వాషింగ్టన్: ప్రాణాంతక చర్మ కేన్సర్‌ను నయం చేసే మందును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి లొంగని మెలనోమా వంటి తీవ్రమైన కేన్సర్‌ను కూడా ఎస్‌బీఐ-756 అనే కొత్త డ్రగ్ నయం చేస్తుందని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ బర్నమ్ ప్రెబీస్ మెడికల్ డిస్కవరి ఇనిస్టిట్యూట్‌కు చెందిన జీవ్ రొనాయ్ తెలిపారు.
సాధారణంగా ప్రతికణంలోని సెల్యులార్ రైబోజోమ్స్.. ప్రొటీన్‌ను తయారు చేస్తాయి. కానీ కేన్సర్ కణాలు ప్రొటీన్ తయారీతోపాటు కణతులు పెరిగేందుకు దోహదపడతాయి. ఈ ఎస్‌బీఐ-756 అనే డ్రగ్ ట్యూమర్ మెలనొమా కణాల అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటుందని రొనాయ్ తెలిపారు. ఇప్పుడున్న మందులు కేవలం ట్యూమర్‌ను తగ్గించేందుకే పనిచేస్తున్నాయని.. కేన్సర్ కణాల పురోగతిని అడ్డుకోవట్లేదన్నారు.
ప్రస్తుతమున్న మందుతో ఎస్‌బీఐ-756ను కలిపి వాడటం వల్ల కణతులు తగ్గటంతోపాటు మెలనోమా అభివృద్ధిని అడ్డుకోవచ్చా అనే దానిపై తదుపరి పరిశోధనలు చేస్తున్నట్లు రోనాయ్ తెలిపారు.