chest
-
గుండెపోటుతో కుంభకర్ణ పాత్రధారి మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నేపధ్యంలో అక్కడక్కడా విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.దేశ రాజధానిలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో వేదికపై రామలీలను ప్రదర్శిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రావణుని సోదరుడు కుంభకర్ణుని పాత్రను పోషిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ నివాసి విక్రమ్ తనేజా రామ్‌లీలలో కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నాడు. వేదికపై ఆయన తన పాత్ర పోషిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతనిని పీఎస్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తనేజా మృతి చెందినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ(76) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్తో పాటు జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో నిన్న రాత్రి చేరినట్లు అధికారులు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నామని తెలిపిన వైద్యులు.. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే చికిత్స జరుగుతున్నట్లు చెప్పారు. సోనియా గాంధీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులకే ఇలా ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఇండియా కూటమిని ముందుకు తీసుకుపోయే విధంగా సోనియా గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఇండియా కూటమి ముంబయి సమావేశంలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Delhi's Sir Gangaram Hospital with symptoms of mild fever. She is under doctors' observation and is currently stable: Sources pic.twitter.com/9uuZz8n4ra — ANI (@ANI) September 3, 2023 ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమిని బలపరచడానికి ఇప్పటికే నిర్వహించిన పాట్నా, బెంగళూరు, ముంబయి వరుస సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకుపోవడానికి కాంగ్రెస్ శ్రేణులకు ముందుండి నడుస్తున్నారు. 2019లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇదీ చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
దారుణం: ప్రముఖ జర్నలిస్టు హత్య..
పాట్నా: బిహార్‌లో దారుణం జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టుని కిరాతకంగా హత్య చేశారు. రాణిగంజ్ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టు ఇంటి ప్రాంగణంలోనే ఈ దాడి జరిగింది. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. జర్నలిస్టు విమల్ యాదవ్ దైనిక్ జాగరణ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ఆయన తలుపుతట్టారు. విమల్ గుమ్మం వద్దకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్నలిస్టు విమల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై ఆస్పత్రి వద్ధ భారీ సంఖ్యలో గుమికూడిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోక్ జన్‌శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు, పోలీసులకే రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. దుండగులను పట్టుకునేందుకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు.. కారణం ఏమై ఉంటుందంటారు? -
స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఛాతిపై ఉండే శరీరంపై గాయం ఏర్పడింది. అది క్రమంగా క్యాన్సర్ మారింది. దీంతో ఫిబ్రవరిలో వైద్యలు బైడెన్ చికిత్స అందించి ఆ క్యాన్సర్ కణజాలన్ని విజయవంతంగా తొలగించారు. తదుపరి ఇక ఎలాంటి చికిత్స అవసరం లేదని వైట్‌హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ ఓ లేఖలో తెలిపారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్‌కి సంబంధించిన సాధారణ రూపం అని పేర్కొన్నారు. బైడెన్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా చర్మసంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని కూడా చెప్పారు. గత నెల వైద్యులు జోబైడెన్(80) శారీర పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ఆ సమయంలోనే అతని ఛాతీపై ఉన్న చర్మసంబంధ గాయాన్ని తొలగించి బయాప్సీకీ(ల్యాబ్ పరీక్షలకి) పంపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ వైద్యుడు ఓ కానర్ లేఖలో ఆ విషయం గురించే చెప్పుకొచ్చారు. ల్యాబ్ పరీక్షల అనంతరం ఆ బేసల్ కార్సినోమా గాయాలు భవిష్యత్తులో వ్యాప్తి చెందే అవకాశం లేదని, ఇక ఏవిధమైన భయం అవసరం లేదని అన్నారు. ఇక ముందు ముందు దానికి సంబంధించి ఎలాంటి చికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆయన 2024లో అధ్యక్ష రేస్‌లో దిగేందుకు సిద్ధమవుతున్నందున బైడెన ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఆమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ కూడా చెప్పడం విశేషం. (చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్) -
ఛాతీలోకి లైవ్ గ్రనేడ్.. ఎలా కాపాడావయ్యా?!
కీవ్: తమపై దురాక్రమణలో రష్యా బలగాల అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఉక్రెయిన్ వాపోతోంది. ఏడాదికి సమయం దగ్గరపడుతున్నా.. ప్రాణ, ఆస్తి నష్టం కొనసాగుతుండడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఆర్మీ డాక్టర్ ఒకాయన చేసిన పని సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైవ్ గ్రనేడ్ ఒకటి ఓ సైనికుడి ఛాతీలో ఇరక్కుపోవడంతో.. ఆయన చాకచక్యంగా వ్యవహరించి దానిని బయటకు తీశాడు. ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా.. బక్ముట్ వద్ద భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో వీవోజీ గ్రనేడ్ లాంఛర్ ద్వారా దూసుకెళ్లాల్సిన ఓ లైవ్ గ్రనేడ్.. సైనికుడి ఛాతీలోకి వెళ్లిందట. అది ఏ క్షణమైనా అది పేలి అతను చనిపోవచ్చు. ఆ టైంలో మేజర్ జనరల్ డాక్టర్ అండ్రి విల్లో, సర్జరీకి దిగారు. తన ప్రాణాలకు తెగించి మరీ ఆపరేషన్ చేసి దానిని తొలగించి అతని పాలిట దేవుడిగా నిలిచాడు. ఆ డేరింగ్ ఆపరేషన్‌ను ఆయన ఇద్దరు సైనికుల సహకారంతో నిర్వర్తించడం విశేషం. వీవోజీ గ్రనేడ్ బాడీలోకి వెళ్లాక ఏమాత్రం చెదరలేదట. ఛాతీలో అలాగే చిక్కుకుపోయిందట. ఏమాత్రం పొరపాటు జరిగినా అది పేలిపోయి ఆ సైనికుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. అతనితో పాటు సర్జరీకి దిగిన వైద్యుడు కూడా హరీమంటాడు. ఆ సమయంలో ఎలెక్ట్రో కోగ్యులేషన్ చర్యకు దిగి ఉంటే.. కచ్చితంగా ఆ గ్రనేడ్ పేలిపోయేది. కానీ, మేజర్ ఆండ్రి విల్లో ఆ పని చేయలేదు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి.. ఆ సైనికుడి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం ధృవీకరించింది కూడా. అయితే సైనికుడి ఛాతీలోకి ఆ గ్రనేడ్ ఎలా వెళ్లిందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎక్స్‌రే ద్వారా ఛాతీలో గ్రనేడ్ ఇరుక్కున ఫొటో, ఆపరేషన్ చేశాక ఆ గ్రనేడ్‌ను తొలగించిన ఫొటోలను మాత్రం రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సైన్యం. -
వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!
ఏదైన ప్రమాదం బారిన పడితేనో లేక పోట్లాడినప్పుడో ఎముకలు విరగడం జరుగుతుంది. మహా అయితే ఏదైన వ్యాయమం చేసినప్పుడూ ఏదైన ఎముక బెణికి విరిగే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఉత్తిపుణ్యానికి అదికూడా కేవలం దగ్గితే ఎముకలు విరగడం గురించి విన్నారా! వాస్తవానికి ఏదైన జన్యులోపంతో ఎముకలు బలహీనంగా ఉండి విరిగిపోవడం జరుగుతుంది. కానీ కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. వివరాల్లోకెళ్తే...చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ఒక రోజు స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడూ విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం వచ్చింది కూడా. ఐతే ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చుకుంటున్న, మాట్లాడుతున్న విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హువాంగ్‌కి స్కాన్ చేయగా మొత్తం నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు బ్యాడేజ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు వైద్యులు. ఐతే స్థానిక మీడియా దగ్గితే పక్కటెముకలు విరగడం ఏమిటని వైద్యులను ప్రశ్నించింది. హువాంగ్ బరువు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె సుమారు 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కిలోగ్రాములే ఉంటుందని చెప్పారు. ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా... పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని చెప్పారు వైద్యులు. ఆమె కోలుకున్నాక కచ్చితంగా బరువు పెరిగేందుకు వ్యాయమాలు చేస్తానని చెబుతోంది. (చదవండి: -
వైరల్ వీడియో : తన ఛాతీని కొట్టడం నేర్చుకుంటున్న చిన్న గొరిల్లా..!
-
Kerala: ఎంత క్రూరం! చిన్నారిని కాలితో తన్నాడు.. మరి జనం ఊరుకుంటారా?
-
ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు!
కారుపై వాలాడని ఓ చిన్నారిని దూషించడంతో పాటు అతన్ని కాలితో గట్టిగా తన్నాడు ఓ వ్యక్తి. దీంతో పాపం ఆ పిలగాడు అమాయకంగా అక్కడి నుంచి కిక్కురుమనకుండా పక్కకు తప్పుకున్నాడు. అయితే దుర్మార్గాన్ని అక్కడే ఉన్న కొందరు మాత్రం ఊరుకోలేదు. కేరళలో తాజాగా ఈ ఘటన జరిగింది. చిన్నారిపై దాడి జరిగిన వెంటనే అక్కడే ఉన్న కొందరు యువకులు, మరికొందరు ఆ కారు చుట్టూ చేరారు. చిన్నారిని తన్నిన వ్యక్తిని నిలదీసి.. వాగ్వాదానికి దిగారు. అయితే అది తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడు ఆ వ్యక్తి. బాధిత చిన్నారి రాజస్థాన్‌కు చెందిన వలసకూలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పొన్నియపాలెంకు చెందిన షిహ్షద్గా నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువలాయర్.. పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. అయినా పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు సోషల్ మీడియా ద్వారా సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో.. చర్యలు తీసుకోని పోలీసులపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. అయితే రాత్రికి రాత్రే అతన్ని మళ్లీ రిలీజ్ చేశారన్న కథనాలతో జనాల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో కేరళ అసెంబ్లీ స్పీకర్, ఏఎన్ షంసీర్ ఈ ఘటనపై స్పందించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ.. మానవత్వం దుకాణాల్లో దొరికేది కాదంటూ వ్యాఖ్యానించారు. ఆరేళ్ల బాలుడు కారు మీద వాలిపోయాడని తన్నడం ఏంటి?. న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారాయన. -
హృదయ విదారక దృశ్యం: నడుము లోతు నీళ్లలోనే అంతిమ వీడ్కోలు!
బెంగళూరు: కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని కోడ్లు గ్రామం వర్షాం వస్తే చాలు జలమయం అయిపోతుంది. ఐతే ఆ సమయంలో ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఏ వ్యక్తి అయిన చనిపోతే వారిని శ్మశానానికి తీసుకువెళ్లడం గ్రామస్తులకు ఒక సవాలుగా ఉంది. పైగా అక్కడ నివాసితులు వర్షకాలం అంటేనే చాలా భయపడతారు. శ్మశాన వాటిక రహదారులన్ని ఈ వర్షాకాలం ముంపునకు గురై శవాలను తరలించడం అత్యంత కష్టంగా ఉంటుంది ఈ మేరకు ఆ కోడ్లు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే నడుమ లోతు నీళ్లో శవాన్ని తీసుకువెళ్తున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వర్షాకాలం వస్తేనే చాలు ఈ గ్రామంలోని రోడ్డన్నీ నీళ్లతో నిండిపోతాయని, పరిష్కారం కోసం ఎన్నో నెలలుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సహాయం అందించడంలేదని వాపోయారు. పైగా ఇది రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గ్రామం. (చదవండి: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ అందజేసిన ప్రకాశ్ రాజ్) -
విషాదం: ఊహించని రీతిలో మృత్యువు ఒడికి..
ఆ యువ ఆటగాడి జీవితాన్ని విధి విచిత్రంగా కాటేసింది. సంబురంగా గడుపుతున్న టైంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో అతను తీవ్రంగా గాయపడగా.. కొన ఊపిరితో మూడుగంటలు పోరాడి మరీ ప్రాణం విడిచాడు. మాటిస్ కివ్‌లెనిక్స్(24)..లాత్వియాకు చెందిన ఐస్ హకీ ఆటగాడు. నేషనల్ హాకీ లీగ్‌లో కొలంబస్ బ్లూ జాకెట్స్ తరపున గోల్టెండర్(గోల్‌ను అడ్డుకునే క్రీడాకారుడు)గా అతనికి మాంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. తొమిదేళ్ల కెరీర్లో జట్టుకు మంచి సేవలు అందించాడు. అలాంటి టాలెంటెడ్ ఆటగాడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం రాత్రి బ్లూ జాకెట్స్ కోచ్ మెన్సీ లెగస్ ఇంట్లో(మిషిగాన్)లో పార్టీ జరిగింది. పటాకుల్ని పేల్చి సంబురాలు చేసుకుంది టీం. ఆ టైంలో కివ్‌లెనిక్స్ సహా ఆటగాళ్లంతా హాట్ టబ్‌లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే పటాకులు ఒక్కసారిగా ఆటగాళ్ల వైపు దూసుకొచ్చాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అంతా తలోదిక్కు పరిగెత్తారు. అయితే కాలు జారి బాత్ టబ్‌లో పడిన కివ్‌లెనిక్స్.. గాయపడ్డ విషయాన్ని తోటి టీం మేట్స్ గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత బాత్ టబ్‌లో పడిపోవడంతో అతని తలకు గాయమై చనిపోయి ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే దూసుకొచ్చిన ఫైర్వర్క్స్ మోటర్ బలంగా ఛాతిని ఢీకొట్టడంతో.. అంతర్గతంగా గాయాలై చనిపోయాడని శవపరీక్షలో తేలింది. కాగా, ఈ యువ ఆటగాడి దుర్మరణంపై క్లబ్‌తో పాటు నేషనల్ హాకీ లీగ్ సంతాపం వ్యక్తం చేసింది. కివ్‌లెనిక్స్ లాత్వియా తరపున పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మే-జూన్‌లో జరిగిన ప్రపంచ టోర్నమెంట్లో కెనెడాపై లాత్వియా తొలి విజయానికి కివ్‌లెనిక్స్ షూట్ అవుట్ కారణం కావడం విశేషం. -
ఛాతిపై కులం పేరు.. రాహుల్ ఆవేదన
న్యూఢిల్లీ : పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాయడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బీజేపీ ప్రభుత్వ జాత్యహంకార వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం యువకుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసిందన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆలోచననే అని ఆయన ఆరోపించారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్ పెన్‌తో రాశారు.ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ విషయమై ధార్ ఎస్పీ వీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు. BJP सरकार के जातिवादी रवैये ने देश की छाती पर छूरा मारा है। MP के युवाओं के सीने पर SC/ST लिखकर देश के संविधान पर हमला किया है। ये BJP/RSS की सोच है। यही सोच कभी दलितों के गले में हांडी टंगवाती थी, शरीर में झाडू बंधवाती थी, मंदिर में घुसने नहीं देती थी। हम इस सोच को हराएँगे। pic.twitter.com/ycqt1nEp0E — Rahul Gandhi (@RahulGandhi) 30 April 2018 -
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల ఛాతీపై కులం పేరు
-
కానిస్టేబుల్ నియామక పరీక్ష... ఛాతిపై కులం పేరు
భోపాల్: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై వారి కులం పేరును స్కెచ్‌తో రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్ పెన్‌తో రాశారు. ఈ విషయమై ధార్ ఎస్పీ వీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు. -
సంచలనం రేపిన ఆటోగ్రాఫ్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏకంగా ఓ మహిళ ఛాతీపై సంతకం చేశారు. వర్జీనియాలోని మనస్సాస్లో ప్రిన్స్ విలియమ్ కంట్రీలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకీ భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ట్రంప్ ఆమె ఛాతీపై సంతకం చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఆటోగ్రాఫ్‌ను అందుకున్న ఆ అభిమాని ఇక తాను స్నానం చేసేది లేదంటూ గాల్లోకి ముద్దులు విసిరి మరింత అలజడి రేపారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారంలో కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ధ్వజమెత్తారు. రోజురోజుకీ ఆటవికులుగా తయారవుతున్న ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు. -
పల్మునాలజీ కౌన్సెలింగ్
మళ్లీ మళ్లీ ఛాతీలో నీరుచేరుతోంది! మా తాతయ్య ఛాతీలో నీరు నీరు చేరిందన్నారు. చాలాసార్లు తీశారు. మళ్లీ మళ్లీ ఛాతీలోకి నీరుచేరుతోంది. ఛాతీలోకి ఇలా నీరెందుకు చేరుతోంది. దీనికి తగిన వైద్యం ఉందా? - సుశాంత్, హైదరాబాద్ ఛాతీలో నీరు చేరడాన్ని ‘ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఇది నీరు కావచ్చు, చీము లేదా రక్తం కావచ్చు. ఇది ఒక పక్క లేదా రెండువైపులా చేరవచ్చు. నీరు ఎక్కువగా చేరితే దాన్ని ‘మాసివ్ ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. వారిలో ఆయాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటివారికి వెంటనే నీరు తీయాలి. ఇలా ఛాతీలోకి నీరు చేరడం అనేది హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్య, లివర్ సమస్యలను సూచిస్తుంది. చీము చేరడం అనేది ఊపిరితిత్తులకు గాని, ప్లూరల్ స్పేస్కుగానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఉదా: నిమోనియా, టీబీ ఇన్ఫెక్షన్లు. సాధారణంగా మొదటిదశలో చీము అవునా, కాదా అన్నది కనుక్కోలేము. నీటిని పరీక్షలకు పంపించి మాత్రమే కనుక్కోగలం. కాబట్టి ఈ సమస్యను ట్రాన్స్డేటివ్ లేదా ఎగ్జూడేటివ్ అని విభజిస్తారు. ట్రాన్స్డేటివ్ నీరు చేయడం అన్నది సాధారణంగా మందులతో తగ్గిపోతుంది. ఎగ్జుడేటివ్ నీరు చేరడం అన్నది దాని దశని బట్టి చికిత్స మారుతుంటుంది. నిమోనియా ఉండి కొంచెం నీరు ఉంటే, సాధారణంగా యాంటీబయాటిక్స్‌తో తగ్గిపోతుంది. కానీ చీము చాలా ఉంటే, వెంటనే ఛాతీలోకి గొట్టం వేసి దాన్ని డ్రైయిన్ చేయాలి (బయటకు ప్రవహించేలా చేయాలి... అంటే తొలగించాలి). ఒకసారి గొట్టం వేశాక చీము రోజుకు ఎంతమొత్తంలో బయటకు డ్రైయిన్ అవుతోంది అన్న అంశం మీద దాన్ని తీసేయడం ఆధారపడి ఉంటుంది. చీము తీసేయడం ఆలస్యం అయితే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి, అక్కడ తేనెతుట్టెలాగా మారిపోతుంది. అలాంటి దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. గొట్టం వేసి, అది కరగడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందులు లోపలికి మూడు రోజుల పాటు పంపుతారు. అప్పటికీ లోపలి ఫైబ్రస్ పార్టిషన్స్ కరగకపోతే ఆపరేషన్ ఒక్కటే మార్గం. అసలు ఈ చీము ఎందుకు చేరుతుందో ముందుగా కనుక్కోవాలి. అందుకోసం తగిన పరీక్షలూ, కల్చర్స్ చేయించాలి. ఇన్ఫెక్షన్ అదుపు చేయడానికి కావలసిన మందులు సూచించినంత కాలం వాడాలి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల చీము చేరడమే కాకుండా ఊపిరితిత్తులకు కన్నం పడుతుంది. దానివల్ల గాలి లీక్ అవుతుంది. దీన్ని ‘బ్రాంకోప్లూరల్ ఫిస్టులా’ అంటారు. ఇలాంటివారిలో ఛాతీలో గొట్టం ఎక్కువరోజులు... అంటే ఫిస్టులా మూసుకుపోయే వరకూ ఉంచాలి. ఇందుకు ఒక్కోసారి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. కొంతమందిలో ఆపరేషన్ ద్వారా ఫిస్టులాను రిపేర్ చేయవచ్చు. మీ తాతగారికి నీరు తీస్తున్నా మళ్లీ మళ్లీ వస్తుందన్నారు. అలా వెంటవెంటనే నీరు చేరుతుందంటే, అది క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటికి సంబంధించి పరీక్షలూ, అవసరమైతే ప్లూరల్ బయాప్సీ చేయించండి. డాక్టర్ ఎస్.ఎ.రఫీ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నాకు చాలారోజులుగా ఛాతీలో మంటగా ఉంటోంది. దగ్గర్లోని మెడికల్ షాప్‌లో యాంటాసిడ్ జెల్ కొని తాగుతున్నాను. తాగినంతసేపు మంట తగ్గుతోంది. ఆ తర్వాత యధావిధిగా వస్తోంది. దీన్ని తగ్గించుకోడానికి తగిన సూచనలు ఇవ్వగలరు. - రాజశేఖర్, ఆదిలాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు అర్థమవుతోంది. వీలైతే మీరొకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. మీరడిగినట్లు జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా మీ వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంది. మీరు పాటించాల్సిన సూచనలలో ముఖ్యమైనవి... ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించడం; కాఫీ, టీలను మానివేయడం పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్లను పూర్తిగా మానివేయడం తిన్న వెంటనే పడుకోకుండా ఉండటం పడకలో తలవైపున కాస్త ఎత్తుగా ఉండేలా తలగడ ఉంచుకోవడం పై సూచనలతో పాటిస్తూనే ఒకసారి మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి హెచ్2 బ్లాకర్స్, పీపీఐ అనే మందులను వాడటం మంచిది. డాక్టర్ భవానీ ప్రసాద్ రాజు, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఛాతీ, టీబీ ఆస్పత్రి తరలింపు అడ్డుకోండి
వాస్తు కారణంతో తరలింపు అన్యాయం హైకోర్టులో నాగం జనార్దన్‌రెడ్డి, జెడ్సన్ వేర్వేరు పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఇందులో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యవిద్య డెరైక్టర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ెప్రజలకు అందుబాటులో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని 75 కిలోమీటర్ల అవతలకు తరలించేందుకు ప్రభుత్వం గతనెల 27న జీవో కూడా జారీ చేసిందని, ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని వారు తెలిపారు. ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో 750 బెడ్లతో టీచింగ్ ఆస్పత్రి, 150 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించారని నాగం తన పిటిషన్లో వివరించారు. అదే సమయంలో ఆస్పత్రిని తరలించాలని యోచించిన అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి వచ్చిన నిరసనతో విరమించుకుందని తెలిపారు. వాస్తు కారణాలతో ఈ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఛాతీ, టీబీ ఆస్పత్రికి వచ్చే రోగులకు గుండె, న్యూరో, కిడ్నీ తదితర విభాగాల్లో వైద్య నిపుణుల అవసరం కూడా ఉంటుందని, దీన్ని తరలిస్తే రోగులు ఇబ్బంది పడతారని జెడ్సన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ అలా చెప్పడం వెనుక కుట్ర టీబీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండొద్దని, మారు మూల ప్రాంతంలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పడం వెనుక కుట్ర ఉందని నాగం ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేద రోగులపై వైఎస్‌కు ఉన్న ప్రేమ కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. -
పీజీ సీట్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ, క్షయ ఆస్పత్రిని వికారాబాద్‌లోని అనంతగిరి టీబీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పీజీ వైద్య సీట్లు కోల్పోకుండా సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బోధనాసుపత్రిగా ఉన్న ఛాతీ ఆస్పత్రిలోని విభాగాలను ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించింది. వైద్య కళాశాలలకు బోధనాసుపత్రి 10 కిలోమీటర్ల లోపు దూరంలో ఉండాలనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధన. కానీ ఆయా ఆసుపత్రుల నుంచి వికారాబాద్ ఛాతీ ఆసుపత్రికి 60 కి.మీ.ల పైగా దూరం ఉంటుంది. అంటే ఎంసీఐ నిబంధన ప్రకారం తరలింపు వల్ల 10 పీజీ వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సర్కారు పై విధంగా ఆలోచన చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి చె ప్పారు. -
అందమా...అందుమా!
నగరంలో కాస్మొటిక్ సర్జరీలపై పెరుగుతున్న మోజు సొట్టబుగ్గలు, నడుము, ఛాతి సర్జరీలపై అమ్మాయిల ఆసక్తి ముక్కు, బట్టతల, పొట్టను సరి చేసుకుంటున్న అబ్బాయిలు అందమంటే అమ్మాయిల సొంతం... ఒకప్పుడు ఈ మాట వింటే అబ్బాయిలు ‘నిజమే’నంటూ మెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ రేసులో వారూ ముందుకు వస్తున్నారు. అందమా..అందుమా.. అంటూ తమ శరీరాకృతికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మేని మెరుపులు పెంచుకునే క్రమంలో స్త్రీలు, పురుషులు పోటీ పడుతున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు వెళుతున్నా... గమ్యం మాత్రం అందమే. వీరి మనసులో మాటను తెలుసుకొని... ‘మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మేమున్నామ’ంటూ అధునాతన చికిత్సలతో ముందుకొస్తున్నారు వైద్య నిపుణులు. వినూత్న పద్ధతుల్లో..విభిన్న రీతుల్లో సొబగులద్దుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదవులు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుములది కీలక పాత్ర. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనలో ఏదో తెలియని అసంతృప్తి. ఎంత ఐశ్యర్యవంతులైనా కంటికి అందంగా కనిపించకపోతే చెప్పలేని వెలితి. అందానికి ఉన్న స్థానమది. అందంగా లేనివారు... శారీరకంగా లోపాలు ఉన్న వారు ఒకప్పుడైతే ‘దేవుడిచ్చిన శరీర భాగాలను మనమేం చేయగలంలే’ అని సరిపెట్టుకునే వారు. మరి ఇప్పుడో... ఏదో ఒకటి చేసి... అందంగా కనిపించాల్సిందే అనుకుంటున్నారు. అందాలకు మెరుగులు దిద్దే మార్గాలను వెదుక్కుంటూ వెళుతున్నారు. ఇలాంటి వారికి కాస్మొటిక్ సర్జరీలు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా చికిత్సల వైపు ప్రస్తుతం మధ్య తరగతి వారూ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సర్వే ప్రకారం కాస్మొటిక్ సర్జరీల్లో మన దేశానిది నాలుగో స్థానం. అందాలకు మెరుగులు దిద్దుకోవాలని గత ఏడాది శస్త్రచికిత్సలకు క్యూ కట్టిన వారి సంఖ్య 8,94,700గా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 20-25 శాతం మంది గ్రేటర్ వాసులే ఉండటం గమనార్హం. కోటేరు లాంటి ముక్కు కోసం ముఖం అందాన్ని నిర్ణయించేది ముక్కు. అందుకే ఏమాత్రం తేడా ఉన్నా.. చాలా మంది అమ్మాయిలు...అందులోనూ పెళ్లి కావాల్సిన వారు రైనోప్లాస్టీ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీ చేసుకుంటున్న వారిలో 70 శాతం అమ్మాయిలు, 30 శాతం అబ్బాయిలు ఉంటున్నారు. ఇలా సర్జరీ చేయించుకునే వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం అతనికి సరిపోకపోతే రక్త సంబంధీకుల నుంచి సేకరించి, అమర్చుతున్నట్లు కేర్ ఆస్పత్రిలోని ఈఎన్టీ, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి చెప్పారు. నాజుకైన నడుముకు... శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ‘అధిక బరువుగా’ భావిస్తారు. మధ్య తరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్లు అంచనా. ఓ సర్వే ప్రకారం 2005లో నగరంలో ఈ సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం 10 శాతానికి చేరుకుంది. శరీరంలోనికొవ్వును‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొ ల గిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే... మధ్య తరగతి వారు ల్యాప్రోస్కోపిక్ విధానం లో చేసే బెరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటున్నట్లు లివ్లైఫ్ ఆస్పత్రి బె రియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ చెప్పారు. బట్టతలను వదిలించుకోవడానికి... వివిధ కారణాలతో కుర్రాళ్లకు పాతికేళ్లకే తలపై జుట్టంతా ఊడిపోతోంది. పెళ్లికి ముందే ఈ పరిస్థితి ఎదురు కావడంతో అమ్మాయిలు ఇలాంటి వారిని నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది అబ్బాయిలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇందు కోసం రూ.లక్ష ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదని కాస్మొటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ చెప్పారు. విదేశాలకు పరుగెత్తాల్సిన అవసరం లేదు: డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ కాస్మొటిక్ సర్జరీ అనగానే ఖరీదైన వ్యవహారం అనుకుంటారు. తక్కువ ఖర్చుతో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంది. విదేశాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత సైతం ఇటీవల ఇక్కడికే వస్తున్నారు. నిపుణులు అందుబాటు లో ఉండటం, ఖర్చు తక్కువ ఉండటమే కారణం. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది: డాక్టర్ మురళీ మోహన్‌రెడ్డి, కాస్మొటిక్ సర్జన్, యశోద ఆస్పత్రి అందం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుత తరంఈ విషయాన్ని తొందరగా గ్రహించారు. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అం దాలకు మెరుగుదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మచ్చుకు కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు.. రైనోప్లాస్టీ: అందమైన నాసిక కావాలనుకునే వారి చాయిస్. చప్పిడి ముక్కు, వంకరలు తిరిగిన ముక్కును సరి చేయవచ్చు. బొటాక్స్: ముఖంపై ముడుతలు పోవడానికి చక్కని పరిష్కారం. 30 దాటిన వారు బొటాక్స్ కోసం పరుగులు తీస్తున్నారు. లైపొసక్షన్: పొట్ట, నడుము భాగాల్లోని కొవ్వును కరిగించే శస్త్రచికిత్స. డింపుల్స్ క్రియేషన్స్ సర్జరీ: నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టపడేలా చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్: బట్టతలపై జుట్టు మొలిపిస్తారు. చీక్ అగ్మంటేషన్: ఆకట్టుకునే ముఖాకృతి కోసం చేసే సర్జరీ. గైనకో మాస్టియా: అమ్మాయిల్లా పెరిగిపోయిన మ్యాన్బూబ్స్ తొలగించే శస్త్రచికిత్స. టమ్మీటక్: పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సిక్స్‌ప్యాక్‌లకు దారి చూపుతుంది. బ్లైఫరోప్లాస్టీ: నాజుకైన కంటిరెప్పల కేరాఫ్ అడ్రస్ ఇది. కాస్మొటిక్ సర్జరీలుచేయించుకుంటున్న వారు... యువతులు- 70 శాతం యువకులు- 30 శాతం 25 ఏళ్ల లోపు వారు- 50 శాతం 35 ఏళ్లలోపు వారు- 30 శాతం ఆపై వయసు వారు- 20 శాతం గ్రేటర్లో ప్రతి నెలా జరుగుతున్న కాస్మొటిక్ సర్జరీలు కాస్మొటిక్ సర్జరీలు- 100 రైనో ప్లాస్టీ- 40-50 మేల్బ్రెస్ట్ సర్జరీస్- 60 లైపొసక్షన్- 150 హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్-100