old women
-
భలే చోరీ చేసినవ్ అవ్వ..
-
హంతకుడు ఎక్కడ..?
-
తిరుపతిలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి కోసం గాలింపు
-
కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకులు
-
తగ్గేదేలే..జగనన్న పాటకు అవ్వ డాన్స్
-
మీ కళ్లు చల్లబడ్డాయా.. ముసలవ్వ ఎమోషనల్ వీడియో..
-
అవ్వ డప్పుకు అడుగు కదిపిన సీతక్క
-
90 ఏళ్ల వయసులోనూ “తగ్గేదే లే” అంటున్న బామ్మా
-
ఈ అవ్వ మాటలకు మంత్రి రజని ఫిదా
-
పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా. చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాడు. తండ్రికి తగ్గట్లే పిల్లలు అన్నట్లుగా.. మహేశ్ కొడుకు, కూతురు కూడా సామాజిక సేవలో ముందుంటారు. ముఖ్యంగా సితార అయితే తన వయసుకు మించిన సహాయాన్ని అందిస్తూ.. అందరి మనసులు గెలుచుకుంటుంది. పెద్దలు అంటే ఆమెకు ఎనలేని గౌరవం. ధన, పేద అనే తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది. తాజాగా జరిగిన సంఘటననే దానికి ఉదాహారణ. అసలేం జరిగింది? తాజాగా సితార హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. చాలా మంది వృద్ధ మహిళలు ఆ బహుమతులు అందుకోవడానికి వచ్చారు. అయితే ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. ఇది గమనించిన సితార.. వెంటనే స్టేజ్ పై నుంచి దిగొచ్చి.. ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. అనంతరం..అక్కడి వారందరితో ప్రేమగా మాట్లాడింది. సితార మంచి మనసుకు మురిసిపోయిన వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘తండ్రి లాగే సితారది కూడా మంచి మనసు’అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురి ప్రేమ❤️ చూడండి @urstrulyMahesh #Sitara ❤️ pic.twitter.com/VHSSNLlCfp — Nagendra (@mavillanagendra) October 1, 2023 -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇంకా తెల్లవెంట్రుక కూడా రాలేదట
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఈమె పేరు అమంతినా దోస్ శాంటోస్ డువిర్జెమ్. ప్రస్తుతం ఈమె వయసు 123 ఏళ్లు. ఈమె 1900 జూన్ 22న జన్మించింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొంది. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు ఈమేనని బ్రెజిల్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్ పట్టణంలో ఈమె ఒంటరిగా తన కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటోంది. పెండలం దుంపల పిండితో తయారు చేసిన కేకు, ఉడికించిన గుడ్లు ఈమెకు ఇష్టమైన ఆహారం. శతాధిక వృద్ధురాలైనా ఇప్పటికీ ఈమెకు డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇప్పటివరకు మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదని, కనీసం తలనొప్పి కూడా ఎరుగనని చెబుతోందీమె. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె తల నెరవకపోవడం మరో విశేషం. ఈమె నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన స్థానిక అధికారులు వారం రోజుల ముందుగానే ఈమె పుట్టినరోజు పార్టీని ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు ఈమెకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. అందువల్ల గిన్నిస్‌బుక్ ఈమెను గుర్తించలేదు. గిన్నిస్‌బుక్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం అత్యంత వృద్ధమహిళ వయసు ఈ ఏడాది మార్చి 4 నాటికి 116 ఏళ్లు. అమెరికాలో స్థిరపడిన ఆ స్పానిష్ మహిళ పేరు బ్రాన్యాస్ మోరేరా. అయితే, గిన్నిస్ అధికారులు గుర్తించినా, లేకున్నా అమంతినానే ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ అని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
కన్న తల్లినే కాదని గెంటేశారు !
-
నేను మళ్ళీ జగనన్నే గెలవాలని ప్రార్ధన చేస్తున్నా
-
జగన్ దేవుడు అంటూ ఫ్లెక్సీకి మొక్కుతున్న మహిళ
-
బామ్మ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: రైలు పట్టాలపై ఓ పెద్ద చెట్టు విరిగిపడింది. అంతలోనే ఆ పట్టాలపై రైలు వస్తోంది. మరికొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం జరిగేదే. కానీ.. ఓ బామ్మ ఎరుపు రంగు వస్త్రంతో దేవతలా వచ్చి ఆ రైలును ఆపేసింది. ఇదేదో సినిమాలో సీన్ కాదు. నిజంగా జరిగిన ఉదంతం. ఈ ఘటన మంగళూరు–పడీల్ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందారలో మార్చి 21వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మార్చి 21న మధ్యాహ్నం 2.10 గంటలకు రైలు పట్టాలపై ఒక భారీ వృక్షం విరిగి పడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ రైలు వస్తోంది. దీన్ని గమనించిన 70 ఏళ్ల వృద్ధురాలు చంద్రావతి ఇంట్లోంచి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలుకు ఎదురుగా వెళ్లి జెండాలా ఊపుతూ నిలబడింది. దీనిని పసిగట్టిన లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు చంద్రావతిని అభినందించారు. ‘ఏం చేయాలో పాలుపోలేదు’ ఈ ఘటనపై చంద్రావతి మాట్లాడుతూ ‘ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి బయట కూర్చొన్నాను. మా అక్క ఇంట్లోనే నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న పట్టాలపై పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి రైలు వెళుతుందనే విషయం గుర్తుకొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికైనా ఫోన్ చేసి చెబుదామని ఇంటి లోపలికి వెళ్లాను. అంతలోనే రైలు హారన్ వినిపించింది. వెంటనే ఇంట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని పట్టాల వద్దకు పరుగు తీశాను. నాకు గుండె ఆపరేషన్ అయింది. అయినా లెక్కచేయలేదు. రైలు వస్తున్నప్పుడు పట్టాల పక్కన నిలబడి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపాను. వెంటనే రైలు నెమ్మదించి ఆగిపోయింది. సుమారు అరగంట పాటు పట్టాలపై రైలు ఆగింది. స్థానికుల సహకారంతో ఆ చెట్టును తొలగించారు’ అని చెప్పింది. చంద్రావతి చేసిన సాహస కార్యాన్ని ప్రజలంతా అభినందించారు. -
67 ఏళ్ల వయసులో అదరగొట్టిన బామ్మ.. శారీతో రోప్ సైక్లింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!
-
కొడుకు ఒడికి చేరిన తల్లి
కర్లపాలెం(బాపట్ల): ఊరు కాని ఊరు.. భాష రాక, తిరిగొచ్చే దారి తెలీక నాలుగేళ్ల క్రితం తప్పిపోయి ఓ మారుమూల రాష్ట్రంలో నరకయాతన అనుభవిస్తున్న 62ఏళ్ల వృద్ధురాలికి బాపట్లకు చెందిన ఓ వ్యక్తి జవాను ఆదుకున్నాడు. ఆమెను తన కుమారుడి దగ్గరకు చేర్చాడు. తెలంగాణలోని గద్వాల్ జిల్లా కుర్తిరవాళ్ గ్రామానికి చెందిన సోంబార్ నాగేశమ్మ 2018లో తన ఇంటి నుంచి అదృశ్యమై అసోంలోని చకోర్ జిల్లా చిల్‌చార్ సిటీకి చేరుకుంది. అక్కడి భాష రాక మానసిక వేదనతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. అయిన వారు లేక నాగేశమ్మ రోజురోజుకీ మానసికంగా కుంగిపోతోంది. ఇంతలో ఓ రోజు అక్కడే జవానుగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం గ్రామానికి చెందిన ఎన్. వెంకట నరేష్ తోటి జవాన్లతో కలిసి ఆ వృద్ధాశ్రమానికి ఈ నెల 21న వెళ్లాడు. అక్కడున్న వృద్ధ మహిళల మంచిచెడులు తెలుసుకుంటుండగా నాగేశమ్మ గురించి తెలిసింది. ఆమెను నరేష్ తెలుగులో పలకరించి ధైర్యం చెప్పాడు. ఆమె వివరాలు తెలుసుకుని తెలంగాణలోని ఓ న్యూస్ చానెల్ ప్రతినిధికి తెలియబర్చి వారిద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. వీడియో కాల్ ద్వారా తన తల్లిని గుర్తించిన ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు హుటాహుటిన అసోం వెళ్లి తన తల్లిని తీసుకుని వచ్చాడు. -
బామ్మ డాన్స్ వీడియో వైరల్
-
సోషల్ మీడియాను షేక్ చేసిన బామ్మ.. వీడియో చూస్తే విజిల్ పడాల్సిందే..
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా, ఈ వేడుకల్లో భక్తులు భారీ రేంజ్లో దహీ హండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టిన వారికి భారీ నజరానా సైతం ఉంటుంది. ఇక, దహీ హండీ వేడుకల్లో ఓ వృద్ధురాలు చేసిన ఫీట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఉట్టి కొట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారి దీపాన్ష్ కాబ్రా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కొందరు మహిళలు మానవ పిరమిడ్‌లో ఏర్పాడ్డారు. ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ వృద్ధురాలు దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని తన తలతో బద్దలు కొట్టింది. అనంతరం ఎంతో సేఫ్‌గా కిందకు దిగింది. కాగా, ఈ వీడియోపై స్పందించిన దీపాన్ష్ కాబ్రా.. "ది ఇన్క్రెడిబుల్ దాదీ" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సునామీ సృష్టించింది. కొద్ది సమయంలోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్‌ను, దాదాపు 10,000 లైక్‌లను సాధించింది. వీడియో చూసిన నెటిజన్లు వృద్ధురాలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. The Incredible Dadi! pic.twitter.com/QiwPHeYYUx — Dipanshu Kabra (@ipskabra) August 20, 2022 ఇది కూడా చదవండి: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
65ఏళ్లుగా ఒకే రూట్లో ఎయిర్‌హోస్టెస్‌గా..
ఒకే కంపెనీలో 20 ఏళ్లు పనిచేయడం కష్టం. ఎందుకంటే ప్రయివేటు ఉద్యోగాల్లో ఉద్యోగికి కోపం వచ్చినా, యజమానికి కోపం వచ్చినా పోయేది ఎంప్లాయ్ జాబే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఒకచోట కాకుండా వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. కానీ, 65 ఏళ్లుగా ఒకే సంస్థలో, ఒకే రూట్లో సేవలందిస్తూ... అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందో మహిళ. బోస్టన్లోని మసాచుసెట్స్‌కు చెందిన బెట్ నాష్‌కు ఇప్పుడు 86 ఏళ్లు. 1957లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆరున్నర దశాబ్దాలుగా న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీ వయా బోస్టన్ రూట్లోనే సేవలందిస్తోంది. ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించే బెట్... తరచుగా ఆ మార్గంలో ప్రయాణించే ఎంతోమందికి అభిమాన ఎయిర్హోస్టెస్గానూ మారిపోయింది. వేరే మార్గాన్ని ఎంచుకునే అవకాశమున్నా ఆమె ఆ రూట్లోనే పనిచేయడానికో కారణం ఉంది. అది ఆమె కొడుకు. వైకల్యంతో బాధపడుతున్న అతడికి తల్లి అవసరం ఎంతో ఉంది. ఇక ఆ రూట్ అయితే రాత్రికల్లా ఇంటికి చేరుకుని కొడుకును చూసుకునే సౌలభ్యం ఉంది. ఇన్నేళ్లుగా ఇటు ఉద్యోగాన్ని, అటు కొడుకు బాధ్యతలను అవిశ్రాంతంగా కొనసాగిస్తోంది. ఒకే కంపెనీలో 84ఏళ్లుగా సేవలందిస్తున్న వ్యక్తిగా ఇటీవలే వందేళ్ల వయసున్న బ్రెజిల్‌కు వ్యక్తి వాల్టేర్ ఆర్థ్మన్ రికార్డు సాధించాడు. -
ఆపరేషన్ చేసి కుట్లు మరిచారు
యశవంతపుర: వృద్ధ మహిళకు డాక్టర్ ఆపరేషన్ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ సంఘటన దావణగెరెలో జరిగింది. దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మ (65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పారు. ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. (చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు) -
చనిపోయిందనుకుని టెంట్ వేసి కూర్చొబెట్టారు...ఆ తర్వాత
తగరపువలస (భీమిలి): జీవీఎంసీ రెండో వార్డుకు చెందిన లక్కోజు అన్నపూర్ణ అనే 74 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం వృద్ధాప్యం కారణంగా ఇంటి వరండాలో పడిపోయి చనిపోయింది. దీంతో ఇంటి ముందు టెంట్ వేసి వారి సాంప్రదాయం ప్రకారం కూర్చొబెట్టారు. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. పగలంతా ఎండ తీవ్రంగా ఉండటంతో మధ్యాహ్నం 3.30 సమయంలో ఆమె భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు స్నానం చేయిస్తుండగా శరీరంలో కదలికలు కనిపించాయి. వెంటనే పల్స్మీటర్తో తనిఖీ చేయగా సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె స్పందించింది. 70 నుంచి 90 వరకు పల్స్ రేట్ చూపించడంతో అప్పటి వరకు విషాదం అలుముకున్న ఆ ఇంట సంభ్రమాశ్చర్యాలు చోటుచేసుకున్నాయి. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అనంతరం స్పూన్‌తో టీ తాగించగా గుటకలు వేసింది. ఆమె స్పందిస్తున్నందుకు సంతోషంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహన సిబ్బందికి ఫోన్ చేశారు. వారు సాయంత్రం 5 గంటలకు వచ్చి తనిఖీలు చేయగా చనిపోయినట్టు నిర్ధారించారు. అంతలోనే మళ్లీ వారింట విషాదం అలముకుంది. అనంతరం ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు. (చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?) -
సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు. చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..
పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): చింతకాయల కోసం ఓ వృద్ధురాలు అడవికి వెళ్లింది. దారి తప్పి 2 రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వృద్ధురాలి ఆచూకీ కనిపెట్టి క్షేమంగా అప్పగించారు. బుక్కపట్నం మండలం కొత్తకోటలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. కొత్తకోటకు చెందిన రామన్న భార్య నరసమ్మ (60) ఈ నెల 22న గ్రామానికి సమీపంలోని అడవిలో ఉన్న తోపులో చింతకాయల కోసం వెళ్లింది. మధ్యాహ్నం వరకూ చింతకాయలు కోసుకొని ఇంటికి బయలు దేరింది. గ్రామానికి వచ్చే దారి తప్పి అడవిలోనే ఉండిపోయింది. రాత్రయినా తల్లి ఇంటికి రాకపోవడంతో కుమారుడు చంద్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించినా ఆచూకీ లభించలేదు. రెండు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో చంద్ర ఆదివారం బుక్కపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో కలిసి అడవికి వెళ్లి వృద్ధురాలి కోసం గాలించారు. వీరికీ ఆచూకీ లభించలేదు. దారి చూపిన సెల్‌ఫోన్ సిగ్నల్ అడవిలో దారి తప్పిన నరసమ్మ వద్ద సెల్‌ఫోన్ ఉందని తెలియడంతో ఎస్ఐ, సిబ్బంది సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కోసం ప్రయతి్నంచారు. ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నా సిగ్నల్ ఆధారంగా కొత్తకోట అడవిలోని శీనప్ప కుంట దగ్గర వృద్ధురాలు ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని క్షేమంగా ఆమెను ఇంటికి చేర్చారు. వృద్ధురాలు అడవిలో 12 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఎస్ఐకి ఘన సన్మానం నరసమ్మ ఆచూకీ కనిపెట్టి క్షేమంగా బంధువులకు అప్పగించిన ఎస్ఐ నరసింహుడు, సిబ్బందిని గ్రామస్తులు ఘనంగా సన్మానించి పూలవర్షం కురిపించి ఊరేగించారు. కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, వైఎస్సార్సీపీ నాయకుడు కొత్తకోట కేశప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.