PPI
-
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పీపీఐ లావాదేవీలకు అనుమతి
ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (గిఫ్ట్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు) ఉపయోగించే యూజర్లు ఇకపై గూగుల్‌పే (Google Pay), ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ (Mobile Apps) ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, నగదు స్వీకరించేందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (PPI) పూర్తి స్థాయిలో ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులను సదరు బ్యాంకు లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి చేయడానికి వీలుంటోంది. కానీ పీపీఐల నుంచి చెల్లించాలన్నా, స్వీకరించాలన్నా ఆయా పీపీఐ సంస్థ యాప్ ద్వారానే చేయాల్సి ఉంటోంది. -
ఆర్బీఐ కొత్త రూల్.. యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్
యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ ద్వారా మాత్రమే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉండేది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై వ్యాలెట్ హోల్డర్లు యూపీఐ చెల్లింపులు చేయడానికి పీపీఐ వ్యాలెట్ జారీచేసే సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐని ఉపయోగించి వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది.పీపీఐ అంటే..పీపీఐలు అనేవి అందులో జమైన సొమ్ముతో వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణ, చెల్లింపులు మొదలైన వాటిని సులభతరం చేసే సాధనాలు. పీపీఐలను బ్యాంకులు, నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. ఆర్బీఐ నుండి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు పీపీఐలను జారీ చేస్తాయి. ఇక భారతదేశంలో ఏర్పాటై కంపెనీల చట్టం, 1956 / 2013 కింద నమోదైన నాన్ బ్యాంక్ కంపెనీలు కూడా పీపీఐలను జారీ చేస్తాయి. -
దేశంలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆర్బీఐ కీలక ప్రకటన!
దేశంలో సామాన్యులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యను అరికట్టేందుకు ఆర్ బీ ఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇక నుంచి నగదుతో పనిలేకుండా, చిల్లర సమస్యలు లేకుండా ప్రయాణాలకు చెల్లింపులు సులభతరం కానున్నాయి. ప్రయాణికులకు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం, వేగం, స్థోమత, భద్రతను అందించేలా విధ ప్రజా రవాణా వ్యవస్థల్లో చెల్లింపులు చేసేందుకు వీలుగా బ్యాంక్, నాన్-బ్యాంకులకు బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పీపీఐ PPI-MTS (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు-మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్) సాధానాల్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది పీపీఐ అంటే? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ ఇన్ స్ట్రుమెంట్ (పీపీఐ)లు డిజిటల్ వాలెట్స్ గా పనిచేస్తాయి. వీటిలో మనీని యాడ్ చేసుకొని, వేర్వేరు లావాదేవీలు చేసుకోవచ్చు. అమెజాన్ పే, పేటీఎం,ఫోన్ పే వంటివి డిజిటల్ వాలెట్స్ ను అందిస్తున్నాయి. కస్టమర్ ఈ వాలెట్లలో డబ్బులు యాడ్ చేసుకుంటే, ఆ మనీ బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అవ్వదు. బదులుగా పేమెంట్ కంపెనీ దగ్గర స్టోర్ అవుతుంది. పేమెంట్స్ చేసేటప్పుడు వాలెట్ లోని మనీ కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు. తాజాగా ఆర్ బీ ఐ ప్రయాణ సమయాల్లో పీపీఐని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రీపెయిడ్ సాధనాలు మెట్రో, బస్సులు, రైలు, జలమార్గాలు, టోల్లు, పార్కింగ్ వంటి వివిధ ప్రజా రవాణా మార్గాలలో చెల్లింపుల కోసం మాత్రమే ప్రారంభించబడతాయి. ఈ ప్రీపెయిడ్ సాధనాలకు హోల్డర్ల కేవైసీ ధృవీకరణ అవసరం లేదు. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్‌కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్‌ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
మొబైల్ పేమెంట్ యాప్‌లకు భారీ జరిమానా
సాక్షి, ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు భారీ జరిమానా విధించింది. ముఖ్యంగా వొడాఫోన్ ఎం-పేసా, ఫోన్ పే మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్‌పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది. చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. వొడాఫోన్ ఎం-పేసాకు రూ.3.05 కోట్ల జరిమానా, మొబైల్ పేమెంట్స్, ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీలకు రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌కి కూడా రూ. 5 లక్షల పెనాల్టీ విధించింది. వీటితోపాటు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ సంస్థలకు వరుసగా రూ. 29.66 లక్షలు, రూ. 10.11 లక్షల మేర ఆర్బీఐ జరిమానా విధించింది. -
ప్రీపెయిడ్ సాధనాల నిబంధనలు సడలింపు
ముంబై: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా.. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (పీపీఐ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించింది. అన్‌లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు మొదలైనవి తమ ఉద్యోగులకు పీపీఐలను అందించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బ్యాంకులు పీపీఐలను జారీ చేయొచ్చని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులు జారీ చేసే ప్రీపెయిడ్ సాధనాలను పొందే అర్హత లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే ఉంది. మరోవైపు, సిబ్బంది గుర్తింపు ధృవీకరణ బాధ్యతలన్నీ సదరు సంస్థ యాజమాన్యానికే ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పీపీఐలు తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలన్నీ సక్రమంగా రికార్డు చేసేలా బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సంస్థ నుంచి తగు అనుమతులు వచ్చిన తర్వాత పీపీఐలలో బ్యాంకులు నగదును లోడ్ చేస్తాయి. పీపీఐలో గరిష్టంగా రూ. 50,000 లోడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని వస్తు, సేవల కొనుగోలు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ మొదలైన లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. -
సైబర్ భద్రతపై దృష్టి పెట్టండి
ప్రీపెయిడ్ సాధనాలపై బ్యాంకులు, కంపెనీలకు ఆర్బీఐ సూచన ముంబై: ఇటీవలి పరిణామాలతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో సైబర్ మోసాలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (పీపీఐ) జారీ చేస్తున్న బ్యాంకులు, కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ సూచించింది. భద్రతపరమైన వ్యవస్థ పటిష్టతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాలు.. ముఖ్యంగా ఈ-వాలెట్ల వాడకం పెరిగిం దని ఆర్బీఐ పేర్కొంది. కొత్త ఖాతాదారులు, వ్యాపారస్తులను సమకూర్చుకునే ప్రయత్నాల్లో సైబర్ భద్రతకు సంబంధించి ఏ చిన్న ప్రతికూల ఉదంతం చోటు చేసుకున్నా.. మొత్తం డిజిటల్ సాధనాలపై ప్రజలకు విముఖత ఏర్పడే అవకాశం ఉందన్న సంగతి గుర్తెరగాలని ఆయా బ్యాంకులు, సంస్థలకు ఆర్బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స టీమ్(సెర్ట్-ఇన్)కి చెందిన ఆడిటర్లతో సైబర్ భద్రత చర్యలపై ఆడిట్ జరిపించుకుని, దిద్దుబాటు చర్యలేమైనా ఉంటే తక్షణం అమలు చేయాలని పేర్కొంది.