
సిరిసిల్ల: కరోనా నియంత్రణలో భాగంగా భౌతిక దూరం పాటించడం ఇప్పుడు అనివా ర్యమైంది. కొందరు ఆదమరిచి సమీపిస్తే అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డును సిరిసిల్ల విద్యార్థిని స్నేహ రూపొందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్నేహ ఎలక్ట్రానిక్ సెన్సార్ ఐడెంటిటీ కార్డును తయారు చేశారు. ఆ కార్డును ధరించి మనం ఎటువెళ్లినా మీటర్ దూరం ఉండగానే ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి, మన దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే ఐడీ కార్డు బీప్ సౌండ్ చేస్తుంది. దీంతో అప్రమత్తమై భౌతిక దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్S చదువుతున్న స్నేహ ఇప్పటికే సెన్సార్ స్మార్ట్‌వాచ్ రూపొందించి పలువురి అభినందనలు పొందారు. ఇప్పుడు అప్రమత్తం చేసే ఐడీ కార్డు రూపొందించి పలువురి మన్ననలు పొందారు.