
లీలావతి కేశవ్‌నాథ్
శనివారం నాడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట కొన్ని గంటలుగా ఓ వృద్ధురాలు దిగాలు ముఖంతో కూర్చొని ఉన్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె వివరాలు కనుక్కుని, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ టూ టైర్ టిక్కెట్ బుక్ చేసి ఆమెను ఢిల్లీ పంపించారు! 68 ఏళ్ల ఆ పెద్దావిడ పేరు లీలావతి కేశవ్‌నాథ్. పెద్దకొడుకు ముంబైలో ఉంటాడు. నాలుగు నెలల క్రితం తన ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేస్తే పరుగుల మీద ఆ తల్లి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఢిల్లీ నుంచి ముంబై చేరుకుంది. ఈ నాలుగు నెలలూ కొడుక్కి సేవలు చేసింది. ఆరోగ్యం కుదుటపడ్డాక.. ‘ఇక నువ్వెళ్లు’ అన్నాడు కొడుకు! లాక్‌డౌన్‌లో ఎలా వెళ్తుంది? ‘ఎలాగైనా వెళ్లు’ అని ఇంట్లోంచి తరిమేస్తే రైల్వేస్టేషన్‌కి వచ్చి కూర్చుంది. ఇప్పుడీ సంగతులన్నీ ఢిల్లీలోని తన చిన్న కొడుక్కి కంట తడితో ఆమె చెబుతూ ఉండి ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment