దేశంలో సామాన్యులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యను అరికట్టేందుకు ఆర్ బీ ఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇక నుంచి నగదుతో పనిలేకుండా, చిల్లర సమస్యలు లేకుండా ప్రయాణాలకు చెల్లింపులు సులభతరం కానున్నాయి.
ప్రయాణికులకు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం, వేగం, స్థోమత, భద్రతను అందించేలా విధ ప్రజా రవాణా వ్యవస్థల్లో చెల్లింపులు చేసేందుకు వీలుగా బ్యాంక్, నాన్-బ్యాంకులకు బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పీపీఐ PPI-MTS (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు-మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్) సాధానాల్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది
పీపీఐ అంటే?
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ ఇన్ స్ట్రుమెంట్ (పీపీఐ)లు డిజిటల్ వాలెట్స్ గా పనిచేస్తాయి. వీటిలో మనీని యాడ్ చేసుకొని, వేర్వేరు లావాదేవీలు చేసుకోవచ్చు. అమెజాన్ పే, పేటీఎం,ఫోన్ పే వంటివి డిజిటల్ వాలెట్స్ ను అందిస్తున్నాయి. కస్టమర్ ఈ వాలెట్లలో డబ్బులు యాడ్ చేసుకుంటే, ఆ మనీ బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అవ్వదు. బదులుగా పేమెంట్ కంపెనీ దగ్గర స్టోర్ అవుతుంది. పేమెంట్స్ చేసేటప్పుడు వాలెట్ లోని మనీ కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు. తాజాగా ఆర్ బీ ఐ ప్రయాణ సమయాల్లో పీపీఐని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ ప్రీపెయిడ్ సాధనాలు మెట్రో, బస్సులు, రైలు, జలమార్గాలు, టోల్‌లు, పార్కింగ్ వంటి వివిధ ప్రజా రవాణా మార్గాలలో చెల్లింపుల కోసం మాత్రమే ప్రారంభించబడతాయి.
ఈ ప్రీపెయిడ్ సాధనాలకు హోల్డర్ల కేవైసీ ధృవీకరణ అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment