Queensland
-
పెంపుడు శునకం చేతిని కొరికేసింది!
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ ముంజేతిని ఆమె పెంపుడు కుక్క కొరికేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సగం తెగిన చేతిని వైద్యులు తిరిగి అతికించారు. తీరప్రాంత టౌన్స్విల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో అత్యవసర ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెంటనే ఓ నివాసానికి చేరుకున్నారు. ఓ ఇంటి బయట మహిళ రక్తం కారుతున్న చేతితో విలవిల్లాడుతుండగా, లోపల ఓ భారీ శునకం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కోపంతో తిరుగుతోంది. దీంతో, వెంటనే పోలీసులు వైద్య సిబ్బందికి కబురు పంపారు. వారొచ్చి బాధితురాలి చేతికి కట్టుకట్టారు. లోపలున్న శునకం నియంత్రణలోకి రాకపోవడంతో నిపుణుల సూచన మేరకు కాల్చి చంపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కుక్క గతంలో తనపైనా కూడా దాడి చేసిందని పొరుగింటి వ్యక్తి చెప్పాడని స్థానిక మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు ఇంతటి ప్రమాదకర స్థాయిలో దాడి చేయడం తన 37 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని సీనియర్ సార్జెంట్ స్కాట్ వారిక్ వ్యాఖ్యానించారు. -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్‌లాండ్‌లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్‌కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్‌గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ.. అనూహ్య మలుపులు
ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్ (మార్ష్ కప్) 2022-23 సీజన్లో రసవత్తర సమరం జరిగింది. థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓ మ్యాచ్ అనూహ్య మలుపులకు వేదికైంది. గబ్బా వేదికగా క్వీన్స్‌ల్యాండ్-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్.. 49.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూసౌత్ వేల్స్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయి (49.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్) ఓటమిపాలైంది. Watch this crazy final over that included a six, an injured bowler on debut, another debutant bowling his first over halfway through the last over to replace him, and a run out that sealed a thrilling win for Queensland https://t.co/CREqRlj00C — cricket.com.au (@cricketcomau) February 26, 2023 చివరి ఓవర్లో న్యూసౌత్ వేల్స్ గెలవాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా (చేతిలో 2 వికెట్లు ఉన్నాయి).. స్టీవెన్ మెక్గిఫిన్ వేసిన తొలి బంతినే డ్వార్షుయిష్ సిక్సర్‌గా మలిచి గెలుపుపై ధీమాను పెంచాడు. అయితే ఆతర్వాత బంతికే డ్వార్షుయిష్ (20 బంతుల్లో 44; 5 సిక్సర్లు).. బ్లేక్ ఎడ్వర్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. Huge wicket for the Bulls and we have a thrilling finish coming up! #MarshCup pic.twitter.com/K0WJ4trzBp — cricket.com.au (@cricketcomau) February 26, 2023 గజ్జల్లో గాయం కారణంగా స్టీవెన్ మెక్గిఫిన్ తప్పుకోవడంతో జోష్ బ్రౌన్ బంతిని అందుకున్నాడు. బ్రౌన్ వేసిన మూడో బంతి డాట్ బాల్ కాగా.. నాలుగో బంతిని లియామ్ హ్యచర్ బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయల్సిన తరుణంలో లియామ్ హ్యాచర్ రనౌట్ కావడంతో మ్యాచ్ ముగిసింది. గెలుపుపై ధీమాగా ఉన్న న్యూసౌత్ వేల్స్ చివరి ఓవర్లో చతికిలపడి ఓటమిపాలైంది. ఈ విజయంలో క్వీన్స్‌ల్యాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సీజన్‌ను ముగించగా.. న్యూసౌత్‌వేల్స్ చిట్టచివరి ప్లేస్‌తో సీజన్‌ను ముగించింది. ఫైనల్ మ్యాచ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా-సౌత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 8న జరుగుతుంది. -
ఆస్ట్రేలియాలో ఢిల్లీ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్ 21న క్వీన్స్లాండ్ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్ మర్డర్ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్విందర్ సింగ్ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్ టౌన్లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్విందర్ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల క్రితం రాజ్ విందర్పై క్వీన్స్లాండ్ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు( భారత్ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష -
లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!
Man Says He Was Fired For Being Too Fat: ఏ కంపెనీ అయిన టాలెంట్‌ని పరిగణలోకి తీసుకునే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుంది. కొన్ని కంపెనీలు ఐతే ఇన్నేళ్లు అనుభవం ఉంటేనే రిక్రూట్ చేసుకుంటానని ముందే చెబుతున్నాయి. కానీ ఇక్కడోక వ్యక్తిని కేవలం లావుగా ఉన్నాడంటూ విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఆస్ట్రేలియాకు చెందిన హమీష్ గ్రిఫిన్ క్వీన్స్‌లాండ్‌లో ఎనిమిదేళ్లుగా పార్క్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పైగా అతని సొంత ఇంటికి ఆఫీస్ సుమారు 3,200 కి.మీ దూరం. కాగా అతను ఇటీవలే ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలా ఇల్లు కూడా మారాడు. అయితే ఉన్నట్టుండి అతని కంపెనీ యజమాని నువ్వు చాలా లావుగా ఉన్నావు పనిచేయలేవు అని చెప్పి విధుల నుంచి తొలగించేశారు. ఈ మేరకు గ్రిఫిన్ మాట్లాడుతూ..."కనీసం నా పని సమర్ధతను చూపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కేవలం నేను లావుగా ఉన్నాను కాబట్టి ఏ పనిచేయలేను అని నిర్ణయించారు. పైగా నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఈ ఏడాది అతని చదువు ఆగిపోతుంది." అని ఆవేదన వ్వక్తం చేశాడు. అయితే ఆరోగ్య కారణాలతో తొలగించడం వివక్షత కిందకే వస్తుందని లాయర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తన ఆస్తులను అమ్ముకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏదిఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి పనిచేయగల సామర్థ్యం ఉన్నప్పుడూ ఒక కంపెనీ ఇలాంటి కుంటిసాకులతో ఉద్యోగం తొలగించడం అమానుషం. (చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!) -
Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా!
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అనే నానుడికి మరో ఉదాహరణ ఆమె కథ. వికలాంగుడైన బిడ్డను ఇతర తల్లుల్లా చెత్త కుప్పల్లో పడేయడానికి ఆమె మాతృ హృదయం వెనుకాడింది. అమ్మకు బిడ్డ ఎప్పటికీ బరువు కాదుగా! అందుకే కడుపున మోసిన బిడ్డను ఈ సారి వీపున మోసింది. ప్రపంచం అంచులా దాకా తీసుకెళ్లింది. కళ్లు కనిపించని బిడ్డకు తన కళ్లతో లోకమంతా చూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తల్లీబిడ్డలకు చెందిన ఫొటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా భావోధ్వేగానికి గురౌతారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్ (43)కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు. ఐతే పుట్టిన బిడ్డకు అంగవైకల్యంతోపాటు, కళ్లు కూడా కనిపించవని తెలుసుకుని కుమిలిపోయింది. ఐతేనేమి తన కళ్లతో బిడ్డకు లోకాన్ని చూపాలనుకుంది. 24 గంటలు కొడకు జిమ్మీ వెన్నంటే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. ఇప్పుడు జిమ్మీకి 26 ఏళ్లు. ఐతే ప్రపంచ పర్యటన (వరల్డ్ టూర్)కు వెళ్లాలనుకున్న నిక్కి తన కొడుకును కూడా తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపై జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలి వరకు అనేక ప్రదేశాలకు కొడుకును తీసుకెళ్తోంది. మామూలు పిల్లలకు అందినట్టే నా కొడుకుకు కూడా సకల ఆనందాలను పంచాలనుకుంటున్నాను. నా కోడుకు జిమ్మీతో కరోనా వ్యాప్తికి ముందే కెనడాను సందర్శించానలనుకున్నాను. డైపర్లు, బట్టలు, బెడ్ ప్యాడ్స్, దుప్పట్లు, దిండులు మాతో పాటు తీసుకెళ్తున్నాను. వీపుపై జిమ్మీని మోయడం ప్రాక్టీస్ చేశాను కూడా. ఇక మరిన్ని ప్రదేశాలను మేమిద్దరం సందర్శిస్తామని నిక్కీ చెబుతోంది. నిక్కీ - జిమ్మీల కథ ఎందరికో ఆదర్శం. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ
QueensLand Police Troll After Englnad Collapse For 147 Runs 1st Test Ashes.. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ఆటను ప్రదర్శించింది. ఆరంభం నుంచి ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడూ మిగతా ఆసీస్ పేస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ అదుర్స్.. 127 ఏళ్ల తర్వాత ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగానే క్వీన్స్లాండ్ పోలీస్ విభాగం.. ఇంగ్లండ్ కుప్పకూలడంపై తమదైన శైలిలో క్రికెటర్ల పేర్లను ఉపయోగిస్తూ పోలీస్ భాషలో ట్వీట్ చేశారు. ఐదు వికెట్లు తీసిన కమిన్స్‌తో పాటు కామెరాన్ గ్రీన్, నాథన్ లియోన్, వార్నర్ పేర్లు వచ్చేలా ఆ ట్వీట్ ఉండడం ఆసక్తి కలిగించిందది. ''బీఎన్‌ఈ ట్రాఫిక్ అప్డేట్: ఎ లార్జ్ క్రౌడ్ ఫర్ ది ఫస్ట్ టెస్ట్ సో ప్లాన్ యువర్ ''కమిన్స్'' అండ్ గోయింగ్స్. వీ వుడ్ బీ ''లియోన్'' ఇఫ్ వి సెడ్ దేర్ విల్ బి నథింగ్ బట్ ''గ్రీన్'' లైట్స్ నియర్ ది గాబా. డోంట్ సే వి డిడింట్ ''వార్నర్''.. అంటూ ట్వీట్ చేసింది. ఇక మరొక ట్వీట్లో.. '' గాబా టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై విచారణ ప్రారంభించాలనుకుంటున్నాం'' అంటూ పేర్కొంది. ఇక వెలుతురులేమి కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్ స్టార్క్ BNE traffic update: A large crowd for the first test so plan your Cummins and goings. We'd be Lyon if we said there'll be nothing but Green lights near the Gabba. Don't say we didn't Warner #Ashes — Queensland Police (@QldPolice) December 7, 2021 -
ప్రతి రోజు రావడం.. రేగు పళ్లు తినడం.. ఏడాదిగా ఇదే పని
కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని అనుకోము. కానీ ఇక్కడొక వ్యక్తి షాపుకి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి ఒకటి ప్రతిరోజు వస్తోందట. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) అసలు విషయంలోకెళ్లితే... ఆస్ట్రేలియాలో ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని జులటెన్ నివశిస్తున్న టోనీ ఫ్లెమింగ్ అనే వ్యక్తి వడ్రంగి షాపుకి ఒక ప్రమాదకరమైన కాసోవరి అనే పక్షి రోజు వస్తోందట. పైగా ఈ కాసోవరి పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి మాత్రమే కాదు చాలా శక్తిమంతంగా దాడిచేస్తాయి. అంతేకాదు ఈ కాసోవరి పక్షి 1.8 మీటర్ల పొడవు, 70 కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పైగా వాటి గోళ్లు 10 సెం.మీ వరకు పొడవు పెరుగతాయి. అందువల్లే అది చాలా భయంకరంగా దాడిచేస్తుంది. అయితే ఈ పక్షి ఒక ఏడాది నుంచి తన షాప్‌లోకి దర్జాగా వచ్చేయడమే కాక అక్కడ ఉన్న రేగు పళ్ళను తినేసి వెళ్లిపోతుందని చెబుతున్నాడు. చాలామంది తమ చుట్టపక్కల స్నేహితులు వచ్చి ఫోటోలు తీసుకుంటారని కూడా అంటున్నాడు. పైగా అది మా ఇంటి ఆవరణలో సైతం తిరుగుతున్నట్లు గమనించామని, పైగా స్థానికులు దానికి పెంపుడు జంతువు మాదిరిగా ఆహారం పెడుతున్నారని చెప్పాడు. అయితే టోనీ ఈ పక్షి "రోంపర్ స్టాంపర్" అని పేరు కూడా పెట్టాడు. కానీ ఇది స్థానికులందరితో కలిసి ఉండదని చెబుతున్నాడు. పైగా అక్కడ నగరంలో ప్రసిద్ధి గాంచిన పబ్‌లో కూడా తిరగడమే కాక అక్కడ రోడ్డుపై వెళ్లుతున్న ఒక వ్యక్తి పై దాడి కూడా చేసిందని అన్నాడు. అయితే అతను అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినట్లు టోనీ చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) -
అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్ అడ్డుగా
Weatherald Scolded for Bizarre Helmet-Kicking Video: షఫీల్డ్ షీల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ సమయంలో సౌత్ ఆస్ట్రేలియా ఆటగాడు వెదర్లాండ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌కు ముందు బ్రేక్ సమయంలో క్వీన్స్‌ల్యాండ్ ఫీల్డర్ మ్యాట్ రెన్షా.. క్రీజులో బ్యాటర్స్ గార్డ్ తీసుకునే చోట హెల్మెట్ పెట్టేసి వెళ్లాడు. ఓవర్ ప్రారంభం కావడంతో వెదర్లాండ్ స్ట్రైకింగ్‌కు వెళ్లాడు. కాగా అప్పటికే వెదర్లాండ్ ఏదో విషయంలో కోపంతో ఉన్నాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే అంతలో క్రీజులోకి చేరుకున్న వెదర్లాండ్స్.. అక్కడ హెల్మెట్ ఉండడం చూసి చిర్రెత్తిపోయినట్టున్నాడు. దీంతో హెల్మెట్‌ను ఫుట్బాల్లా భావించి పెనాల్టీ కిక్ ఇవ్వడంతో అది ఎగిరి దూరంగా పడిపోయింది. వెదర్లాండ్ చర్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన క్వీన్స్లాండ్ కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా జేక్ వెదర్లాండ్స్ దగ్గరకు వచ్చి వాదనకు దిగాడు. ఒక హెల్మెట్‌ను అలా తన్నడం ఏంటని.. కాస్త హుందాగా ప్రవర్తించాలని కోరాడు. అయితే వెదర్లాండ్స్ ఖవాజాను ఏదో అనబోయి.. వెనక్కి తగ్గాడు. ఇదంతా చూసిన అంపైర్ వెదర్లాండ్స్ను పిలిచి ఇలా చేయడం కరెక్టు కాదని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో Bizarre things on a cricket field: Matt Renshaw (QLD) carried the helmet from one end to other and kept it right on the batting crease on batters guard. Jake Weatherald (SA) with a penalty kick to that helmet. @beastieboy07 @cric_blog #SheffieldShield pic.twitter.com/fXNarJZUE8 — Nash (@NashvSant) November 25, 2021 -
ఇన్‌హెలర్‌లో దూరిన పాము.. ఇదెలా సాధ్యం!
మెల్బోర్న్: సాధారణంగా పాములు ఎక్కువగా బొరియల్లో.. బాగా ఉపయోగం లేని చోట.. మనుషుల ఆవాసం లేని ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడు ఇళ్లలోకి, బాత్రూమ్లోకి.. ఆఖరికి బ్యాగుల్లోకి కూడా దూరి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. పాములు పైన చెప్పిన ప్రాంతాల్లో ఎక్కడ దూరిన మనం గుర్తించవచ్చు.. జాగ్రత్త పడొచ్చు. కానీ ఇన్హెలర్ లాంటి చిన్న వస్తువుల్లో దూరితే.. కనిపెట్టలేం.. మన అదృష్టం బాగుండకపోతే.. వాటి కాటుకు బలవుతాం కూడా. అసలు పామేంటి.. ఇన్‌హెలర్‌లో దూరడమేంటి.. అసలు అది అందులో ఎలా పడుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. ఇన్‌హెలర్‌లో పాము పిల్ల బయటపడిన ఘటన ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. అయితే తొలుత ఈ పాము పిల్ల క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో బట్టల బాస్కెట్లో కనిపించింది. ఆ తర్వాత అది మాయమయ్యింది. ఎలా దూరిందో ఏమో గాని ఇన్‌హెలర్‌లో దూరింది. ఇంటి యజమాని కూతురికి ఆస్తమా. దాంతో ఆమె ఇన్హెలర్ని తీసుకుని తెరిచి చూడగా.. దానిలో పాము పిల్ల కనిపించింది. భయంతో తల్లిదండ్రులను పిలిచి వారికి ఈ విషయం చెప్పింది. యువతి తల్లిదండ్రులు దీని గురించి పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. దాంతో సన్‌షైన్ కోస్ట్ స్నేక్ 24/7 సభ్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇన్హెలర్లోకి దూరిన పాము పిల్లను బయటకు తీశాడు. ఇక ఇది విషపూరితమైన రెడ్ బెల్లిడ్ బ్లాక్ స్నేక్ అని తెలిపారు. ఆస్ట్రేలియాలోని అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి. ఇది ఒక్కసారి కాటేస్తే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవల్సిందే. చదవండి: పాముతో ఎలుక ముద్దులాట.. ఇంకేముంది.. ఒక్కసారిగా పాములన్నీ మీద పడ్డాయి! -
అలా అయితే నాల్గో టెస్టు వాకౌట్ చేస్తాం
అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్–ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్‌కాట్ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్‌లోనే ఐపీఎల్ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు. హోటల్ గది... గ్రౌండ్... హోటల్... షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్లాండ్ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు. ‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. మేం బ్రిస్బేన్‌లోనే ఆడతాం... ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్‌లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం. –మాథ్యూ వేడ్ భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. –రాస్ బేట్స్, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్) అంతా కలిసి సిడ్నీకి... మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. -
చావు నుంచి కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా..
-
చావు నుంచి కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా..
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ ప్రాంతం వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రహదారిపై మంగళవారం ఉదయం ఒక వ్యక్తి పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడిపిస్తూ రయ్యిన దూసుకెళ్తున్నాడు. అతని స్పీడును గమనించిన పోలీసులు ఆ కారును వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక ఆ వ్యక్తిని ఆపిన పోలీసులు ఎందుకంత స్పీడుగా వెళుతున్నావని ప్రశ్నించారు. 'చావు నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా' అంటూ సమాధానమిచ్చాడు. అయితే అతని జవాబు అర్థం కాక మళ్లీ అడిగారు. దీంతో సదరు వ్యక్తి అసలు విషయాన్ని వెల్లడించాడు. (పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..) 'నా పేరు జిమ్మీ.. క్వీన్స్‌లాండ్‌కు చిన్నపని మీద వచ్చాను. పని ముగించుకొని వెళ్తున్న నాకు కారులో సడెన్‌గా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఈస్ట్రన్ బ్రౌన్ పాము కనిపించింది. అది నా వాహనంలోకి ఎలా వచ్చిందో తెలియదు. దానిని పట్టుకొని చంపే ప్రయత్నంలో కాటు వేసినా చివరికి ఎలాగోలా దానిని చంపేశాను. అయితే దాని విష ప్రభావం మెల్లిగా మొదలయ్యింది. నా కాళ్లు వణకడం, శరీరం మొద్దుబారినట్లుగా అయిపోవడం ప్రారంభించింది. దీంతో ఎలాగైనా చావు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే కారును గంటకు 120 కి.మీ వేగంతో నడిపాను.' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తమ వాహనంలో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (కూతురి ముందు తల్లి ఓడిపోవాల్సిందే) -
సముద్రం అడుగున తొలి హోటల్
న్యూఢిల్లీ : పచ్చని చెట్లను కడుపులో పొదుపుకొని కనువిందు చేసే పర్వత పక్తుల మధ్య నుంచి నీటిపై పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే. మరి నీటి అడుగున ఇంద్ర ధనుస్సులా సప్త వర్ణాల్లో మెరిసిపోయే పగడపు దీవుల అందాలను తిలకిస్తే, చుట్టూ తిరిగే పలు రంగుల రకాల చేపలతోపాటు షార్కులు, తిమింగళాలు, ఇతర జల చరాలను ఎలాంటి అభద్రతా భావం లేకుండా కనులారా చూస్తుంటే ఆ అనుభూతి ఇంకెంత అందంగా ఉంటుంది? అది ఎలా సాధ్యం అవుతుంది? అలాంటి ఔత్సాహికుల కోసమే ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ‘అండర్ వాటర్ హోటల్’ను ఏర్పాటు చేశారు. క్వీన్స్‌లాండ్‌లో పది మిలియన్ డాలర్లు (దాదాపు 72 కోట్ల రూపాయలు) వెచ్చించి 14 నెలల్లో పూర్తి చేశారు. జల చరాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా ‘కైమేట్ ఛేంజ్’ పట్ల ప్రజల్లో అవగాహనకు ఈ హోటల్ ఉపయోగపడుతుందన్న కారణంగా క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వం 2.75 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయంగా అందించింది. ఏర్లీ బీచ్‌కు 39 నాటికల్స్ మైళ్ల దూరంలో సముద్రంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీని బరువు 260 టన్నులు. ఇందులో మొత్తం పది పడక గదులను నిర్మిస్తున్నారు. అందులో రెండు పడక గదులను డిసెంబర్ ఒకటవ తేదీ ఉంచి పర్యాటకుల కోసం ప్రారంభించారు. మిగతా గదులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నీటి అడుగునే కాకుండా నీటిపై డెక్ మీద టెంటులాంటి పడకల్లో కూడా సేదతీరే అదనపు సౌకర్యం ఉంది. టారిఫ్‌ల గురించి హోటల్ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. -
తాగినమత్తులో కుక్కపై విచక్షణా రహితంగా దాడి
-
నీకు జాలనేదే లేదా? మనిషివేనా?
నార్త్ మకాయ్ : తాగినమత్తులో సోదరికి చెందిన కుక్కపై విచక్షణా రహితంగా దాడి చేసాడో వ్యక్తి . అనవసరంగా దానిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్‌లాండ్‌లోని నార్త్ మాకాయ్కి చెందిన ఆండ్రూ కోలోమెన్ అనే వ్యక్తి తన సోదరికి చెందిన జాబు అనే కుక్కను ప్రేమగా దగ్గరకు పిలిచి, అది దగ్గరకు రాగనే దానిపై దాడి చేశాడు. పిడికిలితో, మోచేతితో దానిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. దానిపై పడి చితకబాదాడు. ఎలాగోలా అతడి దాడినుంచి తప్పించుకున్న జాబు అక్కడినుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డై వైరల్ అవ్వటంతో జంతు ప్రేమికులు‘‘ నీకు జాలనేదే లేదా! నువ్వసలు మనిషివేనా’’ అంటూ అతడిపై విరుచుకుపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తాగినమత్తులో కుక్కపై విచక్షణా రహితంగా దాడి ఆండ్రూను కఠినంగా శిక్షించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన తుది తీర్పును కోర్టు వెలువరించింది. అతడి నేరం నిరూపణ అవ్వటంతో మకాయ్ మెజిస్ట్రేట్ కోర్టు తగిన విధంగా శిక్షించింది. అంతేకాకుండా 3 సంవత్సరాల పాటు కుక్కలను పెంచుకోవటానికి వీలులేదని తేల్చిచెప్పింది. కాగా కుక్క చనిపోలేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ అతడికి జైలు శిక్ష పడకుండా అడ్డుకున్నారు అతడి తరపు న్యాయవాదులు. -
ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు
-
కంగారూ దేశంలో కుంభవృష్టి..!
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో క్విన్స్‌లాండ్, టౌన్స్‌విల్లే నగరాలు జలదిగ్బంధమయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వరద నీటిలో చిక్కుకుని రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోరెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. టౌన్స్‌విల్లే నగరంలో శనివారం 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
తీవ్రంగా గాయపడ్డ ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీక్రికెటర్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత శుక్రవారం హెడెన్ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్లాండ్ దీవులకు హాలిడే ట్రిప్ వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్‌బ్రోక్ ఐస్‌ల్యాండ్‌లో తన కొడుకు జోష్‌తో కలిసి సరదాగా సర్ఫింగ్ గేమ్ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ విషయాన్ని హెడేనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘జోష్‌తో సర్ఫింగ్ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటాను.’అని పేర్కొన్నాడు. ఆసీస్ తరపున 103 వన్డేలు, 161 టెస్ట్‌లు, 9 టీ20లాడిన హెడెన్ 2009లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్ 2008లో భారత్‌తో తన చివరి వన్డే ఆడాడు. View this post on Instagram Ok. Last attention seeking post I promise. Just wanted to say a big thank you to all our mates on Straddie who have been so supportive.✅🏄🏽♂️🙏 Especially Ben & Sue Kelley for the fast diagnosis with MRI, CT scan. Fractured C6, torn C5,C4 ligaments safe to say I truly have dodged a bullet. Thank you everyone ❤️ On the road to recovery 🏄🏽♂️🎣 A post shared by Matthew Hayden (@haydos359) on Oct 7, 2018 at 3:44am PDT -
డెంగ్యూ దోమపై విజయం
లండన్: పరిశోధకులు చేపట్టిన ఓ ప్రయోగం వల్ల డెంగ్యూ రహిత పట్టణం ఆవిర్భవించింది. నాలుగేళ్ల క్రితం డెంగ్యూ వైరస్‌ను అదుపు చేసేందుకు దోమల్లో ప్రవేశ పెట్టిన వోల్బచియా బ్యాక్టీరియా ప్రయోగం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ దీవిలో 66 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న టౌన్స్‌విల్లే వేదికైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు దోమల్లో వోల్బచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి ఇతర దోమలతో జత కూడేలా చేయడంతో డెంగ్యూ వైరస్‌ను నివారించగలిగారు. 2014 నుంచి టౌన్స్‌విల్లేలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ, జికా వ్యాధులను అదుపు చేయాలనే లక్ష్యంతో ఈ పరిశోధన మొదలు పెట్టామని, ఈ ఫలితాలతో తమకు నమ్మకం పెరిగిందని వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ డైరెక్టర్ స్కాట్ ఓ నీల్ చెప్పారు. ప్రస్తుతం వీటిని ఇండోనేషియాలో ప్రయోగిస్తున్నారు. జికా వైరస్‌ను నివారించేందుకు వీటిని బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో ప్రయోగించనున్నారు. ‘టౌన్స్‌విల్లే కన్నా రెట్టింపు విస్తీర్ణం, 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న రియోలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేం విజయం సాధిస్తాం’ అని నీల్ అన్నారు. ఈ బ్యాక్టీరియా మలేరియాను నివారించగలదా అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. -
మృత్యుంజయురాలు.. చదవాల్సిన కథనం
బ్రిస్బేన్: కొండ మీది నుంచి లోయలోకి పడ్డా.. ఆమెకు నూకలు మాత్రం చెల్లిపోలేదు. ఆరో రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలతో బయటపడింది. గురువారం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జోహీ హాన్(25) గత గురువారం క్వీన్స్‌ల్యాండ్‌లో టల్లీ పట్టణానికి వెళ్లారు. అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆమె.. కెర్నిస్ అటవీ ప్రాంతంలోని టైసన్ పర్వతంపైకి ట్రెక్కింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైన్యం హెలికాఫ్టర్ సాయంతో అధికారులు గాలింపు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది. శనివారం అటవీ మార్గం గుండా వెళ్తున్న కొందరికి దూరంగా సాయం చేయాలన్న కేకలు వినిపించాయి. అయితే వారు పోలీసులకు సమాచారం అందించేసరికి కాస్త ఆలస్యమైంది. తిరిగి ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు జలపాతం దగ్గర ఆమెను గుర్తించి రక్షించారు. టల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కొమ్మల్లో చిక్కుకుని... కొండ మీద ఉన్న ఓ రాయిపై నిల్చుని ఫోటో తీసుకునే సమయంలో ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న రాక్సీ జలపాతం చెట్ల భాగంలో ఆమె చిక్కుకుపోయారు. అలా కొన్ని గంటలు స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె.. మేలుకువ రాగానే కిందకు దిగి సాయం కోసం కేకలు వేయటం ప్రారంభించారు. అప్పటికే పూర్తిగా నీరసించిన ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. పైన హెలికాఫ్టర్ శబ్ధం విన్న ఆమె కింద ఉన్న ఇసుక తిన్నెలపై రక్షించాలంటూ రాతలు రాశారు. అయితే అవి సైన్యం కంటపడలేదు. చివరకు శక్తిని కూడగట్టుకుని ఆమె వేసిన కేకలు స్థానికుల చెవిన పడటంతో ప్రాణాలతో ఆమె బయటపడగలిగారు. -
ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
క్వీన్స్లాండ్: మాములుగా మనం పాములను చూస్తే పది ఆమడల దూరం పరుగెత్తుతాం. ఇక కొండచిలువ లాంటి పెద్ద పాములను చూస్తే! గుండె గుభేల్ మంటుంది. కానీ ఒక మహిళ ఏకంగా కొండచిలువను పట్టుకుని భుజంపై వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్వీన్స్లాండ్కి చెందిన బ్రీడీ మారో ఒక ఎలక్ట్రీషియన్. పాములను పట్టుకోవడంలో నైపుణ్యం ఉంది. ఓ ఇంట్లోకి వచ్చిన కొండచిలువ పిల్లిని తిని ఇంటి అడుగుభాగంలోకి వెళ్లింది. అది గమనించిన మారో పాకుతూ ఇంటి అడుగుభాగానికి వెళ్లి పామును పట్టుకుంది. ఒక చేత్తో దాని మెడను గట్టిగా పట్టుకొని తన భుజాన వేసుకుంది. తర్వాత దానిని ఒక బుట్టలోవేసి, తీసుకెళ్లి పొదల్లో వదిలేసింది. ఈ తతంగాన్ని ఒకరు వీడియో తీయగా, దీన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.‘గత 15 ఏళ్లుగా వన్యపాణ్రుల సంరక్షకురాలిగా పని చేస్తున్నాను. ఇలాంటి పాములు ఎన్నో పట్టుకున్నాను. ఈ సీజన్లో పాములు బయటకు వస్తాయి. అందరు జాగ్రత్తగా ఉండాలని’ బ్రీడీ మారో సూచించారు. -
ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
-
అంత పెద్ద పాముతో ఫొటో దిగిన పోలీస్!
దాదాపు ఐదుమీటర్ల పొడవున్న ఓ భారీ కొండచిలువతో ఓ పోలీసాయన ఫొటో దిగాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా హల్చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఓ పోలీసు అధికారి, ఆయన జూనియర్ కలిసి అడవిలో గస్తీ చేపడుతున్నారు. ఈ సమయంలో ఓ భారీ కొండచిలువ దానిమానాన అది పోతూ వారి కంట కనబడింది. అదే అదనుగా భావించిన సదరు పోలీసు అధికారి పాము సమీపంలో ఫొజుఇవ్వగా.. జూనియర్ ఓ ఫొటో తీశాడు. గతంలో తీసిన ఈ ఫొటోను క్వీన్స్లాండ్ పోలీసులు తమ సోషల్ మీడియా పేజీలో సోమవారం షేర్ చేసుకున్నారు. ‘మా డ్యూటీ అంత బోరింగ్ ఏమీ ఉండదు. సింగిల్ షిఫ్ట్‌లో ఏం ఎదురుపడుతుందో చెప్పలేం’ అంటూ పోలీసులు పెట్టిన ఈ పోస్ట్‌ను ఇప్పటికే 20లక్షలకుపైగా మంది ఈ ఫొటోను చూశారు. 10వేల మంది కామెంట్లు చేశారు. ‘మోన్స్టర్ పైథాన్’ ఓ మైగాడ్, హెల్ నో అంటూ కామెంట్లు పెట్టారు. క్వీన్స్‌ల్యాండ్ ఉత్తర నగరం కైర్న్స్‌కు 345 కిలోమీటర్ల దూరంలోని వుజుల్ వుజుల్ అడవిలో ఈ కొండచిలువ అధికారులకు దర్శనమిచ్చింది. ఇక్కడ ఉండే క్రూబ్ పైథాన్లు ఆస్ట్రేలియాలోనే పొడవైనవి. ఒక్కొక్కటి ఏడు మీటర్ల (23అడుగుల) వరకు పెరుగుతాయి. -
ఫోర్ ఇడియట్స్.. ప్రాణాలతో చెలగాటం!
క్వీన్స్ లాండ్ : ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అటువైపుగా వెళ్లేందుకు దాదాపుగా ఎవరూ సాహసించరు. కానీ, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే మూర్ఖులు కాక ఏమంటారు చెప్పండి. క్వీన్స్ లాండ్‌లోని పోర్ట్ డగ్లస్ మెరీనా దగ్గర రెండు వారాల క్రితం వృద్ధురాలు మొసలి బారిన పడి చనిపోయింది. ఆ సరస్సులో మొసళ్ల బారిన పడి చాలా మంది గాయపడుతున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ ఘోరం జరిగింది. అయితే ఆ తర్వాత వాటిని పట్టుకునేందుకు అక్కడక్కడా ఉచ్చులను(బోనులను) ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న నలుగురు యువకులు ఆ సరస్సులోకి దిగి సుమారు గంటకు పైగా గడిపారు. అక్కడే ఉన్న ఓ బోనులో కూర్చుని ఫోటోలు దిగారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన వాళ్లు.. ఆ ఫోటోలను తమ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వారి వేషాలపై విమర్శలు గుప్పించారు. వారు ఫోటోలు దిగిన ప్రాంతానికి 4 మీటర్ల దూరంలోనే మొసలి ఇంతకు ముందు వృద్ధురాలిని చంపటం విశేషం. ఘటనపై డగ్లస్ షైర్ మేయర్ జూలీ ల్యూ స్పందిస్తూ... వారు సరదాగా చేసిన ఆ యత్నం చాలా చెండాలంగా ఉంది. ప్రాణాలతో చెలగాటం సాహసమని వారి భావించి ఉండొచ్చు. కానీ, వారి చేసిన పని మూర్ఖపు చర్యే. వారిని వదిలే ప్రసక్తేలేదు. చర్యలు తీసుకుని తీరతాం అని అన్నారు. నిబంధనల అతిక్రమించి నీటిలో దిగి బోను దగ్గరికి వెళ్లినందుకుగానూ వారికి 15 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫోటోను ముందుగా పోస్ట్ చేసిన స్టేసీ డబ్ల్యూ క్లేటన్ అనే యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇడియట్స్ ఆఫ్ ది సెంచరీ యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Srsly? The meat we put in these traps is bait. For crocodiles. Don’t swim in them! It’s stupid, and illegal. @qldpol @7NewsCairns pic.twitter.com/nQsUZwI3Wc — Steven Miles (@StevenJMiles) 23 October 2017