Transport Department
-
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది. -
దేశంలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆర్బీఐ కీలక ప్రకటన!
దేశంలో సామాన్యులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యను అరికట్టేందుకు ఆర్ బీ ఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇక నుంచి నగదుతో పనిలేకుండా, చిల్లర సమస్యలు లేకుండా ప్రయాణాలకు చెల్లింపులు సులభతరం కానున్నాయి. ప్రయాణికులకు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం, వేగం, స్థోమత, భద్రతను అందించేలా విధ ప్రజా రవాణా వ్యవస్థల్లో చెల్లింపులు చేసేందుకు వీలుగా బ్యాంక్, నాన్-బ్యాంకులకు బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పీపీఐ PPI-MTS (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు-మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్) సాధానాల్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది పీపీఐ అంటే? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ ఇన్ స్ట్రుమెంట్ (పీపీఐ)లు డిజిటల్ వాలెట్స్ గా పనిచేస్తాయి. వీటిలో మనీని యాడ్ చేసుకొని, వేర్వేరు లావాదేవీలు చేసుకోవచ్చు. అమెజాన్ పే, పేటీఎం,ఫోన్ పే వంటివి డిజిటల్ వాలెట్స్ ను అందిస్తున్నాయి. కస్టమర్ ఈ వాలెట్లలో డబ్బులు యాడ్ చేసుకుంటే, ఆ మనీ బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అవ్వదు. బదులుగా పేమెంట్ కంపెనీ దగ్గర స్టోర్ అవుతుంది. పేమెంట్స్ చేసేటప్పుడు వాలెట్ లోని మనీ కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు. తాజాగా ఆర్ బీ ఐ ప్రయాణ సమయాల్లో పీపీఐని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రీపెయిడ్ సాధనాలు మెట్రో, బస్సులు, రైలు, జలమార్గాలు, టోల్లు, పార్కింగ్ వంటి వివిధ ప్రజా రవాణా మార్గాలలో చెల్లింపుల కోసం మాత్రమే ప్రారంభించబడతాయి. ఈ ప్రీపెయిడ్ సాధనాలకు హోల్డర్ల కేవైసీ ధృవీకరణ అవసరం లేదు. -
TS: రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాసం -
సరుకు రవాణాల్లో ఏపీ భేష్
సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది. భూ కేటాయింపుల్లోనూ బెస్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది. వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్‌పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది. ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది. -
ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన స్కూల్ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్ ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. నిర్మల్‌చైన్‌గేట్: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం జిల్లాలోని 208 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొనసాగుతున్న దళారుల దందా... అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్నెస్’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం. తనిఖీల జాడేది? విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండెంట్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. ● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. ● వాహనం టైర్లు, బ్రేక్‌లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి. ● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. – అజయ్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్ సీజ్
ఆదిలాబాద్‌టౌన్: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్‌లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్‌లో దింపారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్‌లను సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్‌లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వీరిని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్‌లను సోమవారం సీజ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎం కల్పన పాల్గొన్నారు. -
రవాణా రంగానికి అండగా ప్రభుత్వం
-
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
హైదరాబాద్: వాహనదారులకు షాక్.. దొరికారో 200 శాతం పెనాల్టీ తప్పదు!
సాక్షి,హైదరాబాద్: త్రైమాసిక పన్ను చెల్లించకుండా పట్టుబడే వాహనాలపై భారీ ఎత్తున పెనాల్టీలు విధించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వాహనదారులు పెండింగ్‌ల ఉన్న పన్ను బకాయీలపైన స్వచ్చందంగా ముందుకు వస్తే 50 శాతం వరకు అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం ఉంది. కానీ రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం ఏకంగా 200 శాతం వరకు పెనాలిటీల రూపంలో చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్టీఏ కొనసాగిస్తున్న ప్రత్యేక తనిఖీలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకు పైగా పన్ను చెల్లించని వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల్లో కొన్ని 3 నెలల కాలపరిమితికే పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కోవిడ్ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. చాలా వరకు 9 నెలల నుంచి 18 నెలల వరకు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఫిబ్రవరి నెలాఖరులోనే తనిఖీలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలను ఉధృతం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పన్ను చెల్లింపులకు గడువు విధించడంతో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తేలికపాటి వాహనాలే అధికం.. గ్రేటర్లో సుమారు 5 లక్షల వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణా రంగంలో కీలకమైన లారీల్లో చాలా వరకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించి రవాణాశాఖ నుంచి అనుమతి పొందాయి. అలాగే మరో 10 వేలకు పైగా స్కూల్ బస్సులు, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు,తదితర వాహనాలు సైతం సకాలంలో పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చాలా వరకు తేలికపాటి రవాణా వాహనాల కేటగిరీ కిందకు వచ్చే టాటాఏస్‌లు, డీసీఎంలు, మినీ బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్ను చెల్లించలేకపోయారు. మరోవైపు రెండేళ్ల కాలపరిమితికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది పన్ను చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు భారం పెరిగినట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనే రెండు త్రైమాసిక పన్ను వాయిదాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారు రూ.13 కోట్ల వరకు బకాయీలను వసూలు చేశారు. ప్రతి రోజు సగటున రూ.60 లక్షలకు పైగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంవీఐకి రూ.7 లక్షల వరకు టార్గెట్ విధించారు. తనిఖీలు ఉధృతం త్రైమాసిక పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టాం. పన్ను చెల్లించని వాహనాలపైన తనిఖీలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాం. వాహనదారులు స్వచ్చందంగా ఆన్లైన్లో లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. తనిఖీ బృందాలు వాహనాలను జప్తు చేసి వెహికిల్ చెకింగ్ రిపోర్ట్ (వీసీఆర్) రాస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. –జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాగి వాహనాలు నడిపిన 5,819 మంది వాహనదారుల లైసెన్స్‌లను రద్దు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా 3,220 మంది లైసెన్సులు రద్దయ్యయాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రవాణా శాఖ తేల్చి చెప్పింది. చదవండి: TSRTC: లాభాల కిక్‌తో 2023లోకి ఆర్టీసీ.. పదేళ్లలో తొలిసారి.. -
పుంజుకుంటున్న రవాణా ఆదాయం
సాక్షి, అమరావతి: రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతోంది. గత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) వరకు రూ.1,531.29 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు (6 నెలలు) రూ.2,130.92 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఆదాయంలో 39.15 శాతం మేర వృద్ధి నమోదైంది. గత రెండేళ్లలో కోవిడ్–19 ప్రభావం రవాణా రంగం ఆదాయంపై తీవ్రంగా పడింది. 2019–20 రవాణా ఆదాయం గణనీయంగా పడిపోగా.. 2020–21లోనూ నేలచూపులు చూసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇప్పుడిప్పుడే ఆదాయం మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు మినహా అన్నిరకాల వాహనాల్లో ఈ ఏడాది తొలి 6 నెలల్లో వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గత ఏడాది కంటే 6.52 శాతం తగ్గింది. అయితే, కార్ల అమ్మకాల్లో మాత్రం వృద్ది నమోదైంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో కార్లు కొనుగోళ్లలో 8.27 శాతం, గూడ్స్ వాహనాల కొనుగోళ్లలో 22.67 శాతం మేర వృద్ధి నమోదు కాగా.. పాసెంజర్ వాహనాల కొనుగోళ్లలో 85.02 శాతం, ఆటోల కొనుగోళ్లలో 83.94 శాతం వృద్ధి నమోదైంది. -
2024 కల్లా అమెరికాకు దీటుగా రోడ్లు: నితిన్ గడ్కరీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. లఖ్‌నవూలో జరిగిన ‘ఇండియన్ రోడ్డు కాంగ్రెస్’ 81వ సదస్సులో రోడ్ల నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.8,000 కోట్లు విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్ రహదారులను అగ్రరాజ్యానికి దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.5 లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు నితిన్ గడ్కరీ. ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో మాట్లాడుతూ భారత్‌లోని రోడ్ల మౌలిక సదుపాయాలు త్వరలోనే అమెరికా తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ‘షాహబాద్-హర్దోర్ బైపాస్, షాజహాన్‌పుర్ టూ షాహబాద్ బైపాస్, మోరాబాద్- థాకుర్వారా-కషిపుర్ బైపాస్, ఘాజిపుర్-బలియా బైపాస్‌లతో పాటు 13 ఆర్వోబీలు, మొత్తం రూ.8వేల కోట్లు ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. సాంకేతికత, పర్యావరణ పరిక్షణ, వినూత్నత, భద్రత, నాణ్యత.. వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి జరగాలి.’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్‌తో కాకుండా సీఎన్జీ, ఇథనాల్, మిథనాల్‌తో నడిచే వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు గడ్కరీ. విద్యుత్తు వాహనాలను వినియోగించాలన్నారు. ఫలితంగా రవాణ వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు.. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు గడ్కరీ. యూపీలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్ -
కేవలం 4 నెలల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఎన్ని లక్షలు ఫైన్ కట్టారో తెలుసా!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు స్పీడ్ గన్ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. చదవండి: అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు -
భారీ షాక్: పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు భారీగా పెంపు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సి రానుంది. ప్రస్తుత స్థాయికి ఎనిమిది రెట్లు అధికంగా కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 600గా ఉంది. ఇక పాత బైక్‌ల రెన్యువల్ కోసం రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతమిది రూ. 300గా ఉంది. మరోవైపు, 15 ఏళ్లు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం రూ. 12,500 (ప్రస్తుతం రూ. 1,500), మధ్యస్థాయి గూడ్స్ లేదా ప్యాసింజర్ వాహనానికి రూ. 10,000 చార్జీలు వర్తిస్తాయి. దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 10,000, కార్లకు రూ.40,000 కట్టాల్సి ఉంటుంది. అదనం.. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే రోజుకు రూ. 50 చొప్పున అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ స్మార్ట్ కార్డ్ తరహా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే అదనంగా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే ప్రతి నెలకు రూ. 300 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాలి. అదే వాణిజ్య వాహనాలకైతే ఇది రూ. 500. చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు! -
ఏం తెలివి.. 'స్మార్ట్'గా దోచేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో ‘స్మార్ట్’ దోపిడీ యధేచ్చగా కొనసాగుతోంది. వాహనదారులకు స్మార్టు కార్డులను అందజేసేందుకు గ్రేటర్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా పంపించవలసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ తదితర స్మార్ట్‌కార్డులను ఏజెంట్లకు కట్టబెడుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఇందుకోసం ఒకరిద్దరిని ప్రత్యేకంగా నియమించడం గమనార్హం. ఒక్కో కార్డుపైన రూ.100 నుంచి రూ.150 చొప్పున కొన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు వందకు పైగా స్మార్ట్ కార్డులను విక్రయిస్తున్నారు. కొంతమంది సిబ్బంది ఇలా చేతివాటాన్ని ప్రదర్శించడం ఆర్టీఏ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవల్లో పారదర్శకతను పెంపొందించేందుకు ఆన్లైన్ సేవలను విస్తృతం చేశారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రం వినియోగదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌కార్డులనే నేరుగా అందజేసేందుకు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. చిరునామా నిర్ధారణకే స్పీడ్ పోస్టు... డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, తదితర డాక్యుమెంట్లను గతంలో వాహనదారులకే నేరుగా అందజేసే వారు. దీంతో చాలామంది నకిలీ అడ్రస్లపైన ఆర్టీఏ పౌరసేవలను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కీలకమైన డ్రైవింగ్ లైసెన్సు వంటి డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లవచ్చుననే ఆందోళన వివిధ స్థాయిల్లో వ్యక్తమైంది. పైగా ఒకే వ్యక్తి రకరకాల చిరునామాలపైన ఒక టి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొనేవా రు. వాహనాల అమ్మకాలు, యాజమాన్య బదిలీల్లో నూ అక్రమాలు జరిగాయి. దీంతో వాహనదారుల చిరునామా నిర్ధారణను తప్పనిసరి చేశారు. ఇందుకోసం డాక్యుమెంట్లను వాహనదారులకు నేరుగా ఇవ్వకుండా స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికే పంపించేందుకు చర్యలు చేపట్టారు. సర్వీసు చార్జీల్లో భాగంగా స్పీడ్ పోస్టు కోసం రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్‌పోస్టు చార్జీలు చెల్లించినప్పటికీ ఏజెంట్ల ద్వారా డాక్యుమెంట్లనే నేరుగా తీసుకొనేందుకు మరో రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. కొరవడిన నియంత్రణ.. గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి వివిధ రకాల పౌరసేవలపైన ప్రతి రోజు సుమారు 2500 నుంచి 3000 స్మార్ట్ కార్డులు పంపిణీ అవుతాయి. కొన్ని ఆఫీసుల్లో కచ్చితంగా పోస్టు ద్వారానే వినియోగదారులకు చేరవేస్తున్నప్పటికీ మరి కొన్ని ఆఫీసుల్లో మాత్రం 50 శాతం నుంచి 60 శాతం కార్డులను నేరుగా అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
రూ 6400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి : కృష్ణబాబు
-
బడ్జెట్ 2021: పదేళ్ల మెగా ప్రణాళిక
న్యూఢిల్లీ: కరోనా అన్ని రవాణా వ్యవస్థలతో పాటు భారతీయ రైల్వేపైనా పెను ప్రభావం చూపించింది. కొన్ని నెలల పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,10,055 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయంగా పేర్కొన్నారు. ‘రికార్డు’బడ్జెట్‌గా అభివర్ణించినా 2020–21 సవరించిన బడ్జెట్ (రూ.1.11 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే. మరోవైపు 2030 కల్లా భవిష్యత్ అవసరాలకు తగిన (ఫ్యూచర్ రెడీ) రైల్వే వ్యవస్థను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా భారత జాతీయ రైలు ప్రణాళిక 2030కి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి ఊతం ఇచ్చేలా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా.. 2022 జూన్ కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (డీఎఫ్సీ) ప్రారంభించాలని నిర్ణయించారు. ఈడీఎఫ్‌సీలో భాగంగా 2021–22లో సోన్నగర్–గోమోహ్ సెక్షన్‌ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు. ఆ తర్వాత గోమోహ్–డాంకుని సెక్షన్ చేపడతారు. భవిష్యత్తులో ఖరగ్‌పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్‌ను, భూసావాల్ – ఖరగ్‌పూర్ – డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్‌ను చేపడతారు. ⇔ 2022 జూన్‌కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు ⇔ భవిష్యత్తులో ఖరగ్‌పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్, ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్, భూసావాల్–ఖరగ్‌పూర్–డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్లు ⇔ 2023 కల్లా బ్రాడ్‌గేజ్ రూట్ల 100 శాతం విద్యుదీకరణ ⇔ రైళ్ల ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్ రైలు భద్రత విధానం 2020 అక్టోబర్ 1 నాటికి 41,548 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)గా ఉన్న బ్రాడ్ గేజ్ రూట్ విద్యుద్దీకరణ 2021 చివరి నాటికి 46,000 రూట్ కిలోమీటర్లకు (72%)చేరుకుంటుంది. 2023 కల్లా 100% విద్యుద్దీకరణ పూర్తవుతుంది. పర్యాటక రూట్లలో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలకు వీలుగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బీ రైల్వే కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఢీకొనడం వంటి ప్రమాదాలు నివారించేందుకు దేశీయంగా డిజైన్ చేసిన ఆటోమేటిక్ వ్యవస్థను అన్ని ప్రధానమైన రూట్లలో ప్రవేశపెడతాం..’అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై దృష్టి మెట్రో రైళ్ల విస్తరణలో భాగంగా చెన్నై మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.63,246 కోట్ల కేంద్ర నిధులు కేటాయించారు. బెంగళూరు మెట్రో రైల్వే ఫేజ్ 2ఏ, 2బీ కోసం రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం 1,957.05 కోట్లు, నాగ్‌పూర్ మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.5,976 కోట్లు, నాసిక్ మెట్రో కోసం రూ.2,092 కోట్లు ప్రకటించారు. సోమవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసిన రైల్వేని ఆర్థికమంత్రి అభినందించారు. ఇది పూర్తిగా భిన్నమైన, పరివర్తనతో కూడిన బడ్జెట్‌గా రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్ శర్మ అభివర్ణించారు. -
ఆర్సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే
సాక్షి, అమరావతి: వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డుల డెలివరీలో రవాణాశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారుడు ఇంటి చిరునామా సరిగా ఇవ్వకపోవడం, కార్డుల ముద్రణలో సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఈ కార్డులు డెలివరీ కావడం లేదు. ఆధార్ కార్డుల్లో అడ్రస్ వేరుగా ఉండటం, లైసెన్సుకు దరఖాస్తు, వాహన రిజిస్ట్రేషన్ సమయంలో అడ్రస్ మార్చకపోవడం వల్ల రోజూ డెలివరీ అయ్యే ఆర్సీ, లైసెన్సు కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తిరిగి రవాణాశాఖ కార్యాలయాలకు వస్తున్నాయి. దీంతో తనిఖీల సమయంలో వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించినా.. అనుమతించాలని రవాణాశాఖ అధికారులు జిల్లాల పోలీస్ అధికారులకు లేఖలు రాస్తున్నారు. రిజిస్ట్రేషన్, కార్డులు గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సరిగా అందించలేదు. కాంట్రాక్టు సంస్థ సరఫరా చేయకపోవడంతో కొన్ని జిల్లాల్లో కొరత ఏర్పడింది. దీంతో వాహన తనిఖీల సమయంలో పత్రాలు చూపిస్తే పోలీసులు అనుమతించకుండా జరిమానా వసూలు చేశారు. ఇప్పుడు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న దృష్ట్యా పత్రాలు చూపిస్తే అనుమతించాలని రవాణా అధికారులు జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీల ద్వారా పోలీస్ శాఖను కోరారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసోత్సవాల్లో భాగంగా రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలతో పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీ చేశారు. వాహనదారులు పత్రాలు చూపిస్తూ.. లైసెన్సు, రిజిస్ట్రేషన్ కార్డులు చూపించ కపోవడంతో పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీ కార్డుల జారీలో జాప్యంతో పాటు కోవిడ్ కారణంగా పత్రాలు ఫోన్లో చూపించినా.. వదిలిపెట్టాలని, జరిమానా విధించవద్దని సూచనలు జారీ అయ్యాయి. గతేడాది 1,932 లైసెన్సుల సస్పెన్షన్ రాష్ట్రంలో గతేడాది పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు సంబంధించిన 1,932 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే జైలుకు పంపుతామని రవాణాశాఖ స్పష్టం చేసింది. వాహన డ్రైవర్లు ఉల్లంఘనలకు పాల్పడినా, ప్రమాదాలకు కారకులైనా.. వారికి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
బీఐఎస్ నాణ్యత హెల్మెట్లు మాత్రమే..
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు మరింత భద్రత కల్పించేలా బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, హైవేల శాఖ ముసాయిదా నివేదికను ఇచ్చింది. దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఐ సర్టిఫికెట్ ఉండేలా నియమాలు తీసుకొని రానుంది. దీనివల్ల ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి పంపాలని కోరింది. -
సచివాలయం ఇక కూల్చివేతే!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయ భవనాలను కూల్చివేసి ఆధునిక హంగులతో కొత్త భవన సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గత సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రభుత్వం వేగం పెంచింది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే డీ–బ్లాక్‌లోని ఐటీ శాఖ సర్వర్‌ను ప్రభుత్వం బీఆర్కేఆర్ భవన్‌కు తరలించడంతో పాటు మీడియా పాయింట్‌ను సైతం ఖాళీ చేయించి సచివాలయ ప్రధాన ప్రవేశ ద్వారం గేట్లకు తాళాలు వేయించిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడిగా సచివాలయంలో నిరుపయోగంగా ఉన్న వాహనాల తరలింపును బుధవారం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న వాహనాలను క్రేన్ల సహాయంతో సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిజాం కళాశాల మైదానానికి తరలించారు. వందకు పైగా కార్లు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వీటిలో ఉన్నాయి. చాలా వాహనాలు శిథిలమైపోగా, కొన్ని వాహనాలు పనికొచ్చే స్థితిలో ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రవాణాశాఖ పరిశీలించి ధరలను ఖరారు చేశాక... బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించే అవకాశముంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంతో చాలా మంది అధికారులు తమ పాత వాహనాలను సచివాలయంలో నిరుపయోగంగా ఉంచారు. వీటిలో పనికి వచ్చే వాహనాలను గుర్తించి వేలం వేయనున్నారు. నెలాఖరులోగా... వివిధ శాఖల కార్యాలయాలను బీఆర్కేఆర్ భవన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ భవనాలకు తరలించడంతో దాదాపు ఏడాదికాలంగా సచివాలయ భవనాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోవడంతో సచివాలయ భవనాల కూల్చివేతకు ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెలాఖరులోగా భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో టెండర్లు నిర్వహించి కొత్త భవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి. -
‘రవాణా’ డ్రైవర్లకు రక్షణ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో సరుకు రవాణా డ్రైవర్లకు రక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను భేషుగ్గా ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌అండ్ హైవేస్ (మోర్త్) మోర్త్ సంయుక్త కార్యదర్శి ప్రియాంక్ భారత్ ఏపీ రవాణా అధికారులను ప్రశంసించారు. ఏపీ విధానాలను తమ రాష్ట్రాల్లో అనుసరించాలని నిర్ణయించి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు ఏపీ అధికారులను సంప్రదించారు. ఇటు డ్రైవర్లలోనూ రవాణా శాఖ చర్యలపై మంచి స్పందన వస్తోంది. నిత్యావసరాలు, అత్యవసర సరుకులను తీసుకెళుతున్న డ్రైవర్లకు ప్రొటెక్షన్ కిట్లను అందిస్తూ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేలా భరోసా ఇస్తున్నారు. రవాణా శాఖ చేపట్టిన ఈ చర్యల తర్వాత 22 శాతం మంది డ్రైవర్లు గూడ్స్ రవాణాకు వెళుతున్నట్లు అంచనా. అంతేకాక జాతీయ రహదారుల వెంబడి ఉన్న ధాబాలలో ఆహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.150 విలువైన కిట్ గూడ్స్ రవాణా డ్రైవర్లకు, ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా రూ.150 విలువ చేసే ప్రొటెక్షన్ కిట్‌ను అందిస్తోంది. కిట్‌లో రెండు డెట్టాల్ సబ్బులు, ఒక శానిటైజర్, రెండు జతల గ్లవుజ్‌లు, నాలుగు మాస్క్‌లు ఉంటాయి. తొలుత 10 వేల కిట్లను, ప్రభుత్వం కేటాయించిన గూడ్స్ వాహనాల డ్రైవర్లకు అందించారు. దీనికి స్పందన రావడంతో త్వరలో మరో 20 వేల కిట్ల పంపిణీకి నిర్ణయించినట్లు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే డ్రైవర్ల ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా చెక్ పోస్ట్‌లలో థర్మల్ స్కానింగ్ యంత్రాలు. పరీక్షలు నిర్వహించాకే అనుమతించాలని ఆదేశాలు. ► రైతుల ఉత్పత్తులు చేరవేసేందుకు అవసరమైన లారీలు, కంటైనర్లు అందుబాటులో ఉంచి, లారీ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి, డ్రైవర్లతో మాట్లాడి సరుకు రవాణాకు పంపించాలని నూతన మార్గదర్శకాల జారీ. ► సరుకు రవాణా వాహనంలో డ్రైవరు, ఒక ప్యాసింజర్‌కు మాత్రమే అనుమతి. -
‘స్లో’ట్యాగ్!
ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రాజధాని బస్సు. దానికి ఫాస్టాగ్ ఉంది. టోల్‌ప్లాజాలో అక్కడి సెన్సార్ దాన్ని స్కాన్ చేసి రుసుము డిడక్ట్ చేసుకుని క్షణాల వ్యవధిలో గేట్ తెరుచుకోవాల్సి ఉంది. కానీ సెన్సార్లు ఆ పని చేయకపోవటంతో టోల్‌ప్లాజా సిబ్బంది హ్యాండ్‌హెల్డ్ యంత్రం ద్వారా స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవటంతో ఆ యంత్రాన్ని డ్రైవర్ చేతికే ఇచ్చారు. ఆయన కాసేపు అటూఇటూ కదిలిస్తూ తిప్పలుపడితేగాని పని కాలేదు. ఇందుకు ఐదారు నిమిషాల సమయం తీసుకుంది. ఈలోపు వెనక వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఈ ఒక్క బస్సుకు ఎదురైన సమస్య కాదు. దాదాపు అన్ని బస్సులది ఇదే సమస్య.. – సాక్షి, హైదరాబాద్ కొత్తగా ఓ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియాలి. అందుకు కొంత నేర్పు, అవగాహన, శిక్షణ అవసరం. ఇవేవీ లేకుండా ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే కొత్త ఇబ్బందులు రావటమే కాకుండా అభాసుపాలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్ విషయంలో ఇదే జరుగుతోంది. పాత పద్ధతిలో నగదు చెల్లించి టోకెన్ తీసుకునేందుకు పట్టే సమయం కంటే, ఫాస్టాగ్ వచ్చాక ట్యాగ్ స్కానింగ్‌కు ఎక్కువ సమయం పట్టాల్సి రావటం విశేషం. ఆర్టీసీ బస్సులు, కొన్ని ఇతర ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. టోల్గేట్ల పైభాగంలో ఉండే స్కానర్లు వీటి ట్యాగ్‌లను స్కాన్ చేయలేకపోతున్నాయి. ఎక్కడ అతికించాలో తెలియదు.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ గడువు విధించి మరీ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ప్రయోగాత్మకంగా దాన్ని అమలు చేయటం కూడా ప్రారంభించింది. నగదు చెల్లించే వాహనాలకు సంబంధించి కేవలం ఒక్క లేన్ మాత్రమే అందుబాటులో ఉంచుతామని, మిగతావన్నీ ఫాస్టాగ్ అతికించిన వాహనాలకే కేటాయిస్తామని, ట్యాగ్ లేని వాహనాలు టోల్ చెల్లించేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందంటూ ప్రకటనల రూపంలో ప్రచారం కూడా చేసింది. దీంతో వాహనదారులు హడావుడిగా ట్యాగ్ కొంటూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొన్న ట్యాగ్‌ను వాహనానికి ఎక్కడ అతికించాలనే విషయంలో చాలామందికి అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. కార్లతో పోలిస్తే పెద్ద వాహనాల్లో ఈ సమస్య ఏర్పడింది. ట్యాగ్‌ను తోచిన చోట అతికించటంతో స్కానర్లు దాన్ని గుర్తించటం లేదు. పెద్ద వాహనాలకు ఆ చోటనే.. లారీలు, బస్సులు లాంటి పెద్ద వాహనాలకు ఫాస్టాగ్‌ను ముందు వైపుండే ఎడమ అద్దానికి దిగువ భాగంలో డ్రైవర్ వైపు అతికించాలి. సెన్సార్లు గుర్తించే స్థలం ఇదే. ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి గ్రీన్‌సిగ్నల్ చూపి గేట్‌ను ఓపెన్ చేస్తుంది. కానీ చాలామంది డ్రైవర్ ముందుండే అద్దం పైభాగంలో అతికిస్తున్నారు. ఫలితంగా సెన్సార్లు మొండికేస్తున్నాయి. ఇక కార్లకు అయితే అద్దంపై భాగంలో అతికించాలి. అక్కడ ఉంటేనే సెన్సార్లు గుర్తిస్తాయి. ఆర్టీసీ స్టిక్కర్లు పాతబడి.. ఇటు స్టిక్కర్లు తప్పుడు ప్రాంతాల్లో అతికించటం వల్ల ఏర్పడ్డ సమస్యకు తోడు ఆర్టీసీ బస్సుల్లో మరో ఇబ్బంది వచ్చిపడింది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 2017లోనే ఆర్టీసీ కొన్ని దూర ప్రాంత బస్సులకు ఫాస్టాగ్‌లు తీసుకుంది. ఇప్పుడు అవి పాతబడిపోయాయి. బస్సు అద్దాలను కడిగే సమయంలో చాలా ట్యాగ్లు స్వల్పంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో సెన్సార్లు వాటిని గుర్తించటం లేదు. కొన్ని బస్సులకు ట్యాగ్ ఉండి కూడా డ్రైవర్లు నగదు చెల్లించి పాత పద్ధతిలో టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. సమస్యను గుర్తించాం.. ‘ఆర్టీసీ బస్సుల్లో ఎదురవుతున్న సమస్యను గుర్తించాం. తప్పుడు చోట్ల అతికించిన వాటిని తొలగించి సరైన స్థానంలో అతికించుకోవాలని ఆర్టీసీకి సూచించాం. దీంతోపాటు పాతబడ్డ ట్యాగ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని కూడా పేర్కొన్నాం. గతంలో ట్యాగ్ అతికించిన కొన్ని బస్సులు ఇతర డిపోలకు మారటంతో వాటికి అక్కడ కొత్త ట్యాగ్లు తీసుకున్నారు. ఇలా రెండు ఉండటం వల్ల కూడా సమస్య ఎదురవుతోంది. మిగతా బస్సులకు కూడా ట్యాగ్లు ఏర్పాటు చేసే విషయంలో సోమవారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ లోపాలపై చర్చించి ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశాం..’ – ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ -
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు. ఈ కేసులోనే రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినట్లుగా సమాచారం. 2017 అక్టోబర్‌లోనూ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారును రాజశేఖర్ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి 2017 లోనే ముగిసింది. అయినా, ఆయన దాన్ని రెన్యువల్ చేసుకోలేదు. దీనికితోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వరుసగా ప్రమాదాలకు కారణమవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
విలీనానికి ముందే కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : విలీన వేళ ఆర్టీసీ కార్మికులకు అండగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు అమలుచేయనున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుచేసి ఆర్టీసీ సిబ్బంది మొత్తాన్ని ప్రభుత్వోద్యోగులుగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 11న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల మొత్తం రూ.210 కోట్లను విడుదల చేసింది. గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 2015 డిసెంబర్ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు. అలాగే డిస్ ఎంగేజ్ (డ్యూటీకి గైర్హాజరైన వారు) అయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. 2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 52 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. -
ఆంధ్రావాళ్లం.. ఏపీకి పంపండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న ప్పుడు తెలంగాణ ఆర్టీసీలో నియమితులైన ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులిప్పుడు తమను ఏపీకి మార్చాలని కోరుతున్నారు. ఏపీలో పుట్టి అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించినందున తమను ఏపీఎస్ఆర్టీసీలోకి మార్చాలని తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మల కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వినతులు పంపుతున్నారు. ఆర్టీసీలో ఏర్పడ్డ సంక్షోభంతో.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో ఆర్టీసీలో నియమితులయ్యారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో కొంతమంది మాత్రమే ఏపీకి వెళ్లాలనుకున్నారు. మిగతావారు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో 58:42 దామాషా ప్రకారం ఉద్యోగుల మార్పిడి జరిగినా, ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోనే సిబ్బంది ఎక్సెస్ కావటంతో ఇక్కడి వారిని తీసుకో లేదు. అక్కడి నుంచే కొందరు తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత ఎవరూ సొంత ప్రాంతానికి బదిలీ చేయాలని కోరిన సందర్భాలు కూడా లేవు. కానీ ఇటీవల ఆర్టీసీలో ఏర్పడ్డ సంక్షోభం వారిని ఆలోచనలో పడేసింది. సమ్మె సమయంలో కార్మికులకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ అగాధం, ఆర్టీసీలో సగం మేర ప్రైవేటీకరణ కసరత్తు నేపథ్యంలో అసలు ఉద్యోగాలుంటాయో లేదోనన్న ఆందోళనలో కార్మికులు గడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించటంతో కథ సుఖాంతమైంది. అయినా.. భవిష్యత్తుపై కొంతమందిలో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. ఏపీలో విలీనం వైపు.. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కసరత్తు వేగంగా జరుగుతుండటంతో కార్మికుల్లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని ప్రభుత్వం అప్పట్లోనే తేల్చి చెప్పింది. వీటన్నింటిని పరిగణించి ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తాము ఏపీకి చెందిన వారమని, ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగిందని, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయని, తమ తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారని, వృద్ధులైనందున వారితో తాము ఉండాల్సిన అవసరం ఉందని... ఇలాంటి కారణాలు చూపుతూ ఇప్పుడు అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కొంతమంది తమ భార్య/భర్త ఏపీలో ఉద్యోగం చేస్తున్నారన్న కారణాన్ని చూపుతున్నారు. ఇలా డిపో మేనేజర్లు మొదలు ముఖ్యకార్యదర్శి కార్యాలయం వరకు రెండు మూడ్రోజులుగా వినతులు వస్తున్నాయి. తాజాగా కొందరు రిజిస్టర్ పోస్టు రూపంలో మంత్రి పువ్వాడ కార్యాలయానికే తమ వినతులు పంపారు. టీఎస్ఆర్టీసీలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు దాదాపు 3 వేల మంది వరకు ఉన్నట్టు సమాచారం. అది సాధ్యం కాదు: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగుల బదిలీ అనేది అధికారుల స్థాయిలో జరిగే నిర్ణయం కాదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ‘ఆర్టీసీ ఇంకా కేంద్రం దృష్టిలో ఉమ్మడిగానే ఉంది. స్థానికత ఆధారంగా ఉద్యో గుల బదిలీ కావాలంటే కేంద్రం కనుసన్నల్లోనే జరగాలి. లేదంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగుల వినతులతో బదిలీ చేయటం కుదరదు’అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి
సాక్షి, అమరావతి, కర్నూలు(అగ్రికల్చర్) : ఒకవైపున రాయితీపై రైతు బజార్లలో ఉల్లిని సరఫరా చేస్తూనే మరోవైపున బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెటింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రవాణా శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం వరకు పోటీపడి క్వింటా రూ.13 వేలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు శనివారం కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్వింటా రూ.8,750కి మించి కొనుగోలు చేయలేదు. వచ్చిన ఉల్లిలో 30 నుంచి 40 శాతానికి మించి కొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ట్రేడర్లతో పోటీపడి ఉల్లిని కొనుగోలు చేస్తోంది. నాణ్యమైన ఉల్లి మార్కెట్లో కనిపిస్తే ఎంత రేటుకైనా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముందుకు వస్తుండటంతో ట్రేడర్లు వెనుకంజ వేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు శనివారం 1000 క్వింటాళ్ల ఉల్లి రాగా, క్వింటా రూ.8,500 చొప్పున మార్కెటింగ్ శాఖ 550 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్‌కు 6,500 క్వింటాళ్లు రాగా, మార్కెటింగ్ శాఖ క్వింటా రూ.8,750 – రూ.9,300 చొప్పున 4,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు 33,950 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తోంది. రైతుబజార్లకు సత్వరమే చేరవేత షోలాపూర్, ఆల్వార్ నుంచి ఉల్లి దిగుమతులు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. కొనుగోలు చేసిన ఉల్లిని వెంటనే రాయితీపై రైతుబజార్లలో విక్రయించేందుకు సత్వర రవాణాకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాయలసీమ జిల్లాలకు, తాడేపల్లిగూడెంలో కొనుగోలు చేసిన ఉల్లిని ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలకు, షోలాపూర్ నుంచి వచ్చిన ఉల్లిని ఉత్తరాంధ్రకు రవాణా చేస్తున్నారు. రవాణాలో జాప్యాన్ని నివారించడంతోపాటు ఖర్చులు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన మార్కెట్ల వద్ద ఉల్లి రవాణా, కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా కొనసాగిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లిని ఎగుమతి చేస్తున్న లారీలను తనిఖీ చేస్తోంది. సరైన డాక్యుమెంట్లు లేకపోతే లారీలను నిలిపివేస్తోంది. వేలం పాటలు జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేస్తున్న ట్రేడర్ల వివరాలను విజిలెన్స్ విభాగం అధికారులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు భయపడి పెద్ద మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు. దీనికితోడు డైలీ ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం వేలంలో ఉల్లి ధర తగ్గింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ప్రైవేటు వాహనాల్లోనూ మహిళలకు 'అభయ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ఉద్దేశించిన ‘అభయ’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు పిలిచిన టెండర్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించే బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించారు. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిటీకి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్ల ఎంపిక విధానం, అమలు అంశాల్ని ఈ కమిటీ పరిశీలించనుంది. అభయ ప్రాజెక్టు అమలు బాధ్యత రవాణా శాఖదే అయినప్పటికీ పోలీసు శాఖ సహకారం అవసరం ఉంటుంది. దీంతో పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించింది. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో గతంలోనే రవాణా శాఖ అభయ ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం 2015లో రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. చివరకు ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్ రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. తెలుసుకునే వీలుంది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేందుకు అభయ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. ‘అభయ’ అమలు ఇలా.. - రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. - పోలీసుల సహకారంతో రవాణా శాఖ ఐటీ అధికారులు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు. - రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాలి. - ఈ బాక్సులు అమరిస్తే రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. - మహిళలు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. - తొలుత విశాఖ, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రవాణా శాఖ గతంలో నిర్ణయించింది. - ఇందుకు రూ.138 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐఓటీ బాక్సుల్ని రవాణా శాఖ సమకూర్చనుంది. - ఈ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. - ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. - ఆటోల్లో/క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే యాప్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారమిస్తే.. వాహనం ఎక్కడుందో తెలుసుకుని ఇట్టే పట్టుకుంటారు. - కమిటీ సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టా లెక్కిస్తారు. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు..భారీ బాదుడొద్దు
సాక్షి, అమరావతి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేంద్రం నిర్ణయించినట్లుగా పదిరెట్ల జరిమానాలొద్దని.. మధ్యస్థంగానే విధించాలని ఏపీ రవాణా అధికారుల కమిటీ సిఫారసు చేసింది. అపరాథ రుసుంలపై ఈ కమిటీ రూపొందించిన సిఫారసుల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పదిరెట్ల వరకు జరిమానాలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ బిల్లు–2019ను గత పార్లమెంట్ సమావేశాల్లో సవరించి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్–200 ప్రకారం సెప్టెంబరు నుంచి నూతన జరిమానాలు అమలుచేయాల్సి ఉంది. అయితే, ఈ చట్టం కింద జరిమానాలు అంత పెద్ద మొత్తంలో విధించే ముందు ప్రజలకు అవగాహన కల్పించి, మధ్యస్తంగా జరిమానాలు ఉండేలా ఏపీ రవాణా అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పలు రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అంత పెద్ద మొత్తంలో వాహనదారులపై జరిమానాలు విధించేందుకు ఆయా ప్రభుత్వాలు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో.. ఏపీలోనూ ట్రాఫిక్ జరిమానాలపై రవాణా శాఖ డిప్యూటీ రవాణా కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లతో అంతర్గతంగా ఓ కమిటీని నియమించుకుంది. ఈ కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలు, కేంద్రం కొత్తగా విధించాలన్న జరిమానాలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించింది. పదిరెట్ల జరిమానాలు రాష్ట్రంలో విధించవద్దని, కేంద్రం నిర్దేశించినట్లుగా కాకుండా మధ్యస్తంగా జరిమానాలు విధించాలని కమిటీ అభిప్రాయపడి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపింది. అలాగే, ముందుగా వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అప్పటివరకు ఓ మోస్తరు జరిమానాలతో సరిపుచ్చాలని అందులో సూచించారు. ప్రభుత్వ నుంచి ఆమోదం వస్తే కేంద్రం నిర్దేశించిన దానికంటే తక్కువగానే జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. లైసెన్సులు లేనివారే ఎక్కువ కాగా, రాష్ట్రంలో అన్ని కేటగిరీల వాహనాలు మొత్తం 90 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో అధిక శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే ఇప్పటివరకు రూ.500 జరిమానా విధిస్తున్నారు. మోటారు వాహన సవరణ బిల్లులో రూ.5 వేల జరిమానా విధించేలా పొందుపరిచారు. అయితే, రాష్ట్రంలో లైసెన్సు లేకుండా వాహనం నడిపితే జరిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి మధ్యస్తంగా జరిమానాలు విధించనున్నారు. -
వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో గత మంగళవారం రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై గుంటూరు నుంచి వస్తుండగా రవాణా శాఖ అధికారి ఆపారు. ఆ వ్యక్తి బైక్‌ను మూడు రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అయితే ఆ బైక్‌కు టీఆర్ లేదు. టీఆర్ లేకపోవడంపై బైక్ యజమానిని ప్రశ్నించగా షోరూమ్ డీలర్ వారం రోజుల తర్వాత టీఆర్ చేస్తానని చెప్పాడని బైక్ యజమాని సమాధానం ఇచ్చాడు. ఆ బైక్‌ను ఏ షోరూమ్‌లో కొనుగోలు చేశాడో ఆరా తీసిన రవాణా శాఖ అధికారులు ఆ షోరూమ్ లైసెన్స్‌ను బ్లాక్ చేశారు. లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. జిల్లాలో చాలా వరకూ షోరూమ్‌లు ఇదే రీతిలో టీఆర్ లేకుండా వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి విడుదల చేస్తున్నారు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పారదర్శకంగా ప్రజలకు రవాణా శాఖ సేవలు అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ సేవల పేరుతో గత ప్రభుత్వ హయాంలో క్షేత్ర స్థాయిలో వినియోగదారులను అడ్డంగా దోచుకున్నారు. జిల్లాలోని వాహనాల షోరూమ్‌లపై రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహన షోరూమ్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వాహనాల విక్రయాలు జరపడమే కాకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. టీఆర్ లేకుండానే అమ్మకాలు జిల్లాలో 35 టూవీలర్, 7 ఫోర్ వీలర్ వాహన షోరూమ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అనధికారికంగా 100కు పైగా సబ్ డీలర్ షోరూమ్‌లు నడుస్తున్నాయి. ఆయా డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) లేకుండానే వాహనాలను డెలివరీ చేసేస్తున్నారు. ఇలా వాహనాలు విక్రయించడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక వాహనం బయట తిరగాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కొత్తగా కొనుగోలు చేసిన వాహనమైతే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వాహనాన్ని రోడ్డు మీదకు వదలాలి. అయితే జిల్లాలోని పలు షోరూమ్‌ల నిర్వాహకులు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) లేకుండానే వాహనాలను రోడ్లపైకి విడుదల చేస్తున్నారు. ఇటీవల టీఆర్ లేకుండా టూవీలర్‌ను విక్రయించిన నరసరావుపేట పట్టణంలోని యర్రంశెట్టి మోటర్స్ షోరూమ్ లైసెన్స్‌ను రవాణా శాఖ అధికారులు బ్లాక్ చేశారు. కొందరు డీలర్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వాహన కొనుగోలు సమయంలో ఇన్వాయిస్ ధరల కంటే తక్కువ ధరలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిఫ్టింగ్ చార్జీలు, అదనపు చార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు షోరూమ్ నిర్వాహకులు చిల్లు పెడుతున్నారు. టూ వీలర్‌కు రూ.2 నుంచి 5 వేలు, ఫోర్ వీలర్‌కు రూ. 5 నుంచి 50వేల వరకూ అదనంగా వసూళ్లు చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక దినాల్లో షోరూమ్ నిర్వాహకులు వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇకపై ఇలాంటి వసూళ్లకు పాల్పడే డీలర్లపై కొరడా ఝుళిపించనుంది. ప్రత్యేక నిఘా గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలోని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇటీవల విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం జిల్లాల్లో భారీ కుంభకోణాన్ని ఆ శాఖ అధికారులు వెలికి తీసిన విషయం తెలిసిందే. వాహనాల విక్రయ ధరలను అమాంతం తగ్గించి లైఫ్ ట్యాక్స్ ఎగవేసినట్లు రవాణా శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో జరిపిన సోదాల్లో వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.250–300కోట్ల వరకూ లైఫ్ ట్యాక్స్ ఎగవేతకు గురైనట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో జిల్లాలో జరిగిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, షోరూమ్‌లలో రికార్డులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు షోరూమ్ నిర్వాహకులు టీఆర్ లేకుండా వాహనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇన్వాయిస్ ధరల కంటే తక్కువ ధరలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తాం. వాహన షోరూమ్‌లపై ఆకస్మిక తనిఖీలు చేపడతాం. షోరూమ్ నిర్వాహకులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, లిఫ్టింగ్ చార్జీల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడితే వినియోగదారులు మాకు ఫిర్యాదు చేయండి. – ఈ.మీరాప్రసాద్, డీటీసీ గుంటూరు -
రవాణా శాఖ యూనిట్లలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
సాక్షి, అమరావతి/చిలకలపూడి (మచిలీపట్నం) : రాష్ట్రంలోని ఎంవీఐ కార్యాలయాల నుంచి జిల్లా కేంద్రాల వరకు అన్ని చోట్లా అత్యాధునిక సాంకేతిక విధానాలతో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. దీనికి అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపించాలని రవాణా అధికారులకు ఉన్నతస్థాయి బృందం సూచించింది. ఆదివారం మచిలీపట్నంలో రవాణా అధికారులతో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ సేఫ్టీపై ప్రభుత్వ ప్రాధాన్యతతో పాటు కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాహనదారులకు కేటాయించే లెర్నర్ లైసెన్సు రిజిస్ట్రేషన్ (ఎల్ఎల్ఆర్) స్లాట్లను ఆగస్టు నెల ప్రారంభం నుంచి కుదించాలని, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంలోనే ఏ రోజుకారోజు ఎల్ఎల్ఆర్ పరీక్షలు ముగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో రవాణా ఆదాయ లక్ష్యం రూ.4 వేల కోట్లు కాగా, ఎన్ఫోర్సుమెంట్ ద్వారా లక్ష్యాలు చేరుకోవాలని చిన్న చిన్న వాహనాలతో జీవనం సాగించే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి నాని అధికారులకు సూచించారు. జాతీయ రహదారులపై నిత్యం డ్రంకన్ డ్రైవ్ చేపట్టాలని స్పష్టం చేశారు. త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. రహదారి భద్రతపై వరంగల్ నిట్‌కు చెందిన ప్రొఫెసర్ సీఎస్సార్కే ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో ముఖ్య నిర్ణయాలు వాహనాల ఫిట్నెస్ తనిఖీలకు ఆర్టీసీ సిబ్బందితో సమన్వయం చేసుకుని వారి సేవలను వినియోగించుకోవాలి. నెలలో మూడో శుక్రవారం రవాణా ఉద్యోగుల గ్రీవెన్స్ కోసం మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు కలిసి హాజరవుతారు. ఇకపై విధిగా పోలీసుల మాదిరిగానే రవాణా జిల్లా స్థాయి అధికారులు సోమ, శుక్రవారాల్లో యూనిఫాం ధరించాలి. రవాణా మంత్రి, కమిషనర్ సంయుక్తంగా అన్ని జిల్లాల్లోని రవాణా కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతారు. రవాణా డీలర్ల వ్యవహార శైలిని గమనిస్తూ, ప్రతి డాక్యుమెంట్ తనిఖీ చేయాలి. లైఫ్ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారో నిశితంగా పరిశీలించాలి. ఇందులో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలుంటాయి. -
ఉద్యోగుల రవాణా
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ప్రత్యేకతలు చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉప రవాణా కమిషనర్‌పై ఉంది. అయితే, రవాణా శాఖ ఉన్నతాధికారుల తీరుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు నచ్చితే చాలు... ఆ ఉద్యోగి కోరుకున్న చోటకు అంతర్గత, అనధికారికంగా బదిలీ చేయడమే కాదు, దానినే శాశ్వత బదిలీల్లో చూపిస్తున్నారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా ఇదే తంతు కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తాత్కాలికమే ఉమ్మడి వరంగల్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో చిన్నస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ తాత్కాలిక విధులే నిర్వహిస్తున్నారు. పలువురు ఉన్నతాధికారులు హైదరాబాద్ స్థాయిలో నేతలను ప్రసన్నం చేసుకుని... రెండు, మూడు పోస్టుల్లో కూడా కొనసాగుతుండడం గమనార్హం. కొందరైతే ఉమ్మడి వరంగల్ కేంద్రంగా అనధికారికంగా చెక్‌పోస్టుకు విధులు కేటాయించుకుని ఇక్కడి నుంచే వేతనాలు తీసుకుంటున్నారు. ఇలా ఇష్టారీతిన ఎవరికి వారు వెళ్తుండడం..ఉన్నతాధికారులు కూడా బదిలీలు చేయడంతో కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక వివిధ పనులపై రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాళీల పేరిటే ఓడీ వ్యవహారం రవాణాశాఖలో 2013 సంవత్సరం తర్వాత పదోన్నతులు లేవు. కానిస్టేబుళ్లు, క్లర్క్‌లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ల వరకు పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట వ్యవహారానికి తెర తీశారు. ఎంవీఐల నుంచి డీటీఓ/ఆర్టీఓల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. మూడు నెలల కిందట హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారు(డీటీఓ)లకు ఉప కమిషనర్(డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. అయితే క్లర్క్‌లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందాల్సిన వారి ఫైలు మాత్రం ఆరేళ్లుగా ముందుకు కదలడం లేదు. రెండు, మూడు చోట్ల బాధ్యతలు రవాణాశాఖలో పదోన్నతులు, హోదాలతో పని లేకుండా పలువురు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం హైదరాబాద్ స్థాయిలో పైరవీలు కూడా సాగిస్తున్నారు. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీవై రమేష్‌రాథోడ్ జనగామ ఇన్చార్జ్ ఎంవీఐ, డీటీఓగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవీందర్ ఇన్చార్జ్ డీటీఓతో పాటు ఖమ్మం ఇన్చార్జ్ ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉన్నారు. అలాగే మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న భద్రునాయక్ అక్కడే ఇన్చార్జ్ డీటీఓగా, ఖమ్మం ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ డీటీఓ కార్యాలయంలో ఎంవీఐగా పని చేస్తున్న కె.వేణు నెల కిందటి వరకు ఇన్చార్జ్ డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కొనసాగుతున్నారు. అదే విధంగా క్లర్క్‌లు, సూపరింటెండెంట్ తదితర పోస్టుల్లోని ఉద్యోగులు కూడా పలువురు రెండు, మూడు చోట్ల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆన్ డిప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారంటూ ఆ శాఖలో కొందరు రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు తాజాగా నాలుగు రోజుల కిందట ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదుతోనైనా మంత్రి, ఉన్నతాధికారులు స్పందిస్తారేమో వేచి చూడాలి. డీపీసీ వేయాలన్న ప్రభుత్వం శాఖలోని కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతల విజ్ఞాపన మేరకు పదోన్నతుల రవాణాశాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో ఇప్పటి వరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసిన పలువురు పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి మరీ ఆన్ డిప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు, మూడు పదవుల్లో కొనసాగుతున్న పలువురు ఉద్యోగులు వివాదాల నుంచి తప్పుకునేందుకు బదిలీల కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తాజా సమాచారం. -
డ్రైవింగ్ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి: ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 8వ తరగతి వరకు చదివుండాలనే నిబంధన ఉంది. దీనివల్ల డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్ తీసుకోవాలంటే కుదిరేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. అలాంటివారి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి చదువుకోకపోయినా లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికోసం అడ్డుగా ఉన్న మోటార్ వెహికల్ చట్టం 1989లోని 8వ నిబంధనను తొలగించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు, రవాణా రంగం ఎదుర్కొంటున్న డ్రైవర్ల సమస్య కూడా తీరనుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రవాణా, లాజిస్టిక్ రంగాల్లో దాదాపు 22 లక్షల డ్రైవర్ల అవసరం ఉందని అంచనా. ఈ విషయం గురించి కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువతకు డ్రైవింగ్‌లో నైపుణ్యంతో పాటు అనుభవం ఉన్నాకూడా చదువులేదనే నిబంధనతో లైసెన్స్‌కి అనర్హులయ్యేవారు. వారు చదువుకోకపోయినా నిరక్షరాస్యులు మాత్రం కారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడినవారు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత లబ్దిపొందుతారు. ఇదే సమయంలో రోడ్డు భద్రత, ప్రమాణాలు కూడా ముఖ్యమే. అందుకోసం లైసెన్స్ ఇచ్చే ముందు వారికి కఠిన పరీక్ష నిర్వహిస్తారు. నెగ్గితేనే లైసెన్స్ జారీ చేస్తారు. తర్వాత వారికి రహదారి భద్రత గురించి అవగాహనతో పాటు కొంత శిక్షణనిస్తారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తుందని ఆ అధికారి తెలిపారు. -
సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: రాజధాని కేంద్రంగా మరో నకిలీ ఇన్వాయిస్ రాకెట్ వెలుగులోనికి వచ్చింది. సరుకులు తయారీ, రవాణా చేయకుండానే రూ.133 కోట్ల వ్యాపారం చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన 5 కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడటంతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో రూ.22.64 కోట్లను ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందాయి. ఈ బాగోతాన్ని మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. నకిలీ ఇన్వాయిస్ల సృష్టికి కలకత్తా పెట్టింది పేరు. బోగస్ వ్యాపారులకు అవసరమైన నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి ఇవ్వడానికి అక్కడ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు ఉంటాయి. ఇలాంటి ఓ సంస్థ నుంచి మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్‌కు ఓ సమాచారం అందింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు ఐదు కంపెనీల అక్రమాలను గుర్తించారు. కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన హిందుస్తాన్ ఏఏసీ ప్రొడక్ట్స్, ఐత్రి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్, శ్రీకృష్ణా క్యాస్టింగ్స్, శ్రీ మెటల్స్, ఆవ్యా ఎంటర్ ప్రైజెస్‌లు ఎంఎస్, కాపర్, మెటల్ తుక్కు పదార్థాల తయారీ, రవాణా వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ ఐదూ 2017 జూలై నుంచి నకిలీ ఈ–వే బిల్లులు సృష్టించడం మొదలెట్టాయి. నకిలీ ఇన్వాయిస్ల సాయంతో ఈ కాలంలో మొత్తం రూ.131 కోట్ల మేర వ్యాపారం చేశామని రికార్డులు సృష్టించాయి. దీనికి సంబంధించి చెల్లించాల్సిన రూ.22.64 కోట్ల జీఎస్టీని ఐటీసీ కింద చూపిస్తూ వచ్చాయి. ఫలితంగా ఆయా సంస్థలు చేస్తున్న వ్యాపారానికి రూ.131 కోట్ల అదనంగా చేసినట్లు రికార్డులు తయారుచేశాయి. దీనికితోడు చెల్లించాల్సిన పన్నులో రూ.22.64 కోట్లు ప్రభుత్వం నుంచే తీసుకున్నాయి. అయితే కలకత్తా నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారని, అసలు సరుకు తయారీ రవాణా కాలేదని నిర్థారించారు. దీంతో ఆ ఐదు సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ సంస్థలను నలుగురు నిర్వహిస్తున్నారని తేలింది. ప్రాథమికంగా నేరం నిరూపణ కావడంతో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. స్కూటర్లపై సరుకు రవాణా చేశారట! జీఎస్టీ అధికారులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి. సాధారణంగా సరుకు తయారీ సంస్థలు వాటి రవాణా కోసం ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ వాడుతాయి. అయితే నకిలీ ఈ–వేబిల్స్ సృష్టించిన ఈ ఐదు సంస్థల్లో వాటిపై సరుకు రవాణా వాహనాల నంబర్లు అంటూ కొన్నింటిని పొందుపరిచాయి. అయితే అసలు సరుకే లేనప్పుడు ఇక రవాణా ఏమిటని అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు ఆ కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయా రిజిస్ట్రేషన్ నంబర్లతో సరుకులు రవాణా చేసే వాహనాలు లేవని, ప్రయాణికులను చేరవేసే వాహనాలు, స్కూటర్లు, ట్రాక్టర్ల నంబర్లను వినియోగించారని బయటపడింది. రూ.20 లక్షల నగదుతో పాటు 4,150 అమెరికన్ డాలర్లు, ఇతర నకిలీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు మేడ్చల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. -
ఏయే గ్రామాలకు బస్సుల్లేవు..?
సాక్షి, హైదరాబాద్: ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల గురించి మంత్రి వాకబు చేయటంతో ఉన్నతాధికారులు ఆగ మేఘాల మీద వివరాల సేకరణకు పూనుకున్నారు. డిపోలవారీగా ఆర్టీసీ బస్సు వసతిలేని గ్రామాల వివరాలు పంపాలంటూ రీజినల్, డిపో మేనేజర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యంలేక విద్యార్థినులు లిఫ్ట్ అడిగి పాఠశాలకు వెళ్లే క్రమం లో కొందరు అత్యాచారాలు, హత్యలకు గురైన నేపథ్యంలో రవాణాశాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు సౌకర్యంలేని గ్రామాల గోడును కళ్ల ముందు నిలుపుతూ మూడురోజుల క్రితం ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఎంపీటీసీ ఎన్నికల బిజీలో ఉన్న మంత్రి ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత వివరాల గురించి వాకబు చేశారు. యుద్ధప్రాతిపదికన సాధ్యమైనన్ని గ్రామాలకు బస్సు వసతి కల్పించాలని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలో దీనికి సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అయితే, 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ గుర్తించింది. ఆ సంఖ్య అంతేనా, మరిన్ని గ్రామాలున్నాయా, అనుబంధ గ్రామాల పరిస్థితి ఏంటి, రహదారులు లేని గ్రామాలు, ప్రధాన రోడ్డుకు చేరువగా ఉన్న గ్రామాలు... తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఏడాదిలో 58 గ్రామాలకు... గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 58 గ్రామాలను ఆర్టీసీ బస్సులతో అనుసంధానించినట్టు ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో బస్స సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 902 ఉండేదని, 2019 మార్చి నాటికి ఆ సంఖ్యను 844 కు తగ్గించినట్టు పేర్కొన్నారు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు వసతి లేనందున వాటిని పక్కన పెట్టి, రహదారి వసతి ఉన్న 428 గ్రామాలకు సాధ్యమైనంత తొందరలో బస్సు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. హాజీపూర్ గ్రామానికి కుషాయిగూడ డిపో నుంచి ఇప్పటికే బస్సులు ఆరు ట్రిప్పుల మేర నడుస్తుండగా అదనంగా మరో ట్రిప్పు పెంచామని, యాదగిరిగుట్ట నుంచి రెండు ట్రిప్పులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. -
సిమెంటు కంపెనీల ఒప్పందాలతో లాభం: రైల్వే జీఎం
సాక్షి, హైదరాబాద్: సిమెంటు కంపెనీలతో ఒప్పందాల వల్ల సరుకు రవాణా రూపంలో రైల్వేకు ఆదాయం పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు. స్థిరమైన రేట్లు, రాయితీల వల్ల ఆయా కంపెనీలకు కూడా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ సంస్థలు దీర్ఘకాలిక సరుకు రవాణా ధర ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన చెప్పారు. వినియోగదారుడు ఒకసారి రైల్వే దీర్ఘకాల ధర సూచి ఒప్పందం(లాంగ్ టర్మ్ టారిఫ్ కాంట్రాక్ట్)లో చేరితే ఒక ఏడాది వరకు సరుకు రవాణా ధరలలో మార్పు ఉండదు. దీనివల్ల వినియోగదారుడు ఒక సంవత్సరం వరకు స్థిరమైన సరుకు రవాణా ధరకు అనుగుణంగా వ్యవస్థాగత ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుందన్నారు. ముందు సంవత్సరం కంటే మరింత ఎక్కువగా రవాణా పెరిగితే ఈ ఒప్పందం ప్రకారం సరుకు రవాణా వినియోగదారుకు చార్జీలో రాయితీ రూపంలో ఎన్నో ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయన్నారు. దీనికి పెరుగుదలతో సంబంధం ఉన్న రాయితీ కనుక గతేడాది కంటే ఎంత ఎక్కువగా సరుకు రవాణా చేస్తే అంత ఎక్కువగా రాయితీలు ఉంటాయన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్. మధుసూదన రావు, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బ్రజేంద్ర కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె. శివప్రసాద్, చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ఫ్రైట్ సర్వీసెస్) డా.బి.ఎస్.క్రిష్టోఫర్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ డెరెక్టర్(మార్కెటింగ్) కృష్ణ శ్రీవాస్తవ ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలో ఎం/ఎస్. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ 8వది కాగా మిగతా 7 కంపెనీల్లో ఎం/ఎస్. అల్ట్రాటెక్, ఓరియంట్, కేశోరాం, మై హోం, రామ్‌కో, జువారి, భారతీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. -
‘స్మార్ట్’కు సారీ...ఆగిన లైసెన్సుల జారీ
కరీంనగర్‌కు చెందిన భూమయ్య తన కొత్త వాహనంలో శబరిమల వెళ్లాడు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసినా స్మార్ట్‌కార్డు రాకపోవడంతో ఏపీ, తమిళనాడు, కేరళలలో పలుచోట్ల చలానాలు చెల్లించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఓ ప్రముఖ క్యాబ్ సంస్థలో ఉద్యోగి. అక్టోబరులో తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నా ఇంత వరకూ అందలేదు. ఈ కారణంతో ఆ కంపెనీ ఇతనికి డ్యూటీలు ఇవ్వడం మానేసింది. ఇది ఒక్క భూమయ్య, శ్రీకాంత్ పరిస్థితే కాదు. ఇటీవల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఎదురుచూస్తోన్న వేలాదిమంది వాహనదారుల దుస్థితి. వీరంతా కొత్త వాహనాలు కొన్నారు. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. ఇంతవరకూ వీరికి ఆర్సీ (రిజిస్ట్రేషన్ కార్డు), డ్రైవింగ్ లైసెన్సులు అందలేదు. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం.. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ టెస్టు, రెన్యువల్ పూర్తయిన 15 రోజుల్లోగా పోస్టులో ఇంటికి కార్డులు అందాలి. కానీ, వేలాదిమంది వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తయినా.. ఇంతవరకూ కార్డులు అందలేదు. కారణం ఏంటి? స్మార్ట్‌కార్డుల ముద్రణకు రిబ్బన్ల కొరత 2017, అక్టోబరులోనే ఏర్పడింది. వీటి ముద్రణకు కావాల్సిన కార్డులు, రిబ్బన్లకు ఐటీ విభాగం టెండర్లు పిలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టరు తెలంగాణ రవాణాశాఖకు రిబ్బన్ల సప్లయి చేసే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అతనికి రూ. 8 కోట్లు చెల్లించాలి. కేవలం రూ. 4 కోట్లే చెల్లించారు. మిగిలిన బకాయిలు అలాగే ఉండిపోయాయి. దీంతో రిబ్బన్ల సరఫరాను సదరు కాంట్రాక్టరు నిలిపివేశాడు. దీంతో ఆర్సీ కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్సుల ముద్రణ కూడా నిలిచిపోయింది. సర్క్యులర్ విడుదల చేయరా? గ్రేటర్ పరిధిలో ప్రతీరోజు 1500 కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. గ్రేటర్లో 11, తెలంగాణ వ్యాప్తంగా 70 వరకు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు ఒక్కో కార్యాలయానికి 300 వరకు వాహనాలు వస్తుంటాయి. 3నెలలుగా వీరందరికి కార్డులు జారీకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో కలిపి 2 లక్షలకుపైగా కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయినా ఆ శాఖ అధికారులు ఆర్సీలు లేవన్న సాకుతో జరిమానాలు, కేసులు బుక్ చేస్తుండటం గమనార్హం. వీటిపై సర్క్యులర్ జారీ చేయక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు.. ఆర్టీసీ, ప్రైవేటు రంగం, రక్షణ రంగంలోని పలువురు డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కాకపోవడంతో వారికి డ్యూటీలు వేయడం లేదు. నగరంలో క్యాబ్‌లు నడిపే చాలా మంది డ్రైవర్లకు లైసెన్సు ఈ కారణం గా 4నెలలుగా పలు కంపెనీలు డ్యూటీలు వేయడం లేదు. దీంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. తాత్కాలిక ఆర్సీ 15 రోజులే వ్యాలిడిటీ. ఆ తరువాత ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ పోలీసులు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. – దయానంద్, తెలంగాణ ఆటో అండ్ మోటార్ వెల్ఫేర్ యూనియన్ కార్డులకు కొరత లేదు.. రిబ్బన్లకు ఎక్కడా కొరత లేదు. గతంలో కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ, ఇపుడు లేదు. రిబ్బన్లు వచ్చాయి. అందరికీ కార్డులు జారీ చేస్తున్నాం. – రమేశ్, జేటీసీ, ఆర్టీఏ -
కుదేలవుతున్న లారీ పరిశ్రమ
చిత్తూరు ,మదనపల్లె సిటీ: దేశీయంగా వస్తువులు, నిత్యావసర సరుకుల చేరవేతకు కీలకమైన రవాణా రంగం దివాలా దిశగా పయనిస్తోంది. పెరుగుతున్న డీజిల్ ధరలు, రోడ్డు ట్యాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో కుదేలవుతోంది. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా లాభాలు రాక, నష్టాలతో వాహనాలను నడపలేక తుక్కు ఇనుము కింద తెగనమ్ముకునే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. పెరిగిన ధరలతో కుదేలు.. రవాణా రంగంలో లారీలు ప్రధాన పాత్ర పోషి స్తున్నాయి. వీటికి సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం, రోడ్డు ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 2013లో ధర్డ్ పార్టీ ఇన్సూరెన్సు రూ.16,300 ఉండగా ప్రస్తుతం రూ.42 వేలకు చేరింది. టైర్లు, వాహనాల విడిభాగాల ధరలు కూడా 30 శాతం మేర పెరిగాయి. పుండు మీద కారంచల్లిన చందంగా లీటర్ డీజిల్ ధర రూ.80కి చేరింది. వీటితో పాటు జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకు టోల్గేట్లు, జీఎస్టీతో వాహన యజమానులు రోడ్డున పడుతున్నా రు. రాష్ట్ర ప్రభుత్వమైతే యజమానుల దగ్గర సెస్ వసూలు చేసి బలవంతంగా చంద్రన్న బీమా చేయిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 9 నెలల్లో 50 లారీల సీజ్.. జిల్లాలో చిన్న,పెద్దవి కలిపి 23 వేలకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. టమట, మామిడి, బెల్లం, పప్పు, బియ్యం రవాణా తదితర వాటిపై ఆధారపడి వీటిని నడుపుతున్నారు. సరుకు రవాణాలోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ పరిశ్రమ వెన్నుదన్నుగా నిలుస్తోంది. పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీ తీవ్రత కారణంగా ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ కొనసాగుతున్నాయి. ఇదే తరుణంలో ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. లారీ ట్రిప్పు పోయి వస్తే గతంలో సరుకు విలువలో ఖర్చులు పోను 12 శాతం మిగిలేది. ప్రస్తుతం 7 నుంచి 8 శాతం మాత్రమే మిగులుతోంది. గతంలో వచ్చిన కిరాయిలో డ్రైవర్లకు 2 శాతం కమీషన్ ఇచ్చేవారు. ప్రస్తుతం 5 శాతం ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే కొంత మంది తమ లారీలు అమ్మకానికి పెట్టారు. మరికొందరు బయటకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతూ నెట్టుకొస్తున్నారు. గత తొమ్మిది నెలల కాలంలో ఫైనాన్స్ కట్టలేక దాదాపు 50 లారీలను సీజ్ చేశారంటే యజమానుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
లారీల సమ్మె విరమణ
అమలాపురం: దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల పాటు సాగిన లారీల సమ్మె ముగిసింది. కేంద్ర రవాణా శాఖాధికారులతో న్యూఢిల్లీలో శుక్రవారం చర్చలు ముగిసిన అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు లారీ యజమాన్య సంఘాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఏపీ లారీ యజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ ధ్రువీకరించారు. దీనితో ఎనిమిది రోజుల పాటు అసోసియేషన్ల ఆవరణలు, ప్రధాన రహదారులకు పరిమితమైన లారీలు శనివారం తెల్లవారు జాము నుంచి రోడ్డెక్కనున్నాయి. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను, టోల్గేట్ వ్యవస్థను పారదర్శకం చేయాలనే పలు డిమాండ్లతో గత గురువారం అర్ధరాత్రి నుంచి లారీ యాజమాన్యాలు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎనిమిది వేల వరకు లారీలు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను కలిపితే రోజుకు సుమారు 15 వేల లారీల ద్వారా సరుకు ఎగుమతి, దిగుమతులు జరుగుతాయని అంచనా. నిత్యావసర వస్తువులు, సిమెంట్, ఐరెన్ వంటి ఉత్పత్తుల దిగుమతి, కొబ్బరి, ఇతర వాణిజ్య, వ్యవసాయ పంటలు, కోడిగుడ్లు, ఆక్వా, ఇసుక, ఇటుకలు, కంకర వంటి ఎగుమతులు జరుగుతుంటాయి. ఎనిమిది రోజుల పాటు సమ్మె వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 1,900 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్టు అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జిల్లా నుంచి ఉత్తర భారతదేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో ఒక్క కొబ్బరికే రూ.24 కోట్ల లావాదేవీలు నిలిచాయని అంచనా. కాకినాడ పోర్టులో రూ.400 కోట్లు, రాజమహేంద్రవరం కేంద్రంగా రూ.300 కోట్లు, కోడిగుడ్ల ఎగుమతులు నిలవడం వల్ల రూ.32 కోట్ల లావాదేవీలు నిలిచాయి. ఇక మిగిలిన రంగాలు సైతం లారీ సమ్మెల వల్ల ఒడుదొడుకులకు లోనయ్యాయి. కార్మిక, రోజు వారీ ఎగుమతి, స్థానికంగా సరుకు రవాణా కూలీలపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎనిమిది రోజుల పాటు సాగిన సమ్మె వల్ల జిల్లా వ్యాప్తంగా లారీల మీద ఆధారపడే డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లలో పనిచేసే కార్మికులకు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా, సిమెంట్, కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరం హోల్‌సేల్ మార్కెట్, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ గొడౌన్లు, రైల్వే గూడ్స్ షెడ్లు వంటి ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాల్లో ఉండే కూలీలు, కార్మికులకు వారం రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. సమ్మె విరమణతో రైతులు, కార్మికులు ఊరట చెందారు. -
తొమ్మిదింటికే ‘ప్రైవేట్ హారన్’!
సిటీని ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటకముందే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిత్యం ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ వాహనాల వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనదారులు నరకం చవిచూడాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై ప్రైవేట్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిబంధనలకు పాతరేసి సిటీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. రాత్రి 9 దాటకుండానే రోడ్ల మీదకు వస్తున్న బస్సులు, లారీలు రవాణా చట్టాలను, రహదారి భద్రతను యధేచ్ఛగా తుంగలో తొక్కేస్తూ స్వైరవిహారం చేస్తున్నాయి. రాత్రి 8గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాలు కబంధహస్తాల్లో చిక్కుకొంటుంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే అతి పెద్ద కారిడార్‌లో ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ రద్దీకి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాత్రి వేళల్లో ఈ వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితమం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్, పెద్ద అంబర్‌పేట్‌ల వద్ద బస్సులు, ట్రక్కులు, లారీలు, తదితర రవాణా వాహనాల కోసం టర్మినల్స్ ఏర్పాటు చేసి అక్క డి నుంచే నడాపాలని ఇటీవల రవాణాశాఖ సమీ క్షా సమావేశంలనూ ఆ శాఖ మంత్రి స్పష్టం చేశా రు. ఇందుకోసం ట్రాక్ ఆపరేటర్స్ అసోసియేషన్ కు గతంలో కేటాయించిన భూములను వినియోగించాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. దీంతో రాత్రి వేళ ల్లో, తెల్లవారు జామున రహదారులన్నీ ప్రైవేట్ బస్సులు, లారీలకు అడ్డాగా మారుతున్నాయి. చీమ కూడా కదలడం కష్టమే.... కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ రోడ్లు సాయంత్రం 5 గంటల నుంచే రద్దీగా ఉంటాయి. ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం రాకపోకలు సాగించే వాళ్లతో æరోడ్లు జనసముద్రాన్ని తలపిస్తాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులతో ప్రధాన రహదారులు నిండిపోతాయి. అలాంటి రోడ్లపై ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. కాలనీల నుంచి ఒకటెనుక ఒకటిగా ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి. క్రమంగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ బస్సులే కనిపిస్తాయి. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిపోయిన వాహనాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతాయి. దీంతో లక్షలాది మంది రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒక్క కూకట్పల్లి ప్రజలే కాదు. అటు మియాపూర్ నుంచి కూకట్పల్లి, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, లకిడాకాఫూల్, హిమాయత్‌నగర్, కాచిగూడ, ఆబిడ్స్, కోఠీ, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ వరకు అడుగడుగునా ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రధానమైన బస్టాపులు, బస్‌బేలలో ప్రయివేట్ బస్సులను నిలిపివేస్తున్నారు.లకిడికాఫూల్లోని టెలిఫోన్ భవన్, కాచిగూడ, అమీర్‌పేట్ బస్టాపులు రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సుల అడ్డాలుగా మారుతున్నాయి. ఈ బస్సులను నియంత్రించడంలో పోలీసులు,ఆర్టీఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిబంధనలు బేఖాతర్... మోటారు వాహన నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ వాహనాలు సిటీలోకి ప్రవేశించాలి. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోదు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటి మరీ దూసుకొస్తాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఖైరతాబాద్ వంటి అతి పెద్ద కూడళ్లలో రెడ్‌సిగ్నల్ వెలుగుతున్నప్పటికీ దూసుకొనిపోయే ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు కనిపిస్తాయి. ఒకవైపు లకిడికాఫూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజ్‌భవన్ వైపు వెళ్తూనే ఉంటాయి. కానీ అదేమీ పంజగుట్ట నుంచి లకిడికాఫూల్ వైపు వెళ్లే బస్సులు మాత్రం రెడ్ సిగ్నల్‌ను లెక్కచేయకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి. రాత్రయిందంటే చాలు అపరిమితమైన వేగంతో ఏ వైపు నుంచి దూసుకొస్తాయో తెలియదు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు రాత్రి సుమారు 550 బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. అలాగే మరో 500 బస్సులు ఉదయం పూట నగరానికి చేరుకుంటాయి. శని,ఆది వారాలు వంటి వీకెండ్స్‌లో వీటి రాకపోకలు మరింత అధికంగా ఉంటాయి. నగరంలోకి వచ్చే వాహనాలు కానీ తిరిగి వెళ్లేవి కానీ ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ప్రైవేట్ బస్సులకు తోడు హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు మరో 50 వేల లారీలు కూడా ఇదే తరహా ఉల్లంఘనలతో ట్రాఫిక్ టెర్రర్ను సృష్టిస్తున్నాయి. పర్మిట్ల ఉల్లంఘన ... ప్రయాణికులను ఎక్కించుకోవలసిన అనేక బస్సులు సరుకు రవాణా అవతారమెత్తాయి. కేవలం ప్రయాణికుల రవాణా కోసమే ఇచ్చిన పర్మిట్లను ఉల్లంఘించి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వాణిజ్య,వ్యాపార వస్తువులను రవాణా చేస్తున్నాయి. అక్రమంగా తిరుగుతున్న ఇలాంటి బస్సులు వల్ల రహదారి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఒక్కొక్క బస్సుపైన 4 నుంచి 5 టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, బహదూర్‌పురా, లకిడికాఫూల్, తదితర ప్రాంతాల్లో రవాణా అధికారులు నిర్వహించే తనిఖీల్లో ఇలాంటి ఓవర్‌లోడ్‌పై కేసులు నమోదువుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు,నెల్లూరు,కడప,అనంతపురం,తదితర ప్రాంతాలకు ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను వ్యాపారులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. లారీల్లో మాత్రమే తీసుకెళ్లాల్సిన అనేక వస్తువులు టూరిస్టు బస్సుల్లో రవాణా అవుతున్నాయి.ఒక్క ప్రైవేట్ బస్సులకే కాకుండా అన్ని రకాల రవాణా వాహనాలకు నగర శివార్లలోనే హాల్టింగ్ కల్పించి అక్కడికి ప్రయాణికులను తరలించేందుకు సిటీ బస్సులను నడిపితే తప్ప పరిష్కారం లభించదు. -
ఆర్టీఏలో డ్రైవింగ్ సిమ్యులేటర్లు
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రవాణాశాఖ ఆర్టీఏ కార్యాలయాల్లో సిమ్యులేటర్(అనుకరణ యంత్రం)లను ఏర్పాటు చేయనుంది. డ్రైవింగ్‌లో కనీస అవగాహన లేని వారికి నేరుగా వాహనం ఎక్కించి రోడ్లపై శిక్షణ ఇవ్వడం సరికాదని రవాణాశాఖ భావిస్తోంది. డ్రైవింగ్ నేర్చుకునేవాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు, పాత డ్రైవర్ల అనుభవాన్ని, మెళకువలను అంచనా వేసేందుకు వీటిని ఏర్పాటు చేయనుంది. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి వాటి కోసం ఆర్టీఏకు వచ్చే వినియోగదారులు వీటి ద్వారా శిక్షణ పొందవచ్చు. నగరంలో ఒకటి రెండు మాత్రమే: సిమ్యులేటర్ ద్వారా శిక్షణ ఇచ్చే డ్రైవింగ్ స్కూళ్లు నగరంలో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. మిగతా డ్రైవింగ్ స్కూళ్లన్నీ రోడ్లపైనే శిక్షణ ఇస్తున్నాయి. ఈ విధమైన శిక్షణతో సరైన నైపుణ్యం, అవగాహన లేకుండానే డ్రైవర్లుగా మారిపోతుండటంతో రహదారి భద్రత అతి పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ఆర్టీఏ కార్యాలయాలతో పాటుగా డ్రైవింగ్ స్కూళ్లలోనూ సిమ్యులేటర్లపై శిక్షణ తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏతోనే ప్రారంభం మొదట ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వీటి ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ పరిశీలించారు. ఆ తరువాత వీటిని మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు. సిమ్యులేటర్లతో దళారుల ఆటకట్టు: చాలా దేశాల్లో సిమ్యులేటర్ల ద్వారా డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి. ఆ శిక్షణలో నైపుణ్యం వచ్చాకే రోడ్డు మీద వాహనం నడిపేందుకు అనుమతిస్తారు. కానీ నగరంలోని కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు వినియోగదారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకు ఆర్టీఏ అధికారులకు, వినియోగదారులకు మధ్య దళారీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో దళారీల ఆట కట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవీ ప్రయోజనాలు - డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం లేక పోయినా సిమ్యులేటర్ల ద్వారా నేరుగా శిక్షణ పొందవచ్చు. - రహదారి భద్రతా, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. - క్లిష్టమైన పరిస్థితుల్లో అనుసరించవలసిన మెళకువలు తెలుసుకోవచ్చు. - నేర్చుకునే వాళ్ల ప్రవర్తనను విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది. - సీనియర్ సిటిజన్లకు డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణలో సిమ్యులేటర్ పరీక్ష ఉపయుక్తంగా ఉంటుంది. -
ప్రజల వద్దకే ఎల్ఎల్ఆర్ టెస్ట్
సాక్షి, కర్నూలు : రవాణా శాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ శాఖ అధికారులు జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఉత్తర్వుల మేరకు ఆ శాఖ కర్నూలు అధికారులు ప్రజల వద్దకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి తాండ్రపాడు శివారు రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎల్ఆర్ మేళాకు కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు ఈ నెల 18వ తేదీన కర్నూలు సి.క్యాంప్ సెంటర్, బనగానపల్లె, డోన్ పట్టణాలతోపాటు ఆదోని దగ్గర బైచిగేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని బసిరెడ్డి సూచించారు. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవా కేంద్రం) వద్ద పేరు నమోదు చేసుకుని రుసుం చెల్లిస్తే నిర్ణీత తేదీల్లో రవాణా శాఖ అధికారులే గ్రామానికి వచ్చి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అక్కడే ఎల్ఎల్ఆర్ జారీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్ కార్డు, వయసు, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు ఒక వాహనానికైతే రూ.260, రెండింటికైతే రూ.410 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
ఖమ్మంవ్యవసాయం: లారీ యజమానుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని స్వీకెల్ రిసార్ట్స్ అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర లారీ యజమానుల సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు పూర్తయినా లారీ రవాణా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోలేదన్నారు. సమస్యలను వివరిస్తూ ప్రభుత్వానికి అనేకమార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. మంత్రులను కలిసినా, నిరసన, ఆందోళనలు, బంద్ వంటి కార్యక్రమాలను చేపట్టినా ప్రభుత్వాల నుంచి కనీస స్పందన లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించిన పన్నులనే ఇప్పటికీ చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా ప్రీమియంను ప్రతి ఏడాది పెంచ డం బాధాకరమన్నారు. ఎగుమతులు, దిగుమతులను కూడా లారీ యజమానులపై మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలంలో డీజిల్ ధరలు రూ. 50 నుంచి రూ. 75లకు పెరిగాయని, వాటికి అనుగుణంగా కిరాయిలు పెరగలేదన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలను ఆమోదించారు. కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం ఖమ్మం అధ్యక్ష, కార్యదర్శులు నకిరకంటి సత్యంబాబు, బోజెడ్ల పూర్ణచందర్రావు, వరంగల్, కరీంగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, మణుగూరు. ఇల్లెందు, కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు చెందిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏమవుద్దో..! రవాణాశాఖ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ పదోన్నతి పొందాలన్న కోరిక ఉంటుంది. వారి సర్వీసును బట్టి ఇవ్వాలి కూడా. అయితే రవాణాశాఖలో గత నాలుగైదేళ్లుగా పదోన్నతులు లేక చాలామంది ఉద్యోగులు తమ కల తీరకుండా సర్వీసు నుంచి రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఆర్టీఏ ఉద్యోగుల్లో ఏ ప్రక్రియ ముందు జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఇలా ఎందుకంటే.. నాలుగేళ్లుగా పదోన్నతి కోసం ఎదురు చూసిన ఓ ప్రాంతీయ రవాణా అధికారి చివరకు ఉప రవాణా కమిషనర్ పదోన్నతికి నోచకుండానే గతేడాది ఉద్యోగ విరమణ చేశారు. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఒక ఆర్టీఓకు డీటీసీగా పదోన్నతి తీసుకొని రిటైర్ కావాలని ఉంది. ఆ అవకాశం కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనే సీనియర్ ఎంవీఐగా పనిచేస్తున్న మరో అధికారికి మూడేళ్ల క్రితమే ఆర్టీఓగా పదోన్నతి రావాలి. కానీ ఇప్పటి వరకు ఆ అవకాశం దక్కలేదు. 2012లో సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుగా చేరిన సుమారు 80 మందిలో కనీసం సగం మందికి ప్రమోషన్ ఇవ్వాలి. అనేక కారణాల వల్ల వారంతా విధుల్లో చేరిన వారు చేరినట్లుగానే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చిన నేపథ్యంలో మొదట బదిలీ ప్రక్రియ పూర్తి చేసి తరువాత పదోన్నతులు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తుండగా, కిందిస్థాయిలో దానిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొదట పదోన్నతులను పూర్తి చేసిన అనంతరం బదిలీలు చేపట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ రెండు అంశాల్లో ఏది ముందు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియని సందిగ్ధం నెలకొంది. అన్ని చోట్ల ఇంచార్జీలే.. రాష్ట్ర విభజన అనంతరం ఒకటి, రెండు సార్లు ఉద్యోగుల బదిలీలు జరిగినప్పటికీ పదోన్నతులు మాత్రం లభించలేదు. గత ఐదేళ్లుగా ఎంతో మంది ఆర్టీఓలు, ఎంవీఐలు ఎలాంటి పదోన్నతులకు నోచకుండానే రిటైరయ్యారు. మరెంతోమంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. రిటైరైన వారి స్థానంలో అక్కడే పనిచేస్తున్న ఇతర కేటగిరీల వారికి ఇన్చార్జిలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్, బండ్లగూడ, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఇన్‌చార్జీలే విధులు నిర్వహిస్తున్నారు. ఎంవీఐలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఆర్టీఓలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇలా చేరినవారు కూడా చివరకు ఇన్చార్జీ హోదాలోనే పదవీ విరమణ చేశారు. కానీ పదోన్నతికి మాత్రం నోచుకోలేదు. మరోవైపు ఇదే సమయంలో చాలాకాలంగా బదిలీలు లేకపోవడంతో ఆర్టీఏలో ‘ఆన్ డిప్యుటేషన్’ (ఓడీ) పైన ఇతర కార్యాలయాలకు, చెక్‌పోస్టులకు బదిలీ చేసుకొని వెళ్లిపోవడం ఒక ప్రహసనంగా మారింది. గత నాలుగేళ్లుగా వంద మందికి పైగా వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఇదేవిధంగా వెళ్లారు. ‘పదోన్నతి పొందడం ఒక హక్కు. మూడేళ్లు ఒక హోదాలో పనిచేసిన తరువాత సహజంగానే మరో హోదాకు వెళ్లాలని కోరుకుంటాం. పదవీ విరమణ నాటికి లభించే ప్రయోజనాలు కూడా అదనంగా ఉంటాయి. వీటన్నింటికీ తోడు ఉన్నత హోదాలో రిటైర్ కావడమనేది జీవితంలో ఒక సంతృప్తి’ అని నగరంలో పనిచేస్తున్న ప్రాంతీయ రవాణా అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏడుగురు ఆర్టీఓలకు ఉప రవాణా కమిషనర్లుగా, మరో 15 మంది ఎంవీఐలు లేదా పరిపాలన అధికారులకు ప్రాంతీయ రవాణా అధికారులుగా పదోన్నతి రావాలి. ఇక ఎంవీఐలుగా పదోన్నతులు పొందవలసిన సహాయ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇలా చేరిన వారు 2012లో 80 మంది ఉంటే, 2014, 2016లో మరో వంద మందికి పైగా ఉన్నారు. ఇక జూనియర్, సీనియర్ క్లర్క్‌లుగా పనిచేస్తున్న వాళ్లు సూపరింటెండెంట్ పదోన్నతుల కోసం తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ముందు ఏ ప్రక్రియ ఉంటుందో..! మొదట బదిలీలు చేపటి తరువాత పదోన్నతులు ఇవ్వాలనే ప్రతిపాదన పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బదిలీ చేసిన తరువాత పదోన్నతి ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఆర్టీఏ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ను ఏదో ఒక ఆఫీస్‌కు బదిలీ చేస్తే సదరు వ్యక్తికే ఆర్టీఓగా పదోన్నతి లభించి మరో చోటకు వెళ్లాల్సి రావచ్చు. అలా వెళ్లినప్పుడు ఎంవీఐ స్థానం ఖాళీ అవుతుంది. అలాగే పరిపాలనాధికారులను మొదట వివిధ చోట్లకు బదిలీ చేస్తే తరువాత వారిలో కొందరికి పదోన్నతులు లభించినప్పుడు మరోసారి పరిపాలనాధికారులను నియమించకతప్పదు. లేదా తిరిగి ఇంచార్జీలకే బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పదోన్నతుల కంటే ముందు బదిలీలు చేయడం వల్ల సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని ఉందని వివిధ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఓడీలకు తెరపడేనా.. బదిలీలు లేకపోవడం వల్ల గత నాలుగేళ్లుగా ఆన్ డిప్యుటేషన్ బదిలీలు పెద్ద ఎత్తున సాగాయి. ఎంవీఐలు, ఇతర కేటగిరీల్లో పనిచేస్తున్న వారు తమకు నచ్చిన ఆఫీసులకు, చెక్‌పోస్టులకు బదిలీ చేయించుకొని వెళ్లారు. నిబంధనల మేరకు సాధారణంగా జరగాల్సిన బదిలీలకు ఆన్ డిప్యుటేషన్ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. తాజాగా ప్రభుత్వం బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రవాణాశాఖలో ఈ విధానానికి తెరపడే అవకాశం ఉంది. -
నరసింహారెడ్డి @ రూ.కోట్లు..
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఆర్టీఓ కార్యాలయ అటెండర్ నరసింహారెడ్డి ఆస్తులపై అధికారులు రెండోరోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. వీరి సోదాల్లో కిలోల కొద్దీ బంగారం, పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. నరసింహారెడ్డి కుమార్తె లాకర్లో భారీగా బంగారంతో పాటు నగదు నిల్వలను గుర్తించారు. ఇక ఆయన అత్తగారి ఊరు ఆత్మకూరులోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్రం సెంటర్లోని నరసింహారెడ్డి అత్తగారి నివాసంలో విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన విషయం విదితమే. వివరాల్లోకి వెళితే...ఆయన రవాణాశాఖలో అటెండర్. పదోన్నతులు వచ్చినా కాదని 34ఏళ్లుగా ఒకేచోట ఆఫీసు సబార్డినేటర్‌గానే విధులు నిర్వహిస్తున్నాడు. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా సుమారు రూ.100 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడగట్టాడు. మంగళవారం ఈ మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు, కడప, తిరుపతి, విజయవాడ ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నెల్లూరు ఎంవీ అగ్రహారంలోని నరసింహారెడ్డి ఇంటితో పాటు కాపువీధిలోని నరసింహారెడ్డి సోదరుడు నరహరిరెడ్డి, పుత్తా ఎస్టేట్‌లోని మరో సోదరుడు నిరంజన్‌రెడ్డి, రాంజీనగర్‌లోని అతని మామ మురళీమోహన్‌రెడ్డి, ఆత్మకూరులోని బావమరిది వరప్రసాద్‌రెడ్డి, ఏజెంట్ బి.ప్రసాద్ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఏబీసీ అధికారులు డీటీసీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు కాపువీధి (ప్రస్తుతం ఎంవీ అగ్రహారం భార్గవినగర్)కి చెందిన కరాదు నరసింహారెడ్డి 1984లో రవాణాశాఖలో అటెండర్ (ఆఫీసు సబార్డినేటర్)గా విధుల్లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చేరిన నాటినుంచి ఉన్నతాధికారులకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి ఉద్యోగోన్నతి లభించినా.. వద్దని 34 ఏళ్లుగా ఆఫీసు సబార్డినేటర్‌గానే విధుల్లో కొనసాగుతున్నాడు. అక్రమ సంపాదనతో తనపేరున, తన భార్య, బంధువుల పేర్లపై పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, భూములు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు. భారీగా అక్రమ ఆస్తుల గుర్తింపు ఏసీబీ అధికారుల సోదాల్లో నరసింహారెడ్డి, అతని భార్య హరిప్రియ పేరుపై 18 ఇళ్లస్థలాలు, ఎంవీ అగ్రహారంలో జీప్లస్–2 ఇళ్లు, నరసింహారెడ్డి పేరుపై నెల్లూరు రూరల్ మండలం గుండ్లపాళెంలో 3.95 ఎకరాల వ్యవసాయ భూమి, అతని భార్య పేరుపై గుండ్లపాళెంలో 12.39 ఎకరాలు, సంగం మండలం పెరమనలో 35ఎకరాల వ్యవసాయభూమి, నరసింహారెడ్డి అత్త నారాయణమ్మ పేరుపై కొంత భూమికి సంబంధించి (మొత్తం 50.36 ఎకరాల వ్యవసాయ భూమి) డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారు, 7.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.7.75 లక్షల నగదు, రూ.1.01కోట్ల ఎల్ఐసీ డిపాజిట్లకు చెందిన బాండ్లు, రూ.10లక్షలు ఎల్ఐసీ పాలసీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌లో రూ.20 లక్షల నగదు, రూ.5లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, రెండు యూనికాన్ బైక్‌లను గుర్తించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.10 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.100కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో నరసింహారెడ్డి అతడి భార్య, కుమార్తె పేర్లపై రెండు లాకర్లు ఉన్నాయి. వాటిల్లో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే మంగళవారం బ్యాంక్‌కు సెలవు కావడంతో బుధవారం వాటిని తెరవనున్నారు. ఉదయం 8.30 గంటలక ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. నరసింహారెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, శ్రీహరిరావు, సుదర్శన్‌రెడ్డి, రమేష్, రాఘవరావు, ప్రసాద్‌రెడ్డి, గిరిధర్ పాల్గొన్నారు. -
వీడనున్న ‘తోహాస్’ అక్రమాల గుట్టు
సాక్షి, హైదరాబాద్ : ట్రక్ పార్కింగ్‌కు కేటాయించిన స్థలాన్ని తప్పుడు పత్రాలతో ప్రైవేటు గోదాములకు లీజుకిచ్చిన వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దర్జాగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటుపరం చేసేందుకు దాని నిర్వాహకులే బరితెగించినా చూసీచూడనట్టు పోయిన రవాణాశాఖ అధికారులు దానిపై కేసు నమోదుకు సిద్ధపడ్డారు. కేసు నమోదుకు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రవాణా మంత్రి సమీక్ష నిర్వహించారు. గత కాం గ్రెస్ ప్రభుత్వం పెద్ద అంబర్‌పేటలోని హెచ్ ఎండీఏ స్థలాన్ని ట్రక్ పార్కింగ్ కోసం రవాణాశాఖకు కేటాయించింది. దీన్ని ‘ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ(తోహాస్)’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీన్ని నేరుగా రవాణాశాఖ కాకుండా తోహాసే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలు చూసే ఓ కీలక వ్యక్తి తప్పుడుపత్రాలతో ఆ స్థలంలో ప్రైవేటు గోదాముల ఏర్పాటుకు తెరతీశాడు. దీని వెనక పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. అది ప్రభుత్వ భూమి అయినందున అధికారుల నిఘా కచ్చితంగా ఉండాలి. దీనిపై ఫిర్యాదుల వచ్చినా సకాలంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. -
ఆర్టీసీకి జాతీయ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో టీఎస్ఆర్టీసీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కొన్నేళ్లుగా ఈ విభాగాల్లో ఉత్తమ రవాణాసంస్థగా పురస్కారాలు సొంతం చేసుకుంటున్న ఆర్టీసీ ఈసారీ అవార్డులను దక్కించుకుంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఎంపిక చేసిన రవాణా సంస్థలకు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఢిల్లీలో జరిగిన 62వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో పురస్కారాలు ప్రదానం చేసింది. వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపులో టీఎస్ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా పురస్కారాలు దక్కించుకుంది. వాహన ఉత్పాదకతలో 318.27 కి.మీ. నుంచి 328.27 కి.మీ.(కి.మీ./వెహికల్/డే)కు మెరుగుపరుచుకుని టాప్‌లో నిలిచింది. ఇక 7,500 వాహనాలు ఉన్న రవాణాసంస్థల కేటగిరీలో ఇంధనపొదుపునకు సంబంధించి 5.51 కేఎంపీఎల్‌తో ఉత్తమంగా నిలిచింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ (మోర్త్)కార్యదర్శి యధువీర్సింగ్, సంయుక్త కార్యదర్శి అభయ్ దామ్లేల చేతుల మీదుగా టీఎస్ఆర్టీసీ ఎండీ రమణారావు పురస్కారాలు అందుకున్నారు. అధికారులు, కార్మికుల కృషి వల్లనే పురస్కారాలు సాధించినట్లు ఆయన తెలిపారు. -
దళారులకు కోడింగ్
షాద్‌నగర్ రూరల్ : పారదర్శకత ఉండాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖలో ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అవినీతిని అంతం కావడం లేదు. దళారులతో వెళితేనే పనులు జరుగుతున్నాయి. అమ్యామ్యాలు ఇవ్వనిదే ఏ ఫైలూ ముందుకు కదలడం లేదు. దీనికి నిదర్శనం ఎంవీఐ అ«ధికారి ఏసీబీకి చిక్కిన ఉదంతం. కోడింగ్ లేని ఫైళ్లు వెనక్కి.. షాద్‌నగర్ ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారులు చెప్పిందే వేదంగా మారింది. కార్యాలయానికి వెళితే.. అక్కడ ప్రజల కంటే దళారులే అధికంగా కనిపిస్తారు. నేరుగా కార్యాలయానికి ప్రజలు వచ్చినా వారి పనులు మాత్రం జరగడం లేదు. మధ్యవర్తులకు అధికారులు కోడింగ్ కేటాయించారు. ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయి. కోడింగ్ లేకుండా ఏదైనా ఫైల్ వచ్చిందంటే అధికారులు ఆపేస్తున్నారు. కార్యాలయంలో తమ పని సులువుగా కావాలంటే దళారులు తమ కోడింగ్‌లను ఫైళ్లపై వేసి కార్యాలయం లోపలికి పంపుతున్నారు. కోడింగ్ ఉంటే చాలు ఎలాంటి పరీక్షలు, తనిఖీలు లేకుండానే లైసెన్సులు, ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదీ కోడ్ భాష షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయంలో కోడ్ భాష భలే పని చేస్తుంది. ఇక్కడి ఏజెంట్లు ఎవరికి వారు కోడింగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంవీఐ కార్యాలయానికి తాము పంపించే ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే సదరు అధికారి ఆ పనిని చేసిపెడతారు. లేదంటే సవాలక్ష కారణాలతో తిప్పిపంపుతారు. ఏజెంట్లు నిర్ణయించుకున్న కోడ్ భాషలు జేసీ, హెచ్, వీఆర్, 45, 35, ఏకే, ఎల్, ఎస్ స్టార్, ఎస్ అని ఇలా ఏజెంట్ల ఫైళ్లపై రాస్తున్నారు. ఈ ఫైళ్లు ఉంటే చాలు అధికారులు పని సులభంగా చేసి పెడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు... ఏసీబీకి చిక్కిన అధికారి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్సుకు రూ. 250, ఫిట్‌నెస్‌కు రూ. 1200, కొత్త రిజిస్ట్రేషన్లకు రూ. 2వేలు, డ్రైవింగ్ లైసెన్సుకు రూ. 750, వాహనాల ట్రాన్స్ఫర్ కోసం రూ. 500 వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఆయా పనులపై వెళితే ఎంవీఐ కేటాయించిన రేట్ల ప్రకారం డబ్బు చెల్లించి పని చేయించుకోవాలి. అలా కాకుండా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చూస్తే మాత్రం జీవితకాలం ఎదురు చూడాల్సిందే. సాయంత్రం లెక్క చూస్తారు ఏసీబీ వలకు చిక్కిన శ్రీకాంత్ చక్రవర్తి తనదైన శైలిలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని ఫైళ్లు వచ్చాయో ఎంవీఐ అ«ధికారి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న కారు డ్రైవర్ చూసుకునేవాడు. సాయంత్రం ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలో ఏయే ఏజెంటు డబ్బులు ఇచ్చాడో లెక్క చూసి మరీ సంతకాలు చేసేవాడని ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టజెప్పని వారి ఫైళ్లను సదరు అధికారి పెండింగ్‌లో పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. ఇలా రోజుకు వేల రూపాయల్లో లంచం వచ్చేదని సమాచారం. రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. దళారులను ఆశ్రయించొద్దు ప్రజలు ఏదైనా పనికోసం వస్తే నేరుగా అధికారులనే సంప్రదించాలి. ధళారులను ఆశ్రయించవద్దు. పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలుంటే ప్రజలు అధికారులను నేరుగా వచ్చి కలిసి సమస్యలు తెలియజేయాలి. షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. అవినీతిని నిరోధించడంలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలి. – ఇన్చార్జి ఎంవీఐ సాయిరాంరెడ్డి -
తప్పెవరిది?
రహదారులు మృత్యుదారులుగా.. వాహనాలు మృత్యుశకటాలుగా మారాయి.. బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. మైనర్లు, అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.. ఆయా ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలు, క్షతగాత్రులు కోలుకోలేని దెబ్బతింటున్నారు.. గద్వాల క్రైం: ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లిన వారు.. సొంత పనులపై బయటకు వెళ్లి వారు ప్రస్తుతం క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మనం సరిగానే వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వారు క్షణకాలంలో చేసే చిన్నపొరపాటు నిండు జీవితాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ఎంతో భవిష్యత్ ఉన్న మైనర్లు, యువకులు, కుటుంబం ఆధారపడి ఉన్న యజమానులు మృత్యువాత పడుతూ.. కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అ లంపూర్ మండలాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వపరంగా నివారణ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం.. వాహనదారుల అవగాహన లేమితో అవేమీ ప్రమాదాలను అడ్డుకోలేకపోతున్నాయి. రోడ్డు భద్రతపై ఏదీ చిత్తశుద్ధి వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం అనే విషయాన్ని డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలి.. ఎలా ముందు వెళ్తున్న వాహనాలను దాటాలి.. తదితర విషయాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒకింత ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయంలో ఇటు రవాణా శాఖ, అటు పోలీసు అధికారులు నామమాత్రంగా తనిఖీలు జరుపుతూ చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు డ్రైవర్లు నిద్రలేమి, మద్యం మత్తులో వాహనాలను నడపడం కూడా గమనార్హం. అవగాహన లేని వారే అధికం ఒక వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా ఆ దారిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖాధికారులు జారీ చేసే లైసెన్స్ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. రాత్రివేళలో హెడ్ ల్యాంపులు, ఇండిగేటర్లు వేస్తూ వాహనాలకు ఎలా సంకేతాలు ఇవ్వాలి.. అనే విషయాలపై ప్రస్తుత డ్రైవర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదు. ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చు. ఇవిగో ఘటనలు.. జనవరి 8న ధరూరు మండలం చిన్నపాడు, యమునోనిపల్లికి చెందిన కొంతమంది గద్వాలలోని ఓ పత్తి మిల్లులో కూలికి వెళ్లేవారు. తిరిగి వచ్చే క్రమంలో బొలేరో డ్రైవర్ నిర్లక్ష్యం.. నిద్రలేమి కారణంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. æ 9వ తేదీన ఉండవెల్లి మండలం మునగాలకు చెందిన మధుసూద న్ అనే విద్యార్థి ద్విచక్రవాహనంపై వస్తుండ గా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతిచెం దాడు. æ 12వ తేదీన మానవపాడు దగ్గర జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. æ 14వ తేదీన బీచుపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మృతిచెందారు. నివారణ చర్యలేవీ.. గద్వాల– అయిజ, గద్వాల– ధరూరు, గద్వాల– ఎర్రవల్లి తదితర రోడ్డు మార్గంలో ప్రభుత్వం నూతనంగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. అయితే వివిధ ప్రాంతాల్లో రోడ్డు వేస్తున్న క్రమంలో అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళలో ఎరుపు రంగు రేడియం స్టిక్కర్ సూచకలు పెట్టాలి. మూల మలుపులు, స్పీడ్ బ్రేకర్లు ఇలా ప్రతిచోట ప్రమాదాలను నివారించేలా బోర్డులు ఉంచాలి. కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. తూతూమంత్రంగా నిర్వహణ.. ప్రతియేటా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి 11 నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. అలాగే 25వ తేదీ నుంచి ఆర్టీసీ యాజమాన్యం సైతం భద్రతా వారోత్సవాలు జరుపుతుంది. అయితే వీటిని ఆయా అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇందులో సంబంధిత అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. రోడ్డు ప్రమాదాల నివారణకు మా శాఖ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రవాణా శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాల్లో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. కొందరు ప్రజలను కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
యువత చెంతకే డ్రైవింగ్ లైసెన్సులు
నగరంపాలెం(గుంటూరు): యువతకు సులభ పద్ధతిలోనే డ్రైవింగ్ లెసెన్సుల జారీ చేసే పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్ విధానం అమలు కావటంతో కార్యాలయాలకు, మీ సేవలకు రాకుండానే వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ అర్హత గల విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా నిర్వహించే లెర్నింగ్ లైసెన్సు టెస్టులు కళాశాలలోనే నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలి దశలో ప్రతి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఎల్ఎల్ఆర్ టెస్టులు నిర్వహించి అర్హులందరికీ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారులను గత రెండు నెలలు క్రితం ఆదేశించారు. అక్కడికక్కడే ఎల్ఆర్ మంజూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కి కేవలం విద్యార్థుల ఆధార్ నంబరు, బయెమెట్రిక్ డివైజ్‌పై ఫింగర్ ఉంచటం ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. రవాణాశాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ టెస్ట్ నిర్వహించే రోజును వారం ముందే ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి అర్హులను పరీక్ష నిర్వహించే రోజు ఆధార్ కార్డులతో హాజరు కావల్సిందిగా సమాచారం అందిస్తారు. ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కి సంబంధించి రోడ్ సిగ్నల్స్, రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యూలైజేషన్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్ యూజర్ గైడ్ అందిస్తారు. జిల్లాలోని ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్ఎల్ఆర్ టెస్ట్‌లను ప్రతి ఒక వారం ఒక చోట నిర్వహించటానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ జీసీ రాజరత్నం తెలిపారు. -
‘ప్రైవేటు’ పోటు.. మళ్లీ నష్టాల రూటు!
సాక్షి, హైదరాబాద్: లాభాల మాట ఎన్నడో మరిచిపోయిన ఆర్టీసీ.. దాదాపు దశాబ్దం తర్వాత భారీ రాబడితో గాడిన పడినట్టు కనిపించింది. హైదరాబాద్ సిటీ జోన్ మినహా మిగతా రెండు జోన్లు ఒకేసారి లాభాలు సాధించి సంస్థలో కొత్త జోష్‌ను నింపాయి. కానీ ‘వరి గడ్డి మంట’ చందంగా ఆ సం తోషం ఎక్కువ రోజులు నిలవలేదు. స్వయం గా ప్రభుత్వ నిర్లక్ష్యమే లాభాల బాట పట్టిన ఆర్టీసీని మళ్లీ నష్టాలు చవిచూసేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల సంఖ్యలో ప్రైవేటు అక్రమ సర్వీసులకు బ్రేకులు పడగా.. ఇప్పుడు ప్రభుత్వం చూసీ చూడనితనంతో అవి రోడ్డె క్కి బుకింగ్స్‌తో దూసుకెళ్తున్నాయి. దీంతో ఆర్టీసీ రూ.72 కోట్ల నష్టాలు చవి చూసింది. అంతకు ముందు నెలకంటే దాదాపు రూ.40 కోట్లు అధికం కావటం గమనార్హం. పైన పటారం.. ప్రైవేటు బస్సుల అక్రమ సర్వీసులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందన్నది ప్రభుత్వానికి తెలియని విషయమేమీ కాదు. ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ దాదాపు రూ.వేయి కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుందని నిపుణులు కూడా గతంలో నివేదికలు అందజేశారు. గతేడాది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీపై జరిపిన సమీక్షలోనూ దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో ఆర్టీసీ, రవాణా శాఖలు కలసి ప్రైవేటు అక్రమ సర్వీసుల విషయంలో చర్యలు తీసుకునేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాటి సంయుక్త రవాణా కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక వ్యవ స్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ప్రైవేటు అక్రమ సర్వీసులను నియంత్రించేం దుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పేరు కు చర్యలు గంభీరంగానే ఉన్నా.. వాస్తవంగా జరుగుతోంది మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. మళ్లీ పెరిగిన నష్టాలు.. రవాణా చట్టాలు ఎంతగా అపహాస్యమవుతున్నాయో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన చర్యల ద్వారా ఇటీవల బహిర్గతం చేసింది. ఆ రాష్ట్రంలో పర్మిట్లు పొంది వేరే రాష్ట్రాలు కేంద్రంగా అక్రమంగా వేల సంఖ్యలో బస్సులు తిరుగుతున్న తీరును బయటపెట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా దాదాపు వెయ్యి వరకు బస్సులున్నట్టు తేలింది. వాటిలో తెలంగాణ వాటా దాదాపు 400. ఈ నేపథ్యంలో ఆ బస్సులను నిషేధించింది. ఇదే సమయంలో ఆర్టీసీ దూర ప్రాంతాలకు దాదాపు 150 సర్వీసులు ప్రారంభించింది. ఈ రెండు చర్యల కారణంగా ఒక్కసారిగా ఆర్టీసీకి గణనీయ సంఖ్యలో రాబడి పెరిగి నష్టాలు బాగా తగ్గాయి. రెండు జోన్లు లాభాల్లోకి రావటంతో.. నష్టాలు గణనీయంగా తగ్గాయి. ప్రతినెలా రూ.వంద కోట్లకుపైగా నష్టాలు వస్తుండగా, ఆ మొత్తం రూ.40 కోట్లకు తగ్గింది. దీంతో ఆర్టీసీ దూర ప్రాంతాల సర్వీసుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. మరో నెలరెండు నెలల్లో ఆ మాత్రం నష్టాలు కూడా ఉండవన్న సంకేతాలిచ్చింది. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయింది. నెల క్రితం రూ.40 కోట్లకే పరిమితమైన నష్టాలు తాజాగా రూ.72 కోట్లకు చేరుకున్నాయి. కారణాలను విశ్లేషించిన ఆర్టీసీ అధికారులు మళ్లీ ప్రైవేటు అక్రమ సర్వీసులు రోడ్డెక్కడమే ప్రధాన కారణమని తేల్చారు. పట్టించుకోవద్దని ఆదేశాలు ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులు మళ్లీ రోడ్డెక్కి పరుగు ప్రారంభించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఇప్పటికే పలుమార్లు రవాణా శాఖ దృష్టికి తెచ్చారు. కానీ రవాణా శాఖ అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఆ బస్సుల విషయంలో చూసీచూడనట్టు ఉండాలన్న బడా నేతల ఆదేశాలే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ‘దాదాపు 3 నెలలుగా దూరప్రాంత సర్వీసులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కొత్త బస్సులెన్ని తెచ్చిపెట్టినా నిండుగా వెళ్తున్నాయి. దీంతో లాభాలు వస్తున్నాయి. కానీ నెల రోజులుగా తీరు మారింది. కొన్ని బస్సులు రద్దు చేసుకోవాల్సి వస్తోంది. రద్దయిన ప్రైవేటు బస్సులు యథాప్రకారం తిరగటమే ఇందుకు కారణం’ అని ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు. బాహాటంగా మాట్లాడ్డానికి జంకుతున్నా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఆ ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని పేర్కొంటున్నారు. -
రవాణాశాఖకు ఆదాయం ఫుల్
నల్లగొండ : ఆదాయ వృద్ధిలో రవాణా శాఖ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. జిల్లాల పున ర్విభజన తర్వాత రవాణా శాఖలో తీసుకొచ్చిన వినూత్న మార్పులు ఆదాయ పెరిగేందుకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో డీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ సాధించిన వృద్ధి రేటు వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న రవాణ శాఖ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మూడు జిల్లాలకు విస్తరించడంతో ప్రజలకు మరింత అందుబాటులో సేవలు అందించడం ద్వారానే ఆదాయ వృద్ధి సాధ్యమైందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఆరు మసాల్లోనే ఆదాయంలో 9శాతం వృద్ధి సాధించామని వివరించారు. జీవితకాలపు పన్నులు, త్రైమాసిక పన్నులు, జరిమానాల రూపంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబ ర్ వరకు రూ.90.25 కోట్ల లక్ష్యానికిగాను రూ.87.23 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు డీటీసీ చెప్పారు. గతేడాది ఇదే రోజుల్లో ఉమ్మడి జిల్లా రూ.80 కోట్లు ఆదాయం వస్తే...ఈ ఏడాది దానికి అదనంగా రూ.7.23 కోట్లు పెరిగిందన్నారు. దీంతో పాటు కోదాడ, వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టుల నుంచి రూ.12.77 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దీంట్లో కోదాడ చెక్ పోస్ట్ నుంచి రూ.5.92 కోట్లు, వాడపల్లి రూ.5.85 కోట్లు, నాగార్జునసాగర్ చెక్‌పోస్టు నుంచి రూ.కోటి ఆదాయం సమకూరిందని తెలిపారు. ఓవర్‌లోడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి... ప్రధాన రహదారులపై రాకపోకలు సాగిస్తున్న ఓవర్‌లోడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రధానంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సిమెంట్ పరిశ్రమలు, రైస్ మిల్లుల నుంచి సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాలు వస్తున్నాయని తద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వారం రోజుల్లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తామని డీటీసీ తెలిపారు. -
రవాణాశాఖలో దళారులదే హవా..!
–ప్రతి పనికి పైసలిచ్చుకోవాల్సిందే.. –అమర్యాదగా ప్రవర్తిస్తున్న మహిళా ఉద్యోగులు – చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు పాత శ్రీకాకుళం: జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారుల రాజ్యం సాగుతోంది. ఇటీవల డీటీసీగా బాధ్యతలు చేపట్టిన అధికారి దళారులను కార్యాలయం దరిదాపులకు రాకుండా చూశారు. ఇది కొద్దిరోజులపాటు అమలైంది. ఇప్పుడు మళ్లీ హవా సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రణస్థలానికి చెందిన ఓ వ్యక్తి తన వాహనాన్ని అమ్మకానికి పెట్టాడు. వాహనానికి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నప్పటికీ దానిని వేరే వ్యక్తి పేరిట ట్రాన్ఫర్ చేసేందుకు తీసుకోవాల్సిన పర్మిట్ కాగితాల కోసం పైసలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉండే ఓ దళారీని ఆశ్రయించాడు. వెంటనే ఆయన రవాణాశాఖ అధికారిని సంప్రదించడంతో భారీ మోతాదుల్లో పైకం తీసుకుంటూ రెండు రోజుల్లో చేయాల్సిన పనిని గంటలోనే పూర్తిచేసి పంపేసినట్టు సమాచారం. ప్రతి పనికీ పైస లిచ్చుకోవాల్సిందే... జిల్లా ఉప రవాణాశాఖ కార్యాలయంలో ప్రతి పనికి లంచం ఇచ్చుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో పాటు కార్లుకు ఆయా షోరూంలలో రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ పనులకు తప్ప మిగతా పనులన్నీంటికీ అదనంగా పైకం (లంచం) చెల్లించుకోవాల్సిందే. మర్యాద అనే పదం తెలియని మహిళా ఉద్యోగులు... ఇదిలావుండగా కార్యాలయంలో వివిధ కౌంటర్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు అమర్యాదగా మాట్లాడుతున్నారని కార్యాలయానికి వివిధ పనులపై వచ్చిన వారు వాపోతున్నారు. రెండు రోజుల కిందట 9,10 కౌంటర్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినికి ఎల్‌ఎల్‌ఆర్‌కు సంబంధించి కౌంటర్ స్లిప్‌లో తప్పు పడడంతో దానిని మార్చాలని ఓ వ్యక్తి కోరాడు. దీంతో ఆయనపై అమర్యాదగా ఎన్నో మాటలు విసిరేసింది. ఆయన ఏమి చేయలేక మిన్నకుండిపోయారు. నాదృష్టికి రాలేదు.. సరిచేస్తాం కార్యాలయంలో దళారులను పూర్తిస్తాయిలో నియంత్రించాం. మళ్లీ ఇలా జరుగుతుందంటే కార్యాలయ సిబ్బందితో మరోసారి సమావేశమవుతాం. మహిళా ఉద్యోగులందరూ కార్యాలయానికి వచ్చేవారితో మర్యాదగా మాట్లాడాలి. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. –శ్రీదేవి, డీటీసీ -
డేంజర్ జర్నీ!
రోడ్డెక్కితే చాలు.. అడుగడుగునా ప్రమాద భయం..! కండిషన్ లేని వాహనాలు.. వాటిని నడిపే డ్రైవర్లకు మద్యం మత్తు లేదంటే నిద్రమత్తు.. వాహనంలో అపరిమిత లోడు.. కారణాలేవైనా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై శనివారం జరిగిన దుర్ఘటనలో 23 ప్రాణాలు హరీమన్నాయి. మన జిల్లాలోనూ ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా రవాణాశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. సాక్షి, గుంటూరు : వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే రాజ్యలక్ష్మి, శివమ్మ అనే తల్లీ కూతుళ్లు ఈ నెల 11వ తేదీ రాత్రి మంగళగిరి సమీపంలోని హ్యాపీక్లబ్‌లో జరిగే వివాహానికి హాజరై ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చారు. కళ్లు మూసి తెరిచేలోగా ఓ గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆ కుటుంబం వీధుల పాలైంది. ► జిల్లాకు చెందిన ఇద్దరు సీఏ విద్యార్థులు విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్నారు. స్నేహితుని ద్విచక్ర వాహనం తీసుకుని గుంటూరుకు వచ్చారు. కొరిటెపాడు సెంటర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురూ మృత్యు ఒడిలోకి చేరారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇలా నిత్యం జిల్లాలో ఎవరో ఒకరు, ఎక్కడో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ► కొందరు చేజేతులా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇతరుల నిర్లక్ష్యంవల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగానూ మద్యం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత రహదారుల దుస్థితి, అధికారులు ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఏటా ప్రమాదానికి గురై మృత్యువాత పడే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. హైవేల్లో ఎనీటైమ్ మద్యం.. లారీలు, ఆటోల ప్రమాదాలకు మద్యపానమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పట్టణాల్లో అర్ధరాత్రి వేళల్లోసైతం మద్యం విక్రయాలు యదేచ్ఛగా జరుగుతుండగా హైవేల్లో మాత్రం 24 గంటలూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎన్‌హెచ్-5 కృష్ణానది నుంచి చిలకలూరిపేట వరకు ఉంది. మొత్తం హైవే 70 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ దారిలో ప్రతి ఐదు, పది కిలోమీటర్ల మార్గంమధ్యలో దాబాల్లో, మద్యం దుకాణాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఆటోలు, లారీడ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుకొని మద్యం తాగడం నిత్యకృత్యంగా మారుతోంది. ఈ తంతు తెలిసినా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాస్తున్న అధికారులు హైవేలపై లారీ డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించకపోవటం వల్ల కూడా డ్రైవర్లు ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్నారు. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొక్కుబడిగా భద్రతా కమిటీ.. రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రహదారి భధ్రతా కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా ఎస్పీ, ఎన్‌హెచ్-5 అధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్, రవాణాశాఖా అధికారులు, ఆర్టీసీ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రహదారుల ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మొక్కుబడి సమీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
అడ్డగోలుగా రైట్ రైట్..
రవాణా శాఖలో కలకలం ఆర్టీవో, మరో ఇద్దరు సస్పెన్షన్ ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ బ్యాడ్జిల జారీలో అవినీతి విద్యార్హతలను పరిశీలించకుండా మంజూరు నెలరోజులుగా విజిలెన్స్ దర్యాప్తు అనకాపల్లి : వాహనాన్ని నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన కూడళ్లలో సిగ్నల్స్‌ను గమనించాలి. మలుపుల్లో ప్రమాద హెచ్చరికలను అర్థం చేసుకోవాలి. అందుకే ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ బ్యాడ్జి పొందాలంటే కనీస విద్యార్హత ఉండాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కాదు. డబ్బులిస్తే చాలు విద్యార్హతలను పరిశీలించరు. క్షేత్రస్థాయి దర్యాప్తు జరపరు. ట్రాన్స్‌పోర్టు లెసైన్స్‌లు జారీ చేస్తారు. అనకాపల్లి ఆర్టీవో కార్యాలయంలో కొన్నాళ్లుగా జరుగుతోందిదే. ఆర్టీవో మహ్మద్ సలీమ్ సహా కార్యాలయ పరిపాలనాధికారి నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణిల సస్పెన్షన్‌కు కారణమిదే. వీరిని సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులతో కలకలం రేగింది. అక్రమాలపై కమిషనర్‌కు ఫిర్యాదు: ట్రాన్స్‌పోర్టు లెసైన్సుల జారీలో సంబంధీకుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై క్షేత్రస్థాయి దర్యాప్తు జరపకుండా బ్యాడ్జీలను ఇస్తున్నారని ఓ వ్యక్తి నేరుగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. ఆశాఖ ఉన్నతాధికారులృబందం అనకాపల్లి కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన కమిషనర్ కూడా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధానంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జారీ చేసిన 312 లెసైన్సులకు సంబంధించిన 97 ఫైళ్ల అదృశ్యంపై ఉన్నతాధికారులు, విజిలెన్స్ృబందం నెలరోజులపాటు దర్యాప్తు చేపట్టారు. అధిక సంఖ్యలో లెసైన్స్‌ల బ్యాడ్జీ నంబర్లు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు గ్రహించారు. విచారణలో నివేదికలనుబట్టి ఇందులో అనకాపల్లి ఆర్టీవో మహ్మద్ సలీమ్, ఏవో నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణిల ప్రమేయం ఉన్నట్టు రుజువైంది. లెసైన్స్ బ్యాడ్జీల నంబర్ల మంజూరులో అక్రమాల డొంక బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాడ్జి నంబర్ల అవినీతి అనకాపల్లి కార్యాలయానికి పరిమితం కాదని అన్ని కార్యాలయాలలో ఇదే పరిస్థితి ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా రికార్డులు పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో బ్యాడ్జీ నంబర్ల జారీ ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే కమిషనర్ బ్యాడ్జీ నంబర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలిసింది. విశాఖ, గాజువాక కార్యాలయాలలో ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. నా తప్పేమీ లేదు: ఆర్టీవో సలీం : బ్యాడ్జీల వివాదంలో తన తప్పులేదని ఆర్టీవో సలీం పేర్కొన్నారు. కిందిస్థాయిలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చానన్నారు. అయినా తనను శిక్షించారని, దేవుడే ఈ సమస్యకు పరిష్కారం చూపుతాడన్నారు. కాలమే సమాధానం చెబుతుందన్నారు. -
బడి బస్సు.. తనిఖీలు తుస్సు!
►నత్తనడకన ఫిట్నెస్ పరీక్షలు ►పట్టించుకోని పాఠశాల యాజమాన్యాలు ►నిర్లక్ష్యాన్ని వీడని రవాణ శాఖ అధికారులు ►ఆన్లైన్లో నమోదు అంతంతే ►జూన్ 1కి ముగియనున్న గడువు బడి బస్సులు భద్రంగా ఉండాలి.. విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు వెళ్లాలి..అనుమతుల్లేకుండా రోడ్లపై తిరిగే బస్సులపై కఠినంగా వ్యవహరించండి..అంటూ ప్రభుత్వం ఆదేశించినా జిల్లా రవాణా శాఖలో పెద్దగా చలనం కనిపించలేదు. ఈనెల 15 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షల తనిఖీలు జిల్లాలో తూతూమంత్రంగా సాగుతున్నాయి. వ్యవస్థాగతంగా జరగాల్సిన తనిఖీ నామమాత్రంగా ముగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు: బస్సుల్లో వెళ్లే చిన్నారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రభుత్వం సామర్థ్య పరీక్షల కోసం పాఠశాల బస్సులకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. డ్రైవర్ అర్హతల నుంచి బస్సు ఫిట్నెస్ వరకు మొత్తం 33 అంశాల ప్రాతిపదికన తనిఖీలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో 980 పాఠశాలల బస్సులు ఉండగా.. ఈనెల 15తో వాటన్నిటికీ ఫిట్నెస్ గడువు ముగిసింది. ఆన్లైన్లో నమోదు చేసుకుని రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేయించుకుని ఫిట్నెస్ ధృవపత్రాలు పొందాకే వాహనాలు రోడ్డుపై తిప్పాలి. ఇప్పటివరకు 45 బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు చేయించుకున్నారు. మరో 14 బస్సులు కండీషన్ సరిగా లేకపోవడంతో వాటి యజమానులకు సీఎఫ్ఆర్ఆర్ నోటీసులను అధికారులు జారీ చేశారు. ప్రతి ఏడాది మే 15వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించి సంబంధిత అధికారులు ఫిట్నెస్ పత్రాలు జారీ చేసేవారు. ప్రస్తుతం పాఠశాలలు తెరిచేలోపు తప్పనిసరిగా ఎఫ్‌సీ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. సామర్థ్య పరీక్షలకు జూన్ 1వ తేదీ తుది గడువుగా ప్రకటించినప్పటికీ పాఠశాలల యాజమాన్యాలలో స్పందన అంతంతమాత్రమే. అధికారులు తనిఖీలు కూడా ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ 900 బస్సులకు పైగా ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది. రవాణా శాఖ వెబ్సైట్లో స్లాట్ కోసం నమోదు చేసుకున్న బస్సుల సంఖ్య ఇప్పటివరకు వందకు మించలేదు. ప్రతి బస్సునకు ఫలానా డ్రైవర్, క్లీనర్ ఉంటారని యాజమాన్యాలు వెబ్సైట్లో సూచించాలి. వారినే సామర్థ్య పరీక్షలకు పంపాలి. డ్రైవర్ పూర్తి ఆరోగ్యంతో 60 ఏళ్లకు మించని వాడై ఉండాలి. చాలా సంస్థల్లో ముసలి, ముతక డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్లు ఉండటం లేదు. అటువంటివారు స్లాట్ నమోదుకు వెనుకాడుతున్నారు. అయితే పాఠశాలల యాజమాన్యాల వాదన మరో విధంగా ఉంది. తనిఖీల సమయం కోసం నమోదు ప్రక్రియను మే 1 నుంచి ప్రారంభించివుంటే తమకు 15 రోజులు వెసులుబాటు దక్కేదని విద్యాసంస్థల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. గడువు ముగిసిన రోజు నుంచి స్లాట్‌కు ప్రయత్నిస్తున్నప్పటికీ సమయం పడుతున్నందున మరికొంత వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. కర్నూలు, నంద్యాలలో ప్రాంతీయ కార్యాలయాలు, ఆదోనిలో యూనిట్ కేంద్రం, ఆత్మకూరు, డోన్‌లో ఎంవీఐ కేంద్రాలు రవాణా శాఖకు ఉన్నాయి. గడువులోగా ఎఫ్‌సీ చేయించుకోకపోతే చర్యలు జిల్లాలో పాఠశాలల బస్సులు సామర్థ్య నిర్ధారణ పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించాం. విద్యాసంస్థల బస్సులు తమ శాఖ నుంచి విధిగా అనుమతి పొందాలి. ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చినందున ఆ మేరకు విద్యాసంస్థ తమ బస్సుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలి. గడువులోగా ఎఫ్‌సీ చేయించుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. చాలా బస్సులు కండీషన్‌గా ఉండటం లేదు. వాటన్నిటినీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని నిబంధనల మేరకే బస్సులను కార్యాలయానికి తీసుకురావాలని నోటీసులు ఇచ్చాం. ఎఫ్‌సీ లేకుండా రోడ్లపై తిప్పితే చర్యలు తప్పవు. -ఎస్.ఎస్.మూర్తి, ఆర్టీఓ -
బ్రోకర్లకు అడ్డుకట్ట
రవాణాలో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం జూలై నుంచి అమలుకు ప్రయత్నాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ల రద్దు వాహన యజమానులకు ఊరట మర్రిపాలెం : వాహన యజమానులకు ఊరట లభించనుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పుకు సిద్ధమవుతోంది. కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్ల రద్దు నిర్ణ యం త్వరలో ప్రకటించనుంది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలులోకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాహనం కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం యజమానులు బోలెడంత ప్రయాసపడతారు. రద్దీ రోజులు, శుభ దినాలలో కౌంటర్ల వద్ద కిక్కిరిసిపోతారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటారు. ఇదే అదునుగా భావిస్తోన్న బ్రోకర్లు జేబులు నింపుకుంటున్నారు. వాహన షోరూమ్ యాజమాన్యాలతో కుమ్మక్కై వాహన యజమానుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా వాహన యజమాని రిజిస్ట్రేషన్ చేసుకునేలా రవాణా శాఖ సిద్ధపడింది. యజమాని రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి చొరవ చూపనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా...! వివిధ కంపెనీల షోరూమ్‌లకు వచ్చే స్టాక్‌ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తారు. ప్రతీ వాహనం ఇంజన్, చాసిక్ నంబర్లు నమోదు చేసుకుంటారు. వాహనాల వివరాలు రవాణా కార్యాలయంలో పొందుపరుస్తారు. వాహనం కొనుగోలు సమయంలో యజమాని చిరునామా, గుర్తింపు, ఆధార్ పత్రాలు షోరూమ్‌లో స్వీకరిస్తారు. యజమాని సంతకం కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను అదే రోజు అందచేస్తారు. షోరూమ్‌లలో వాహనాల అమ్మకాలను బట్టి ప్రతీ రోజు ఫైళ్లను రవాణా కార్యాలయానికి చేరవేస్తారు. యజమాని వివరాలు, పత్రాలు సరిపోల్చి రిజిస్ట్రేషన్ కార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఒకవేళ యజమాని పేరుతో మరో వాహన ఉన్నట్టుగా తేలితే అదనంగా టాక్స్ చెల్లించాలి. అటువంటి సమాచారం షోరూమ్‌కు అక్కడి నుంచి వాహన యజమానికి తెలియజేస్తారు. యజమానులకు ఊరట... షోరూమ్‌లలో శాశ్వత రిజిస్ట్రేషన్ జరపడంతో యజమానులు సేద తీరుతారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రవాణా శాఖ తెలియజేసిన ధరలు షోరూమ్‌లలో చెల్లించడంతో లాభపడతారు. శాశ్వత రిజిస్ట్రేషన్ల బాధ్యతలు షోరూమ్‌లకు అప్పగించడంతో యజమానులు రవాణా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. యధావిధిగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు...! రిజిస్ట్రేషన్‌కు ముందుగా వాహనం యజమాని ఫ్యాన్సీ నంబర్లు బుకింగ్ జరుపుకోవచ్చు. రవాణా శాఖ నిర్ధేశించిన నంబర్లకు డీడీ చెల్లించి పొందవచ్చు. ఆన్లైన్లో నంబర్ వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. షోరూమ్‌లో వాహనం కొనుగోలు సమయంలో రిజర్వేషన్ కేటగిరీలో నంబర్ ఫీడింగ్తో రిజిస్ట్రేషన్ అవుతుంది. సాధారణ నంబర్ పొందగోరు వారికి సీరియల్ ప్రకారం ఆన్లైన్లో కేటాయిస్తారు. -
రాకాసి రహదారి
► మృత్యుమార్గాలుగా జిల్లా రోడ్లు ► ఏటేటా పెరుగుతున్న ప్రమాదాలు ► అధికవేగం.. నిర్లక్ష్యమే కారణం ► ఏడాదికి సరాసరి 950మంది మృతి ► మృతుల్లో యువకులే అధికం.. ► పాఠాలు నేర్వని రవాణా, పోలీసుశాఖ జిల్లా రహదారులు నెత్తురు చిందిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం వెరసి నిండుప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ముచ్చటగా మూడుపదులు నిండని వయస్సులోనే యువకులు విగతజీవులుగా మారుతున్నారు. ప్రమాదం జరిగిన చోట ముగ్గురు ఆపై చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంత జరుగుతున్నా పోలీసు, రవాణా శాఖల అధికారులు పాఠాలు నేర్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సంఘటనలు యగతనెల 26న భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు టాటాఏస్ వాహనంలో ఓ కేసు విషయమై ఆమనగల్లుకు వెళ్లొస్తున్నారు. జాతీయ రహదారిపై దివిటిపల్లి సమీపంలో వెనుకనుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో నలుగురూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. యజనవరి 27న అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి గ్రామశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇదే ప్రమాదంలో బెంగళూరుకు చెందిన భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. యగతేడాది జిల్లాకేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యాపిల్లలతో కలిసి దైవదైర్శనానికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. అతివేగంతో వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది... ఇలాంటి ప్రమాదాలు జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ క్రైం : రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువకులే అధికంగా ఉన్నారని స్పష్టమవుతోంది. కేరింతలు.. వయస్సు పెట్టే గిలిగింతలు.. వెరసి అనర్థాలకు దారితీస్తోంది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న వాహనాలపై ఇద్దరి నుంచి నలుగురు కూర్చోవడం, ఆటోల్లో సామర్థ్యానికి మించి తరలించడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పిల్లలపై ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు 18ఏళ్లు నిండకుండానే వాహనాలు కొనుగోలుచేసి ఇస్తున్నారు. రోడ్లపై దూకుడును ప్రదర్శించడంతో రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణాలివే.. 44వ జాతీయ రాహదారిపై రోడ్డు మధ్య ఉన్న డివైండర్ల ఎత్తు పెంచకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అతివేగంగా వచ్చిన వాహ నాలు ఒక్కోసారి అదుపుతప్పి డివైండర్లను దాటి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ గ్రామశివారులో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదం ఇలాంటిదే. డివైండర్ ఎత్తు తగ్గిపోవడంతో హైదారాబాద్ వైపునకు వెళ్తున్న వాహనం డివైడర్‌ను దాటుకుని కర్నూలు వైపునకు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోనే ఎనిమిది మృతిచెందారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టడంతో పోలీసులు చొరవచూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి,ఆటోల్లో పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వంటివి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 44వ జాతీయ రహదారిపై ప్రతిరోజు వేలసంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఇందులో ఓవర్‌లోడ్‌తో పాటు అతివేగంగా వెళ్తూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ఆర్టీఓ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికలోడ్ ఉన్న వాహనాలను పట్టుకొని వారిచ్చే డబ్బులకు ఆశపడి వదిలేయడంతో అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు రక్షణలేకుండాపోతుంది. అతివేగాన్ని నిరోధిస్తూ జాతీయ రహదారితో పాటు ప్రధానపట్టణాల్లో స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటుచేయకపోవడం వంటి వాటిపై ఉదాసీనంగా వ్యవహరించడంతో రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తే మేలు వాహనాలు నడిపే సమయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా వచ్చేవారు కూడా జాగ్రత్తలు పాటించకపోతే న ష్టం తప్పదు. రవాణా శాఖ రూపొందించిన సూచనలు పాటిస్తే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో ‘వేగం కన్నా ప్రాణమే మిన్న’ అనే సూత్రాన్ని మదిలో ఉంచుకుంటే ప్రమాదాలకు చెక్‌పెట్టొచ్చు.మద్యం సేవించి ఎట్టి పరిస్థితిల్లోనూ వాహనాలు నడపరాదు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు వారి చదువులు పూర్తయ్యే వరకు ఎలాంటి వాహనాలు కొనివ్వకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. - కృష్ణమూర్తి, మహబూబ్‌నగర్ డిఎస్పీ -
రవాణా శాఖకు సిబ్బంది కొరత
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చే రవాణా శాఖలో సరిపడా సిబ్బంది లేరు. ప్రతి ఏటా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఈ శాఖ ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ఖాళీల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి ఈ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఏడుగురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరిని ఆర్టీసీకి డిప్యుటేషన్‌పై పంపించారు. వెహికల్ ఇన్స్పెక్టర్లు నలుగురున్నారు. ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లకు ఆరుగురున్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టెనో పోస్టులు రెండింటికి రెండూ ఖాళీగా ఉన్నాయి. రెండు డ్రైవర్ పోస్టులకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది తక్కువుగా ఆండడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీంతో విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. రవాణశాఖాధికారులు ప్రతి రోజూ వాహన తనిఖీలు నిర్వహించడం, పన్నులు వసూలు చేయడం. ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రెవింగ్ లెసెన్సులు, ఫిట్నెస్ సరిస్టికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుం ది. అలాగే అతివేగంగా వెళ్లే వాహనాలను కూడా నియంత్రించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం విధించే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు. గతేడాది రూ.42 కోట్లు లక్ష్యం కాగా కేవలం 39 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగారు. మరి ఈ ఏడాదైనా ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటారో, లేదో చూడాలి. ఈ విషయాన్ని ఆర్టీఓ అబ్థుల్వ్రూప్ వద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు.