు రోడ్డుతో కూడిన మార్గం, కింద కొత్తపల్లి–మనోహరాబాద్ రైలు వెళ్లేలా ప్రత్యేక రైల్వేట్రాక్‌తో వంతెన నిర్మిస్తామన్నారు. కేంద్రంతోపాటు, దక్షిణమధ్య రైల్వే జీఎం కూడా దీని నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సైతం ఎంతో దోహదపడుతుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. రాజమండ్రి వారధిలో కింద ఉన్న రైలు వంతెన 2.8 కి.మీ.లు, కాగా పైనున్న రోడ్డు వంతెన 4.1 కి.మీ. ఉంటుంది. చీర్లవంచ వంతెనలో రైలు, రోడ్డు వంతెన ఎన్ని మీటర్లు ఉంటుందన్న సాంకేతికాంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డబుల్ వంతెన కడితే బహుళార్థ సాధక ప్రాజెక్టు అవుతుందన్న సీఎం కేసీఆర్ సూచనలతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ బ్రిడ్జి పనులకు దాదాపుగా అన్నిరకాల అనుమతులు వచ్చినట్లే. ప్రభుత్వం ఆగస్టు 15న ప్రకటించనున్న అనంతరం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. -
27 రకాల సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీర
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ పరిమళించే పట్టు చీరను రూపొందించారు. విజయ్‌కుమార్ ఇప్పటికే తండ్రి పరంధాములు స్ఫూర్తితో అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి పవర్లూమ్పై పట్టు చీరను నేశాడు. సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచీల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. నాలుగు రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. (క్లిక్: డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి) -
పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న!
సాక్షి, సిరిసిల్ల/బోధన్/హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్న (80) అలియాస్ కేఆర్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. హైదరాబాద్ శివారులోని కౌకూరులో ఓ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారని సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు. వయోభారంతో రాజన్న అనారోగ్యంతో ఉన్నారని విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ఏనుగు ప్రభాకర్‌రావు అలియాస్ వేణుగోపాల్‌రావు హత్యకేసులో కూర రాజన్న నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టయిన రాజన్న, జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ.. మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్నపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ జనశక్తి సాయుధ దళాలను నిర్మించేందుకు రాజన్న ఆయుధాలు సమకూర్చుకుంటున్నట్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెడతారని భావిస్తున్నా... రాజన్న అరెస్ట్‌పై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా... జిల్లాలోని వేములవాడకు చెందిన కూర రాజన్న నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో విచారించాలి.. పోలీసులు అరెస్టుచేసిన సీపీఐఎం ఎల్ జనశక్తి నేత కూర రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే విచారించాలని మానవహక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇతరుల సహాయం లేకుండా నడవ లేని, శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉన్నాడని వైద్యుల పర్యవేక్షణలో, రాజన్న ఏర్పాటు చేసుకున్న న్యాయవాది సమక్షంలో విచారించాలని సంస్థ అధ్యక్షులు జి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. -
నేతన్నలకు ‘జెండా’ పండుగ
పవర్‌లూమ్స్‌పై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు మామిడాల సమ్మయ్య. సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన సమ్మయ్య నిత్యం 12 సాంచాలపై పనిచేస్తూ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సమ్మయ్యకు వారానికి రూ.2,500 కూలి వస్తుంది. ఇలా ఒక్క సమ్మయ్యనే కాదు.. సిరిసిల్లలో 5 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. జాతీయ జెండాల తయారీపని చేస్తున్న వీరు సిరిసిల్లకు చెందిన మహిళలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అవసరమైన జెండాలను సిరిసిల్లలో సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్లలో జెండాలు తయారుచేసే పది మంది వ్యాపారులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేస్తున్నారు. సిరిసిల్ల: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయు ల త్యాగాలు.. పోరాటఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15కి ముందు వారం, తరువాత మరో వారం రోజులు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కోద్వారా కొ నుగోలుచేసి, ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారుచే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నల వద్ద 30 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొ నేందుకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలో 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలు.. తెలంగాణవ్యాప్తంగా 38,588 పవర్‌లూమ్స్ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్‌లూమ్స్ ఉన్నాయి. 4,116 సాంచాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలతో (18) సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తోంది. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్లు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి రూ.13 నుంచి రూ.16 వరకు ఒక్కో మీటరుకు చెల్లించాలని నిర్ణయించారు. సిద్ధమవుతున్న జెండాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 50 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 1,200 మంది మహిళలు జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. ఇది అనుకోని ఆర్డర్ టెస్కో ద్వారా పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేస్తారని తెలియదు. ఇది అనుకోని ఆర్డర్. నాకు 52 సాంచాలు ఉన్నాయి. నా వద్ద నిల్వ ఉన్న 50 వేల మీటర్ల వస్త్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా. టెస్కో కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. – కోడం విజయ్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల ఢిల్లీకి 5 లక్షల జెండాలు ఇస్తున్నా.. నాకు ఢిల్లీ నుంచి జూలై 10న ఐదు లక్షల జెండాల ఆర్డర్లు వచ్చాయి. కొంచెం ముందుగా ఆర్డర్లు వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల ఆర్డర్లు వస్తున్నాయి. కానీ సమయం సరిపోదు. నా వద్ద ఓ 50 మంది ఉపాధి పొందుతున్నారు. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి, సిరిసిల్ల నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్న నేను బీడీలు చేసిన. ఆ పని కష్టంగా ఉండటంతో జెండాలు కుట్టడం, ప్యాకింగ్ చేయడం చేస్తున్న. నెలకు రూ.6వేలు సంపాదిస్తున్న. మా ఆయన సాంబశివ సాంచాలు నడుపుతారు. మాకు ఇద్దరు పిల్లలు. ఈ పని బాగుంది. నాలాగే చాలా మంది ఈ పని చేస్తున్నారు. – వెల్దండి శైలజ, సిరిసిల్ల -
నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులిప్పిస్తున్నాం
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే నని, అందువల్ల నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్‌ను కేటీఆర్ సందర్శించి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆస్పత్రిలో పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో తమ తొలి విడత ఐదేళ్ల పాలనలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ప్రస్తుత రెండో దఫా పాలనలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్‌ఫోన్ పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీసర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అభ్యర్థులు అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ చోదకశక్తిగా ఎదిగింది.. తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ రెట్టింపు అయిందని.. దేశాన్ని సాదుతున్న రాష్ట్రంగా, ఆర్థిక చోదకశక్తిగా ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. ఇవి ఆర్బీఐ చెప్పిన లెక్కలని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు రాష్ట్రం నుంచి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన కేంద్రం అడుగడుగునా వివక్ష చూపతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
సర్కారు దవాఖానలో సౌలత్లు బాగున్నయ్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని చింతల్‌ఠాణా పునరావాస కాలనీకి చెందిన సామంతుల వసంత, స్వామి కూతురు శిరీష (హారిక) పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లారు. వైద్యులకు చూపించారు. వారు ‘ఎలాంటి ఇబ్బంది లేదు.. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం’అనడంతో.. సాధారణ కాన్పుకు సిద్ధమయ్యారు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు, సేవలపై వసంత సంతృప్తి చెందింది. దీంతో చదువు రాని ఆమె వెంటనే తన కూతురు శిరీషతో రాయించిన ఉత్తరం మంత్రి హరీశ్‌రావుకు మంగళవారం చేరింది. ఉత్తరం ఇలా.. ‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులున్నాయని నా బిడ్డను సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేశాడు. బాగా నొప్పులతో ఆసుపత్రికెళ్లినం. అక్కడ డాక్టర్లు మంచిగా చూసి ‘సాధారణ కాన్పు చేపించుకో’అన్నారు. పైసా ఖర్చులేదు, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, అమ్మఒడి వాహనంలో మా ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా. సర్కారు దవాఖానలో సకల సౌలత్లు ఉన్నాయ్.. కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికే రావాలి.. నాకు జరిగిన మేలు అందరికి జరగాలే.. ఇట్లు.. శామంతుల వసంత’అని లేఖలో పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకొని.. సాధారణ కాన్పులు చేపించుకోవాలని, తన బిడ్డకు జరిగిన మేలు అందరికీ జరగాలని ఒక మంచి సందేశం ఇచ్చిన వసంత ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లపాపలతో వర్ధిల్లాలి. ఈ ఉత్తరం ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగిస్తుంది. – మంత్రి హరీశ్‌రావు సారుకు చేరుతుందని అనుకోలే.. మా బిడ్డ చిన్న వయసుది. కోనరావుపేట మల్కపేటకు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేసినం. తొలిచూరు కాన్పు తల్లిగారే చేయాలి కాబట్టి సిరిసిల్ల దవాఖానాకు తీసుకపోయిన. నార్మల్ డెలివరీ అయింది. మాకు జరిగిన మేలు పది మందికి తెలువాలే అని సారుకు మా బిడ్డ శిరీషతో ఉత్తరం రాయించిన. అది సారుకు చేరుతుందని అనుకోలే. ప్రైవేటు దావాఖానాకు పోతే ఎంత లేదన్నా రూ.40వేలు అయ్యేది. మా ఉత్తరానికి మంత్రి స్పందించడం సంతోషంగా ఉంది. – వసంత, చింతలఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ -
వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే..
సాక్షి, కరీంనగర్‌క్రైం: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కరీంనగర్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని భగత్‌నగర్‌కు చెందిన తాండ్ర పాపారావు–పద్మల కుమారుడు ప్రణీత్‌కు నిజామాబాద్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఈ దంపతులు అమెరికాలో ఉంటున్నారు. వీరికి నాలుగు నెలల క్రితం బాబు జన్మించాడు. అప్పటినుంచి తమ మనవడిని చూడాలని పాపారావు–పద్మ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీసా పనిమీద ఆదివారం కారులో హైదరాబాద్ బయలుదేరారు. కానీ విధి వక్రీకరించడంతో మల్లారం వద్ద డివైడర్ పైకి దూసుకెళ్లిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో మనవడిని నేరుగా చూడకుండానే మృత్యుఒడికి చేరుకున్నారు. వీరితోపాటు కారు డ్రైవర్ గుంటి ఆంజనేయులు కూడా మృతిచెందాడు. ఎంతో మంది విద్యార్థులకు మార్గనిర్దేశకుడు.. కామర్స్ అధ్యాపకుడైన పాపారావు తొలుత నిర్మల్‌లో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల, జగిత్యాల ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్‌గా, అగ్రహారంలో, చివరకు కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలల్లో బోధించాడు. ఒక ఏడాదిపాటు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. 2016లో ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలలో ఉద్యోగ విరమణ పొందాడు. వేలాది మంది విద్యార్థులకు పాఠాలు బోధించి, వారికి మార్గనిర్దేశకుడిగా మారారు. పాపారావు భార్య పద్మ ఆరేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధితో ఏడాదిపాటు పోరాడి, కోలుకున్నారు. అప్పుడు అండతో మృత్యువును గెలిచినా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దంపతులిద్దరూ ఇద్దరు వైష్ణవ భక్తులు. వీరు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు. పాపారావు కుమారుడు ప్రణీత్ అమెరికా నుంచి బయలుదేరాడు. సోమవారం రాత్రి వరకు ఇంటికి చేరనున్నాడు. మంగళవారం తల్లిదండ్రుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. చదవండి: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ ఆంజనేయులుది నాగుల మల్యాల స్వగ్రామం. సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆంజనేయులు గతంలో చాలాసార్లు పాపారావును ట్యాక్సీలో తీసుకెళ్లినట్లు సమాచారం. -
Sircilla Weavers: అంచు చీరలే ఆ‘దారం’
► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు. ► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్‌కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్‌లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు. నేరుగా నూలు కొనుగోలు చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే.. కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.