సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు.
బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే సునీతామహేందర్‌రెడ్డిపై అవిశ్వాసం
Comments
Please login to add a commentAdd a comment