ప్రాణాంతక ‘జీవనాడి’
విశ్లేషణ
ముంబై లోకల్ రైలు ప్రయాణికులు రోజుకు పది మంది ప్రమాదాల్లో మరణిస్తుంటారు. ఇది, దేశంలోని అన్ని రైలు ప్రమాద మరణాలలో దాదాపు సగం. అయినా, ఇది ఎవరికీ ఆందోళన కలిగించదు.
ముంబై లోకల్ రైళ్లు దిగ్భ్రాంతికరంగా రోజుకు (సెలవు రోజుల్లో గాక) 75 లక్షల మంది ప్రజలను గమ్యాలకు చేరుస్తుంటాయి. వాటిని ముంబైకి జీవనాడిగా (లైఫ్‌లైన్) పిలవడం సముచి తమే. దూరంగా ఉన్న కర్జత్, కసారా, వీరార్ వంటి శివారు సబర్బన్ ప్రాంతాలను, నగరంలోని కీలక వ్యాపార ప్రాంతాలతో అనుసంధానించేవి అవే. లోకల్ రైళ్లు నిలి చిపోయాయంటే ముంబై నగరమే స్తంభించిపోతుంది. లోకల్స్ లేవంటే తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణికులు సైతం ఇంటికి పరిమితం కావాల్సిందే. శివసేన బంద్‌ల కోసం అనుసరించే వ్యూహం అదే. కాబట్టి అక్కడ బంద్‌లు జరిగేది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం వల్ల కాదు, ఇంట్లో కూర్చోవడం తప్ప గత్యంతరం లేక.
సగటున ప్రతి మూడు నిమిషాలకు ఒక రైలు చొప్పున నడిచే రైళ్లు స్టేషన్లలో నిలిచేది నిమిషం కంటే తక్కువే. వాటిలో కొన్ని అన్ని చోట్లా ఆగని ఫాస్ట్ ట్రైన్లు కాగా, మరికొన్ని అన్ని స్టేషన్లలోనూ ప్రయాణికులను ఎక్కించుకునే స్లో రైళ్లు. మొత్తానికి ఈ లోకల్ రైళ్లు సౌక ర్యానికి కాకున్నా ప్రయాణానికి హామీని కల్పిస్తాయి. మునివేళ్లపై నిలిచి తోసుకుంటూ, తోపులాడుతూ సాగడం అధిగమించక తప్పని నిత్య సంక్షోభం. మీకు కాస్త నిలబడే వీలు చిక్కాలంటే కొందరు ప్రయాణికులు దిగే వరకు వేచి ఉండాల్సిందే. అనుకోకుండానే జరిగే ఈ వేధింపును, దూర ప్రయాణికులు కాస్త నాగరికంగా ‘‘శరీర మర్దన’’ (బాడీ మసాజ్) అని పిలుస్తుంటారు.
సెంట్రల్, వెస్ట్రన్ అనే రెండు లోకల్ రైలు వ్యవ స్థలు సక్రమంగా పని చేయకపోవడం కాదు, తగినం తగా పని చేయడం లేదు. కొత్త రైళ్లను వేశారు, 9 బోగీలుండే లోకల్స్ అన్నిటినీ 12 బోగీలుగా మార్చారు. వాటన్నింటినీ 15 బోగీలుగా మార్చే రోజు ఎంతో దూరంలో లేదు. సంరక్షణ పనులను చేపట్టడానికి (మెయింటెనెన్స్) రైలు పట్టాలు అందుబాటులో ఉండేది తెల్లవారు ఒంటి గంట నుంచి 4 గంటల వరకే. ఇక ఆదివారాల్లోనైతే రైలు లైన్లలో కొంత భాగం మొత్తం అందుకు అందుబాటులో ఉంటుంది. అలాంటి వాటిని మెగాబ్లాక్స్ అంటారు. రైల్వేలు తలకు మించిన భారాన్ని మోయాల్సివస్తోందనేది స్పష్టమే. ఒక విధంగా చెప్పా లంటే, గుండె దడతో ఉన్న హృద్రోగ నిపుణుడు గుండెకు శస్త్ర చికిత్స చేయడం లాంటిదే ఇది కూడా.
అయితే, ఈ జీవనాడి ప్రాణాలను తీస్తుంది కూడా. పరుగులు తీసే రైళ్లను ఎలాగో పట్టుకుని ప్రమాద కరంగా వేలాడుతూ పట్టుదప్పి పడి, లేదా రైల్వే లైన్లకు పక్కనుండే స్తంభాలకు కొట్టుకుని, లేదా రద్దీలో ఊపిరి ఆడక ఏడాదికి సగటున దాదాపు 3 వేలమంది మర ణిస్తుంటారు. బోగీల సామర్థ్యానికి 4 రెట్లకు పైగా ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో లోపల ఆక్సిజన్ అందుబాటు తగ్గిపోతుంది. మరణాలకు మరో కార ణం, ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా ప్రజలు పట్టాలను దాటుతుండటం. కొద్ది రోజుల క్రితమే అలా పట్టాలు దాటిన ఒక దుర్ఘటనను దర్యాప్తు చేసేందుకు వెళ్లిన ఒక స్టేషన్ మాస్టర్ రైలు కింద పడి చనిపో యాడు. ఒక్క 2010లోనే 40 మంది రైల్వే ఉద్యోగులు ఇలా తమ విధులను నిర్వర్తిస్తూ మరణించారు. ప్రజలు పట్టాలు దాటుతుండటానికి పూర్తిగా రైల్వేలే కారణం కాదు.
నిజానికి రద్దీ బాగా ఉండే సమయంలోనే పట్టాలు దాటడమూ ఎక్కువగా ఉంటుంది. కాలినడక వంతె నలు మరీ కిక్కిరిసి ఉండటాన్ని చూసి కొందరు ప్రయా ణికులు మూర్ఖంగా పట్టాలు దాటాలనే ప్రయత్నంలో ప్రాణాలతో చెలగాట మాడుతుంటారు. గంటకు అత్య ధికంగా రైళ్లు నడిచే సమయం సరిగ్గా అదే. అంచనాలో ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితానికి వీడ్కోలు చెప్పక తప్పదు. ఇలా సంభవించే మరణాలు రోజుకు దాదాపు పది. మొత్తం దేశంలోని అన్ని రైలు ప్రమాద మరణా లలో దాదాపు సగం అని చెబుతారు.
అయినా, పత్రి కల్లో ఎప్పుడో ఒకసారి కాలానుసార గణాంక సమాచా రంలోని ఒక చిన్న వాస్తవంగా ప్రస్తావనకు రావడానికి మించి, ఇది ఆందోళన కలిగించదు. రాజకీయవేత్తలు ఒక ప్రకటనను చీది పారేయడం లాంటి దినచర్యగా మారిపోయాయి ఈ చావులు. ప్రయాణికుల మరణా లకు మరో కారణం కూడా ఉంది. అది, రైలు ఫుట్ బోర్డ్‌కు ప్లాట్‌ఫాంకు మధ్యన ఖాళీ ఉండటం. అది ఒక మనిషిని దిగమింగేసేంత పెద్దదిగా ఉంటుంది. దీన్ని క్రమంగా సరిదిద్దుకుంటూ రావడానికి బొంబాయి హైకోర్టు ఆదేశించడం అవసరమైంది. రక్షణపరమైన అన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉన్న రైళ్లు ఈ సందు విషయాన్ని విస్మరించడం ఆశ్చర్యకరం.
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఈ కారు చౌక రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు భారీ ఎత్తున నిధులను కేటాయించారు. అయినా సరఫరా కంటే డిమాండు బాగా మించిపోయి ఉంది. మెట్రో లను, మోనోలను నిర్మిస్తున్నారుగానీ, అది ఆలస్యంగా మేలుకోవడమే. చౌక, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం తగినంతగా అందుబాటులో లేక ప్రజలు కార్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇది, పెద్ద ఎత్తున వనరులను కాలుష్యభరితమైన ప్రైవేటు రవాణా రంగా నికి తరలిస్తోంది. ముంబై రోడ్లేమో ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌లతో కిక్కిరిసి ఉన్నాయి, నగరంలో ఉన్న స్థలమే కొద్దిగ. ఇక అది సముద్రాన్ని కబళించి విస్తరించా ల్సిందే.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపృకర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com