Chinese Woman Quits Job To Become Full-Time Daughter Gets Salary - Sakshi
Sakshi News home page

ఆ తల్లిదండ్రుల కన్నప్రేమ.. కూతురికి అంతేసి ‘జీతం’.. ఎక్కడా ఇలా జరగదేమో!

Published Mon, May 29 2023 2:00 PM | Last Updated on Mon, May 29 2023 3:08 PM

China Woman Quits Job To Become Full-Time Daughter Gets Salary - Sakshi

వైరల్‌ న్యూస్‌: అదేదో సినిమాలో హీరో ఓ గొప్పింటి హీరోయిన్‌ను పెళ్లి చేసుకునేందుకు.. ప్రేమలు, ఆప్యాయతలు మరచిన ఇంట్లో వాళ్లకి డబ్బిచ్చి మరీ నటించమని అడుగుతాడు. అయితే.. తాను చేసే పనితో విసిగిపోయిన కూతురిని.. ఉద్యోగం మానేసి తమతో పాటు ఇంటిపట్టూనే ఉండమని తల్లిదండ్రులు కోరారట. అయితే అందుకు ఆ కూతురు కండిషన్లు పెడితే.. వాళ్లు దానికి సంతోషంగా అంగీకరించారు. నెలవారీగా ఆ కూతురికి ‘జీతం’ ఇస్తూ పోతున్నారు. విడ్డూరంగా ఉందా?.. 

పెళ్లిపెటాకులకు దూరంగా ఓ న్యూస్‌ ఏజెన్సీలో పదిహేనేళ్ల పాటు పని చేసిందామె. 2022లో జాబ్‌లో ప్రమోషనూ దక్కించుకుంది. కానీ,  అప్పటి నుంచి ఆమెపై ఒత్తిడి పెరిగింది. మానసికంగా కుంగిపోతున్న కూతురిని చూసి ఆ తల్లిదండ్రులు కరిగిపోయారు. ఈ భూమ్మీద ఎవరూ ఇవ్వని బంపరాఫర్‌ను ఆమెకు ప్రకటించారు. 

‘‘నువ్వెందుకు నీ ఉద్యోగం వదిలేయకూడదు.. నీ ఆర్థిక అవసరాలను మేం తీరుస్తాం’’ అంటూ  ఆ తల్లిదండ్రులు చేసిన ప్రతిపాదనను ఆమె స్వీకరించింది. బదులుగా జీతం కింద తమ పెన్షన్‌లో సగం ఇచ్చేందుకు సైతం సిద్ధపడ్డారు వాళ్లు. దీంతో పూర్తిగా తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమైంది ఆమె. అయితే.. ఆ గడపాన్ని ఒక పనిగానే భావిస్తానని.. వాళ్లు నెల నెలా ఇచ్చే డబ్బును జీతంగా ఆమె ప్రకటించుకుంది. అందుకు తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. 

చైనాలోని నియానాన్‌(40) అనే మహిళ.. ఈ ఫుల్‌ టైం డాటర్‌ జాబ్‌తో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా తల్లిదండ్రుల కోసం కేటాయించే షెడ్యూల్‌ను సైతం ఆమె అక్కడి సోషల్‌ మీడియా అకౌంట్‌లలో వివరించింది. బదులుగా నెలకు తమకు వచ్చే 10వేల యువాన్‌ల నుంచి.. నాలుగు వేల యువాన్‌లను ‘జీతం’గా తీసుకుంటుందట.  ఇది తల్లిదండ్రుల మీద ఆధారపడడం అవుతుందే తప్ప.. ఉద్యోగం ఎలా అవుతుంది?.. ఆమె చేసేది చాలా తప్పు అని విమర్శించేవాళ్లూ లేకపోలేదు.  

ఇదీ చదవండి: తెల్లారి లేచి చూస్తే.. ఊరేంటి ప్రపంచమంతా షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement