ఏదైన ప్రమాదం బారిన పడితేనో లేక పోట్లాడినప్పుడో ఎముకలు విరగడం జరుగుతుంది. మహా అయితే ఏదైన వ్యాయమం చేసినప్పుడూ ఏదైన ఎముక బెణికి విరిగే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఉత్తిపుణ్యానికి అదికూడా కేవలం దగ్గితే ఎముకలు విరగడం గురించి విన్నారా! వాస్తవానికి ఏదైన జన్యులోపంతో ఎముకలు బలహీనంగా ఉండి విరిగిపోవడం జరుగుతుంది. కానీ కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం.
వివరాల్లోకెళ్తే...చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ఒక రోజు స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడూ విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం వచ్చింది కూడా. ఐతే ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చుకుంటున్న, మాట్లాడుతున్న విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది.
దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హువాంగ్‌కి స్కాన్ చేయగా మొత్తం నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు బ్యాడేజ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు వైద్యులు. ఐతే స్థానిక మీడియా దగ్గితే పక్కటెముకలు విరగడం ఏమిటని వైద్యులను ప్రశ్నించింది. హువాంగ్ బరువు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారు.
ఆమె సుమారు 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కిలోగ్రాములే ఉంటుందని చెప్పారు. ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా... పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని చెప్పారు వైద్యులు. ఆమె కోలుకున్నాక కచ్చితంగా బరువు పెరిగేందుకు వ్యాయమాలు చేస్తానని చెబుతోంది.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment