క్వీన్స్‌లాండ్: మాములుగా మనం పాములను చూస్తే పది ఆమడల దూరం పరుగెత్తుతాం. ఇక కొండచిలువ లాంటి పెద్ద పాములను చూస్తే! గుండె గుభేల్ మంటుంది. కానీ ఒక మహిళ ఏకంగా కొండచిలువను పట్టుకుని భుజంపై వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
క్వీన్స్‌లాండ్‌కి చెందిన బ్రీడీ మారో ఒక ఎలక్ట్రీషియన్. పాములను పట్టుకోవడంలో నైపుణ్యం ఉంది. ఓ ఇంట్లోకి వచ్చిన కొండచిలువ పిల్లిని తిని ఇంటి అడుగుభాగంలోకి వెళ్లింది. అది గమనించిన మారో పాకుతూ ఇంటి అడుగుభాగానికి వెళ్లి పామును పట్టుకుంది. ఒక చేత్తో దాని మెడను గట్టిగా పట్టుకొని తన భుజాన వేసుకుంది. తర్వాత దానిని ఒక బుట్టలోవేసి, తీసుకెళ్లి పొదల్లో వదిలేసింది. ఈ తతంగాన్ని ఒకరు వీడియో తీయగా, దీన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.‘గత 15 ఏళ్లుగా వన్యపాణ్రుల సంరక్షకురాలిగా పని చేస్తున్నాను. ఇలాంటి పాములు ఎన్నో పట్టుకున్నాను. ఈ సీజన్‌లో పాములు బయటకు వస్తాయి. అందరు జాగ్రత్తగా ఉండాలని’ బ్రీడీ మారో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment