Fracture
-
ఆ ఫ్రాక్చర్ని ఏఐ పసిగట్టింది..కానీ డాక్టర్లు..
ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ అంటేనే అమ్మో అని హడలిపోతున్నారు జనాలు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని చాలమంది విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం. చెప్పాలంటే దీన్ని వ్యతిరేకించేవారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా నిరుద్యోగం ఎక్కువవతుందనేది అందరి ఆందోళన. అయితే దీన్ని సరిగా ఉపయోగించుకుంటే మన ఎదుగదలకు దోహదపడుతుందనే ఓ సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. సవ్యంగా ఉపయోగిస్తే నష్టాన్ని కూడా లాభంగా మార్చుకోవచ్చు. ఏదైనా మనం ఉపయోగించే విధానంలో ఉంటుందన్నా.. పెద్దల నానుడిని గుర్తు చేసేలా ఓ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన ఓ రకంగా ఏఐపై ఉన్న నెగిటివిటీకి స్వస్తి చెప్పేలా జరిగింది. ఏం జరిగిందంటే..ఓ తల్లి సోషల్ మీడియాలో తన ఏఐ అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారి చర్చలకు దారితీసింది. ఆమె తన కుమార్తె కారు ప్రమాదంలో చిక్కుకుందని. ఆ సమయంలో ఎలాంటి గాయాలు అవ్వకపోయినా ఆమె మణికట్టు నుంచి మోచేయి భాగం వరకు విపరీతమైన నొప్పిని ఎదుర్కొంది. వైద్యులు వద్దకు తీసుకెళ్తే..ఎముకలు ఫ్రాక్చర్ కాలేదని చెప్పి ఇంటికి పంపించేశారు. కానీ ఆమె నొప్పితోనే విలవిలలాడుతూ ఉండేది. దీంతో అనుమానంతో ఎలాన్ మస్క్(Elon Musk ఫ్లాట్‌ఫామ్ ఏఐ చాట్‌బాట్(AI chatbot) గ్రోక్(Grok)లో తన సందేహం నివృత్తి చేసుకునే యత్నం చేసింది. అందుకోసం తన కుమార్తె ఎక్స్ రేని అప్లోడ్ చేసి ఫ్రాక్చర్(fracture) అయ్యిందో కాలేదా అని ప్రశ్నించింది. అయితే గ్రోక్ డిస్టల్ రేడియస్‌లో స్పష్టమైన ఫ్రాక్చర్ లైన్ ఉందని పేర్కొంది. అయితే ఇదే ఈసందేహం ఆ తల్లికి ముందే తట్టింది. అయితే అప్పుడు ఆ వైద్య బృందాన్ని అడిగితే..అది గ్రోత్ ప్లేట్ అని చెప్పి భయపడాల్సిన పనిలేదని ఆ తల్లికి నమ్మకంగా చెప్ప్పారు. కానీ ఇక్కడ ఏఐ ఆ తల్లి అనుమానమే నిజమని తేల్చింది. దీంతో ఆమె మరో చేతి ఎముకల స్పెషలిస్ట్‌ని కలవగా డోర్సల్ డిస్ప్లేస్మెంట్తో డిస్టల్ రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ ఉందని, తక్షణమే సర్జరీ చేయాలని చెప్పడం జరిగిందని పోస్ట్‌లో రాసుకొచ్చింది. త్రుటిలో తన కూతురు ఆ నొప్పి నుంచి బయటపడగలిగింది లేదంటే చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఏఐ మానవుడిని మించిపోయిందని ఒకరు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి విషయాల్లో దీన్ని ఎంతవరకు నమ్మగలం అని మరోకరూ అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.True story: @Grok diagnosed my daughter’s broken wrist last week. One of my daughters was in a bad car accident last weekend. Car is totaled but she walked away. Everyone involved did, thankfully. It was a best case outcome for a serious, multi-vehicle freeway collision.… pic.twitter.com/fRNh81WX0N— AJ Kay (@AJKayWriter) January 11, 2025 (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు. అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్‌ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks. My @OfficeOfKavitha shall be available for any assistance or communication. — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023 అయితే ఎలా గాయపడ్డారనే విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా కవిత అధికారులకు అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ -
నడవలేని స్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. ఫోటో వైరల్
కొంతమంది హీరో,హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా ఇట్టే గుర్తిండిపోతారు. అలాంటి వారిలో నటి కనిహ ఒకరు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కనిహా తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. తమిళనాడుకు చెందిన ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును కనిహా అని మార్చుకుంది. తెలుగులో ఒట్టేసి చెపుతున్నా,నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వంటి సినిమాల్లో నటించింది. 2008లో పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కనిహా గాయపడింది. ఫ్రాక్చర్ కారణంగా నడలేని స్థితిలో ఉంది. వాకర్ పట్టుకొని ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. బ్యాలెన్సింగ్‌గా అడుగులు వేయడం నేర్చకుంటున్నా అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కనిహా త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) -
వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!
ఏదైన ప్రమాదం బారిన పడితేనో లేక పోట్లాడినప్పుడో ఎముకలు విరగడం జరుగుతుంది. మహా అయితే ఏదైన వ్యాయమం చేసినప్పుడూ ఏదైన ఎముక బెణికి విరిగే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఉత్తిపుణ్యానికి అదికూడా కేవలం దగ్గితే ఎముకలు విరగడం గురించి విన్నారా! వాస్తవానికి ఏదైన జన్యులోపంతో ఎముకలు బలహీనంగా ఉండి విరిగిపోవడం జరుగుతుంది. కానీ కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. వివరాల్లోకెళ్తే...చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ఒక రోజు స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడూ విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం వచ్చింది కూడా. ఐతే ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చుకుంటున్న, మాట్లాడుతున్న విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హువాంగ్‌కి స్కాన్ చేయగా మొత్తం నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు బ్యాడేజ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు వైద్యులు. ఐతే స్థానిక మీడియా దగ్గితే పక్కటెముకలు విరగడం ఏమిటని వైద్యులను ప్రశ్నించింది. హువాంగ్ బరువు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె సుమారు 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కిలోగ్రాములే ఉంటుందని చెప్పారు. ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా... పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని చెప్పారు వైద్యులు. ఆమె కోలుకున్నాక కచ్చితంగా బరువు పెరిగేందుకు వ్యాయమాలు చేస్తానని చెబుతోంది. (చదవండి: -
హీరోయిన్ త్రిషకు ప్రమాదం.. కాలికి ఫ్రాక్చర్, ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్‌తో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో త్రిష ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలె విదేశాలకు వెళ్లిన త్రిష గాయంతో తిరిగొచ్చింది. టూర్లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. ఈ క్రమంలో కాలికి పట్టి వేసి ఉన్న ఫోటోని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక త్రిష షేర్ చేసిన ఫోటో చూసి ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ చేతికి గాయం.. సర్జరీ.. వాస్తవం ఏంటంటే?
దీపావళి పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకులతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య ఎన్టీఆర్ సాంప్రదాయ దుస్తులతో కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోటోను కొంచెం పరీక్షించి చూస్తే ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ చేతికి ఫ్రాక్చర్ అయ్యిందా అంటూ ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడి వేలికి గాయం అయిందని, దీంతో ఎన్టీఆర్ సర్జరీ కూడా చేయించుకన్నట్లు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్ అయితే ఈ విషయం మీద ఆరా తీయగా.. ఎన్టీఆర్ చేతికి గాయం అయిన విషయం నిజమేనని తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్ చేతి వేలికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వినికిడి. చదవండి: ఆచార్య: ‘నీలాంబరి’ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) ఇదిలా ఉండగా తారక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ, ఎవరు మీలో కోటిశ్వరుడు ప్రోగ్రాంతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఓ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు. -
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ
అడిలైడ్: తొలి టెస్టులో ఘోర ప్రదర్శనకు తోడు భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్‌లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్‌ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. -
ఫ్రాక్చర్ లేకపోయినా నొప్పి తగ్గడం లేదు
నా వయసు 25 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. నొప్పి ఎంతగా ఉంటోందంటే ఒక్కోసారి అస్సలు దానిపై భారం వేయలేకపోతున్నాను. కాలు కింద పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్–రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. -
భుజంలో తీవ్రమైన నొప్పి... ఎందుకిలా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. ఆఫీసులో పనంతా కంప్యూటర్ పైనే ఉంటుంది. గత మూడు నెలలుగా నా కుడి భుజంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇది డల్ పెయిన్ మాదిరి వచ్చినా ఒక్కోసారి తీవ్రంగా లోపల గుచ్చుతున్నట్లుగా నొప్పి (షార్ప్ పెయిన్)గా మారుతోంది. నా చేతిని తల కంటే పైకి ఎత్తినప్పుడు ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తోంది. మధ్యమధ్యన నొప్పి తెలియడం లేదు. కానీ ఇది తరచూ తిరగబెడుతోంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు. – జగన్నాథరావు, రాజమండ్రి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు భుజంలోని ‘రొటేటర్ కఫ్’ అనే కండరాల సమూహంలో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవి ఏదైనా ఎత్తడానికి ఉపయోగపడతాయి. భుజానికి సంబంధించిన రెండు ఎముకల మధ్యలోంచి వెళ్తాయి. ఆ కండరాలకు ఏదైనా సమస్య వస్తే వాటిలో వాపు వస్తుంది. అప్పుడు మనం భుజం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే ఇవి రెండు ఎముకల మధ్య నలిగిపోతుంటాయి. ఒక్కోసారి కొద్దిగా చిట్లిపోవచ్చు కూడా. ఈ పరిణామం అక్కడ గాయం అయ్యేలా చేస్తుంది. మీరు భుజంతో చేసే పనుల వల్ల ఈ గాయం మరింత రేగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఇది తగ్గడం కోసమే ఉద్దేశించిన ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఇలా రొటేటర్ కఫ్ సమస్య వచ్చినప్పుడు క్రికెట్, బాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మీరు మీ భుజం ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు. ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించాలి. ఆ ప్లేట్లు తొలగించాల్సిందేనా? నాకు ఐదేళ్ల క్రితం జరిగి ప్రమాదంలో ముంజేతికి శస్త్రచికిత్స చేసి, ప్లేట్లు, స్క్రూలు బిగించారు. వాటిని ఇప్పుడు తొలగించడం మంచిది అంటున్నారు. తప్పనిసరిగా తొలగించాల్సిందేనా? – చంద్రశేఖర్, నల్లగొండ సాధారణంగా ఆపరేషన్ కోసం బిగించిన ప్లేట్లు, స్క్రూలను ప్రతిసారీ తొలగించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే కాళ్లల్లో అమర్చిన వాటిని తప్పనిసరిగా తొలగించాలి. మీ విషయంలో ప్లేట్లు చెయ్యికి వేశారంటున్నారు కాబట్టి ఎలాంటి సమస్యా లేకపోతే వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అక్కడే మళ్లీ ఫ్రాక్చర్ అయితే అది మరింత ప్రమాదంగా పరిణమిస్తుంది కాబట్టి సాధారణంగా వాటిని తొలగిస్తుంటారు. అలా తొలగించడమే మంచిది. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. బైక్ యాక్సిడెంట్... మోకాలిపై బరువు పడితే తీవ్రమైన నొప్పి నా వయసు 28 ఏళ్లు. ఇటీవల నేను ప్రమాదవశాత్తు బైక్ మీది నుంచి కింద పడ్డాను. అప్పుడు మోకాలు కొద్దిగా వాచింది. ఇప్పుడు దానిపై ఏమాత్రం భారం వేయలేకపోతున్నాను. డాక్టర్‌కి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – సుబ్రహ్మణ్యం, ఒంగోలు బహుశా మీకు మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణం. అక్కడ నిర్దిష్టంగా ఏమైందో తెలుసుకోవడం కోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... మీకు ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో, అతి విశ్వాసంతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల విషయంలో భవిష్యత్తులో అది మరింత పెద్ద సమస్యగా పరిణమించవచ్చు. ఇక మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేకుండా వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
చివరి టెస్టుకు శిఖర్ ధావన్ దూరం
కోల్‌కతా: ఎడమ చేతి వేలి గాయంతో శిఖర్ ధావన్ న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఆదివారం బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సార్లు అతనికి గాయమైన సంగతి తెలిసిందే. ఎక్స్‌రే తీసిన అనంతరం వేలికి ఫ్రాక్చర్ అరుునట్లుగా తేలింది. దాంతో అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులో ఓపెనర్‌గా గౌతమ్ గంభీర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. మరోవైపు ధావన్ స్థానంలో ముందు జాగ్రత్తగా కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవలి జింబాబ్వే పర్యటనలో రెండు వన్డేలు ఆడిన నాయర్... గత ఏడాది శ్రీలంక పర్యటనలోనూ టెస్టు జట్టుకు ఎంపికై నా, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
ఓ శుభవార్త!
‘‘అభిమానులు, స్నేహితులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. ఇవాళ నడిచా తెలుసా?’’ అని కమల్‌హాసన్ సంబరపడిపోయారు. దాదాపు పదిహేను రోజుల క్రితం మెట్ల మీద నుంచి ఆయన జారిపడిన విషయం తెలిసిందే. కమల్ కుడి కాలు ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. ముందు ఒక ఆపరేషన్, ఆ తర్వాత రెండో ఆపరేషన్ చేశారు. దాంతో కమల్ బెడ్‌కి అంకితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు నొప్పి కాస్త తగ్గడంతో ఆయన నడవడానికి ప్రయత్నించారు. తన గదిలోనే కొన్ని అడుగులు వేశారు. ‘‘ఇద్దరు వ్యక్తుల భుజాల మీద చేతులు వేసి, వాళ్ల సహాయంతో నడిచాను. గాంధీజీలా అన్నమాట. ఏదేమైనా అడుగులు వేసేంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది’’ అని కమల్ తన పరిస్థితిని సరదాగా ట్వీట్ చేశారు. -
బైక్ యాక్సిడెంట్ తరువాత నుంచి మోకాలిలో నొప్పి... తగ్గేదెలా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. ఒక్కోసారి ఎంత నొప్పి ఉంటోందంటే దానిపై అస్సలు భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. - కృష్ణకుమార్, హైదరాబాద్ ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్-రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో అది భవిష్యత్తులో మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. నా వయసు 30 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా ఏదైనా వైకల్యం వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - రమేశ్, నిర్మల్ మీ సమస్యను నిశితంగా పరిశీలించినట్లయితే మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వృద్ధాప్యంలో కీలక సమస్య ‘ఫాల్’
డాక్టర్ సలహా ఇటీవల పెద్దవయసు వారు బాత్‌రూమ్‌ల్లోనూ, మెట్ల దగ్గర పడిపోతున్న ఉదంతాలను ఎక్కువగా చదువుతున్నాం. ఇలా పడిపోయే అవకాశాలను ముందుగా తెలుసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా? - సీహెచ్. సుదర్శన్‌రావు, మహబూబ్‌నగర్ ఫాల్ అంటే పడిపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చిన్నవయసు వారు పడిపోయి, ఫ్రాక్చర్ అయినా వారు కోలుకునే వ్యవధి తక్కువ. ఎముక అతుక్కునే తీరు కూడా వేగంగా జరుగుతుంది. కానీ పెద్దవారు పడిపోయి, ఎముక ఫ్రాక్చర్ అయితే అది మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తాము పడిపోయే అవకాశాన్ని వృద్ధులు తమకు తామే పరీక్షించుకోవచ్చు. ముందుగా మీ కుడి చేతిని గోడకు ఆనించి నిలబడండి. దాన్ని గోడకు ఆనించి ఉంచే పిడికిలి బిగించి నేరుగా ముందుకు చాపండి. ఇలా కుడి చేతిని నిటారుగా ఉంచి ముందుకు కొద్దికొద్దిగా ఒంగుతూ... పడిపోకుండా గరిష్టంగా ఎంతమేరకు ఒంగగలరో చూడండి. ముందుకు ఒంగకుండా కేవలం కుడి చేయి చాచి ఉన్నప్పుడూ.... పడిపోకుండా ముందుకు ఒంగుతూ చాచిన చేతిని పొడిగించినప్పుడూ ఉన్న తేడా ఒక అడుగు (30 సెం.మీ.) ఉంటే అలాంటి వృద్ధుల్లో ‘ఫాల్’కు (పడిపోవడానికి) అవకాశం చాలా తక్కువ. అయితే ఒకవేళ ఇలా ఒంగుతూ చేతిని సాచినప్పుడు మీరు మీ చేతిని కేవలం 30 సెం.మీ లోపే సాచగలుగుతుంటే మాత్రం బాత్రూమ్లోనో లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడో లేదా ఇతరత్రా కార్యకలాపాల్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ అని గుర్తించండి. ఇలాంటి వాళ్లు నడిచేసమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. - డాక్టర్ బి. విజయకుమార్, సీనియర్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్