గుర్తు తెలియని వృద్ధురాలి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం :
అంతర్జాతీయ ఆత్మహత్యల వ్యతిరేక దినం రోజునే ఓ వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కోటిలింగాల ఘాట్‌లోని కోటిలింగేశ్వర స్వామి గుడి ఎదురుగా 65 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. సంచిలో పురుగు మందు తెచ్చుకున్న వృద్ధురాలు.. కూల్ డ్రింక్‌లో దానిని కలుపుకొని తాగింది. అపరస్మాకర స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగా ఆమె మరణించింది. ఆమె వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.