
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాలే కాదు.. సమాజ సేవలోనూ రాఘవ లారెన్స్ ముందుంటారు. తన వంతుసాయంగా రైతులు, పేదలకు ఆర్థికంగా నిలబడేందుకు ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తుంటారు. అలా రీల్ హీరోగా రాణిస్తూనే.. రియల్ లైఫ్‌లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇవాళ తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. అమ్మ పుట్టినరోజు శుభవేళ మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్విటర్‌లో ఫోటోలు పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ మదర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే రాఘవ లారెన్స్ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. 2023లో బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Hi Everyone, Today is my mother’s birthday. I need all your wishes and blessings 💐 pic.twitter.com/3QAWRisjvD
— Raghava Lawrence (@offl_Lawrence) May 2, 2025