సాక్షి, అమరావతి: రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతోంది. గత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) వరకు రూ.1,531.29 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు (6 నెలలు) రూ.2,130.92 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఆదాయంలో 39.15 శాతం మేర వృద్ధి నమోదైంది.
గత రెండేళ్లలో కోవిడ్–19 ప్రభావం రవాణా రంగం ఆదాయంపై తీవ్రంగా పడింది. 2019–20 రవాణా ఆదాయం గణనీయంగా పడిపోగా.. 2020–21లోనూ నేలచూపులు చూసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇప్పుడిప్పుడే ఆదాయం మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు మినహా అన్నిరకాల వాహనాల్లో ఈ ఏడాది తొలి 6 నెలల్లో వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గత ఏడాది కంటే 6.52 శాతం తగ్గింది.
అయితే, కార్ల అమ్మకాల్లో మాత్రం వృద్ది నమోదైంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో కార్లు కొనుగోళ్లలో 8.27 శాతం, గూడ్స్ వాహనాల కొనుగోళ్లలో 22.67 శాతం మేర వృద్ధి నమోదు కాగా.. పాసెంజర్ వాహనాల కొనుగోళ్లలో 85.02 శాతం, ఆటోల కొనుగోళ్లలో 83.94 శాతం వృద్ధి నమోదైంది.
పుంజుకుంటున్న రవాణా ఆదాయం
Published Mon, Nov 14 2022 5:04 AM | Last Updated on Mon, Nov 14 2022 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment