invented
-
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్ కేన్సర్‌ని జయించాడు!
కేన్సర్ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్ రిచర్డ్ స్కోలియర్ బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్ ..తన స్నేహితుడు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్ ట్రయల్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్ లాంగ్ అన్నారు. (చదవండి: 'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?) -
అమ్మమ్మలకు అండగా.. మతిమరుపుతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ సొల్యూషన్
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్‌స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు. వృద్ధులకు సహాయం.. హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది. అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్‌గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్‌లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్‌ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు. పరికరం ఎలా పనిచేస్తుందంటే.. ఈ పరికరం వాచ్‌లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్‌బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది. ‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్‌తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్లను పొందాడు. – నిర్మలారెడ్డి -
పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
-
ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు సమర్పించవచ్చ ని బార్‌కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత ఏ తేదీన వారికి ఎన్రోల్మెంట్ ఉంటుందో తెలియజేస్తామని, ఆరోజున మాత్రమే బార్ కౌన్సిల్‌కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. కార్యదర్శి రేణుక పదవీ విరమణ బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్.రేణుక శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 32 ఏళ్లుగా ఆమె బార్ కౌన్సిల్‌కు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంగా రామారావు, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బార్ కౌన్సిల్ కార్యదర్శిగా వి.నాగలక్ష్మిని నియమించారు. -
అమ్మమ్మ కష్టంలోంచి పుట్టిన ఆలోచన, ప్రధాని ప్రశంస
సాక్షి, బంజారాహిల్స్: అమ్మమ్మ పడుతున్న అవస్థలను చూసిన ఆ బాలుడి మనసు కరిగిపోయింది. ఆ కష్టాలకు చెక్ పెట్టాలన్న ఆలోచన పుట్టింది. అల్జీమర్ వ్యాధితో తన అమ్మమ్మలాగే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా బాధపడుతున్నారని తెలుసుకున్న ఆ బాలుడు పరిష్కారం చూపాలని మూడేళ్లు కష్టపడి మొత్తానికి అందులో విజయం సాధించాడు. ⇔ జుబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చదలవాడ హిమేష్ అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారి ఆరోగ్య పరిరక్షణకు స్మార్ట్ వాచ్ కనిపెట్టి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డ్–2021ను గెలుచుకున్నాడు. ⇔ గుంటూరుకు చెందిన హిమేష్ తండ్రి కిశోర్‌కుమార్ ఆడియో ఇంజినీర్ కాగా, తల్లి సంధ్య గృహిణి. ⇔ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన హిమేష్ ఈ యంత్రాన్ని కనిపెట్టడంలో చేసిన కృషికి సోమవారం ప్రధాన మంత్రి నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌కు కూడా హిమేష్ హాజరయ్యాడు. వృద్ధులను, వికలాంగులను పర్యవేక్షించడానికి స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ తోడ్పడుతుందని హిమేష్ తెలిపాడు. ⇔ ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లలో ఒక వ్యక్తి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, అందులో మా అమ్మమ్మ కూడా ఒకరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రోగులందరికీ ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పాడు. ⇔ ఈ పరికరాన్ని అల్జీమర్స్ రోగులు ధరిస్తారని, ఇది వారి ఆరోగ్య స్థితిని పరిరక్షించడమే కాకుండా సంచారం, పల్స్, బీపీ వంటి రోగాలను గురించి తెలియజేస్తుందని తెలిపారు. రోగికి ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైతే ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా ఆ సమాచారాన్ని పంపుతుందన్నాని వివరించాడు. ⇔ అల్జీమర్స్ వ్యాధి సోకిన వారి ఆరోగ్య పరిరక్షణ కోసం స్మార్ట్ వాచ్ కనిపెట్టిన చదలవాడ హిమేష్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ సోమవారం సత్కరించి బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను అభినందించారు. -
అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డు
సిరిసిల్ల: కరోనా నియంత్రణలో భాగంగా భౌతిక దూరం పాటించడం ఇప్పుడు అనివా ర్యమైంది. కొందరు ఆదమరిచి సమీపిస్తే అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డును సిరిసిల్ల విద్యార్థిని స్నేహ రూపొందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్నేహ ఎలక్ట్రానిక్ సెన్సార్ ఐడెంటిటీ కార్డును తయారు చేశారు. ఆ కార్డును ధరించి మనం ఎటువెళ్లినా మీటర్ దూరం ఉండగానే ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి, మన దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే ఐడీ కార్డు బీప్ సౌండ్ చేస్తుంది. దీంతో అప్రమత్తమై భౌతిక దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్S చదువుతున్న స్నేహ ఇప్పటికే సెన్సార్ స్మార్ట్‌వాచ్ రూపొందించి పలువురి అభినందనలు పొందారు. ఇప్పుడు అప్రమత్తం చేసే ఐడీ కార్డు రూపొందించి పలువురి మన్ననలు పొందారు. -
ఇంటర్ పరీక్షా కేంద్రాల వివరాలకు ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 4 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనుండగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బోర్డు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘టీఎస్‌బీఐఈ ఎం–సర్వీసెస్’యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, దానిద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఒకట్రెండు రోజుల ముందే కేంద్రానికి వెళ్లి, తామున్న ప్రాంతం నుంచి ఎంత సమయంలో అక్కడికి చేరుకుంటామో యాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్ అధికారిని నియమించామని తెలిపారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, 25,550 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో పాల్గొననున్నారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 4,80,516 మంది మొదటి సంవత్సరం, 4,85,323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షకు హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. -
మేడారం జాతరకు రండి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వానించారు. బుధవారం ప్రగతిభవన్ లో వారు సీఎంను కలసి ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మేడా రం జాతర పోస్టర్, సీడీని ఆవిష్కరించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎం మంత్రులను కోరారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను కడియం ముఖ్యమంత్రికి వివరించారు. ‘‘2016లో మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.140 కోట్లు, ఈ సారి రూ.80 కోట్లు మంజూరు చేశారు. వీటితో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాం. భూపాలపల్లి, పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వచ్చే మూడు ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చాం. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాం’’అని కడియం వివరించారు. -
ప్రాణాంతక చర్మ కేన్సర్‌కు మందు
వాషింగ్టన్: ప్రాణాంతక చర్మ కేన్సర్‌ను నయం చేసే మందును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి లొంగని మెలనోమా వంటి తీవ్రమైన కేన్సర్‌ను కూడా ఎస్బీఐ-756 అనే కొత్త డ్రగ్ నయం చేస్తుందని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ బర్నమ్ ప్రెబీస్ మెడికల్ డిస్కవరి ఇనిస్టిట్యూట్‌కు చెందిన జీవ్ రొనాయ్ తెలిపారు. సాధారణంగా ప్రతికణంలోని సెల్యులార్ రైబోజోమ్స్.. ప్రొటీన్‌ను తయారు చేస్తాయి. కానీ కేన్సర్ కణాలు ప్రొటీన్ తయారీతోపాటు కణతులు పెరిగేందుకు దోహదపడతాయి. ఈ ఎస్బీఐ-756 అనే డ్రగ్ ట్యూమర్ మెలనొమా కణాల అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటుందని రొనాయ్ తెలిపారు. ఇప్పుడున్న మందులు కేవలం ట్యూమర్‌ను తగ్గించేందుకే పనిచేస్తున్నాయని.. కేన్సర్ కణాల పురోగతిని అడ్డుకోవట్లేదన్నారు. ప్రస్తుతమున్న మందుతో ఎస్బీఐ-756ను కలిపి వాడటం వల్ల కణతులు తగ్గటంతోపాటు మెలనోమా అభివృద్ధిని అడ్డుకోవచ్చా అనే దానిపై తదుపరి పరిశోధనలు చేస్తున్నట్లు రోనాయ్ తెలిపారు.