
ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్(Honduras)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ సంగీతకారుడు ఆరేలియో మార్టినెజ్‌తో సహా 12 మంది దుర్మరణం పాలయ్యారు. రోటన్ ద్వీపం నుండి లా సీబాకు వెళుతున్న విమానం హోండురాస్ తీరంలో కూలిపోయింది.
ప్రమాదం సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఐదుగురిని జాలర్లు రక్షించారు. లాన్సా ఎయిర్‌లైన్స్(Lansa Airlines)కు చెందిన విమానం రోటన్ ద్వీపం నుండి లా సీబాకు వెళుతుండగా కూలిపోయింది. విమానం సరిగా టేకాఫ్ కాలేకపోయిందని, దీంతో అది కూలిపోయి, సముద్రంలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో సముద్రంలో ఉన్న జాలర్లు ఐదుగురు విమాన ప్రయాణికులను రక్షించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హోండురాన్ సివిల్ ఏరోనాటిక్స్ ఏజెన్సీ తెలిపింది.
ఆ విమాన ప్రమాదంలో గరిఫునా సంగీతం ప్రాచుర్యానికి విశేష కృషి చేసిన ఆరేలియో మార్టినెజ్ సువాజో మృతిచెందారు. ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. ఆరేలియో మార్టినెజ్ 1969లో హోండురాస్‌లోని ప్లాప్లాయాలో జన్మించాడు. 1990లో అతను సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి, లాస్ గాటోస్ బ్రావోస్ అనే బ్యాండ్‌కు ప్రధాన గాయకునిగా మారారు. ఆరేలియో తొలి ఆల్బమ్ ‘గరిఫునా సోల్’ అతనికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది.
ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment