అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఛాతిపై ఉండే శరీరంపై గాయం ఏర్పడింది. అది క్రమంగా క్యాన్సర్ మారింది. దీంతో ఫిబ్రవరిలో వైద్యలు బైడెన్ చికిత్స అందించి ఆ క్యాన్సర్ కణజాలన్ని విజయవంతంగా తొలగించారు. తదుపరి ఇక ఎలాంటి చికిత్స అవసరం లేదని వైట్‌హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ ఓ లేఖలో తెలిపారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్‌కి సంబంధించిన సాధారణ రూపం అని పేర్కొన్నారు. బైడెన్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా చర్మసంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని కూడా చెప్పారు.
గత నెల వైద్యులు జోబైడెన్(80) శారీర పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ఆ సమయంలోనే అతని ఛాతీపై ఉన్న చర్మసంబంధ గాయాన్ని తొలగించి బయాప్సీకీ(ల్యాబ్ పరీక్షలకి) పంపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ వైద్యుడు ఓ కానర్ లేఖలో ఆ విషయం గురించే చెప్పుకొచ్చారు. ల్యాబ్ పరీక్షల అనంతరం ఆ బేసల్ కార్సినోమా గాయాలు భవిష్యత్తులో వ్యాప్తి చెందే అవకాశం లేదని, ఇక ఏవిధమైన భయం అవసరం లేదని అన్నారు. ఇక ముందు ముందు దానికి సంబంధించి ఎలాంటి చికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆయన 2024లో అధ్యక్ష రేస్‌లో దిగేందుకు సిద్ధమవుతున్నందున బైడెన ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఆమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ కూడా చెప్పడం విశేషం.
(చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్)
Comments
Please login to add a commentAdd a comment