over speed
-
Hyderabad: కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది.. పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్‌లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేశారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1 నుంచి లాంబోర్గిని కారు (టీఎస్09 జీడీ 9777)లో ఓ యువకుడు మితిమీరిన వేగంతో, భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. ఈ కారును ఓ యువకుడు ఫొటోలు తీశాడు. ‘కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు’ అంటూ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. సోమవారం రోజంతా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కారు నడిపిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. లాంబోర్గిని కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు వేట ప్రారంభించారు. ట్వీట్ చూసిన సదరు కారు నడిపిన యువకుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Video: చెక్‌పోస్టు వద్ద ఆగకుండా.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతి వేగం, అజాగ్రత్త, రాంగ్ రూట్లో ప్రయాణించడం నేరం. దీని వల్ల మనతోపాటు ఎదుటివాళ్ల ప్రాణాలను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రోడ్డు భద్రతా చర్యలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. నాకెందుకులే అని నిర్లక్ష్యంగా ప్రయాణించి అనేక అనర్థాలకు కారణకులుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వెళ్లడమే కాకుండా.. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై ఓ కారు దూసుకెళ్లింది. వివరాలు.. బుధవారం తెల్లవారు జామున ట్రాఫిక్ పోలీసులు చిలకలగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతివేగంతో వెళ్తున్న ఓకారు చెక్‌పోస్టు వద్ద హైస్పీడ్‌తో దూసుకొచ్చింది. కారును గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ దానని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేష్‌కు తీవ్ర గాయాలవ్వగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓవర్ స్పీడ్‌తో నడిపిన కారు డ్రైవర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు అతడిపై కఠిన చర్చలు తీసుకోవాలని కోరుతున్నారు. Early hours of Wednesday, speeding vehicle didn't stop at #checkpost in #Chilakalaguda & instead rammed into @hydcitypolice constable Mahesh & sped past; he was shifted to a private hospital nearby & is thankfully said to be out of danger @ndtv @ndtvindia #TelanganaElections2023 pic.twitter.com/OY4fdxt4FE — Uma Sudhir (@umasudhir) October 20, 2023 -
అతివేగంతో అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
నర్సంపేట రూరల్ : చివరి సంవత్సరం.. కళాశాలకు చివరి రోజు.. దీంతో ఓ యువకుడు ఉదయమే కాలేజీకి చేరుకున్నాడు. అక్కడ స్నేహితులతో ఆనందంగా గడిపాడు. స్మృతులను నెమరువేసుకుని ఎంజాయ్ చేశాడు. ఫొటోలు దిగిన అనంతరం మిత్రులకు వీడ్కోలు చెప్పాడు. మధ్యాహ్నం వ్యక్తిగత పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై వరంగల్ వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డుతోపాటు కల్వర్టును ఢీకొని కాల్వలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నర్సంపేట మండలంలోని లక్నెపల్లి శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన చింతల చెరువు కుంభం సైదులు, ఉమాదేవి దంపతులకు కుమారుడు సాయికిశోర్ (22), కూతురు వైష్ణవి ఉన్నారు. సాయికిశోర్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. లక్నెపల్లిలో కిరాయికి ఉంటూ రోజూ తన బైక్‌పై కళాశాలకు వెళ్లి వస్తాడు. ఈ క్రమంలో కళాశాలలో చివరి రోజు కావడంతో వైవా పూర్తి చేసుకుని స్నేహితులతో ఆనందంగా గడిపాడు. అనంతరం వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై వరంగల్‌కు వెళ్లి వస్తున్నాడు. అతివేగంగా వస్తూ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డుతోపాటు కల్వర్టు ఢీకొని కాల్వలో పడ్డాడు. గమనించిన స్థానికులు 108లో నర్సంపేటకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న నర్సంపేట రూరల్ ఎస్సై సురేశ్ నాయక్ మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్లవాగ్రానైట్స్ అధినేత డాక్టర్ కొడలూరు సుబ్బారెడ్డి సోదరుడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చెంగల్పట్టు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బారెడ్డి తమ్ముడు నరోత్తంరెడ్డి భార్య కె.భారతి రెడ్డి (60), కుమారుడు డాక్టర్ కె. శ్రీహిమవర్ష్ (27) దుర్మరణం చెందారు. సుబ్బారెడ్డి సోదరుడి కుటుంబం చెన్నై మైలాపూర్, అభిరామపురంలో ఉంటున్నారు. చాలాకాలం క్రితం సోదరుడు నరోత్తంరెడ్డి మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ డాక్టర్ అయిన కె. శ్రీహిమవర్ష్ తన తల్లి భారతి రెడ్డితో కలిసి జీప్‌లో దిండివనం సమీపంలోని ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం సోమవారం తిరుగుపయనం అయ్యారు. సాయంత్రం మార్గం మధ్యలోని చెంగల్పట్టు జిల్లా పళవేలి గ్రామం వద్ద వీరి జీప్ ప్రమాదానికి గురైంది. అతివేగంగా వచ్చిన ఓ కారు జీప్‌ను ఢీకొట్టి వెళ్లింది. దీంతో అదుపు తప్పిన జీపు చెట్టును ఢీకొని డివైడర్ దాటి అవతలి మార్గంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న తల్లి, కుమారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ సమాచారంతో సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చెంగల్పట్టు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. వీరి భౌతికకాయాలను ఆళ్వార్‌పేట, అభిరామపురం, సుబ్రమణ్యం వీధి, నెంబర్ 19 చిరునామాలో ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్ధం ఉంచారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. టీనగర్ కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన కె.శ్రీహిమవర్ష్ ఎం.ఎస్ చదివేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండిః అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు.. -
ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా!
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ‘ఇప్పుడే వస్తానమ్మా.. అంటూ బండి తీసుకుని బైటికిపోయినవ్. చూసిచూసి అర్ధరాత్రి ఐతంది బిడ్డా.. ఎక్కడికి పోయినవ్ రా.. అని ఫోన్ చేసిన. అన్నం తినకుండా పోయినవ్.. బుక్కెడంత తిందువురారా అని బ్రతిమిలాడిన. దగ్గరనే ఉన్నా అంటివి. గంటలో ఇంటికాడుంటా అంటివి. వచ్చి పడుకున్నావనుకున్నా కొడుకా.. ఇట్లా.. నీ బతుకు తెల్లారుతదనుకోలేదు బిడ్డా.. అంటూ ఆ కన్నతల్లి కడుపు వేదన కన్నీరు పెట్టించింది. బైక్ ప్రమాదంలో చనిపోయిన బక్కతట్ల ఉమామహేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా.. కొడుకు చదువుకుంటున్నాడని కూరగాయలు అమ్మిన పైసలతో బైక్ కొనిస్తే.. అదే అతడి ప్రాణాలు తీసిందని కన్నీరు మున్నీరయ్యారు. ప్రాణంతీసిన అతివేగం.. అర్ధరాత్రి.. అతివేగం.. ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మరొకరు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ బైక్‌పై ముగ్గురు యువకులు మితిమీరిన వేగంతో ఓ షాపు గోడను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని రాంనగర్‌కు చెందిన గొల్లెన శివరాం(19), మల్లికార్జునగర్‌కు చెందిన బక్కతట్ల ఉమామహేశ్(21), కొత్తకూరగాయల మార్కెట్‌కు చెందిన బీమ్ల సిద్దూ(17) స్నేహితులు.ముగ్గురు కలిసి సోమవారం రాత్రి తొమ్మిదిగంటలకు మహేశ్ బైక్‌పై బయటకు వెళ్లారు. పదకొండు గంటల సమయంలో ఉమామహేశ్‌కు తల్లిఫోన్చేసి త్వరగా ఇంటికి రమ్మని సూచించగా.. గంటలో వస్తానని వెళ్లలేదు. చదవండి: మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ అందంగా మాట్లాడుతారు మంగళవారం వేకువజామున ముగ్గురూ కలిసి బైక్‌పై స్టేడియం వైపు నుంచి రమేశ్నగర్వైపు అతివేగంగా వెళ్తుండగా చౌరస్తా వద్ద అదుపు తప్పి వెంకటేశ్వర్ సైకిల్‌షాప్ గోడకు ఢీకొంది. బైక్ నడుపుతున్న శివరాం గోడకు అతుక్కుని అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు. వెనకాల కూర్చున్న ఉమామహేశ్ తలకు బలమైన గాయాలు కాగా కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. బీమ్ల సిద్దూతలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఉమామహేశ్ తండ్రి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్‌సీఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివరాం, సిద్దూ పై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ రెండు కుటుంబాల్లో తీరని విషాదం ఉమామహేశ్ తండ్రి స్థానిక మల్లికార్జున్‌నగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఉమామహేశ్ వరంగల్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శివరాం తండ్రి సమ్మయ్య మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలోనూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్దూ కుటుంబం కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసముంటున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులు లేకపోడంతో ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు తీస్తున్న నైట్రైడ్లు స్పోర్ట్స్‌బైక్‌లపై నైట్రైడ్లు యువకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతకు బైక్‌రైడింగ్ ఫ్యాషన్‌గా మారింది. కొత్త బైక్‌లకు తోడు తమకున్న అలవాట్లు ప్రాణాలు తీస్తున్నాయి. మూడేళ్ల కిందట ఇలాగే రామమందిర్ ఏరియా సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుపై ఉన్న పోల్‌ను ఢీకొని ఇద్దరు మృతి చెందారు. -
కేవలం 4 నెలల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఎన్ని లక్షలు ఫైన్ కట్టారో తెలుసా!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు స్పీడ్ గన్ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. చదవండి: అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు -
ఐదుగుర్ని బలిగొన్న అతివేగం
గుమ్మఘట్ట: అతి వేగంతో ప్రయాణిస్తున్న ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావి సమీపాన సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోయ రాజశేఖర్ (27), అతని కుమార్తె రష్మిత (5), గొల్ల నాగమ్మ (64), ఆమె కుమార్తె గొల్ల లక్ష్మీదేవి (64), నాగమ్మ మనవడు మహేంద్ర (9) మృత్యువాత పడగా.. బోయ రూప, ఆమె కుమారుడు రాము తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లికి చెందిన బోయ రాజశేఖర్, రూప దంపతులు కుమార్తె రష్మిత, కుమారుడు రాముతో కలిసి శనివారం సొంత ఆటోలో పైదొడ్డి గ్రామానికి వెళ్లారు. ఆటోను అక్కడే బంధువుల ఇంటివద్ద నిలిపి.. మరో 15 మంది బంధువులతో కలసి క్రూయిజర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రంలోని హులిగెమ్మ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ తమ కుమారుడైన రాముకు కేశఖండనం చేయించి ఆదివారం రాత్రి పైదొడ్డి గ్రామానికి తిరిగొచ్చి రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం రాజశేఖర్ దంపతులు పిల్లలతో తమ ఆటోలో సొంతూరికి పయనమయ్యారు. వారి వెంటే బయలుదేరిన రాజశేఖర్ పినతల్లి ఈశ్వరమ్మ మార్గంమధ్యలో కలుగోడు క్రాస్ వద్ద దిగిపోయింది. బతిమాలి ఆటో ఎక్కి.. ఆటో మరో 15 కిలోమీటర్లు వెళ్లి ఉంటే అందరూ సురక్షితంగా ఇంటికి చేరేవారు. కానీ.. పూలకుంట వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ముప్పలకుంటకు చెందిన గొల్ల నాగమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీదేవి, మనవడు గొల్ల మహేంద్ర (9) ఆ ఆటోలో ఎక్కేందుకు ప్రయత్నించారు. వద్దని ఎంత చెబుతున్నా వినకుండా బతిమాలి అదే ఆటోలో ఎక్కారు. కిలోమీటర్ దూరం కూడా వెళ్లకముందే గోనబావి సమీపాన ఆటో, మహీంద్ర కారు అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న బోయ రాజశేఖర్, కుమార్తె రష్మిత, గొల్ల నాగమ్మ, ఆమె మనవడు మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. బోయ రూప, కుమారుడు రాము, గొల్ల లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గొల్ల లక్ష్మీదేవి చనిపోయింది. మెరుగైన వైద్యం కోసం రూపను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి, రామును కర్నూలుకు తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారు డ్రైవర్, వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సంతాపం తెలిపారు. -
ఒకదానివెనుక మరోటి.. నుజ్జునుజ్జయిన 7 కార్లు
చేవెళ్ల: అతివేగం.. ఏడు కార్లను ధ్వంసం చేయగా పలువురిని గాయపడేలా చేసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు–అంతారం బస్‌స్టేజీల మధ్య చోటు చేసుకుంది. చేవెళ్ల నుంచి ఆదివారం వికారాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న ఆరుకార్లు అంతే వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టాయి. కార్లు నుజ్జునుజ్జాయంటే ఏ మేరకు వేగంతో వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయలయ్యాయి. ఓ కారులో ఉన్న బాలుడి చేయికి, కాలికి.. ఓ మహిళ తలకు గాయమైంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై నుంచి కార్లను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనులు త్వరగా జరిగితేనే ప్రమాదాల నివారణ సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇండికేటర్ వేసినా ఫలితం లేదు.. వీళ్లు మారరా?
రోడ్డుపై అతి వేగం ప్రమాదకరం అని, నెమ్మదిగా వెళ్లాలని తెలిసినా కొంత మంది మారడం లేదు. రద్దీ రోడ్లపై, కూడళ్లలో ఇండికేటర్లు వేసినా పట్టించుకోకుండా వెనుక నుంచి ఓవర్ టేక్ చేసుకుంటూ ఓవర్ స్పీడ్‌లో వెళ్లిపోతున్నారు. సంగారెడ్డిలో ఈ ఓవర్ స్పీడ్ వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరు గాయాలపాలవుతూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి నుంచి బైక్‌పై వెళ్తున్నారు. కొత్త బస్టాండ్ దగ్గర ఇండికేటర్ వేసి టర్నింగ్ తీసుకుంటుండగా, వెనుక నుంచి ఇద్దరు స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టారు. అసలే ఒకరికి కాలు విరిగి ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా.. వేరొకరి అతివేగం వల్ల ఆ వ్యక్తి మళ్లీ గాయాలపాలయ్యాడు. -శివప్రసాద్, సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల
గుంటూరు రూరల్: మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్ సాదిక్ (18) గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెంలో బంధువుల ఇంట జరిగిన వివాహానికి రెండు రోజల కిందట కారులో వచ్చాడు. వివాహ అనంతరం కార్యక్రమాలు చూసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి కాకుమాను వెళదామనుకున్నాడు. ఈలోగా మధ్యాహ్నం బంధువుల ఇంట్లోకి కొన్ని వస్తువులు అవసరమవ్వడంతో వాటిని తీసుకొచ్చేందుకు బేగ్ ఖాదర్ నాగుల్ బాషా (15), పఠాన్ లాలు (19)లతో కలసి కారులో బయలుదేరాడు. ఇందులో పఠాన్ లాలు కారును నడుపుతున్నాడు. మితిమీరిన వేగంతో వెళుతూ వెంగళాయపాలెంలోని జగ్జీవన్‌రామ్ సెంటర్లో రోడ్డు పక్కన ఉన్న విగ్రహం దిమ్మెను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ఖాదర్ నాగుల్ బాషా, సాదిక్‌లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా లాలుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఓ యువకుడి తలతెగి రోడ్డుపై పడిందంటే ఎంత వేగంగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదంలో మృతి చెందిన నాగుల్ బాషా తండ్రి మహమ్మద్ బేగ్. ఆయన ముగ్గురు కుమారుల్లో రెండోవాడైన బాషా 9వ తరగతి చదువుతున్నాడు. తనయుడు మృత్యువాతకు గురవ్వడం చూసి ఆయనతో పాటు కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. మృతి చెందిన సాదిక్‌ను చూసేందుకు సైతం తండ్రి మస్తాన్‌వలి తల్లడిల్లిపోయారు. ప్రమాదంలో కారును నడుపుతున్న లాలుకు గతంలో ఇటువంటి ప్రమాదం జరిగి ఒక కాలును కూడా కోల్పోయాడని సమాచారం. జైపూర్ ఫుట్‌తో కారును నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాల్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
నెత్తుటి దారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారులు రక్తమోడుతున్నాయి.. నిత్యం ఏదోచోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా రోజూ 17 మంది మృత్యువాత పడుతున్నారు. ము ఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ప్రజారవాణాపై ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. దీంతో రోడ్లపై రద్దీ పెరిగి, ప్రమాదాలకు దారితీస్తోం ది. అతివేగం ప్రమాదాలకు తొలి కారణం కాగా.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనల ఉల్లంఘన తరువాత కారణాలని రోడ్డు భద్రత అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారులు వాటిని పాటించకపోవడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోంది. 90% అతివేగమే కారణం రోడ్డు ప్రమాదాల్లో నూటికి 90 శాతం అతివేగమే కారణం. ఇటీవల సిద్దిపేట వద్ద అతివేగంగా కారు డ్రైవింగ్ చేసి దాన్ని రోడ్డు పక్కన కల్వర్టుకు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తుండగా డీసీఎం వ్యాను నిర్లక్ష్యంగా దూసుకురావడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగింది పట్టపగలే.. అందులోనూ అది విశాలమైన రోడ్డే. మరోవైపు హైదరాబాద్–బీజాపూర్ హైవేపై లారీని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాలకు అతి వేగంతో పాటు నిర్లక్ష్యం కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు కమిషనరేట్లు, జిల్లాల వారీగా మృతులు మరణాల్లోనూ గ్రేటరే.. రోడ్డు ప్రమాదాల మరణాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచాయి. కమిషనరేట్ల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్ (193), సైబరాబాద్ (582), రాచకొండ (466) కమిషనరేట్లు మృతుల సంఖ్య అధికంగా ఉంది. గ్రేటర్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డిలోనూ మృతుల సంఖ్య 300గా ఉంది. మొత్తం రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో చివరి స్థానాల్లో నారాయణపేట (60), ములుగు (62) జిల్లాలు నిలిచాయి. ఇక్కడ గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్లు, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, నల్లగొండల్లో జాతీయ రహదారులున్నాయి. అందుకే, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, మృతులు అధిక సంఖ్యలో ఉన్నారు. లాక్డౌన్ తర్వాత పెరిగిన ప్రమాదాలు.. మార్చిలో లాక్డౌన్ విధించిన దరిమిలా రోడ్డు ప్రమాదా లు గణనీయంగా తగ్గాయి. వాహన సంచారం, రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు చాలా మేరకు తగ్గాయి. లాక్డౌన్ ఆంక్షలు క్రమం గా ఎత్తేసినా.. కరోనా భయం మాత్రం పోలేదు. దీంతో ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాలకు ప్రజలు ప్రా ధాన్యమిస్తున్నారు. ఫలితంగా రోడ్లపై రద్దీ పెరిగింది. సరైన అనుభవం లేనివారు కూడా జాతీయ రహదారులపై వాహనాలను వేగంగా పోనిస్తున్నారు. ఫలితంగా లాక్డౌన్ తర్వాత ప్రమాదాలు పెరిగాయి. నెలకు 1,486 ప్రమాదాలు రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు 14,864 ప్రమాదాలు జరిగాయి. ప్రతీనెల 1,486 ప్రమాదాలు జరుగుతుండగా.. రోజుకు 49 మంది, ప్రతీ గంటకు రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6,809 మంది మరణించగా.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 5,209 మంది రోడ్డు ప్రమాదాల్లో బలయ్యారు. ఈ లెక్కన ప్రతి నెలకు 520 మంది మరణిస్తుండగా.. ప్రతీరోజూ 17 మందికి పైగా రహదారుల వెంబడి తుది శ్వాస విడుస్తున్నారు. ఈ గణాంకాలను విశ్లేషించగా.. ప్రతీ 72 నిమిషాలకు ఒక ప్రాణాన్ని రోడ్డు మింగేస్తోంది. అతివేగాన్ని నియంత్రించలేక.. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో నూటికి 90 శాతం కారణం అతివేగమే. జాతీయ రహదారులపై చాలామంది 120 కి.మీ.లకు పైగా వేగంతో దూసుకెళ్తున్నారు. ఆ వేగంలో వెళ్తున్నపుడు ఆకస్మికంగా మరో వాహనం ఎదురైనపుడు నియంత్రించడం కష్టంగా మారుతుంది. ఫలితంగా బ్రేకులు వేసినా.. ఎలాంటి ప్రయోజనముండదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. –సందీప్ శాండిల్య, ఏడీజీ (రోడ్ సేఫ్టీ) -
జరిమానాల కొరడాతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు 8 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధికారులు అంటున్నారు. గత నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు, అలాగే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 వరకు నమోదైన ఉల్లంఘనల్ని రవాణా శాఖలోని ట్రాఫిక్ రీసెర్చి వింగ్ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఉల్లంఘనలతో రోజుకు 9మంది మృతి ⇔ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తేల్చింది. ⇔ ఈ కారణంగా రోజుకు 9మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ⇔ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానాలు భారీగా పెంచింది. ⇔ 2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. కాగా నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి. ⇔ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నెలకు సగటున 7 వేల వరకు నమోదు అయ్యేవి. జరిమానాల పెంపుతో దాదాపు నెల రోజుల్లో 6,400 మాత్రమే నమోదయ్యాయి. అంటే 8 శాతం వరకు తగ్గాయన్న మాట. ⇔ ఇక భారీ జరిమానాలు విధిస్తుండటంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగింది. ⇔ గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా విధించే వారు. ఇప్పుడు రూ.1,000కి పెంచడం సత్ఫలితాన్నిచ్చింది.. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు హెల్మెట్ ధరించని కేసులు 1,947 నమోదు కాగా.. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 మధ్య 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే 15 శాతం మేర కేసులు తగ్గాయన్న మాట. ⇔ ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలకు జరిమానా రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు పెంచడంతో ఈ కేసులు 10 శాతం తగ్గిపోయాయి. జరిమానా పెంచక మునుపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు 900 వరకు మాత్రమే నమోదవుతున్నాయి. పదే పదే ఉల్లంఘిస్తే జైలే జరిమానాల పెంపుతో సత్ఫలితాలు వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల సంఖ్య తగ్గిపోతోంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 20 శాతం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జైలుకు పంపేలా ఆలోచన చేస్తున్నాం. -ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు దాచేపల్లి మండలం గామాలపాడు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. అనంతరం పక్కనున్న నివాసాలపైకి దూసుకుపోయి గోడలకు ఆనుకుని తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయింది. దాంతో కారులో ఉన్న వారిలో ఒక యువకుడితో సహా మరొక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.(చదవండి: నా బావ ఏడీ.. అత్త, మామకు ఏమైంది?) తమది నెల్లూరని, హైదరాబాదు నుంచి వస్తున్నామని గాయపడిన ఒక మహిళ చెప్పిందని స్థానికులు అంటున్నారు. అంతకుమించి కారులోని వారి వివరాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. -
చావు నుంచి కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా..
-
చావు నుంచి కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా..
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ ప్రాంతం వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రహదారిపై మంగళవారం ఉదయం ఒక వ్యక్తి పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడిపిస్తూ రయ్యిన దూసుకెళ్తున్నాడు. అతని స్పీడును గమనించిన పోలీసులు ఆ కారును వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక ఆ వ్యక్తిని ఆపిన పోలీసులు ఎందుకంత స్పీడుగా వెళుతున్నావని ప్రశ్నించారు. 'చావు నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా' అంటూ సమాధానమిచ్చాడు. అయితే అతని జవాబు అర్థం కాక మళ్లీ అడిగారు. దీంతో సదరు వ్యక్తి అసలు విషయాన్ని వెల్లడించాడు. (పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..) 'నా పేరు జిమ్మీ.. క్వీన్స్‌లాండ్‌కు చిన్నపని మీద వచ్చాను. పని ముగించుకొని వెళ్తున్న నాకు కారులో సడెన్‌గా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఈస్ట్రన్ బ్రౌన్ పాము కనిపించింది. అది నా వాహనంలోకి ఎలా వచ్చిందో తెలియదు. దానిని పట్టుకొని చంపే ప్రయత్నంలో కాటు వేసినా చివరికి ఎలాగోలా దానిని చంపేశాను. అయితే దాని విష ప్రభావం మెల్లిగా మొదలయ్యింది. నా కాళ్లు వణకడం, శరీరం మొద్దుబారినట్లుగా అయిపోవడం ప్రారంభించింది. దీంతో ఎలాగైనా చావు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే కారును గంటకు 120 కి.మీ వేగంతో నడిపాను.' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తమ వాహనంలో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (కూతురి ముందు తల్లి ఓడిపోవాల్సిందే) -
రహదారులు చంపేస్తున్నాయి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని రోడ్‌సేఫ్టీ విభాగం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రోడ్‌సేఫ్టీ విభాగం గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. 2019లో రోడ్డు ప్రమాదాల కారణంగా తెలంగాణలో చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 6,800గా ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల సగటున రోజుకు 16 మంది మరణిస్తుండగా.. 61 మందికి గాయాలవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు, ట్రాఫిక్, రవాణారంగ నిపుణులు చెబుతున్నా.. చాలామంది పెడచెవిన పెట్టడంతో ఇది రోజురోజుకూ విజృంభిస్తోంది. సిరిసిల్ల జిల్లాలో జీరో మరణాలు.. కనీసం ఈ ఏడాదిలోనైనా ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంతా భావిం చారు. ముఖ్యంగా పోలీసులు నూతన సంవత్సరం రోజున ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య తక్కువగా నమోదైంది. తరువాత వరుసగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాలు గతేడాది మరణాల సగటును అందుకునేలా చేశాయి. ఈ ఏడాది జనవరిలో 1,907 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 484 తీవ్ర ప్రమాదాలు కాగా.. 1,423 సాధారణ ప్రమాదాలు. ఇందులో 491 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,143 మంది క్షతగాత్రులు అయ్యారు. జిల్లాలపరంగా రోడ్డు ప్రమాదాల మరణాలను పరిశీ లిస్తే.. రాచకొండ (53), సైబరాబాద్ (43), సంగారెడ్డి (32), వరంగల్ (29), నిజామాబాద్ (25), మెదక్ (25) తరువాత స్థానాల్లో నిలిచాయి. జనవరి నెలలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేసులు, చలానాలంటే లెక్కలేదు..: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన విషయంలోనూ ప్రజలకు లెక్కలేకుండా పోయింది. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రహదారులపై పార్కింగ్, రవాణా వాహనాల్లో మనుషుల తరలింపు, సీటు బెల్టు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీరికి చలానాలన్నా.. కేసులన్నా లెక్కలేకుండా పోతోంది. 31 రోజుల్లో 87,608 ఓవర్స్పీడు కేసులు నమోదయ్యాయంటే వాహనాల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
11 నెలలు.. రూ. 100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: జరిమానాలకు జనం ఏమాత్రం జడవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కేవలం 11 నెలల్లో రూ.100 కోట్లకు పైగా చలానాలు విధించారంటే ఉల్లంఘనులు ఏస్థాయిలో చెలరేగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న వాహనాలు, మితిమీరిన వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ వరకు ఒక్క ఓవర్స్పీడ్లోనే అత్యధికంగా 29 లక్షల కేసుల్లో రూ.82 కోట్ల చలానాలు విధించడం వాహనదారుల మితిమీరిన వేగానికి నిదర్శనం. ప్రతిరోజూ 58 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా 16 మంది మరణిస్తున్నారు. 60 మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి నిమిషానికీ 6 ఓవర్‌స్పీడ్ కేసులు నమోదవడం వాహనదారుల దూకుడును సూచిస్తోంది. ప్రమాదాలకు కారణాలు... వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తే.. జాతీయ రహదారులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుండటం గమనార్హం. సైబరాబాద్ (570), రాచకొండ (503), సంగారెడ్డి (310), వరంగల్ (239), ఖమ్మం (204), సిద్దిపేట (185) నిజామాబాద్ (178)ల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. అధికలోడు, మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా రోడ్డు ప్రమాదాలు, చలానాలు అధికంగా నమోదయ్యేందుకు కారణమవుతున్నాయని రోడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. -
అదే ఎక్కువగా ప్రాణాలు తీస్తోంది!
సాక్షి, అమరావతి: మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధప్రదేశ్‌లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 82 శాతం మంది ఈ రెండు కారణాలతో దుర్మరణం చెందారు. ఒక్క మితిమీరిన వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో 72 శాతం మంది మృతి చెందినట్టు కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అధిక వేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్.. దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. తమిళనాడు 2, కర్ణాటక 3, తెలంగాణ 7, కేరళ 13 స్థానాల్లో ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రమాదాల్లో 80 శాతంపైగా సవ్యంగా, నేరుగా ఉన్న రోడ్లపైనే జరిగాయి. అదికూడా పగటి సమయంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు జరిగినవే కావడం గమనార్హం. దీనిబట్టి రాష్ డ్రైవింగ్ ఎంతలా ప్రమాదాలకు కారణం అవుతుందో అర్థమవుతోంది. రోజుకు 9 మంది మృతి రోడ్డు ప్రమాదాలకు మరో కారణం తాగి నడపడం. డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా గతేడాది ఏపీలో 1,345 ప్రమాదాలు జరిగి 85 మంది మృతి చెందారు. ఇక రక్షణ పరికరాలైన హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో 43 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించకపోవడంతో 1707 మంది బైకర్లు, 678 మంది రైడర్లు మృతి చెందారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో 395 మంది డ్రైవర్లు, 451 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. రక్షణ పరికరాలు వాడకపోవడం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 9 మంది చనిపోతున్నారు. పల్లె దారుల్లోనూ మృత్యుఘంటికలు గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. రూరల్‌లో 70 శాతం ప్రమాదాలు చోటు చేసుకోగా 76 శాతం మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో ఏపీ 7వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంత రోడ్డు ప్రమాదాల్లో 9వ స్థానంలో ఉన్నట్టు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. పరిమిత వేగం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం ఎంతో ముఖ్యమో ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. (చదవండి: ప్రేమ హత్యలే అధికం!) -
ఫైన్ వేసినా.. పగ్గాల్లేవ్..
సాక్షి, హైదరాబాద్ : చేతిలో 2000 సీసీ ఇంజిన్ కారు, కళ్లెదురుగా స్పీడు బ్రేకర్లు లేని రింగు రోడ్డు.. ఇంకేం.. కాళ్ల కింద ఉన్న క్లచ్చును తొక్కి రయ్యిమంటూ వాహనాన్ని దూకించడానికి ఇంతకంటే ఏం కావాలి.. వీటికితోడు చేతిలో డ్రగ్స్ ప్యాకెట్టో, బీరుబాటిలో ఉంటే.. ఆ దూకుడుకు కళ్లెమేయడం అసాధ్యమే. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చేసే ప్రచారం వీరి చెవికెక్కదు. గమ్యస్థానాలకు చేరే లోపు ప్రమాదాలు జరుగుతున్నా వీరికి పట్టదు. పలువురు నటులు, ప్రముఖులు.. వారి పుత్ర రత్నాలు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ఓవర్‌స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడటం, చలానా కట్టేయడం. ఎన్ని సార్లు వార్తల్లోకెక్కినా వీరి తీరు మారడం లేదు. కేవలం మరణాలు సంభవిం చినపుడు మాత్రమే ఓవర్‌స్పీడ్‌పై అంతా హడావుడి, అన్ని చోట్ల డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు.. ఆ తర్వాత షరామామూలే.. వేగంగా కారు నడుపుతూ ప్రమాదాలకు కారణమైన వారికి చలానాతోపాటు జైలుకూడా ఉంటేనే వీరికి కళ్లెమేయడం సాధ్యమవుతుందని పోలీసులే అభిప్రాయపడుతున్నారు. వేగం, మద్యం, నిర్లక్ష్యం.. సెప్టెంబర్‌లో కొత్త వాహన సవరణ చట్టం–2019 అమలవుతుందన్న భయంతో తొలుత వాహనదారులు జాగ్రత్తగా నడుచుకున్నారు. ఉల్లంఘనలకు వేలకు వేలు జరిమానాలు విధిస్తారని జంకారు. అయితే, ఆ చట్టం అమలు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో ఉల్లంఘనులు తిరిగి చెలరేగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వేగమే. అ తర్వాత డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉండటం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి కేవలం 80 కి.మీ. సాధారణ వాహనాల్లో ఈ వేగం దాటితే వాహనంలో మార్పులు వస్తాయి. కానీ, కొంతకాలంగా మార్కెట్లో్లకి వస్తోన్న అధిక సామర్థ్యం, హైఎండ్ వాహనాలు 150 కి.మీ.లు దాటి ప్రయాణించినా పెద్దగా ఇబ్బంది ఉండదు. దీంతో ఈ స్పీడ్‌ను 180 కి.మీ నుంచి 200 కి.మీ. దాకా తీసుకుపోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. జైలుశిక్ష కూడా విధించాలి.. అతివేగం వల్ల కలిగే అనర్థాలపై ఎంత ప్రచారం చేసినా.. కొందరు ప్రముఖులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఓవర్‌స్పీడ్‌కు చలానాలు కడుతున్నారు తప్ప జరిగిన దానికి చింతించడం లేదు. పైగా చాలాసార్లు అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ దాని పరిసరాల్లో ఇలాంటి ఓవర్‌స్పీడ్ మరణాలు సాధారణంగా మారాయి. మితిమీరిన వేగం వాహనం నడిపేవారికి కాదు, రోడ్డుపై వెళ్తున్న వారికీ ప్రమాదమే. అందుకే ఓవర్‌స్పీడ్ విషయంలో భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేస్తే ఫలితాలు ఉంటాయని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది నమోదైన ఓవర్‌స్పీడ్ కేసుల వివరాలు.. (అక్టోబర్ 31 వరకు) నమోదైన కేసులు: 89,6092 అక్టోబర్ 31న నమోదైన కేసులు: 3,614 రోజుకు నమోదువుతున్న సగటు కేసులు: 2,986 గంటకు నమోదవుతున్న కేసులు దాదాపు: 125 నిమిషానికి నమోదవుతున్న కేసులు: 2.5 అక్టోబర్ 31 వరకు వేసిన చలానాలు: రూ.72.51 కోట్లు రోజుకు సగటున జరిమానాలు: రూ.24.15 లక్షలు భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం.. వాహనదారుల్లో ఉల్లంఘనులు పెరగడం ఆందోళనకర అంశమే. ముఖ్యంగా హైఎండ్ వెహికిల్స్, మోటారు సైకిల్స్ వేగానికి కళ్లెం వేయాల్సిందే. తప్పు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్న భయం వాహనదారులకు కలగాలి. ఈ మేరకు కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం. –పాండురంగ్‌నాయక్, జేటీసీ, ఆర్టీఏ, హైదరాబాద్ -
అతివేగానికి ఐదు ప్రాణాలు బలి
జగ్గయ్యపేట(కృష్ణాజిల్లా) : నిద్రమత్తు, అతివేగం ఐదు ప్రాణాలను బలితీసుకున్నాయి. సెలవు రోజు దర్గమ్మను దర్శించుకుందామని హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన వారు కారు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన షేక్ మున్సూర్ (24), మహబూబ్‌నగర్‌కు చెందిన మఠంపల్లి భీమిరెడ్డి (27), హైదరాబాద్ పటేల్‌నగర్‌కు చెందిన విక్రం కోటేశ్వరరావు (24), కర్ణాటకలోని ఖేదంగోల్కొండకు చెందిన పోతుల భీమిరెడ్డి (25) స్నేహితులు. కర్ణాటకకు చెందిన పోతుల భీమిరెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇందులో ఇద్దరు ఏసీ మెకానిక్‌లు కాగా ఒకరు బైక్ మెకానిక్, మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా ఆదివారం సెలవు దినం కావటంతో దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు బయలుదేరారు. శనివారం అర్థరాత్రి అదే ప్రాంతానికి చెందిన కారును అద్దెకు తీసుకుని డ్రైవర్ సహా ఐదుగురు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆపుకుంటూ సెల్ఫీలు దిగుతూ ఆడుతూ పాడుతూ ప్రయాణిస్తున్నారు. ఆర్టీఐ చెక్‌పోస్టు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వచ్చే సరికి కారు వేగంగా వెళ్తూ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి 10 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను చీల్చుకుంటూ వెళ్లి రోడ్డుపై పల్టీలు కొట్టి ఆగింది. అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి దీన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఖమ్మం జిల్లా నాగులవంచకు చెందిన డ్రైవర్ నారపోగు గోపయ్య (22), పక్కనే కూర్చున్న షేక్ మున్సూర్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న పోతుల భీమిరెడ్డి, మఠంపల్లి భీమిరెడ్డి, విక్రం కోటేశ్వరరావును జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు భీమిరెడ్డిలు మార్గమధ్యంలో మృతి చెందగా విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతి చెందాడు. అతి వేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన అతి వేగం
పలమనేరు (చిత్తూరు జిల్లా): అతివేగం రెప్పపాటులో ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం కారు బోల్తా పడి అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. కారును నడుపుతున్న టీటీడీ ఉద్యోగి విష్ణు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తా.. తిరుపతికి చెందిన విష్ణు తన సోదరిని బెంగళూరులో దింపేందుకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్‌ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కారు ఇంజన్ రెయిలింగ్‌ను రాసుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకుకు నిప్పంటుకుంది. సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్ చేశారు. అనంతరం గంగవరం పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీతో కారును బయటకు తీశారు. అప్పటికే కారులోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మృతులు విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్రామ్ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19)గా గుర్తించారు. పెట్రోలు లీకై మంటలు వ్యాపించడంతో.. చిత్తూరు ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుల బంధువులను ఓదార్చారు. పెట్రోలు కారు కావడం, ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో అదుపు తప్పి దుర్ఘటన జరిగినట్లు ఎస్పీ చెప్పారు. అందరూ తిరుమలేశుని పరమ భక్తులు టీటీడీ ఉద్యోగి చంద్రశేఖర్, ఆయన భార్య నాగరత్నమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. వారి కుమారుడు విష్ణు ఉన్నత చదువులు పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం చేస్తుండేవాడు. కోడలు జాహ్నవి ఆయుర్వేద వైద్య నిపుణురాలు. కాగా తమ బిడ్డ విష్ణు శ్రీవారి చెంత సేవలు చేయాలని భావించిన చంద్రశేఖర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. అమెరికాలో ఉంటున్న తమ బిడ్డకు టీటీడీలో అవకాశం కల్పించారు. దీంతో విష్ణు తిరుపతిలోనే ఉంటున్నారు. మరోవైపు బెంగళూరులో ఉంటున్న ఆయన చెల్లి శ్రీవారి దర్శనం కోసం బిడ్డ భానుతేజతో కలసి తిరుపతి వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధం కాగా.. విష్ణు బెంగుళూరులో ఉంటున్న తమ మామ రామకృష్ణ (భార్య తండ్రి) అనారోగ్యం బారిన పడటంతో ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వారివెంట వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
భయపెడుతున్న భారీ వాహనాలు
సాక్షి, పశ్చిమగోదావరి : లారీలు పోటాపోటీగా వెళ్లే క్రమంలో వారు ప్రయాణిస్తున్న వేగం రోడ్డుపై ప్రయాణించే వారిని గందరగోళానికి గురిచేస్తున్నట్టు పలువురు వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల ఈ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి నుంచి సజ్జాపురం కోయాక్సిల్ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్ ఆవరణలోని వ్యాగిన్లకు ఎక్కించేందుకు బియ్యం లోడుతో లారీలు ప్రయాణిస్తున్న వేగం 50 కిలోమీటర్లకు పైనే. అధిక లోడుతో వేగంగా వెళ్తున్న ఈ లారీలు వస్తున్న తీరు చూసి ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు తమ వాహనాలను డ్రెయిన్లపైకి నడుపుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా లారీలో క్లీనర్ లేకుండా డ్రైవర్ మాత్రమే ఉండటంతో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులు నిలదీస్తుంటే లారీల డ్రైవర్లంతా ఏకమైపోయి వాగ్వాదానికి దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దారిలో 4 పాఠశాలలు ఇదే రహదారిలో 4 ప్రైవేటు పాఠశాలలు ఉండడంతో తల్లితండ్రులు ఈ బియ్యం రవాణా చేసే లారీలు తిరిగే రోజుల్లో పిల్లలను రోడ్డుపైకి వెళుతుంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రితోపాటు ఈఎస్ఐ ఆస్పత్రి కూడా ఇదే రహదారిని ఆనుకుని ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు సైకిళ్లపై వెళ్లే పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంత జరుగుతున్నా లారీలు తిరిగే సమయంలోనైనా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయడంలేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల వేగాన్ని నియంత్రించాలని, లారీల్లో క్లీనర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వేగంగా రాకపోకలు బియ్యం లోడుతో వెళ్తున్న లారీల వేగాన్ని చూస్తుంటే భయమేస్తోంది. పిల్లలను ఇళ్లలోంచి బయటకు వదలేకపోతున్నాం. ముందుగా వెళ్లాలనే లక్ష్యంతో పోటీపడి వెళుతున్నారు. ప్రమాదం జరుగుతుందేమో అనే భయం డ్రైవర్లలో లేదు. లారీలు ప్రయాణం చేసే రోజుల్లోనైనా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలి. – వై.శ్రీహరి, కోయాక్సిల్ రోడ్డు, తణుకు చర్యలు తీసుకుంటాం కోయాక్సిల్ రోడ్డులో ప్రయాణించే బియ్యం రవాణా లారీలు నిబంధనలకు లోబడి ప్రయాణించాలి. వేగంగా వెళ్లినా, క్లీనర్ లేకుండా వాహనం నడిపినా సదరు లారీల యజమాని, డ్రైవర్లపై చర్యలు తీసుకుంటాం. ఈ లారీల కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. – డి.చైతన్య కృష్ణ, తణుకు సీఐ -
స్పీడ్ 'గన్' గురి తప్పిందా..?
సాక్షి, నిజామాబాద్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతి వేగానికి చెక్ పెట్టేందుకు పోలీసుశాఖ చేపట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్పీడ్ లేజర్‌గన్ గురి తప్పింది. గురువారం ఉదయం 11.48 గంటలకు 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం ఓవర్ స్పీడ్‌తో వెళుతుంటే.. మెదక్ జిల్లా రామాయంపేట్ వద్ద ఈ స్పీడ్ లేజర్‌గన్‌తో గుర్తించిన పోలీసులు.. జరిమానాకు సంబంధించిన చలానా మాత్రం మరో వాహనానికి పంపారు. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే.. తన వాహనం టీఎస్ 16 ఈఆర్7299కు చాలనా విధిస్తూ ఎస్ఎంఎస్ సందేశాన్ని పంపారని మాక్లూర్‌కు చెందిన అమర్ వాపోయారు. హైస్పీడ్‌తో వెళ్లిన వాహనం నెంబర్ కూడా ఇదే నెంబరుకు కాస్త దగ్గరలోనే ఉండటంతో పొరపాటున ఈ చలానా జారీ అయి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొరపాటున జరిమానా విధించిన వాహనం ఇది -
ఓవరైతే.. డేంజర్ !
సాక్షి, హైదరాబాద్ : అధిక భారంతో వెళ్తున్న వాహనాలు రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహన పరిమితికి మించి లోడ్‌తో వెళ్తే ఆ వాహనాన్ని డ్రైవర్ నియంత్రించలేరని, ఈ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం కావడంతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనార్జన కోసం యజమానుల దురాశ వల్ల అమాయకులు బలవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. 1979లో రోడ్డు ప్రమాదాలపై జస్టిస్ వీఆర్ కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చి 30 ఏళ్లు దాటినా.. పరిస్థితిలో మెరుగు కాలేదని, రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. రహదారి భద్రతకు చెందిన రెండు చట్టాలను కఠినంగా అమలు చేయని పక్షంలో మరిన్ని అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వ్యాఖ్యా నించింది. ఈ నెల 4న ఆటో ప్రమాదంలో 13 మంది వ్యవసాయ కూలీలు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలను సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. చట్టాల అమలులో ఉదాసీనత... అధిక లోడ్‌తో, సామర్థ్యం లేని వాహనాలను నియంత్రించడానికి చట్టాల్లో నిబంధనలున్నప్పటికీ అమల్లో ఉదాసీనత కనిపిస్తోందని జస్టిస్ పి.నవీన్‌రావు పేర్కొన్నారు. సీజ్ చేసిన వాహనాలను అక్కడికక్కడే విడిచి పెట్టే అధికారం ఉన్నప్పటికీ ప్రాసిక్యూషన్ చేయడం లేదన్నారు. కఠినమైన శిక్షలు లేని పక్షంలో అమాయకుల ప్రాణాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, వాహనాన్ని వినియోగించుకునే హక్కు వ్యక్తులకు ఉందని, ఇది విస్తృత ప్రజాప్రయోజనాలకు లోబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన వాహనాల విడుదల విషయంలో దాఖలైన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాలన్నారు. ప్రత్యామ్నాయం ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవీ మార్గదర్శకాలు అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను సీజ్ చేసినప్పుడు నేరుగా హైకోర్టులో పిటిషన్ విచారణార్హం కాదు. వాహన యజమాని, డ్రైవర్లో ఎవరైనా ఇక్కడ పిటిషన్ వేయడానికి ముందే చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను వాడాలి. తెలంగాణ రాష్ట్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం సీజ్ చేసిన వాహన యజమాని ఆర్టీఏ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్యదర్శి చట్ట ప్రకారం పరిశీలించి తగిన ఉత్తర్వులివ్వాలి. షరతులతో వాహనాన్ని విడుదల చేయవచ్చు. దానికి ముందు విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాహన కండిషన్‌ను అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంటుంది. వాహనాన్ని సీజ్ చేసే ప్రక్రియను వీడియోతో చిత్రీకరించి దాన్ని రికార్డులో భాగం చేయాలి. వీడియో రికార్డింగ్ విధానాన్ని రూపొందించాలి. కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే పరిష్కారంలో ఎక్కువ జాప్యం జరుగుతోందన్నది యజమానుల ఆవేదన. దీనికి పరిష్కార మార్గంగా ఆన్లైన్ పోర్టల్‌ను తెరవాలి. ప్రస్తుతం ఉన్నదానిలో ప్రత్యేకంగా ఒక పేజీ, మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలి. విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలి. దరఖాస్తుదారు కార్యదర్శి/ అధీకృత అధికారి వద్దకు రావాల్సిన అవసరంలేదు. నిర్దేశిత ప్రదేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. తీర్పు ప్రతి అందిన 6 వారాల్లో తాత్కాలికంగా వాహనాన్ని అప్పగించడానికీ, దరఖాస్తును పరిష్కరించడానికిగాను విధానాన్ని రూపొందించాలి. ఈ దరఖాస్తును వారంలోగా పరిష్కరించాలి. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇప్పటికే విడుదలైన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఈ కోర్టు చెప్పడం లేదు. అయితే ప్రాసిక్యూషన్ చేయడానికి, జరిమానా విధించడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావు. ఒకవేళ యజమాని అడ్వాన్స్ సొమ్ము చెల్లించినట్లయితే తప్పు తేలి విధించే జరిమానాతో సర్దుబాటు చేయాలి. యజమాని జరిమానా చెల్లించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టప్రకారం ప్రాసిక్యూషన్ చేయడానికి అధికారులకు అవకాశం ఉంది. ళీ జరిమానా చెల్లించడానికి వాహన యజమాని చేసుకున్న దరఖాస్తును అనుమతించినట్లయితే వాహనాన్ని విడుదల చేసే ముందు దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించి ధ్రువీకరణ జారీ చేయాలి. ఈ పత్రం ఉంటేనే వాహనాన్ని అనుమతించాలి. ళీ అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక లారీలను స్వాధీనం చేసుకునే విషయంలో మైనింగ్ అధికారులు కూడా రవాణా శాఖతో అనుసంధానమై తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ళీ పోలీసు, పరిశ్రమల శాఖల అధికారులకు అవకాశం ఉండేలా ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలు నిబంధనల ఉల్లంఘనలు ఆన్లైన్లో కనిపించేలా ఉండాలి. యజమాని/డ్రైవర్ పదేపదే ఉల్లంఘించినట్లయితే అవి ఆన్లైన్లో కనిపిం చాలి. తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. -
విధి చిదిమేసింది!
శామీర్‌పేట: పిల్లలతో సహా పెళ్లిరోజు వేడుకలను సంతోషంగా జరుపుకుని వస్తున్న ఓ కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కరీంనగర్–హైదరాబాద్ రహదారి శామీర్‌పేటలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా ఆ కుటుంబంలోని ఓ బాలుడితోపాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డి ప్రమాదం జరిగిన తీరును వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాగోల్.. బండ్లగూడకు చెందిన కోసూరి కిశోర్ చారి (55), భార్య భారతి (45), వీరి ఇద్దరు కుమారులు సుధాంశ్ (15), తనిష్‌లు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (టీఎస్08ఎఫ్‌వీ3005) కారులో సిద్దిపేట జిల్లా, వర్గల్ దేవాలయంలో దర్శనం చేసుకుని నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువు (రాజీవ్ రహదారిపై) సమీపంలో వీరి కారు వేగంగా వెళ్తూ.. డివైడర్‌ను ఢీ కొట్టింది. వేగం ఎక్కువగా ఉండడంతో గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డులో (హైదరాబాద్–కరీంనగర్) గజ్వేల్‌కు వెళ్తున్న మారుతి సుజుకీ ఎర్టిగా (టీఎస్ 36ఈ 7111) కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎకోస్పోర్ట్ వాహనంలోని కిశోర్ చారి, ఆయన భార్య భారతి, పెద్దకుమారుడు సుధాంశ్‌లు అక్కడిక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు తనిష్‌తో పాటు ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న రాజు, మహేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి మృతదేహాలు కారులోనే ఉండటంతో స్థానికుల సాయంతో వీటిని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని, ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు సీఐ నవీన్‌రెడ్డి తెలిపారు. పెళ్లి రోజు జరుపుకునేందుకు వెళ్లి.. నాగోలు డివిజన్ పరిధిలోని వెంకట్‌రెడ్డి నగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు, ఓబీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కోసూరి కిశోర్‌చారి దంపతులతో పాటు వారి కుమారుడు సోమవారం సాయంత్రం శామీర్ పెట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కిశోర్, భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కారులో బీదర్ లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని.. అక్కడినుంచి వేములవాడకు చేరుకుని రాజరాజేశ్వరుడి దర్శనం తర్వాత నగరానికి తిరుగుపయనమయ్యారు. సోమవారం మధ్యాహ్నం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరి కారు ప్రమాదానికి గురైంది. సుధాంశ్ నాగోల్‌లోని ఎస్ఆర్ డీజీ స్కూల్లో టెన్త్ చదువుతున్నట్లు తెలిసింది. కిశోర్ చారి మృతితో నాగోలు డివిజన్లో బీజేపీ చురుకైన కార్యకర్తను కోల్పోయిందని బీజేపీ నేతలు కందికంటి కన్నాగౌడ్, శ్రీకాంత్, తదితరులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీని హైదరాబాద్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి హైదరాబాద్: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బైక్‌పై వేగంగా వస్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ద్రుపద్(22) ఖాజాగూడలోని వెంకటేశ్వర పీజీ హాస్టల్లో ఉంటూ మాదాపూర్‌లోని ఐకాన్ డిజిటల్ ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడు కృష్ణ చైతన్యను గౌలిదొడ్డిలోని హాస్టల్లో దింపి విప్రో సర్కిల్ వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ద్రుపద్.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు. దీంతో ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య గచ్చిబౌలి పోలీసులను ఆరా తీశారు. -
ఏమిటా స్పీడు... చలాన్ పడుద్ది
హైదరాబాద్ : డ్రైవింగ్... రద్దీ రోడ్లపై నెమ్మదిగా వెళ్లినా, ఖాళీగా కనిపిస్తే చాలు దూసుకుపోతాం. మనలో అనేక మందికి ఇది అలవాటే. ఇక ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లాంటి మార్గాల్లో వేగానికి పరిమితే ఉండదు. సాధారణ స్పీడ్ దాటినా మీటర్ రీడింగ్ కూడా చాలా మంది చూసుకోరు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిగో ఇలాంటి వారి కోసమే పోలీసులు కొత్త యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మీ స్పీడ్‌ను పరిశీలించి హెచ్చరిస్తాయి. ‘నో యువర్ స్పీడ్’, ‘యువర్స్ స్పీడ్’యంత్రాలను ఓఆర్ఆర్పై ఏర్పాటు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్రావు ‘సాక్షి’కి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తమ పరిధిలో ఉన్న 62 కి.మీ. ఔటర్లో ఒక్కో రోజు ఒక్కో చోట వీటిని వినియోగించనున్నారు. యువర్స్ స్పీడ్ పనిచేస్తుంది ఇలా.. ఈ యంత్రాన్ని నిర్ణీత ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇది ఎదురుగా వచ్చే వాహనాలను 300–400 మీటర్ల దూరం నుంచే అధ్యయనం చేస్తుంది. రాడార్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం వాహన వేగాన్ని అధ్యయనం చేసి అనుసంధానించి ఉండే బోర్డు మీద వేగాన్ని (యువర్ స్పీడ్ అంటూ..) అంకెల్లో సూచిస్తుంది. వాహనం సాధారణ వేగంతో ఉంటే గ్రీన్ సిగ్నల్‌ను, మితిమీరితే రెడ్ సిగ్నల్‌ను చూపిస్తూ ‘డేంజర్’అని హెచ్చరిస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళితే అక్కడ ఉండే స్పీడ్ లేజర్ గన్ కెమెరా దీన్ని గుర్తించి ఈ–చలాన్ రూపంలో వాహనదారుడికి జరిమానా విధిస్తుంది. ట్యాంక్‌బండ్‌పై ట్రయల్.. ఈ స్పీడ్ డిటెక్టింగ్ టెక్నాలజీని ఇన్స్పెక్టర్ ఎం.నర్సింగ్‌రావు నేతృత్వంలోని బృందం గత నెలలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి అధ్యయనం చేసింది. ఈ స్పీడ్ డిటెక్టర్లు జర్మనీ టెక్నాలజీతో తయారై రాడార్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక మంది వాహనచోదకులు ‘యువర్ స్పీడ్’చూసుకొని వేగం తగ్గించారని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు వీటిని అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలు గుర్తించాక కీలక ప్రాంతాల్లో పెట్టాలని యోచిస్తున్నారు. స్పీడ్ లిమిట్ లోపల వెళ్తే ఇలా ‘గ్రీన్’ రీడింగ్ చూపిస్తుంది.., స్పీడ్ లిమిట్ దాటి వెళ్తే ఇలా ‘రెడ్’ రీడింగ్ చూపిస్తుంది.. ప్రాథమికంగా రెండు యంత్రాలు... రోడ్డు ప్రమాద నిరోధం, ప్రాణనష్టం తగ్గించడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్పై రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. – దివ్యచరణ్ రావు, ట్రాఫిక్ డీసీపీ, రాచకొండ -
అతివేగానికి ఆరుగురి బలి
సాక్షి, కోదాడ : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్జల్‌పాషా(48), గౌసియాబేగం(40), మహబూబ్‌పాషా(40) మహిముదాబేగం(35), మాహిన్(15), ముస్కాన్(12), జాకిర్ పాషా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో షేక్ అబ్జల్ పాషా ఇంటి పెద్ద. తన చెల్లెలు అక్తర్‌బేగం మనవరాలు బారసాల ఫంక్షన్‌కు బుధవారం కో దాడ వచ్చారు. శుభకార్యం పూర్తికాగానే హుజూర్‌నగర్‌లో నివాసముంటున్న అబ్జల్‌పాషా చిన్న తమ్ముడు యాకుబ్ పాషా ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లి అదే రోజు రాత్రి 7గంట లకు హుజూర్‌నగర్‌కు చేరుకున్నారు. అయితే రాత్రి అక్కడే నిద్రపోయి తెల్లవారుజామున 6 గం టలకు లేచి తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఓవర్టేక్ చేసే క్రమంలో.. కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామునే లేచి స్వగ్రామానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో హుజూర్‌నగర్‌లోనే కోదాడకు వెళ్లే ఆటోను మాట్లాడుకుని అందులో ఎక్కారు. చిలుకూరు మండలం చిలుకూరు మండలం సీతా రంపురం వద్దకు చేరుకోగానే ఆటో డ్రైవర్ ముం దున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. రెప్ప పాటులో చోటు చేసుకున్న ఈ ఘోర దుర్ఝటనలో షేక్ అబ్జల్‌పాషా, గౌసియాబేగం, మహిముదా బేగం, మాహిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌పాషా, ము స్కాన్, జాకిర్ పాషా, ఆటో డ్రైవర్ నాగుల్ మీరా కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు రోడ్డు పై చెల్లా చెదురుగా పడిపోయాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తొలుత హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లాకు తరలించారు. మార్గమధ్యలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్దకు చేరుకోగానే పరిస్థితి విషమించి ముస్కాన్ మృతి చెందింది. మహబూబ్‌పాషా కూడా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రిలో చికిత్స పొందు తూ మృత్యుఒడికి చేరుకోగా డ్రైవర్ నాగుల్ మీరా, జాకిర్ పాషా చికిత్స పొందుతున్నారు. రెండు కుటుంబాల్లో మిగిలింది ఒక్కరే.. ప్రమాదంలో దుర్మరణం పాలైన షేక్ అబ్జల్‌పాషా ఇంటి పెద్ద. ఈయన తోడ మొత్తం ఏడుగురు. ముగ్గురు చొప్పున తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు. అబ్జల్ పాషా, మహమూద్ పాషా కుటుంబాలు స్వగ్రామంలోనే ఉంటుండగా, చిన్న తమ్ముడు యాకుబ్ పాషా హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని ఆరుగురు మృతిచెందగా జాకిర్పాషా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన విషయం తెలుసుకున్న బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆరుగురు బలైపోవడంతో బోరున విలపించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కాగా విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, కోదాడ రూరల్, టౌన్ సీఐలు రవి. శ్రీనివాస్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చిలుకూరు ఎస్ఐ వెంకన్నను వివరాలు అడిగి తెలుసుకుని తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. -
అంతే స్పీడ్‌గా..
సాక్షి, సిటీబ్యూరో: ఏటా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో అత్యధికం అతివేగం కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా మృతుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యంతో డీజీపీ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలను నిరోధించడంలో భాగంగా ఓవర్ స్పీడ్‌పై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేకంగా రాడార్ టెక్నాలజీతో పని చేసే 30 స్పీడ్ లేజర్ గన్లను కొనుగోలు చేశారు. వీటి వినియోగంపై ఆయా జిల్లాలు, కమిషనరేట్ల సిబ్బందికి డీజీపీ కార్యాలయంలో బుధవారం నుంచి శిక్షణ ఇస్తున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ గన్స్ సంఖ్య 58కి చేరింది. వీటిని ‘ఎంపిక చేసిన’ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మోహరించి తనిఖీలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా రహదారులు, వాటి స్థితిగతులపై అధ్యయనం చేసిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) నిర్ణీత వేగపరిమితులను విధించింది. వీటి ప్రకారం జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఔటర్ రింగ్రోడ్లపై గరిష్టంగా గంటకు 100 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఇది వాహనాలను బట్టి మారుతుంటుంది. మిగిలిన రహదారుల్లో గరిష్ట వేగం గంటకు 60 కిమీ మించకూడదు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఇది 40 కిమీ, విద్యాసంస్థలు ఉండే ప్రాంతాల్లో 20 కిమీ దాటకూడదు. వీటికి తోడు నగరంలో ట్యాంక్‌బండ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వేగ పరిమితులు విధించారు. వీటికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో సూచికలు అందుబాటులో ఉంచినా వాహనచోదకులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా అత్యధిక వాహనాలు ఓవర్స్పీడింగ్తో వెళ్లి ప్రమాదాలకు లోనుకావడం, ప్రమాదకారకాలుగా మారడం జరుగుతోంది. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా పేర్కొంటారు. గత రెండేళ్లుగా వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు విభాగం శాస్త్రీయంగా కారణాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న ఇంజినీరింగ్ లోపాలు, ఆక్రమణలు తదితరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించినా, ఆయా ప్రాంతాల్లో వినియోగించేందుకు స్పీడ్ లేజర్ గన్స్ అవసరమైన సంఖ్యలో లేవు. రాష్ట్రం మొత్తమ్మీద కేవలం 28 మాత్రమే అందుబాటులో ఉండటంతో కొత్తగా 30 గన్స్‌ను సమీకరించుకుంది. రాడార్ పరిజ్ఞానంతో పని చేసే వీటి వినియోగంపై డీజీపీ కార్యాలయం కేంద్రంగా క్షేత్రస్థాయి ట్రాఫిక్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీటిని ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంట్లున్న జిల్లాలు, కమిషనరేట్లకు అందించనున్నారు. ఆయా యూనిట్స్‌కు చెందిన వారు వీటి వినియోగం కోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు ఒక్కో రోజు ఒక్కో బ్లాక్‌స్పాట్ వద్ద కాపుకాసి మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను గుర్తిస్తాయి. తొలుత ఈ ఉల్లంఘనులకు చలాన్లు జారీ చేయకుండా కొన్ని రోజుల పాటు అవగాహన కల్పించాలని, ఆ తర్వాతే చలాన్లు విధించాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. మాన్యువల్..ఆటోమెటిక్.. ఈ స్పీడ్ లేజర్ గన్స్‌ను మాన్యువల్‌గానూ, ఆటోమేటిక్ మోడ్‌లోనూ వినియోగించే అవకాశం ఉంది. అంటే... ఎంపిక చేసిన ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ సిబ్బంది అటుగా వచ్చే వాహనాల్లో అతివేగంగా వెళ్తున్న వాటిని గుర్తించి ఫొటోలు తీయడం ద్వారా చర్యలు తీసుకుంటారు. ఆటోమెటిక్ విధానంలో ఓ ప్రాంతంలో స్పీడ్ గన్ను ఏర్పాటు చేసి వదిలేస్తే దాని ముందు నుంచి ప్రయాణించే వాటిలో నిర్ణీత వేగం దాటిన వాహనాలను లేజర్ గన్నే గుర్తించి ఫొటోలు తీస్తుంది. సదరు ప్రాంతంలో వేగ పరిమితి ఎంత? ఎంత వేగం దాటితే ఫొటో తీయాలి? తదితర అంశాలను గన్‌లో పొందుపరిచేందుకు ఆస్కారం ఉంది. దీనికి అనుసంధానించి ఉండే ట్యాబ్ ఈ–చలాన్ సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. గన్ క్యాప్చర్ చేసిన ఫొటోల్లో ఏది సక్రమంగా ఉంది? ఏది అస్పష్టంగా ఉంది? అనేవి సరిచూసే సిబ్బంది పక్కాగా ఉన్న ఫొటోలనే సర్వర్‌కు అప్లోడ్ చేస్తారు. ఈ సర్వర్ ఆర్టీఏ డేటాబేస్‌లోని వివరాల ఆధారంగా సదరు ఉల్లంఘనుడి వాహనం నంబర్‌తో ఈ–చలాన్ జనరేట్ చేస్తుంది. దీన్ని అతడి చిరునామాకు పోస్టులో పంపిస్తారు. రహదారులపై తనిఖీలు చేపట్టే ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఉండే పీడీఏ మిషన్లలోనూ ఈ డేటా నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా ఓవర్ స్పీడింగ్ చేసి, ఈ–చలాన్ చెల్లించని వారిని గుర్తించి పట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు ‘నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఒకప్పుడు ప్రమాదాలకు నెలవుగా ఉండేది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు ఓవర్ స్పీడే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రాథమికంగా ఎనిమిది స్పీడ్ లేజర్ గన్స్ ఖరీదు చేసి ఔటర్‌పై మోహరించారు. ఫలితంగా వాహనాల గరిష్ట వేగం తగ్గడంతో పాటు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని ఓవర్‌స్పీడింగ్ బ్లాక్‌స్పాట్స్ అన్నింటి వద్దా ఈ గన్స్‌తో డ్రైవ్స్ చేయాలని నిర్ణయించాం. భవిష్యత్‌లో ఈగన్స్ సంఖ్యను భారీగా పెంచడానికీ కసరత్తు చేస్తున్నాం’ –ఓ పోలీసు ఉన్నతాధికారి -
ప్యాట్నీ సెంటర్లో అర్ధరాత్రి కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్యాట్నీ సిగ్నల్ వద్ద ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆటో తిరగబడి పడిపోవడంతో అందులో ఉన్నవారు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. వెంటనే వారిని స్థానికులు పలు ఆస్పత్రులకు తరలించారు. అంతా జరిగిన కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అతి వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. -
ముగ్గురిని బలిగొన్న అతివేగం
రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. మితిమీరిన వేగం..ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి ముగ్గురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోగా.. మరో పదిహేడుమందిని క్షతగాత్రుల పాల్జేశాయి. ఈ దుర్ఘటన జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ (నకిరేకల్) : కృష్ణాజిల్లా గవర్నరుపేట డిపో–1కు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఆది వారం రాత్రి గం.11.00లకు విజయవాడ నుంచి హైదరాబాదుకు 46మంది ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్‌తో కలిపి మొత్తం 48 మందితో బయలు దేరింది. మార్గమధ్యలో కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై సుమారు సోమవారం తెల్లవారు జామున గం. 2.15 లకు బస్సు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ముందున్న సిమెంట్ ట్యాంకర్ ను ఓవర్టేక్ చేయబోయి వెనుకనుంచి ఢీ కొట్టాడు. దీంతో సిమెంట్ ట్యాంకర్ వెనుకభాగం కొంత బస్సు క్యాబిన్లోకి దూసుకెళ్లింది. రెండు వాహనాలు ఒకదానికొకటి ఇరుక్కుపోయి అక్కడే నిలిచిపోయాయి. హాహాకారాలు.. ఆర్తనాదాలు ఆర్టీసీ బస్సు వెనుకనుంచి సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒకేసారి భారీ శబ్దం రావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. తేరుకునేలోపే సిమెంట్ ట్యాంకర్ వెనుకభాగం కొంత ఆర్టీసీ బస్సుఎడమవైపు నుంచి క్యాబిన్లోకి దూసుకొచ్చింది. అనుకోని ప్రమాదంతో ప్రయాణికులు హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తుండగానే ముందుభాగంలో కూర్చున్న కృష్ణాజిల్లా నంది గామ మండలం శనిగపాడు గ్రామానికి చెందిన కండక్టర్ పంతంగి రామకృష్ణ(43) రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం పాలయ్యాడు. బస్సులో ఎడమవైపు కూర్చున్న మరో 19మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణికులు అప్రమత్తమై.. ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొని నిలిచిపోయిన కాసేపటికి ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చొని ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే 100 ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కట్టంగూర్ ఎస్ఐ నర్ర అంతిరెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయవాడలోని కృష్ణలంకకు చెందిన పాతర్లపల్లి అప్పాయమ్మ(47) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు అప్పాయమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నర్ర అంతిరెడ్డి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు వీరే.. ఆర్టీసీ బస్సు వెనుకనుంచి సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో హైదరబాదుకు చెందిన కొమ్మినేని లక్ష్మి, చిక్కాల వాసుకీదేవీ, బొమ్మడి సాంబశివరావు, సంబంగి భానుప్రియ, ఊచ శ్రీని వాసరావు, ఆకుల అనిల్‌కుమార్, డేగ జయరాం, రవీంద్ర సురేశ్‌కుమార్, కూకట్‌పల్లికి చెందిన పులిగడ్డ శైలజ, దుర్గాచారి, వీరపనేని రంగారావు, వనస్థలిపురానికి చెందిన పుల్లూర బ్రహ్మం, కృష్ణాజిల్లా పెనిగంజిప్రోలు మండలం అనిగెల్లపాడు గ్రామానికి చెందిన బస్సుడ్రైవర్ చిలవేరు గణేశ్, ఇదే జిల్లా ముదినేపల్లి మండలం అన్నవరం గ్రా మానికి చెందిన గుమ్మడి శ్యాంనాగబాబు, విసన్నపేటకు చెందిన అన్నబత్తుల గోపి, గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన లంకె రత్నం, విజ యవాడలోని కృష్ణలంకు చెందిన పాతర్లపల్లి నాగదుర్గారావులకు గాయాలయ్యాయి. అయితే వీరపనేని రంగారావు(72) పరిస్థితి విషమించి రాత్రి మృతిచెందాడు. శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి ఉద యం సంఘటన స్థలాన్ని పరిశీలించి, అనంతరం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదవివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసేందుకు మూడుగంటల సమయం బస్సు డ్రైవర్ అతివేగంతో సిమెంట్ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ Ððవెనుకభాగం కొంత బస్సు క్యాబిన్లోకి దూసుకొచ్చింది.ముందు కూర్చున్న కండక్టర్ రామకృష్ణ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. అతడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో జీఎంఆర్ సంస్థకు చెందిన రెండు క్రేన్లు తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు నల్లగొండ నుంచి ఫైర్ సిబ్బందిని రప్పించి కట్టర్ సహాయంతో పట్టీలను తొలగించి మృతదేహాన్ని వెలుపలికితీశారు. అనంతరం బస్సును క్రేన్ సహాయంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రక్రియ మూడుగంటల పాటు సాగింది. -
మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్,ముగ్గురు మృతి
-
మెట్టుగూడలో రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్టుగూడలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైక్ మెట్టుగూడలోని మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఉదయ్, పృథ్వీ, ఉదయ్‌రెడ్డిలుగా గుర్తించారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు బైక్‌పై(నంబర్ టీఎస్08 ఎఫ్టీ 6841) వెళ్తున్న యువకులు మెట్టుగూడ వద్ద మూలమలుపును సరిగా అంచనా వేయకలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే ప్రమాదం చోటుచుసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన యువకులను సూర్యాపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.. లుంబినీ పార్క్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. అతివేగంతో కారు యూ టర్న్ వద్ద మలుపు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నీళ్లలో ఉన్న కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
స్పీడందుకున్న ఎస్కలేటర్.. 20 మందికి గాయాలు
-
స్పీడందుకున్న ఎస్కలేటర్.. 20 మందికి గాయాలు
రోమ్ : నిర్దేశిత వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించిన ఓ ఎస్కలేటర్ 20మందిని గాయలపాలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని రిపబ్లికన్ మెట్రో స్టేషన్లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిర్దేశిత వేగంతో కదులుతున్న ఎస్కలేటర్ ఆకస్మాత్తుగా ఒవర్ స్పీడ్ అందుకుంది. దాంతో దానిపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక మెట్రో అధికారులు విచారణ చేపట్టారు. ఓ అధికారి మాట్లాడుతూ ‘ప్రమాదం జరగటానికి కాసేపటి క్రితం మద్యం సేవించిన కొందరు యువకులు ఎస్కలేటర్‌పై గంతులు వేశారని.. అందుకే అది అదుపు తప్పి ఉండొచ్చని భావిస్తున్నట్లు’ వెల్లడించారు. -
ఇంత నిర్లక్ష్యమా?!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ‘ప్రగతి రథం–ప్రజల నేస్తం’ లోగోతో ఉంటాయి. ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, క్షేమకరం’ అన్న నినాదాలకు కూడా కొదవలేదు. కానీ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కనీవినీ ఎరుగని రీతిలో 57మంది ప్రయాణీకులు బలైపోయారు. దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో చిన్న పిల్లలతోసహా 102మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. అనేకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. మన రహదారుల వాలకం చూస్తున్నా, వాటిపై ప్రతి క్షణం పరుగులు తీసే వాహనాల తీరును గమనిస్తున్నా ఇంటి నుంచి బయటికెళ్లినవారు క్షేమంగా తిరిగొస్తారన్న గ్యారెంటీ ఉండటం లేదు. కానీ మంగళవారంనాటి ప్రమాదం అన్నిటినీ తలదన్నింది. బస్సులో డ్రైవర్‌తోసహా 51మంది ప్రయాణికులకు మించరాదన్న నిబంధన ఉండగా ఈ వాహనంలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఎలా ఉన్నారన్న సందేహం తలెత్తుతోంది. ఇది చాలదన్నట్టు ప్రమాద సమయానికి అది పెను వేగంతో వెళ్తున్నదని గాయపడినవారిలో కొందరు చెబుతున్నారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్న బస్సును వేగంగా పోనిస్తూ మలుపు తిప్పితే అందరూ అటువైపు ఒరిగిపోతారు. దాంతో బరువు ఒకవైపే పడి బస్సు అదుపు తప్పి ఉండొచ్చునన్నది నిపుణులు చెబుతున్న మాట. అంటే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండకపోతే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు. కనీసం ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు. మృతుల్లో చాలామంది ఊపిరాడక చనిపోవ డాన్ని గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. కొండగట్టులో కొలువైన ఆంజనేయుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో అక్కడికి భక్తులు వెళ్తుం టారు. మంగళవారాలు ఈ రద్దీ మరింత అధికం. ఇటువంటి మార్గాల్లో సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇటీవలికాలంలో దాన్ని గాలికొదిలేస్తు న్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థగా కాక ప్రైవేటు సంస్థ మాదిరిగా వ్యవహరిస్తోంది. అధికా దాయం లభించే రూట్లలో తక్కువ బస్సులతో ఎక్కువ ఆదాయం రాబట్టడం ఎలా అన్నదే దానికి ప్రధానమైపోయింది. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కంట్రోలర్లను నియమిస్తే ప్రయాణికుల సంఖ్యను గమనించి వారు డిపో మేనేజర్‌కు వర్తమానం పంపే వీలుంటుంది. అలాంటపుడు అవసర మనుకున్నప్పుడు అదనపు బస్సుల్ని పంపే అవకాశం ఏర్పడుతుంది. కానీ డిపో నుంచి బయల్దేరిన బస్సు ఎలా ఉందో, డ్రైవర్ పరిస్థితేమిటో, అది వెళ్లిన రూట్లో రద్దీ ఎలా ఉందో గమనించే నాథుడు లేకుండా పోయాడు. బస్సులుంటే సరిపోదు. తగినంతమంది డ్రైవర్లుండాలి. కానీ ఆ రెండు విషయా ల్లోనూ ఆర్టీసీ తీసికట్టే. రిటైరవుతున్నవారి స్థానంలో కొత్తవారిని తీసుకోవటం లేదని, ఉన్నవారితోనే అదనపు గంటలు పనిచేయిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఒక డ్రైవరు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉండగా, కనీసం అయిదారు గంటలు అదనంగా పనిచేయకతప్పడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అలాగే బస్సుల ఫిట్నెస్ గురించి పట్టడం లేదని చెబుతున్నాయి. ఇలాంటి పరి స్థితులు డ్రైవర్లపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఇటు బస్సు రావటంలో జాప్యం జరిగితే ప్రయాణికుల్లో అసహనం, ఆత్రుత పెరుగుతాయి. వచ్చిన బస్సు ఎక్కకపోతే వేరే బస్సు రావటానికి మరెంత సమయం పడుతుందోనన్న ఆందోళన వారిని ఆవహిస్తుంది. దాంతో కష్టమైనా, ఎంతో అసౌకర్యంగా ఉన్నా వచ్చిన బస్సే ఎక్కడానికి ప్రయత్నిస్తారు. లాభాలు ఆర్జించి కోట్లకు పడగెత్తాలన్న దురాశతో ప్రైవేటు సంస్థలు గతంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాయి. కనుకనే అప్పట్లో బస్సు రూట్ల జాతీయం కోసం అందరూ డిమాండు చేసేవారు. కానీ ఇప్పుడు యూనియన్లు, సిబ్బంది చెబు తున్న మాటలు వింటుంటే ఆర్టీసీ కూడా అదే రూట్లో వెళ్తోందన్న భావన కలుగుతుంది. ప్రమాదం సంభవించిన బస్సును నడిపిన డ్రైవర్ శ్రీనివాస్‌కు మంచి పేరుంది. నెలక్రితం ఆయనకు అవార్డు కూడా వచ్చింది. మద్యం అలవాటు లేదంటున్నారు. ఇన్ని అనుకూలాంశాలు కూడా ఒక పెను ప్రమాదాన్ని నివారించలేకపోయాయి. ప్రమాదం సమయానికి బస్సు వేగంగా వెళ్తున్నదని బస్సులోని ప్రయాణికులతోపాటు బయటివారు కూడా చెబుతున్నారు. ఒకటి రెండు వాహనాలను ఓవర్ టేక్ చేయడంతోపాటు ప్రమాదం జరగడానికి ముందు బస్సు ఒక ఆటోను ఒరుసుకుంటూ పోయింది. దీన్నంతటిని గమనిస్తే బ్రేకులు విఫలం కావడం వల్ల డ్రైవర్ బస్సుపై అదుపు కోల్పోయాడా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ బస్సు ఇంతక్రితం వేరే డిపోలో ఎక్స్ ప్రెస్‌గా తిరిగి ఇప్పుడు పల్లె వెలుగు బస్సుగా రూపు మార్చుకుని వచ్చిందంటున్నారు. పైగా 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును తక్కుగా పరిగణించి పక్కన పడేసే నిబంధనను మూడేళ్లక్రితం సవ రించి దాన్ని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారని చెబుతున్నారు. చిత్రమేమంటే ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సు ఆ పరిమితిని కూడా దాటిపోయి, రెండు నెలలక్రితమే 20 లక్షల కిలోమీటర్ల స్థాయికి చేరుకుందని అంటున్నారు. అలాంటి బస్సుకు రంగులద్ది, మరమ్మతులు చేసి రోడ్డెక్కించిన పాపం ఎవరిదో, అసలు పాత నిబంధనలను ఎవరు ఏ ప్రాతిపదికన సవరించారో తేలాలి. ఇంకా దారుణ మేమంటే ఇలాంటి డొక్కు బస్సులు జగిత్యాల డిపోలోనే మరో 20 ఉన్నాయంటున్నారు. ఇతర డిపోల్లో ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తీయాలి. వాటిని తక్కుగా పరిగణించాలి. అలాగే ఇప్పుడు ప్రమాదం జరిగిన రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలున్నాయని గుర్తించారని, అందువల్లే ద్విచక్ర వాహనాలు తప్ప వేరే వాహనాలు వెళ్లకూడదన్న నిబంధన మొన్నటివరకూ ఉండేదని చెబుతున్నారు. ఆ నిబంధన మారిందా లేక జగిత్యాల డిపో అధికారులు అధికాదాయానికి ఆశ పడి దాన్ని ఉల్లంఘించారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సాధారణ పౌరుల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని కొండగట్టు ఘాట్ రోడ్డు దుర్ఘటన నిరూపించింది. ఇది సహించరాని నిర్లక్ష్యం. -
జరిమానా చెల్లించిన గవర్నర్
రాజ్యాంగ పదవిలో ఉన్న కూడా రవాణా శాఖ అధికారులు తన వాహనానికి విధించిన జరిమానా చెల్లించారు కేరళ గవర్నర్ పి సదాశివం. వివరాల్లోకి వెళితే.. సదాశివం అధికారిక వాహనం మెర్సిడెస్ బెంజ్ కారు 10 రోజుల కిందట నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించింది. కౌడియర్ రోడ్డులో 55 కి.మీ వేగ పరిమితి ఉండగా.. గవర్నర్ వాహనం మాత్రం 80 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో గవర్నర్ లేకపోవడంతో డ్రైవర్ స్పీడ్‌గా వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి స్పీడ్ డిటెక్టర్ సెన్సార్లలో కారు అధిక వేగంతో వెళ్లినట్టు రికార్డయింది. దీంతో రవాణా శాఖ అధికారులు గవర్నర్ వాహనానికి 400 రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ వెంటనే ఆ ఫైన్ చెల్లించాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో ఆయన సెక్రటరీ రవాణా శాఖ కార్యాలయంలో జరిమానా చెల్లించారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందిస్తూ.. తొలుత గవర్నర్ వాహనానికి ఫైన్ విధించే అంశంలో వెనుకడుగు వేసినప్పటికి.. నిబంధనల ప్రకారం నడుచుకున్నామని తెలిపారు. గవర్నర్ చేసిన ఈ పని పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
రెప్పపాటులో ఘోరం
సాక్షి, సుల్తానాబాద్/మంథని : రెప్పపాటులో ఘోరం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యం నలుగురిని బలిగొంది. రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారి మరోసారి రక్తమోడింది. కాసింత ఏమరపాటు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు వెనకనుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మంథని, సుల్తానాబాద్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన చదువాల అరుణ్‌కుమార్(37) మంథని పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆరేళ్లుగా ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు.భార్య సౌమ్య(30), కొడుకు అఖిలేశ్(9), కూతురు శాన్వి(5)తో కలిసి మంథనిలోనే నివాసం ఉంటున్నాడు. తన సోదరుడు సాయికుమార్, బావమరిది ఓం ప్రకాశ్‌ను హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలతో చేర్పించేందుకు కారులో భార్య, పిల్లలతో కలిసి గురువారం వెళ్లారు. వారిని అక్కడ దింపేసి, ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9గంటలకు మంథనికి బయల్దేరారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న కారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆగిఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఘటనలో అరుణ్, సౌమ్య, శాన్వీ అక్కడికక్కడే మృతిచెందారు. అఖిలేష్ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాలుగు గంటల శ్రమ.. రోడ్డుపై భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్, ఏసీపీలు హబీబ్‌ఖాన్, వెంకటరమణ, సీఐ రాములు, ఎస్ఐ రాజేశ్ అక్కడికి చేరుకున్నారు. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. వాటిని తీసేందుకు పోలీసులు, స్థానికులు సుమారు నాలుగు గంటలు శ్రమించారు. గ్యాస్‌కట్టర్ తెప్పించి, కారు భాగాలు విడదీసి బయటకు తీశారు. లారీ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను వద్దని.. కారులో ప్రయాణం చేసిన ప్రతి సమయంలో అరుణ్‌కుమార్ డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలోనూ డ్రైవర్ అందుబాటులో ఉన్నప్పటికి కారులో ఎక్కు వ మంది వెళ్తున్నామని, డ్రైవర్ అవసరం లేదని తానే స్వయంగా కారు నడిపినట్లు తెలిపారు. డ్రైవర్ ఉంటే ప్రాణాలు దక్కేవని రోదించారు. మళ్లొస్తానని.. హైదరాబాద్‌కు వెళ్లే ముందు అరుణ్‌కుమార్ రామగుండంలో నివాసముంటున్న తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, రాజేశ్వరీ వద్దకు వెళ్లాడు. నాన్న ఆరోగ్యం బాగా లేక పోవడంతో రూ. 20వేలు, బియ్యం అప్పజెప్పాడు. హైదరాబాద్ వెళ్లి మళ్లొస్తానని చెప్పిన కొడుకు తెల్లవారేసరికి అనంతాలకు వెళ్లాడని తల్లి రోదిస్తూ తెలిపింది. పలువురి పరామర్శ.. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు రౌతు కనకయ్య, ఆకుల నర్సయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, రమణారావు, ప్రసాద్ సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అతివేగమే కారణమా..? ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాద సమయంలో 130 స్పీడ్‌తో వెళ్లడంతోపాటు అలసటతో నిద్రమత్తు ఉండడం కూడా మరో కారణమవుతుందని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పేర్కొన్నారు. ఘటనపై పరిశీలన చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారి, తహసీల్దార్, ఎస్ఐ, గ్రామసర్పంచ్లతో ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేశామని డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ తెలిపారు. పెను విషాదం అరుణ్‌కుమార్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో సుల్తానాబాద్, మంథనిలో పెను విషాదం అలుముకుంది. సుల్తానాబాద్ ట్యాంకువీధికి చెందిన అరుణ్‌కుమార్ మొదట గోదావరిఖని 8వకాలనీలో కష్ణవేణి హైస్కూల్లో పనిచేశారు. తరువాత ప్రిన్సిపల్ హోదాలో అదే పాఠశాల మంథనిశాఖకు వచ్చారు. అప్పటి నుంచి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నఅస్తం అందించేవారు. అరుణ్ భార్య సౌమ్య బోధనారంగంలో స్థిరపడాలని బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకు నాలుగు, కూతురు యూకేజీ చదువుతున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంథని, సుల్తానాబాద్‌లోని స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. -
బస్సు ప్రమాదం.. 17మంది సజీవ దహనం
అంకారా : టర్కీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచోసుకుంది. ఈ ఘటనలో 17 మంది సజీవదహనమవ్వగా.. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ బస్ అదుపు తప్పి కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడంతో ఇంజన్ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు నిండా మంటలు చెలరేగటం, అందరూ నిద్ర మత్తులో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఇగ్దీస్ ప్రోవిన్స్ పరిధిలో చోటు చేసుకుందని.. ఈ బస్సులో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దేశస్తులుగా గుర్తించామని, వీరు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా టర్కీలోకి ప్రవేశించారని టర్కీ పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీరి దగ్గర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వీరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స అనంతరం విచారణ చేపడతామన్నారు. -
మందు కొట్టి.. యువతి ర్యాష్ డ్రైవింగ్
హైదరాబాద్: స్నేహితులతో కలసి కారులోనే పార్టీ చేసుకుని, మద్యం సేవించారు. అదే మత్తులోనే ఓ యువతి మితిమీరిన వేగంతో కారు నడిపింది. దీంతో కారు అదుపు తప్పి యాక్టివాను ఢీకొట్టింది. శనివారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యాక్టివాపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు బోర బండకు చెందిన రామాయణం చిరంజీవి(20)గా, క్షతగాత్రుడు రామనాతి సాయికుమార్(20)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకురాలైన న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్(26)ను అదుపులోకి తీసుకుని, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా 51 శాతం బీఏసీ రీడింగ్ నమోదైందని పోలీసులు చెప్పారు. ఆదివారం రాయదుర్గం ఎస్ఐ నదీమొద్దీన్ వివరాలను మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్, లీజా.. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ కోకాపేట్‌లోని బ్లాసమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శనివారం స్నేహితుడు రవనీత్ సింగ్‌ను కలిసి.. రాత్రి జూమ్‌కార్‌లో క్రెటా కారును అద్దెకు తీసుకొని కారులోనే పార్టీ చేసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు లీజాతో కలసి కారు నడుపుకుంటూ మాదాపూర్ నుంచి నిర్మాణంలో ఉన్న టీహబ్ మీదుగా రాయదుర్గం వైపు వెళుతున్నారు. మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్ కారును మితిమీరిన వేగంతో నడుపుతూ బయోడైవర్సిటీ వద్ద హోండా యాక్టివాను ఢీకొట్టింది. ఆ బైక్‌పై ఉన్న చిరంజీవి, సాయికుమార్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. మాదాపూర్‌లోని జుమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న చిరంజీవి రోజూమాదిరిగానే విధులు ముగించుకొని స్నేహితుడు సాయికుమార్‌తో కలసి యాక్టివాపై గచ్చిబౌలి నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఉన్న ఒక్క కుమారుడు చిరంజీవి మృతి చెందడంతో రామాయణం శ్రీనివాస్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పల్టీలు కొట్టిన కారు.... మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్ మితిమీరిన వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. క్రేటా కారులో బెలూన్ ఓపెన్ కావడంతో జెన్నీ, లీజాకు గాయాలు కాలేదు. కారులో బీరు సీసాలు, చికెన్ లెగ్ పీస్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నదీమొద్దీన్ తెలిపారు. -
హద్దులు మీరకున్నంత వరకే ముద్దు..!
-
హద్దులు మీరకున్నంత వరకే ముద్దు..!
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ 10లో అద్భుత ఆటతీరు కనబరచిన యువ క్రికెటర్లలో రిషబ్ పంత్ ఒకడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడిన పంత్ 14 మ్యాచ్‌లలో 366 పరుగులు సాధించాడు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు పంత్. వీడియోలో మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ఎస్యూవీ కారును 125 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో నడుపుతున్నట్లు ఉంది. అయితే, పంత్ ఆనందం కోసం చేసిన పని విమర్శకులకు దారి తీసింది. ఢిల్లీ వీధుల్లో అత్యధిక వేగంతో వాహనాలను నడపకూడదు. దీంతో పంత్ నిర్లక్ష్యంపై కొందరు విమర్శలు చేశారు. హద్దులు మీరకున్నంత వరకే ముద్దని అంటున్నారు. ❤❤ #NewCar @rishabpant A post shared by Rishabh Pant FAN Culb (@rishabpant777) on May 23, 2017 at 2:25am PDT -
ఆటోను ఢీకొన్న లారీ
► ఆరుగురి దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు ► విజయనగరం జిల్లాలో ఘటన విజయనగరం: ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించగా నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం విజయనగరం జిల్లా డెంకాడ మండలం చందకపేట సమీపంలో విజయనగరం-నాతవలస ఆర్ అండ్ బీ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ముక్కుబంగార్రాజు శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం స్టాండ్‌నుంచి ఆటో నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రయాణికుల్ని ఎక్కించుకుని నాతవరం దాటి విజయనగరం వైపు వస్తుండగా ఎదురుగా అతివేగంతో వస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో రెండు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతి చెందినవారిలో పూసపాటిరేగ మండలం గులివిందపేటకు చెందిన గులివింద అప్పలనాయుడు(45), అదే మండలం చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(48), భోగాపురం మండలం మాల నందిగాంకు చెందిన మిరప గోవింద(37), డెంకాడకు చెందిన బంగారి సూరి(34), విజయనగరం పట్టణంలోని కోరాడ వీధికి చెందిన ఆర్.రాజేష్(23), శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నెల్లిమర్ల అప్పారావు(30) ఉన్నారు. గాయపడిన డెంకాడకు చెందిన బంగారి అప్పారావు, పి.శ్రీను, ఆటోడ్రైవర్ ముక్కు బంగార్రాజు, విజయనగరానికి చెందిన ఆర్.రాజశేఖర్‌లు విజయనగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్లు వెనువెంటనే పరారయ్యారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు, విజయనగరం ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పరిశీలించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో ఉన్న మృతుల కుటుంబీకులను, క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. కాగా, మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతో విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రి శోకసంద్రమైంది. మృతులు, గాయపడిన వారిలో అత్యధికులు ప్రైవేటు కంపెనీల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిపైనే ఆయా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. చందకపేట రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి విజయనగరం జిల్లా డెంకాడ మండలం చందకపేటలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
కొల్లాపూర్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన రామకృష్ణ, మల్లేశ్‌లు కారులో కొల్లాపూర్ వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న కారు అంకిరావుపల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగండి.. ఆగండి!
►వాహనాల స్పీడ్‌కు ఇక చెక్ ►40 కిమీ దాటితే రూ.300ల జరిమానా ►సెన్సర్ల ద్వారా స్పీడ్ లేజర్ గన్‌తో వాహన వేగం షూట్ ► రోజుకు 60 నుంచి 70 వాహనాలకు జరిమానా విధిస్తున్న పోలీసులు చీమకుర్తి రూరల్ : హైటెక్ టెక్నాలజీ సాయంతో పోలీసులు హైస్పీడ్ వాహనాలను గుర్తిస్తున్నారు. వెంటనే ప్రింటౌట్ తీసి ఎగువనున్న పోలీసులకు సమాచారం అందించి వెంటనే రూ.300ల చలానా రాసేస్తున్నారు. ఒంగోలు నుంచి పొదిలి వైపు వెళ్లే కర్నూలు రోడ్డులో పేర్నమిట్ట వద్ద ఒకటిన్నర నెల నుంచి హైస్పీడ్ వాహనాలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ రంగనాథ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు ఇంటర్ సెప్టర్ వాహనంలో ప్రత్యేకంగా అమర్చిన స్పీడ్ లేజర్‌గన్ సాయంతో 40 కిమీ కంటే ఎక్కువ వేగంగా వచ్చే వాహనాలను గుర్తించి వెంటనే ఆ వాహనం ప్రింటౌట్ బయటకు తీస్తున్నారు. దానిలో ఆ వాహనం వస్తున్న వేగం ఎంత, రావాల్సిన వేగం ఎంత.. వంటి పూర్తి వివరాలతో సహా వాహనం ఫొటోతో ప్రింటౌట్ వస్తుంది. వెంటనే వేగాన్ని అతిక్రమంచిన వాహనానికి సంబంధించిన సమాచారాన్ని వైర్లెస్ సెట్లో ఎగువనున్న పోలీసులకు అందిస్తారు. ఫొటో తీసిన ప్రింటౌట్ను ఎగువకు వెళ్లే ఇతర వాహనదారుల ద్వారా పంపిస్తారు. ఎగువన వేగాన్ని అతిక్రమించిన వాహనదారుడిని పోలీసులు జెండా ఊపి పక్కకు తీస్తారు. వారికి ఒక్కొ వాహనానికి రూ.300 చొప్పున చలానా రాసి పంపిస్తున్నారు. ఇలా హైటెక్ పోలీసు ఇంటర్ సెప్టర్ వాహనాలు రాష్ట్రంలో మూడే మూడు ఉన్నాయి. ఒకటి వైజాగ్, రెండు తిరుపతి, మూడు పేర్నమిట్ట. ప్రమాదాలు ఎక్కవ జరిగే చోట నిఘా: ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న చోట్ల హైటెక్ ఇంటర్ సెప్టర్ వాహనాలు ఉంచుతున్నారు. కర్నూలు రోడ్డులో ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఒంగోలు వరకు మధ్య ప్రాంతంలో ఎక్కువుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పేర్నమిట్ట ప్రాంతంలో స్పీడ్ కంట్రోల్‌ను 40 కిమీగా నిర్ణయించి రోడ్డు మీద బోర్డు పెట్టారు. స్పీడ్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చే వాహనాల వేగాన్ని 40 కిమీ దాటిన తర్వాత వాస్తవానికి జరిమానా విధించాలి. కానీ లేజర్ గన్ అదనంగా మరో 15 కిమీ వరకు సహిస్తుంది. అంటే 55 కిమీ వరకు ఫొటో తీయకుండా 56 కిమీ దాటిన వాహనాలను మాత్రమే ఫొటో తీసి బయటకు పంపిస్తుంది. ఇలా వాహనదారుల అతివేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న హైటెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి వాహనదారులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గమనించడం కష్టం: పోలీసులు ఇంటర్ సెప్టర్ వాహనంతో రోడ్డు పక్కన ఉంటారు. వారు చలానా రాస్తారని వాహనదారులు ఆఖరి వరకూ గమనించలేకపోతున్నారు. దీన్ని గతంలో నేషనల్ హైవేపై పేస్, రైజ్ కాలేజీల వైపు ఉంచారు. ప్రస్తుతం పేర్నమిట్ట వైపు ఎక్కువుగా ప్రమాదాలు జరుగుతుండటం గమనించి పోలీసు ఉన్నతాధికారులు పేర్నమిట్ట్టపై దృష్టి సారించారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఒంగోలు వైపు వచ్చే వాహనాలకే కాకుండా ఒంగోలు నుంచి సంతనూతలపాడు వైపు వెళ్లే వాహనాలకు కూడా విడతలు వారీగా ఇంటర్ సెప్టర్ వాహనాన్ని మార్చి మార్చి స్పీడ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఐ రంగనా«థ్ తెలిపారు. ఇప్పుడు వాహనాల స్పీడ్ తగ్గటమే కాకుండా గతంతో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొంటున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు వాహనాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. రోజుకు 60 నుంచి 70 మంది వాహనాలను గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. -
వేగం 100 కి.మి దాటితే ఇక జైలుకే
-
విషాదం మిగిల్చిన అతివేగం
–వరుసగా ట్రాక్టరు, ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు – ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు – ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు – కన్నీరు మన్నీరుగా విలపించిన బంధువుల ఆదోని టౌన్: ఆదోని– ఆస్పరి రోడ్డులోని మిల్టన్ హైటెక్ స్కూల్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు, మృతుడి బంధువులు వాపోయారు. తాలూకా ఎస్ఐ నీలకంఠేశ్వర తెలిపిన వివరాలు మేరకు.. పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంత్రాలయం నుంచి పుట్టపర్తికి వెళ్తొంది. ఆస్పరి రోడ్డులోని మిల్టన్ హైటెక్ స్కూల్ వద్ద బస్సు ముందు వెళు్తన్న శంకరబండకు చెందిన ట్రాక్టరును ఢీ కొట్టింది. ట్రాక్టరు ఇంజిన్ నుజ్జు నుజ్జు అయింది. ట్రాలీ రోడ్డు పక్కన ఎగిరి పడింది. తర్వాత కొద్ది ముందుకు వెళ్లి ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను బసు్స ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ముగ్గురు బాలికలు,ఒక బాలుడు, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నీలకంఠేశ్వర సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి తరలించిన ఏడుగురిలో ఆస్పరి మండలం బిణిగేరికి చెందిన డబ్బల రామాంజనేయులు(42) చికిత్స మొదలవ్వకముందే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన బాలుడు లక్ష్మన్న గాయాలుకాగా చిరుమాన్‌దొడ్డికి చెందిన పెద్ద అంజినయ్య(55) రెండు కాళ్లు నుజ్జు అయ్యాయి. ట్రాక్టరు డ్రైవరు వీరేష్‌కు రక్త గాయాలయ్యాయి. ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రమాదం ఆటోను బస్సు ఢీకొన్న ఘటనలో ఆస్పరి మండలం బిణిగేరి గ్రామానికి చెందిన లక్ష్మన్న, మంగమ్మ దంపతుల ముగ్గురు కూతుళ్లు ఉమ, రేవతి, ఉష తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు పదేళ్ల లోపు వయస్సు ఉన్నవారే. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుళ్లు ప్రమాదంలో గాయపడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘అయ్యా.. డాక్టరు సారూ.. నాకూతుళ్లను బాగు చేయండంటూ’ తల్లి మంగమ్మ విలపించిన తీరు పక్కనున్న వారికి కంట తడి పెట్టించింది. పిల్లలతో కలిసి ఈ దంపతులు కమ్మరచేడు జాతరకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నీలకంఠేశ్వర తెలిపారు. -
12 పసిప్రాణాలు బలి
► ఉత్తరప్రదేశ్‌లో లారీ, బస్సు ఢీ ►పొగమంచు, అతివేగం వల్లే.. ఎటా(ఉత్తరప్రదేశ్): ప్రతీరోజు లాగే ఆరోజు కూడా స్కూలు బస్సెక్కారు పిల్లలు. కానీ పాఠశాలకు చేరాల్సిన వారి గమ్యస్థానం ఆసుపత్రులకు, మార్చురీలకు చేరింది. ఎంతో సున్నితమైన చిన్నారుల శరీరాలు బస్సులో ఛిద్రమైపోయాయి. పాఠశాలలో ఆటపాటలతో కేరింతలు కొట్టాల్సిన వారు, భయంతో ఆర్తనాదాలు చేయాల్సి వచ్చింది. పొగమంచు, అతి వేగం, యాజమాన్య నిర్లక్ష్యం కలసి 12 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎటా జిల్లాలోని అలీగంజ్–పాలియాలి రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. మృతుల్లో 12 మంది బాలలు, బస్సు డ్రైవర్ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చలి అత్యధికంగా ఉండటంతో పాఠశాలలకు సెలవివ్వాలన్న జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ధిక్కరిస్తూ స్థానిక జేఎస్ విద్యానికేతన్ తరగతులు నిర్వహిస్తోంది. ఈ పాఠశాలకు చెందిన బస్సు 66 మంది చిన్నారులతో వెళు్తండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటన కు పొగమంచు, అతి వేగమే కారణమని అధికారులు చెబుతున్నారు. మరణించిన విద్యార్థులంతా 5–15 ఏళ్ల విద్యార్థులు కావడంతో ఘటనా స్థలంలో, ఆస్పత్రిలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఈ ఘటన తెలిసిన వెంటనే ఎంతో ఆవేదన చెందాను. చనిపోయి న బాలల కుటుంబాల బాధను నేనూ పంచుకుంటున్నాను. మృతి చెందిన చిన్నారులకు నివాళులు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
బాలకృష్ణ కాన్వాయ్‌లో ప్రమాదం
అనంతపురం : సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని కార్లు హిందూపురం మండలం కోడికొండ చెక్‌పోస్టు సమీపంలో బుధవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో కూడా బాలకృష్ణ కాన్వాయ్‌లోని ఓ వాహనం బెంగళూరు సమీపంలో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. -
బైక్‌ను ఢీకొన్న లారీ: యువకుడి మృతి
బూర్గంపాడు(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న రాయల దుర్గ(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కలవారు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు విజయనగర్ కాలనీ వాసిగా గుర్తించారు. -
కారు బోల్తా.. ఇద్దరి మృతి
-
కారు బోల్తా.. ఇద్దరి మృతి
జగిత్యాల: కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు అదుతప్పింది. ఆ వెంటనే బోల్తాపడి కారు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం
ఆటో, మినీ బస్సు ఢీ, ఇద్దరి దుర్మరణం నిమజ్జన వేడుకలకు వెళ్తూ అనంతలోకాలకు.. ఓ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని రెండు ప్రాణాలు బలయ్యాయి. త్వరగా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో మినీ బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్‌గా వెళుతూ.. ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ క్రైం: మండలంలోని ఓబులాయపల్లిలో సమీపంలో మంగళవారం సాయంత్రం ఓ మినీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరో మహిళ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం గద్దెగూడెంకు చెందిన సతీష్ హైదరాబాద్‌లో గండిపేటలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు, దాస్, శ్రీను, మణెమ్మ, నక్షత్ర అక్కడే కూలీ పని చేస్తూ బతుకుతున్నారు. అయితే మంగళవారం గద్దెగూడెంలో వినాయక నిమజ్జనం ఉండటంతో మధ్యాహ్నం 12గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఆరుగురు కలిసి ఏపీ 28 టీబీ 8568నంబర్ కలిగిన ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో సాయంత్ర 4.45 గంటల సమయంలో మండలపరిధిలో ఓబులాయపల్లి సమీపంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేఏ 20డీ 5797 నంబర్ కలిగిన మినీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అతివేగంతో పూర్తిగా రోడ్డు కుడివైపుకు వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆంజనేయులు(17) అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఎరుకలి మణెమ్మ(45)ను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృత్యువాతపడింది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఆటో డ్రైవర్ సతీష్, దాస్, శ్రీను, చిన్నారి నక్షత్రలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి. గాయపడిని నక్షత మృతి చెందిన మణెమ్మ మనవరాలు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
లారీని ఢీకొట్టిన కారు : ఒకరి మృతి
నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న కారు, లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. -
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు
గిద్దలూరు(ప్రకాశం): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ముండ్లపాడు నుంచి గిద్దలూరు వెళ్తున్న ప్రయాణికుల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రాణం తీసిన అతివేగం
ఓర్వకల్లు – హుసేనాపురం గ్రామాల మధ్య జాతీయరహదారిపై ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఇద్దరు దుర్మరణం... ఆరుగురికి గాయాలు క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలుకు తరలింపు ఓర్వకల్లు: కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలో ఓర్వకల్లు–హుసేనాపురం గ్రామాల మధ్య గుట్టపాడు బస్సు స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయాలపాలయ్యారు. అతివేగమే ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ డిపోకు చెందిన (ఏపీ21 టీఏ0126) నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తోంది. రాజమండ్రి నుంచి బళ్లారికి పండ్ల మొక్కలను తరలిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన(ఏపీ02టీసీ8555) నంబర్ గల ఐచర్ వాహనం గుట్టపాడు బస్‌స్టేజీ వద్ద ముందుగా వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ నారాయణ(40) అక్కడికక్కడే దుర్మరణం చెందగా తీవ్రగాయాలైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయి(20) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతిచెందాడు. అదే వాహనంలో ఉన్న మిగతా ఇద్దరు కో డ్రైవర్లు రహంతుల్లా, రమేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణిస్తుండగా వారిలో డ్రైవర్ వెంకటయ్య, కండక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు, బండి ఆత్మకూరు మండలం ఎ.కోడూరుకు చెందిన బావాబామర్దులు వెంకటేశం, వెంకటరమణకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటేశం సిండికేట్ బ్యాంక్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ఢీకొన్న వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వెంటనే హెడ్ కానిస్టేబుల్ కేశవరెడ్డి, పోలీసులు మల్లికార్జున, సమీర్ ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. తర్వాత స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ మల్లికార్జున ఐచర్ వాహనంలో ఇరుక్కుపోయిన నారాయణ మతదేహాన్ని యంత్రాల సాయంతో వెలికి తీయించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్చార్జ్ ఎస్ఐ తెలిపారు. ప్రమాదాలకు కేరాఫ్ జాతీయ రహదారి జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపు ఆరేళ్లు అవుతున్నా పూర్తి కావడం లేదు. నిర్మాణ పనుల్లో భాగంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు తవ్వి ఉండటం, పలుచోట్ల క్రాసింగ్‌లు ఉండంటతో వాహనచోదకులు గుర్తించలేక ప్రమాదాల భారీన పడుతున్నారు. కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై హుసేనాపురం సమీపంలో వంతెన నిర్మాణం కోసం తవ్విన గుంతలో జూలై 31వ తేదీన ఓ పోలీసు ఉద్యోగి పడి దుర్మరణం చెందగా, ఈనెల 9వ తేదీన నన్నూరు సమీపాన గల రబ్బానీ స్టోరేజీ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు జరిగి పట్టుమని పదిహేను రోజులు కూడా కాకముందే శనివారం ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొని ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
చాట్రాయి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. మొక్కజొన్న కండెల లోడు లారీ పల్టీ కొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు. లారీ ఢీకొని మరో యువకుడు దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం అడ్డరోడ్డుకు చెందిన 18మంది కూలీలు బుధవారం చాట్రాయి మండలంలోని చిత్తపూరు గ్రామంలో మొక్కజొన్న కండెలు విరిచే పనికి వచ్చారు. సాయంత్రం మొక్కజొన్న కండెలు లోడు చేసుకుని తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా, మర్లపాలెం గ్రామం వద్ద లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కూలీలు అబ్బదాసరి ఫ్రాన్సిస్(40), అబ్బదాసరి లక్ష్మి(35) దంపతులు మృతిచెందారు. తాణంకి నాగరాజు, తాణంకి వేణు, కొమ్ము పద్మ, శిరోమణి, నాగజ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో నూజివీడు, చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మితిమీరిన వేగం.. తీసింది ప్రాణం కంకిపాడు : జాతీయ రహదారిపై కంకిపాడు–గోసాల మార్గంలో వేగంగా వెళ్తున్న లారీ, మోటారుసైకిల్ ఢీకొని ఓ యువకుడు మరణించాడు. విజయవాడ నుంచి ఉయ్యూరు వైపు వెళ్తున్న లారీ, కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఓ కార్పొరేట్ కాలేజీ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. లారీ ఇంజిన్ భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన యువకుడు ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఎన్.అశోక్ (25)గా గుర్తించారు. అతను పెయింటర్‌గా పని చేస్తుంటాడని తేలింది. గాయపడిన వ్యక్తి కూడా అదే గ్రామానికి చెందిన కర్రా శివకోట్లుగా నిర్ధారించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అశోక్, శివకోట్లును 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు హల్చల్: ఒకరికి గాయాలు
నార్తురాజుపాలెం(కొడవలూరు): నార్తురాజుపాలెంలో కారు హల్చల్ చేసిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వారు కొత్తకారు కొనుగోలు చేసి ఆ కారులో రామతీర్థానికి పూజకు వెళ్లారు. అక్కడ పూజ పూర్తి చేసుకొని తిరిగి అతివేగంగా వస్తూ బసవాయపాలెం వద్ద నెల్లూరు నుంచి విధులు ముగించుకొని స్వగ్రామమైన అల్లూరుకు మోటార్ సైకిల్‌పై వెళుతున్న కుండా గౌతమ్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గౌతమ్‌కు గాయాలయ్యాయి. ఆ వెంటనే అప్రమత్తమైన గౌతమ్lకారును వెనుకనే వెంబడించగా, మరింత వేగంతో నార్తురాజుపాలెం వైపు వచ్చిన ఆ కారు స్థానిక బస్టాండు కూడలిలో అతివేగంగా అటుఇటు తిప్పుతూ స్థానికులను భయభ్రాంతులను చేసి నెల్లూరు వైపు దూసుకెళ్లింది. కారును అతివేగంగా మలుపులు తిప్పడంతో కూడలిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నార్తురాజుపాలెంలో హల్చల్ చేసి పరారైన కారు నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద వదిలేసి ఉండగా, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హల్చల్ చేసిన కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. -
ప్రాణాలు తీసిన నిద్ర మత్తు.. అతి వేగం
దొరవారిసత్రం (నెల్లూరు) : స్కార్పియో కారు డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం వేకువజామున జరిగింది. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్ సెంట ర్ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరీరికం సందర్భంగా స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16న భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటలకు పొన్నేరికి కారులో బయలుదేరారు. కలగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్ ధరణి నరేష్ (30), డాక్టర్ భవాని ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల దుర్మరణం
టిప్పర్‌ను ఢీకొన్న బైకు అతివేగంతోనే ప్రమాదం గచ్చిబౌలి : అతివేగం ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఉసురు తీసింది. యూ టర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను బైకు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... ఖాన్పూర్కు చెందిన అమోద్‌సింగ్(27) వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటుండగా... లక్నోకు చెందిన పూజాసింగ్(26) గోల్కొండలోని మిలటరీ ఆసుపత్రి ఎదురుగా నివాసం ఉంటోంది. ఇద్దరూ అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. శనివారం సెలవు కావడంతో స్నేహితులు నేహా మిట్టల్, అభిషేక్‌లతో కలిసి బైకులపై చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్లి.. సాయంత్రం తిరిగి వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని క్రీమ్‌స్టోన్‌లో ఐస్‌క్రీం తిని తిరిగి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నేహా ఇంటికి బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న అమోద్‌సింగ్ బైక్ రాత్రి 10.50 గంటలకు గచ్చిబౌలిలోని మైక్రోసాప్ట్ గేట్-1 ఎదురుగా యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమోద్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలకు గురైన పూజాసింగ్ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ కొద్ది గంటల్లోనే మృతి చెందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతివేగానికి పదుల సంఖ్యలో ప్రాణాలు బలి
దర్శి : అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో దారిన వెళుతున్న ఓ వ్యక్తితో పాటు 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కారు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా... ఎదురుగా ఓ లారీ రావడంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో కారు చిన్న వెంకయ్య(50) అనే వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు ఎగిరి రోడ్డు అవతలి వైపు పడిపోయాడు. అనంతరం కారు రోడ్డుపై వెళుతున్న ఓ గొర్రెల మందను ఢీకొంది. సుమారు 1,000 గొర్రెలు వెళుతుండగా కారు వేగంగా ఢీకొట్టడంతో 40 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. మరి కొన్నింటికి నడుం, కాళ్లు విరిగిపోయాయి. దీంతో ప్రమాద స్థలి భీతావహంగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబుల్ రోడ్డు కావడంతో మరో వైపు వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. -
సైదాబాద్‌లో కారు బీభత్సం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న దోబీ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఓ మహిళ అతి వేగంతో కారు నడపడంతో సైదాబాద్ దోబీ ఘాట్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
► మరో ఇద్దరి విద్యార్థులకు తీవ్రగాయాలు ► కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఘటన ► బర్త్‌డే పార్టీ తిరుగు ప్రయూణంలో విషాదం ► పంథిని, నాగేంద్రనగర్‌లో విషాదఛాయలు బర్త్‌డే పార్టీ వేడుక విషాదాంతమైంది.. శుక్రవారం అర్ధరాత్రి కారు అతివేగంగా చెట్టును ఢీకొనడంతో పిన్నింటి అనిదీప్‌రావు, అభినవ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయూలయ్యూరుు. వీరు ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు.. ఘటన వరంగల్-ఖమ్మం రహదారి నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది.. వర్ధన్నపేట మండలం పంథిని, నగరంలోని నాగేంద్ర నగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నారుు. మామునూరు : నలుగురు బీటెక్ విద్యార్థులు కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న వారి ప్ర యాణం విషాదాంతమైంది. కారు స్టీరింగ్ అదుపుతప్పి చెట్టును వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెం దగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవా రం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం పంథినికి చెందిన పిన్నింటి అమరేందర్‌రావు, కృష్ణజ్యోతి దంపతులకు కుమారుడు అనిదీప్‌రావు(19), కూతురు సిర ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహమైంది. అమరేందర్‌రావు వ్యవసాయం చేస్తూ కుమారుడు అనిదీప్రావును బీటెక్ చదివిస్తున్నారు. అనిదీప్‌రావు హన్మకొండలో ఉంటూ హసన్‌పర్తిలోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అని దీప్‌రావు బర్త్‌డే సందర్బంగా కుమారుడి కోరిక మేరకు అమరేందర్‌రావు వేర్న కారు (సెకండ్ హ్యాండ్)ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో స్నేహితుల కోరిక మేరకు కళాశాలలో బీటెక్ చేస్తున్న వరంగల్ నగరంలోని 11వ డివిజన్ నాగేంద్రనగర్ కాలనీకి చెందిన బిల్ల శంకర్ కుమారుడు బిల్ల అభినవ్(18), 16వ డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మారినేని లక్ష్మణ్‌రావు కుమారుడు కృష్ణ ప్రసాద్ (18), కాజీపేట సి ద్దార్థనగర్కు చెందిన బాలమోహన్‌రెడ్డి కుమారుడు బాల ప్రణయ్‌రెడ్డి(18)తో కలిసి అనిదీప్‌రావు శుక్రవారం సాయంత్రం కారులో తన స్వ గ్రామమైన పంధినికి వెళ్లాడు. బర్త్‌డే పార్టీ పూర్తి చేసుకుని ఆ నలుగురు విద్యార్థులు తిరిగి శుక్రవారం అర్ధరాత్రి నగరానికి కారులో బయలుదేరారు. ఈక్రమంలో వరంగల్-ఖమ్మం జాతీ య ర హదారిపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో వేగంతో ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న పిన్నింటి అనిదీప్రావుతోపా టు బిల్ల అభినవ్ అక్కడిక్కడే మృతిచెందగా... మరో ఇద్దరు మారినేని కృష్ణప్రసాద్, బాల ప్రణయ్‌రెడ్డి తీవ్ర ంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108 వా హనంలో తరలించారు. వైద్యుల సూచనల మే రకు బాల ప్రణయ్‌రెడ్డిని హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మారినేని కృష్ణప్రసాద్ హన్మకొండ లైఫ్లెన్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నాడు. మృతిచెందిన బిల్ల అ భినవ్, పిన్నింటి అనిదీప్‌రావు తల్లిదండ్రుల పిర్యాదు మేరకు మామునూరు పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హతిరాం తెలిపారు.కాగా, అతివేగం.. మద్యమత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కరణమై ఉంటుందని, ప్రమాదానికి గురైన కారు లో మద్యం సీసాలు దొరికినట్లు తెలిసింది. వి ద్యార్థులు మృతిచెందడంతో పంధిని, నాగేంద్రనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నారుు. ఇదిలాఉండగా, మామునూరు నాయుడు పె ట్రోల్ బంక్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆభినవ్(19) తన కళ్లను వరంగల్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. వరంగల్ కంటి ఆస్పత్రి డాక్టర్ ఎల్వీ ప్రసాద్ సూచనమేరకు ఆభినవ్ కళ్లను డొనేట్ చేశామని మృతుడి తండ్రి శంకర్ తెలిపారు. -
అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం: కర్ణాటక రవాణా మంత్రి
కర్ణాటకలోని హవేరి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి గురువారం బెంగళూరులో వెల్లడించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సు 140 -150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు.హవేరి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదం,ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం వద్ద వోల్వో బస్సు అగ్ని ప్రమాదం ఘటనలు ఒకేలా ఉన్నాయని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరు ముంబైకి చెందిన శ్రీరాంగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరమే ప్రమాదం జరిగిన బస్సును కొనుగోలు చేశారని మంత్రి రామలింగారెడ్డి వివరించారు. అయితే ప్రమాదానికి ముందు పెధ్ద శబ్దం వచ్చి, మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అద్దాలు పగుల కొట్టి బయటకు దూకామని ఆ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు వెళ్లడించారు. అయితే తన పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్ కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెట్స్కు చెందిన వోల్వో బస్సు ఈ రోజు తెల్లవారుజామున కునుమళ్లహళ్లి వద్ద వర్దా నది సమీపంలోనిరోడ్డు డివైడర్‌ను ఢీకొంది. అనంతరం టైర్ పేలింది. దాంతో ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ బస్సు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రలును హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
అతి వేగంతోనే అనర్థం
వోల్వో బస్సు ప్రమాదంపై పోలీసుల నిర్ధారణ! మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం వద్ద చోటుచేసుకున్న బస్సు దగ్ధం ప్రమాద సంఘటన అతివేగం కారణంగానే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అతివేగం వల్లే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందజేశారు. వనపర్తి సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో బెంగళూరుకు వె ళ్లిన ఓ బృందం జబ్బార్, దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాలను తనిఖీ చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రెండు ట్రావెల్స్ మధ్య గల ఆర్థిక బంధంపైనా ఆరా తీశారు. లగేజి బుకింగ్ వివరాలను పరిశీలించిన మీదట పేలుడు పదార్థాలేమీ బస్సులో లేవని గుర్తించారు. బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టి అక్కడే ఆగిపోవడంతో ట్యాంకులో ఉన్న డీజల్ మొత్తం ఒకేచోట పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఘోరం జరిగిపోయిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ‘వోల్వో ఇండియా’ ప్రతినిధులతో ఆర్టీఏ అధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ దుర్ఘటనలో అత్యంత ఆధునికమైన బస్సు నిమిషాల వ్యవధిలో బుగ్గిగా మారటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఆర్టీఏ అధికారులు, అందుకు దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ చేసేందుకు మంగళవారం వోల్వో ఇండియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత వోల్వో కంపెనీ నిపుణులు ఆ బస్సును పరిశీలించారు. అందులో వారు గుర్తించిన వివరాలను ఆధారం చేసుకుని, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని ఈ సమావేశంలో అధికారులు ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. యురోపియన్ రోడ్లకు సరిపడే డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్న వోల్వో బస్సులు మన రోడ్లపై వేగంగా వెళ్లటం ఎంతవరకు మంచిది, మంటలంటుకున్నప్పుడు వాటిని క్షణాల్లో తీవ్రం చేస్తున్న కర్టెన్లు, రెగ్జిన్, ఏసీ వాయువుల విషయంలో నాణ్యత ప్రమాణాలేంటి, వోల్వో బస్సులను నడపటంలో డ్రైవర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహించటం, ప్రమాదాలు సంభవించినప్పుడు వేగంగా ప్రయాణికులు బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఇలా పలు అంశాలపై అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే వాటిపై కంపెనీ యాజమాన్యంతో చ ర్చించి సవివరంగా సమాధానమిస్తామని ప్రతినిధులు వారికి సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ అనంతరాము, అదనపు, సంయుక్త కమిషనర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 520 బస్సులపై కేసులు నమోదు చేసి, 284 బస్సులను సీజ్ చేశారు. -
వేగంగా కారు నడిపినందుకు 80 లక్షల జరిమానా!!
బ్యాంకు ఖాతాలో బాగా డబ్బులుండటమే ఆ పెద్దమనిషి చేసుకున్న పాపం. అతి వేగంతో కారు నడిపినందుకు ఆ స్వీడిష్ కోటీశ్వరుడికి ఫిన్లాండ్లోని ఓ కోర్టు ఏకంగా 80 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆయన బాగా డబ్బున్నవాడు కావడమే అందుకు కారణమట. ఆండర్స్ విక్లాఫ్ (67) అనే వ్యాపారవేత్త ఫిన్లాండ్లోని అలాండ్ దీవుల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, 77 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు. దీంతో ఆయనకు 80 లక్షల రూపాయల జరిమానా విధించారు. అదే తన సొంత దేశం స్వీడన్లో అయితే ఆయనకు కేవలం ౩8 వేల రూపాయల జరిమానా మాత్రమే పడేది. ఫిన్లాండ్లో ఎవరికైనా ఎంత ఆస్తి ఉందన్నదాన్ని బట్టి వారికి జరిమానా విధిస్తారు. ఆండర్స్ విక్లాఫ్ వద్ద చాలా డబ్బు ఉంది. దాంతో ఆయనకు భారీ జరిమానా పడింది. తాను వేగంగా నడిపి చట్టాన్ని ఉల్లంఘించిన మాట నిజమే అయినా, జరిమానా మాత్రం మరీ ఎక్కువ వేశారని ఆ పెద్దమనిషి వాపోయాడు. దీనికి బదులు వృద్ధుల కోసం తాను ఈ డబ్బు ఖర్చుపెట్టి ఉండేవాడినని అన్నాడు.