పూల కోసం.. అత్తను చావబాదింది | Woman Beats Up Mother In Law In Kolkata For Plucking Flowers Without Permission | Sakshi
Sakshi News home page

పూల కోసం.. అత్తను చావబాదింది

Jun 1 2018 8:44 AM | Updated on Oct 22 2018 6:10 PM

Woman Beats Up Mother In Law In Kolkata For Plucking Flowers Without Permission - Sakshi

కోల్‌కతా : తన అనుమతి లేకుండా పెరట్లోని పూలు కోసిందనే కారణంతో వృద్ధురాలనే కనికరం లేకుండా అత్తను చావబాదిందో కోడలు. విషయాన్ని గమనించిన ఇంటి పక్కన వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అత్తను హింసించిన కోడల్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యశోదాపాల్‌ అనే 75 ఏళ్ల వృద్ధురాలు భర్త మరణించడంతో కొడుకు, కోడలితో పాటు గారియాలో నివాసం ఉంటోంది. యశోదకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. కోడలు నిత్యం ఆమెను హింసిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే బుధవారం పెరట్లోకి వెళ్లి పూలు కోస్తున్న యశోదను చూసిన కోడలు కోపంతో ఆమెపై దాడి చేసింది. ‘నా అనుమతి లేకుండా పూలు కోస్తావా’  అంటూ జుట్టు పట్టి ఈడ్చుకుంటూ అత్తను చావబాదింది. ఇం‍దుకు సంబంధించిన వీడియోను కోల్‌కతా పోలీసులు అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement