ఓ శుభవార్త! | goos news for kamal fans | Sakshi
Sakshi News home page

ఓ శుభవార్త!

Published Wed, Aug 3 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

ఓ శుభవార్త!

ఓ శుభవార్త!

‘‘అభిమానులు, స్నేహితులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. ఇవాళ నడిచా తెలుసా?’’ అని కమల్‌హాసన్ సంబరపడిపోయారు. దాదాపు పదిహేను రోజుల క్రితం మెట్ల మీద నుంచి ఆయన జారిపడిన విషయం తెలిసిందే. కమల్ కుడి కాలు ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. ముందు ఒక ఆపరేషన్, ఆ తర్వాత రెండో ఆపరేషన్ చేశారు. దాంతో కమల్ బెడ్‌కి అంకితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు నొప్పి కాస్త తగ్గడంతో ఆయన నడవడానికి ప్రయత్నించారు.

తన గదిలోనే కొన్ని అడుగులు వేశారు. ‘‘ఇద్దరు వ్యక్తుల భుజాల మీద చేతులు వేసి, వాళ్ల సహాయంతో నడిచాను. గాంధీజీలా అన్నమాట. ఏదేమైనా అడుగులు వేసేంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది’’ అని కమల్ తన పరిస్థితిని సరదాగా ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement