
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు స్పీడ్ గన్ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment