Skin Cancer
-
బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్‌స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్‌ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్‌ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు. -
కేన్సర్‌పై యువతి పోరు : ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో
ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని కేన్సర్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. ముందుగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలావరకు ప్రమాదం తప్పుతుంది. ఇది తెలియక చాలామంది ఆందోళనలో పడిపోతారు. తాజాగా చర్మ కేన్సర్ బారినపడి కోలుకున్న ఒక యువతి ఈ ధైర్యాన్నిస్తోంది. తీవ్రమైన మెలనోమా బారిన పడి కోలుకున్నతన జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేన్సర్ బాధల నుంచి కోలుకున్న వైనాన్ని రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన అలోండ్రా సియెర్రా టిక్‌టాక్‌లో స్కిన్ క్యాన్సర్ బారిన పడింది. గత ఏడాది కాలంగా చికిత్సలు, ఆపరేషన్లను అచంచలమైన ధైర్యంతో ఎదుర్కొంది. అంతేకాదు తనలాంటి వారికి అవగాహన కల్పించేందుకు, బలాన్నిచ్చేందుకు తాను అనుభవించిన బాధలను పంచుకుంటూ ఒక పవర్ఫుల్ సందేశాన్ని ఇవ్వడం విశేషం. వయస్సు, జెండర్, లేదా చర్మం రంగుతో సంబంధం లేకుండా ఎవరినైనా దాడి చేసే మెలనోమా అత్యంత తీవ్రమైనదని ఇది చాలా త్వరగా విస్తరిస్తుందని కూడా హెచ్చరించింది. తగిన శ్రద్ధతో చికిత్స తీసుకోవాలని సూచించింది. తన జుట్టును షేవ్ చేసుకోవడం నుండి మళ్లీ పొడవాటి జుట్టు దాకా, తీవ్రమై అలసట నుంచి పూర్తి ఆరోగ్యం దాకా ఇలా మొత్తం జర్నీని రికార్డు చేసింది. ‘‘నేను ముందుకు సాగడానికి తగిన శక్తిని వచ్చిన దేవునికి ధన్యవాదాలు’’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు అందించారు. అదృష్టవంతురాలు, ఆమె చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. క్రేజీ క్లిప్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. Woman with cancer records her recovery process pic.twitter.com/aJxSLI398z — Crazy Clips (@crazyclipsonly) March 7, 2024 -
సబ్బుతో స్కిన్ క్యాన్సర్‌కి చెక్..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ
క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. బాగా డబ్బుంటే విదేశాల్లో పేరుగాంచిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడుతుంటారు ప్రముఖులు, సెలబ్రెటీలు. అలాంటి భయానక క్యాన్సర్ వ్యాధుల్లో ఒకటి ఈ స్కిన్ క్యాన్సర్. అలాంటి స్కిన్ క్యాన్సర్‌ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్. ఈ ఆవిష్కరణతో ఆ యువ శాస్త్రవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరా టీనేజర్? ఏమిటా ఆవిష్కరణ..?. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే స్కిన్ క్యాన్సర్‌ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. అది కూడా తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/-. ఈ సరికొత్త ఆవిష్కరణగానూ ఆ బాలుడు టాప్ యంగ్ సైంటిస్ట్‌గా అవార్డును గెలుచుకున్నాడు. ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండేలా ఆ బాలుడు లాభప్రేక్షలేని ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్ మహ్ఫుజా అలీ సాయం చేశారు. బెకెలేకి జీవశాస్త్రం, సాంకేతికపై మంచి ఆసక్తి. ఇదే ఈ ఆలోచనకు పురిగొల్పింది. అదే అతడిని యూఎస్‌లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్‌లో అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీనికి ఈ ఛాలెంజ్ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పుకొచ్చాడు. ఇక బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్. ఈ సోప్ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. అదీగాక ఇంతవరకు మార్కెట్లో స్కిన్ క్యాన్సర్‌కి సంబంధించి క్రీమ్‌లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయని, సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్ ఛాలెంజ్ ప్రెజెంటేషన్ ప్యానల్ వివరించాడు బెకెలే. సమాజానికి తన వంతుగా సాయం అందించేలా ఈ స్కిన్ క్యాన్సర్‌ని అతి తక్కువ ఖర్చుతోనే జయించేలా తాను కనుగొన్న ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నానని ప్యానెల్ సభ్యులకు వివరించాడు బెకెలే. (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఛాతిపై ఉండే శరీరంపై గాయం ఏర్పడింది. అది క్రమంగా క్యాన్సర్ మారింది. దీంతో ఫిబ్రవరిలో వైద్యలు బైడెన్ చికిత్స అందించి ఆ క్యాన్సర్ కణజాలన్ని విజయవంతంగా తొలగించారు. తదుపరి ఇక ఎలాంటి చికిత్స అవసరం లేదని వైట్‌హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ ఓ లేఖలో తెలిపారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్‌కి సంబంధించిన సాధారణ రూపం అని పేర్కొన్నారు. బైడెన్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా చర్మసంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని కూడా చెప్పారు. గత నెల వైద్యులు జోబైడెన్(80) శారీర పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ఆ సమయంలోనే అతని ఛాతీపై ఉన్న చర్మసంబంధ గాయాన్ని తొలగించి బయాప్సీకీ(ల్యాబ్ పరీక్షలకి) పంపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ వైద్యుడు ఓ కానర్ లేఖలో ఆ విషయం గురించే చెప్పుకొచ్చారు. ల్యాబ్ పరీక్షల అనంతరం ఆ బేసల్ కార్సినోమా గాయాలు భవిష్యత్తులో వ్యాప్తి చెందే అవకాశం లేదని, ఇక ఏవిధమైన భయం అవసరం లేదని అన్నారు. ఇక ముందు ముందు దానికి సంబంధించి ఎలాంటి చికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆయన 2024లో అధ్యక్ష రేస్‌లో దిగేందుకు సిద్ధమవుతున్నందున బైడెన ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఆమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ కూడా చెప్పడం విశేషం. (చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్) -
Health: చర్మం మీద మార్పులు.. క్యాన్సర్ సూచన కావొచ్చు! కణతి, పుట్టుమచ్చ.. ఏదైనా..
చాలామంది ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు, స్కిన్‌ట్యాగ్స్ కనిపించగానే క్యాన్సరేమోనని ఉలిక్కిపడుతుంటారు. అందుకే స్కిన్ క్యాన్సర్‌పై అవగాహన పెంపొందిచడానికి ఈ వివరాలు మీకోసం... టీనేజ్‌లో, అటు తర్వాత... హార్మోన్ల అసమతౌల్యత వల్ల చర్మంలోని నూనె గ్రంథులు (సెబేషియస్ గ్లాండ్స్) ‘సీబమ్’ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల జిడ్డుతనం ఎక్కువై మొటిమల వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అది క్యాన్సర్ కారకం కాదు! అవి తీవ్రంగా ఉన్నప్పుడు మచ్చలు, గుంటలు ఏర్పడుతూ ఉంటాయి. హెచ్‌పీవీ వైరస్ వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా, మరి కొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి, మరింతగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) క్యాన్సర్ కారకం కాదు. లైంగిక చర్యల వల్ల మర్మావయవాల వద్ద వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. అయితే హెచ్‌పీవీ 16, 18 మొదలైన వైరస్ రకాలను అంకోవైరస్లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎలాంటి పులిపిరులను కలగజేయవు. కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. అధికబరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులో వారికైనా కనిపించే స్కిన్‌ట్యాగ్స్ వల్ల సాధారణంగా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఇలాంటి లక్షణాలుంటే అయితే అవి పెద్దసైజులో ఉండి, బయటకు కనిపించే భాగాల్లో ఉంటే తీసివేయించుకోవడమే మంచిది. మామూలుగా పెసరగింజంత ఉండే ఈ స్కిన్‌ట్యాగ్స్ ఒక్కోసారి గోల్ఫ్‌బాల్ సైజుకూ పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించి, స్కిన్క్యాన్సర్కు దారితీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా... 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి, అవి సరైన ఆకారంలో లేకుండా, రంగుమారుతూ, రక్తం స్రవిస్తూ, ఉబ్బెత్తుగా ఉంటే... క్యాన్సరేమోనని అనుమానించాల్సి ఉంటుంది. వాటిని అనుమానించాల్సిందే శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ట్టిష్యూలతో ఏర్పడే కొవ్వు గడ్డలనే లైపోమా అంటారు. ఎడిపోజ్ టిష్యూలతో ఏర్పడే ప్రమాదకరం కాని ఈ గడ్డలు... శరీరం లోపలి భాగాల్లో కూడా ఏర్పడితే జాగ్రత్తగా గమనించాలి. చర్మం కిందగానీ, రొమ్ముల్లోగానీ, గడ్డలు మెత్తగా కదులుతూ, కొద్దివారాలుగా ఎలాంటి మార్పులేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ... మనం చేతితో తాకినప్పడు గట్టిగా రాయిలాగా ఉండటం, గడ్డలో ఏవైనా మార్పులు గమనిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వాటిని అనుమానించాలి. గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు ఎటువంటి నొప్పినీ కలగజేయవు. క్యాన్సర్ కణుతులు కూడా తొలిదశలో అస్సలు నొప్పి ఉండవు. కానీ పెరిగేకొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల తీవ్రమైన నొప్పిని కలగజేయటంతో పాటు చికిత్సకు అంత తొందరగా లొంగవు. 90 శాతం అవే! మన దేశాలలోని ప్రజల శరీరాలలో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని చెప్పవచ్చు. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్ ప్రధానంగా ‘బేసల్‌సెల్ కార్సినోమా’, ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అని రెండు రకాలుగా ఉంటుంది. దాదాపు 90 శాతం బేసల్‌సెల్ కార్సినోమా రకానికి చెందినవే ఉంటాయి. మనదేశంలో కూడా ‘నాన్ మెలనోమాస్కన్ క్యాన్సర్’ పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. పరీక్షలు చేయంచుకోవడం మంచిది యాభై ఏళ్లు పైబడ్డాక కనిపించే ఈ క్యాన్సర్స్... అల్ట్రావయొలెట్ కిరణాలు (యూవీ రేస్) ఎక్కువగా ఉన్న పాశ్చాత్యదేశాలలో శరీరాన్ని ట్యాన్ చేయడానికి ఉపయోగించే ట్యాన్బూత్స్వల్ల, బాగా తెల్లగా ఉన్నవారిలో, నీలం రంగు కళ్లు ఉన్నవారిలో, పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. శరీరం మీద ఎక్కడైనా...అంటే... ముఖ్యంగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే శరీరభాగాల్లో చర్మం రంగుమార్పుతో పాటు మాననిపుండు, స్కిన్ప్యాచ్లా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయంచుకోవడం మంచిది. పూతమందుగా కీమోథెరపీ స్కిన్క్యాన్సర్స్ చాలావరకు 100% నయమవుతాయి. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిలిగి ఉన్న క్యాన్సర్ కణాలనూ చంపివేయడానికి క్రయోవిధానంలో లేదా లేజర్‌తో చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్, కీమోథెరపీలను అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది. క్యాన్సర్ వచ్చిన భాగంలో మాత్రమే ఆయింట్మెంట్ రూపంలో పూతమందుగా కీమోథెరపీనీ ఇస్తారు. సర్జరీ చేసి... చర్మాన్ని చాలా ఎక్కువగా తొలగించాల్సి వచ్చినప్పుడు ఇతర భాగాలనుంచి చర్మాన్ని సేకరించి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్ చేస్తారు. ►ఎండ నేరుగా తగిలే భాగాల్లో పైపూతగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ►శరీరాన్ని బాగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ►ఎండకు వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించడం, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం ►వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే ఎండలో బయటకు తిరగకుండా ఉండటంవంటి జాగ్రత్తలు పాటిస్తే స్కిన్క్యాన్సర్ను కొంతవరకు దూరంగా ఉంచగలిగినవాళ్లం అవుతాం. కేవలం క్యాన్సర్ నివారణ కోసం మాత్రమే కాకుండా సాధారణ చర్మ సంరక్షణకు ఈ జాగ్రత్తలు ఉపయోగపడతాయి. -డా. సీహెచ్. మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ చదవండి: Health: పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! పిల్లలు పుట్టే అవకాశాలు!? Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే -
బీచ్‌లో ఒకేసారి 2500 మంది ఫొటో షూట్.. ఎందుకో తెలుసా?
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంత మంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో ఏకంగా 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్‌పై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో, చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద శనివారం ఉదయం సుమారు 2500 మంది ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో, వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. BREAKING: #BNNAustralia Reports. In an effort to raise awareness about skin cancer, over 2,500 people got nude on Saturday to pose for Spencer Tunick, U.S. photographic artist at Sydney's Bondi Beach, in Australia. #Australia #Sydney #Cancer #Health #Photoshoot pic.twitter.com/v2Uwdzse6a — Gurbaksh Singh Chahal (@gchahal) November 26, 2022 -
చర్మం మీద మార్పులతో... క్యాన్సర్స్
మన శరీరంలోని అతి పెద్ద అవయవం మన చర్మం. శరీరాన్నంతటినీ కప్పి రక్షణ కవచంలాగా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ నీటిని, కొవ్వును నిల్వ ఉంచుతూ... విటమిన్ ‘డి’ తయారీకి ఉపయోగపడుతుంది. చర్మానికి వచ్చే ఇతర సమస్యలతో పాటు చర్మ క్యాన్సర్... నివారణ పద్ధతులు, చికిత్సలాంటి అంశాలను తెలుసుకుందాం. చర్మం పైన హెచ్‌పీవీ వైరస్ వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా మరికొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) క్యాన్సర్ కారకం కాదు. అలాగే సెక్సువల్ కాంటాక్ట్స్ వల్ల మర్మావయవాల వద్ద వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. కానీ... హెచ్‌పీవీ 16, 18 మొదలైన వైరస్ రకాను అంకోవైరస్లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎలాంటి పులిపిరికాయలను కలగజేయవు గానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. అధిక బరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులోవారికైనా కనిపించే స్కిన్‌ట్యాగ్స్ వల్ల సాధారణంగా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ అవి పెద్దసైజులో ఉండి, బాగా బయటకు కనిపించే భాగాల్లో ఉంటే తీసివేయించుకోవడమే మంచిది. సాధారణంగా పెసర గింజంత ఉండే ఈ స్కిన్‌ట్యాగ్స్ గోల్ఫ్‌బాల్ సైజుకూ పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించి, స్కిన్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా... 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి అవి సరైన ఆకారంలో లేకుండా రంగుమారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది. శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ట్టిష్యూలతో ఏర్పడే కొవ్వు గడ్డలనే లైపోమా అంటారు. ఇవి అక్కడక్కడ ఒకటీ రెండూ లేదా శరీరమంతా ఉండవచ్చు. ఎడిపోజ్ టిష్యూలతో ఏర్పడే ఈ ప్రమాదకరం కాని ఈ గడ్డలు... ఒకవేళ శరీరం లోపలి అవయవాల మీద కూడా ఏర్పడితే జాగ్రత్తగా గమనించాలి. చర్మం కిందగానీ, రొమ్ములోగానీ, గడ్డలు మెత్తగా కదులుతూ, కొద్దివారాలుగా ఎలాంటి మార్పులేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ... మనం చేతితో తాకినప్పడు గట్టిగా రాయిలాగా ఉండటం, గడ్డలో ఏవైనా మార్పులు గమనిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వాటిని అనుమానించాలి. రంగు మారడం కనిపిస్తే జాగ్రత్త: గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు ఎటువంటి నొప్పినీ కలగజేయవు. క్యాన్సర్ కణుతులు కూడా తొలిదశలో అస్సలు నొప్పి ఉండవు. కానీ పెరిగే కొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల తీవ్రమైన నొప్పిని కలగజేయటంతో పాటు చికిత్సకు అంత తొందరగా లొంగవు. శరీరం మీద ఎక్కడైనా... అంటే... ముఖ్యంగా ఎండకు గురయ్యే శరీరభాగాల్లో చర్మం రంగులో మార్పుతో పాటు మానని పుండు, స్కిన్ప్యాచ్లా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయంచుకోవడం మంచిది. మన దేశవాసుల్లో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్ ప్రధానంగా ‘బేసల్‌సెల్ కార్సినోమా’, ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అని రెండు రకాలుగా ఉంటుంది. దాదాపు 90 శాతం బేసల్‌సెల్ కార్సినోమా రకానికి చెందినవే ఉంటాయి. చికిత్స: స్కిన్క్యాన్సర్స్ దాదాపు 100 శాతం నయమవుతాయి. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలనూ చంపివేయడానికి క్రయోవిధానంలో లేదా లేజర్‌తో చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్, కీమోథెరపీలను అవసరాన్ని బట్టి ఇస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగంలో మాత్రమే ఆయింట్మెంట్ రూపంలో పూతమందుగా కీమోథెరపీనీ ఇస్తారు. సర్జరీ చేసి చర్మాన్ని చాలా ఎక్కువగా తొలగించాల్సివచ్చినప్పుడు... ఇతర భాగాలనుంచి చర్మాన్ని సేకరించి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్ చేస్తారు. నివారణ ఇలా... ఎండ నేరుగా తగిలే భాగాల్లో పై పూతగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం, శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులూ, ఎండలోకి వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులూ, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం, వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే ఎండలో బయటకు తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ క్యాన్సర్‌ను కొంతవరకు దూరంగా ఉంచగలిగినవాళ్లం అవుతాం. క్యాన్సర్ నివారణకే గాక ... మామూలుగా కూడా చర్మసంరక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. -డా. సీహెచ్ మోహన వంశీ -
మైకేల్ క్లార్క్ భావోద్వేగ సందేశం
సిడ్నీ: గత కొన్నేళ్లుగా క్యాన్సర్ కౌన్సిల్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. తాను స్కిన్ క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తూ యువ క్రికెటర్లకు భావోద్వేగ సందేశం ఇచ్చాడు. యువకులు ఎవరూ స్కిన్ బారిన పడకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. దానిలో భాగంగా క్యాన్సర్ బారిన పడి చికిత్స చేయించుకున్న తర్వాత తన నుదుటిపై ఉన్న కుట్లును చూపిస్తూ ఒక ఫోటో షేర్ చేశాడు. ఇందుకు ఒక సందేశాత్మక క్యాప్షన్‌ను జోడించాడు. ‘మరొక రోజు.. నా ముఖానికి మరో స్కిన్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. యువకులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. మీరు మీ శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకుంటారనే అనుకుంటున్నా’ అని క్లార్క్ పేర్కొన్నాడు. 2006లో క్లార్క్‌కు తొలిసారి స్కిన్ క్యాన్సర్ రావడంతో అప్పట్లోనే చికిత్స చేయించుకున్నాడు. తాజాగా అతని నుదుటిపై క్యాన్సర్ కణుతులు రావడంతో వాటిని సర్జరీ ద్వారా తొలగించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు క్లార్క్. ఆసీస్ యువకులు తమ శరీరాన్ని వారే సూర్యకాంతి నుంచి రక్షించుకోవాలని స్మిత్ ప్రధానంగా సూచించాడు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ శాతం చాలా ఎక్కువ. 2016లో స్కిన్ క్యాన్సర్ బారిన పడి 1960 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్ ఆసీస్ క్రికెట్ జట్టును నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను క్లార్క్ అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం క్రికెట్ గుడ్ బై చెప్పాడు క్లార్క్. View this post on Instagram Another day, another skin cancer cut out of my face... youngsters out there make sure you are doing all the right things to protect yourself from the sun ☀️🕶🎩 A post shared by Michael Clarke (@michaelclarkeofficial) on Sep 6, 2019 at 4:49pm PDT -
కేన్సర్ పంట!
అన్నదాతలు కోటి ఆశలతో పంట పెడతారు. ఆరుగాలం అష్టకష్టాలూ పడి పంట పండిస్తారు. చీడపీడల నుంచి రక్షణకు పురుగు విషాలు పిచికారీ చేస్తారు. కాలంతోపాటు పురుగుల్లోనూ మార్పొచ్చింది..వాటిని మట్టుబెట్టడానికి ఒకటికి పదిసార్లు ‘సిస్టమిక్’ విషాలు చల్లుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోతోంది. పురుగు విషాలు పచ్చని పల్లెల గాలిని, నీటిని, భూమిని విష కాసారాల్లా మార్చేస్తున్నాయి. రైతులు పంటల మీద చల్లుతున్న విషరసాయనాలు కేన్సరై వారినే కాటేస్తున్నాయి.. చిత్తూరు జిల్లా ఈడిగపల్లె పంచాయతీ గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. గత ఏడాదిలోనే 15 మంది చనిపోయారు. చెన్నై, బెంగళూరు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కేన్సర్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ భయానక పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఈడిగపల్లె పంచాయతీ చిత్తూరు–మదనపల్లె హైవేలో ఉంది. అక్కడి భూములు సారవంతమైనవే. గత ముప్పయ్యేళ్లుగా టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజి, వరి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈడిగపల్లె పంచాయతీలోని చిలకావారిపల్లె, ఆవులోళ్లపల్లె, నేతిగుట్లపల్లె, యర్రగుంట్లపల్లె తదితర గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గత ఏడాది కాలంలోనే రైతు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది మహిళలు, పురుషులు కేన్సర్ కారణంగా చనిపోయారు. పదుల సంఖ్యలో బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. 80–90 ఏళ్లు వరకు ఆరోగ్యవంతులుగా జీవించిన పల్లెవాసులు నేడు 50–60 ఏళ్లలోపే క్యాన్సర్ బారిన పడి నేలరాలుతున్నారని కొందరు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదకరంగా పురుగుమందుల పిచికారీ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలకు నాలుగైదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేయడం వరకూ వెళ్లింది. అంతకన్నా ప్రమాదకరమైన సంగతేమిటంటే.. పురుగుమందులు పిచికారీ చేసే టప్పుడు ఒక్కరు కూడా ముఖానికి గుడ్డ కూడా అడ్డం కట్టుకున్నట్లు కనపడలేదు. ఈ గ్రామాల్లో రైతులు సాధారణంగా 4–7 రోజుల వ్యవధిలో ఒక సారి పురుగుమందు పిచికారీ చేయిస్తుంటారు. మొత్తం పంట కాలంలో 15–20 సార్లు పిచికారీ చేస్తున్నట్లు అంచనా. టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించడానికి కూడా ప్రత్యేక మందులు పిచికారీ చేస్తున్నట్లు ఒక రైతు చెప్పారు. టమాటా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు రసాయనిక పురుగుమందుల పిచికారీ కూడా బాగా తక్కువగా కొడతారని ఒక రైతు తెలిపారు. కొందరు రైతులు స్ప్రింక్లర్ల ద్వారా కూడా పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినప్పుడు ఒంటిపై పడకుండా జాగ్రత్తపడే పరిస్థితి కూడా లేదు. చీడపీడలను సహజ పద్ధతుల్లో అదుపులో ఉంచడానికి దోహదపడే అంతర పంటలు, ఎర పంటలు, సరిహద్దు పంటలు వేయడం, ఎర అట్టలు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులు అక్కడ అసలు కనపడలేదు. ఇలా.. పురుగుమందులను ప్రమాదకరంగా వాడటంతోపాటు.. అధిక రసాయనిక అవశేషాలతో కూడిన కూరగాయలనే వారూ తింటున్నారు. ఎకరానికి 20 బస్తాలకు పైగా ఎరువులు.. కర్ర ఊతం లేకుండా టమాటా సాగు చేసే రైతులు కూడా ఎకరానికి రూ. 60 వేలు ఖర్చు పెట్టి.. 10 వేల నుంచి 15 వేల కిలోల వరకు దిగుబడి తీస్తున్నారు. స్టేకింగ్(కర్ర ఊతం) పద్ధతిలో ఏకపంటగా, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్‌తో టమాటా సాగు చేస్తున్నారు. అధికోత్పత్తి సాధించే లక్ష్యంతో ఎకరానికి 20 నుంచి 50 బస్తాల(బస్తా 50 కిలోలు) వరకు రసాయనిక ఎరువులు వేస్తున్నట్లు తెలిసింది. ఎకరానికి 25 వేల కిలోల నుంచి 30 వేల కిలోల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఎరువులు, పురుగుమందులతో కలుపుకొని ఎకరానికి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పిచికారీ చేసే రసాయనాలలో కేవలం 8 శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతుందని అంచనా. మిగిలిన 92 శాతం పురుగుమందు గాలిలో, నీటిలో, భూమిలో కలిసి మనం తినే ఆహారం, పీల్చే గాలిలో ప్రకృతిలో కలిసిపోయి.. ముఖ్యంగా స్థానిక గ్రామీణ ప్రజల వినాశనానికే దారి తీస్తున్నది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం రెండు, మూడు పంటలు కలిపి మిశ్రమ సేద్యం చేసేవారు. 15 ఏళ్ల నుంచి అయితే టమాటా లేదా కాళీఫ్లవర్ వంటి ఏదో ఒకే పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి ‘సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్’ విచ్చలవిడిగా చల్లుతున్నారని మదనపల్లెకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు. బూడిద, పుల్లటి మజ్జిగ, గోమూత్రంతో కషాయాలు వాడుతుంటే చీడపీడల సమస్య ఉండటం లేదన్నారు. తాము సూచించిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.నీటిని, గాలిని, భూమిని విషపూరితం చేసి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. రైతులు మొదట తాము తినే పంటలనైనా సేంద్రియ పద్ధతుల్లో పండించుకోవడంపై దృష్టిపెట్టడం అత్యవసరమని సూచిస్తున్నారు. మా ఇంట్లో ముగ్గురికి కేన్సర్ వచ్చింది.. మా ఇంటిలో అమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న ముగ్గురూ కేన్సర్ వ్యాధికి గురయ్యారు. అమ్మ 7 నెలల క్రితం చనిపోయింది. చిన్నాన్న, పెద్దనాన్న చికిత్స తర్వాత కోలుకున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారు. టమాటా, కాళీఫ్లవర్, వరి తదితర పంటలు పదెకరాల్లో సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు ఎకరానికి 10–15 బస్తాల వరకు వేస్తాం. పురుగుమందులు దండిగానే చల్లుతున్నాం. ఈ పంటలనే మేము కూడా తింటున్నాం. పంటలు పండించడం మాత్రమే మాకు తెలుసు. దీని వల్ల ప్రాణాలు తీసే వ్యాధులు వస్తాయన్న విషయం తెలియదు. రామకృష్ణారెడ్డి (కిట్టు), చిలకావారిపల్లె, చిత్తూరు జిల్లా పురుగుమందులు తప్పనిసరి.. మా పంచాయతీలో ఏ పంటకైనా తప్పక రసాయనిక పురుగుమందులు స్ప్రే చేయాల్సిందే. టమాటా, కాళీఫ్లవర్ పంటకు 15 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో పది రోజులకోసారి తప్పకుండా చేస్తుంటాం. చీడపీడలు నివారించేందుకు ఇంతకంటే వేరే మార్గం లేదని ఇక్కడి రైతుల అభిప్రాయం. సేంద్రియ వ్యవసాయం గురించి ఇక్కడెవరికీ తెలియదు. బాలకృష్ణారెడ్డి, ఈడిగపల్లె, చిత్తూరు జిల్లా 5 రెట్లు ఎక్కువగా పురుగుమందులు.. వ్యవసాయంలో పరిమితి కన్నా ఎక్కువగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటంతో దుష్పరిణామాలు తప్పవు. ఒకవేళ ఎరువులు మోతాదుకు మించితే భూమిలో కరిగిపోతాయి. పురుగు మందులు అలా కాదు. గాలిలో, నీటిలో కలవడం, కూరగాయలపై వాటి అవశేషాలు అలాగే ఉంటాయి. అందువల్ల హానికలుగుతుంది. రైతులు రేపు, ఎల్లుండి మార్కెట్‌కు తరలించే కూరగాయలపై సైతం పురుగుల మందులు పిచికారీ చేయడం మంచిది కాదు. కేవలం పురుగులు, చీడపీడీలు ఆశించినపుడు తప్ప అదేపనిగా ఐదు రెట్లు ఎక్కువగా పంటలకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. పంట తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తుందేమోనని ముందుజాగ్రత్తగా పురుగుల మందులను విపరీతంగా స్ప్రే చేయడంతోనే అనర్థాలు సంభవిస్తున్నాయి. – సుధాకర్, వ్యవసాయ విస్తరణాధికారి, పుంగనూరు పురుగుమందుల వల్ల కేన్సర్లు.. ఈడిగపల్లె పరిసర ప్రాంతాల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, అవగాహన రాహిత్యంతో పురుగుల మందులు స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గాలి ద్వారా పీల్చడం వల్ల గొంతు కేన్సర్ రావచ్చు. ఆడవారికి బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రైతులు, పొలం పనులపై వెళ్లే రైతు కూలీలు వక్కలతో పాటుగా దుగ్గు, గుట్కా వాడటం క్యాన్సర్‌కు కారకం కావచ్చు. – డా. పవన్‌కుమార్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ముడిపాపనపల్లె – సురమాల వంశీధర్, సాక్షి, మదనపల్లి -
రాష్ట్రపతికి ఓ కన్నతల్లి ఆవేదన
సాక్షి, కాన్పూర్: ఏ తల్లి తన బిడ్డ చావును కోరుకోదు. కానీ, కళ్ల ముందే కన్న కొడుకు అనుభవిస్తున్న నరకాన్ని చూడలేక ఇక్కడ ఓ తల్లి మాత్రం అది నెరవేరాలని కోరుకుంటోంది. తన బిడ్డకు మరణం ప్రసాదించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన జానకీకి పదేళ్ల కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా అతను చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో.. నిరుపేద అయిన ఆమె అధికారులను ఆశ్రయించింది. జిల్లా కలెక్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దినేశ్ శర్మ, ఇలా అందిరిని కలిసి విన్నవించుకుంది. చివరకు ఎమ్మెల్యే నీలిమా కటియార్ స్పందించి.. మే నెలలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు ఓ లేఖ రాశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు ఇవ్వాలని కటియార్ విజ్ఞప్తి చేశారు. అయినా సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు నిస్సహయక స్థితిలో తన కుమారుడికి మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం) ప్రసాదించాలని కోరుతూ ఆ తల్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నేడు కాన్పూర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రామ్‌నాథ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు ఆ మహిళ సిద్ధమౌతోంది. -
సాయం అందించరూ...
మెుదటి సంతానంలో పుట్టిన కూతురు ఆరు నెలల్లోనే మృతి చెందింది. రెండో సంతానంలో కొడుకు పుట్టాడన్న సంతోషం నాలుగు నెలలలైనా నిలవలేదు ఆ దంపతులకు. పుట్టిన నాలుగు నెలలకే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న కొడుకును చూసి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆటో నడిపితేగానీ పూట గడవని ఆ కుటుంబం కొడుకుకు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. మిర్యాలగూడ టౌన్ : పట్టణానికి చెందిన షేక్ షఫీకి దేవరకొండ సమీపంలోని మాల్‌కు చెందిన మున్నీసాతో 2006లో వివాహం జరిగింది. షఫీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 2008లో మొదటి సంతానంగా కూతురు సమీనా పుట్టింది. ఆమెకు పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉండడంతో ఆరు నెలల్లోనే చనిపోయింది. కాగా 2010లో రెండో సంతానంగా జానీపాష జన్మించాడు. అతడు పుట్టిన నాలుగు నెలల వరకు బాగానే ఉన్నా మరుసటి రోజు నుంచే ముఖంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. స్కినే కేన్సర్‌గా నిర్ధారణ జానీపాష ముఖంపై విపరీతంగా మచ్చలు రావడంతో స్థానికంగా గల పిల్లల వైద్య నిపుణులు, చర్మ వ్యాధుల నిపుణులకు చూపించినా వ్యాధి ఏమిటో నిర్ధారించలేకపోయారు. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రి, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులతో పాటు, ఆయుర్వేదిక్ డాక్టర్ల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి తమిళనాడులో స్కీన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా రక్తంలో మార్పులు వచ్చినందున ఇలాంటి మచ్చలు వచ్చాయని, ఈ వ్యాధిని స్కిన్ కేన్సర్‌గా డాక్టర్లు నిర్ధారించారు. మందులకు నెలకు రూ. 15 వేలు వ్యాధి తగ్గాలంటే ఏడాది పాటు మందులు వాడాల్సి ఉంటుందని, అప్పటి వరకు కొంత మేరుగు పడుతుందని డాక్టర్లు సూచించినట్లు జానీపాష తల్లిదండ్రులు తెలిపారు. వైద్యం కోసం ఇప్పటికే రూ. 5 లక్షల వరకు ఖర్చయింది. ఇప్పుడు మందులు వాడాలంటే నెలకు రూ. 15 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కళ్లకు ఆపరేషన్ జానీపాషకు వచ్చిన స్కిన్ కేన్సర్ వ్యాధి ఇటీవల కళ్లల్లోకి చేరడంతో గత నెల 25న హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ నిర్వహించారు. మరో కంటికి ఈ నెల 5న ఆపరేషన్ చేయించారు. అప్పు చేసి తమిళనాడుకు వెళ్లి మందులు తీసుకురాగా 2 నెలలు మాత్రమే వచ్చాయని, దాంతో కొంత వరకు జబ్బు తగ్గుముఖం పట్టగా, గత నెల నుంచి మందులు లేకపోవడంతో మళ్లీ జబ్బు తిరగబడిందని జానీపాష తండ్రి షఫీ తెలిపాడు. సంప్రదించాల్సిన సెల్‌నంబర్ : 98854 77687 అకౌంట్ నంబర్ 34181594673 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా కొడుకును ఆదుకోండి – మున్నీసా, షేక్ షఫీ, జానీపాష తల్లిదండ్రులు స్కిన్ కేన్సర్‌తో బాధపడుతున్న మా కుమారుడి చికిత్సకు దాతలు సహకరించాలి. మందులకు నెలకు రూ. 15 వేలు కావాల్సి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. మా కుమారుడు ఇంతకాలం కేవలం పాలతోనే జీవిస్తున్నాడు. దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందించి మా కుమారుడిని రక్షించాలి. -
సన్డే...
పెరిగిన ఎండలు 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు సిటీబ్యూరో: నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటిపూట నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం నగరంలో గరిష్టంగా 41.3 డిగ్రీలు, కనిష్టంగా 26.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి, ఉక్కపోత తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. రోడ్లవెంట నివసించే యాచకులు, అనాథలు, ఇతర ప్రయాణికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎండల తీవ్రత అతిగా ఉంటే...అతినీల లోహిత కిరణాల వల్ల ముఖ సౌందర్యం దెబ్బతినడంతో పాటు చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పగటిపూట బయటికి వెళ్లక పోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఎండలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు..మజ్జిగ... వేసవిలో రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తాగాలి. పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోతే వడదెబ్బకు గురవుతారు. వేడికి తట్టుకోలేక తాగే కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని హరిస్తాయి. వీటిలోని ఫాస్పేట్ పదార్థంతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దాహం వేయకపోయినా నీళ్లు కొంచెం కొంచెం తాగడం వల్ల డీహైడ్రేషన్ భారీ నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ రసం వంటివి మంచినీళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తాయి. - డాక్టర్ సమి, అపోలో ఆస్పత్రి, డీఆర్డీఓ ఎండలో ఆడనివ్వకూడదు.. చిన్నారుల శరీరంలో 50 శాతం నీరే ఉంటుంది. ఎండ దెబ్బకు నీటి శాతం తగ్గడం వల్ల చిన్నారులు వడదెబ్బకు గురవుతారు. త ద్వారా తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు రావచ్చు. వేసవి సెలవుల కారణంగా ఆటపాటలు ఎక్కువవడం సహ జం. దీనికి ఎండ తోడవడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. నీటి పరిమాణం ఎక్కువుండే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి వి అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండేలా చూడాలి. బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఆహారంగా ఆమ్లెట్కు బదులు ఉడకబెట్టిన గుడ్డు, కోల్డ్ మిల్క్ వంటివి అందించాలి. - డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్ కుక్కలకు దూరంగా ఉండాలి పగటి ఉష్ణోగ్రతలు వీధి కుక్కలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. సరిపడు ఆహారం, మంచి నీరులేమితో పాటు మండుతున్న ఎండలు వీటికి పిచ్చెక్కిస్తున్నాయి. కుక్కలకు వేట సహజ లక్షణం. ఈ లక్షణమే వాటిని చిన్నారులు, వాహనదారులపై ఉసికొల్పుతుంది. ఇలా ఫీవర్ ఆస్పత్రిలో రోజు సగటున 35 కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి కుక్కలకు దూరంగా ఉండాలి. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను కుక్కలకు దూరంగా ఉంచాలి. - డాక్టర్ గోవర్థన్, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి మసాల ఫుడ్డు వద్దు పాలు, పాల పదార్థాలతో తయారు చేసిన లస్సీలు కాకుండా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ద్రవపదార్థాలు అధికం గా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, మామిడి పండ్లు, ముంజలు వంటివి తీసుకోవాలి. రోడ్ల వెంట ఐస్‌తో తయారు చేసిన రంగు నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి. మసాలాలు ఉన్న ఆహారం వద్దు. తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకోవాలి. వడదెబ్బ తగిలి సొమ్మ సిల్లిన వ్యక్తులను కూర్చో బెట్టకూడదు. నీడకు తరలించి ఏదైనా నునుపైన బల్లపై కానీ మంచంపై కానీ పడుకోబెట్టాలి. నూలుతో తయారు చేసిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. స్పృహలోకి వచ్చిన తర్వాత చల్లటి మంచి నీరు, సోడా, కోబ్బరి నీళ్లు, మజ్జిగ తాగించాలి. - డాక్టర్ రవిశంకర్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సన్‌షైన్ స్కిన్ గ్లో తగ్గకుండా... చెమటపొక్కుల్ని గోళ్లతో గిల్లడం వంటివి చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎండలకు సెగ గడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ. యాంటి బ్యాక్టీరియల్ సోప్‌తో వీటిని శుభ్రం చేసుకోవాలి. గాఢమైన రంగులున్న దుస్తులు కాకుండా తేలి కైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. పట్టినట్టుండే దుసు ్తలు కాకుండా వదులైన పలుచని దుస్తులు వేసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు తలకు క్యాప్ అలవాటు చేసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం వేళలో చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలకు గోనె సంచులను అమర్చి, వాటిని నీటితో తడపాలి. - ప్రొఫెసర్ మన్మోహన్, చర్మవైద్య నిపుణుడు, ఉస్మానియా ఆస్పత్రి సర్వేంద్రియానాం...‘నయనం’... మండుతున్న ఎండలు కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డీహైడ్రేషన్ వల్ల కళ్లు ఎర్రబడి, మంట పుట్టిస్తాయి. పగలు నేరుగా సూర్యుని వైపు చూడకూడదు. వైద్యుడి సూచన మేరకు కళ్లకు ఎలాంటి హానీ చేయని కంటి అద్దాలను ఎంపిక చేసుకోవాలి. ఏవీ పడితే అవి కాకుండా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కళ్లజోళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఫొటోగ్రే, ఫొటో థింక్, ఫొటో బ్రౌన్ లెన్స్ అద్దాలను వాడటం ఉత్తమం. - డాక్టర్ రవీందర్‌గౌడ్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
వయాగ్రాతో జర జాగ్రత్త!
వాషింగ్టన్; పురుషుల్లో లైంగిక పటుత్వం మెరుగవటానికి వాడే వయాగ్రాతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలు తీసుకునే వారిలో స్కిన్ క్యాన్సర్ సంభవించే అవకాశాలు ఉన్నాయి అని తాజా పరిశోధనల్లో తేలింది. జంతు, మానవ కణాలపై దీనిలోని మెడిసిన్ సిడెన్ఫిల్ చూపించే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్యుబింజెన్ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. చర్మంలోని మాలిగ్నెంట్ మెలనోమా కణాలను వయాగ్రా ప్రేరేపిస్తుందని, దీంతో చర్మ క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన రాబర్ట్ ఫీల్ తెలిపారు. ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి వయాగ్రా అన్నది జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమాల్ లాంటి మందు కాదని, దీనితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గుండెజబ్బు లాంటి వ్యాధులకు మందులు వేసుకునే వారిలో ఇది ప్రమాదకరం అంటున్నారు. వయాగ్రాను సరైన స్పెషలిస్ట్‌ల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. -
ప్రాణాంతక చర్మ కేన్సర్‌కు మందు
వాషింగ్టన్: ప్రాణాంతక చర్మ కేన్సర్‌ను నయం చేసే మందును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి లొంగని మెలనోమా వంటి తీవ్రమైన కేన్సర్‌ను కూడా ఎస్బీఐ-756 అనే కొత్త డ్రగ్ నయం చేస్తుందని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ బర్నమ్ ప్రెబీస్ మెడికల్ డిస్కవరి ఇనిస్టిట్యూట్‌కు చెందిన జీవ్ రొనాయ్ తెలిపారు. సాధారణంగా ప్రతికణంలోని సెల్యులార్ రైబోజోమ్స్.. ప్రొటీన్‌ను తయారు చేస్తాయి. కానీ కేన్సర్ కణాలు ప్రొటీన్ తయారీతోపాటు కణతులు పెరిగేందుకు దోహదపడతాయి. ఈ ఎస్బీఐ-756 అనే డ్రగ్ ట్యూమర్ మెలనొమా కణాల అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటుందని రొనాయ్ తెలిపారు. ఇప్పుడున్న మందులు కేవలం ట్యూమర్‌ను తగ్గించేందుకే పనిచేస్తున్నాయని.. కేన్సర్ కణాల పురోగతిని అడ్డుకోవట్లేదన్నారు. ప్రస్తుతమున్న మందుతో ఎస్బీఐ-756ను కలిపి వాడటం వల్ల కణతులు తగ్గటంతోపాటు మెలనోమా అభివృద్ధిని అడ్డుకోవచ్చా అనే దానిపై తదుపరి పరిశోధనలు చేస్తున్నట్లు రోనాయ్ తెలిపారు. -
క్రికెట్ వ్యాఖ్యాత రిచీ బెన్నాడ్ కు చర్మ కేన్సర్
సిడ్నీ: విశ్వవిఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిచీ బెన్నాడ్(84) చర్మ కేన్సర్ తో పోరాటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా స్పష్టం చేశాడు. తాను కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్నట్లు బెన్నాడ్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం చర్మ కేన్సర్ కు రేడియేషన్ థెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు. గత సంవత్సరం బెన్నాడ్ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత గౌరవమైన వ్యక్తిగా బెన్నాడ్ స్థానం సంపాదించాడు. 1964 లో టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం కామెంటేటర్ అవతారం ఎత్తాడు. 1960 ప్రాంతంలో బీబీసీకి వ్యాఖ్యాతగా వ్యహరించాడు. ఆపై మూడ సంవత్సరాల తరువాత కామెంటేటర్ గా పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. అటు క్రికెట్ జర్నలిస్టుగాను, కామెంటేటర్ గాను బెన్నాడ్ విశిష్టమైన సేవలందించాడు. -
విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!
వాషింగ్టన్: విమాన పైలెట్లతోపాటు క్యాబిన్లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ కేన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది. అనేక అధ్యయనాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ** -
మేని మెరుపులకు... డెర్మటాలజిస్టు
మనిషి చర్మానికి 3 వేలకుపైగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. సొరియాసిస్, స్కిన్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు వంటివాటితో చర్మం జీవం కోల్పోతుంది. అందవిహీనంగా మారుతుంది. డెర్మటాలజిస్టులు వీటిని గుర్తించి, తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు డెర్మటాలిజిస్టులను ఆశ్రయించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. డెర్మటాలజీని కెరీర్‌గా ఎంచుకుంటే ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. ప్రధానమైంది.. అనుకూలమైన పనివేళలు. ఇతర వైద్యుల్లాగా ఎమర్జెన్సీ కేసులను చూడాల్సిన సందర్భాలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. నచ్చిన సమయాల్లో పనిచేసుకోవచ్చు. చికిత్స ద్వారా రోగులకు స్వస్థత చేకూరిస్తే కెరీర్‌గా పరంగా ఎదురే ఉండదు. డెర్మటాలజిస్టులకే అగ్రస్థానం భారత్‌లో నిపుణులైన డెర్మటాలజిస్టుల కొరత అధికంగా ఉంది. అనుభవం కలిగిన చర్మ వైద్యులకు భారీ డిమాండ్ ఉంది. డెర్మటాలజిస్టులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. విదేశాల్లోనూ వీరికి భారీ వేతన ప్యాకేజీ లభిస్తోంది. సొంతంగా క్లినిక్‌ను స్థాపించుకుంటే మంచి ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి. వీటిలో డెర్మటాలజిస్టులను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఈ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించింది. కాస్మటిక్ డెర్మటాలజీ, లేజర్ ట్రీట్మెంట్ వంటి వాటి ద్వారా చికిత్సలు మరింత సులువుగా మారాయి. వేతనాల పరంగా ఫిజిషియన్లలో డెర్మటాలజిస్టులకు అగ్రస్థానం దక్కుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అర్హతలు: బయాలజీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్(అండర్గ్రాడ్యుయేట్) డిగ్రీ పూర్తిచేయాలి. తర్వాత డెర్మటాలజీలో ఎండీ(పోస్టుగ్రాడ్యుయేట్) చదవాలి. అనంతరం ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తిచేసి, డెర్మటాలజిస్టుగా కెరీర్ లో స్థిరపడొచ్చు. వేతనాలు: డెర్మటాలజిస్టులకు ప్రారంభంలో నెలకు రూ.40 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. కూల్‌గా సాగిపోయే కెరీర్.. ‘‘చర్మ సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దాంతో డెర్మటాలజిస్టులకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. మారుతున్న టెక్నాలజీతో వైద్యవిధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. వయసు మీదపడుతున్నపుడు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు యాంటీ ఏజింగ్ ప్రక్రియ ప్రాచుర్యంలోకి వచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రిళ్లు అత్యవసర కేసులు వచ్చే అవకాశం లేదు. అందుకే అధికశాతం మహిళా వైద్యులు డెర్మటాలజీని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలిగితే ఆదాయమార్గం భారీ ఎత్తున పెరిగినట్లే. డెర్మటాలజీని స్పెషలైజేషన్‌గా తీసుకున్నవారికి ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి’’ -డాక్టర్ మన్మోహన్, డెర్మటాలజీ విభాగ అధిపతి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి డెర్మటాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చఝఛి.్చఛి.జీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)-న్యూఢిల్లీ వెబ్సైట్: www.aiims.edu లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.hardinge.org/ గురు తేజ్ బహదూర్ హాస్పిటల్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.gtbh.delhigovt.nic.in జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పోస్టు: అసిస్టెంట్ ఇంజనీర్; విభాగం: ఎలక్ట్రికల్ అర్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఏఎంఐఈ ఉండాలి. వయసు: 36 ఏళ్లకు మించకూడదు.; ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 26; వెబ్సైట్: www.apeasternpower.com నవోదయ విద్యాలయ సమితి పోస్టు: ప్రిన్సిపాల్; ఖాళీల సంఖ్య: 47 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, బీఎడ్ ఉండాలి. రెసిడెన్షియల్/సీబీఎస్ఈ/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పీజీటీ/మాస్టర్/లెక్చరర్‌గా కనీసం పన్నెండేళ్ల అనుభవం ఉండాలి.; ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://www.navodaya.nic.in/ భారత నావికాదళం పోస్టులు: యూనివర్సల్ ఎంట్రీ స్కీమ్-ఎస్ఎస్సీ ఆఫీసర్స్ అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.; ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5 వెబ్సైట్: http://nausena-bharti.nic.in/ పారాదీప్ పోర్ట్ ట్రస్టు పోస్టులు: డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్బీ/ఎంఎస్ ఉండాలి. కనీసం ఏడేళ్ల క్లినికల్ అనుభవం అవసరం ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; దరఖాస్తులకు చివరి తేది: జూలై 28 వెబ్సైట్: http://www.paradipport.gov.in/ నిమ్స్- హైదరాబాద్ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, వైవా ద్వారా.. దరఖాస్తులకు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: http://www.nims.edu.in/ సీమ్యాట్ కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2015-16(మొదటి పరీక్ష) నోటిఫికేషన్‌ను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(10+2+3) ఉత్తీర్ణులు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 25 వెబ్సైట్: http://www.aicte-cmat.in/