చావు నుంచి కాపాడుకోవ‌డానికే స్పీడుగా వెళుతున్నా.. | Australian Man Attacked By Deadly Snake While Driving | Sakshi
Sakshi News home page

చావు నుంచి కాపాడుకోవ‌డానికే స్పీడుగా వెళుతున్నా..

Published Tue, Jul 7 2020 8:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ ప్రాంతం వేలాది వాహ‌నాల‌తో నిత్యం ర‌ద్దీగా ఉంటుంది. అలాంటి ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక వ్య‌క్తి ప‌రిమితికి మించిన వేగంతో వాహ‌నాన్ని న‌డిపిస్తూ ర‌య్యిన దూసుకెళ్తున్నాడు. అత‌ని స్పీడును గ‌మ‌నించిన పోలీసులు ఆ కారును వెంబ‌డించారు. కొద్ది దూరం వెళ్లాక ఆ వ్య‌క్తిని ఆపిన పోలీసులు ఎందుకంత స్పీడుగా వెళుతున్నావ‌ని ప్ర‌శ్నించారు.  'చావు నుంచి న‌న్ను నేను  కాపాడుకోవ‌డానికే స్పీడుగా వెళుతున్నా' అంటూ స‌మాధాన‌మిచ్చాడు. అయితే అత‌ని జ‌వాబు అర్థం కాక మ‌ళ్లీ అడిగారు. దీంతో స‌ద‌రు వ్య‌క్తి అసలు విష‌యాన్ని వెల్ల‌డించాడు. 

'నా పేరు జిమ్మీ.. క్వీన్స్‌లాండ్‌కు చిన్న‌ప‌ని మీద వ‌చ్చాను. ప‌ని ముగించుకొని వెళ్తున్న నాకు కారులో స‌డెన్‌గా ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన  ఈస్ట్ర‌న్ బ్రౌన్ పాము క‌నిపించింది. అది నా వాహ‌నంలోకి ఎలా వ‌చ్చిందో తెలియ‌దు. దానిని ప‌ట్టుకొని చంపే ప్ర‌య‌త్నంలో కాటు వేసినా చివ‌రికి ఎలాగోలా దానిని చంపేశాను. అయితే దాని విష ప్ర‌భావం మెల్లిగా మొద‌ల‌య్యింది. నా కాళ్లు వ‌ణ‌క‌డం, శ‌రీరం మొద్దుబారిన‌ట్లుగా అయిపోవ‌డం ప్రారంభించింది. దీంతో ఎలాగైనా చావు నుంచి త‌ప్పించుకోవాల‌నే ఉద్దేశంతోనే కారును గంట‌కు 120 కి.మీ వేగంతో న‌డిపాను.' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ వ్య‌క్తిని త‌మ వాహ‌నంలో ఎక్కించుకొని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement