mumbai railway
-
48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!
న్యూఢిల్లీ: రైలు ఎక్కేందుకు ట్రాఫిక్ కారణంగా కాస్త ముందుగా వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ స్టేషన్లో విశ్రాంతి రూం సరిగా ఉండక ఎక్కడ బస చేయాలో తోచక ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ముంబై రైల్వే శాఖ సరికొత్త పాడ్ రూంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది హోటల్‌కి వెళ్లి రూం అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చింది. (చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ) అయితే వీటిలో క్లాసిక్ పాడ్లు, ప్రైవేట్ పాడ్లు "లేడీస్-ఓన్లీ" పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్‌గా పిలిచే ఈ పాడ్ హోటల్లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్‌లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్‌కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూలో "స్నీక్ పీక్" అనే పేరుతో ఈ అత్యధునిక సరికొత్త విశ్రాంతి పాడ్ రూంలకు స్వాగతం అంటూ వాటికి సంబంధించిన వీడియోను ఒకటి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. (చదవండి: బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!) Koo App Sneak Peek! Welcome to the new-age Pod retiring rooms by @RailMinIndia at Mumbai Central. View attached media content - Ashwini Vaishnaw (@ashwinivaishnaw) 17 Nov 2021 -
‘ఎలాగైనా వెళ్లు’ అని అమ్మని పొమ్మన్నాడు
శనివారం నాడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట కొన్ని గంటలుగా ఓ వృద్ధురాలు దిగాలు ముఖంతో కూర్చొని ఉన్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె వివరాలు కనుక్కుని, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ టూ టైర్ టిక్కెట్ బుక్ చేసి ఆమెను ఢిల్లీ పంపించారు! 68 ఏళ్ల ఆ పెద్దావిడ పేరు లీలావతి కేశవ్‌నాథ్. పెద్దకొడుకు ముంబైలో ఉంటాడు. నాలుగు నెలల క్రితం తన ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేస్తే పరుగుల మీద ఆ తల్లి జనరల్ కంపార్ట్మెంట్లో ఢిల్లీ నుంచి ముంబై చేరుకుంది. ఈ నాలుగు నెలలూ కొడుక్కి సేవలు చేసింది. ఆరోగ్యం కుదుటపడ్డాక.. ‘ఇక నువ్వెళ్లు’ అన్నాడు కొడుకు! లాక్డౌన్లో ఎలా వెళ్తుంది? ‘ఎలాగైనా వెళ్లు’ అని ఇంట్లోంచి తరిమేస్తే రైల్వేస్టేషన్‌కి వచ్చి కూర్చుంది. ఇప్పుడీ సంగతులన్నీ ఢిల్లీలోని తన చిన్న కొడుక్కి కంట తడితో ఆమె చెబుతూ ఉండి ఉండొచ్చు. -
కరోనా: ముంబై లోకల్ రైళ్లు బంద్
ముంబై: రోజురోజుకు కరోనా వైరస్ బాధిత కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ముంబై రైల్వే సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్యే అధికారులు సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో ముంబై రైల్వే స్టేషన్‌కు వచ్చే స్థానిక, అవుట్ స్టేషన్ రైళ్లను మార్చి 31 వరకూ నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ముంబై లైఫ్‌లైన్ పరిగణలోకి వచ్చే 3000 లోకల్ సబర్బన్ రైళ్లలో రోజు కనీసం 80 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారులు పేర్కొన్నారు. (దేశీయ విమాన సర్వీసులపై కీలక నిర్ణయం) ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముంబై రైల్యే బోర్డు అధికారులు ఆదివారం మధ్యాహ్నం సమావేశమై అన్ని సబర్బన్ రైళ్ల సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారుల తెలిపారు. కాగా గత కోన్నేళ్లలో సబర్బన్ రైళ్ల సేవలను రద్దు చేయడం ఇదే మొదటిసారని.. 1974లో ట్రేడ్ యూనియన్ సమ్మె కారణంగా సబర్బన్ రైళ్లతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను 20 రోజుల పాటు నిలిపివేసినట్లు రైల్యే ప్రతినిధి పేర్కొన్నారు. ఇక అదివారం మధ్యాహ్నం తక్కువ పౌనపున్యంతో సబర్బన్ రైళ్లు నడిచాడయని.. అందులో కేవలం అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఇక ముంబై మున్సిపల్ కార్పోరేషన్ సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14 కరోనా కేసులు నమోదు కావడంతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరాయి. -
ప్రాణాంతక ‘జీవనాడి’
విశ్లేషణ ముంబై లోకల్ రైలు ప్రయాణికులు రోజుకు పది మంది ప్రమాదాల్లో మరణిస్తుంటారు. ఇది, దేశంలోని అన్ని రైలు ప్రమాద మరణాలలో దాదాపు సగం. అయినా, ఇది ఎవరికీ ఆందోళన కలిగించదు. ముంబై లోకల్ రైళ్లు దిగ్భ్రాంతికరంగా రోజుకు (సెలవు రోజుల్లో గాక) 75 లక్షల మంది ప్రజలను గమ్యాలకు చేరుస్తుంటాయి. వాటిని ముంబైకి జీవనాడిగా (లైఫ్‌లైన్) పిలవడం సముచి తమే. దూరంగా ఉన్న కర్జత్, కసారా, వీరార్ వంటి శివారు సబర్బన్ ప్రాంతాలను, నగరంలోని కీలక వ్యాపార ప్రాంతాలతో అనుసంధానించేవి అవే. లోకల్ రైళ్లు నిలి చిపోయాయంటే ముంబై నగరమే స్తంభించిపోతుంది. లోకల్స్ లేవంటే తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణికులు సైతం ఇంటికి పరిమితం కావాల్సిందే. శివసేన బంద్‌ల కోసం అనుసరించే వ్యూహం అదే. కాబట్టి అక్కడ బంద్‌లు జరిగేది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం వల్ల కాదు, ఇంట్లో కూర్చోవడం తప్ప గత్యంతరం లేక. సగటున ప్రతి మూడు నిమిషాలకు ఒక రైలు చొప్పున నడిచే రైళ్లు స్టేషన్లలో నిలిచేది నిమిషం కంటే తక్కువే. వాటిలో కొన్ని అన్ని చోట్లా ఆగని ఫాస్ట్ ట్రైన్లు కాగా, మరికొన్ని అన్ని స్టేషన్లలోనూ ప్రయాణికులను ఎక్కించుకునే స్లో రైళ్లు. మొత్తానికి ఈ లోకల్ రైళ్లు సౌక ర్యానికి కాకున్నా ప్రయాణానికి హామీని కల్పిస్తాయి. మునివేళ్లపై నిలిచి తోసుకుంటూ, తోపులాడుతూ సాగడం అధిగమించక తప్పని నిత్య సంక్షోభం. మీకు కాస్త నిలబడే వీలు చిక్కాలంటే కొందరు ప్రయాణికులు దిగే వరకు వేచి ఉండాల్సిందే. అనుకోకుండానే జరిగే ఈ వేధింపును, దూర ప్రయాణికులు కాస్త నాగరికంగా ‘‘శరీర మర్దన’’ (బాడీ మసాజ్) అని పిలుస్తుంటారు. సెంట్రల్, వెస్ట్రన్ అనే రెండు లోకల్ రైలు వ్యవ స్థలు సక్రమంగా పని చేయకపోవడం కాదు, తగినం తగా పని చేయడం లేదు. కొత్త రైళ్లను వేశారు, 9 బోగీలుండే లోకల్స్ అన్నిటినీ 12 బోగీలుగా మార్చారు. వాటన్నింటినీ 15 బోగీలుగా మార్చే రోజు ఎంతో దూరంలో లేదు. సంరక్షణ పనులను చేపట్టడానికి (మెయింటెనెన్స్) రైలు పట్టాలు అందుబాటులో ఉండేది తెల్లవారు ఒంటి గంట నుంచి 4 గంటల వరకే. ఇక ఆదివారాల్లోనైతే రైలు లైన్లలో కొంత భాగం మొత్తం అందుకు అందుబాటులో ఉంటుంది. అలాంటి వాటిని మెగాబ్లాక్స్ అంటారు. రైల్వేలు తలకు మించిన భారాన్ని మోయాల్సివస్తోందనేది స్పష్టమే. ఒక విధంగా చెప్పా లంటే, గుండె దడతో ఉన్న హృద్రోగ నిపుణుడు గుండెకు శస్త్ర చికిత్స చేయడం లాంటిదే ఇది కూడా. అయితే, ఈ జీవనాడి ప్రాణాలను తీస్తుంది కూడా. పరుగులు తీసే రైళ్లను ఎలాగో పట్టుకుని ప్రమాద కరంగా వేలాడుతూ పట్టుదప్పి పడి, లేదా రైల్వే లైన్లకు పక్కనుండే స్తంభాలకు కొట్టుకుని, లేదా రద్దీలో ఊపిరి ఆడక ఏడాదికి సగటున దాదాపు 3 వేలమంది మర ణిస్తుంటారు. బోగీల సామర్థ్యానికి 4 రెట్లకు పైగా ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో లోపల ఆక్సిజన్ అందుబాటు తగ్గిపోతుంది. మరణాలకు మరో కార ణం, ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా ప్రజలు పట్టాలను దాటుతుండటం. కొద్ది రోజుల క్రితమే అలా పట్టాలు దాటిన ఒక దుర్ఘటనను దర్యాప్తు చేసేందుకు వెళ్లిన ఒక స్టేషన్ మాస్టర్ రైలు కింద పడి చనిపో యాడు. ఒక్క 2010లోనే 40 మంది రైల్వే ఉద్యోగులు ఇలా తమ విధులను నిర్వర్తిస్తూ మరణించారు. ప్రజలు పట్టాలు దాటుతుండటానికి పూర్తిగా రైల్వేలే కారణం కాదు. నిజానికి రద్దీ బాగా ఉండే సమయంలోనే పట్టాలు దాటడమూ ఎక్కువగా ఉంటుంది. కాలినడక వంతె నలు మరీ కిక్కిరిసి ఉండటాన్ని చూసి కొందరు ప్రయా ణికులు మూర్ఖంగా పట్టాలు దాటాలనే ప్రయత్నంలో ప్రాణాలతో చెలగాట మాడుతుంటారు. గంటకు అత్య ధికంగా రైళ్లు నడిచే సమయం సరిగ్గా అదే. అంచనాలో ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితానికి వీడ్కోలు చెప్పక తప్పదు. ఇలా సంభవించే మరణాలు రోజుకు దాదాపు పది. మొత్తం దేశంలోని అన్ని రైలు ప్రమాద మరణా లలో దాదాపు సగం అని చెబుతారు. అయినా, పత్రి కల్లో ఎప్పుడో ఒకసారి కాలానుసార గణాంక సమాచా రంలోని ఒక చిన్న వాస్తవంగా ప్రస్తావనకు రావడానికి మించి, ఇది ఆందోళన కలిగించదు. రాజకీయవేత్తలు ఒక ప్రకటనను చీది పారేయడం లాంటి దినచర్యగా మారిపోయాయి ఈ చావులు. ప్రయాణికుల మరణా లకు మరో కారణం కూడా ఉంది. అది, రైలు ఫుట్ బోర్డ్‌కు ప్లాట్‌ఫాంకు మధ్యన ఖాళీ ఉండటం. అది ఒక మనిషిని దిగమింగేసేంత పెద్దదిగా ఉంటుంది. దీన్ని క్రమంగా సరిదిద్దుకుంటూ రావడానికి బొంబాయి హైకోర్టు ఆదేశించడం అవసరమైంది. రక్షణపరమైన అన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉన్న రైళ్లు ఈ సందు విషయాన్ని విస్మరించడం ఆశ్చర్యకరం. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఈ కారు చౌక రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు భారీ ఎత్తున నిధులను కేటాయించారు. అయినా సరఫరా కంటే డిమాండు బాగా మించిపోయి ఉంది. మెట్రో లను, మోనోలను నిర్మిస్తున్నారుగానీ, అది ఆలస్యంగా మేలుకోవడమే. చౌక, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం తగినంతగా అందుబాటులో లేక ప్రజలు కార్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇది, పెద్ద ఎత్తున వనరులను కాలుష్యభరితమైన ప్రైవేటు రవాణా రంగా నికి తరలిస్తోంది. ముంబై రోడ్లేమో ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌లతో కిక్కిరిసి ఉన్నాయి, నగరంలో ఉన్న స్థలమే కొద్దిగ. ఇక అది సముద్రాన్ని కబళించి విస్తరించా ల్సిందే. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
డిస్కవరీలో ముంబై ‘లోకల్’
ముంబై: ముంబైకర్ల లైఫ్ లైన్‌గా ప్రఖ్యాతి చెందిన లోకల్ రైళ్ల చరిత్ర ఈ నెల 7 న ప్రముఖ డిస్కవరీ చానెల్లో ప్రసారం కానుంది. ప్రయాణికుల రాకపోకలు, రైల్వే సేవల తీరు, రైల్వే సిబ్బంది పనితీరు, రైళ్ల సంఖ్య వంటి ముఖ్యమైన విషయాలు ప్రసారం చేయనుంది. అంతేగాకుండా ముంబైలో అత్యంత కీలకమైన, రద్దీ స్టేషన్లలో ఒకటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి ప్రతిరోజు 1,250 రైళ్లు బయలు దేరుతాయి. రోజు 30 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తారు. ప్రతి మూడు నిమిషాలకో లోకల్ రైలు నడపటం ఎలా సాధ్యం..? రైళ్లను సమయానుసారంగా (టైం టేబుల్ ప్రకారం) నడిపేందుకు కృషి చేస్తున్న స్టేషన్ మేనేజరు మొదలుకుని ఆపరేషన్ రూంలోని కంట్రోలర్లు, సిగ్నల్ మెన్, మోటర్‌మెన్ (డ్రైవర్లు), గార్డులు, ప్లాట్‌పాంలపై విధులు నిర్వహించే రైల్వే పోలీసులు, కూలీల వివరాలు, ఇతర అనేక అంశాలు ప్రపంచానికి తెలియజేయనున్నట్లు డిస్కవరీ నెట్ వర్క్ (ఆసియా) కార్యనిర్వాహక ఉపాధ్యాక్షుడు, జీఎం రాహుల్ జొహరీ చెప్పారు. ముంబై లోకల్ రైళ్లే ఎందుకంటే.. రోజూ దాదాపు 70.5 లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఘనత ముంబై లోకల్ రైళ్లు దక్కించుకున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో ప్రయాణికులను చేరవేసే రైల్వే వ్యవస్థ కేవలం ముంబైలో మాత్రమే ఉంది. రోజులో రెండు గంటలు మాత్రమే ఈ రైళ్లకు విరామం ఉంటుంది. ఇందుకే లోకల్ రైళ్లంటే ముంబైకర్లకు ప్రీతి. ఇదే విషయాన్ని గ్రహించిన డిస్కవరీ.. ముంబైకర్ల హృదయాలను దోచుకున్న లోకల్ రైళ్ల చరిత్ర ప్రసారం చేయాలని నిర్ణయించింది.