యశవంతపుర: వృద్ధ మహిళకు డాక్టర్ ఆపరేషన్ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ సంఘటన దావణగెరెలో జరిగింది. దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మ (65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పారు. ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
(చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్‌లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు)
Comments
Please login to add a commentAdd a comment