ముంబై: రోజురోజుకు కరోనా వైరస్ బాధిత కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ముంబై రైల్వే సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్యే అధికారులు సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో ముంబై రైల్వే స్టేషన్‌కు వచ్చే స్థానిక, అవుట్ స్టేషన్ రైళ్లను మార్చి 31 వరకూ నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ముంబై లైఫ్‌లైన్ పరిగణలోకి వచ్చే 3000 లోకల్ సబర్బన్ రైళ్లలో రోజు కనీసం 80 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారులు పేర్కొన్నారు. (దేశీయ విమాన సర్వీసులపై కీలక నిర్ణయం)
ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముంబై రైల్యే బోర్డు అధికారులు ఆదివారం మధ్యాహ్నం సమావేశమై అన్ని సబర్బన్ రైళ్ల సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారుల తెలిపారు. కాగా గత కోన్నేళ్లలో సబర్బన్ రైళ్ల సేవలను రద్దు చేయడం ఇదే మొదటిసారని.. 1974లో ట్రేడ్ యూనియన్ సమ్మె కారణంగా సబర్బన్ రైళ్లతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను 20 రోజుల పాటు నిలిపివేసినట్లు రైల్యే ప్రతినిధి పేర్కొన్నారు. ఇక అదివారం మధ్యాహ్నం తక్కువ పౌనపున్యంతో సబర్బన్ రైళ్లు నడిచాడయని.. అందులో కేవలం అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఇక ముంబై మున్సిపల్ కార్పోరేషన్ సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14 కరోనా కేసులు నమోదు కావడంతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment