Operation
-
SLBC లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్
-
బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి..
తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్(38) కథ దీనికి భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్ సపోర్ట్‌తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్ రామ్పాట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు దాదాపు చనిపోయారని అర్థం.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
Munich: జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు
బెర్లిన్: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గురువారం సిటీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ జరుగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిపిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధాని ఇది. శుక్రవారం ఈ నగరంలో భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ కాన్సరెన్స్ను హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఘటనలో గాయపడ్డవాళ్లంతా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లేనని సమాచారం. -
బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ డెవిల్స్ హంట్.. 1300 మంది అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు, ప్రత్యర్థుల ఏరివేతకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ చెప్పుకొచ్చారు.ప్రజా భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెవిల్ హంట్’లో ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన దాడులు మరింత పెరిగాయి. వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల హేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని.. మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్‌లే కారణమని సమాచారం. -
ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు
అఖ్నూర్: జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అసన్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపధ్యంలో భారత ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం. అది 2020, మే 25న జన్మించింది. ‘మా నిజమైన హీరో, ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ డాగ్, ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము వందనం చేస్తున్నాం’ అని భారత ఆర్మీ పేర్కొంది.కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ‘ఫాంటమ్’కి శత్రువుల బుల్లెట్లు తగిలాయి.కే9 యూనిట్‌కి చెందిన శునకాలలో ఫాంటమ్ ఒకటి. ఇది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పోరాడేందుకు శిక్షణ పొందిన శునకం. మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ నుండి ఈ శునకాన్ని తీసుకువచ్చారు. ఈ శునకం 2022, ఆగస్ట్ 12 నుంచి అసాల్ట్ డాగ్ యూనిట్లో ఉంది.UpdateWe salute the supreme sacrifice of our true hero—a valiant #IndianArmy Dog, #Phantom.As our troops were closing in on the trapped terrorists, #Phantom drew enemy fire, sustaining fatal injuries. His courage, loyalty, and dedication will never be forgotten. In the… pic.twitter.com/XhTQtFQFJg— White Knight Corps (@Whiteknight_IA) October 28, 2024ఈ సందర్భంగా జమ్మూ డిఫెన్స్ పీఆర్ఓ మాట్లాడుతూ, ‘మా శునకం ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి వందనం చేస్తున్నాం. మన సైనికులు ఉగ్రవాదులను సమీపిస్తున్నప్పుడు, ఫాంటమ్ శత్రువుల కాల్పులకు గురయ్యింది. దీంతో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలింది. దాని ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మర్చిపోలేం’ అని అన్నారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
ఆపరేషన్ తోడేలు సక్సెస్
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాను కొన్ని నెలలపాటు వణికించిన తోడేళ్ల కథ ముగిసింది.ఆపరేషన్ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఐదు ఇప్పటికే పట్టుబడగా తాజాగా శనివారం(అక్టోబర్5) ఆరో తోడేలును గ్రామస్తులు మట్టుబెట్టారు. మేకను వేటాడుతుండగా గ్రామస్తులు ఆరో తోడేలును కొట్టి చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు.ఐదో తోడేలు పట్టుబడ్డాక 24 రోజులుగా ఆరో తోడేలు ఒక్కతే తప్పించుకు తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలుపెట్టింది. అయితే గ్రామస్తుల దాడిలో మరణించిన ఆరో తోడేలు మ్యాన్ఈటర్ అని చెప్పలేమని అటవీ అధికారులు అన్నారు.గత కొన్ని నెలలుగా బహ్రెయిచ్‌లో ఆరు తోడేళ్ల గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. తోడేళ్లు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందగా 50 మంది దాకా గాయపడ్డారు. ఆపరేషన్ భేడియా సక్సెస్ కావడంతో బహ్రెయిచ్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ చదవండి: నెత్తురోడుతున్న బస్తర్ అడవులు -
యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
డ్రోన్ల సాయంతో నరభక్షక తోడేళ్ల గాలింపు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు పోలీసులు, జిల్లా అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బహ్రైచ్ డివిజన్ సర్కిల్ అధికారి అభిషేక్ సింగ్ మాట్లాడుతూ డ్రోన్ల సాయంతో తోడేళ్ల జాడలు లభించాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారితో పాటు మొత్తం బృందమంతా సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందన్నారు. ఒకట్రెండు రోజుల్లో తోడేళ్లను పట్టుకుంటామన్నారు. గత కొన్ని నెలలుగా బహ్రైచ్‌లో స్థానికులను తోడేళ్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నరమాంస భక్షక తోడేళ్లు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 8 మందిని చంపాయి. అధికారులు ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకోగా, మరో రెండు తోడేళ్లను పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగుతోంది. తోడేళ్లను రక్షించడానికి, పట్టుకోవడానికి పీఎసీకి చెందిన 200 బృందాలు, రెవెన్యూ శాఖకు చెందిన 32 బృందాలు, అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి.మహసీ తహసీల్‌లోని హార్ది, ఖైరీఘాట్ పరిధిలోని దాదాపు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు కేజ్‌లు, నెట్, ఆరు ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో తోడేలు మరోసారి దాడి చేసింది. ఇంట్లో తల్లితో కలిసి పడుకున్న ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది. ఈ ఘటన మజ్రా జంగిల్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ తోడేలు చిన్నారి మెడను నోటకరచుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆ చిన్నారి అరుపు విని కుటుంబ సభ్యులు నిద్ర నుంచి లేచారు. దీంతో ఆ తోడేలు పొలాల్లోకి పరుగెత్తింది. -
వయనాడ్ విలయం : ఆమె సీత కాదు.. సివంగి
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎవ్వరూ బతికి ఉంటే అవకాశం లేదంటూ స్వయంగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతటి విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో, రికార్డు సమయంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించిన మేజర్ సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.ఇండియన్ ఆర్మీకి చెందినమద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్‌కు చెందిన మేజర్ సీతా షెల్కే సహాయక చర్యలలో చురుకుగ్గా పాల్గొన్నారు. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిల్సుస్తోంది. కేరళలోని వాయనాడ్‌లో కేవలం16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం, షెల్కే చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు. ఇంకా పలువురు సైనికాధికారులు, నెటిజన్లుఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు. వంతెన నిర్మాణం జూలై 31న రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 1సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. మేజర్ షెల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ల మధ్య వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం, వేగవంతం చేసింది.Kudos to Maj Seeta Shelke & her team of #MadrasEngineersGroup of #IndianArmy who went beyond all kind of challenges & built the 190ft long bridge with 24 Ton capacity in 16 hours in #Wayanad Started at 9 pm on 31 July & completed at 5:30 pm on 1 Aug. @giridhararamane #OPMADAD pic.twitter.com/QDa6yOt6Z2— PRO Defence Trivandrum (@DefencePROTvm) August 1, 2024 -
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం
జమ్ముకశ్మీర్‌లోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత ఆర్మీ సిబ్బంది భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు నెలకొన్న కారణంగా విజిబులిటీ సున్నాగా ఉంది. అటువంటి పరిస్థితిలోనూ ఇండియన్ ఆర్మీ ఎంతో సమర్థవంతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) మరోసారి బట్టాల్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ బృందం ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాక్ ఉగ్రవాదులు అర్థరాత్రి నుంచి కశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు ఉగ్రవాదుల చొరబాటుయత్నాలను భగ్నం చేశాయి.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఒక సైనికుడు గాయపడ్డారు. -
ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రధాని పిలుపు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్ సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.2014, డిసెంబర్ 16న పాక్‌లోని పెషావర్ స్కూల్‌పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు. -
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్‌లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. చికిత్స అందించే విధానాల్లో నూతన ప్రక్రియలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన వైద్యులు మరో అద్భుతం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఢిల్లీలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగికి 40 కి.మీ. దూరం నుంచి టెలీసర్జరీ టెక్నిక్ ద్వారా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో, రోగికి కోత పెట్టడం నుంచి కణితిని తొలగించడం, తిరిగి కుట్లు వేయడం వరకు మొత్తం ప్రక్రియ పూర్తయింది. డార్క్ గ్లాసెస్ ధరించి, రోబోట్‌ను ఆపరేట్ చేస్తూ, వైద్యులు రోగి మూత్ర నాళం చుట్టూ ఉన్న క్యాన్సర్ ప్రభావిత కణాలను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వారంలో బాధితుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.వైద్యుల బృందం గురుగ్రామ్‌లోని ఎస్ఎన్ ఇన్నోవేషన్‌లో ఉండగా, 52 ఏళ్ల రోగి ఢిల్లీలోని రోహిణిలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చికిత్స అందుకున్నాడు. ఆపరేషన్ సమయంలో ఇంటర్నెట్తో పాటు సాంకేతికతకు అంతరాయం ఏర్పడకుండా వైద్యప్రక్రియ విజయవంతంగా జరిగింది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, జెనిటో-యూరో ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ రావల్‌తో పాటు అతని వైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.ఈ సందర్భంగా డాక్టర్ రావల్ మాట్లాడుతూ దేశంలోని ఏ మూలన ఉన్న రోగులకైనా టెలిసర్జరీ ద్వారా చికిత్స సాధ్యమవుతుందన్నారు. ఆపరేషన్ సమయంలో తన రెండు చేతులు రోబోపై ఉంచానని, తాను ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్లు భావిస్తూ, పేషెంట్ ఎదురుగా పడుకుండగా మానిటర్లో చూస్తూ చికిత్స చేశానన్నారు. సాధారణ ఆపరేషన్‌లో రోగి శస్త్రచికిత్స భాగం ఎలా కనిపిస్తుందో, ఈ టెక్నిక్‌లో త్రీడీ నాణ్యతతో మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.ఈ ఆపరేషన్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా జరిగింది. దీనికి ఐదు సన్నని రోబోటిక్ చేతులు ఉన్నాయి. దీనికి త్రీడీ హెచ్డీ సెట్ అనుసంధానమై ఉంది. ఇది సర్జన్‌కు మరింత స్పష్టమైన దృశ్యం కనిపించేలా చేస్తుంది.ఈ పద్ధతిలో రోగి చిన్నపాటి కోతకు గురవుతాడు. రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ సోకిన అవయవం లేదా కణం తొలగించిన తర్వాత, కుట్లు వేస్తారు.ఈ పద్ధతిలో రోగి సంప్రదాయ శస్త్రచికిత్సా విధానం కంటే త్వరగా కోలుకుంటాడు. బెంగళూరుకు చెందిన 400 మంది వైద్యుల దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. -
‘కాంబోడియా’ కేసులో మరో ఇద్దరు ఏజెంట్ల అరెస్టు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను విదేశాలకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ కాంబోడియా పేరిట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న సుమారు 25 మంది యువకులను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ చొరవతో క్షేమంగా విశాఖకు తీసుకువచి్చన విషయం తెలిసిందే. ఇంకా కాంబోడియాలో చిక్కుకొని ఉండిపోయిన బాధితులను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఆయన విడుదలచేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి, వాటి మూలాలు ఛేదించడానికి విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ కె.ఫకీరప్ప పర్యవేక్షణలో విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు యువకులను పంపిస్తున్న గాజువాక, భానుజీనగర్ ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకోగా విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. కన్సల్టెన్సీ ఏజెంట్ కొలుకుల వీరేంద్రనాథ్(37) ఇంజనీరింగ్ చదివి 2023 నుంచి కాంబోడియా దేశానికి ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను పంపిస్తున్నాడు.అనకాపల్లికి చెందిన రామకృష్ణను పరిచయం చేసుకొని, తాను కాంబోడియా దేశం నుంచి వచ్చానని, అక్కడికి కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్‌గా పంపిస్తే మంచి కమీషన్ వస్తుందని చెప్పాడు. కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న 17 మంది నుంచి రూ.లక్షా 20 వేల చొప్పున తీసుకుని పంపించారు. వారికి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు కమీషన్ లభించింది. అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వీరేంద్రనాథ్, అతని భార్య శ్రీప్రియ కాంబోడియా ఏజెంట్‌కు అనేక మంది సిస్టమ్ ఆపరేటర్స్‌ను పలు దఫాలుగా పంపించారు. వీరిలో కొంతమందిని విజిటింగ్ వీసాపైన బ్యాంకాక్ పంపించి అక్కడ నుంచి కాంబోడియా దేశం బోర్డర్ వద్ద ఆ దేశ వీసా తీసుకుని అక్కడి చైనా కంపెనీలకు ఈ నైపుణ్యం గల వ్యక్తులను 2500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లకు విక్రయించారు. చీకటి రూమ్‌లో బంధించి.. అక్కడికి వెళ్లిన యువకులను చైనా కంపెనీలు అదుపులోకి తీసుకుని ఓ చీకటి గదిలో బంధించేవారు. వివిధ రకాల సైబర్ నేరాలు ఏ విధంగా చేయాలనే అంశంపై బలవంతంగా స్క్రిప్ట్ ఇస్తూ ట్రైనింగ్ ఇవ్వడమే గాక సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చిత్రహింసలకు గురిచేస్తారు. ఆహారం, నీరు ఇవ్వకుండా కట్టిపడేస్తుంటారు. వారి వలలో చిక్కుకున్న తర్వాత బయటపడడం అసాధ్యం. చేసిన నేరాల ద్వారా సంపాదించిన డబ్బులో 1 శాతం కమీషన్ ఇస్తూ 99 శాతం కంపెనీలే తీసుకుంటాయి. వీరంతా ఉత్సాహంగా పనిచేసేందుకు పలు రకాల ఎంటర్టైన్మెంట్స్ అలవాటుచేస్తారు.పబ్స్, కేసినో గేమ్స్, మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు సంపాదించిన డబ్బును ఖర్చుపెట్టేలా తయారు చేస్తున్నారు. చైనా కంపెనీ చెర నుంచి తప్పించుకుని నగరానికి చేరుకున్న బాధితుడు పెమ్మడి చిరంజీవి, కల్యాణ్, శేఖర్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్ విచారణ చేపట్టగా స్కామ్ బయటపడింది. ఈ రాకెట్లో ప్రధాన నిందితుడు చుక్క రాజే‹Ù, అతని వద్ద పనిచేస్తున్న సబ్ ఏజెంట్లు గాజువాకకు చెందిన సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావును ఇంతకుముందే అరెస్టు చేశారు. తాజాగా కొలుకుల వీరేంద్రనా«థ్, కొమ్ము ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం దీని వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టడానికి లోతైన దర్యాప్తు చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. అందుకు స్పెషల్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాదరావు (సెల్ నంబర్ 9490617917)కు, కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 0891–2565454కు, లేదా సీపీ వాట్సప్ నంబరు 9493336633కు ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు 1930కి నంబర్‌కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
విశాఖ పోలీసుల వేట ఆపరేషన్ కంబోడియా
-
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే రాఖీసావంత్ గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె మాజీ భర్త రితేశ్ సింగ్ తెలిపారు.ప్రస్తుతం రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స విజయవంతంగాపూర్తైనట్లు ఆమె మాజీ భర్త తెలిపారు. తాజాగా ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు దాదాపు 10 సెంటిమీటర్ల కణతిని తొలగించారని పేర్కొన్నారు. మే 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతర ఆమె అపస్మారక స్థితిలో ఉందని మాజీ భర్త చెప్పారు. రాఖీ గర్భాశయంలో కణితి చాలా పెద్దదిగా ఉందని.. దాదాపు అరచేతి పరిమాణంలో ఉందని రితేశ్ తెలిపారు. మొదటిసారి అది చూసి తాను షాకయ్యానని చెప్పారు. ఆమెకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగినట్లు వివరించారు. రాఖీ కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
షాడో నిఘా! లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా.. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎత్తులు.. దానికి ప్రత్యర్థుల పైఎత్తులు మామూలే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఈ ఎత్తులు, పైఎత్తుల విషయంలో తిప్పలు పడుతున్నారు. ఓ వైపు తమ ప్రచారం కొనసాగిస్తూనే.. ప్రత్యర్థుల వ్యూహాలేమిటో తెలుసుకునేందుకు నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా కొందరు ఏకంగా ‘కోవర్ట్ ఆపరేషన్లు’ కూడా చేయిస్తున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఎత్తులు తెలిస్తేనే పైఎత్తులు.. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఆరు నెలల్లోపే లోక్‌సభ ఎన్నికలు రావడం ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రతి అభ్యర్థి కూడా.. ఎదుటి పార్టీలో, పోటీలో ఉన్న అభ్యర్థులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు. వారు ఎవరిని ఎలా కలుస్తున్నారు? ఏ హామీలిస్తున్నారు? ప్రలోభాల ఘట్టం ప్రారంభించారా? డంప్‌లు ఎక్కడ ఏర్పాటు చేశారు? వంటి అంశాలు తెలుసుకుని తిప్పికొట్టాలని.. ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుచరులకు ‘ప్రత్యేక’బాధ్యతలు ప్రత్యర్థులపై నిఘాకు, వ్యూహాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు కొందరు నమ్మకస్తులైన అనుచరులను ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నారు. వారు తమ అభ్యర్థి తరఫున పనిచేసినా, చేయకున్నా.. ఎదుటి అభ్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడమే పని. వారు మరికొందరిని సమీకరించుకుని ‘షాడో టీమ్స్’మాదిరిగా పనిచేస్తూ.. ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలేమిటన్నది తెలుసుకుని.. అభ్యర్థులకు సమాచారమిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలనూ ఆశ్రయిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు భారీగానే ఖర్చుపెడుతున్నారట. డంప్‌ల డేటా ‘లీక్’చేసేందుకు.. ప్రతి అభ్యర్థి తన ప్రత్యర్థులను వీలైనన్ని ఎక్కువ కోణాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ప్రచార వ్యూహాలు మాత్రమేకాదు.. వారి ప్రలోభాల ‘డంప్స్’ల సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. మద్యం, నగదును ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తున్నది ఎవరు? అనే అంశాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి వాటి సమాచారం ఇప్పించడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికల ‘సిత్రాలు’ఎన్నో.. కోవర్టు ఆపరేషన్లకూ ప్లాన్! అభ్యర్థులు తాము ఎవరితో నిఘా పెట్టినదీ ప్రత్యర్థి పార్టీవారు గుర్తించకుండా ఉండాలి, లేకుంటే బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువు. పూర్తిగా కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండే అవకాశం తక్కువ. దీంతో కొందరు అభ్యర్థులు.. కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యర్థుల వెంట ఉండేవారికి ఎర వేసి, వారి నుంచే సమాచార సేకరణ చేస్తున్నట్టు చెప్తున్నాయి. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నట్టు వివరిస్తున్నాయి. -
బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్
బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్‌లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది. తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. -
రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు!
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం అర్థరాత్రి దానాపూర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ హోలీ స్పెషల్ రైలులో మంటలు చెలరేగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భోజ్‌పూర్ జిల్లా పరిధిలోని బిహియా- కరిసాత్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోలీ ప్రత్యేక రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యూపీ రైల్వే లైన్‌లోని ఓహెచ్‌ఈలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపారు. నేటి (బుధవారం) ఉదయం ట్రాక్‌ను క్లియర్ చేసిన తర్వాత, నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, పాట్నా ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను వాటి షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు అనుమతించారు. ఈ హోలీ స్పెషన్ రైలులో అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను తొలగించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్‌తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్‌లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
మావోయిస్టులపై కేంద్రం ఫోకస్.. దద్దరిల్లిన దండకారణ్యం!
సాక్షి, రాయ్‌పూర్: మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలో బలగాల కూంబింగ్‌లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉలికిపాటు మొదలైంది. వివరాల ప్రకారం.. మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతోంది. నారాయణపూర్‌లో కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పీఎల్జీఏ స్థావరం అబూజ్మడ్ను చుట్టుముట్టేందుకు బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్కు చెందిన పదివేల మందితో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, ఇటీవలే జోసెఫ్ (దర్శన్ పాల్), సంజీత్ (అర్జున్ ప్రసాద్ సింగ్)ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మూలంగా భారత్ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అబూజ్మడ్ను ముట్టడించే కార్యక్రమానికి కేంద్ర భద్రతా వర్గాలు రెడీ అయ్యాయి. ఇక, తాజాగా కూంబింగ్‌తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని తూర్పు డివిజన్ ఉలిక్కిపడింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక..
అది 2023, జూలై 6.. 70 ఏళ్ల వృద్ధుడు దట్టమైన అడవిలో దారి తప్పాడు. అతనితోపాటు వచ్చినవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి 48 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మనదేశంలోని గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు.. గుజరాత్‌లోని గిర్నార్ అడవుల ఎంతో దట్టంగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా దారి తప్పారంటే ఇక అంతే సంగతులు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా పూప్ తాలూకాలోని కుప్రాలా గ్రామానికి చెందిన మదన్మోహన్ మురళీధర్ జైన్(72) ఈ ఏడాది జూలై 6వ తేదీన 20 మంది సభ్యుల బృందంతో పాటు జునాగఢ్‌లోని గిర్నార్‌కు విహారయాత్రకు వచ్చాడు. వారంతా గిర్నార్‌లోని అంబాజీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారంతా అక్కడి జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే మురళీధర్.. బృంద సభ్యుల నుంచి వినిపోయాడు. ఆ సమయంలో అతనికి దాహం వేయడంతో నీటి కోసం వెదుకుతూ వెళ్లాడు. ఒకచోట ఊట నీరు తాగుతుండగా అతని కాలు జారింది. ఆ నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాడు. కాస్త తేరుకుని లేచి నిలబడే సమయానికి అడవి మధ్యలోకి వచ్చేశాడు. నీటిలో కొట్టుకుపోయిన సందర్భంలో అతని పాదాలకు, తలకు ముళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. అటువంటి దుర్భర పరిస్థితిలో మురళీధర్ తనను కాపాడమంటూ ఎనిమిది గంటల పాటు కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతని ఆరుపులు అరణ్యరోదనగా మారాయి. కొద్దిసేపటికి మురళీధర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి అడవి పందుల గుంపు అతనికి అతి సమీపం నుంచి వెళుతోంది. వాటిని చూసినంతనే అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. అయితే అవి అతనిని ఏమీ చేయకుండా విడిచిపెట్టడం విశేషం. మరోవైపు మురళీధర్ బృంద సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 33 మంది సభ్యులు గల ఎస్డిఆర్ఎఫ్, పోలీసు, అటవీ శాఖ హోంగార్డుల బృందం అడవిలో గాలింపు చేపట్టింది. ఎట్టకేలకు 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం వారు మురళీధర్‌ను గుర్తించి కాపాడారు. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..?
ఉత్తరకాశీ: ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి 17 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతం అయింది. 41 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 800 మిల్లీమీటర్ల పైపు గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మట్టి తొలగింపు పనులను పూర్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు వదలకుండా రెస్క్యూ అపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే..? సొరంగం కూలింది ఇక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో సొరంగం లోపలి వైపుగా 41 మంది కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడల్పుమేర శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. చిక్కుకున్న కార్మికులకు ఆహారం ఇలా.. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కూలడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారింది. దీంతో చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందించారు. దీంతో సొరంగంలో కార్మికులు ప్రాణాలతో ఉండగలిగారు. స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలను కూడా చూశారు. లోపలికి ల్యాండ్‌లైన్.. ఆహారం నీరు అందడంతో కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపారు. ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడారు. అనుకోని అవాంతరాలు.. సొరంగంలో మొదట సమాంతరంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. కానీ ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకునేలోపే అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. Uttarakhand Tunnel Rescue:ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు వాతావరణం కూడా అడ్డంకిగా మారి.. ఉత్తరాఖండ్‌లో అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్‌కు కొత్త సమస్యలను సృష్టిచింది. వర్షాలు, వడగళ్ల వాన కురిసి రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించిన ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధులు రెస్క్యూ సిబ్బందికి ప్రోత్సాహాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కూడా తన బృందంతో ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్.. సమాంతరంగా అవాంతరాలు ఎదురవడంతో సొరంగంలో కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను మొదలు పెట్టారు. ఈ క్రమంలో డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి అధునాతన ఆగర్ మెషీన్‌ను ఉపయోగించారు. 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. కానీ శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడ్డాయి. దీంతో డ్రిల్లింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మ్యాన్యువల్ పద్దతిని ఎంచుకున్నారు. చివరికి మాన్యువల్‌గానే డ్రిల్లింగ్.. డ్రిల్లింగ్ మిషన్ ధ్వంసం కావడంతో సాధారణంగా మనుషులతోనే తవ్వాల్సి వచ్చింది. మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గింది. దాదాపు 57 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశారు. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో మెషీన్‌ను వెనక్కి లాగారు. కానీ మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీశారు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేశారు. భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడంలో సహాయం చేసింది. ఇందుకు ర్యాట్-హోల్ పద్దతిని ఉపయోగించారు. Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదిలారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్‌పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel: నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు!
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 17 రోజులు దాటుతున్నా విముక్తి లభించలేదు. వారిని చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొదట డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి తెచ్చిన యంత్రం చెడిపోయింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణం కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మెషిన్ చెడిపోవడంతో ప్రస్తుతం మాన్యువల్ డ్రిల్లింగ్ జరుగుతోంది. 86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 మీటర్ల మేరకు తవ్వగలిగారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన డ్రిల్లింగ్ మిషన్ బ్లేడ్లు.. బాధిత కార్మికులున్న ప్రదేశానికి 12 మీటర్ల ముందుగానే విరిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపివేసి, బ్లేడ్లను తొలగించాల్సివచ్చింది. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్‌కు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల రెస్క్యూకు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సంఘటనా స్థలానికి వచ్చారు. సొరంగంలో వర్టికల్ డ్రిల్లింగ్ శరవేగంగా జరుగుతోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు 36 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. కార్మికులలో నిరాశానిస్పృహలు నెలకొన్న దృష్ట్యా, ఐదుగురు వైద్యుల బృందం సంఘటనా స్థలంలో ఉంటోంది. వారు సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని, వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూస్తున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు త్వరగా బయటకు రావాలని కాంక్షిస్తూ స్థానికులు సొరంగం దగ్గర హోమాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం! -
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌కు మరో ఆటంకం?
ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో అక్కడి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ప్రభావం పడనుంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శ్రీనగర్‌తో పాటు ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంది. హిమాచల్‌లో ఆదివారం నుంచి వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 26 నుండి ఉత్తరాఖండ్‌తో పాటు హిమాలయ ప్రాంతంలో మంచు కురవనుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఫలితంగా పర్వత ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. సోమవారం ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ, పితోరాఘర్తో సహా 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. పహల్గామ్ కాశ్మీర్‌లోని అతి శీతల ప్రాంతం. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -3.4 డిగ్రీల సెల్సియస్, శ్రీనగర్, గుల్మార్గ్లలో -1.0 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుత శీతాకాలంలో శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు వెళ్లడం ఇది రెండోసారి. జమ్మూలో కూడా తేలికపాటి సూర్యరశ్మి ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా చలిగా ఉంటుంది. పగటిపూట కాస్త ఉపశమనం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో 25 స్వైన్ కేసులు -
‘ఉత్తర కాశీ’ ఆపరేషన్‌లో స్వల్ప ఆటంకం!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగింది. నేడు గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారి రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
ఆపరేషన్ అజయ్: భారత్ చేరిన ఐదో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ అజయ్ నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా 286 మందితో కూడిన మరో విమానం భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత్ తిరిగి వచ్చిన వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళ వాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. దీంతో స్వదేశానికి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో సుమారు 900పైగా మందిని భారత్‌కు తరలించారు. తాజాగా ఐదో విమానం చేరుకుంది. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది. -
ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు
ఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఓ రోజు రెండు విమానాలు భారత్ చేరాయి. 197 మందితో మూడో విమానం, 274 మందితో నాలుగో విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన భారతీయులకు జాతీయ జెండాలు ఇచ్చి కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ స్వదేశానికి స్వాగతం పలికారు. యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ప్రాంతం నుంచి స్వదేశానికి తీసుకువచ్చినందుకు బాధితులు కేంద్ర ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి, రెండో విమానంలో 212, 235 మందిని వరుసగా ఇండియాకి తరలించారు. నాలుగో విమానం 274 మందితో టెక్ అవీవ్ నుంచి శనివారం రాత్రి 11:45కి ఇప్పటికే బయలుదేరింది. ఇప్పటివరకు దాదాపు 918 మందిని భారత్‌కి తరలించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులకు ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి. హమాస్ దళాలపై భూతల, వాయు, జల మార్గాల్లో దాడులు చేస్తున్నారు. ఇళ్లలో, సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై పట్టు వీడకుండా పోరాడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3500 మంది ఇప్పటికే మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 పైగా పౌరులు మరణించగా.. పాలస్తీనాలో 2000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఇదీ చదవండి: 235 మందితో రెండో విమానం రాక -
235 మందితో రెండో విమానం రాక
న్యూఢిల్లీ: సంక్షుభిత ఇజ్రాయెల్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’ పేరిట భారత సర్కార్ మొదలుపెట్టిన పౌరుల తరలింపు కార్యక్రమంలో భాగంగా శనివారం 235 మందితో ఇజ్రాయెల్ నుంచి బయల్దేరిన విమానం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీకి ఈ విమానం చేరుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ శనివారం వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పౌరులు చేరుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. టెల్ అవీవ్ నగరం నుంచి తొలి విమానం వచి్చన సంగతి తెల్సిందే. ఎయిర్ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆపరేషన్ కింద తొలి విమానంలో 200కుపైగా భారతీయులు స్వదేశానికి రాగలిగారు. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. ‘ మోదీ సర్కార్ తక్షణం స్పందించి తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడం పట్ల వీరంతా సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి ట్వీట్‌చేశారు. దీంతో శనివారంనాటికి మొత్తంగా 400కుపైగా భారత్‌కు చేరుకున్నారు. మరో రెండు విమానాలూ వస్తున్నాయ్ టెల్ అవీవ్ స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదింటికి, రాత్రి 11 గంటలకు మరో రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కు బయల్దేరతాయని టెల్ అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. సాయంత్రం విమానంలో 230కిపైగా, రాత్రి విమానంలో 330కిపైగా ప్రయాణికులు స్వదేశానికి రానున్నారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవి బయల్దేరతాయి. సంబంధిత వివరాలను ఎంబసీ ట్వీట్‌చేసింది. విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులు, వజ్రాల వ్యాపారులు సహా పలు రంగాలకు చెందిన దాదాపు 18,000 మంది భారతీయపౌరులు ఇజ్రాయెల్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సరీ్వస్‌లు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఆదివారంకల్లా రెండూ ఢిల్లీకి వస్తాయి. -
ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో విమానం 235 మందితో ఢిల్లీ చేరుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 212 మంది భారతీయులతో శుక్రవారమే మొదటి విమానం చేరుకున్న విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై బాధితులు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా మొదటగా రిజస్టర్ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. రెండో విమానం రాత్రి 11.02కు ఢిల్లీ చేరుకుంది. ఆదివారం కూడా ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎంబసీలో రిజస్టర్ చేసుకున్నవారికి నేడు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. నేడు కూడా మరో విమానం భారత్ చేరనుంది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: 212 మంది భారతీయుల తరలింపు -
ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 212 మందితో కూడిన మొదటి ఛార్టర్ ఫ్లైట్ ఢిల్లీకి చేరింది. స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న భారతీయులను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీకి బాధితులు ధన్వవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నేపథ్యంలో ఎయిర్ ఇండియా రాకపోకలను అక్టోబర్ 7నే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ప్రస్తుతం కేంద్రం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానాలలో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది. Welcome to the homeland! 1st #OperationAjay flight carrying 212 citizens touches down in New Delhi. pic.twitter.com/FOQK2tvPrR — Arindam Bagchi (@MEAIndia) October 13, 2023 ఇజ్రాయెల్‌లోని పౌరుల కోసం భారత్ చర్యలు ఇజ్రాయెల్ దేశంలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. దాదాపు 18000 మంది ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ అజయ్’పేరుతో దేశ పౌరుల తరలింపు ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఆపరేషన్ అజయ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు’ బుధవారం ట్విటర్లో ప్రకటించారు. భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని తమ పౌరుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు. పశ్చిమాసియాలో మారణహోమం.. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-గాజా యుద్ధం.. రంగంలోకి భారత్, ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభం -
భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత!
ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 1) నుండి భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఎంబసీ ఆదివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం గురించి ఆఫ్ఘన్ అధికారులు మాట్లాడుతూ న్యూఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం చాలా విచారకరం. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం సంయుక్తంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆతిథ్య దేశం నుండి తమకు సహకారం అందడం లేదని, ఈ కారణంగానే కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ రాయబారి, ఇతర సీనియర్ దౌత్యవేత్తలు భారతదేశం నుండి యూరప్‌కు వెళ్లి, యూఎస్ఏలో ఆశ్రయం పొందిన తరువాత ఈ పరిణామం జరిగిందని ఆఫ్ఘన్ ఎంబసీకి చెందిన ముగ్గురు అధికారులు తెలిపారు. ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లో కూడా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రస్తుతం రాయబారి ఫరీద్ మముంద్జే నేతృత్వం వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: 22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ! Press Statement FOR IMMEDIATE RELEASE Date: 30th September, 2023 Afghanistan is closing its Embassy in New Delhi. The Embassy of the Islamic Republic of Afghanistan in New Delhi regrets to announce the decision to cease its operations, effective October 1, 2023. pic.twitter.com/BXesWPdLFP — Afghan Embassy India (@AfghanistanInIN) September 30, 2023 -
ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు విడదీయాలంటున్నారు?
గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ పేరు చర్చలలోకి వస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ నేపధ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఖలిస్తాన్ ఉదంతం ఏమిటో తెలుసుకోవాలనే అసక్తి అందరిలో పెరిగింది. ఈ ఉద్యమం ఏమిటో? అది ఎలా మొదలైందో తెలియని వారు గూగుల్ సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకే ఖలిస్తాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖలిస్తాన్ అంటే ఏమిటి? భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమ మూలాలు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొందరు విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ పేరిట అనేక ఉద్యమాలు సృష్టిస్తున్నారు. భారత్‌పై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు వారు నిరంతరం కృషిచేస్తున్నారు. వారు భారతదేశం నుండి పంజాబ్‌ను వేరు చేయాలనే ఉద్యమానికి ఖలిస్తాన్ ఉద్యమం అని పేరు పెట్టారు. ఖలిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఖలిస్తాన్ అనేది ఖలీస్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. ఖలిస్తాన్ అంటే ఖల్సాకు చెందిన భూమి. అంటే సిక్కులు మాత్రమే నివసించే ప్రదేశం. 1940లో లాహోర్ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా డాక్టర్ వీర్ సింగ్ భట్టి ఒక కరపత్రాన్ని ప్రచురించినప్పుడు ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం అనే డిమాండ్ 1929 నుండి మొదలయ్యింది. కాంగ్రెస్ సమావేశంలో మాస్టర్ తారా సింగ్ ఈ డిమాండ్‌ను తొలిసారి లేవనెత్తారు. ఖలిస్తానీ ఉద్యమ నాంది.. 70వ దశకంలో చరణ్ సింగ్ పంక్షి, డాక్టర్ జగదీత్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఖలిస్తాన్ కోసం డిమాండ్ మరింత తీవ్రమైంది. దీని తరువాత 1980లో ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ కూడా ఏర్పాటయ్యింది. అనంతరకాలంలో పంజాబ్‌లోని కొంతమంది యువకులు దాల్ ఖల్సా అనే సంస్థను స్థాపించారు. ఇదిలావుండగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు 1984లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిర్వహించారు. దీని తరువాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారతదేశం నుండి దూరమయ్యాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా అనేక దేశాలలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో ఉంటూ, భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు? -
ఆ నలుగురు..నాటి హైదరాబాద్ సంస్థానంలో కీలకం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్..భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానం. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల సమ్మేళనంతో ఓ వెలుగు వెలిగింది. 1724లో నిజాం ఉల్‌ముల్క్ స్వతంత్రుడిగా ప్రకటించుకొని నిజాంపాలనకు శ్రీకారం చుట్టగా, 1948 వరకూ ఆయన వారసులు పరిపాలించారు. అయితే 1947 తర్వాత హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని నిజాం ఆర్మీ ఛీప్ ఇద్రూస్, పాకిస్తాన్లో కలపాలని నిజాం పెంచి పోషించిన రజాకార్ల చీఫ్ ఖాసీం రజ్వీ చూస్తే...సంస్థానంలో రైతుకూలీ రాజ్యం కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి పావులు కదిపారు. చేయి దాటిపోయే పరిస్థితి రావడంతో భారత సైన్యాలు జనరల్ జయంత్‌నాథ్ చౌదరి ఆధ్వర్యంలో అపరేషన్ పోలోతో 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశాయి. నిజాం ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఇద్రూస్, ఖాసీం రజ్వీలు, పడగొట్టేందుకు జయంత్‌నాథ్, నారాయణరెడ్డి ఆధ్వర్యంలోని సేనలు కారణమయ్యాయి. ఆపరేషన్.. హైదరాబాద్ భారతదేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్యం వస్తే ..హైదరాబాద్ సంస్థానం నిజాం రజకార్ల ఆగడాలతో అట్టుడికిపోయింది. నిజాం రాజు ఉస్మాన్ తాను స్వతంత్ర దేశంగానే ఉండాలని కోరుకోగా, అది కుదరకపోతే పాకిస్తాన్‌తో విలీనం కోసం చేస్తున్న ఎత్తుగడలను భారత ప్రభుత్వం పసిగట్టి 1948, సెప్టెంబర్ 13న మిలటరీ ఆపరేషన్‌ను మొదలుపెట్టి కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసింది. 16వ తేదీ నాటికి వాస్తవ పరిస్థితి నిజాంకు అర్థమైంది. 2,727 మంది రజాకార్లను భారత సైన్యాలు హతమార్చగా, మరో 4వేల మందిని బంధీలుగా పట్టుకున్నాయి. పరిస్థితిని గమనించిన నిజాం చీఫ్ ఇద్రూస్ లొంగిపోవాలని చేసిన సూచన మేరకు ఆ రోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరుసటి రోజు అంటే..సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశం మేరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెతం దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. రైతాంగ సేనాని.. రావి ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక సిరాతో లిఖించిన రైతుకూలీల పోరాటాన్ని ముందుకు నడిపిన సేనాని రావి నారాయణరెడ్డి. రజాకార్లు, నిజాం సామంతులైన దేశ్‌ముఖ్‌ల ఆగడాలను ఎదుర్కొ నేందుకు సాయుధ పోరాటానికి ఝంగ్ సైరన్ ఊదారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మెజారి టీ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడి సమాంతర పాలన సాగించారు. ఒక దశంలో కమ్యూనిస్టులు సంస్థానమంతా విస్తరిస్తారన్న వార్తల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అమలు చేసింది. రైతాంగ పోరాటమే లేకపోతే హైదరాబాద్ సంస్థానం భారతదేశ గుండెల మీద కుంపటిలా తయారయ్యేది. కశ్మీర్‌లా నిత్యం రావణకాష్టం రగిలించేది..సాయుధ పోరాటం దేశ స్వతంత్ర, సమైక్యతకు కారణమైందని రావి తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆపరేషన్ పోలో.. జయంత్‌నాథ్ ‘తక్కువ రక్తపాతంతో మన విజయయాత్ర ముందుకు వెళ్లాలి. శత్రువు వ్యూహం మేరకు మన ప్రతివ్యూహం ఉండాలి. మనం చేస్తున్న ఆపరేషన్ భూభాగంతోపాటు మనుషుల్ని కలిపేదిగా ఉండాలి’ అంటూ తన సైన్యాలకు దిశా నిర్దేశనం చేసిన ఆపరేషన్ పోలో చీఫ్ జయంత్‌నాథ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ పతాకం తొలిసారిగా ఇక్కడ రెపరెపలాడింది. జయంత్ 1928లో సైన్యంలో చేరి 1966లో ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్ సంస్థానంపై ఐదురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేసిన జయంత్ హైదరాబాద్ స్టేట్‌కు తొలి మిలటరీ గవర్నర్‌గా కూడా పనిచేశారు. బెంగాల్లో పుట్టిన జయంత్, కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన డబ్ల్యూసీ బెనర్జీ మనువడే. చౌదరి అత్యున్నత సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. పాకిస్తాన్ కోసం.. రజ్వీ ఖాసీం రజ్వీ..పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్ లోని లక్నో. లా చదివి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తన సమీప బంధువు నిజాం ఆర్మీలో ఉండటంతో అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. 1944లో ఇతెహైదూల్ ముస్లిమీన్ వ్యవస్థాపకుడు బహుదూర్‌యార్ ఝంగ్ మరణంతో ఆ సంస్థ బాధ్యతలు తీసు కొని తన ఆస్తులన్నీ సంస్థ పేరుతో రాసిచ్చాడు. నిజాం రాజును దైవాంశ సంభూతుడిగా అభివర్ణిస్తూ సిద్ధిఖీ యే దక్కన్‌గా రెచ్చిపోయి రజాకార్ల సంస్థ ఏర్పాటు చేసి నిజాం రాజ్యంలో రక్తపుటేరులు పారించారు. 1948 సెప్టెంబర్ 17న అరెస్ట్ అయ్యి 1957 వరకు జైలు జీవితం గడిìపాడు. విడుదల చేస్తే తాను పాకిస్తాన్లో తలదాచుకుంటానన్న షరతుతో కరాచీ వెళ్లిపోయాడు. 1970 జనవరి 15న చని పోయాడు. రజ్వీ వారసులు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. స్వతంత్ర రాజ్యం కోసం.. ఇద్రూస్ ఇండియా ఆర్మీ చీఫ్‌గా కూడా పనిచేసే సామ ర్థ్యం ఉందంటూ బ్రిటి ష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ హైదరాబాద్ స్టేట్ ఫోర్స్ చీఫ్ సయ్యద్ అహ్మద్ ఈఎల్ ఇద్రూస్‌ను ప్రశంసించాడు. నిజమే మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నమ్మిన బంటుగా హైదరాబాద్ స్టేట్ ఫోర్స్‌కు సుదీర్ఘకాలం కమాండర్ ఇన్ చీఫ్‌గా పనిచేశాడు. ఇద్రూస్ పూర్వీకులు యెమన్ నుంచి వచ్చి నిజాం సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇద్రూస్1913లో హైదరా బాద్ స్టేట్ ఆర్మీలో చేరి 1948 వరకు కొనసా గారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ మిత్రదేశాలకు మద్దతుగా హైదరాబాద్ లాన్సర్స్ తరఫున పాలస్తీనాతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. భారత్‌కు స్వాతంత్య్రం రాగానే, హైదరాబాద్ స్టేట్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే లక్ష్యంతో యూరప్ వెళ్లి అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే యత్నం చేసి విఫలమయ్యాడు. ఆపరేషన్ పోలో చీఫ్ జేఎన్.చౌదరి సమక్షంలో లొంగిపోయే కొన్ని క్షణాల ముందు ‘‘ ఇది జీవితంలో ఒక ఆట, మేం చేయాల్సింది అంతా చేశాం’’ అంటూ అంతర్జాతీయ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ తమ లొంగుబాటు ప్రకటించారు. అయితే నిజాం ప్రధానమంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధం నుంచి తప్పించిన కేసులో ఇద్రూస్ అరెస్ట్ అయ్యి విడుదలయ్యారు. కుటుంబసభ్యులంతా పాకిస్తాన్లో స్థిరపడగా, ఇద్రూస్ మాత్రం బెంగళూరులో చిన్నగదిలో చివరి రోజులు గడిపాడు. అనారోగ్య సమస్యలతో 1962లో చనిపోయారు. -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్‌ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
'ఆపరేషన్ హస్త'.. పొలిటికల్ వార్..
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికే 'ఆపరేషన్ హస్త' పేరుతో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లను కలుస్తున్నారు. యశ్వంతాపూర్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం పార్టీ మార్పేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను తమ రాజకీయ గురువుగా పేర్కొంటూ సోమశేఖర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల జేడీఎస్ నాయకుడు ఆయనూర్ మంజునాథ్ కూడా డిప్యూటీ సీఎం శివకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టనున్న ఆపరేషన్ హస్త వెలుగులోకి వచ్చింది. బీజేపీ నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకురావడమే దీని ప్రధాన ధ్యేయం. ఆపరేషన్ హస్త అనేది ఆపరేషన్ లోటస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యగా పరిగణించవచ్చు. 2019లో ఆపరేషన్ లోటస్‌లో భాగంగా 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. దీంతో అప్పట్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో కమల దళం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ మఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ఎమ్మెల్యేలతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. తమ సభ్యులు ఎవరూ ఫిరాయింపుకు సిద్ధంగా లేరని అన్నారు. తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. ఈ పరిణామాల అనంతరం బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి స్పందించాడు. కాంగ్రెస్ ఆపరేషన్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసని అన్నారు. దీనిపై శివకుమార్ కూడా స్పందించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో చేరమని ఎవరినీ పిలవట్లేదని అన్నారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?
మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత స్వయంకృషితో ఎదిగిన ఏకైక నటుడు. 67 ఏళ్ల వయసులో అదే జోష్‌లో దూసుకెళ్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ అందుకున్న మెగాస్టార్..ఆరు నెలల గ్యాప్‌లో ‘భోళా శంకర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. చిరంజీవి స్థాయిని దిగదార్చేలా మెహర్ రమేశ్ మేకింగ్ ఉందని మెగా అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. అదే సమయంలో రీమేక్ చిత్రాలకు వెళ్లొద్దని చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోకాలి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి.. తాజాగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి) వారంలో హైదరాబాద్‌కు రాకా ప్రస్తుతం చిరంజీవి ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఆగస్ట్ 22 అంటే ఆయన బర్త్‌డే రోజు కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొంటారు. ఈ చిత్రానికి 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూడు వారాల విశ్రాంతి చిరంజీవికి మోకాలి నొప్పి రోజు రోజుకి తీవ్రతరం కావడంతో సర్జరీ చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. భోళా శంకర్ ప్రమోషన్ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సర్జరీ చేయించుకోవాలని భావించారు. అందుకు తగ్గట్టే ఆరు నెలల క్రితమే తన డేట్స్‌ని సర్దుబాటు చేసుకున్నారట. అయితే చిరుకి జరిగిన సర్జరీ చాలా చిన్నదని సమాచారం. నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. టెక్నాలజీని ఉపయోగించి నిమిషాల్లో ఈ సర్జరీ పూర్తి చేస్తారు. ప్రస్తుతం చిరంజీవి సాధారణంగాగే ఉన్నారట. రోజూలాగే నడవడం, తన పనులు తాను చేసుకోవడం చేస్తున్నారట. వారంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చి మరో రెండు వారాల పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత తన షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో పాల్గొంటారట. రెమ్యునరేషన్‌పై ‘భోళా..’ ఎఫెక్ట్ దాదాపు తొమ్మిదేళ్లు నటనకు విరామం ఇచ్చిన చిరంజీవి ఖైదీ 150(2017) చిత్రంలో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదికో సినిమాను విడుదల చేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య కాలంలో తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట చిరంజీవి. ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి రూ.55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న చిరు.. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యకు కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ పుచ్చుకున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి రెమ్యునరేషన్ వివరాలు అయితే వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో తన పారితోషికాన్ని పెంచేశారట మెగాస్టార్. భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ.65 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ ఎఫెక్ట్ చిరంజీవి తదుపరి చిత్రంపై కచ్చితంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి చిత్రానికి రెమ్యునరేషన్ తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ ‘చిరుత’
తిరుమల: తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. చిన్న పిల్లలను దగ్గరే పెట్టుకొని వెళ్లాలని సూచిస్తోంది. చిరుతల దాడుల నియంత్రణకు నిపుణులు కమిటీ ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది టీటీడీ. తిరుమల అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: విశాఖ కారాగారంలో అన్నీ నదులే..! -
బీటెక్ విద్యార్థినికి ప్రాణం నిలిపిన సీఎం జగన్
కోడుమూరు రూరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీటెక్ విద్యార్థిని ప్రాణం నిలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన గుర్రం క్రిష్ణయ్య 108లో డ్రైవర్, ఆయన భార్య నాగలక్ష్మమ్మ అంగన్వాడీ టీచర్. వీరి కుమార్తె జాన్వీకౌసిక్ ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలికి గడ్డ ఏర్పడి.. అది క్రమంగా క్యాన్సర్‌గా మారింది. తల్లిదండ్రులు కర్నూలు, తిరుపతి, విజయవాడలో చూపించగా.. వైద్యులు ఆరు నెలలకు మించి ఆమె బతకదని, హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆశతో అక్కడికి వెళ్లగా రూ.7 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు కూడా పరిమితి దాటిందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చూపించే స్థోమత లేక వెనుదిరిగారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూశారు. దీంతో విద్యార్థినికి మార్చి నెలలో బసవతారకం ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఆగస్టులో విద్యార్థిని క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోనుండటంతో ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగి పాప ప్రాణం దక్కదని ఆశలు వదులుకున్న దశలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూపంలో సీఎం జగన్ తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. జగనన్న వల్లే తాను కోలుకుంటున్నానని విద్యార్థిని జాన్వీకౌసిక్ చెప్పింది. -
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
చేరికలపై దూకుడు.. టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్..
సాక్షి, హైదరాబాద్: చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ చేరికలను కాంగ్రెస్ నేతలతో కాకుండా న్యూట్రల్ పర్సన్స్‌తో ఆపరేషన్ ఆకర్షగా కంప్లీట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. వరంగల్ మోదీ సభ రోజే ఒకరిద్దరు కీలక నేతలను చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేసింది. ప్రియాంక హాజరుకానున్న సభలో మరికొందరు కీలక నేతలను చేర్చుకునే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. యెన్నంశ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌రావు, ఖాజీపేట లింగయ్య, పవన్‌కుమార్‌రెడ్డి, రమేష్ రాథోడ్, రవీంద్రనాయక్, తీగల కృష్ణారెడ్డిలతో మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి ఘర్ వాపసిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ! కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. రాజకీయ వర్గాలు ముందుగా ఊహించినట్టుగానే ఖమ్మం గడ్డపై నుంచి ఆ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ జనం నడుమ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభను తలపించిన సంగతి తెలిసిందే. -
ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం!
బిహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రసవత్తర రాజకీయ క్రీడకు తెర లేవనుందా? తద్వారా ఉత్తరాదిన కొరకరాని కొయ్యగా మారిన ఏకైక రాష్ట్రాన్నీ బీజేపీ గుప్పిట పట్టజూస్తోందా? అందుకోసం నితీశ్ పార్టీ జేడీ(యూ)ను చీల్చి నిర్వీర్యం దిశగా పావులు కదుపుతోందా...? పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది... మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఆశ్చర్యకరమేమీ కాదు. అనుకోనిది అసలే కాదు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార బీజేపీ–శివసేన (షిండే) కూటమికి జై కొట్టి షాకిచ్చారు. గాలివాటును బట్టి రాజకీయ వైఖరి మార్చడంలో చిన్నాన్న కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు. ఏడాది క్రితమే ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనను బీజేపీ నిలువునా చీల్చి బలహీనపరచడం తెలిసిందే. అందుకు బదులుగా షిండేకు సీఎం పీఠం దక్కితే తాజాగా ఎన్సీపీని చీలి్చనందుకు అజిత్‌కు డిప్యూటీ సీఎం పోస్టు దక్కింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికో, తదనంతరమో ఈ రెండు చీలిక వర్గాలూ కమల దళంలో విలీనమైపోతాయని భావిస్తున్నారు. తద్వారా శివసేన, ఎన్సీపీలను నామమాత్రంగా మార్చేసి బలమైన విపక్షమన్నదే లేకుండా చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీకి మించిన బలమున్నా ఎన్సీపీని చీల్చడం ఆసక్తికరమైన పరిణామమే. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో కొంతకాలంగా కీలకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్‌కు ఈ రూపంలో కమలనాథులు కోలుకోలేని షాకిచ్చినట్టు కనిపిస్తోంది. పిలవడమే తడవుగా రెక్కలు కట్టుకుని తన గూటిలోకి వచ్చి వాలేందుకు అజిత్ ఎప్పట్నుంచో సిద్ధంగా ఉన్నా పనిగట్టుకుని ఇప్పుడే ఎన్సీపీని బీజేపీ దెబ్బ కొట్టడం వెనక ఇదే ప్రధాన కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం. పవార్ ప్రస్తుతం విపక్ష నేతల సానుభూతి వెల్లువలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు! నాలుగేళ్ల నాడు ఇలాగే శివసేనతో జట్టు కట్టిన అజిత్‌ను అతికష్టమ్మీద దారికి తెచ్చుకోగలిగిన ఆయనకు తాజా దెబ్బ నుంచి కోలుకోవడం పవార్‌కు కష్టమే కావచ్చు. ఆయనకు నమ్మినబంటైన ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వంటి నేతలు కూడా అజిత్ పంచన చేరడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పవార్ కూతురు సుప్రియా సులే సమర్థురాలే అయినా ఎన్సీపీకి ఉద్దవ్ పార్టీ గతి పట్టకుండా కాచుకోవడం శక్తిని మించిన పనేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం ఇతర విపక్షాలనూ ఆలోచనలో పడేసింది. జూలై 13–14 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన తదుపరి మేధోమథన భేటీ కూడా నాలుగు రోజుల పాటు వాయిదా పడింది! ఇలా బీజేపీ ఒకే దెబ్బతో ఒకటికి మించిన లక్ష్యాలను తాత్కాలికంగానైనా సాధించినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్–ఆప్ విభేదాలతో ఇప్పటికే డీలా పడ్డ విపక్షాల ఐక్యతా యత్నాలకు ఈ పరిణామం గట్టి దెబ్బేనంటున్నారు. తదుపరి టార్గెట్ నితీశే...! మహారాష్ట్ర అనంతరం ఇప్పుడిక బీజేపీ దృష్టి బిహార్పైకి మళ్లినట్టు కని్పస్తోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. తొమ్మిదేళ్లుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు, పలు రాష్ట్రాల్లో స్థానిక విపక్షాలకు చుక్కలు చూపుతున్న బీజేపీకి ఉత్తరాదిన బిహార్ మాత్రం ఓ పట్టాన కొరుకుడు పడటం లేదు. నిజానికి ఏడాది క్రితం షిండే శివసేనను చీలి్చనప్పుడే బిహార్‌లోనూ అలాంటిదేదో జరుగుతుందని చాలామంది ఊహించారు. ఒకరకంగా దానికి భయపడే బీజేపీకి అవకాశమివ్వకుండా అప్పట్లో నితీశ్ కుమార్ తానే తొలి ఎత్తు వేశారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు తదితరాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకుని రాజకీయ చతురత ప్రదర్శించారు. కానీ బీజేపీ మాత్రం ప్రయత్నాలు మానలేదు. జేడీ(యూ) బలాన్ని కొద్దికొద్దిగా తగ్గిస్తూ వస్తోంది. నితీశ్‌కు నమ్మకస్తుడైన ఉపేంద్ర కుషా్వహా జేడీ(యూ)కు గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకోవడం, జితిన్‌రామ్ మాంఝీ సారథ్యంలోని హిందూస్తానీ అవామ్ మోర్చా అధికార కూటమిని వీడటం వంటివన్నీ దాని ఫలితమేనంటారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. జేడీ(యూ)కూ సేన, ఎన్సీపీ గతి తప్పదంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వంటివారు ఇప్పటికే మాటల దాడికి దిగుతున్నారు. ఇదంతా బీజేపీ మైండ్‌గేమ్‌లో భాగమేనని భావిస్తున్నారు. నితీశ్ కరిష్మా క్రమంగా తగ్గుతుండటం, ప్రధాని మోదీ మేనియా నానాటికీ విస్తరిస్తుండటం జేడీ(యూ) నేతలు, ఎమ్మెల్యేల్లో చాలామందిని ‘ఆలోచన’లో పడేస్తోందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఏళ్ల తరబడి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన జేడీ(యూ) ప్రభ తగ్గుతూ వస్తోంది. ఇలాంటప్పుడే ఆ పార్టీని వీలైనంత గట్టి దెబ్బ తీస్తే మరో కీలక రాష్ట్రమూ చిక్కినట్టేనన్నది కమలనాథుల వైఖరిగా కని్పస్తోంది. ఈ తాజా దాడిని కాచుకునేందుకు నితీశ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవడం తదితరాల ద్వారా వారి విధేయత సడలకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎత్తులూ పై ఎత్తులతో రంజుగా సాగుతున్న బిహార్ రాజకీయ చదరంగంలో చివరికి ఎవరిది పై చేయి అవుతుందన్నది ఆసక్తికరం. -
సింగర్‌లా కనిపించాలని సర్జరీ.. ఇప్పుడేమో సగం మొహానికి స్పర్శ లేదు, ముక్కు, మూతి చూస్తే..
అభిమానం వెర్రితలలు వేస్తే ‘ఫ్రాన్ మారియానో’లా ఉంటుంది. అతను అర్జంటీనా వాసి. స్పానిష్ (ప్యుర్టో రికా) గాయకుడు, పాటల రచయిత, నటుడు రికీ మార్టిన్ వీరాభిమాని! సాధారణంగా అయితే సెలబ్రిటీల అభిమానులు.. సెలబ్రిటీల అభినయ, ఆహార్య, వాచకాలను అనుకరిస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఫ్యాన్ ఫ్రాన్ మారియానో మాత్రం తన రూపు రేఖలనే మార్చేసుకున్నాడు కనుబొమలు సహా! అచ్చం రికీలాగే కనిపించాలనే కోరికతో ఏకంగా డజన్‌కి పైగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నాడు. తన కనుబొమలు కూడా రికీ మార్టిన్ కనుబొమలను పోలి ఉండాలని మోటార్ ఆయిల్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. ఈ ప్రకియంతా అతన్ని త్రీవమైన శారీరక, మానసిక వ్యధలోకి నెట్టింది. ఇప్పుడు అతను ఇటు తనలా కాకుండా అటు రికీ మార్టిన్లా కాకుండా తయారయ్యాడు. ఈ మధ్యే ఓ రియాలిటీ షో (అర్జంటీనా)లో తనలాంటి ఫ్యాన్స్‌కి తన అనుభవాన్ని చెబుతూ ఏ అభిమానీ తనలా మారొద్దని.. అభిమానాన్ని హద్దులు మీరనివ్వద్దని హెచ్చరించాడు. ‘నా ముక్కు, మూతి నావి కాకుండా పోయాయి. నా సగం మొహానికి స్పర్శే తెలియడం లేదు. మంచినీళ్లనూ గటగటా తాగలేని పరిస్థితి.. కర్చీప్ని నీళ్లలో ముంచి నోట్లో పిండుకోవాల్సి వస్తోంది’ అని వాపోతున్నాడు మారియానో. ఇతని గాథ విన్నవాళ్లంతా ‘ప్చ్ .. క్రేజీ ఫెలో.. ’ అంటూ జాలిపడుతున్నారు. చదవండి: ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ -
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మారని తీరు
నిజామాబాద్ సిటీ : జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి లో పేషెంట్ల పట్ల సిబ్బంది తీరు మారలేదు. ఆపరేషన్ అయిన బాలుడు ఇంటికి వెళ్తుండగా కేర్ టేకర్లు కనీసం పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరానికి చెందిన పదేళ్ల బాలుడికి కడుపులో నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. గురువారం బాలు డిని డిశ్చార్జి చేశారు. ఆస్పత్రి గేట్ వరకు వీల్‌చైర్‌లో తీసుకెళ్లవలసిన పేషంట్ కేర్ టేకర్ ఎవరూ అందుబాటులో లేకపోవటంతో బాలుడిని తల్లి గేట్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లింది. అదే సమయంలో వీల్‌చైర్‌లో ఆస్పత్రి సిబ్బంది వాటర్ బాటిల్‌ను తీ సుకెళ్లటం కనిపించింది. ఆస్పత్రిలో కేర్ టేకర్లు, వీల్ చైర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేదని పేషెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఆస్పత్రి వైద్యులు నాణ్యమైన సేవలందిస్తూ గుర్తింపు పొందుతుంటే సిబ్బంది మాత్రం రోగులతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. -
పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలుపుతూ.. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఆమె న్యాయ సలహా కూడా తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ధృవపత్రాల కోసం వైద్యులను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఎల్జిబిటిక్యూ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన దీని గురించి మాట్లాడుతూ.. తనను తాను మగవాడిగా గుర్తించానని, శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడిన సుచేతన, “నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్‌మ్యాన్‌గా నేను ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 41. ఫలితంగా నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. అదే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే దీని కోసం పోరాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని సుచేతన తెలిపింది. ఈ వార్తలను వక్రీకరించవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేసింది. తన తండ్రి ఈ నిర్ణయానికి మద్దతిస్తాడని సుచేతన భావిస్తున్నట్లు చెప్పింది. చదవండి: రెండురోజులుగా ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్ ఘటన వెలుగులోకి -
భార్య నల్లపూసల దండ మింగేసి గప్‌చుప్‌గా..
అనంతపురం క్రైం: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్య నల్లపూసల దండ మింగేశాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ రహస్యాన్ని కడుపులోనే దాచుకున్నాడు. చివరకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వైద్యులను సంప్రదించగా, అనంతపురం సర్వజనాస్పత్రి ఈఎన్టీ విభాగం వైద్యులు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే నల్లపూసల దండను నేర్పుగా బయటకు తీసి అతడికి పునర్జన్మ ప్రసాదించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రామాంజనేయులు (45) మూడు నెలల క్రితం తన భార్య నల్లపూసల దండను(బంగారం కాదు)మింగేశాడు. ఇటీవల కడుపు నొప్పి తీవ్రం కావడంతో విషయం కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు అతడిని అనంతపురంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.వేలల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో మే 29న ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకురాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుకుమార్ రామాంజనేయులును పరీక్షించారు. వివరాలు ఆరా తీయగా, తాను చైన్‌ను మింగానని, ఏదైనా ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వైద్యుడు ఎక్స్‌రేకి రిఫర్ చేశాడు. రామాంజనేయులు అన్నవాహిక వద్ద నల్లపూసల దండ డాలర్ ఇరుక్కుని, దండ కడుపులోని ఈసోఫాగస్ (ఫుడ్‌పైప్) వరకు వెళ్లినట్లు కనిపించింది. దీంతో వైద్యులు అతడిని అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ లేకుండానే కడుపులో ఉండిపోయిన నల్లపూసల దండ బయటకు తీయాలని నిర్ణయించారు. మే 30న అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ కృష్ణ సౌమ్య, స్టాఫ్‌నర్సులు, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ వేమానాయక్, ఓటీ టెక్నీషియన్ రాజేష్‌లు రామాంజనేయులు అన్నవాహికకు మత్తు మందు ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా నల్లపూసల దండను తొలగించారు. రామాంజనేయులు ఆరోగ్యంగా ఉన్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుకుమార్ తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా కడుపు లోపల ఉన్న నల్లపూసల దండను బయటకు తీసిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ అభినందించారు -
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
హ్యాట్సాఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. చిమ్మచీకట్లో సాహాసోపేతంగా 121 మందిని..
ఢిల్లీ: అదొక చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌స్ట్రిప్. కమ్యూనికేషన్లో భాగంగా.. నావిగేషనల్ అప్రోచ్ సహకారం లేదు. అక్కడ ఫ్యూయల్ సౌకర్యమూ లేదు. రాత్రి పూట ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోటు అది. ల్యాండింగ్ లైట్లు కూడా లేని చోటు నుంచి జనాల్ని తరలించే ఆపరేషన్ సక్సెస్‌గా పూర్తి చేసింది భారత వైమానిక దళం. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసే దమ్ము ఉందని మరోసారి నిరూపించుకుంది. సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ (Night Vision Goggles) సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఎలాంటి ఆటంకాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే.. అంత చిన్న రన్‌వేలో ఎయిర్‌క్రాఫ్ట్ దించగలిగారు. ల్యాండింగ్ అయ్యాక కూడా ఇంజిన్లను ఆన్‌లోనే ఉంచి.. అక్కడున్నవాళ్లను, వాళ్ల లగేజీలను విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ యూనిట్ గరుడకు చెందిన ఎనిమిది మంది కమాండోలు ప్యాసింజర్ల భద్రతను పర్యవేక్షిస్తూనే.. సురక్షితంగా ఎక్కించారు. విమానం ఎలాగైతే దిగిందో.. అదే తరహాలో ఎన్వీజీ ఉపయోగించి టేకాఫ్ చేశారు. అలా రెండున్నర గంటలపాటు ఈ రిస్కీ ఆపరేషన్ కొనసాగింది. కల్లోల రాజధాని ఖార్తోమ్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా చోటుచేసుకోవడం గమనార్హం. అంతా జెడ్డాకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటిదాకా 1,360 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. ఇదీ చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు! 110 ఏళ్ల తర్వాత.. -
Operation Kaveri: సూడాన్ నుంచి మరో 754 మంది రాక
న్యూఢిల్లీ/కైరో: సూడాన్‌లో చిక్కుకుపోయిన మరో 754 మంది భారతీయులు ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం స్వదేశం చేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా 1,360 మందిని తీసుకొచ్చినట్టు చెప్పారు. వీరిలో 17 మంది తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ తెలిపింది. మరోవైపు సూడాన్‌లో హింస ఆగడం లేదు. 72 గంటల కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించి గంటలైనా కాకుండానే రాజధాని ఖార్టూమ్, ఒండుర్మన్, కఫౌరీల్లో పోరు తీవ్రమైంది. -
అక్కడే చనిపోతామనుకున్నాం.. భారత్ చేరిన సూడాన్ బాధితులు
ఢిల్లీ: సుడాన్(sudan)లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ వేగంగా కొనసాగుతోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూడాన్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్.. స్వదేశం చేరుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. కాగా, మొదటి బ్యాచ్‌లో సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చేశారు. ఆపరేషన్ కావేరీ సాయంతో సూడాన్ నుంచి మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు.. బుధవారం ఉదయం సుడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్ నుంచి మూడో బ్యాచ్‌లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, సూడాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల్లో చాలా మంది గాయపడ్డారు. అనంతరం, ఢిల్లీలో వారు సూడాన్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సూడాన్‌లో నివాసాలపై బాంబు వేయడంతో భయానక పరిస్థితులను చూశాడు. స్వదేశానికి తిరిగి వస్తామని అనుకోలేదు. అక్కడే చనిపోతామనే భయంతో క్షణక్షణం కాలం గడిపాము. కట్టుబట్టలతో సూడాన్ నుంచి బయలుదేరాము. బాంబు దాడుల కారణంగా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాము. కొందరు వ్యక్తులు మమ్మల్ని గన్‌తో బెదిరించి మావద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. First flight carrying Indian nationals who were evacuated from Sudan landed in Delhi yesterday. #OperationKaveri brought 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi.@MEAIndia @EoI_Khartoum pic.twitter.com/xXp4ZJW40K — DD India (@DDIndialive) April 27, 2023 ఇది కూడా చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
సూడాన్ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్ కావేరి
న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించింది. ‘ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నారు. మరికొందరు వస్తున్నారు. వీరి కోసం అక్కడ ఓడలు, విమానాలను సిద్ధంగా ఉంచాం. సూడాన్‌లోని ప్రతి భారతీయుడికీ సాయంగా నిలుస్తాం’అని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నేవీకి చెందిన ఒక షిప్‌ను సూడాన్‌లోని ఒక పోర్టులో కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. మరోవైపు, సూడాన్‌లో ఉండిపోయిన తమ పౌరులు, దౌత్య సిబ్బంది తరలింపును పలు యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం సూడాన్ నుంచి వెనక్కి తీసుకువచ్చిన 28 దేశాలకు చెందిన 388 మందిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. సూడాన్ నౌకాశ్రయంలో భారతీయులు -
16 నెలల క్రితం మహిళ కడుపులో క్లాత్ వదిలేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే?
సాక్షి, జగిత్యాల జిల్లా: మేం చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకునే కొందరు తెలంగాణ మంత్రుల మాటలకు భిన్నంగా.. అడుగడుగునా నిర్లక్ష్యపు ఛాయలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపుతోంది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు
‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ ఓ సామాన్య పేదరాలితో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాట ఇది. ఆ ఒక్క మాట ఇద్దరు బిడ్డల ప్రాణాలకు సంజీవనిగా మారింది. ఏళ్లకు ఏళ్లు ఏడుస్తూ బతుకుతున్న ఆ కుటుంబంలో ఆశల దీపాన్ని వెలిగించింది. చిన్నారుల చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న వారికి ఓ దారిని చూపించింది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మందులతో ఆకలి తీర్చుకుంటున్న పసివాళ్లకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది. సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న జి.సిగడాంకు చెందిన ఇద్దరు చిన్నారుల ఆపరేషన్ కోసం వైఎస్ జగన్ సర్కారు రూ.32 లక్షల నగదు విడుదల చేసింది. శ్రీకాకుళం: మండల పరిధిలోని డీఆర్ వలస గ్రామానికి చెందిన పాండ్రంగి సుబ్బలక్ష్మి, రామారావు దంపతుల కుమారులు తిరుపతిరావు(12), యశ్వంత్ (10)లు సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. ఈ బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’లో గత ఏడాది జూన్ 29 కథనం కూడా ప్రచురితమైంది. ఇన్నాళ్లకు ఆ ఇద్దరు చిన్నారుల జబ్బు శాశ్వతంగా నయమయ్యే మార్గం కనిపించింది. గత ఏడాది ఆగస్టు 26న విశాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగా.. ఆయన వద్దకు వెళ్లిన సుబ్బలక్ష్మి, రామారావు దంపతులు బిడ్డల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. చిన్నారులకు సాయం చేస్తానని ఆనాడే సీఎం మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రక్తహీనతతో ఇబ్బంది.. తిరుపతిరావు, యశ్వంత్‌లు ఐదేళ్లుగా ఈ రక్తహీనత వ్యాధితో బాధ పడుతున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌తో ఈ వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని తెలియడంతో.. బోన్‌మ్యారో ఇవ్వడానికి కూడా తల్లిదండ్రులు ముందుకువచ్చారు. కానీ ఆ ఆపరేషన్‌కు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విశా ఖ వెళ్లి సీఎం జగన్‌కు తమ పరిస్థితి చెప్పారు. ‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడిన సీఎం.. ఒక్కో చిన్నారికి చికిత్సకు రూ.16 లక్షల చొప్పున రూ.32 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్లో ముందుగా పెద్ద కుమారుడికి ఆపరేషన్ చేసి ఆ తర్వాత చిన్నోడికి కూడా శస్త్ర చికిత్స చేస్తారు. -
8 గంటలు శ్రమించి... ప్రాణాలు కాపాడారు జీజీహెచ్ లో అరుదైన ఆపరేషన్...!
-
HYD: రోబో సాయంతో గుండె ఆపరేషన్.. ఇదే దీని ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో వైద్య రోబో అనుసంధానంతో ఓ రోగికి గుండె ఆపరేషన్ జరిగింది. గచ్చి»ౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. సాధారణ గుండె ఆపరేషన్లకు భిన్నంగా అత్యాధునిక రోబో అనుసంధానంతో గుండె ఆపరేషన్ చేయడం ఓ ముందడుగు. గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఓ 36 ఏళ్ల రోగికి కాంటినెంటల్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం ప్రపంచ ప్రఖ్యాత రొబోటిక్ సీటీవీఎస్ సర్జన్, ఎస్ఎస్ ఇన్నొవేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సు«దీర్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనుసంధానంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శస్త్రచికిత్సను వైద్యశాస్త్రంలో ఒక ముందడుగుగా అభివర్ణించారు. రోగికి అతితక్కువ బాధ, తక్కువ ఇబ్బందితోనే ఆపరేషన్ నిర్వహించగలగడం ఈ విధానం ప్రత్యేకత అని వివరించారు. అతితక్కువ సమయంలోనే రోగి తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషమని తెలిపారు. ఈ విజయం దేశ ప్రతిష్టతను పెంపొందించడమేగాక యావత్ దేశానికి స్ఫూర్తిదా యకంగా, తెలంగాణకు గర్వకారణంగా వెలుగొందుతోందన్నారు. -
ఆపరేషన్ చేసి.. తాబేలుకు ప్రాణం పోశారు
అనకాపల్లి: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాబేలుకు ఆపరేషన్ చేసి ఓ వైద్యాధికారి జీవం పోశారు. స్థానిక యువకులు సకాలంలో స్పందించడంతో ఒక మూగ జీవి ప్రాణం నిలబడింది. వివరాలు.. వడ్డాది పెద్దేరు నదిలో తాబేళ్లు సంచరిస్తూ ఉంటాయి. శనివారం తాబేలు ఒకటి గుడ్లు పెట్టడానికి ఒడ్డుకు వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు దానిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ తాబేలు పేగులు బయటకు వచ్చేయడంతో విలవిల్లాడింది. ఈ విషయం గమనించిన స్ధానిక యువకులు దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ పశువైద్యాధికారి శివకుమార్‌కు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన వైద్యుడు తాబేలును ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించారు. ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలైన మూగజీవికి ఆపరేషన్ చేసి ఆదుకున్నందుకు వైద్యు డు శివకుమార్‌ను స్థానికులు అభినందించారు. -
నంద్యాల: తల్లి పులి ఉత్కంఠ.. కీలక పరిణామం
సాక్షి, నంద్యాల: తల్లిపులి దగ్గరికి పులి పిల్లలను చేర్చడం అనే ఆపరేషన్ ద్వారా.. దేశ చరిత్రలోనే తొలిసారి ఈ తరహా ప్రయత్నానికి ఏపీ వేదిక అయ్యింది. అలాగే నంద్యాల జిల్లాలో తల్లి పులి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే.. తాజాగా ఆపరేషన్ తల్లి పులిలో కీలక పరిణామం చోటు చేసుకుందని ఆపరేషన్ కమిటీ మెంబర్, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్ఎస్ పేర్కొన్నారు. పెద్ద గుమ్మాడాపురం అటవీప్రాంతంలోపెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు విగ్నేష్ తెలిపారు. అయితే.. అది తల్లి పులి (T108 F)వి అవునా? కాదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మరోవైపు 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్ తల్లి పులి నిర్వహిస్తున్నట్లు తెలిపారాయన. పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారాయన. శాస్త్రీయంగాను సాంకేతికంగా తల్లి పులికోసం గాలిస్తున్నాం. దాదాపు 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నాము. అవసరాన్ని బట్టి డ్రోన్ కూడా వినియోగిస్తాం అని తెలిపారాయన. నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం చేత ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నాం. నిపుణుల సూచనల మేరకు పులికూనలకు పాలు, సెరోలాక్ తో పాటు ఇవాళ (బుధవారం) చికెన్ లివర్ ముక్కలను అందించాం అని తెలిపారాయన. -
బిడ్డను తీశారు.. కత్తెర మరిచారు.. ఆరేళ్ల తర్వాత!
కోల్‌సిటీ(రామగుండం): ప్రసవం చేయమని డాక్టరుని వేడుకుంటే..సిజేరియన్ ద్వారా కడుపులో బిడ్డను తీసి..కత్తెర ఉంచి కడుపు కుట్టేశారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధితురాలు ఆరేళ్లుగా నరకయాతన అనుభవించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో 2017 ఏప్రిల్ 15న చేరింది. మరుసటిరోజు ఆస్పత్రిలోని సీనియర్ గైనకాలజిస్టు సిజేరియన్ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. అయితే సిజేరియన్ అనంతరం మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసి వారం తర్వాత ఇంటికి పంపేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో ఉంటున్న సదరు మహిళకు మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం దాల్చలేదు. కడుపునొప్పితోపాటు తరుచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుండటంతో రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎక్స్‌రే తీయించగా...ఆమె కడుపులో కత్తెర ఉందని వైద్యులు నిర్ధారించారు. పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్న వైద్యురాలు బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్ చేసిన గైనకాలజిస్టును నిలదీయడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రాజీ కుదుర్చురోవాలని వైద్యురాలు వేడుకున్నారు. బాధితురాలి కడుపులో కత్తెర తీసేందుకు చేసే శస్త్రచికిత్సకు ఖర్చును తానే భరించడంతోపాటుగా రూ.3.50లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో అందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డబ్బులిచ్చి ఆ మహిళను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. దీనిపై వైద్యురాలిని వివరణ అడగగా..ఆపరేషన్ సమయంలో పొరబాటు జరిగి ఉండొచ్చని చెప్పారు. కాగా, కడుపులోనే కత్తెర మర్చిపోయిన గైనకాలజిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్ డిమాండ్ చేశారు. -
తల వెంట్రుకలను పీక్కొని తిన్న బాలిక.. 8 నెలలుగా
మైసూరు(బెంగళూరు): బాలిక కడుపులో ఉండలా పేరుకుపోయిన అరకేజీ వెంట్రుకల ఉండను వైద్యులు ఎండో స్కోపీ ద్వారా బయటకు తీసి స్వస్థత చేకూర్చారు. 11 సంవత్సరాల వయసున్న బాలిక తన తల్లిదండ్రలకు తెలియకుండా తల వెంట్రుకలను పీక్కొని తినేది. ఈ క్రమంలో 8 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. మైసూరులోని అపోలో అస్పత్రికి తీసుకెళ్లగా బాలల గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అతీరా రవింద్రనాథ్ బాలికకు వైద్య పరీక్షలు చేయగా కడుపులో వెంట్రుకలు ఉన్నట్లు తేలింది. ఎండోస్కోపీ సాయంతో బయటకు తీసి ఉండను తూకం వేయగా 500 గ్రాముల బరువు 5 సెంటి మీటర్ల పొడవు ఉన్నట్లు తేలింది. బాలిక ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: న్యూ ఇయర్ పార్టీలో తుపాకీతో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్.. -
భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు
భారత్ జలాల్లోకి ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది. (చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం) -
మెడలో గుచ్చుకున్న త్రిశూలం.. అలాగే 65 కి.మీ. ప్రయాణించి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెడలోకి గుచ్చుకున్న త్రిశూలంతో ఓ వ్యక్తి ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. కళ్యాణి ప్రాంతానికి చెందిన భాస్కర్ రామ్‌కు గత వారం కోల్‌కతాలోని నీలరతన్ సర్కార్ మెడికల్ కాలేజీలో అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. మెడకు త్రిశూలం గుచ్చుకున్న ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో త్రిశూలం వ్యక్తి మెడకు కుడివైపు నుంచి గుచ్చుకొని ఎడమ వైపుకు బయటకు దిగింది. గొంతు దగ్గర ఇరుక్కుపోయిన త్రిశూలాన్ని బయటకు తీసేందుకు అతను కళ్యాణి ప్రాంతం నుంచి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకి 65 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గొంతు దగ్గర చిక్కుకున్న త్రిశూలంతో యువకుడు నవంబర్ 28 తెల్లవారుజామున తమ వద్దకు వచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 30 సెంటిమీటర్ల పొడవున్న త్రిశూలం గుచ్చుకొని, మెడపై రక్తం కారుతున్న స్థితిలో రామ్‌ని చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు పేర్కొన్నారు. అయితే భాస్కర్ రామ్ ప్రాణాలతో బయటపడడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రిశూలం శరీర అవయవాలు, సిరలు,ధమనులను డ్యామెజ్ చేయకపోవడంతో ఈ కేసు మెడికల్ వండర్‌గా భావిస్తున్నారు. అంతర్గతంగా కూడా పెద్దగా నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు త్రిశూలాన్ని తొలగించేందుకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. కంటి-ముక్కు-గొంతు(ఈఎన్టీ)స్పెషలిస్ట్ డాక్టర్,అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రణబాసిస్ బంద్యోపాధ్యాయ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో చివరకు రోగి మెడ నుంచి త్రిశూలాన్ని తొలగించారు. గాయంతో అంత దూరం ప్రయాణం చేసినప్పటికీ రామ్ తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్పాడని వైద్యులు వెల్లడించారు. అంతేగాక ఆపరేషన్ ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుడికి త్రిశూలం ఎలా గుచ్చుకుందనే దానిపై స్పష్టత లేదు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ త్రిశూలాన్ని శ్రీ రామ్ తన ఇంట్లోని దేవుని బలిపీఠంపై ఉంచారని, తరతరాలుగా ఈ చారిత్రక త్రిశూలాన్ని పూజిస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వ్యక్తితో భాస్కర్ రామ్‌కు చిన్న వాగ్వాదం జరిగిందని, దీంతో అతడు త్రిశూలంతో దాడి చేయడంతో భాస్కర్ రామ్ మెడ వెనుక భాగంలో గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్ -
Viral: సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్
సాక్షి, గుంటూరు: ఎనిమిదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. గతంలో నెలకు రెండుసార్లు, వారానికి ఒకసారి మాత్రమే ఫిట్స్ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజులోనే రెండు, మూడుసార్లు ఫిట్స్ వస్తున్నాయి. అయితే ఆపరేషన్ అంటే భయపడిపోయిన రోగికి తనతో మాట్లాడుతూ మెలకువగా ఉండి కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చని అవేక్ సర్జరీలలో బాహుబలి సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూరోసర్జన్ భరోసా ఇచ్చారు. వెంటనే రోగి తనకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూపిస్తూ తనకు ఆపరేషన్ చేయాలని కోరాడు. రోగి మెలకువగా ఉండగానే రోగికి ఇష్టమైన సీఎం ప్రమాణస్వీకార వీడియోలను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ బాహుబలి సర్జన్ ఆపరేషన్ చేశారు. శనివారం గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పటల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమశ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రూ.4లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో ఉచితంగా.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండటం ఇసుకత్రిపురవరం గ్రామానికి చెందిన 43 ఏళ్ల గోపనబోయిన పెద్ద ఆంజనేయులు రోజువారి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఇతను ఫిట్స్ బాధపడుతున్నాడు. గతంలో నెలలో రెండు సార్లు లేదా వారంలో ఒకసారి మాత్రమే ఫిట్స్ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజుకు మూడుసార్లు ఫిట్స్ వస్తూ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఫిట్స్‌తో పాటుగా బ్రెయిన్లో సుమారు ఏడు సెంటిమీటర్ల పరిమాణంలో ట్యూమర్ ఏర్పడింది. ఆపరేషన్ చేయించుకున్న పెద్ద ఆంజనేయులుతో వైద్యులు భవనం హనుమశ్రీనివాసరెడ్డి, త్రినాథ్ ట్యూమర్ వల్ల కాలు చేయి పటుత్వం కోల్పోయి వస్తువులేమీ చేతితో పట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పలు ఆస్పత్రుల్లో మందులు వాడినా సమస్య తగ్గలేదు. గత నెలలో గుంటూరులోని తమ ఆస్పత్రికి రోగి వచ్చాడని డాక్టర్ భవనం హనుమశ్రీనివాసరెడ్డి చెప్పారు. అతడికి ఎమ్మారై స్కానింగ్, బ్రెయిన్ తీడీ మ్యాప్ టెక్నాలజీ చేసి బ్రెయిన్లో అతిసున్నిత భాగమైన ఫ్రాంటల్ ప్రీమోటార్ ఏరియా నుంచి మిడిల్ ప్రాంటల్ గైరస్ వరకు సుమారు ఏడు సెంటీమీటర్ల పరిమాణంలో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అతి సున్నితమైన భాగాల్లో ట్యూమర్ ఉండటం వల్ల మెలకువగా ఉండి(అవేక్ సర్జరీ) ఆపరేషన్ చేయించుకుంటే బాగా ఉపయోగముంటుందని రోగికి కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. చదవండి: (మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం) రోగి అవేక్ సర్జరీకి అంగీకరించటంతో అత్యాధునికమైన న్యూరో నావిగేషన్ బ్రెయిన్ త్రీడీ మ్యాపింగ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉపయోగించి నవంబర్ 25న ఆపరేషన్ చేశామన్నారు. ఆపరేషన్ చేసేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆపరేషన్ చేస్తున్న సమయంలో రోగి కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను చూపించి రోగితో మాట్లాడుతూ విజయవంతంగా ఆపరేషన్ చేశామని చెప్పారు. సుమారు రూ.4లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశామన్నారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతోపాటుగా న్యూరో ఎనస్థటిస్ట్ డాక్టర్ త్రినాథ్, పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ ఆకాష్, వైద్య సిబ్బంది రెడ్డి, నరేందర్ పాల్గొన్నట్లు వెల్లడించారు. సకాలంలో ఆపరేషన్ చేయని పక్షంలో రోగికి బ్రెయిన్లో ట్యూమర్ పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని తెలిపారు. అవేక్ సర్జరీ విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యబృందాన్ని శ్రీసాయి హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత కృష్ణప్రసాద్ అభినందించారు. తన ప్రాణాలు కాపాడిన వైద్యులకు పెద్ద ఆంజనేయలు, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే ఆపరేషన్ చేయించుకునే స్థోమత తమకు లేదని, సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
విచిత్రమైన అలవాటు! తన జుట్టును తానే తింటున్న బాలిక!
చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్ బాల్(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్ సిండ్రోమ్‌గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు. (చదవండి: డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...) -
నగరంలో ఆపరేషన్ రోప్ అమలు..
-
యువకుడి కడుపులో 63 ‘స్టీల్ స్పూన్లు’.. ఏడాదిగా అవే ఆహారం!
లక్నో: ఏదైనా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతేనే.. కడుపులో నొప్పితో సతమతమవుతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏడాదిగా స్టీల్ స్పూన్లు తింటున్నాడు. పొట్ట నిండా స్పూన్లు ఉన్న ఈ షాకింగ్ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి శరీరంలో ఏకంగా 63 స్టీల్ స్పూన్లు ఉండటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. గంటల తరబడి శస్త్రచికిత్స చేసి చెంచాలను బయటకు తీశారు. ఏం జరిగింది? జిల్లాకు చెందిన విజయ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దాంతో ఏడాది క్రితం కుటుంబ సభ్యులు డీఅడిక్షన్ కేంద్రంలో చేర్పించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో స్పూన్లు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేసి 63 చెంచాలను బయటకు తీశారు. అయితే.. స్పూన్లు ఎలా వచ్చాయని డాక్టర్లు ప్రశ్నించగా.. తాను గత ఏడాది నుంచి స్పూన్లు తింటున్నానని విజయం చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఆ స్పూన్లు నువ్వే తింటున్నావా అని మేము అడిగితే అవునని చెప్పాడు. సుమారు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి స్పూన్లు తొలగించాం. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి విషమంగానే ఉంది. రోగి సుమారు ఏడాది కాలంగా స్టీల్ చెంచాలు తింటున్నాడు.’ అని డాక్టర్ రాకేశ్ ఖర్రాన్ తెలిపారు. మరోవైపు.. డీఅడిక్షన్ కేంద్రంలోనే విజయ్‌కి బలవంతంగా స్పూన్లు తినిపించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇదీ చదవండి: 11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. తర్వాత ఏం జరిగిందంటే? -
తలలో కణితి.. శిశువుకు శస్త్రచికిత్స
రఘునాథపల్లి: తలలో కణితితో జన్మించిన ఆడశిశువుకు ఆపరేషన్ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల ఆడశిశువును.. ఎవరో ఈ నెల 28న జనగామ జిల్లా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో వదిలేశారు. బాలల సంరక్షణ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మంగళవారం వైద్యులు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. కాగా, చిన్నారికి గుండెలోనూ సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి తెలిపారు. -
ఆపరేషన్ చేసి కుట్లు మరిచారు
యశవంతపుర: వృద్ధ మహిళకు డాక్టర్ ఆపరేషన్ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ సంఘటన దావణగెరెలో జరిగింది. దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మ (65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పారు. ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. (చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు) -
హైదరాబాద్: మనిషి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలోనే
సాక్షి, హైదరాబాద్: రోగి కిడ్నీలో ఏర్పడిన 206 రాళ్లను వెలికితీసి అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. గురువారం సదరు ఆస్పత్రి వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య (56) ఆరు నెలలుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన గత నెల ఎల్బీనగర్లోని అవేర్ ఆస్పత్రిలో చేరాడు. యూరాలజీ సీనియర్ వైద్యుడు పూల సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రామలక్ష్మయ్యకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు రామలక్ష్మయ్యకు కీ హోల్ శస్త్ర చికిత్స చేసి గంట సేపట్లోనే కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. ఎండకాలం డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుందని, ఎండలో అధికంగా తిరగ డం కారణంగా సమస్య వస్తుందన్నారు. నీరు, జ్యూస్ అధిక మొత్తంలో తీసుకోవాలని వైద్యు లు సూచించారు. నీటి శాతం తక్కువ అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని పేర్కొన్నారు. చదవండి: పెళ్లి చూపులకు వచ్చిన వారు ఎవరూ ఒప్పుకోవడం లేదని -
ఇబ్రహీంపట్నంలో దారుణం..బాలికకు తెలియకుండా అబార్షన్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు పెళ్లికాని బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేయడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో రామరక్ష ఆసుపత్రి వైద్యులు బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి వైద్యాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అధికారులు ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇక, ఈ ఘటనలో రంగంలోకి దిగిన పోలీసులు 417, 420, 312, 342, 376, పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎంత మందికి అబార్షన్ చేశారు. ఎప్పుడు ఏ సమయంలో అబార్షన్స్ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి! -
4 గంటలు.. 3 సర్జరీలు
సాక్షి గాంధీ ఆస్పత్రి: గాంధీఆస్పత్రి ఆర్థోపెడిక్ వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురికి శస్త్ర చికిత్సలు చేసి ఔరా అనిపించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరికి చెందిన ఆగయ్య (63), ఖమ్మం జిల్లా వాసి అయిలయ్య(65), ముషీరాబాద్‌కు చెందిన నీలవేని (50)లకు మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏకబిగిన మూడు కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా సర్జరీలు ఉచితంగా చేసినట్లు గాంధీ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్, మైక్రోబయోలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజేశ్వరరావు తెలిపారు. సర్జరీలో పాల్గొన్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా, అనస్థీషియా హెచ్ఓడీ బేబిరాణి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, శ్రీనివాస నాయక్ అనీల్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అబ్బయ్య, కిరణ్, అక్రమ్‌లు అభినందలు అందుకున్నారు. (చదవండి: అంతు చిక్కని అస్వస్థత) -
మాట మార్చిన పుతిన్: యుద్ధాన్ని ఆపేందుకే మిలిటరీ ఆపరేషన్!
Goal Of Russias Military Operation: ఉక్రెయిన్ రష్యాల మధ్య సాగుతున్న నిరవధిక పోరు నేటికి 13వ రోజుకి చేరుకుంది. అయితే యూకేలో రష్యన్ రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని మిలటరీ ఆపరేషన్ లక్ష్యం యుద్ధాన్ని ఆపడమే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్టీ విక్టోరోవిచ్ లావ్రోవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ..ఇది పచ్చి అబద్ధం అని ఖండించారు. అంతేకాదు అప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని రష్యన్ మాట్లాడే వర్గాలను రక్షించడమే లక్ష్యంగా 'మిలిటరీ ఆపరేషన్' అని పేర్కొన్నారు. పైగా రష్యాను బెదిరించడానికి ఉక్రెయిన్ను ఉపయోగించకుండా నిరోధించడం అని కూడా చెప్పారు. కానీ పశ్చిమ దేశాలు పుతిన్ వాదనను యుద్ధానికి నిరాధారమైన సాకుగా అభివర్ణించాయి. కానీ ఇప్పుడేమో రష్యా ఎంబసీ ఉక్రెయిన్ భూభాగంలో జరిగే యుద్ధాన్ని ఆపేందుకే ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అయితే అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడమే కాక మాస్కో దురాక్రమణకు అడ్డుకట్టవేసేలా ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు రష్యా సాయుధ బలగాలు రాజధాని కైవ్‌ని సోంతం చేసుకుంటాం లొంగిపోండి అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని బెదిరించడమే కాక ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల బాంబుల వర్షంతో విరుచుకుపడింది. ఈ యుద్ధ విధ్వసం కారణంగా సుమారు 331 మందికి పైగా పౌరులు మరణించినట్లు యూఎన్ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. FM #Lavrov: The goal of Russia’s special military operation is to stop any war that could take place on Ukrainian territory or that could start from there. pic.twitter.com/tLf7798DIh — Russian Embassy, UK (@RussianEmbassy) March 7, 2022 (చదవండి: ఓవైపు యుద్ధం.. మరోవైపు తరలింపు!! రష్యా-ఉక్రెయిన్ చెరోమాట) -
ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్‌ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్‌ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం) -
అంకుర ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అంకుర ఆస్పత్రిలో అత్యంత అరుదైన ఆపరేషన్ నిర్వహించి కవలలను బతికించినట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదావాణి వెల్లడించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన మహిళ అత్యంత అరుదైన రకానికి చెందిన గర్భంతో ఉన్నట్లుగా గర్భధారణ జరిగిన తర్వాత 18వ వారంలో తాము గుర్తించామన్నారు. ఆమె మోనో కొరియోనిక్ ట్విన్స్ (గర్భాశయంలో ఇద్దరు పిల్లలు ఒకే ప్లాజంటా అమినిటిక్ సాక్‌ను పంచుకోవడం)గా కలిగి ఉన్నట్లు తేలిందిన్నారు. ఇలా ఉండటం అత్యంత అరుదని 35 వేల నుంచి 60 వేల గర్భాల్లో ఒకటి మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటాయన్నారు. దీని వల్ల పిండాలకు తీవ్ర మైన సమస్యలు తలెత్తుతాయని అలాంటి స్థితిలో పిండాలు బతికేందుకు 50 శాతం వరకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసు విషయంలో కవలలకు ఒకరికి కపాలం, మెదడు అసంపూర్ణంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో గర్భంలో ఉన్న శిశువును సెలక్టివ్ రిడెక్షన్ ప్రత్యేక టెక్నిక్స్‌ను ఉపయోగించి తొలగించడం జరిగిందన్నారు. ఇది దేశంలోనే అత్యంత అరుదైంది అన్నారు. ప్రసవం జరిగే వరకు ఎంతో జాగ్రత్తగా పరిశీలించాల్సి వచ్చిందన్నారు. వీరిని బతికించడం, డెలివరీ చేయడం సవాళ్లతో కూడుకున్నదని చక్కని వైద్య నిపుణులతో మంచి ఉపకరణాలున్న ఎన్ఐసీయూలతో ఇలాంటి కేసులో ఫలితాలు సాధించామని వారు వెల్లడించారు. -
మహేశ్‌బాబుకి సర్జరీ.. రెండు నెలల పాటు విశ్రాంతి!
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు సర్జరీ జరిగింది. కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు ఇటీవల స్పెయిన్‌కి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన దుబాయిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు మహేశ్‌బాబు షూటింగ్‌కి దూరంగా ఉండనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్ పడనుంది. ఆ కారణంగానే సినిమా విడుదల తేదిని కూడా వాయిదా వేశారు. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. కాగా, మహేశ్‌బాబుకి గతంలో కూడా మోకాలి నొప్పితో గాయంతో బాధపడ్డారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగ్‌కి వెళ్లారు. అప్పుడు సర్జరీ చేయించుకోకపోవడం వల్లే ఆ బాధ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకే ఆయన స్పెయిన్ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. ఇక మహేశ్ సర్జరీ చేయించుకున్నారనే వార్త విన్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. -
మహిళ కడుపులో కాటన్ గుడ్డను పెట్టి మర్చిపోయి కుట్లు వేయడంతో..
సాక్షి, మొయినాబాద్: ఆపరేషన్ చేసి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చారు డాక్టర్లు. పురుటి నొప్పులతో వచ్చిన మహిళకు శస్త్రచికిత్స చేసి కడుపులో కాటన్ వస్త్రం పెట్టి కుట్లు వేశారు. పది రోజుల తర్వాత తమతో కాదని చేతులెత్తేశారు. చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్ చేసి కాటన్ గుడ్డను బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాలివీ.. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ డెలివరీ కోసం నవంబర్ 28న మండల పరిధిలోని భాస్కర ఆస్పత్రికి వెళ్లింది. 29న ఉదయం డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు. పది రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. కుట్లు ఎంతకూ మానకపోవడంతోపాటు కడుపునొప్పి రావడంతో భర్త మాణిక్యం డాక్టర్లను ప్రశ్నించాడు. దీంతో ఎక్స్‌రేలు తీయిస్తూ, మందులు తెప్పిస్తూ కాలయాపన చేశారు. ఎంతకూ తగ్గకపోవడంతో చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈనెల 8న అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సైతం కాదని చెప్పడంతో అదే రోజు రాత్రి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు స్కానింగ్ చేసి కడుపులో ఏదో గుడ్డ ఉందని గుర్తించారు. శుక్రవారం ఆపరేషన్ చేసి బయటికి తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. చదవండి: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’! డాక్టర్లను ప్రశ్నించిన భర్త మాణిక్యం మాణిక్యం, బంధువులతో కలిసి శనివారం సాయంత్రం భాస్కర ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశారు. పెద్ద డాక్టర్లు లేరని.. సోమవారం వచ్చి మాట్లాడండి అంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లగొట్టారని మాణిక్యం ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంచందర్‌రావు వివరణ కోరగా రెండు రోజులుగా సెలవులో ఉన్నానని.. సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపడతామన్నారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
గేదె పాలు ఇవ్వడం లేదని ఆపరేషన్.. కడుపులో 5 కిలోల ప్లాస్టిక్
సాక్షి, ఆదిలాబాద్(నిర్మల్): ప్లాస్టిక్ కవర్లు పశువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. యథేచ్ఛగా వినియోగిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడంతో ఆహారంగా భావించి తింటున్న పశువులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మామడ మండలం కొరిటికల్ గ్రామంలో లింగన్నకు చెందిన గేదె ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురైంది. మేత మేయకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, పాలు ఇవ్వకపోవడం వంటి లక్షణాలను గుర్తించిన పోషకుడు పశువైద్యులు ఓంప్రకాష్, శ్రీకర్రాజులకు సమాచారం అందించాడు. గురువారం గేదెను పరీక్షించిన పశువైద్యాధికారులు ప్లాస్టిక్ ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి గురైందని గుర్తించారు. ఆపరేషన్ ద్వారా గేదె కడుపులోపల ఉన్న ఐదు కిలోలకు పైగా ప్లాస్టిక్‌ను తొలగించారు. పశుపోషకులు పశువుల మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..) -
2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిని షేక్ అబ్దుల్ రహీం లక్డీకపూల్లో మిరాకిల్ గ్లాస్ ట్రేడర్ పేరు షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీ సాయంత్రం తన వీపు పై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్ కొడుకు షేక్ జునేద్ (21) తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్ అబ్దుల్ రహీమ్.. జునేద్‌ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్‌కు పరీక్షలు నిర్వహించి క్లినిక్‌లోకి తీసుకువెళ్లి షేక్ అబ్దుల్ రహీమ్‌ను అడగకుండానే మైనర్ సర్జరీ చేసి కురుపును తొలగించాడు. సర్జరీ విషయం తెలిసిన జునైద్ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని నిలదీశాడు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్ జునేద్‌కు నొప్పి బాగా పెరిగింది. అక్కడరక్తస్రావమైంది. గమనించిన డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్‌ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్ జునేద్‌కు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు నేరుగా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. కురుపు వద్ద మైనర్ సర్జరి చేసే సమయంలో సూది జునైద్ శరీరంలోనే ఉండిపోయిందని డాక్టర్ సజ్జాద్ తెలిపారు. ఇదిలా ఉండగా 3వ తేదీ తెల్లవారు జామున షేక్ జునైద్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆపిల్ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా సర్జరీ చేశారని షేక్ అబ్దుల్ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును గోల్కొండ పోలీసులు బుధవారం స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి విజ్ఞప్తి మేరకు గురువారం ఉస్మానియా వైద్యులు ఖననం చేసిన షేక్ జునైద్ మృతదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సెవెన్ టూంబ్స్ సమీపంలోని స్మశానవాటిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఒంట్లోకి దూసుకెళ్లిన ఇనుప కడ్డీ.. స్విమ్స్‌లో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్
సాక్షి, తిరుపతి తుడా: కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన తాపీ మేస్త్రి కె.లక్ష్మయ్యకు తిరుపతి స్విమ్స్ వైద్యులు సోమవారం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు లక్ష్మయ్య కిందపడ్డాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిపై పడడంతో తొడ భాగంలో గుచ్చుకున్న ఇనుప కడ్డీ భుజం నుంచి బయటకు చొచ్చుకుని వచ్చింది. స్థానికులు అతన్ని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారానే ఇనుప కడ్డీని శరీరం నుంచి తీయాల్సి రావడంతో వైద్యులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆదివారం బాధితుడ్ని స్విమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించారు. స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సీటీసర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు పేషెంట్ స్థితిగతులను వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. 10 ఎంఎం సైజు ఇనుప కడ్డీ దాదాపు మూడు అడుగుల పొడవు అతని శరీర భాగంలోకి చొచ్చుకుని పోయిందని నిర్ధారించారు. అతిక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి బాధితుడికి ప్రాణం పోశారు. శరీర భాగంలోని అవయవాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని ఆ ఇనుప కడ్డీని శరీరం నుంచి వేరు చేశారు. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ సత్యవతి, డాక్టర్ మధుసూదన్ల బృందాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అభినందించారు. -
Operation Parivartan: గంజాయి కట్టడికి దేశంలోనే భారీ ఆపరేషన్
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) వేళ్లూనుకున్న గంజాయి దందాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ అప్రతిహతంగా సాగుతోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్‌తో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ‘ఆపరేషన్ పరివర్తన్’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రచారం చేపట్టినా గిరిజనుల సహకారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) మన్యంలో ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా 10 మంది సభ్యులతో 30 బృందాలను ప్రభుత్వం నియమించింది. చదవండి: విశాఖ నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు మావోయిస్టుల బెదిరింపులు బేఖాతర్ మావోయిస్టుల సహకారంతోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డ్రోన్ కెమెరాల సహకారంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తోంది. గిరిజనులను భయపెట్టేందుకు మావోయిస్టులు ఇటీవల విశాఖ ఏజెన్సీలో పోస్టర్లు అతికించారు. ‘పోలీసు వాహనాల్లో ప్రయాణించవద్దు.. గంజాయి మొక్కల నరికివేతకు సహకరించవద్దు.. ప్రత్యామ్నాయం చూపకుండా గంజాయి సాగును నిర్మూలించడం హేయమైన చర్య’ అని పేర్కొంటూ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరుతో పోస్టర్లు అతికించారు. అయితే ‘సెబ్’ బృందాలు ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. గిరిజనులు కూడా పూర్తిస్థాయిలో దీనికి సహకరిస్తున్నారు. మన్యంలోకి ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన తరువాతే ‘సెబ్’ ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టింది. తొలుత ప్రత్యేక నిఘా బృందాల ద్వారా క్షేత్రస్థాయి నివేదిక సేకరించింది. అనంతరం డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాలను గుర్తించి రంగంలోకి దిగింది. మూడు బేస్ క్యాంప్‌ల నుంచి ప్రతి రోజు ప్రత్యేక బృందాలు మన్యంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుని ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిత్యం సగటున ఆరేడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహిస్తూ సగటున 150 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. అతిపెద్ద ఆపరేషన్ అక్టోబరు 30న ప్రారంభించిన ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5,600 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం విశేషం. దీంతో పాటు అక్రమంగా రవాణా చేస్తున్న 18,600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 113 వాహనాలను జప్తు చేసి, 217 కేసులు నమోదు చేశారు. దాదాపు 2.15 కోట్ల గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీటి విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి సాగు నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ దేశంలో అతి పెద్దది. 29 రోజుల్లోనే పెద్ద ఎత్తున గంజాయిని ధ్వంసం చేయడంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏవోబీతోపాటు దండకారణ్యం విస్తరించిన ఒడిశా, చత్తీస్ఘడ్, జార్ఖండ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సాగవుతోంది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత విస్తృతస్థాయిలో ఆపరేషన్ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ పరివర్తన్‌పై ఎన్సీబీ ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. -
వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!
ఏదైన వ్యాధి వస్తే తొందరగా తగ్గిపోయేంత వరకు మనస్సు ఒక పట్టాన కుదుటపడదు. అలాంటిది కొన్ని అరుదైన వ్యాధులతో పోరాడతూనే మరోవైపు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏ చిన్న అవకాశమైన దొరక్కుండా పోతుందా అనే ఆశతో ఎదురుచేసేవాళ్లను చూస్తే చాలా బాధనిపిస్తుంది కదూ. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతోంది. (చదవండి: టెన్నిస్ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి) అసలు విషయంలోకెళ్లితే....బోల్టన్‌కు చెందిన లీన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటూ అరుదైన పరిస్థితితో జీవితాన్ని గడుపుతోంది. పైగా ఆమె నిరంతర వికారం కడుపు నొప్పి కారణంగా ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు ఆమె ఈ సమస్య కారణంగా ఏమి తినలేక జీర్ణించకోలేక అత్యంత బాధను అనుభవిస్తున్న సందర్భాలు అనేకం. అయితే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తొలిసారిగా 2008లో గుర్తించడమే కాక గ్యాస్ట్రోపరేసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమెకు గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్‌ను అమర్చారు. అయితే ఆ పరికరానికి సంబంధించిన బ్యాటరీ అయిపోవడంతో పరిస్థితి మళ్లీ యథావిధికి వచ్చేసింది. పైగా ఆ బ్యాటరీలు చాలా అరుదుగా లభిస్తాయని, వాటిని మార్చడం కోసం దగ్గర దగ్గరగా సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఆమె ఈ వ్యాధి కారణంగా ఉద్యోగానికి దూరమవ్వడమే కాక కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె తను ఏవిధంగానైన తన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్ కొత్తబ్యాటరీ కోసం కావల్సిన డబ్బుల నిమిత్తం "గో ఫండ్ మీ" అనే వెబ్‌పేజీ ఓపెన్ చేసి తన శస్త్రచికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో తనకు ఎవరైనా సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఆ వెబ్‌పేజ్‌కి సుమారు రూ. 3 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. ఏది ఏమైన ఆమె ఆశావాహదృక్పథానికి అభినందిస్తూ...లీన్నే శస్త్ర చికిత్సకు కావల్సిన డబ్బులు సమకూరి త్వరితగతిన ఆ అరుదైన వ్యాధి నుండి బయటపడాలని ఆశిద్దాం. (చదవండి: అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) -
గంజాయి సాగు పై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం
-
13 ఏళ్ల బాలికకు పునర్జన్మ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గ్రహణంమొర్రి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ జీవించే అవకాశం ప్రమాదంలో పడ్డ 13 ఏళ్ల బాలికకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో పునర్జన్మ లభించింది. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పరిధి కొత్తపాలెం నివాసితులు సిద్దాబత్తుల పురుషోత్తం, కుమారి నిరుపేదలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో చివరి సంతానం.. కృప. 2008లో జన్మించిన కృప గ్రహణంమొర్రి, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ విశాఖ వస్తున్నారని తెలుసుకుని పాప తల్లిదండ్రులు ఆయనను కలిశారు. వైఎస్సార్ పాపకు వెంటనే ఆపరేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గ్రహణంమొర్రికి ఆపరేషన్ చేయించారు. గుండెకు మాత్రం పాప ఎదిగిన తర్వాతే ఆపరేషన్ చేయడం వీలవుతుందని వైద్యులు తెలిపారు. 2009లో వైఎస్సార్ కన్నుమూయడంతో తర్వాత వచ్చిన పాలకులు చిన్నారిని పట్టించుకోలేదు. కృప ఎదిగే కొద్దీ గుండె సమస్యతోపాటు కిడ్నీ సమస్య కూడా వెంటాడింది. దీంతో తరచూ తీవ్ర అనారోగ్యానికి గురవుతుండేది. వైఎస్సార్, జగన్‌లకు రుణపడి ఉంటాం.. నాడు పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి మమ్మల్ని ఆదుకోకపోతే మా పాప జీవించి ఉండేది కాదు. ఎక్కడున్నా ఆ మహానుభావుడికి వేల వేల కృతజ్ఞతలు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యశ్రీని వర్తింపజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. –పురుషోత్తం సిద్దాబత్తుల (చిన్నారి కృప తండ్రి) ‘సాక్షి’ చొరవతో.. ఈ ఏడాది జూన్ 23న కృప తీవ్ర అనారోగ్యానికి గురవడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పాపకు గుండె, కిడ్నీ సమస్యలు తీవ్రమైనట్టు తెలిపారు. వీటికి హైదరాబాద్ లేదా చెన్నైలో మాత్రమే చికిత్స ఉందని, చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పారు. బతికే అవకాశాలు కూడా తక్కువేనని చెప్పడంతో తల్లిదండ్రులు బావురుమన్నారు. ఇక చేసేది లేక కృప తండ్రి పురుషోత్తం తనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సహాయాన్ని అర్థించడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన మెసేజ్‌ను చూసిన సాక్షి విలేకరి విజయ్‌కుమార్ వెంటనే పాప అనారోగ్య విషయాన్ని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్‌కు తెలియజేశారు. బెంగళూరు నుంచి తల్లిదండ్రులతో కలిసి ఇటీవల నగరానికి చేరుకున్న కృప ఆయన కృపకు బెంగళూరులో ఆపరేషన్ చేసే వీలుందని తెలుసుకుని.. అక్కడి ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ ఉషతో మాట్లాడారు. ఆమె సూచన మేరకు కృపను బెంగళూరు వైదేహి ఆస్పత్రిలో చేర్చారు. సెప్టెంబర్ 8న కార్డియాలజిస్ట్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం పాపకు గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. పాపకు ఆరోగ్యం కుదుటపడటంతో సెప్టెంబర్ 24న డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడే గుండె ఆపరేషన్ చేయడంతో కొంతకాలం ఆగాక కిడ్నీ సమస్యకు కూడా ఉచితంగా ఆపరేషన్ చేస్తానన్నారని కృప తల్లిదండ్రులు చెప్పారు. ఆపరేషన్ మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లోనూ వర్తింపచేయడం గ్రేట్ ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స. ఇలాంటి ఆపరేషన్‌ల్లో సగం మాత్రమే విజయావకాశాలు ఉంటాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్నవారికి కూడా వర్తింపజేయడం గ్రేట్. గతేడాది మా ఆస్పత్రిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఆనంద్‌కు ఆరోగ్యశ్రీ పథకం కింద గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాం. దీనికి ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు విడుదల చేసింది. – డాక్టర్ దుర్గాప్రసాద్, కార్డియాలజిస్ట్, వైదేహి ఆస్పత్రి, బెంగళూరు -
పేద కుటుంబానికి పెద్ద కష్టం: ప్లీజ్..నన్ను బతికించండి..
కరీంనగర్ టౌన్: అద్దె ఇంట్లో జీవనం..వచ్చి పడ్డ ఆపదతో పేద కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్రీనివాస్ థియేటర్ పక్క వీధిలో నలభై ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న మిట్టపల్లి రాజయ్య ఓ ఏజెన్సీకి సంబంధించిన ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు సంతానం. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సంతోశ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. చదవండి: పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా కొన్నాళ్లు స్టేషనరీ షాపులో పని చేయగా అనంతరం హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా నెలకు రూ.9 వేల జీతానికి పని చేస్తున్నాడు. అతడికి భార్య ముగ్గురు పిల్లలు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న సంతోశ్ అనారోగ్యానికి గురయ్యాడు. రెండేళ్ల కిందట కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కడుపులో చిన్నపేగు దగ్గర పెద్ద కణితి తయారైందని నిర్ధారణ అయింది. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక రూ.15 లక్షలు అవసరం సంతోశ్ ఏడాదిన్నరగా ఇంట్లో మంచానికే పరిమితం అయ్యాడు. అతడి ఆదాయంపై ఆధారపడిన కుటుంబం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. రెక్కాడితే గానీ డొక్కాడని తమకు శస్త్రచికిత్స కోసం రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆ కుటుంబం బాధపడుతోంది. పేద కుటుంబానికి పెద్ద కష్టం రావడంతో వైద్య చికిత్స కోసం అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. మానవతావాదులు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆ కుటుంబం దీనంగా ఎదురుచూస్తోంది. సహాయం చేయాలనుకునే దాతలు సంప్రదించాల్సిన వివరాలు మిట్టపల్లి సంతోశ్ బ్యాంక్ ఖాతా హెచ్డీఎఫ్సీ 50100 3274 70439 ఐఎఫ్ఎస్సీ కోడ్ : హెచ్డీఎఫ్సీ 0003461 ఫోన్ నంబర్ : 98494 72734 -
సియాచిన్ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు
న్యూఢిల్లీ: కొందరూ అన్ని సక్రమంగా ఉండి ఏం సాధించలేక నిరాశ నిస్ప్రుహలకి లోనైన ఆత్మనూన్యత భావంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా వికలాంగులు ప్రంపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హిమ శిఖరాలలో ఒకటైన సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వివరాల్లోకెళ్లితే.... ఎనిమిది మంది వికలాంగుల బృందం ఆదివారం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ హిమ శిఖరం దగ్గర కుమార్ పోస్ట్ వద్దకు చేరుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో ఒకటైన సియాచిన్ హిమనీనదాన్ని అధిరోహించిన తొలి వికలాంగ బృందంగా నిలిచింది. భారత సైన్యం కాంకర్ ల్యాండ్ వాటర్ ఎయిర్(క్లావ్)ని ట్రెక్కింగ్ చేయడానికీ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో క్లావ్, మాజీ ఆర్మీ అధికారులు ఏప్రిల్ నెలలో ఈ ట్రెక్కింగ్‌లో వికలాంగులు పాల్గొనేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. మాజీ పారా ఆఫీసర్ మేజర్ వివేక్ జాకబ్ నేతృత్వంలో 20 మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట్లు భారత సైన్యం పేర్కొంది(చదవండి: 70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా) ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున "ఆపరేషన్ బ్లూ" పేరుతో ఈ యాత్ర ప్రారంభించారు. దీన్ని క్లావ్ టీమ్, భారతసైనిక దళలు వికాంగుల సాధికారత దిశగా ప్రోత్సహించేలా ఈ ఆపరేషన్ని అమలు చేశారు. ఆపరేషన్ బ్లూ విజయవంతమవ్వడమే కాక ప్రపంచ రికార్డు సృష్టించారంటూ ...భారత సైన్య్ం ట్వీట్ చేసింది. (చదవండి: పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!) -
సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల
మెగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు సర్జరీ పూర్తయింది. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికి వైద్యులు కాలర్ బోన్‌కు సర్జరీ నిర్వహించారు. కాసేపటి క్రితమే ఈ ఆపరేషన్ సెక్సెస్‌గా ముగిసిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్ బావ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, అల్లు అరవింద్‌లు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో సాయి తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి భాగంలో గాయమైన సంగతి తెలిసిందే. -
ఆడా-మగా జననాంగాలు.. 25 ఏళ్ల తర్వాత వివాదాస్పదం
వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్‌సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది. హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది. ‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె. మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్‌గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా. చదవండి: ‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’ -
అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్ ట్విన్స్
బ్రెజిల్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐడెంటికల్ ట్విన్స్.. జెండర్ కన్ఫర్మేషన్ సర్జరీ(లింగమార్పిడి సర్జరీ)తో ఆడవాళ్లుగా మారారు. ఈ సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆగ్నేయ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ మాల్యా, సోఫియాలు పుట్టుకతో అబ్బాయిలు. అయితే పెరుగుతున్న కొద్ది వారిలో మార్పులు చోటు చేసుకోసాగాయి. అబ్బాయిలుగా కంటే అమ్మాయిలుగా తమను గుర్తించుకోవటానికే ఇష్టపడేవారు. తమను అమ్మాయిలుగా మార్చేయమని దేవుడ్ని ప్రార్థించేవారు. లింగమార్పిడి సర్జరీ ద్వారా అమ్మాయిలుగా మారాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇందుకు వారి ఫ్యామిలీనుంచి కూడా సపోర్ట్ దొరికింది. వీరి తాతయ్య ఆపరేషన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు సహాయం చేశాడు. వారం క్రితం వీరిద్దరికీ ఓ రోజు తేడాతో లింగమార్పిడి సర్జరీ జరిగింది. దీనిపై మాల్యా మాట్లాడుతూ.. ‘‘నాకు నా శరీరం అంటే చాలా ప్రేమ, కానీ, నా జననాంగాన్ని ఇష్టపడేదాన్ని కాదు. నన్ను అమ్మాయిగా మార్చేయమని దేవుడ్ని ప్రార్ధించే దాన్ని’’ అని పేర్కొంది. చదవండి : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి.. కోపంతో నా ఫ్రెండ్ ముక్కు పగులగొట్టా: ఒబామా -
ముంబై: ‘ఆపరేషన్ ఆలౌట్’.. దడ మొదలైంది!
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 39 మంది నేరస్తులను ముంబై పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక నగరంలోని అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 951 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబై పోలీసులు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ‘ఆపరేషన్ ఆలౌట్’ పథకం సత్పలితాలనిస్తోంది. ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో స్థానికంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తులతో పాటు పరారీలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులు, లైసెన్స్ లేని ఆయుధాలతో తిరుగుతున్న నేరస్తులు కూడా ఇందులో పట్టుబడుతున్నారు. దీంతో కరుడుగట్టి నేరస్తులతోపాటు ఇళ్లల్లో దాక్కున్న సాధారణ నేరస్తుల్లో దడ మొదలైంది. ముంబై సీపీ నేతృత్వంలో.. శివ్ (శివాజీ) జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్ చేపట్టారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, విశ్వాస్ నాంగరే–పాటిల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ల మార్గదర్శనంలో కూంబింగ్ ఆపరేషన్ జరిగింది. తమ తమ పోలీసుస్టేషన్ల హద్దులో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు 259 చోట్ల కూంబింగ్ నిర్వహించారు. అందులో పరారీలో ఉన్న 39 మంది నేరస్తులను పట్టుకోగా లైసెన్స్ లేకుండా అక్రమంగా ఆయుధాలతో తిరుగుతున్న 37 మందిపై, నగర బహిష్కరణకు గురైన మరో 37 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నివాసముంటున్న వారిపై కూడా ఈ ఆపరేషన్‌లో చర్యలు తీసుకున్నారు. అందులో హోటళ్లు, ముసాఫిర్ ఖానా, లాడ్జింగులు, గెస్ట్ హౌస్‌లు తదితర అద్దె నివాస గృహాలలో 951 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అలాగే మొత్తం ముంబైలో 149 చోట్ల నాకా బందీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ఆలౌట్‌లో భాగంగా రోడ్లపై, జంక్షన్ల వద్ద, సిగ్నల్స్ వద్ద అడుక్కుంటున్న 50 మంది బిక్షగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బిక్షగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దడమూ ఈ ఆపరేషన్ లక్ష్యమే. సిగ్నల్స్ వద్ద, ప్రార్థన స్థలాలవద్ద అడుక్కుంటున్న బిక్షగాళ్లందరిని పట్టుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా ముంబై పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లేదా నగరాన్ని తిలకించేందుకు వచ్చి తప్పిపోయి తిరుగుతున్న లేదా ప్రేమలో మోసపోయి ఇంటికి వెళ్లలేక ఇక్కడే తిరుగుతున్న పిల్లలన్ని పట్టుకుని వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఇందులో అనేక మంది పిల్లలు రైల్వే స్టేషన్ల బయట, ప్లాట్‌ఫారాలపై, బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై లభించారు. వీరి చిరునామా సేకరించి ఇళ్లకు పంపించడంతో అనేక పేద కుటుంబాలు ఉపరి పీల్చుకున్నాయి. అంతేగాకుండా ఈ పథకం చేపట్టినందుకు ముంబై పోలీసులు వివిధ రంగాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు ఉత్తరాఖండ్: మూడేళ్ల కొడుకును వదిలి -
బొటన వేలిని పరీక్షగా చూసి షాక్!
ముంబై : ప్రమాదంలో తెగిపోయిన ఓ వ్యక్తి బొటన వేలు భాగాన్ని అతికించటానికి దాదాపు ఏడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు డాక్టర్లు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు.. ముంబైకి చెందిన రోహాన్ అజ్గాంకర్(42)కు బైక్ విన్యాసాలు చేయటం అంటే సరదా. దీంతో భార్య జాగృతి ఓ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం అతడు తడి బట్టతో ఆ బైక్‌ను తుడుస్తున్నాడు. ఆ సమయంలో బైక్ ఇంజిన్ ఆన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అతడి ఎడమ చేయి బొటన వేలు చైన్‌లో ఇరుక్కుపోయింది. సెకన్లలో చెయ్యిని వెనక్కు లాక్కున్నాడు. వేలునుంచి బుడబుడా రక్తం కారసాగింది. ( కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ ) అయితే అదో చిన్న గాయంగా భావించిన అతడు బొటన వేలిని పరీక్షగా చూసి షాక్ అయ్యాడు. వేలి పైభాగం కనిపించలేదు. దానికోసం వెతగ్గా ఐదు అడుగుల దూరంలో కనిపించింది. వెంటనే పరెల్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు దాదాపు ఏడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి వేలిని అతికించారు. కాగా, తను గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్ కారణంగానే భర్తకు ప్రమాదం జరగటంతో భార్య జాగృతి బాధతో కుమిళిపోతోంది. చదవండి : నానమ్మను గుర్తు చేసిన ప్రియాంక.. ఫోటోలు వైరల్ -
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్
గుంటూరు మెడికల్: పుట్టుకతోనే చెవుడు సమస్యతో బాధపడుతున్న బాలుడి రెండు చెవులకు రూ.12 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను గుంటూరులో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారు. దేశంలోనే మొదటిసారిగా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. దీంతో గుంటూరు ఈఎన్టీ వైద్యులు తొలిసారిగా రెండు చెవులకు ఆపరేషన్ చేసి బాలుడి వినికిడి సమస్యను తొలగించారు. గుంటూరు కొత్తపేటలోని బయ్యా ఈఎన్టీ హాస్పిటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు ఈ వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన పఠాన్ ఆరిఫ్‌ఖాన్, రిహానాల రెండో సంతానం హర్షద్‌ఖాన్ (3)కు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. తల్లిదండ్రులు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావును సంప్రదించగా ఆరునెలల కిందట ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. రెండునెలల కిందట హర్షద్‌ఖాన్ తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వివరించగా ఆయన రెండో చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు ఆదేశాలు జారీచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రెండు చెవులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించి బాలుడికి ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు చెప్పారు. ఆరునెలల కిందట ఒక చెవికి, నవంబర్ 30న రెండో చెవికి విజయవంతంగా ఆపరేషన్ చేశామన్నారు. ఆపరేషన్లోసర్జన్ డాక్టర్ బయ్యా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో గరిష్ట స్థాయికి..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో విధించిన 8 వారాల లాక్‌డౌన్‌తోపాటు ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను పెంచడం వల్ల ఈ గరిష్ట స్థాయి అనేది 34 నుంచి 76 రోజులు వెనక్కి జరుగుతున్నట్లు తేలింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరితే బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత తప్పకపోవచ్చని అధ్యయనం వెల్లడించింది. అందుకే ఇప్పటినుంచే అప్రమత్తం కావడం మంచిదని సూచించింది. పరిశోధకులు ఇంకా ఏం చెప్పారంటే.. ► లాక్డౌన్, ఇతర నియంత్రణ చర్యల వల్ల కరోనా వ్యాప్తిలో గరిష్ట స్థాయి దాదాపు రెండున్నర నెలలు ఆలస్యమవుతోంది. తద్వారా కరోనా బాధితుల సంఖ్య 97 శాతం నుంచి 69 శాతానికి తగ్గిపోతుంది. ఈ రెండున్నర నెలల సమయాన్ని ఆరోగ్య రంగంలో వనరుల కల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వాడుకోవచ్చు. ► ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల డిమాండ్‌ను నవంబర్ మొదటి వారం వరకు తట్టుకోవచ్చు. ఆ తర్వాత ఐసోలేషన్ బెడ్ల కొరత 5.4 నెలలు, ఐసీయూ పడకల కొరత 4.6 నెలలు, వెంటిలేటర్ల కొరత 3.9 నెలలు తప్పకపోవచ్చు. ► కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించాలంటే టెస్టింగ్, ట్రీట్మెంట్, కాంట్రాక్టు ట్రేసింగ్ను పెంచాలి. ► కరోనా బాధితుల కోసం 2,313 హెల్త్సెంటర్లు పని చేస్తున్నాయని, 1,33,037 ఐసోలేషన్ బెడ్లు, 10,748 ఐసీయూ బెడ్లు, 46,635 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. 9 వేలు దాటిన మరణాలు భారత్‌లో కరోనా విలయం యథాతథంగా కొనసాగుతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 3.20 లక్షలు, మరణాలు 9 వేల మార్కును దాటేశాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,929 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 311 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా మొత్తం కేసులు 3,20,922కు, మరణాలు 9,195కి చేరాయి. దేశంలో ప్రసుత్తం క్రియాశీల కరోనా కేసులు 1,49,348. కరోనా బాధితుల్లో 1,62,378 మంది చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతుండడం సానుకూలం పరిణామంగా చెప్పొచ్చు. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉండడం విశేషం. ప్రస్తుతం రికవరీ రేటు 50.60 శాతంగా నమోదైంది. తాజాగా కరోనా వల్ల 311 మంది మరణించగా, వీరిలో 113 మంది మహారాష్ట్రలోనే కన్నుమూయడం గమనార్హం. ఢిల్లీలో 57, గుజరాత్లో 33, తమిళనాడులో 30 మంది చనిపోయారు. మరణాల్లో తొమ్మిదో స్థానం కరోనా మహమ్మారి కాటుకు దేశంలో ఇప్పటిదాకా 9,195 మంది మరణించారు. దీంతో కరోనా సంబంధిత మరణాల్లో దేశం ప్రపంచంలో తొమ్మిదో స్థానానికి చేరింది. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచింది. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో పరీక్షల సంఖ్య పెంచుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 893 ల్యాబ్‌ల్లో ఇప్పటివరకు 56,58,614 కరోనా టెస్టులు జరిగాయి. -
కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్ : కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఆపరేషన్ చేసి...కణితులు తొలగించాల్సింది పోయి...సర్జరీ సమయంలో ఉపయోగించే క్లాత్, కాటన్ కుక్కేశారు. దీంతో బాధితురాలికి మళ్లీ కడుపునొప్పి తిరగబెట్టింది. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్లకంటి లాలమ్మ(43) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఆమనగల్లులోని ఓ ఆసుపత్రిలో చూపించగా కడుపులో కణితులు ఉన్నాయని హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెబుతూ బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ మేరకు లాలమ్మకు గతేడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. ఇటీవల లాలమ్మకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం కర్మన్‌ఘాట్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని అనగా.. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా కడుపులో కణితులతో పాటు క్లాత్, ఆపరేషన్‌లో వినియోగించే పత్తి ఉండలు బైటపడ్డాయి. గతంలో ఎక్కడ ఆపరేషన్ చేయించారో వాళ్ల నిర్లక్ష్యమేనని అక్కడి ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రి వద్దకు చేరుకుని నిలదీద్దామని వస్తే అది మూసివేశారు. దీనిపై బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని లాలమ్మ కుమారుడు శేఖర్ తెలిపారు. చదవండి: ఇది మదురై కాదా..! -
సీఎం జగన్ ఔదార్యం..
టెక్కలి రూరల్: చిన్నారి మోహిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని తనకు ఇవ్వాలని, తన ఇంట్లో పెట్టుకుంటానని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ను అడిగింది. దీంతో ఆమెకు సీఎం చిత్రపటాన్ని దువ్వాడ అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుమారు 10 సంవత్సరాల క్రితం కోటబోమ్మాళి గ్రామానికి చెందిన సకలబర్తుల త్రినాథరావు కుమార్తె మోహితకు రెండు చెవులు వినిపించక ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలసి తమ సమస్యను వివరించారు. (టీడీపీ నేత కుమార్తెకు జగన్ సాయం) దానిపై స్పందించిన ఆయన మోహితకు ఆ్రస్టేలియా డాక్టర్లతో వైద్యం చేయించి వినిపించేందుకు వీలుగా చెవిలో మిషన్ ఏర్పాటు చేశారు. అలాగే వెలుపల వైపు మరో మిషన్ ఏర్పాటు చేశారు. అయితే వెలుపలి వైపు ఏర్పాటు చేసిన మిషన్ 10 సంవత్సరాలే పనిచేస్తుందని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్ 23వ తేదీన మిషన్ పని చేయడం ఆగిపోయింది. మరలా ఆ అమ్మాయికి అదే సమస్య వచ్చింది. దువ్వాడ చొరవతో మరలా సాయం ప్రస్తుతం మోహిత 9వ తరగతి చదువుతోంది. మరలా ఆ పాపకు సక్రమంగా వినిపించాలంటే మిషన్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ అపోలో ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పాన్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న త్రినాథరావు అంత డబ్బు లేకపోవడంతో కుమిలిపోయాడు. ఆ సమయంలో కొంతమంది స్నేహితుల సాయంతో వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ వద్దకు వెళ్లారు. (ఎనిమిది నెలల చిన్నారి వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్) అనంతరం దువ్వాడతో జరిగిన విషయం అంతా వివరించడంతో ఆయన చలించిపోయారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు విడుదల చేశారు. దీంతో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను పార్టీ కార్యాలయంలో దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కుమార్తెను దేవుళ్లులా ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో పొన్నాన జగన్మోహన్రావు(చంటి), కిల్లి అజయ్‌కుమార్, బెండి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..
సాధారణంగానే జలగలను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది రెండు నెలలకు పైగా ఒక వ్యక్తి శరీరంలో జలగలు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఒక వ్యక్తి రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం దగ్గుతుండగా రక్తం పడడంతో అనుమానమొచ్చి సదరు వ్యక్తి ప్యూజిన్ ఫ్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ హాస్పిటల్‌ను సంప్రదించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అతన్ని శ్వాసకోస విభాగానికి సిఫార్సు చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి సిటీ స్కాన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించారు. రిపోర్టులను పరీక్షించిన డాక్టర్లు ఆ వ్యక్తి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. వెంటనే సదరు వ్యక్తికి మత్తుమందు ఇచ్చి ట్వీజర్ సాయంతో ఆపరేషన్ నిర్వహించి 1.2 ఇంచులు ఉన్న రెండు జలగలను బయటికి తీశారు. ప్రసుత్తం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 'అతని గొంతులోంచి రెండు జలగలను బయటకు తీశాం. ప్రసుత్తం అతని ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆ వ్యక్తి బహుశా జలగలు ఉన్న నీటిని తాగి ఉంటాడు. అయితే అవి కంటికి కనిపించని స్థితిలో ఉండడంతో గుర్తించలేకపోయాడు. కాగా, ఆ జలగలు రెండు నెలలుగా ఆ వ్యక్తి యొక్క రక్తం పీల్చుతూ పెరిగాయని' శ్వాసకోస విభాగధిపతి డాక్టర్ రావు గున్యాంగ్ తెలిపారు. -
మృతుడి చర్మం సేకరించి... కాలిన రోగికి అంటించి
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో మొదటిసారి ఒక చనిపోయిన వ్యక్తి నుంచి చర్మం సేకరించి కాలిన గాయాలతో బాధ పడుతున్న రోగికి అమర్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుంటూరుకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జీఎస్ సతీష్‌కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 18 రోజుల క్రితం తొడ, ఇతర భాగాల వద్ద చర్మం కాలి తమ వద్దకు చికిత్స కోసం వచ్చారన్నారు. సాధారణంగా చర్మం కాలిన వారికి వారి శరీరంలోని తొడ, కాలు, చేయి, పొట్ట ఇతర శరీర భాగాల నుంచి చర్మం సేకరించి కాలినచోట అతికించి ఆపరేషన్ చేస్తామన్నారు. తమ వద్దకు వచ్చిన వ్యక్తికి 30 శాతం కాలిన గాయాలు ఉండటంతో పాటుగా చర్మాన్ని సేకరించేందుకు వీలు కుదరకపోవటంతో చనిపోయిన వారి నుంచి చర్మాన్ని( కెడావర్) సేకరించి అమర్చేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ముంబై లోని నేషనల్ సెంటర్ నుంచి నిల్వ ఉంచిన చర్మాన్ని సేకరించి ఐదు రోజుల క్రితం కెడావర్ గ్రాఫ్ట్ ద్వారా ఆపరేషన్ చేసి చర్మం అతికించామన్నారు. చర్మాన్ని సేకరించి స్కిన్ బ్యాంక్‌లో ఐదేళ్ల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. స్కిన్ బ్యాంక్ ఉంటే కాలిన గాయాల వారు చాలా త్వరగా కోలుకుంటారని, చనిపోయిన వారి నుంచి కళ్లు, కిడ్నీలు, గుండె సేకరించినట్టుగానే చర్మాన్ని కూడా సేకరించి కాలిన గాయాలవారి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. -
ఆపరేషన్ కేలా మీలర్
చీకటిలోనూ వెలుగును చూస్తున్నాను. నిర్బంధంలోనూ స్వేచ్ఛను కనుగొంటున్నాను. ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలత ఉంటుంది. – కేలా మీలర్ నాలుగేళ్ల క్రితం ఐసిస్ చిత్ర హింసలకు బలైన మానవతావాది ‘కేలా మీలర్’ పేరిట ఐసిస్ ఉగ్రనేతను హతమార్చే ఆపరేషన్‌ను చేపట్టి, అతడిని తుదముట్టించడం ద్వారా అగ్రరాజ్యం తన పౌరురాలికి ఘనమైన నివాళిని అర్పించింది. సిరియాలోని అలెప్పో ప్రాంతంలో ఉన్న ఒక ఆసుపత్రిని సందర్శించేందుకు 2013 ఆగస్టులో టర్కీ నుంచి బయల్దేరిన ఒక అమెరికన్ యువతి ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు! ఆ ఆసుపత్రిలో ఉన్నది ఐసిస్ ఉగ్రవాదుల బారినపడిన శరణార్థి క్షతగాత్రులు. వారితో మాట్లాడి, వారికి సేవలు అందించడం కోసం వేల మైళ్ల దూరం ప్రయాణించి వెళ్లిన ఆ యువతి పేరు కేలా మీలర్. యు.ఎస్.లోని ఆరిజోనా రాష్ట్రం ఆమెది. సామాజిక కార్యకర్త. అంతకన్నా కూడా మానవతా వాది. మీలర్ అదృశ్యంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆనాడే ఆందోళన వ్యక్తం చేసింది. రెండేళ్లు గడిచినా మీలర్ ఆనవాళ్ల జాడ కనిపించకపోవడంతో ఐసిస్ ఉగ్రవాదులే ఆమెను అపహరించి ఉంటారని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాలే చివరికి నిజమయ్యాయి. ఐసిస్ నిర్బంధంలో ఉన్న మీలర్ చనిపోయిందన్న వార్త 2015 ఫిబ్రవరిలో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాలేజీ విద్యార్థినిగా కేలా మీలర్ అయితే రఖా పట్టణంపై జోర్డాన్ జరిపిన వైమానిక బాంబు దాడుల్లో మీలర్ చనిపోయినట్లు ఐసిస్ ఒక ప్రకటన చేసింది! తర్వాత బయటపడిన వాస్తవం వేరు. మీలర్ను చేత చిక్కించుకున్న ఐసిస్ ఉగ్రవాద నాయకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపి, అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేశాడు. ఈ క్రమంలో నాలుగున్నర ఏళ్ల తర్వాత మొన్న శనివారం రాత్రి సిరియాలోని బారిషా అనే గ్రామంలో అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌కు అమెరికా పెట్టిన పేరు ‘కేలా మీలర్’. అలా తన దేశ పౌరురాలికి అగ్రరాజ్యం నివాళి అర్పించింది. నివాళి అనేకన్నా కేలా ఆత్మగౌరవానికి సైనిక వందనం చేసిందనే అనాలి. అల్ బాగ్దాదీ హతమైనట్లు వెల్లడవగానే ప్రపంచ మీడియా కేలా మీలర్ తండ్రి కార్ల్‌ను కలిసింది. ‘‘నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. బందీగా అనేక జైళ్లు తిప్పారు. నిర్బంధ శిబిరాల్లో ఉంచారు. మానసికంగా, శారీరకంగా అవమానించారు. చివరికి అల్ బాగ్దాదీ అత్యాచారం కూడా చేశాడు. ఏ తల్లిదండ్రులకూ ఇంతటి మానసిక క్షోభ ఉండకూడదు’’ అని ఆయన అన్నారు. బందీగా ఉండి కూడా ఎంతో ధైర్యంగా తన కూతురు రాసిన ఉత్తరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘చీకటిలోనూ వెలుగును చూస్తున్నాను. నిర్బంధంలోనూ స్వేచ్ఛను కనుగొంటున్నాను. ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలత ఉంటుంది’’ అని కేలా మీలర్ ఆ లేఖలో రాశారు. కేలా తల్లి మార్షా కూతురి మరణం నుంచి నేటికీ తేరుకోలేదు. ‘‘నిజంగా నా కూతురుకి ఏమైందో నాకు తెలియాలి’’ అంటూనే ఉన్నారు. కేలా దైవభక్తురాలు. చనిపోయే వరకు కూడా ఆ దేవుడు పంపిన దూతగానే ఆమె శరణార్థులకు సేవలు అందించారు. ‘డాక్టర్స్ వితవుట్ బార్డర్స్’ (జెనీవా) ఆసుపత్రి సిరియా శాఖ నుంచి ఆమె అడుగు బయటపెట్టిన కొద్దిసేపటికే ఐసిస్ ఉగ్రవాదులకు çపట్టుబడ్డారు. కేలా మీలర్ మానవ హక్కుల కార్యకర్తగా మారడానికి పొలిటì కల్ సైన్స్‌లో ఆమె చేసిన డిగ్రీ, కాలేజీ విద్యార్థినిగా ఆమె నిర్వహించిన చర్చి విధులు దోహదపడ్డాయని అంటారు. -
‘చీకట్లు’ తొలగేనా..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం మసకబారుతోంది. శస్త్ర చికిత్స చేస్తే మసక చీకట్లు తొలగి కంటిచూపు మెరుగు పడుతుందని ఆశించిన వారికి ఆ చూపేమో కానీ.. ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. కంటివెలుగు పరీక్షలు చేయించుకుని ఆపరేషన్ల కోసం ఆరు నెలలుగా వేలాది మంది వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తమపై ఎప్పుడు కరుణ చూపుతుందో.. తమ జీవితాల్లో చీకట్లు ఎప్పుడు తొలగిపోతాయో అని వారు నిరీక్షిస్తున్నారు. సాక్షి, ఖమ్మం(బూర్గంపాడు) : రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అగస్టులో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారికి పరీక్షలు జరిపారు. రీడింగ్ గ్లాస్లు, మందులు అవసరమైన వారికి వెంటనే అందించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోళ్లు కావల్సిన వారికి కూడా ఐదు నెలల తర్వాత పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సలు అవరసమైన వారిని గుర్తించి రిఫరల్ ఆస్పత్రులకు పంపేందుకు ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే కంటివెలుగు శిబిరాలు పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా.. ఆపరేషన్లు అవసరమైన వారికి మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. దీంతో పేర్లు నమోదు చేసుకున్న వారు తమకు శస్త్ర చికిత్సలు ఎప్పుడు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. 4.93 లక్షల మందికి కంటి పరీక్షలు... జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం కింద 4.93 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1.20 లక్షల మందికి కళ్లద్దాలు, మందులు అందించారు. మరో 45 వేల మందికి ప్రత్యేకంగా కళ్లజోళ్లు తయారు చేయించి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వారి పేర్లు, ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను ఆన్లైన్ చేశారు. ఏ ఆస్పత్రిలో ఎవరికి ఆపరేషన్లు చేయాలనే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ తంతు పూర్తయి ఆరు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు ఆపరేషన్లు మాత్రం ప్రారంభించలేదు. వైద్యాధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 23 వేల మంది కంటివెలుగు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్లు చేయించాలని వారు కోరుతున్నారు. ఆపరేషన్లు చేయటం లేదు కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఇప్పటికి ఆరునెలలైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు కళ్లజోళ్లు కూడా ఇవ్వలేదు. ఆపరేషన్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. – పుట్టి లక్ష్మి, గౌతమిపురం ప్రైవేటు ఆస్పత్రులకు పోతున్నారు కంటివెలుగులో ఆపరేషన్ చేయకపోవటంతో కొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేయించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కంటివెలుగులో ఆపరేషన్లు చేయాలి. లేకపోతే ఆ కార్యక్రమానికి అర్థమే లేదు. స్వచ్ఛంద సంస్థల వారు కూడా క్యాంపులు పెట్టి కళ్లజోళ్లు ఇస్తున్నారు. – ఎడారి అచ్చారావు, బూర్గంపాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు జిల్లాలో 23 వేల మందికి కంటి శస్త్ర చికిత్సలకు రికమండ్ చేశాం. వారి పేర్లు, చేయాల్సిన ఆపరేషన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. రిఫరల్ ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్లైన్ చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ భావ్‌సింగ్, కంటివెలుగు జిల్లా ఇన్చార్జ్ -
బ్రెస్ట్‌క్యాన్సర్ వస్తే రొమ్ముతప్పనిసరిగా తొలగించాలా?
నా అక్కకు 36 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు త్వరగా ఆపరేషన్ చేయించుకొమ్మని సిఫార్సు చేశారు. క్యాన్సర్ ఉన్న రొమ్మును పూర్తిగా తొలగించి వేస్తారని, అయినా మళ్లీ మరోచోట క్యాన్సర్ వస్తుందేమోనని మా అక్క భయపడుతోంది. రొమ్ముక్యాన్సర్ వస్తే... ఆ రొమ్మును తప్పనిసరిగా, పూర్తిగా తొలగించాలా? హార్మోన్ల సమతౌల్యం ఏమైనా దెబ్బతింటుందా? ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఎదురవుతాయా? మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో దయచేసి వివరంగా తెలపండి. శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ సోకిన భాగాన్ని తీసివేస్తే మరోసారి క్యాన్సర్ రాదని ఖచ్చితంగా చెప్పలేము. ఇందుకు కారణం... ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం క్యాన్సర్ కణాలన్నింటినీ సమూలంగా తొలగించడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ఆపరేషన్‌లో మొత్తం క్యాన్సర్ భాగాన్ని సమూలంగా తీసేసినా, మరోసారి క్యాన్సర్ కాదని ఖచ్చితంగా చెప్పలేము. రొమ్ము క్యాన్సర్ సర్జరీ తర్వాత వ్యాధి సోకిన ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల రేడియేషన్, అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో అదే భాగంలో మరోసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించగలుగుతాం. అయితే శస్త్రచికిత్స జరిగిన తర్వాత కొంతమంది మహిళలకు బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్ మళ్లీ వచ్చినట్లు గుర్తించారు. కానీ సర్జరీ చేయించుకున్న వ్యక్తి క్యాన్సర్ కారణంగా చనిపోయే ప్రమాదం మాత్రం చాలావరకు ఉండకపోవచ్చు. రెండు అండాశయాలను తొలగించిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ మరణాలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.ఇక బ్రెస్ట్క్యాన్సర్లో రొమ్మును తొలగించడం పైన ప్రచారంలో ఉన్న అంశాలు చాలావరకు అపోహలూ, అనుమానాలే. క్యాన్సర్ సోకిన రొమ్మును పూర్తిగా తొలగించడం అన్నది చాలా అరుదు. రోగనిర్ధారణ పరీక్షలపై ఆధారపడి రొమ్ములో క్యాన్సర్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగించడం జరుగుతుంది. దానివల్ల రొమ్ము ఆకృతి చెడకుండా, ఆపరేషన్ చేసిన గీత కనిపించకుండా ఉండేందుకు తొలగించిన భాగంలో, శరీరంలోని మరోచోటి నుంచి కొంతభాగాన్ని తెచ్చి, పార్షియల్ ఫిల్లింగ్ అనే ప్రక్రియ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. దాంతో శస్త్రచికిత్స తర్వాత కూడా రొమ్ము ఆకృతిలో పెద్దగా మార్పు ఉండదు. రొమ్ము మొత్తాన్ని తీసేయడం అన్న అంశం సహజంగానే మహిళ మనసుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆమె మానసికంగా కుంగుబాటుకు (డిప్రెషన్‌కు) గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇటీవల రొమ్ముపూర్తిగా తొలగించకుండానే చాలావరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.రొమ్ము తొలగించాల్సి రావడం చాలా చాలా అరుదు. అలాగే ఒకవేళ రొమ్ము తొలగించాల్సి వచ్చినా దాని వల్ల శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలు ఏమాత్రం ప్రభావితం కావు. మీ అక్క భయపడుతున్న పరిణామాలు ఏవీ ఎదురయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆందోళన చెందకుండా మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్‌ను సంప్రదించండి. అర్థం లేని అపోహలు వీడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గొంతు దగ్గర గడ్డ... సలహా ఇవ్వండి నా వయసు 42 ఏళ్లు. నాకు గత ఏడేళ్ల నుంచి హైపోథైరాయిడ్ సమస్య ఉంది. దానికి థైరాయిడ్ మాత్రలు వాడుతున్నాను. ఈమధ్య గొంతు దగ్గర గడ్డలా కనిపిస్తోందని నా భార్య గమనించింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అల్ట్రాసౌండ్ చేసి, కణితి ఉందని చెప్పారు. అది క్యాన్సర్‌కు సంబంధించిందని కూడా చెప్పారు. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. మీకు హైపోథైరాయిడ్ సమస్య ఉందని చెప్పారు. హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు కొన్నిసార్లు థైరాయిడ్‌లో చిన్న గ్రంథులు ఏర్పడతాయి. కానీ హైపోథైరాయిడ్ సమస్య క్యాన్సర్‌కు కారణం కాదు. అల్ట్రాసౌండ్ చేస్తే గడ్డ ఉందని చెప్పారని వివరించారు. అలాగే అది క్యాన్సర్‌కు సంబంధించిన కణితిలాగా ఉందని కూడా చెప్పారన్నారు. అల్ట్రాసౌండ్ గైడెన్స్‌లో ఆ కణితి నుంచి ఒక ఎఫ్ఎన్ఏసీ పరీక్ష చేయించాలి.ఆ రిపోర్ట్‌లో క్యాన్సర్ అని నిర్ధారణ అయితే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. థైరాయిడ్ గ్రంథిని పూర్తిగా తీసేయాలి. అలాగే శ్వాసనాళం/శ్వాసగొట్టం (ట్రాకియా/బ్రీతింగ్ పైప్) పైన, పక్కన ఉన్న ఊపిరితిత్తుల నాడ్యూల్స్ కూడా తీసేయాలి. అల్ట్రాసౌండ్‌లో మెడలో కూడా ఏమైనా కణుతులు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎఫ్ఎన్ఏసీలో సందేహాస్పదం (డౌట్ఫుల్) అని రిపోర్టు వస్తే ఆపరేషన్ చేసి, ఆ సమయంలో ఫ్రోజెన్ సెక్షన్‌ను ఉపయోగించుకొని, ఆ కణితి తాలూకు అసలు రిపోర్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలలుగా రక్తంతో కూడిన విరేచనాలు... ఇదేం సమస్య? మా నాన్నగారి వయసు 67 ఏళ్లు. గత మూడునాలుగు నెలల నుంచి నీళ్ల విరేచనాలు (లూజ్ మోషన్స్) అవుతున్నాయి. విరేచనం సమయంలో రక్తం కూడా పడుతోంది. కడుపునొప్పి కూడా ఎక్కువగా వస్తోందని అంటున్నారు. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు. ఏది తిన్నా వాంతి అవుతుందంటున్నారు. ఇది ఎలాంటి సమస్య? మీరు చెప్పిన లక్షణాలను విశ్లేషిస్తే అవి పెద్దపేగు సమస్యగా అనిపిస్తోంది. ఈ వయసులో ఇలాంటి రక్తంలో కూడిన లూజ్‌మోషన్స్ (విరేచనాలు) అవుతుంటే, పెద్దపేగు కింది భాగంలో ఉన్న సిగ్మాయిడ్ కోలన్ లేదా రెక్టమ్ (మోషన్పైప్) పైభాగంలో ట్యూమర్/కణితి ఉండే అవకాశం ఉంది. ఈ భాగంలో క్యాన్సర్ ఉన్నవారిలో ఆకలి తగ్గుతూ అజీర్ణం, రక్తంతో కూడిన మోషన్స్, కొన్ని రోజులు మలబద్దకం/కొన్ని రోజులు ఎక్కువసార్లు మోషన్‌కు వెళ్లడం, అలాగే మోషన్‌కు వెళ్లినప్పుడు మల విసర్జన పూర్తిగా జరగలేదని అనిపించి, మళ్లీ తిరిగి వెంటనే వెళ్లడం కూడా జరుగుతుంటుంది. వీటితో పాటు అజీర్ణం, బరువు తగ్గడం, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తుంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రోంటరాలజిస్ట్ను సంప్రదించి, కొలొనోస్కోకపీ అనే పరీక్ష చేయించుకోండి. దీని ద్వారా పెద్దపేగు లోపలి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలవుతుంది. అలాగే ఏదైనా అల్సర్స్ ఉంటే వెంటనే బయాప్సీ తీస్తారు. కొలొనోస్కోపీతో పాటు ఒక అబ్డామిన్ స్కాన్ పరీక్ష కూడా చేయించుకోవడం మంచది. ఇవి పైల్స్ కావచ్చేమో అంటూ మీరు అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. డాక్టర్ కె. శ్రీకాంత్,సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
గుండె అయోర్టిక్ వాల్వ్ టావర్తో వెరీ వెల్
గుండె కవాటాల్లోని అయోర్టిక్ వాల్వ్ దెబ్బతిన్నప్పుడు వాల్వ్ మార్పిడి ప్రక్రియలో వచ్చిన సరికొత్త మార్పు ఇది. అయోర్టిక్ వాల్వ్ అనే గుండె కవాటం పనితీరులో మార్పులు వచ్చి, అది సమర్థంగా పని చేయనప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండానే ఆ వాల్వ్‌ను మార్చే ప్రక్రియ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. టావర్ లేదా టావీ అని పిలిచే ఈ వాల్వ్ మార్పిడి పద్ధతి గురించి, ఈ ఆధునిక సాంకేతికతతో శస్త్రచికిత్స అవసరం లేకుండానే తగిన చికిత్స చేసే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. గుండె కవాటాలు పనిచేసే తీరు ఇది మన గుండె... రక్తాన్ని అన్ని అవయవాలకూ చేరవేస్తుందన్న విషయం తెలిసిందే. రక్తాన్ని పంప్ చేసే క్రమంలో అది లయబద్ధంగా స్పందిస్తుంది. తన స్పందనల్లో భాగంగా అది ముడుచుకుపోయినప్పుడు రక్తం ధమనుల్లోకి చేరుతుంది. మరి అలాంటప్పుడు గుండె విప్పారినప్పుడు రక్తం వెనక్కు రావాలి కదా. కానీ అలా జరగదు. గుండె లోపల ఉండే నాలుగు వాల్వ్స్ అయిన అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మోనిక్ అనేవి రక్తం ఒకేవైపునకు ప్రవహించేలా చూస్తాయి. ఇందులో అయోర్టిక్ వాల్వ్ అనేది ఎడమవైపున ఉన్న కింది గది ముడుచుకుపోగానే రక్తాన్ని ప్రధాన ధమనిలోకి వెళ్లేలా చూసి, మళ్లీ అక్కణ్నుంచి రక్తం వెనక్కు రాకుండా మూసుకుపోతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ చూద్దాం. మనం గాలిని పంప్ చేసినప్పుడు మోటార్‌సైకిల్ లేదా కారు టైర్ తాలూకు ట్యూబులోకి గాలి వెళ్తుంది. కానీ అదే గాలి మళ్లీ అదే దారి నుంచి వెనక్కు రాలేని విధంగానే ఈ వాల్వ్స్లు కూడా రక్తప్రవాహాన్ని ఒకేవైపు వెళ్లేలా చూస్తాయి. అయోర్టిక్ వాల్వ్ అంటే...? గుండెకు ఉన్న నాలుగు వాల్వ్‌లలో అయోర్టిక్ వాల్వ్ అనేది చాలా ప్రధానమైనది. ఇది గుండె నుంచి... శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని తీసుకుపోయే ప్రధానమైన ధమనిలోకి రక్తాన్ని పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనిషి గుండె ప్రతి రోజూ కనీసం ఒక లక్షసార్లు స్పందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా జరిగిన ప్రతిసారీ అయోర్టిక్ వాల్వ్ తెరచుకొని, రక్తాన్ని ఎడమవైపు కింది గది నుంచి ధమనిలోకి ముందుకు పంపుతుంది. ఇలా జరగగానే మళ్లీ మూసుకుపోయి ఆ రక్తం వెనక్కు రాకుండానూ చూస్తుంది. ఇలా ఒక రోజులో కనీసం 7000 లీటర్ల పరిమాణమంత రక్తాన్ని అది పంప్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అది మనం ఈ భూమి మీద పుట్టడానికి ముందే... అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పని మొదలుపెట్టి... మన చివరి శ్వాస వరకూ పని చేస్తూనే ఉంటుంది. ఇంత పనిని తట్టుకొని అది కనీసం 50 ఏళ్ల పాటు,సమస్య రాని కొందరిలోనైతే జీవితాంతం ఎలాంటి అవరోధం లేకుండా పనిచేస్తుంది. అయోర్టిక్ వాల్వ్ చివరిలో అది తెరచుకోడానికీ, మూసుకోడానికీ వీలు కల్పిస్తూ మూడు తలుపుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవి అచ్చం... మెర్సిడెజ్ బెంజ్ చిహ్నంలా ఉండి, ముక్కోణాకృతిలో ఉండే మూడు ఆకుల్లా ఆ తలుపులు తెరచుకుంటూ మూసుకుంటూ ఉంటాయి. ఇలా రోజులో లక్షసార్లు జరిగే ప్రక్రియలో అవి ఎంతో కొంత గాయపడుతుంటాయి. మన ఒంట్లో మిగతా చోట్ల గాయాలు మానినట్టే... అక్కడా మానిపోతుంటాయి. అయితే ఇలా గాయాలు మానే క్రమంలో అక్కడ కొంత కండ పేరుకుంటూ ఉంటుంది. ఇలా గాయాలవుతూ, మానుతూ ఉండటం జరిగే ప్రక్రియలో అక్కడ క్యాల్షియమ్ పేరుకుపోయి వాల్వ్ మునుపటంత మృదువుగా ఉండక క్రమంగా కాస్త గట్టిబారుతుంది. దాంతో మునుపటంత తేలిగ్గా తెరచుకోలేకపోతుంటుంది. అది గట్టిబారిపోయి, సన్నబడటాన్ని‘స్టెనోసిస్’ అంటారు. మనం నీళ్లపైప్ను కాస్త బిగుతుగా చేసి పట్టుకుంటే... నీళ్లు మరింత బలంగానూ, మరింత ఒత్తిడితోనూ చాలా దూరం వెళ్తుంటాయి కదా. అలాగే వాల్వ్ సన్నబడ్డప్పుడు రక్తం కూడా బలంగా ప్రవహిస్తుంటుంది. దాంతో ఒత్తిడి పెరిగి వాల్వ్ మరింత దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. కాలక్రమంలో ఈ స్టెనోసిస్ తీవ్రత మరింత పెరిగినప్పుడు గుండె పంపింగ్ మరింత బలంగా జరగాల్సి రావడంతో క్రమంగా అది బలహీనపడుతుంది. దాంతో క్రమంగా అది గుండె వైఫల్యానికి (హార్ట్ ఫెయిల్యూర్‌కి) దారి తీస్తుంది. అది ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. ఎవరెవరిలో స్టెనోసిస్ సాధారణం ►వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు పెరుగుతూ ఉంటుంది. ►డయాబెటిస్ ఉన్నవారిలో లేదా కొలెస్ట్రాల్ మోతాదులు చాలా ఎక్కువగా ఉన్నవారిలో ►క్యాన్సర్ వంటి జబ్బులకు ఛాతీకి రేడియేషన్ తీసుకున్న వారిలో ►అయోర్టిక్ వాల్వ్‌కు గతంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. ►కొందరిలో పుట్టుక నుంచి అయోర్టిక్ వాల్వ్ లోపం ఉన్నప్పుడు. (ఇలా పుట్టుకతో అయోర్టిక్ వాల్వ్ లోపం ఉన్నవారిలో కొందరిలో వాల్వ్నకు మూడు తలుపులకు బదులు రెండే ఉంటాయి. ►మరికొందరిలో ఒకటే ఉంటుంది. అందువల్ల రక్తసరఫరా సరిగా జరగదు). అయోర్టిక్ వాల్వ్ సన్నబడినప్పుడు కనిపించే లక్షణాలు అయోర్టిక్ వాల్వ్ సన్నబడినప్పుడు దాని తీవ్రతను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అది కొద్దిపాటి సన్నబడిన దశ (మైల్డ్); ఓ మోస్తరుగా సన్నబడిన దశ (మాడరేట్); బాగా ఎక్కువగా సన్నబడిన దశ (సివియర్). ఈ మూడింటిలో తొలి రెండు దశల్లో లక్షణాలేమీ కనబడవు. అయితే చివరిదైన సివియర్ దశలో ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. ►ఛాతీలో అసౌకర్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (మరీ ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా ఏమీ చేయకుండా ఉన్నప్పుడు కూడా) ►కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం లేదా స్పృహతప్పడం ►వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం ∙కాళ్ల వాపు కనిపించడం. ఆపరేషన్ లేకుండానే అయోర్టిక్ వాల్వ్‌కు చికిత్స... ఆయోర్టిక్ వాల్వ్‌లో వచ్చే మార్పులు అనేవి దాని ఆకృతి మారడం వల్ల జరిగే మార్పులు (అంటే మెకానికల్ మార్పులు)గా చెప్పవచ్చు. అందుకే ఈ సమస్యను మందులతో చక్కబరచడం సాధ్యం కాదు. కాకపోతే కొన్ని రకాల మందులతో రక్తప్రవాహంలో కొద్దిపాటి మార్పులు తెచ్చి తాత్కాలికంగా గుణం కనబడేలా చూడవచ్చేమోగానీ, అది శాశ్వత ప్రయోజనాన్ని మాత్రం ఇవ్వదు. అందుకే వాల్వ్‌ను మార్చడం ద్వారా అది మునుపటిలా ఉండేలా చక్కదిద్దడమే దీనికి పరిష్కారం. గతంలో దీన్ని గుండె శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దేవారు. అయితే ఇలా శస్త్రచికిత్స చేయడం వల్ల రోగిని 2 – 4 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఆ తర్వాత మరో 3 – 5 రోజుల పాటు వార్డ్‌లో ఉంచి చికిత్స అందించాలి. ఆ తర్వాత మరో 6 వారాలు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాల్సిన (పోస్ట్ ఆపరేటివ్ రీ–హాబిలిటేషన్) అవసరం ఉంటుంది. ఇక కొందరైతే వయసు పరంగానూ లేదా మరికొన్ని దీర్ఘకాలిక జబ్బుల వంటి ఇతర కారణాల వల్ల శస్త్రచికిత్సకు అనువుగా ఉండరు. శస్త్రచికిత్స చేస్తే వారికి ప్రాణాపాయం ముప్పు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి వారు తమ పరిమితుల కారణంగా చికిత్స తీసుకోలేకపోతే జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) విషమించి, ఆయాసపడుతూ చాలా కష్టంగా బతుకీడ్చాల్సి వస్తుంది. ‘టావర్’ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు? టావర్/టావీ ప్రక్రియ కోసం వంటిపైన ఎలాంటి కోతా పెట్టనక్కర్లేదు. కేవలం తొడ దగ్గర, మెడ దగ్గర రెండు చోట చిన్న గాట్లతోనే ఆ వాల్వ్‌ను మార్చడం సాధ్యమే. ఈ సరికొత్త ప్రక్రియనే ‘టావర్’ అంటారు. ట్రాన్స్‌కేథటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే మాటకు సంక్షిప్తరూపమే టావర్. అలాగే దీన్ని టావీ అని కూడా అంటారు. అంటే ఇది ట్రాన్స్‌కేథటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనే మాటకు సంక్షిప్త రూపం. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ అనస్థిసిస్ట్, కార్డియాక్ ఇమేజింగ్ నిపుణులతో పాటు కార్డియాక్ సర్జన్ ఈ ప్రక్రియను నిర్వహించే బృందంలో ఉంటారు. ఇది కూడా కరోనరీ యాంజియోగ్రఫీ లేదా యాంజియోప్లాస్టీ జరిపే విధంగానే ఉంటుంది. తొడ దగ్గర ఒక చిన్న గాటు పెట్టి, ధమని లోకి వాల్వ్‌ను ప్రవేశపెట్టి దాన్ని గుండెవరకు తీసుకెళ్తారు. దాంతో సాధారణ శస్త్రచికిత్సలో మాదిరిగా ఛాతీ ఎముకలను కోయాల్సిన అవసరం ఉండదు. పైగా అనుకూలురైన కొందరు రోగులకు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రక్రియకు దాదాపు గంట సేపు పడుతుందంతే. నిజానికి ఈ ప్రక్రియ ముగిసిన రోజే సాయంత్రం ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. అయితే ముందుజాగ్రత్త కోసం రోగిని 24 గంటల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచుతారు. దాంతో సాధారణ ఆపరేషన్‌లో మాదిరిగా మాదిరిగా రోగి కనీసం వారం రోజులైనా (రెండు రోజులు ఇంటెన్సివ్ కేర్‌లో, ఆ తర్వాత మిగతా రోజులు వార్డ్‌లో) ఉండాల్సిన అవసరం ఉండదు. ఆరువారాల పాటు విశ్రాంతి అవసరం కూడా అవసరముండదు. చికిత్స ముగిసిన వారం రోజుల తర్వాత వారు తమ సాధారణ కార్యకలాపాలకు హాజరు కావచ్చు. ఒక నెల రోజుల తర్వాత యథావిధిగా తమ ప్రయాణాలు చేయవచ్చు. మునుపు తాము చేసే పనులన్నీ ఎలాంటి అంతరాయం లేకుండానే చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది రోగుల్లో రక్తాన్ని పలచబార్చే మందులు లేదా ఇతరత్రా మందులు కూడా ఏవీ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారు అంతకు ముందు వాడినవి కూడా చాలా రకాల మందులు ఉపయోగించాల్సిన అవసరమూ పడకపోవచ్చు. ఇప్పుడు కొత్త ఆశారేఖ టావర్ అయోర్టిక్ వాల్వ్ విషయంలో అది సరిగా పనిచేయక సన్నబడినప్పుడు దాన్ని శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా సరిచేయాల్సి వస్తుంది. కానీ ఇటీవల సరికొత్త ప్రక్రియ ద్వారా ఎలాంటి ఆపరేషన్ లేకుండానే వాల్వ్‌ను మార్చవచ్చు. దాంతో ఏవైనా కారణాల వల్ల శస్త్రచికిత్స చేయించుకోలే వారు, శస్త్రచికిత్స అంటే భయపడే వారు, వయసు పెరిగిన కారణంగా శస్త్రచికిత్సతో ప్రాణాపాయం వంటి ముప్పు ఉన్నవారికి ‘టావర్/టావీ’ అనే చికిత్స వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతానికి ఖరీదైన ప్రక్రియే ప్రస్తుతం ఈ వాల్వ్‌లో మూడు రకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. యూఎస్‌కు చెందిన వాల్వ్ చాలా ఖరీదైనది. దీనికి దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుంది. మన దేశం కూడా ఈ వాల్వ్‌ను తయారు చేస్తోంది. దీనికి దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చు కావచ్చు. అయితే ఇప్పుడు ఈ వాల్వ్‌లను తయారు చేసే సంస్థలు చాలానే వస్తున్నాయి. దాంతో మార్కెట్లోకి కొత్త కొత్త వాల్వ్‌లు రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. ఫలితంగా కొద్దికాలంలోనే ఇది మరింత చవగ్గా లభ్యం కావచ్చు. అంటే సాధారణ అపరేషన్‌కు రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు ఖర్చయితే... దాదాపు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపే లేదా ఆపరేషన్ ఖర్చులోనే భవిష్యత్తులో ఈ వాల్వ్‌ల మార్పిడి ప్రక్రియ ‘టవర్’ సాధ్యమయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవు. డాక్టర్ అనూప్ అగర్వాల్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ప్రోక్టర్ ఫర్ టావర్ ప్రొసిజర్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హైదరాబాద్ -
అయ్యో పాపం కీర్తన
సాక్షి, నడిగూడెం (కోదాడ) : అధికారులు నిర్లక్ష్యం ఆ విద్యార్థిని ప్రాణాలకు ముప్పుతెచ్చింది. సంబంధిత అధికారులు తమకెందుకులే అనుకోవడంతో ఇప్పుడు ఓ తల్లికి కడుపుకోత మిగిల్చేలా ఉంది. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎన్నో ఆశలతో ఆ పాఠశాలలో చేరింది. తోటి విద్యార్థులతో నిత్యం ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ గడిపింది. కానీ విధి విద్యుత్ తీగల రూపంలో ఆ పసిపాప ప్రాణం ఇప్పుడు విలవిలతాడుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ, నాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నారు ఆ తల్లిదండ్రులు, మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దగ్గుపాటి యేసు, నాగమణిల చిన్న కూతురు కీర్తన. తండ్రి యేసు మూగ. తల్లి నాగమణి కూలినాలి పనులు చేసుకుంటున్నది. ఈ చిన్నారి నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఈ విద్యార్థిని చదువుతోపాటు, ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొనేది. రెండు చేతులు తొలగించారు కీర్తన విద్యుత్ఘాతానికి గురై శరీరం తల భాగం తప్ప పూర్తిగా దెబ్బతింది. దీంతో గత నెల 26న ఎడమ చేతిని తొలగించారు. గత నెల 28న కుడిచేయిని కూడా తొలగించారు. విద్యుత్ ఘాతంతో శరీరం కుళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారిని చూసిన వైద్యసిబ్బంది, వైద్యులు, బందువులు కన్నీరు పెట్టుకున్నారు. మాటలు రాని తండ్రి యేసు మౌనంగానే రోదిస్తున్నాడు. కన్న తల్లి నాగమణి జీవశ్ఛవాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం కీర్తన చూడడం, మాట్లాడడం చేస్తుంది కానీ అవయవాల్లో కదలికలు లేవు. కీర్తన ఆరోగ్యం కుదుట పడేంత వరకు పూర్తిగా గురుకుల విద్యాలయం సంస్థ ఆధ్వర్యంలోనే చికిత్స చేయిస్తున్నారు. కీర్తన కోలుకునేందుకు దాదాపు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని, ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రూ.13 లక్షలు ఖర్చు అయ్యింది. పాఠశాల నుంచి ఇద్దరు ఉపాద్యాయులు, ప్రిన్స్‌పాల్ భిక్షమయ్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజురూ చేసేందుకు, స్థానిక శాసన సభ సభ్యుల ద్వారా దరఖాస్తు కూడా చేశారు. విద్యార్థిని పూర్తి స్థాయిలో కోలుకునేందుకు చికిత్స జరిపిస్తామని కోదాడ ఎమ్యెల్యే మల్లయ్య యాదవ్ హామీనిచ్చినట్లు ప్రిన్స్‌పాల్ ఎ.భిక్షమయ్య తెలిపారు. విద్యార్థిని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేంత వరకు గురుకుల సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ఘాతానికి గురై చికిత్స పొందుతున్న కీర్తన త్వరగా కోలుకోవాలని అనేక మంది విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. విషమంగా కీర్తన పరిస్థితి ఈ నెల 16న కీర్తన తన స్నేహితులతో గురుకుల పాఠశాలలోని క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుతుండగా ప్రాంగణంలో లభించిన అల్యూమినియ రాడ్‌తో సాధన చేసింది. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణం మీదుగా 33బై కేవీ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం.. ప్రమాదశాత్తు కీర్తన ఆడుకుంటున్న అల్యూమినియం రాడ్ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురైంది. తీవ్ర గాయాల పాలవ్వడంతో అదే రోజున 108 వాహనంలో కోదాడకు తరలించారు. అక్కడినుంచి ఖమ్మం తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. -
కుట్లేశారు.. కత్తెర మరిచారు..
హైదరాబాద్/ సోమాజిగూడ: నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఇటీవల ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేసి కత్తెరను కడుపులోనే మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి తరపు బంధువులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయడంతోపాటు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసిన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నిమ్స్ ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సక్సెస్.. కానీ! హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన వ్యాపారి హర్షవర్దన్ భార్య మహేశ్వరి (33) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను అక్టోబర్ 30న నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు చూపించారు. మహేశ్వరిని పరిశీలించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ జగన్మోహన్రెడ్డిలు.. హెర్నియాతో ఆమెకు కడుపునొప్పి వస్తోందని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు. నవంబర్ 2న ఈ ఇద్దరు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా.. సర్జరీ చేసిన కత్తెరను కడుపులో మరిచిపోయి కుట్లు వేశారు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. రోగి కోలుకోవడంతో నవంబర్ 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సర్జరీ జరిగి మూడునెలలైనా.. తరచూ కడుపునొప్పి వస్తుండటంతో బాధితురాలి కుటుంబం శుక్రవారం రాత్రి మళ్లీ నిమ్స్ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్సరే తీయించగా, పొత్తి కడుపులో సర్జికల్ కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలియడంతో మహేశ్వరి భర్త, బంధువులు నిమ్స్ పరిపాలనాభవనం ముందు ఆందోళనకు దిగడంతో విషయం బయటికి పొక్కింది. ఈ ఆందోళనతో అప్రమత్తమైన వైద్యులు రోగికి మళ్లీ సర్జరీ చేసి కడుపులోని కత్తెరను బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. నిమ్స్ వైద్యులు నిర్లక్ష్యపూరిత వైఖరిపై రోగి తరపు బంధువులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ నివేదిక అందజేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రోగికి సర్జరీ చేసే ముందు, ఆ తర్వాత.. ఆపరేషన్‌లో వినియోగించిన వైద్య పరికరాలు, ఇతర వస్తువులు లెక్కిస్తారు. బ్లేడ్స్, కత్తెర, కాటన్ బెడ్స్, ఇతర సర్జికల్ ఐటమ్స్‌ను విధిగా లెక్కించి, అన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కుట్లు వేస్తారు. కానీ నిమ్స్ ఆసుపత్రిలో ఇలాంటివేవీ జరగకుండానే పని పూర్తి చేస్తారనే ఆరోపణలున్నాయి. దురదృష్టకరం రోగి కడుపులో సర్జికల్ కత్తెర ఉంచి కుట్లు వేయడం దురదృష్టకరం. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడిన వారెంతటివారైనా ఉపేక్షించబోం. బాధ్యులను గుర్తించేందుకు ఆస్పత్రి డీన్, మెడికల్ సూపరింటిండెంట్, ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్‌తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే సదరు వైద్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ బాధ్యులపై చర్యలు తీసుకోండి నిమ్స్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్న వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – హర్షవర్థన్, బాధితురాలి భర్త -
మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారు..
హైదరాబాద్ : చాలా సినిమాల్లో రోగి పొట్టలో దూది మర్చిపోవడం విన్నాం... కత్తులు మర్చిపోయి కుట్లు వేసేయ్యడం చూశాం. ఆఖరికి అదేదో సినిమాలో రోగి పొట్టలో వాచ్, సెల్ఫోన్లు మర్చిపోయిన సన్నివేశాలు.. ఆ తర్వాత బాధితుడు ఇబ్బంది పడే దృశ్యాలను చూసే ఉంటాం. అయితే తాజాగా నిమ్స్ ఆస్పత్రిలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. నిమ్స్ వైద్యులు...ఓ మహిళా రోగికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరచిపోయారు. అయితే ఆ తర్వాత రోగి కడుపు నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో..వారు వైద్యులను సంప్రదించారు. అసలు విషయం ఎక్స్‌రే తీసిన అనంతరం బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరి (33) అనే మహిళ మూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకి తరచుగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఎక్స్‌రే తీయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడింది. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్‌కు రాగా, ఆపరేషన్ చేసిన వైద్యులు ప్రస్తుతం అందుబాటులో లేరంటూ సమాధానం ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహిరంచిన వైద్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం మీడియాకు ఎక్కడంతో నిమ్స్ వైద్యులు బాధితురాలికి తిరిగి ఆపరేషన్ చేసేందుకు సిద్ధం అయ్యారు. -
దండకారణ్యంలో కూంబింగ్
చర్ల: ఆపరేషన్ సమాధాన్‌ను వ్యతిరేకించాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో దండకారణ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఈ నెల 31న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యం లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 5, 6 రోజులుగా సరిహద్దు అటవీ ప్రాం తంలో భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల కోసం పోలీసు బలగాలు జల్లెడ పడుతుండటంతో సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. ఏ క్షణంలో ఏం ప్రమాదం ముం చుకొస్తుందోనని ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దండకారణ్యలో మోహరించిన సీఆర్పీఎఫ్, స్పెషల్‌పార్టీ, కోబ్రా బలగాలు సరిహద్దుల్లో అనుమానితులుగా కనిపించే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ వారి నుంచి మావోయిస్టుల సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేసు ్తన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సభలు ఎక్కడ పెడుతున్నారు.. ఎవరైనా వెళ్తున్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
అరుణ్ జైట్లీకి ఆపరేషన్ విజయవంతం
న్యూఢిల్లీ: కేన్సర్‌తో బాధపడుతున్న కేంద్ర మంత్రి జైట్లీ(66) అమెరికాలోని న్యూయార్క్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు వెల్లడించాయి. జైట్లీకి తొడ భాగంలో అరుదైన కేన్సర్ సోకింది. దీంతో ఆయన ఈ నెల 13న వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ వచ్చారు. గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. -
రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో సారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. ‘ఆపరేషన్ కమల’ వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రలోభాల నుంచి తప్పించుకునేందుకు శుక్రవారం తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరు దగ్గర్లోని ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. గత మేలో అసెంబ్లీ ఎన్నికలయ్యాక తమ సభ్యుల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఇదే రిసార్టులో ఉంచింది. తాజాగా శుక్రవారం బెంగళూరులో సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే విధానసౌధ నుంచి రెండు బస్సుల్లో వారిని మళ్లీ అదే రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నంత కాలం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తాయేమోనన్న భయంతోనే మోదీ, అమిత్ షా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్–జేడీఎస్‌ల ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని పునరుద్ఘాటించారు. తమ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నుంచి రూ .70 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోల్‌కతాలో ప్రధాని మోదీని ప్రశ్నించారు. మరోవైపు, వారం రోజులుగా గురుగ్రామ్‌లోని రిసార్టులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం బెంగళూరు రానున్నారు. సీఎల్పీ భేటీకి నలుగురు డుమ్మా.. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి నలుగురు సభ్యులు రాలేదు. 80 మంది ఎమ్మెల్యేల్లో 76 మంది వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వ్యక్తిగత కారణాల రీత్యా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ముందస్తుగానే పార్టీ పెద్దలకు సమాచారమిచ్చారు. అనారోగ్య కారణాలతో గైర్హాజరవుతున్నట్లు చించోలి ఎమ్మెల్యే ఉమేశ్‌జాధవ్..సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫ్యాక్స్ చేశారు. కోర్టు పని వల్ల సీఎల్పీ భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు బళ్లారి(గ్రామీణ) ఎమ్మెల్యే నాగేంద్ర.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌కు తెలియజేశారు. అయితే గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జారకిహోళి, అథని ఎమ్మెల్యే మహేశ్ కుమటెళ్లి గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. రమేశ్ జారకిహోళి తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రస్తుతం బీజేపీకి 106 సభ్యుల మద్దతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నాక కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 116కు తగ్గిపోయింది. -
రసకందాయంలో కన్నడ రాజకీయం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ను ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో కర్నాటక రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందంటూ బీజేపీ తమ 104 మంది ఎమ్మెల్యేలను హరియాణాలోని గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచిన విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్‌లోని దాదాపు ఆరుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబైలో మకాం వేసి బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే, తమ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ను వీడటం లేదని, ఆ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లోనే ఉన్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రేపు(జనవరి 18న) పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు, ఇన్నాళ్లూ కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతును ఉపసంహరించుకుని బీజేపీ వైపునకు వెళ్లారు. వారిలో ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, మరొకరు కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ(కేపీజేపీ)కి చెందిన సభ్యుడు. దాంతో బీజేపీ బలం 106కి చేరింది. బీజేపీ కుయుక్తులు ఫలించవని, తన ప్రభుత్వానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు తామేమీ ప్రయత్నించడం లేదని, తమ ప్రమేయం లేకుండానే, అంతర్గత విభేదాలతోనే కుమారస్వామి సర్కారు కూలుతుందని బీజేపీ పేర్కొంది. వీరిపైనే దృష్టి ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్ జార్కిహోళి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఉమేశ్ జాదవ్, బి.నాగేంద్ర, ప్రతాప్‌గౌడపాటిల్, మహేశ్ కుమటళ్లి, బీసీ పాటిల్, కంప్లి గణేశ్, భీమానాయక్, డాక్టర్ సుధాకర్, శ్రీనివాసగౌడ సొంత పార్టీ కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వీరు పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. రేపు సీఎల్పీ భేటీ ప్రాంతీయ కర్ణాటక ప్రజ్ఞావంత జనతా(కేపీజేపీ) పార్టీకి చెందిన ఆర్. శంకర్, స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్. నగేశ్‌లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్–జేడీఎస్ బలం 117కి తగ్గిపోయింది. వారిద్దరు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం 106కు పెరిగింది. అధికార కూటమిలో అంతర్గత విభేదాల్ని ఆసరాగా చేసుకుని అటువైపు నుంచి ఎమ్మెల్యేల్ని ఆకర్షించేందుకు బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ను ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో తమ సభ్యులు జారిపోకుండా బీజేపీ వారందరిని గురుగ్రామ్‌లోని ఓ విలాసవంత హోటల్‌కు తరలించింది. మరోవైపు, రేపు బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగే శాసనసభా పక్ష సమావేశం ద్వారా అంతా సవ్యంగానే ఉందనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బడ్జెట్ గురించి చర్చిండమే అజెండాగా ఈ సమావేశం జరగాల్సి ఉండగా, తాజా రాజకీయ పరిస్థితులే ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు.. కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర కేపీసీసీ నేతలు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే విషయంపై చర్చించారు. అవసరమైతే ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించాలని యోచిస్తున్నారు. గురుగ్రామ్ హోటల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సమావేశమై సమాలోచనలు జరిపారు. మా సంకీర్ణం భద్రం: కాంగ్రెస్ కాంగ్రెస్ సభ్యులంతా తమను సంప్రదిస్తూనే ఉన్నారని, పార్టీలో అంతా సవ్యంగానే ఉందని ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా, జాతీయ స్థాయిలో ఏర్పడబోయే విపక్ష మహా కూటమి విఫలమవుతుందనే సంకేతాన్ని బీజేపీ ఇవ్వాలనుకుంటోందన్నారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించవని నొక్కిచెప్పారు. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందిస్తూ..తమ సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు లేవని, కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులందరి మద్దతు ప్రభుత్వానికే ఉందన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే కూటమిలో విభేదాలున్నాయంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. బీజేపీ వ్యూహం కర్ణాటకలో కాంగ్రెస్–జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి 117మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 104 సభ్యుల బలం ఉంది. తాజాగా ఇద్దరు స్వతంత్రులు బీజేపీ వైపు వచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి 13 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 211కి తగ్గుతుంది. మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్య 106 అవుతుంది. ప్రస్తుతం సొంత సభ్యులు 104, స్వతంత్రులు ఇద్దరు కలిస్తే బీజేపీ బలం 106కి చేరుతుంది. కాంగ్రెస్– జేడీఎస్ సభ్యులు నేరుగా బీజేపీకి మద్దతిస్తే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. అందుకే ‘ఆపరేషన్ కమలం’ ద్వారా రాజీనామా చేసిన వారిని ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడమే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలు అంచనా వేస్తుండటంతో.. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా వస్తే లాభమని బీజేపీ అంచనా. ఆపరేషన్ కమలం అంటే.. :దక్షిణాదిన తొలిసారిగా ఇక్కడ పాగావేసిన కమలనాథులు తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆపరేషన్ కమలం అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బుని, అధికారాన్ని ఎరగా వేసి చీలిక తెచ్చి తమవైపు లాక్కోవడమే ఆపరేషన్ కమలం లక్ష్యం. బెంగళూరులో ఆందోళనకు దిగిన జేడీఎస్ ఎమ్మెల్యేలు -
బాగానే ఉన్నాను
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న దర్శక–నిర్మాత రాకేశ్ రోషన్ మంగళవారం దానికి సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ సక్రమంగానే జరిగినట్టు రాకేశ్ రోషన్ టీమ్ పేర్కొంది. ‘‘ఆపరేషన్ బాగా జరిగింది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. దేవుడున్నాడు. శుక్రవారం లేదా శనివారం ఇంటికి కూడా వెళ్లిపోతాను’’ అని రాకేశ్ పేర్కొన్నారు. -
‘గ్యాస్ట్రైటిస్’ తగ్గుతుందా?
నా వయసు 43 ఏళ్లు. కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. విశ్వప్రసాద్, గుంటూరు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : – 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది! మా పాపకు ఏడేళ్లు. మూడేళ్లుగా ఆమె చెవినొప్పితో బాధపడుతోంది. చెవిలో చీము కూడా కనపడుతోంది. కొంతకాలంగా ప్రతిరోజూ చెవిపోటు వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ అవసరమంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స సూచించండి. – చంద్రశేఖర్, సిద్దిపేట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. కారణాలు : ∙కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు : ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ : ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? – ఆర్. ప్రసాదరావు, సామర్లకోట మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్ధకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్ధకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్ధకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పీసీఓడీ పూర్తిగా నయమవుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా భార్య వయసు 35 ఏళ్లు. ఇటీవల ఆమె ఒంటిపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియోలో పూర్తిగా నయమయ్యేలా పీసీఓడీకి మంచి చికిత్స ఉందా? – జె. సాగర్, సిద్దిపేట రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు:నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానంకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ చాలాకాలంగా పాపకు చెవి నొప్పి... తగ్గుతుందా? మా పాపకు తొమ్మిది. గత మూడేళ్ల నుంచి చెవినొప్పితో వస్తోంది. చెవిలో చీము, వాపు కూడా కనపడుతున్నాయి. ఏడాదిగా ఈ సమస్య దాదాపు రోజూ కనిపిస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స చెప్పండి. – సాయి ప్రతాప్, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. కారణాలు: ∙ కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙ మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙ చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు : ∙ తీవ్రమైన జ్వరం ∙ వినికిడి లోపం ∙ శరీరం సంతులనం కోల్పోవడం ∙ చెవి నుంచి చీము కారడం ∙ ముఖం బలహీన పడటం ∙ తీవ్రమైన చెవి/తలనొప్పి ∙ చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ: ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంట! నా వయసు 32 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతేకాదు విసర్జన సమయంలో చాలా మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – ఒక సోదరి, నకిరేకల్ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ–కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స హోమియోలో వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. – ఆర్. శ్రీధర్ రావు, వరంగల్ కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటివి. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం) , కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతు సంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. కడుపులోకి నీరు వస్తోంది.. కారణం ఏమిటి? నా వయసు 48 ఏళ్లు. నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. శ్రీనివాసరావు, కొత్తగూడెం మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీకు తగిన చికిత్స అందిస్తారు. కళ్లు పచ్చగా మారుతున్నాయి... నా వయసు 47 ఏళ్లు. పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి కూడా తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, హైదరాబాద్ మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు. మలవిసర్జన తర్వాత కడుపునొప్పి... నా వయసు 32 ఏళ్లు. సుమారు ఏడాదిగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, దాంతో చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే మందులు ఇచ్చారు. వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం సూచించండి. – ఆర్. సాయి ప్రసాద్, కోదాడ మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వైద్యుడి అత్యాశ.. ఆపరేషన్ మధ్యలోనే..
పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వైద్యులు డబ్బుమీద అత్యాశతో వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. కిడ్నీ రోగికి ఆపరేషన్ చేస్తూ.. అదనంగా డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడో వైద్యుడు. ఈ సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన జుత్తిగ పార్థసారథి(55) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. నిన్న ఆపరేషన్ చేస్తూ ఉండగా మహేష్ అనే వైద్యుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని రోగి బంధువులు ఆరోపించారు. కిడ్నీలో రాళ్ళ వ్యాధితో గత రెండు రోజుల క్రితం పార్థసారథిని మదర్ వన్నినిలో అతని బంధువులు చేర్పించారు. అయితే ఇక్కడి సిబ్బంది స్కానింగ్, ఇతర పరీక్షల నిమిత్తం ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నిన్న మదర్ వన్నినికి తీసుకొచ్చారు. అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకు పార్థసారథికి కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరగాల్సి ఉండగా వైద్యుడు మహేష్ ఆలస్యంగా 7.30 గంటలకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాడు. మత్తు ఇచ్చి సగం ఆపరేషన్ అయ్యాక స్టోన్ కిడ్నీ కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని తనకు డబ్బులిస్తే ఇప్పుడే స్టోన్‌ను తొలగిస్తానని లేకుంటే అలానే వదిలేస్తానన్నాడని పేషేంట్ బంధువులు ఆరోపించారు. తాము సొమ్ములిచ్చుకోలేమనడంతో ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారంటూ వారు వాపోయారు. ఈ విషయం ముందే చెప్పాలి గానీ ఆపరేషన్ మధ్యలో చెప్పడమేంటని డాక్టర్‌ను వారు నిలదీశారు. కొద్దిసేపటి తర్వాత వైద్యుడు మహేష్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. దీంతో పేషేంట్ బంధువులు అక్కడి సిబ్బందిని నిలదీసి ఆందోళన నిర్వహించారు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బందికి, పేషేంట్ బంధువులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సొమ్ములకోసం ఆపరేషన్‌ను మధ్యలో వదిలివెళ్లిన డాక్టర్ మహేహ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని వారు కోరారు. -
థాయ్‌లాండ్ ఆపరేషన్‌లో డైవర్ మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న పిల్లలు, వారి కోచ్‌ను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యల్లో ఓ డైవర్ మృతిచెందాడు. గతంలో నావికా దళంలో పనిచేసిన 38 ఏళ్ల సమన్ గునన్ పిల్లలకు ఆహారం, ఆక్సిజన్ అందించి తిరిగి వస్తుండగా శ్వాస ఆడక మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రొఫెషనల్ డైవర్ చనిపోవడం ఈ ఆపరేషన్ సంక్లిష్టతను తెలియజేస్తోంది. ‘గుహలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందించేందుకు అతన్ని లోనికి పం పాం. కానీ దురదృష్టవశాత్తూ తిరిగొస్తూ శ్వాస ఆడక స్పృహ కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయాం. అయినా పిల్లల్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయి’ అని నేవీ కమాండర్ తెలిపారు. -
గౌరీలంకేశ్ హత్య పథకం ‘ఆపరేషన్ అమ్మ’
బనశంకరి: పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కుట్రకు నిందితులు ‘ఆపరేషన్ అమ్మ’ అని పేరు పెట్టినట్లు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణలో తేలింది. ఆమెను హత్య చేయడానికి రహస్య సంకేతాల ద్వారా కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో నిందితులు మాట్లాడినట్లు తెలిసింది. సుమారు ఏడాదిపాటు టెలిఫోన్ బూత్‌ల నుంచి మాట్లాడిన నిందితులు హత్య చేయాల్సిన వ్యక్తి పేరును మాత్రం ఎప్పుడూ ఉచ్చరించలేదు. కేవలం ‘ఆపరేషన్ అమ్మ’ అని మాత్రమే మాట్లాడుకున్నట్లు సిట్ గుర్తించింది. గత ఏడాది సెప్టెంబర్ 5న రాత్రి బెంగళూరులో ఇంటి వద్ద ఉన్న ఆమెను కొందరు దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. చివరివరకు టార్గెట్ తెలియదు సిట్ అదుపులో ఉన్న పరశురామ్ వాగ్మారే విచారణ సమయంలో గౌరీ లంకేశ్ అంటే తనకు తెలియదని, వారపత్రిక సంపాదకురాలు అని కానీ, సామాజికవేత్త అని కానీ తెలియదన్నాడు. అయితే, తాను ఎప్పుడూ హిందూ మతాన్ని నమ్ముతాననీ, తన మతాన్ని ఎవరైనా విమర్శిస్తే సహించలేనని చెప్పాడు. ‘ఒకరోజు కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి ఓ ప్రముఖ వ్యక్తిని హత్య చేయాలని చెప్పాడు. మొదట నేను ఒప్పుకోలేదు. గౌరీ లంకేశ్ హిందూ మతాన్ని కించపరిచేలా పత్రికల్లో రాస్తూ, సభల్లో మాట్లాడుతోందని అతడు తెలపడంతో ఆమెను చంపాలనే నిర్ణయానికి వచ్చా. నీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని వదలొద్దు. నువ్వు ఈ కార్యం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే నీకు నేను అండగా ఉంటా’ అంటూ ఆ అపరిచితుడు బ్రెయిన్‌వాష్ చేసినట్లు సిట్ ఎదుట తెలిపాడని సమాచారం. మొదటిరోజు కుదరలేదు.. గౌరీ లంకేశ్‌ను హత్య చేసేందుకు అంగీకరించిన వెంటనే ఆ అపరిచితుడు తనను బెళగావిలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఎయిర్‌గన్‌తో శిక్షణ ఇచ్చాడని వాగ్మారే చెప్పాడు. ఇరవై రోజుల శిక్షణ సమయంలో సుమారు 500 రౌండ్లు కాల్చినట్లు తెలిపాడు. ఆ శిక్షణ అనంతరం ఆ వ్యక్తి ఇచ్చిన మొబైల్ నంబర్‌కు టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి గౌరీ లంకేశ్ హత్య పథకం గురించి తెలుసుకున్నాడు. అతని సూచన మేరకు సెప్టెంబర్ 3వ తేదీన బెంగళూరుకు వెళ్లి సుంకదకట్టెలోని ఓ ఇంట్లో బస చేశాడు. అదే ఇంట్లో సుజీత్ అలియాస్ ప్రవీణ్ కూడా ఉన్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపడానికి సిద్ధపడినా, ఆ రోజు ఆమె తొందరగా ఇంట్లోకి వెళ్లిపోవడంతో కుదరలేదు. కానీ, సెప్టెంబర్ 5వ తేదీన గౌరీ ఇంటి సమీపంలోని పార్కుకు వెళ్లి ఎదురుచూశారు. గౌరీలంకేశ్ కారు రాగానే బైక్‌పై వెంబడిస్తూ ఆమె ఇంటి వద్ద కారు దిగి లోపలికి వెళ్తుండగా కాల్పులు జరిపినట్లు వాగ్మారే సిట్‌కు వివరించినట్లు సమాచారం. -
‘ఆపరేషన్’ రోబో..!
రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలివే.. ♦ తక్కువ కోత పెట్టి, అతి స్వల్ప రక్తస్రావంతో, తక్కువ సమయంలోనే శస్త్రచికిత్స పూర్తి చేయడం ♦ ఆపరేషన్ తర్వాతత్వరగా రోగి కోలుకోవడం ♦ సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే ఇన్షెక్షన్ రేటు,నొప్పి తక్కువ ♦ ఇన్‌పేషెంటుగా ఎక్కువ రోజులు ఆస్పత్రిలోఉండాల్సిన అవసరం లేదు ♦ దీనివల్ల ఇన్‌పేషెంటు ఖర్చులు భారీగా తగ్గే అవకాశం సాక్షి, అమరావతి: కొంతకాలం క్రితం వరకు కూడా ఎవరైనా రోగికి ఆపరేషన్ చేయాలంటే.. అవసరమైన చోట శరీరాన్ని కోసి, కత్తితో గాట్లు పెట్టి చేసేవారు. ప్రస్తుతం చేతికి ఒక చుక్కరక్తం కూడా అంటకుండానే శస్త్రచికిత్స పూర్తి చేసి, రోగికి జబ్బు నయం చేస్తున్నారు నేటి వైద్యులు. ఈ క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. తాజాగా రోబోటిక్ శస్త్రచికిత్సల వైపు వీరి దృష్టి మళ్లింది. వీటిపై అవగాహన పొందేందుకు ఏటా మనదేశం నుంచి 3 వేల మందిపైనే పాశ్చాత్య దేశాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీలకు రోగులు అంగీకరిస్తున్న నేపథ్యంలో యువ వైద్యులు ఆ శస్త్రచికిత్సల వైపు అడుగులేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ ఇలా.. రోబోటిక్ సర్జరీ అత్యంత సులువుగా ఉంటుందనివైద్యులు చెబుతున్నారు. వైద్యుడు రెండు చేతులతో చేస్తే రోబో నాలుగు చేతులతో పనిచేస్తుంది. డాక్టర్లు కత్తులు, కత్తెర్లు చేతబట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రోబో చూసుకుంటుంది. అయితే ఓ కంప్యూటర్ వద్ద వైద్యుడు కూర్చుని రోబోకు కమాండ్స్ ఇస్తూ పర్యవేక్షిస్తుంటారు. కంప్యూటర్లో డాక్టర్ ఇచ్చే సూచనలకనుగుణంగా రోబో పనిచేస్తుంది. నాలుగు చేతులున్న కంప్యూటర్ 360 డిగ్రీల కోణంలో రోగి శరీరం చుట్టూ ఎలాగైనా తిరిగి సర్జరీ చేయగలదు. రోబో చేతులకు అమర్చిన 3డి కెమెరాలు డాక్టర్‌కు కంప్యూటర్లో అత్యంత స్పష్టతతో చిత్రాలను చూపిస్తూ ఉంటాయి. మొత్తం కమాండ్స్ మీదే వ్యవస్థ పనిచేస్తుంది. డాక్టర్ నిర్ణయించిన సమయంలోగా రోబో సర్జరీ పూర్తిచేస్తుంది. ప్రత్యేక సర్జరీ ప్రోగ్రాంతో రూపొందించిన రోబో ఇప్పుడు రూ.12 కోట్లకు లభ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోబోలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీలు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోబో ఉండగా, హైదరాబాద్‌లో యశోద, కిమ్స్, అపోలో, ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రోబోలు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యయం చేయలేకపోవడం, శిక్షణ పొందిన వైద్యులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ప్రారంభం కాలేదు. రోబోలను తయారుచేస్తున్న కంపెనీలే ఇక్కడి డాక్టర్లకు విదేశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 40 నుంచి 50 మంది వైద్యులు విదేశాల్లో రోబోటిక్ సర్జరీలో శిక్షణ పొందుతున్నట్టు అంచనా. ఎక్కువగా యూరాలజీ, క్యాన్సర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఈ రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. త్వరలోనే మిగతా శస్త్రచికిత్సలకూ ఈ విధానాన్నే అమల్లోకి తెచ్చే పనిలో వైద్యులు ఉన్నారు. ల్యాప్రోస్కోపీ తర్వాత ఇదే ఉత్తమ పద్ధతి ఇన్నాళ్లూ ల్యాప్రోస్కోపీ పద్ధతే అత్యాధునికం. పెద్ద పెద్ద కోతల నుంచి ల్యాప్రోస్కోపీ ద్వారా రోగులకు ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఆ స్థానాన్ని రోబోలు ఆక్రమించాయి. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే రోబోలకు సూచనలు చేయగలరు. యువ వైద్యులు ఎక్కువగా దీనిపై దృష్టి సారిస్తున్నారు. సర్జన్లు కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఉపయోగం ఉంటుంది. – డా.హరిచరణ్, జనరల్ సర్జన్, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
ట్విట్టర్ బాంధవుడు..!
సిరిసిల్ల: ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్.. ఈసారి ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడారు. హైబీపీతో మెదడులో నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిన అతడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బేరుగు రమేశ్ (40) నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. 12 గంటల్లో ఆపరేషన్ చేయాలని, ఇందుకోసం రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులను ఆశ్రయించారు. సర్వీసు ఆధారంగా రూ.4 లక్షలకు మించి ఆరోగ్యబీమా వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు. డబ్బులు చెల్లిస్తేనే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో బాధితుడు రమేశ్ బావ అనిల్‌కుమార్ వెంటనే సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ట్విట్టర్, వాట్సాప్‌కు రమేశ్ పరిస్థితిని వివరిస్తూ మెసేజ్ పెట్టారు. స్పందించిన మంత్రి కేటీఆర్: కండక్టర్ రమేశ్ పరిస్థితిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వెంటనే ఆపరేషన్ చేయాలని ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లిస్తామని, ఒకవేళ అలా సాధ్యం కాకుంటే.. సొంతగా ఆ డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడంతో 12 మంది డాక్టర్లు ఐదున్నర గంటలపాటు శ్రమించి రమేశ్‌కు ఆపరేషన్ చేశారు. రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి కేటీఆర్‌కు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శులకు రమేశ్ భార్య అరుణ, పిల్లలు సాత్విక్, ప్రగతి కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లి కోసం మంత్రగాడి దగ్గరికి వెళ్తే...
లక్నో: పెళ్లి కోసం మంత్రగాడి దగ్గరికి వెళ్తే.. ప్రాణాల మీదకే వచ్చింది. అయితే వైద్యులు సకాలంలో స్పందించటంతో ప్రాణాలు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ ద్వివేది(42)కి వివాహం కాలేదు. పైగా కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో బంధువుల సలహామేరకు ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. తాను చెప్పినట్లు వింటే సమస్యలన్నీ దూరమైపోతాయని మాంత్రికుడు అజయ్‌ను నమ్మబలికాడు. సెల్ ఫోన్ బ్యాటరీ, పదునైన ఇనుప ముక్కలు, గాజు ముక్కల తినాలంటూ అజయ్‌కు మాంత్రికుడు సూచించాడు. అజయ్ కూడా గుడ్డిగా ఆ వస్తువులన్ని తినేశాడు. ఆపై కడుపు నొప్పితో బాధపడుతున్న అతన్ని బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్‌లో కడుపులో ఇనుప ముక్కలు కనిపించటంతో వైద్యులు నిర్ఘాంత పోయారు. వెంటనే అతనికి ఆపరేషన్ చేసి ఆ చెత్తనంతా తొలగించారు. అజయ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని.. దయచేసి ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మొద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు మాంత్రికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి పొట్ట నుంచి బయటపడ్డ వస్తువులు.. అజయ్(ఇన్సెట్లో) -
తలలో కత్తెర దిగినా.. బస్సెక్కి ఆసుప్రత్రికి..
బీజింగ్ : మనకేమైనా ప్రమాదం ఏర్పడి తృటిలో తప్పిపోతే... హమ్మయ్యా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశామో? అనుకుంటాం. చైనాకు చెందిన ఓ మహిళ కూడా ఇలానే అనుకునే సందర్భం ఎదురైంది. కత్తెరతో చెట్ల ఆకులను కత్తిరిస్తోండగా ప్రమాదవశాత్తు ఆమె తలలోకి కత్తెర దూసుకెళ్లింది. వెంటనే ఆమె అలాగే బస్సు ఎక్కి హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది. ఉదయాన్నే ఇంట్లోని మొక్కలకు ఉన్న ఆకులను కత్తిరిస్తూ ఉంది. అక్కడే ఉన్న వెదురు చెట్టుకు ఆ కత్తెరను గుచ్చిపెట్టింది. దురదృష్టవశాత్తు గుచ్చిన కత్తెర జారీ కింద ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు మహిళకు చికిత్స చేసి ఆ కత్తెరను తొలగించారు. తలలో రెండు నుంచి మూడు మిల్లిమీటర్ల దూరం కత్తెర దూసుకెళ్లిందని వైద్యులు పేర్కొన్నారు. కత్తెర నిలువుగా మహిళ తలలోకి దూసుకెళ్లి వుంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయేదని చెప్పారు. ప్రస్తుతం ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. -
అక్కమ్మ కథ... తీరని వ్యథ
జీవితాంతం అండగా ఉంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త అర్ధంతరంగా వదిలేశాడు. కడుపున పుట్టిన బిడ్డకు పట్టెడు అన్నం పెట్టేందుకు కాయకష్టం చేసిన కాలం వెక్కిరించింది. ఆదుకుంటారని పుట్టింటికి వెళితే... వారికే మెతుకులేక ఎండిన డొక్కలు ఎదురొచ్చాయి. నా అనే దిక్కులేక ఆ మహిళ చలించిపోయింది. తాను భూమికి భారమేనని భావించి యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పేగులు కాలిపోయాయి. ఆపరేషన్ చేయించుకొనేందుకు డబ్బులు లేక... అమ్మ నువ్వెందుకు ఇలా చేశావని కూతురు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఆ తల్లి ఆసుపత్రి మంచంపైన మగ్గిపోతోంది. నరసరావుపేట టౌన్: మండలంలోని కేతముక్కల అగ్రహారం దళితవాడకు చెందిన కలిసేటి అక్కమ్మకు సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన భూపతితో సుమారు 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఐదేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఏడేళ్ల తన కుమార్తె ప్రవళ్లికతో తల్లిదండ్రులు శేఖర్, ద్వారకల వద్ద అగ్రహారంలో ఉంటోంది. తండ్రి శేఖర్‌కు మెదడులో గడ్డ రావడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడు. వారి జీవనోపాధి కష్టతరంగా మారింది. ఈ క్రమంలో భర్త నిరాదరణకు తోడు తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో ఎనిమిది నెలల కిందట మరుగుదొడ్లు శుభ్రం చేసే యాసిడ్‌ను తాగి అక్కమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను వైద్యశాలలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు పేగులు కాలిపోయాయని నిర్ధారించారు. ఆపరేషన్ చేయాలని, అందుకు గానూ నాలుగులక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థిక స్థోమత లేదని చెప్పడంతో తాత్కాలికంగా పొట్ట పక్క భాగంలో రంధ్రం చేసి ఆహారాన్ని ఇస్తున్నారు. సీఎం సాయం కోసం ఎదురుచూపులు అక్కమ్మకున్న తెల్లరేషన్ కార్డుపై అపరేషన్ చేయాలని పలు వైద్యశాలలకు తిరిగినా ప్రయోజనం దక్కలేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేనిదే ఆపరేషన్ చేయమని వైద్యులు చెప్పడంతో కార్డుకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో సీఎమ్ రిలీఫ్ ఫండ్ కోసం ధరఖాస్తు చేసుకొని నెలల నుంచి ఎదురు చూçస్తోంది. క్షీణిస్తున్న ఆరోగ్యం పేగులు కాలిపోవడంతో అక్కమ్మ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి పోతోంది. నాలుగురోజుల కిందట పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఏరియా వైద్యశాలలో చేర్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక పక్క మంచంపై ఉన్న రోగులు, వారికోసం వచ్చే సహాయకులను ప్రాథేయపడుతోంది.దాతల సహా యం చేస్తే తప్పా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. -
ఆపరేషన్ లేకుండా పైల్స్ నయం చేయవచ్చా?
నా వయసు 38 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? – రమేష్‌బాబు, కందుకూరు పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు : ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స : హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం మందులతోనే సమస్య నయమయ్యేలా చేయవచ్చు. పైల్స్ చికిత్స కోసం బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాల్సి ఉంటుంది.-డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
ప్రాణం తీసిన ఆపరేషన్
హుజూరాబాద్: ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ తల్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. చిన్న కూతురికి గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పడంతో.. కన్నీరుమున్నీరైంది. ఇరుగుపొరుగు వారి సలహాతో పిల్లలు పుట్టేందుకు రీకనలైషన్ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. బుధవారం ఆపరేషన్ చేయించుకుం ది. అది వికటించి ఆ మహిళ అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం ఘణపూర్‌కు చెందిన ఆవుల రఘుపతికి శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన మల్లీశ్వరి(28)తో ఆరేళ్లక్రితం వివాహమైంది. రఘుపతి హైదరాబాద్‌లో గుమాస్తగా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఐదు నెలల క్రితం చిన్నకూతురు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కొద్ది రోజులకు చిన్నకూతురుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి గుండెకు రంధ్రం ఉందని చెప్పడంతో బోరున విలపించారు. ఇంటి చుట్టుపక్కల వారి సలహా మేరకు మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. రీకనలైజేషన్ ఆపరేషన్ కోసం హుజూరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ జరుగగా అర్ధరాత్రి అది వికటించి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
మూత్రంలో ఎరుపు కనిపిస్తోంది... కిడ్నీలకు ప్రమాదమా?
నా వయసు 28 ఏళ్లు. అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది. ఏడాదిన్నరగా ఇలాగే అప్పుడప్పుడూ వచ్చిపోతోంది. వచ్చినప్పుడుల్లా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. దీని వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? – నరేంద్రప్రసాద్, కాకినాడ సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి. కిడ్నీ రోగులు నీళ్లు తక్కువగా ఎందుకు తాగాలంటారు? నా వయసు 47 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని మా డాక్టర్ చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ నీళ్లు ఎక్కువగా తాగమంటూ సలహాలిస్తారు కదా. మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఎందుకు అంటున్నారు? దయచేసి చెప్పండి. – గోపాలరావు, కర్నూలు సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలోనూ నీరు తక్కువగా తాగాలంటూ ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం రోగులు ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు చెబుతారు. మన భారతదేశంలాంటి ఉష్ణ దేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5–6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరు వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, దానికి అనుగుణంగా డాక్టర్లు వారు రోజూ తీసుకోవాల్సి నీటి మోతాదును నిర్ణయిస్తారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జాగ్రత్తలేమిటి? నాకు 45 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – రామసుబ్బారెడ్డి, ఒంగోలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, సీనియర్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ మధ్యలో ఉండగా హ్యాండ్ డ్రిల్ మిషన్ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ల మధ్య ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం జీజీహెచ్‌లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్‌ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి. థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు జీజీహెచ్‌లోని ఎస్ఓటీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీజీహెచ్ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్‌ఫోన్, టార్చ్లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. -
రైతులకు వరం ఆపరేషన్ గ్రీన్
హన్వాడ : ప్రధాన ఆహార పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. మార్కెట్లో ధర తగ్గిన సమయంలో అన్నదాతలు పండించిన పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కాని రైతులు ప్రధానంగా సాగుచేసే కూరగాయ పంటలైన ఉల్లి, టమాటలకు మాత్రం ఒక్కోసారి ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎక్కువగా ధరల్లో హెచ్చు తగ్గులుండే ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వీటిని మద్దతు ధరలో చేర్చింది. మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు మధ్య వ్యత్యాసం ఉండి రైతులు నష్టపోతున్న సందర్భంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మద్దతు ధర కన్నా దిగువ స్థాయికి మార్కెట్లో ధరపడిపోయినప్పుడు ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటల ధరల్లో హెచ్చుతగ్గుల సమస్యల పరిష్కారానికి ఇటీవలే తమ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టమాట, ఉల్లి సాగు చేసిన రైతులకు ఇక ఢోకా ఉండదు. కూరగాయ తోటలే.. హన్వాడ మండల కేంద్రంతోపాటు పెద్దర్పల్లి, కొత్తపేట, టంకర, దాచక్‌పల్లి, సల్లోనిపల్లి, గుడిమల్కాపూర్, కొనగట్టుపల్లి, నాయినోనిపల్లి తదితర గ్రామాల్లో అత్యధికంగా కూరగాయల పంటలే సాగు చేస్తారు. అయితే ఆయా గ్రామాల్లో ఎక్కువగా ఉల్లి, టమాట పంటలు సాగుచేసి గతంలో చాలామంది రైతులు నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. దీంతో సాగుచేసిన ప్రతిసారి ఏదో ఓసారి నష్టాలబారిన పడాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్ గ్రీన్’ పథకం ఆయా పంటల రైతులకు ఇక వరంగా మారనుంది. ఇక మండలంలో మరిన్ని గ్రామాల్లో సైతం వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు మేలుచేసే ఈ పథకంతో చాలామంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయా.. ఇటీవల టమాట సాగుచేసి మార్కెట్లో ధరలు రాక తీవ్రంగా నష్టపోయాను. ఉల్లి, టమాట పంటలకు సరైన ధర రాక వృథాగా పారబోశాను. పెళ్లిళ్లు, పండగల సీజన్లకు ముందుగా అందరూ ఇదే పంటల సాగుపై దృష్టిసారించడంతో ఈ సమస్య తలెత్తేది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి, టమాటపై మద్దతు ధర ప్రకటించడం సంతోషంగా ఉంది. – నర్సింహులు, రైతు, హన్వాడ -
కడుపులో కాటన్ మరిచిపోయారు..
సాక్షి, కోవూరు: ఆపరేషన్ చేశారు.. పొట్ట లోపల కాటన్ మర్చిపోయారు.. తాపీగా కుట్లు వేశారు.. ఇదీ నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రోగి పడిన అవస్థలు వర్ణనాతీతం. వివరాలు ఇలా ఉన్నాయి. వావిళ్లకు చెందిన ఓ మహిళకు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో గతంలో గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కడుపులోనే ఉండిపోయిన కాటన్‌ను గమనించకుండా వైద్యులు కుట్లు వేశారు. ఆమెకు కొద్దిరోజులుగా కడుపు నొప్పి తీవ్రంగా వస్తుండడంతో కోవూరు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి కాటన్‌ను తొలగించడంతో ప్రస్తుతం కోలుకుంటోంది. -
మిల్లీ మీటర్ దూరంలో బతికిపోయాడు
మేరీలాండ్ : ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు’, సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఆరు ఇంచుల మేకు పుర్రెలోకి దిగిన ప్రమాదంలో మిల్లీ మీటర్ దూరంలో బతికిపోయాడు ఓ 13 ఏళ్ల బాలుడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరీలాండ్కు చెందిన డారియస్ ఫోర్‌మెన్ చెట్టుపై ఇళ్లు నిర్మించుకుంటుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. అయితే కింద ఉన్న ఆరు ఇంచుల కప్ బోర్డు మేకు బలంగా అతని తలలోకి దిగింది. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా కప్బోర్డు 5 ఫీట్లు ఉండటంతో అతన్ని అందులోకెక్కించేందుకు కష్టమైంది. దీంతో 5 ఇంచుల కప్ బోర్డును రెండు ఇంచులుగా కట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎక్స్‌రే తీయగా మేకు అతని పుర్రేలోకి దిగింది. వెంటనే డాక్టర్లు బయటకు ఉన్న మేకును తొలిగించి అనంతరం శస్త్ర చికిత్స ద్వారా లోపలి మేకును తొలిగించారు. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్ అని, బాలుడు అదృష్టవంతుడని, మిల్లీమీటర్ దూరంలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు. గత శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా డాక్టర్లు ఆదివారం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక గురువారం తన పుట్టిన రోజునాడే డిశ్చార్జ్ కావడం తమ కుమారుడికి పున:జన్మ అని తల్లితండ్రులు తెలిపారు. అంతేగాకుండా 5 ఇంచుల కప్ బోర్డును 7 గంటల సేపు మోసాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంతో చెట్లపై ఇళ్లు నిర్మించరాదనే గుణపాఠం నేర్చుకున్నాని ఆ బాలుడు పేర్కొన్నాడు. -
ఆపరేషన్‌తో దివ్యాంగురాలైన గర్భిణి
జయపురం: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి దివ్యాంగురాలైనందున అందుకు బాధ్యుడైన డాక్టర్ బాధితురాలికి రూ.20 లక్షల పరిహారం చెల్లించా లని వినియోగదారుల అదాలత్ ఆదేశించింది. వివరా లిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా తారాగాం పంచా యతీలోని బొడముండగుడ గ్రామానికి చెందిన ఆశిష్ రహమాన్ ఖాన్ దురాశి భార్య సబినా రహమాన్‌కు 2010 మే నెల 19వతేదీన పురిటి నొప్పులు ఎక్కువై తాళలేకపోవడంతో భర్త ఆమెను నవరంగ్‌పూర్ క్రిస్టియన్ ఆస్పత్రిలో చేర్చాడు. ఆమెను పరీక్షించిన ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ నాగ్ ఆపరేషన్ చేయాలని సూచించాడు. అందుకు ఆశిష్ రహమాన్ అంగీకరించాడు. ఆపరేషన్ చేసేందుకు ముందుగా డాక్టర్ ఆమె వెన్నెముక వద మూడు మత్తు ఇంజక్షన్లు చేశా రు. బాధతో మెలికలు తిరుగుతున్న ఆమెకు ఈ ఇంజ క్షన్లు పనిచేయకపోవడంతో మరోసారి డాక్టర్ ఇంజక్ష న్ ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయగా ఆమెకు ఒక మగ శిశువు జన్మించాడు. అయితే ఆమె వెన్నెముక నుంచి రెండు కాళ్ల వరకు శరీరం పనిచేయలేదు. ఈ విషయం ఆమె డాక్టర్‌కు తెలపగా ఎటువంటి వైద్యం చేయకుండా మరో పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపిం చండని లేనిపక్షంలో ప్రాణాపాయమని వైద్యుడు ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె ను భర్త విశాఖపట్నం తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు పరీ క్షించి ఆమెకు స్కానింగ్ చేసి ఆపరేషన్ చేయాలని తెలి పారు. దీంతో సబీనాకు మరోసారి విశాఖపట్నంలో ఆపరేషన్ జరిగింది. అందుకు రూ.3లక్షల 80 వేలు ఖర్చయింది. విశాఖపట్నం ఆస్పత్రి నుంచి ఆమెను జూన్ 8వ తేదీన డిశ్చార్జ్ చేశారు. తిరిగి ఆమెకు జూన్ 21వ తేదీన మరో సారి అన్ని పరీక్షలు చేశారు. అందుకు మరో రూ.19 వేలు ఖర్చయింది. బాధితుడికి అనుకూలంగా తీర్పు ఈ సంఘటనపై బాధితురాలి భర్త నవరంగ్‌పూర్ వినియోగదారుల అదాలత్‌ను ఆశ్రయించాడు. ఆస్పత్రి ఖర్చులు, ఇతర ఖర్చులు ఇప్పించండని వేడుకున్నాడు. బాధితుడి ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న వినియోగదారుల అదాలత్ అధ్యక్షుడు గోపాల కృష్ణ రథ్, సభ్యులు మీణాక్షీపాఢిలు ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు నిచ్చారు. సబీనాకు నష్టపరిహారంగా రూ.20 లక్షలను 30 రోజుల్లో చెల్లించాలని ఆ సమయం దాటితే రూ.30 లక్షలకు 12 శాతం వడ్డీ చొప్పున చెల్లించాలని ఆపరేషన్ చేసిన క్రిస్టియన్ ఆస్పత్రి డాక్టర్ సంతోష్ కుమార్నాగ్ను ఆదేశించారు. -
కడుపులోనే బిడ్డకు ఆపరేషన్
వైద్య రంగంలో మరో సంచలనం. ఓ మహిళ గర్భంలో ఉన్న 24 వారాల వయసు బిడ్డకు ఉన్న వెన్నెముక లోపాన్ని అమెరికా వైద్యులు సరిచేశారు. ఏకంగా ఆమె గర్భసంచిని బిడ్డతో సహా బయటికి తీసి శస్త్రచికిత్స చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లెక్సీ రోయర్‌కు 28 ఏళ్లు. ఈ ఏడాది మేలో లెక్సీ నెలవారీ గర్భపరీక్షలు చేయించుకునేందుకు వెళ్లింది. అప్పుడే తెలిసింది.. పుట్టబోయే బిడ్డ వెన్నెముకలోని కొంత భాగం శరీరం నుంచి బయటకు వచ్చిందని. ‘స్పైనా బైఫిడా’ అని పిలిచే ఈ రకమైన పరిస్థితి అమెరికాలో ప్రతి 4,200 మంది పిల్లల్లో ఒకరికి ఉంటుందని రికార్డు లు చెబుతున్నాయి. బిడ్డ పుట్టాక శస్త్రచికిత్స చేసి పరిస్థితిని సరిచేయడం ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతి. అయితే ఈ శస్త్రచికిత్స విజయవంతం కావ డం చాలా అరుదు. ఈ నేపథ్యంలో బిడ్డ గర్భసంచిలో ఉండగానే శస్త్రచికిత్స చేసి వెన్నెముకను సరిచేయాలని హోస్టన్‌లోని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు నిర్ణయించారు. లెక్సీ రోయర్, ఆమె భర్త ఇందుకు అంగీకరించడంతో గత నెల 27న శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సిజేరియన్ తరహాలో.. సిజేరియన్ ఆపరేషన్ మాదిరిగానే మొత్తం ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ గర్భసంచిని లెక్సీ శరీరం నుంచి కొంచెం బయటకు తీశారు. గర్భసంచి ఉపరితలంపై 4 మి.మీ మేర కోత పెట్టారు. ఉమ్మనీరు తీసేసి.. అందులోకి కార్బన్డయాక్సైడ్ వాయువును పంపి, గర్భసంచి ఉబ్బేలా చేశారు. కెమెరా తో పాటు బల్బు ఉన్న ఓ యంత్రాన్ని లోపలికి పంపించారు. బిడ్డకు వెన్నెముక బయటకొచ్చిన ప్రాంతంలో చర్మంపై చిన్న గాట్లు పెట్టి.. వెన్నెముకను శరీరం లోపలికి యథాస్థానంలోకి పంపారు. ఆ తర్వాత బిడ్డ శరీరానికి కుట్లు వేసి గర్భసంచి మొత్తాన్ని సెలైన్, యాంటీబయోటిక్ ద్రావణాలతో నింపా రు. గర్భసంచిని యథాస్థితిలో ఉంచి కుట్లు వేశారు. 4 గంటల పాటు 12 మంది డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది. బిడ్డ పుట్టాక కానీ ఈ శస్త్రచికిత్స విజయవంతమైందీ లేనిదీ చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. మూడేళ్ల శ్రమ.. ఈ ఆపరేషన్ చేసేందుకు టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు మైకేల్ బెల్ఫోర్ట్, విలియం వైట్హెడ్లు మూడేళ్లు శ్రమించారు. బార్సిలోనాకు చెందిన మరికొందరు డాక్టర్ల సాయంతో వీరు మూడేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆపరేషన్ చేసేందుకు డబ్బు అడుగుతున్నారు
మచిలీపట్నంటౌన్(మచిలీపట్నం): తన కుమారుడి కాలికి గాయమైందని, ఆపరేషన్ చేసేందుకు ఎముకల డాక్టర్ డబ్బు అడుగుతున్నారని ఓ మహిళ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధకు ఫిర్యాదు చేశారు. అనూరాధ మంగళవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనూరాధ మంగళవారం ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. వార్డుల్లో ఉన్న రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రభుత్వాసుపత్రిలో 70 శాతం మేర సిజేరియన్లు జరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముచ్చులగుంట గ్రామానికి చెందిన జంగం మంగమ్మ జెడ్పీ చైర్పర్సన్ వద్దకు వచ్చి తన కుమారుడు కాలికి గాయం కావటంతో ఆపరేషన్ అవసరమైందని, ఆపరేషన్ చేసేందుకు ఎముకల వైద్యుడు వినయ్‌కుమార్ నగదు అడిగారని ఫిర్యాదు చేశారు. స్పందించిన అనూరాధ వెంటనే డాక్టర్ వినయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలోనూ మీపై పలుమార్లు అవినీతి ఆరోపణలు వచ్చాయి. సరిచేసుకుంటారులే అని అనుకుంటున్నా మారటం లేదు. ఇలా అయితే పేద రోగులకు వైద్యం ఎలా అందుతుంది?’ అని ప్రశ్నించారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను డబ్బు అడగలేదని వినయ్‌కుమార్ బదులిచ్చారు. మంగమ్మ ఎముకల వార్డుకు వెళ్లి ఆధార్‌కార్డు తీసుకువచ్చే క్రమంలో డబ్బులు అడగలేదని చెప్పాలంటూ ఆమెను కొంతమంది ఆమెను హెచ్చరించారు. దీంతో మంగమ్మ చైర్పర్సన్ కాళ్లు పట్టుకుని రోదిస్తూ తన కుమారుడికి ఆపరేషన్ సరిగా చేయరేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ జరిగే సమయంలో తాను కూడా అక్కడే ఉంటానని, భయపడొద్దని ఆసుపత్రి ఆర్ఎంవో అల్లాడ శ్రీనివాసరావు మంగమ్మకు హామీ ఇచ్చారు. చైర్పర్సన్ వెంట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సోమశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.జయకుమార్, కమిటీ సభ్యులు బోయిన వెంకటకృష్ణరాజు, అంగర తులసీదాసు, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేశారు..!
► కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స పూర్తి చేయకుండానే పంపించేసిన వైద్యుడు ► ఆగ్రహం వ్యక్తం చేసిన బాలింత కుటుంబసభ్యులు ► ఎచ్చెర్ల పీహెచ్సీలో ఘటన ఎచ్చెర్ల(ఒడిశా): ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు వైఫల్యం చెందడంపై బాలింతల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడైన వైద్యుని తీరుపై బాధితులు మండిపడ్డారు. ఆపరేషన్ చేయడం చేతకాదని ముందే చెబితే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే వారమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఎచ్చెర్ల పీహెచ్సీలో కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుశాలపురం గ్రామానికి చెందిన బొడ్డేపల్లి అనూషను శస్త్రచికిత్స కోసం తీసుకొచ్చారు. ఆమెకు ప్లాట్ ఎక్కువగా ఉందని, శస్త్రచికిత్స కష్టంగా ఉంటుందని చెబుతూనే వైద్యుడు శ్రీనివాసరావు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. అరగంట సేపు వైద్యం చేసి ఆపరేషన్‌కు వీలు కావటం లేదని చెప్పి కుట్లు వేసేశారు. వారం తర్వాత రిమ్స్‌లో ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి బెడ్‌పైకి పంపించేశారు. దీంతో అనూష తల్లిదండ్రులు పద్మ, కృష్ణతో పాటు కుటుంబసభ్యులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతకాకపోతే ముందే చెప్పాలని, ఇలా ఆపరేషన్ మధ్యలో తమవల్ల కాదని వదిలేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పేషెంట్‌కు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని మండిపడ్డారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తామని చెప్పారు. ఈమె కంటే ముందు సర్జరీకి వెళ్లిన నందిగాం గ్రామానికి చెందిన పట్నాన నాగమ్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈమెకు కూడా ఆపరేషన్ మధ్యలో నిలిపివేసి బెడ్‌మీద పడేశారు. నాగమ్మకు బ్లీడింగ్ ఆగకపోవడం వల్లే ఆపరేషన్ చేయడం వీలుకాలేదని వైద్యులు చెప్పారు. బుధవారం కూడా ఇక్కడ ఇదే పరిస్థితి చోటుచేసుకుందని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. బుధవారం చేసిన శస్త్ర చికిత్సల్లో రెండు కేసులను ఇలా మధ్యలోనే నిలిపివేసి ఇంటికి పంపించేశారని అంటున్నారు. ఈ విషయమై వైద్యుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడ మత్తు ఇంజక్షన్ డోస్ తక్కువగా ఉందని తెలిపారు. ప్లాట్ ఉన్నవారికి ఆపరేషన్ చేస్తే వారికి నొప్పి వస్తుందని చెప్పారు. అనూష అనే పేషెంట్ నొప్పి భరించలేకపోవటంతో ఆపరేషన్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. బుధవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి వల్ల శస్త్రచికిత్సలను నిలిపివేశామని స్పష్టం చేశారు. -
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్..
-
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్.
-
వైద్యుడి నిర్వాకం..కడుపులోనే పైపు
నల్లగొండ: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తుండగా మహిళ కడుపులోనే పైపు ఉంచి కుట్లు వేసి ఇంటికి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చండూరు మండలం ఇడికుడ గ్రామానికి చెందిన రజిత జూన్ 2న ప్రసవం కోసం ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆడపిల్లకు జన్మనిచ్చింది రజిత. జూన్ 9న రజితను డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన దగ్గరి నుంచి కడుపు నొప్పి విపరీతంగా రావడంతో, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోగా కడుపులో పైపు ఉందని తేలింది. దీంతో అక్కడే డాక్టర్లు ఆపరేషన్ చేసి పైపును తీసివేశారు. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని అధికారులను కలిసి, సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. -
నేసల్ పాలిప్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా నా ముక్కులో కండలా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. తరచూ జలుబు వంటి సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే నేసల్ పాలిప్స్ అని, శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో చికిత్స అందుబాటులో ఉందా? – భాస్కర్‌రావు, విజయవాడ సాధారణంగా ముక్కు లోపలి భాగం, సైనస్‌లు (కపాలంలోని గాలితో నిండిన కుహరాలు) ఒక విధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొర ఒక విధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కు, సైనస్‌లను తేమగా ఉంచుతూ, ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించే దుమ్ము–ధూళితో పాటు ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల్లాంటి (సీలియా) నిర్మాణాల సహాయంతో గొంతులోకి, ముక్కులోకి చేర్చి... ఆ తర్వాత బయటకు పంపేస్తుంది. ఇది ముక్కులో జరిగే సాధారణ ప్రక్రియ. ముక్కులోని ఆ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్కు గురైతే, అది గురుత్వాకర్షణశక్తి కారణంగా కిందికి వేలాడటం వల్ల పాలిప్స్ ఏర్పడతాయి.ఇవి ఒకటిగా లేదా చిన్న చిన్న పరిమాణాల్లో గుంపుగా ఏర్పడచవచ్చు. అలా ముక్కులో ఉన్న మృదువైన కండ పెరుగుదలనే నేసల్ పాలిప్స్ అంటారు. అవి క్రమంగా పెరిగి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. కారణాలు : ఈ సమస్యకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే తరచూ ఇన్ఫెక్షన్స్ గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జిక్ రైనైటిస్, వంశపారంపర్య కారణాల వంటి అనేక అంశాలన్నీ ఈ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది; నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి రావడం. గురక రావడం; వాసన, రుచి గుర్తించే శక్తి తగ్గడం.తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స : హోమియోలో నేసల్ పాలిప్ సమస్యతో పాటు మిగతా శ్వాసకోశ సమస్యలన్నింటినీ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం చికిత్స ద్వారా నయం చేయవచ్చు. రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూర్చడం ద్వారా సమస్య మళ్లీ తిరగబెట్టకుండా శాశ్వతంగా సమస్యను తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
రుయాలో పసివేదన
►రుయా చిన్నపిల్లల ఆస్పత్రికి బాలారిష్టాలు ►చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేని వైద్యులు ►నామమాత్రంగా అత్యవసర వైద్య సేవలు ►ఖరీదైన మందులు బయట కొనుగోలు చేయాల్సిందే వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన హుస్సేన్‌బీ. హుస్సేన్ బాషాలకు రెండేళ్ల క్రితం వివా హం జరిగింది. హుస్సేన్‌బీ నాలుగు రోజుల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన గంటల వ్యవధిలోనే అనారోగ్యం బారిన పడింది. దంపతులు హుటాహుటిన రుయా చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు పరిశీలించి వెన్ను ఆపరేషన్ చేయాలని నిర్ధారించి నవజాత శిశువు (ఎన్ఐసీయు) విభాగంలో చేర్చారు. మూడు రోజులు గడిచినా వైద్యులు ఆపరేషన్ చేయలేదు. గురువారం దంపతులను వైద్యులు పిలిపించి ‘మీ పాపను తీసుకెళ్ళండి.. పాపకు ఆపరేషన్ చేస్తే బతకడం కష్టం’ అని తేల్చేశారు. చిన్నారి ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన వైద్యులే పొమ్మనేసరికి బరువెక్కిన గుండెతో ఆ దంపతులు అక్కడి నుంచి స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఇదీ ఒక్క హుస్సేన్‌బీ, హుస్సేన్ బాషా దంపతుల సమస్య మాత్రమే కాదు.. అత్యవసర వైద్యం కోసం వస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య. – తిరుపతి (అలిపిరి) తిరుపతి (అలిపిరి) : చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన వైద్యులు చాకచక్యంగా తప్పుకుంటున్నారు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లు మొహం చాటేస్తున్నారు. ఫలితంగా పిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఇది శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ఆస్పతిలో రాయలసీమలోనే అత్యంత ఖరీదైన పరికరాలతో ప్రారంభమైన చిన్నపిల్లల ఆస్పత్రి దుస్థితి. ఆస్పత్రి ప్రారంభంలో మెరుగైన వైద్య సేవలు అందించినా క్రమంగా కనుమరుగవుతున్నాయి. 10 మంది వైద్యుల బృందం ఉన్నా.. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు. ఖరీదైన మందులను చిన్నారుల తల్లిదండ్రులు బయట కొనుగోలు చేయాల్సివస్తోంది. అత్యవసర వైద్య సేవలు చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. కొంత కాలంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చిన్నపిల్లల ఆస్పత్రిని బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యం దైన్యంగా మారుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన నిరుపేదలు వారి చిన్నారులకు మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకంతో వ్యయ ప్రయాసలకోర్చి రుయా ఆస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ పేరుకు తగ్గట్టుగా మెరుగైన వైద్యం అందడం లేదు. అత్యవసర విభాగం మొదలుకుని.. అన్ని విభాగాల్లో సేవలు నామమాత్రంగా ఉంటున్నాయి. చిన్నారుల శస్త్రచికిత్సలకు ఉపయోగించే ఖరీదైన పరికరాలు మరమ్మతులకు గురైనా బాగుచేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభాగాధిపతితో పాటు ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ఫ్రొఫెసరు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం పది మంది ఉన్నారు. వీరితో పాటు పీజీ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. పటిష్టమైన వైద్య బృందం ఉన్నా చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్నాయి. రేడియాలజీ మొదలుకుని శస్త్ర చికిత్స పరికరాల వరకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అత్యవసరం నామమాత్రం అత్యవసర వైద్యం కోసం వచ్చే చిన్నారులకు నామమాత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి. చిన్నారి వైద్యం సేవలకు స్పందించేంత వరకు వైద్యం అందిస్తున్నారు. కాస్త విషమించగానే తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విమర్శలున్నాయి. మందులు బయట కొనుగోలు చేయాల్సిందే అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన మందులు ఆస్పత్రి మందుల కేంద్రంలో అందుబాటులో లేవు. పేదలు ఖరీదైన మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మందులు కొని వాటి తాలూకు బిల్లులను జతచేస్తే ఎన్టిఆర్ వైద్యసేవ కింద నిధులు మంజూరవుతాయని వైద్యులు చెప్పడం ఆశ్చర్యం. నిరుపేదలు ఆస్పత్రికి వస్తే ఖరీదైన మందులు ఎలా కొనగలరన్న కనీస ఆలోచన కూడా వైద్యులకు లేకపోవడం విస్మయానికి గురిచేయక మానదు. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 2007లో అప్పటి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అనతి కాలంలోనే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయసీమలోనే ఖరీదైన పరికరాలతో చిన్నారులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. సహాయ కేంద్రం ఎక్కడ ? రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో చిన్నారుల వైద్యం కోసం వచ్చే తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు కనీసం సహాయ కేంద్రాలు లేవు. చిన్నారులకు అత్యవసర వైద్యం కోసం వచ్చే తల్లిదండ్రులకు ఓపీ మొదలుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ గది. ఎన్ఐసీయూ విభాగాల వరకు కనీసం పది మందిని అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. -
ముక్కులో ఏదో అడ్డంకి... ఎందుకిలా?
ఇఎన్‌టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అవి వాడినప్పుడు మాత్రం సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా మళ్లీ వస్తోంది. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి. – సుదర్శనమూర్తి, మహబూబాబాద్ ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాల్సిరావచ్చు. ఈ పరీక్షలతో ముందుగా మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే ఫలితాల ఆధారంగా చికిత్స ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ హఠాత్తుగా హైబీపీ... ఏం చేయాలి? కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. రోజూ వాకింగ్‌కు వెళ్తాను. ఆర్నెల్ల క్రితం హఠాత్తుగా 160/100 బీపీ వచ్చింది. ఈ నెల అదికాస్తా 190/100కు పెరిగింది. బీపీ కంట్రోల్ కాకపోతే అనేక సమస్యలు వస్తాయని మిత్రులు హెచ్చరిస్తున్నారు. ఏయే సమస్యలు వస్తాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఏ.వి.జి.రావు, ఆదిలాబాద్ మీరు క్రమం తప్పకుండా వాకింగ్‌కు వెళ్తుండటం, వ్యాయామం చేయడం మంచి అలవాటు. ఇక రక్తపోటు విషయానికి వస్తే... పూర్తిగా ముదిరే వరకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా హఠాత్తుగా దెబ్బతీసే హైపర్‌టెన్షన్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది కాబట్టి దానికి ఆ పేరు. దీనిలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలుంటాయి. చాలామందిలో ఏ ప్రత్యేక కారణం లేకుండా వ్యక్తమయ్యే రక్తపోటును ప్రైమరీ హైపర్‌టెన్షన్‌గా పేర్కొనవచ్చు. ఇది నెమ్మదిగా ఏళ్లతరబడి పెరుగుతూ వచ్చి, అకస్మాత్తుగా కనిపిస్తుంది. మరికొందరిలో పైకి కనిపించని కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీన్ని సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ మరింత ప్రమాదకరమైనది. ఈ రకమైన రక్తపోటుకు దారితేసే కారణాలు... కిడ్నీల సమస్యలు, ఎడ్రినల్ గ్లాండ్‌లో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, గురకతో నిద్రకు అంతరాయం, పుట్టుకతో వచ్చే రక్తనాళ సమస్యలు, బర్త్ కంట్రోల్ పిల్స్, మితిమీరిన మద్యపానం. బీపీ సమస్య మెదడు, గుండె, కిడ్నీ, కళ్లు... ఇలా మనలోని ఏ అవయవాన్నైనా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రైమరీ హైపర్‌టెన్షన్‌ను ఒకింత సులభంగా అదుపు చేయవచ్చు గానీ... సమస్యల్లా సెకండరీ ౖహె పర్టెన్షన్తోనే. దీనిని అదుపు చేసేందుకు జాగ్రత్తగా, నేర్పుతో చికిత్స చేయాలి. మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని రోజూ 1.5 – 2 గ్రాములకు మించకుండా పరిమితం చేయాలి. కొవ్వుపదార్థాలు తక్కువగానూ, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగానూ ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని అదుపు చేసుకునే ప్రశాంతమైన దృక్పథాన్ని కలిగి, ఉద్వేగాలకు దూరంగా ప్రశాంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. డాక్టర్ వరద రాజశేఖర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఎముకల్లో నొప్పి, వాపు ఎందుకు? ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత నెల రోజులుగా నా కాళ్ల ఎముకలలో రాత్రి సమయాల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. కొద్దిగా వాపు కూడా కనిపిస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. నా సమస్య ఏమిటి? దీనికి చికిత్స ఏదైనా ఉందా? – నాగభూషణం, ఒంగోలు రాత్రి వేళ ఎముక నొప్పి రావడం అంత మంచి లక్షణం కాదు. ఇలా వస్తున్నప్పుడు మొదట ఎముక క్యాన్సర్‌ను అనుమానించాల్సి ఉంటుంది. మామూలుగా ఎముక క్యాన్సర్లలో నొప్పితో గాని, నొప్పి లేకుండా గాని కణుతులను గుర్తిస్తారు. మృదుకణజాలంతో క్యాన్సర్ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. ఎముకలో గట్టిగా ఉండే కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం నొప్పి, వాపు ముందుగా కనిపిస్తాయి. చికిత్స : ఎముక క్యాన్సర్ సాధారణంగా రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఇలా రక్తం ద్వారా ఇది శరీరంలో మరికొన్ని చోట్ల క్యాన్సర్‌ను కలిగించవచ్చు. క్యాన్సర్ ట్యూమర్ చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. ఇది వ్యాపించకుండా చూడటం కోసం మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీని బయట కొంత మేరకు ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి ఇది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రొస్థెసిస్ అనే కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి అక్కడికక్కడే ఎముకకు రేడియేషన్ అందించి తిరిగి దాన్ని అమరుస్తారు. దీన్ని ఎక్స్ట్రా కార్పోరల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలామంది ఎముకలో నొప్పి, వాపు రాగానే మసాజ్ చేయిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తసరఫరా పెరిగి క్యాన్సర్ కణాలు మరింత త్వరగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఎముకలో నొప్పి, వాపు కనిపించనప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జిన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఉంగరం మింగిన పసిబాలుడు
– తప్పిన ముప్పు – కాపాడిన డాక్టర్ మధుసూదనరావు, శేషఫణి నంద్యాల: నెలరోజులు కూడా నిండని పసిబాలుడు వెండి ఉంగరం మింగాడు. సకాలంలో వైద్యులు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. సోమవారం నంద్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అశోక్, లక్ష్మీదేవిలకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి గత నెల 8వ తేదీన మగబిడ్డ జన్మించాడు. హర్షవర్దన్గా నామకరణం చేసిన ఈ పసిబాలుడి వేలికి తల్లి లక్ష్మిదేవి ప్రేమతో వెండి ఉంగరం తొడిగింది. నోట్లో వేలు పెట్టుకున్న సమయంలో ఉంగరం కడుపులోకి పోయింది. కొద్ది సేపటి తర్వాత ఏడుస్తూ వాంతులు చేసుకోవడంతో అనుమానం వచ్చిన తండ్రి అశోక్ వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. హర్షవర్దన్‌కు ఎక్సరేలు తీసిన వైద్యులు ఉంగరం గొంతులోని అన్నాశయం వద్ద చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే కర్నూలు లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అశోక్ నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రముఖ అనస్థీయ స్పెషలిస్ట్ శేషఫణి, డాక్టర్ మధుసూదనరావు ఎండోస్కోపీ సర్జరీ ద్వారా హర్షవర్దన్ అన్నాశయంలోని ఉంగరాన్ని బయటకు తీశారు. బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
ఎండోస్కోపిక్ సర్జరీతో నాలుగు నెలల చిన్నారికి మెదడులోని నీరు తొలగింపు కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ): పుట్టుకతో మెదడులో సంభవించిన జన్యుపరలోపంతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి గంట స్వల్ప వ్యవధిలో కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జన్లు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. మెదడుకు నీరు పట్టడంతో తల సైజు పెరిగిపోవడం, తలను నిలబెట్టలేకపోవడం వంటి రుగ్మతలతో సతమతమవుతున్న చిన్నారికి ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమి (ఈటీవీ) విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స చేశారు. మెదడులోని నీరు తొలగించారు. ఈ వివరాలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమ్‌జిత్ రే మంగళవారం విలేకరులకు వెల్లడించారు. మలికిపురం గ్రామానికి చెందిన రాపాక నాగరాజు, కనకదుర్గ దంపతులకు తొలి కాన్పులో నాలుగు నెలల కిందట పాప జన్మించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ చేశారు. పాప పుట్టినప్పటి నుంచి తల సైజు పెరగటం, తల నిలబెట్టలేకపోవడం, ఆకలి మందగించడం, తలతిరగటం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించి పలువురు వైద్యులకు చూపించారు. చిన్నారికి మైక్రోస్కోపిక్ స్టంట్స్ ద్వారా పైపులు వేయాలని, రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అని, ఇందుకు చాలా ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేని వీరు తమ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి 2వ తేదీన చేర్పించారు. చిన్నారిని పరీక్షించిన న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌జిత్ రే ఎండో స్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమీ (ఈటీవీ) ఆధునిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స నిర్వహించారు. మార్చి 18న మైక్రోస్కోపిక్ స్టంట్స్ ద్వారా తలకు ఎటువంటి పైపులు వేయకుండా, ఎండోస్కోపిక్ సర్జరీతో కేవలం గంట వ్యవధిలో నీటిని తొలగించారు. ఎండోస్కోపిక్ సర్జరీని చిన్నారికి జీజీహెచ్‌లో నిర్వహించడం ఇదే తొలిసారని విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌జిత్ రే తెలిపారు. పదిరోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు. శస్త్రచికిత్సలో తనతో పాటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరి, మత్తు వైద్యులతో పాటూ పీజీ వైద్యులు పాల్గొన్నట్టు తెలిపారు. ఆపరేషన్‌కు రూ.2 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు తెలపడంతో నిరుపేదలమైన తాము చిన్నారి జీవితంపై ఆశ వదులుకున్నామన్నారు. అలాంటి దశలో జీజీహెచ్ వైద్యులు ఉచితంగా వైద్యం చేశారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది!
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు ఎనిమిదేళ్లు. మూడేళ్ల నుంచి చెవినొప్పితో పాటు చీము, వాపు కనపడుతున్నాయి. ఈ ఏడాది ప్రతిరోజూ వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే, కానీ ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. హోమియోలో చికిత్స చెప్పండి. – నరహరి, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. కారణాలు : ∙కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు : ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ : ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
ఎమ్మెల్యే డాక్టర్‌గా మారి.. ఆదుకున్నారు
-
ఎమ్మెల్యే డాక్టర్‌గా మారి.. ఆదుకున్నారు
మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం తన నియోజకవర్గానికి చెందిన మహిళకు స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సైహా జిల్లా ఆసుపత్రిలోని సర్జన్ శిక్షణ కోసం ఇంఫాల్‌కు వెళ్లారని.. అదే సమయంలో ఓ మహిళ(35) తీవ్ర కడుపునొప్పితో అక్కడి వచ్చినట్లు తనకు తెలిసిందని ఎమ్మెల్యే డా. కే బిచ్‌హువా తెలిపారు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమెకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. మహిళ కడుపులో చిన్న రంధ్రం ఏర్పడిందని ఆపరేషన్ జరిగి ఉండకపోతే ఆమె ప్రాణాలు కోల్పోయేదని తెలిపారు. గురువారం ఆమెను ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు. జిల్లాలో వైద్యుల కొరత ఉందని జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్యే తమ దృష్టికి తీసుకువచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ చెప్పారు. బిచ్‌హువా 2013లో సైహా నియోజకవర్గం నుంచి మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1991లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన బిచ్‌హువా.. 20 ఏళ్ల పాటు వైద్యవృత్తిలో ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. 2008లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. -
కొడుకు కోసం ఓ అమ్మ ఆర్తనాదం
-
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ @ 250 డాలర్లు..
సాధారణంగా మన ఇళ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను మన ఇంటి మనుషుల్లాగే ప్రేమిస్తాం.. వాటికేమైనా జబ్బు చేస్తే మన సొంత పిల్లలకు రోగం చేసినంతగా బాధ పడుతాం.. వెంటనే వాటిని చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం.. సరిగ్గా అలాగే చేసింది ఇంగ్లండ్‌లోని ఓ కుటుంబం.. అయితే ఇక్కడ జబ్బు చేసింది ఏ కుక్కకో.. పిల్లికో అయితే కాదు... ఒక బంగారు చేప (గోల్డ్ ఫిష్)కు. ఆ గోల్డ్ ఫిష్ వయసు 20 ఏళ్లు. దాని శరీరం లోపలఒక ట్యూమర్ (గడ్డ) ఉన్నట్లు సదరు కుటుంబం గమనించింది. వెంటనే ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఫాయే బేతేల్ వద్దకు తీసుకెళ్లారు. సుమారు 30 నిమిషాల పాటు డాక్టర్ సర్జరీ నిర్వహించి అతి కష్టం మీద ఆ ట్యూమర్‌ను వెలికి తీసి ఆ చేపను కాపాడారు. చేపకు అనస్థీసియా ఇచ్చి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆపరేషన్ అనంతరం డాక్టర్ చెప్పారు. చేప ఎంతో చిన్నది కావడంతో ఆపరేషన్ చేయడం ఎంతో కష్టతరమైందని ఆమె తెలిపారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం నిలకడగా ఉందని, తన ఇంట్లో ఆనందంగా ఈత కొడుతోందని పేర్కొన్నారు. ఆ చేప వయసు ఆ యజమాని పిల్లల వయసు కంటే ఎక్కువ కావడం గమనార్హం. అందుకే ఆ చేప అంటే ఆ యజమానికి ఎనలేని ప్రేమ.. ఇంతకీ ఆ ఆపరేషన్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రెండు వందల యాభై డాలర్లు(సుమారు రూ. 17 వేలు). -
చిన్నారుల జీవితాల్లో వెలుగు
– ముగిసిన గ్రహణ మొర్రి ఆపరేషన్లు – రూ.50 లక్షల సర్జరీలు పూర్తిగా ఉచితం నంద్యాల: ఫౌండేషన్ ఫర్ చైల్డ్ ఇన్‌నీడ్ ఆధ్వర్యంలో, అమెరికాకు చెందిన స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సహకారంతో స్థానిక శాంతిరాం జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న గ్రహణ మొర్రి ఆపరేషన్లు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఆపరేషన్లు ఈనెల 5వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 75మంది చిన్నారులకు అమెరికాకు చెందిన 25 మంది వైద్యుల బృందం ఆపరేషన్లు నిర్వహించింది. ఎఫ్సీఎన్ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, థోమాస్రెడ్డి ఈ శిబిరాన్ని నిర్వహించారు. సర్జరీలు పూర్తయ్యాక వీరు చిన్నారుల తల్లిదండ్రులకు రవాణా చార్జీలను కూడా అందజేసి ఇంటికి పంపారు. థోమాస్రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపడానికే మూడేళ్ల నుంచి శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అమెరికా వైద్యులు నిస్వార్థంగా సేవలు అందించారన్నారు. శాంతిరాం జనరల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు, వైస్ చైర్పర్సన్ డాక్టర్ మాధవీలత ఆపరేషన్ థియేటర్లను, నర్సింగ్ స్టాఫ్‌తో పాటు అన్నివస తులు కల్పించాలన్నారు. సాక్షి మీడియాతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రహణ మొర్రి చిన్నారులకు సమాచారం అంది, వారు ఆపరేషన్లు చేయించుకున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. -
విజయదుర్గలో అరుదైన హృదయ చికిత్స
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో గుండెలో వచ్చిన లోపాన్ని కర్నూలు వైద్యులు సరిదిద్ది ఊపిరిపోశారు. ఆపరేషన్ వివరాలను శుక్రవారం శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. వసంతకుమార్ వెల్లడించారు. సాధారణంగా గర్భస్థ శిశువుకు పెద్దధమని, చిన్నధమని మధ్య డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్ ఉంటుందన్నారు. ఈ ట్యూబ్ గర్భస్థ శిశువుకు ఆరోగ్యానికి ఎంతో అవసరం అన్నారు. శిశువు గర్భం నుంచి బయటకు వచ్చాక మూడు నెలల్లో ఈ ట్యూబ్ పూడుకుపోతుందన్నారు. లేకపోతే బిడ్డకు గుండెపై ఒత్తిడి పెరిగి డొక్కలు ఎగరేయడం, బరువు తగ్గడం, సరిగ్గా తినలేకపోవడం, దగ్గు, ఆయాసం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న కాకినాడకు చెందిన విజయలక్ష్మి(9) వారం క్రితం ఆసుపత్రికి వచ్చిందన్నారు. 2వేల మందిలో ఒకరికి ఈ సమస్య వస్తుందన్నారు. ఇలాంటి సమస్య ఉన్న వారికి గతంలో ఆపరేషన్ ద్వారా ట్యూబ్‌ను మూసివేస్తారన్నారు. కానీ విజయలక్ష్మికి ఆపరేషన్ లేకుండా డివైస్ క్లోజర్ పద్ధతిలో తొడ నరం ద్వారా గుండెకు ట్యూబ్‌ను పంపి తెరిచి ఉన్న డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్‌ను సరిచేశామన్నారు. ఎన్టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో బాలిక విజయలక్ష్మి, ఆమె తండ్రి ఓబులనాయుడు, అనెస్తెటిస్ట్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్: 250 వాహనాలు స్వాధీనం
వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వజిత్ ఆధ్వర్యంలో డీఎస్పీ సుధాకర్, సీఐలు, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది మొత్తం 300మంది దేవస్థానం వసతి గృహాలు, ప్రైవేటు లాడ్జిలు, ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా 90మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జీవితానికి కొత్త పాదు
రమేశ్‌కి ఇరవై నాలుగేళ్లు. ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కిడ్నీలూ పూర్తిగా పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఉన్న పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఎలాగైనా సరే కొడుకుని బతికించుకోవాలి. కొడుకు ఆరోగ్యంగా జీవించాలని తల్లిదండ్రులు తపించి పోయారు. లైవ్ డోనర్ నుంచి సేకరించిన కిడ్నీ అయితే రమేశ్‌కు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వవచ్చని డాక్టర్లు సూచించారు. దాంతో రమేశ్ తండ్రి తన కిడ్నీని కొడుక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అసలు మూత్రపిండాల మార్పిడి అవసరం ఎందుకు వస్తుంది? ఎలాంటి కిడ్నీతో మార్పిడి చేయాలి? ఆపరేషన్ తర్వాత దాత, స్వీకర్త ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారా? మూత్రపిండాలు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. పరోక్షంగా రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఎముకల పటిష్టతను కాపాడతాయి. ఎర్ర రక్తకణాల తయారీలో కిడ్నీల పాత్ర కీలకం. దేహక్రియలలో అత్యంత క్లిష్టమైన పనులను చేసే మూత్రపిండాలు నిర్వీర్యమైతే రక్తం శుద్ధికాదు. దాంతో మలినాలు పేరుకుపోయి రక్తం కలుషితమవుతుంది. దేహం మొత్తం రోగగ్రస్థమవుతుంది. కారణాలు మూత్రపిండాల పనితీరు లోపించడానికి కారణాలు అనేకం. మధుమేహం, హైబీపీ దీర్ఘకాలం కొనసాగడం, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం... వంటి అనేక కారణాలు కిడ్నీలు ఫెయిల్ కావడానికి దారి తీస్తాయి. వీటితోపాటు 2–5 శాతం మందిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. మూత్రపిండాలు పని చేయడం మానేస్తే... మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా పోతుంది. లక్షణాలు మూత్రపిండాలు ఫెయిలయితే... కాళ్లకు నీరుపట్టి వాపు, ముఖం ఉబ్బినట్లు ఉండడం, ఆకలి తగ్గడం, వాంతులు, నీరసం, చిన్నపాటి శ్రమకే ఆయాసపడడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన మోతాదు తక్కువగా ఉండడం, మూత్రంలో రక్తం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రత్యామ్నాయంగా...! మూత్రపిండాలు పనిచేయడం మానేసినప్పుడు ఆ పనిని బయటి నుంచి చేయించే ప్రక్రియ డయాలసిస్. సీరమ్ క్రియాటినైన్ 8 ఎంజి, యూరియా 150కి పైగా ఉంటే డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుభ్రం చేయాలి. హీమో డయాలసిస్ ప్రక్రియలో రక్తాన్ని శుద్ధి చేయడానికి కృత్రిమ మూత్రపిండం సహాయం తీసుకుంటారు. ఒక దఫా డయాలసిస్‌కి మూడు గంటలు పడుతుంది. వారంలో మూడుసార్లు చేయాల్సి ఉంటుంది. దీనిని హాస్పిటల్లోనే చేయించుకోవాలి. మరో పద్ధతి పెరిటోనియల్ డయాలసిస్. దీనిని ఇంట్లో చేసుకోవచ్చు. సన్నటి జల్లెడ వంటి పొరకు మెత్తని ట్యూబ్‌ను చిన్న కోత ద్వారా అమర్చి ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగ్‌లోని ఫ్లూయిడ్స్‌ని కడుపులోకి పంపిస్తారు. ఫిల్టర్ ప్రక్రియకు అరగంట సమయం పడుతుంది. ఈ ప్రక్రియను రోజుకు మూడు– నాలుగు సార్లు చేయాలి. వీటితోపోల్చినప్పుడు కిడ్నీ ఫెయిలయిన పేషెంటుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే శాశ్వతమైన ప్రత్యామ్నాయం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వయసు పరిమితి లేదు. కానీ 70 ఏళ్లు దాటితే దేహం శస్త్రచికిత్సకు సహకరించడం కొంత కష్టమే. మార్పిడికి కిడ్నీలు ఎలా! కిడ్నీ ఫెయిలయిన వారికి మరొకరి కిడ్నీని అమర్చే ప్రక్రియనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇందుకు బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ స్వీకరించడం ఒక పద్ధతి, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చడం మరొక పద్ధతి. లైవ్ డోనార్ రక్తసంబంధీకులైతే మంచిది. కిడ్నీ దాత బ్లడ్ గ్రూప్, స్వీకర్త బ్లడ్‌గ్రూప్ కలవాలి. కిడ్నీ దాతకు హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, హెపటైటిస్ బి,సి వంటి కాలేయవ్యాధులు, ఎయిడ్స్ ఉండకూడదు. రక్త సంబంధీకుల్లో బ్లడ్ గ్రూప్ కలవకపోతే స్వాప్ పద్ధతిలో ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు ఉన్నాయి. అంటే... కిడ్నీ ఫెయిలైన ‘ఎ’ అనే వ్యక్తి కోసం అతడి బంధువుల నుంచి సేకరించిన కిడ్నీని, ‘బి’ అనే మరో పేషెంట్ కోసం అతడి బంధువులు ఇచ్చిన కిడ్నీని పరస్పరం మార్చుకోవడం. దీనిని స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అయితే అత్యాధునిక వైద్యవిధానంలో బ్లడ్ గ్రూపు కలవకపోయినా సరే విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయగలుగుతున్నారు. వైద్యుని పర్యవేక్షణలోనే! మూత్రపిండం మార్పిడి తర్వాత పేషెంటు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దేహంలో ఇమ్యూన్ సిస్టమ్ వేరే అవయవాన్ని అంత త్వరగా స్వీకరించదు. ఇందుకోసం సర్జరీకి ముందు నుంచే ఇమ్యునోసప్రెసంట్ మందులు ఇస్తారు. ఈ మందుల వల్ల పేషెంటు దేహంలోని ఇమ్యూన్‌సిస్టమ్ కొత్త అవయవాన్ని వ్యతిరేకించే గుణాన్ని కోల్పోతుంది. ఈ మందులను జీవితకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కొత్త కిడ్నీ పనితీరును నిపుణులైన కిడ్నీ మార్పిడి బృందం పర్యవేక్షిస్తుంటుంది. కిడ్నీ మార్పిడి తరవాత 85–90 శాతం మందిలో రిజెక్షన్ కనిపించదు. 10– 15 శాతం మందిలో మాత్రం ఎర్లీ రిజెక్షన్ కనిపిస్తుంది. ఎర్లీ రిజెక్షన్ ఎదురైన ఆ సమస్యను క్రమంగా నియంత్రించవచ్చు. పేషెంటు డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు నెలల వరకు కూడా తరచుగా వైద్యుని సంప్రదిస్తూ సూచనలను పాటించాలి. ఆ తర్వాత కూడా దీర్ఘకాల నిడివితో రొటీన్ హెల్త్ విజిట్లను కొనసాగించాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు ముందు... తర్వాత? ఆపరేషన్‌కు ఒకరోజు ముందు దాత, స్వీకర్త ఇద్దరూ ఇన్పేషెంట్లుగా చేరాలి. ఆపరేషన్ తర్వాత దాతను నాలుగైదు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. స్వీకర్తను డిశ్చార్జ్ చేయడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది. ఆపరేషన్ తర్వాత పేషెంటు మామూలు స్థితికి వచ్చినట్లు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేస్తారు. ఆహారం తీసుకోవడం, కొత్త మూత్రపిండం పని మొదలుకావడం వంటివి పరిక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆపరేషన్ తర్వాత పేషెంటు ధూమపానం, మద్యపానం, దేహానికి విపరీతమైన శ్రమనిచ్చే ఆటలకు దూరంగా ఉండాలి. కిడ్నీ దానం సురక్షితమే! కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎటువంటి హాని కలగదు. దేహంలో ఉంటే రెండు కిడ్నీలలో ఒకటి సమర్థంగా పని చేస్తున్నా మనిషి హాయిగా జీవించవచ్చు. కాబట్టి దాత దైనందిన జీవితాన్ని యథాతథంగా కొనసాగించవచ్చు. డ్రైవింగ్, వ్యాయామం, ఆటలతోపాటు మిలటరీ ఉద్యోగం కూడా చేయవచ్చు. అలాగే దాత పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉన్నారని, కిడ్నీ తీసుకోవడం వల్ల దాతకు ఇతర ఆరోగ్యసమస్యలేవీ తలెత్తవని నిర్ధారించుకున్న తర్వాతనే కిడ్నీ స్వీకరణకు అనుమతిస్తారు. ఇటీవల కిడ్నీ తీసుకోవడానికి లాప్రోస్కోపిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. దాంతో చిన్న గాయంతో, తక్కువ నొప్పితో ఆపరేషన్ పూర్తవుతుంది. తర్వాత నాలుగు వారాలపాటు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ బి. సూర్యప్రకాశ్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాలుడి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్
* అరుదైన వ్యాధికి మెరుగైన చికిత్స * జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ యశోధర గుంటూరు మెడికల్: చాలా అరుదుగా సంభవించే వ్యాధికి గురైన పిల్లవాడికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడినట్లు జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెనుగొండ యశోధర చెప్పారు. పిల్లవాడి ఆరోగ్యం కుదుట పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఎనిదేళ్ల దోసూరి బాలవెంకటేష్ గత నెలలో జ్వరం సోకి స్థానిక ఆస్పత్రిలో చేరాడు. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత జ్వరం తగ్గడంతో బాలవెంకటేష్‌ను ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే జ్వరం వచ్చి కాళ్లు, చేతులు పక్షవాతం వచ్చిన వారికి మాదిరిగా తయారై మాట తబడుతుండటంతో తల్లిదండ్రులు నాగమణి, చంద్రయ్య స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, తామేం చేయలేమని అక్కడి వైద్యులు చేతులెత్తేసినట్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని నవంబర్ 23వ తేదీన గుంటూరు జీజీహెచ్‌కు వచ్చినట్లు తెలిపారు. పిల్లల వైద్యులు పరీక్షలు చేసి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వ్యాధి ఉన్నట్లుగా నిర్థారించారు. పదివేల మంది చిన్నారుల్లో ఒక్కరికి ఇలాంటి వ్యాధి సోకుతుందని డాక్టర్ యశోధర చెప్పారు. వ్యాధితో పాటుగా పిల్లవాడు శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స అందించి దాంతో పాటు ఇమ్యూనోగ్లోబిన్ ఇవ్వడం ద్వారా పిల్లవాడి ప్రాణాలు నిలిచినట్లు తెలిపారు. సుమారు రూ.మూడు లక్షల ఖరీదుచేసే వైద్య సేవలను ఆస్పత్రిలో ఉచితంగా అందించినట్లు తెలిపారు. జీజీహెచ్‌లో కార్పొరేట్ ఆస్పత్రులకు తగ్గట్టుగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె వివరించారు. -
కడుపునొప్పి తగ్గేదెలా?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి కూడా తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరి, గుంటూరు మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు. నా వయసు 41 ఏళ్లు. నేను చాలాకాలం నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం కొన్ని టాబ్లెట్లు కూడా వాడాను. ఇప్పుడు మళ్లీ అసిడిటీ కోసం కొన్ని మందులు వాడుతున్నాను. అయినా కడుపు నొప్పి, మలబద్దకం, తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - ప్రసాద్, ఒంగోలు మీరు మందులు వాడుతున్నా ఫలితం లేదని అంటున్నారు. ఇప్పటివరకూ మీరు ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఆ ప్రొసీజర్ చేయించుకోండి. రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి అని రాశారు. మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవాళ్లలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఐబీఎస్ కాంపోనెంట్ ఉందేమో చూపించుకొని నిర్ధారణ చేసుకోండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంకైటిస్‌కు పరిష్కారం చెప్పండి? ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. బరువు 62 కేజీలు. ఏడాది నుంచి దగ్గు వస్తోంది. అప్పుడప్పుడు కళ్లె పడుతోంది. డాక్టర్లు అన్ని పరీక్షలు చేయించి, ఇది ‘క్రానిక్ బ్రోంకైటిస్’ అన్నారు. ఏదో తెలియని పదార్థాలకు, వాతావరణానికి ఎలర్జీ కావచ్చని అన్నారు. మందులు చాలా వాడాను. కేవలం తాత్కాలిక ప్రయోజనం, అదీ అంతంతమాత్రం. దయచేసి సంపూర్ణ నిర్మూలనకు ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - నాగమల్లేశ్వరి, రాజమండ్రి ఆయుర్వేద పరిభాషలో దగ్గును ‘కాస’ అంటారు. మీరు చెప్పినదానిని బట్టి మీరు ‘పిత్త ప్రధాన కఫానుబంధ’ కాసతో సతమతమవుతున్నారు. అసాత్మ్యతను (అలర్జీని) ఖచ్చితంగా కనిపెట్టలేకపోయినా ఈ కింది సూచనలు పాటిస్తే ఈ సమస్య సమసిపోతుంది. నూనె పదార్థాలు, వేపుళ్లు; ఉప్పు పులుపు కారాలు అతిగా తినడం, బజారులో అమ్మే తినుబండారాలపై మక్కువ చూపడం వంటి వాటిని త్యజించండి. వాతావరణంలో తేమ, అతిశీతలత్వం వంటివాటికి గురికావద్దు. చుట్టుపక్కల కర్మాగారాల నుంచి వెలువడే విషవాయువులు, కెమికల్స్ మొదలైన వాటిని పరిశీలించి, వాటికి దూరంగా ఉండండి. మీకు సరిపడని వస్తువులు స్పష్టంగా తెలిస్తే వాటిని దూరం చేయ్యండి. కేవలం ఉడికించిన కూరలు, పొట్టుతీయని తృణధాన్యాలు, మొలకెత్తే గింజలు, వెజిటబుల్ జ్యూసులు (సలాడ్స్, శాకాలు పచ్చివి, గోరువెచ్చని ఉప్పునీటిలో అరగంట నానబెట్టి, కడిగి-జ్యూస్ చేసుకోవాలి), ముడిబియ్యపు అన్నం, నూనె వెయ్యని గోధుమరొట్టెలు (పుల్కాలు) మొదలైనవి శరీరానికి బలకరంగానూ, సాత్మ్యంగానూ ఉంటాయి. ఆవుపాలు, ఆవునెయ్యి తగు మోతాదులో సేవించండి. శుష్క ఫలాలు (డ్రైఫ్రూట్స్) కూడా తీసుకోవాలి. ఔషధాలు : మహాలక్ష్మీవిలాసరస (మాత్రలు) : ఉదయం 1 రాత్రి 1 సితోపలాది చూర్ణం : 3 గ్రాములు (అరచెంచా) తేనెతో మూడుపాటలా తీసుకోవాలి. వాసారిష్ట : నాలుగు చెంచాలు మోతాదులో మూడు పూటలా నీళ్లతో తాగాలి. (ఇవి 15 రోజులు వాడండి) తర్వాత : ఈ కిందివి రెండు నెలల పాటు వాడాలి. యష్టిమధు (మాత్రలు): మూడుపూటలా రెండేసి దశమూలారిష్ట (ద్రావకం) : మూడు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి తాగాలి. (మూడు పూటలా మూడు మోతాదులు) గృహవైద్యం : శొంఠి చూర్ణం 1 గ్రాము, కరక్కాయల పొడి 1 గ్రాము, ఎండు ద్రాక్షలు 5 కలిపి ముద్దగా చేస్తే ఒక మోతాదు అవుతుంది. దీన్ని రెండుపూటలా దగ్గు పూర్తిగా తగ్గే వరకు సేవించాలి. గమనిక : రెండు పూటలా పదేసి నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి. నేను 40 ఏళ్ల గృహిణిని. కాళ్ల వేళ్ల మధ్య అతి తరచుగా ఒరిసిపోతూ ఉంటుంది. నీళ్లలో కాళ్లుమోపి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. వేళ్ల మధ్య పగుళ్లు, నొప్పి, మంట కూడా ఉంటుంది. చికిత్స తెలుపగలరు. - యాదమ్మ, కరీంనగర్ ఆయుర్వేదంలో దీన్ని చిన్న రోగాలలో ‘అలసక’ అని వర్ణించారు. మీరు తడికాళ్లను శుభ్రం చేసి పొడిగా ఆరబెట్టి ‘టంకణభస్మ’ను వేళ్ల మధ్య జల్లుకోవాలి. రోజూ రెండు మూడుసార్లు ఇలా చేయండి. రాత్రిపూట నింబతైల (వేపనూనె) లేదా గంధకతైలాన్ని పూతగా రాసుకోవాలి. మీరు క్యాన్వాస్ షూస్ వేసుకొని పనులు చేసుకోండి. త్వరగా తగ్గిపోతుంది. ఇంట్లో తిరిగేటప్పుడు హవాయి స్లిపర్స్ వాడండి. డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
మీ ఎనస్తీషియా డాక్టర్ గురించి తెలుసుకోండి...
అనస్తీషియా... ఆందోళన వద్దు! అనాదిగా మానవాళికి నొప్పి అంటే భయం. దాన్ని బలమైన శత్రువుగా పరిగణిస్తున్నారు. దశాబ్దాలుగా నొప్పిపై మానవుల శాస్త్రీయ పోరాటం సాగుతోంది. ఏదైనా ఆపరేషన్ పూర్తి విజయవంతం కావడానికి ఎనస్తీషియా వైద్యుల (మత్తు డాక్టర్ల) పాత్ర ఎంతో ముఖ్యం. ఆపరేషన్ చేస్తున్నప్పుడు రోగి అన్ని అవయవాల తీరు, గుండె, రక్తప్రసరణ, మెదడు, శ్వాస, మూత్రపిండాలు మొదలైన వాటిని పూర్తిగా నియంత్రించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం నొప్పి కలగనివ్వకూడదు. ఆపరేషన్ అయ్యాక రోగికి సాధారణ స్థితికి వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోవడం ఎనస్తీషియా వైద్యుని ముఖ్య కర్తవ్యం. కొద్దిగా చరిత్రలోకి వెళితే నొప్పి అనేది భగవంతుని శిక్ష అనీ, దాన్ని తప్పించకూడదనే భావన ఉండేది. అలా నొప్పిని తగ్గించడం దానిని తొలగించడం పాపం అని క్రీస్తుపూర్వం నమ్మేవారు. క్రీ.శ. తొలి దశాబ్దంలో మాండ్రగోరా (కఊఈఖఅఎైఖఅ) అనే మొక్క రసంతో నొప్పి తగ్గించేవారు. 1721లో బెయిలీ (ఆఅఐఔఉ్గ) ఇంగ్లీష్ డిక్షనరీలో ఎనస్తీషియాను స్పర్శజ్ఞాన లోపం (అ ఛ్ఛీజ్ఛఛ్టి జీ ట్ఛట్చ్టజీౌ) గా వర్ణించారు. ఈజిప్షియన్లు మార్ఫిన్ (కౌటఞజిజ్ఛీ) అనే రసాయనాన్ని రోగికి తాగించి చిన్న శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. 1846, అక్టోబర్ 16న మెసచుసెట్స్ జనరల్ హాస్పటల్, బోస్టన్‌లో అతిరథ వైద్యులు తొలిసారిగా చరిత్రలో ఈథర్ అనే ఎనస్తీషియా మందును రోగికి ఉపయోగించి దవడలో కంతిని తొలగించారు. శస్త్రచికిత్స తరువాత రోగి తనకు ఏ మాత్రం నొప్పి కలగలేదని చెప్పడంతో వైద్య రంగంలోనే పెనుమార్పు వచ్చింది. జాన్ స్నో అనే నిపుణడిని ఫాదర్ ఆఫ్ అనస్థీషియా గా గుర్తించారు. ఆయన క్లోరోఫామ్ పై పరిశోధనలు చేసి వాటిని గ్రంథస్థం చేశారు. ఇంగ్లాండ్ (క్వీన్ విక్టోరియాలో) 1853 సం॥ ప్రసవ సమయంలో క్లోరోఫోమ్ను ఉపయోగించి నొప్పిలేకుండా సుఖప్రసవం అయ్యేలా చేశారు. అప్పట్నుంచి ఎనస్తీషియా మందుల శాస్త్రీయ పరిశోధనలతో ఎనస్తీషియా వైద్యుల శస్త్రచికిత్సల ప్రమాణాలు పెరుగుతూ వస్తున్నాయి. తొలిసారిగా గొంతులో గొట్టం ద్వారా ఎనస్తీషియా ఇవ్వడంతో పాటు కొన్ని మందులు కనిపెట్టి వాడకంలోకి తేవడం ద్వారా ఎనస్తీషియా శాస్త్రం పురోగమించింది. ఆధునిక వైద్యంలో... ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో శస్త్రచికిత్సల్లో హాని లేకుండా ఎనస్తీషియా ప్రక్రియ సాగుతోంది. కొన్ని కఠినమైన శస్త్రచికిత్సలలో సైతం ఎనస్తీషియా శాస్త్ర నిపుణులు ఎంతో ప్రగతి సాధించారు. ఎనస్తీషియా ఇచ్చి అన్ని జాగ్రత్తలతో తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అవయవదానం, గుండె, మెదడుకు సంబంధించిన అతి సున్నితమైన భాగాల్లో కూడా ఎనస్తీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత కూడా... కేవలం శస్త్రచికిత్స జరుగుతున్నపుడు మాత్రమే కాకుండా ఆపరేషన్ తరువాత కూడా పూర్తి నొప్పి లేకుండా ఎనస్తీషియా వైద్యులు చూస్తారు. దాని కోసం కొన్ని మందులు, డ్రగ్ప్యాచెస్, నర్వ్ బ్లాక్ లాంటి మందులు వాడతారు. అవి పూర్తిగా సురక్షితం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో... అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులు, రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా దెబ్బతిన్నవారికి, అత్యవసర చికిత్స పొందే సమయంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల్లో ఎనస్తీషియా వైద్యులు బాగా కృషి చేస్తారు. వారికి మందుల మీద పూర్తి అవగాహన ఉంటుంది. వెంటిలేటర్ ఉపయోగించడంలో నైపుణ్యం ఉంటుంది. ప్రసవాలు కూడా హాయిగా... సాధారణంగా ప్రసవం చాలా నొప్పితో ఉంటుంది. ప్రసవవేదనను అనే మాట ఆవిర్భావానికి ఆ నొప్పే కారణం. అయితే అలాంటి నొప్పి ఏదీ లేకుండానే ఇప్పుడు చిరునవ్వుతో హాయిగా ప్రసవించి బిడ్డను స్వాగతించే పరిజ్ఞానం ఉంది. దీన్ని ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ ఎలాంటి హానీ ఉండదు. ఎనస్తీషియా అపోహలు ఎనస్తీషియా వల్ల చాలా హాని ఉంటుందని కొంతమందిలో అపోహలు ఉన్నాయి. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నడుముకి ఇచ్చే ఇంజక్షన్ వల్ల ఆ తర్వాతి కాలంలో నడుమునొప్పి వస్తుందనీ, ఆ తర్వాత ఆ తరహా అనస్థీషియా తీసుకున్న వారు ఏ పనీ చేయలేరన్నది కూడా కేవలం అపోహ మాత్రమే. ఇవీ సూచనలు... దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, గుండెవ్యాధులు, ఆస్తమా ఉన్నవారు తమ వివరాలను ఆపరేషన్‌కు ముందే వివరంగా డాక్టర్‌కు చెప్పాలి. ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలు ఎనస్తీషియా డాక్టర్‌కు తెలపాలి. పాత వైద్యపరీక్షల రిపోర్టులు తీసుకొని వెళ్లాలి. రొంప, దగ్గు ఉన్నపుడు పూర్తి ఎనస్తీషియా (ఎ్ఛ్ఛట్చ ్చ్చ్ఛట్టజ్ఛిటజ్చీ)లో ఇబ్బంది రావచ్చు. అప్పుడు ఎనస్తీషియా డాక్టర్ సలహా తీసుకోవాలి. మీ నోటిలో పళ్లు వదులుగా ఉన్నా, కట్టుడుపళ్లు ఉన్నా ఎనస్తీషియా వైద్యులుకు తెలియజేయాలి. మందులు పడకపోవడం, డ్రగ్ రియాక్షన్, డస్ట్ అలర్జీ ఉంటే చెప్పాలి. ఆపరేషన్ ముందు పొట్ట ఖాళీగా ఉండాలి. ద్రవ పదార్థాలను ఆపరేషన్‌కు 2 గంటల ముందు ఆపేయాలి. ఘన పదార్థములు 5 గంటల ముందే ఆపేయాలి. ప్రతిరోజూ ఎందరో రోగులకు ఎనస్తీషియా ఇస్తుంటారు. ఇదేమీ అపాయకరం కాదనే అవగాహన అందరిలో రావాలి. డాక్టర్ వేణుగోపాల్ ఎన్. అనస్తీషియాలజిస్ట్ ఫ్యాకల్టీ, జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి టాన్సిల్స్ అంటే తొలగించాల్సిందేనా! ఇఎన్‌టి కౌన్సెలింగ్ మా పాప వయసు 8 ఏళ్లు. పాపకు గొంతుభాగంలో నొప్పి కారణంగా డాక్టర్‌ను కలిశాం. టాన్సిల్స్ అన్నారు. చిన్నపిల్లల్లో తరచూ వినిపించే ఈ టాన్సిల్స్ గురించి వివరించండి. - చంద్రకళ, కోదాడ ప్రతి ఒక్కరి గొంతులో కొండనాలుకకు ఇరువైపులా టాన్సిల్స్ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల పెద్దవి అవుతాయి. అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. గొంతు నొప్పి పెట్టడం, మింగడానికి ఇబ్బందిగా ఉండటం, తరచూ జ్వరం, ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్య వస్తాయి. మీ పాపకు టాన్సిల్స్ సమస్య వచ్చిందనగానే వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. అయితే అవి ఆరునెలలకు పైగా ఉన్నా, ఆర్నెల్లలో 4-5 సార్లు ఇబ్బందిగా మారినా శస్త్రచికిత్స చేయించుకోవాలి. మా బాబు వయసు 10 ఏళ్లు. వాడికి చెవి నొప్పి, చెవి నుంచి చీము కారడం జరుగుతోంది. అసలు చిన్నపిల్లల్లో ప్రధానమైన చెవి సమస్యలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? - నివేదిత, యడ్లపాడు ఈ కింద పేర్కొన్నవి పిల్లల్లో కనిపించే సాధారణ చెవి సమస్యలు... పుట్టుకతో చెవులు వినిపించకపోవడం (వినికిడి శక్తి లేకపోవడం) ఏదైనా అలికిడి జరిగినా పిల్లలు వాటిని గుర్తించకపోవడం చెవిలో గువిలి (వాక్స్) ఉండటం చెవిపోటు చెవి నుంచి చీము కారడం చెవి నుంచి చీముకు ప్రధాన కారణం మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి కర్ణభేరికి రంధ్రం పడటం. పిల్లలు తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు చెవిలోకి నీరు పోనివ్వకుండా చూసుకోవాలి. పుల్లలు, ఏవైనా గుచ్చుకునే (షార్ప్) వస్తువులు చెవిలో పెట్టుకోకూడదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే ఈఎన్టీ వైద్య నిపుణుల సలహా మేరకు వారు సూచించిన మందులు వాడాలి. డాక్టర్ సత్యకిరణ్ అవ్వారు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం. 12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
కొండ దిగని గజరాజు
– నాలుగో రోజూ ఆపరేషన్ గజ విఫలం రామసముద్రం: అడ్డకొండ నుంచి గజరాజును కిందకు దించేందుకు చేపట్టిన ఆపరేషన్ గజ నాలుగో రోజు గురువారం కూడా విఫలమైంది. దీంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏనుగుకు ఇష్టమైన చెరకు గడలు, అనాస పండ్లు, అరటికొమ్మలను అధికారులు అక్కడక్కడా వేశారు. బుధవారం రాత్రి కొండ ప్రాంతంలో వర్షం కురవడంతో ఏనుగు కొండలోనే ఉండిపోయింది. శిక్షణ పొందిన ఏనుగులైన జయంత్, వినాయక్‌ను కొండకు అటు ఇటు తిప్పుతున్నారు. అదేవిధంగా ట్రాకర్స్ ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఎలాగైనా ఏనుగును కొండ దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.