Suburban
-
కరోనా: ముంబై లోకల్ రైళ్లు బంద్
ముంబై: రోజురోజుకు కరోనా వైరస్ బాధిత కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ముంబై రైల్వే సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్యే అధికారులు సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో ముంబై రైల్వే స్టేషన్కు వచ్చే స్థానిక, అవుట్ స్టేషన్ రైళ్లను మార్చి 31 వరకూ నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ముంబై లైఫ్లైన్ పరిగణలోకి వచ్చే 3000 లోకల్ సబర్బన్ రైళ్లలో రోజు కనీసం 80 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారులు పేర్కొన్నారు. (దేశీయ విమాన సర్వీసులపై కీలక నిర్ణయం) ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముంబై రైల్యే బోర్డు అధికారులు ఆదివారం మధ్యాహ్నం సమావేశమై అన్ని సబర్బన్ రైళ్ల సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారుల తెలిపారు. కాగా గత కోన్నేళ్లలో సబర్బన్ రైళ్ల సేవలను రద్దు చేయడం ఇదే మొదటిసారని.. 1974లో ట్రేడ్ యూనియన్ సమ్మె కారణంగా సబర్బన్ రైళ్లతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను 20 రోజుల పాటు నిలిపివేసినట్లు రైల్యే ప్రతినిధి పేర్కొన్నారు. ఇక అదివారం మధ్యాహ్నం తక్కువ పౌనపున్యంతో సబర్బన్ రైళ్లు నడిచాడయని.. అందులో కేవలం అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఇక ముంబై మున్సిపల్ కార్పోరేషన్ సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14 కరోనా కేసులు నమోదు కావడంతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరాయి. -
ఏళ్లనాటి కల ఫలించిన వేళ
రావికమతం(చోడవరం): ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని శివారు గిరిజన గ్రామాలవి. ఏ చిన్న పని కావాలన్నా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సిందే. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. మా పరిస్థితిని పట్టించుకోండి.. అంటూ ఎన్నో మార్లు వినతులు.. విజ్ఞప్తులు.. విసిగి పోయి ధర్నాలు కూడా చేశారు ఆయా గ్రామాల ప్రజలు. అయినా నేతలు, అధికారుల్లో మార్పు రాలేదు. హామీలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మండలంలో... ►రావికమతం మండలంలో గ్రామ పంచాయతీలు 24 ►24 పంచాయతీల పరిధిలో శివారు గ్రామాలు 62 ►పంచాయతీ కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ►ప్రస్తుతం మండలంలో పంచాయతీల సంఖ్య 28కి చేరింది. వమ్మవరం: కన్నంపేట పంచాయతీ శివారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వమ్మవరం గ్రామం పంచాయతీగా ఏర్పాటైంది. జనాభా: 969, ఓటర్లు: 713 రిజర్వేషన్: జనరల్ కె.కొట్నాబిల్లి: టి.అర్జాపురం పంచాయతీ శివారు ఐదు గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో కె.కొటా్నబిల్లి, గదబపాలెం, డోలవానిపాలెం గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా: 766, ఓటర్లు: 593 రిజర్వేషన్: ఎస్టీ మహిళ కేబీపీ అగ్రహారం: కొమిర పంచాయతీ శివారు 4 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్న కేబీపీ ఆగ్రహారం గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలో యర్రబంద గ్రామాన్ని కలిపారు. జనాభా: 991 ఓటర్లు: 634 రిజర్వేషన్: జనరల్ మహిళ ధర్మవరం: పి.ధమ్రవరం, కె.ధర్మవరం గ్రామాలు జెడ్.కొత్తపట్నం పంచాయతీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏ పని కావాలన్నా సర్పానది దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్ని కలిపి ధర్మవరం పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా: 429, ఓటర్లు: 327 రిజర్వేషన్: జనరల్ మహిళ సమస్య తీరింది టి.అర్జాపురం శివారుగా మా ఐదు గిరిజన గ్రామాలుండేవి. ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సరిగ్గా వినియోగించక మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. –గొలుముల రాములు, కె. కొట్నాబిల్లి ఆనందంగా ఉంది మాది కన్నంపేట శివారు వమ్మవరం గ్రామం. ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికకు సిద్ధమవ్వడం ఆనందంగా ఉంది. మా కష్టాలు తీరినట్టే. – గల్లా వెంకటలక్ష్మి, వమ్మవరం నది దాటక్కర్లేదు మాది ధర్మవరం. జెడ్.కొత్తపట్నం శివారుగా ఉండేది. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే సర్పానది దాటాల్సి వచ్చేది. భయం భయంగా వెళ్లేవాళ్లం. ఇకపై ఆ ఇబ్బంది లేదు. – గోరా చిరంజీవి, ధర్మవరం -
వానోచ్చింది.. మత్తడి దుంకింది..
మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీటి ఉధృతికి శనివారం మధ్యాహ్నం నల్లవాగు మత్తడి పొంగిపొర్లింది. మత్తడికి ఎగువ ప్రాంతాల్లో ఉన్న కల్హేర్, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో కురిసిన వర్షానికి వాగుల ద్వారా వరద నీరు వస్తోంది. తద్వారా మండలంలోని నల్లవాగు మత్తడికి జలకళ నెలకొంది. నల్లవాగు మత్తడి అలుగుపై నుంచి వరదనీరు పొంగిప్రవíß స్తుండడంతో ఆయకట్టు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – నిజాంసాగర్ -
సబర్బన్కు గ్రీన్ సిగ్నల్ పడేనా?
రైల్వే బడ్జెట్పై అందరి చూపు సబర్బన్ ఏర్పాటైతే ట్రాఫిక్ సమస్యలకు చెక్ బెంగళూరు: ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు బెంగళూరుకు దగ్గరగా ఉన్న పట్టణాలను కలుపుతూ నిర్మించే సబర్బన్ రైలుకు నేడు కేంద్రం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో మోక్షం దక్కక పోతుందా అని నగర ప్రజలతో పాటు ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే దశాబ్ధకాలం నాటి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. రూ.9వేల కోట్ల వ్యయం కాగల ఈ బృహత్ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి కానుంది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ద్వితీయ స్థాయి నగరాలు, పట్టణాల నుంచి నిత్యం ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం 12 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్ల్లు పట్టణాభివద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా సొంతవాహనాలు, లేదా బస్సుల ద్వారా బెంగళూరుకు వస్తుంటారు. రానున్న పదేళ్ల్లలో ఇది మరింతగా పెరిగి ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా బెంగళూరుకు 100 కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లా కేంద్రాలను, వాటి మధ్య ఉన్న 23 చిన్నచిన్న నగరాలు, పట్టణాలను కలుపుతూ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 440 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. రూ.3,400 కోట్లు ఖర్చుకాగల మొదటి దశలో బెంగళూరు-చిక్కబళ్లాపుర,దొడ్డబళ్లాపుర, రెండోవిడతలోరూ.2,300 కోట్ల నిధులతో బెంగళూరు-రామనగర,మండ్యా, రూ.1,300 కోట్లు ఖర్చుతో మూడో విడతలో బెంగళూరు-బంగారుపేట మధ్యలో ఉన్న అన్ని చిన్నచిన్న నగరాలకు రైలు సౌకర్యం కల్పిస్తారు. మెట్రోతో పోలిస్తే ఈ నూతన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. మెట్రోకు కిలోమీటరుకు సగటున రూ.300 కోట్లు ఖర్చవుతుంది. నూతన ప్రాజెక్టులో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 18 కోట్లు మాత్రమే. నూతన ప్రాజెక్టుకు కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ వనరులను పెంచితే సరిపోతుంది.