ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (గిఫ్ట్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు) ఉపయోగించే యూజర్లు ఇకపై గూగుల్‌పే (Google Pay), ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ (Mobile Apps) ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, నగదు స్వీకరించేందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (PPI) పూర్తి స్థాయిలో ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులను సదరు బ్యాంకు లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి చేయడానికి వీలుంటోంది. కానీ పీపీఐల నుంచి చెల్లించాలన్నా, స్వీకరించాలన్నా ఆయా పీపీఐ సంస్థ యాప్ ద్వారానే చేయాల్సి ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment