Mobile Apps
-
యాప్‌రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్‌ఫోన్– స్మార్ట్‌ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్‌తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్‌ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్‌పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్‌తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్‌గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్‌లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్‌లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్‌లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్‌డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్‌సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్‌లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్‌ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్‌దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్‌లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్‌గా నిలిచాయి. యాప్స్‌లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్‌టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్‌లో లాస్ట్ వార్, వైట్‌ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్‌తోపాటు నాన్ –గేమ్స్‌లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్‌లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్‌స్టైల్, టేబుల్‌టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్‌లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్‌లో భారత్‌లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్‌లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్‌కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్‌కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్‌బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్‌బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్‌బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్‌లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్‌బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్‌బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్‌తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్‌తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్‌తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా 17.91 శాతం -
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పీపీఐ లావాదేవీలకు అనుమతి
ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (గిఫ్ట్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు) ఉపయోగించే యూజర్లు ఇకపై గూగుల్‌పే (Google Pay), ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ (Mobile Apps) ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, నగదు స్వీకరించేందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (PPI) పూర్తి స్థాయిలో ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులను సదరు బ్యాంకు లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి చేయడానికి వీలుంటోంది. కానీ పీపీఐల నుంచి చెల్లించాలన్నా, స్వీకరించాలన్నా ఆయా పీపీఐ సంస్థ యాప్ ద్వారానే చేయాల్సి ఉంటోంది. -
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
ఢిల్లీ: అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం 14 మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్‌బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది. ఇదీ చదవండి: మన్‌కీ బాత్ టైంలో పురిటి నొప్పులు, ఆపై.. -
క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో యుపిఐ చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువవుతోంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. డైరెక్ట్ ట్రాన్స్ఫర్: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు పంపించుకోవడానికి స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కో బ్యాంకు రోజువారీ లిమిట్ కలిగి ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సక్షన్ కొంత ఆలస్యం అవ్వొచ్చు, కొన్ని సార్లు వెంటనే కూడా పూర్తయిపోవచ్చు. ఇవన్నీ దేశం, కరెన్సీ, బ్యాంక్ రూల్స్ మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటాయి. నెట్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నగదు జమచేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదట మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి వెబ్సైట్ క్రెడిట్ కార్డ్ ఏరియా సెలక్ట్ చేసుకుని, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎంత మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకునేది ఎంటర్ చేయండి. అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి, మొత్తం ట్రాంసెక్షన్ పూర్తయ్యే వరకు అవసరమైన సమాచారం అందించి పూర్తి చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మరో సులభమైన మార్గం ఫోన్ కాల్స్. మొదట మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేసి వారు అడిగే వివరాలు తెలియజేయండి. డబ్బు పంపాలన్న విషయం కూడా వారికి తెలపాలి. మీరు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న విషయం ద్రువీకరించి పూర్తి చేసుకోవచ్చు. చెక్కును అందించడం ద్వారా: చెక్ ఇస్యూ చేయడం ద్వారా కూడా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొదటి తీసుకునే లేదా గ్రహీత పేరు దగ్గర 'సెల్ఫ్' అని వ్రాయండి చెక్కుపై రాయాల్సిన మిగిలిన వివరాలను కూడా పూర్తి చేయండి. దగ్గరగా ఉన్న బ్యాంక్ లొకేషన్లో చెక్కును డిపాజిట్ చేయాలి. ఏటీఎమ్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడానికి మీరు ఏటీఎమ్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా చేయడానికి క్యాష్ అడ్వాన్స్ ఫీచర్ ఎంచుకోవాలి. తరువాత పంపాలనుకున్న మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ విధంగా డబ్బు జమచేయడానికి బ్యాంకులు కొంత చార్జెస్ నిర్ణయిస్థాయి. ఇది కూడా ఒక్కో బ్యాంకుకి ఒక్కోలాగా ఉంటుంది. మొబైల్ యాప్‌లు ఉపయోగించి: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువవ్వడం వల్ల ఏదైనా దాదాపు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. కావున స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి బ్యాలెన్స్‌లను బదిలీ చేయవచ్చు. -
మనోళ్లు ‘స్మార్ట్’గా అడిక్ట్!.. ఫోన్, యాప్స్‌కు బానిసలుగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాప్స్ (అప్లికేషన్స్) వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఫోన్ వినియోగం అడిక్షన్ స్థాయికి చేరుతోంది. 2022 ఏడాదిలో భారత యూజర్లు రోజుకు సగటున ఐదు గంటల పాటు మొబైల్స్‌తోనే కాలక్షేపం చేశారు. ఆ ఏడాదికాలంలో ఏకంగా 28.8 బిలియన్ల యాప్ డౌన్లోడ్లు చేసి.. ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు. 111 బిలియన్ల డౌన్లోడ్లతో చైనా టాప్ ప్లేస్‌లో నిలిచింది. వివిధ మొబైల్ యాప్స్‌లో సమయం గడుపుతున్న విషయంలోనూ భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా అందరూ కలిపి గతేడాది మొత్తం 0.74 ట్రిలియన్ గంటలు (74 వేల కోట్ల గంటలు) మొబైల్స్‌లోనే కాలం గడిపారు. ‘యాప్ ఆనీ (ఇటీవలే డేటా.ఏఐగా పేరు మారింది)’ ఇటీవల విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ద మొబైల్ రిపోర్ట్–2023’ నివేదికలో ఈ ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ కొనుగోళ్లలోనూ బిజీగా.. షాపింగ్‌కు సంబంధించి ఆన్లైన్ కొనుగోళ్లలోనూ భారతీయులు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు మొత్తంగా 110 బిలియన్ల గంటలు ఆన్లైన్ కొనుగోళ్లలో గడపగా.. అందులో భారతీయులు గడిపిన సమయం 8.7 బిలియన్లు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్లోడ్ చేసిన పది ఫైనాన్స్ యాప్‌లలో ఐదు (పేటీఎమ్, గూగుల్‌పే, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ యోనో యాప్) మన దేశంలోనే ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. 2022లో ఇండియన్ల ఫ్రెండ్షిప్, డేటింగ్ యాప్‌ల వినియోగం రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొంది. గతేడాది ఈ యాప్స్‌పై 9.9 మిలియన్ డాలర్ల (2021లో 4.5 మిలియన్ డాలర్లు) మేర ఖర్చు చేసినట్టు అంచనా. కల్పిత రిలేషన్‌షిప్‌లు.. మోసాలు.. మొబైల్స్, యాప్స్ వినియోగానికి అలవాటుపడ్డవారు తమకు అంతగా పరిచయం లేనివారి నుంచి కూడా పరోక్ష సాంత్వన కోరుకుంటున్నారు. యాప్స్‌తో పరిచయమయ్యేవారు నిజ స్వరూపాన్ని దాచి, కల్పిత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ. అమాయకత్వం నుంచి క్రిమినల్ బిహేవియర్ ఉన్న వారిదాకా తమ పద్ధతుల్లో ఈ యాప్స్‌ను ఉపయోగించడమో, దుర్వినియోగం చేయడమో జరుగుతోంది. ఈ దుష్ప్రభావాలను గుర్తెరిగి ప్రవర్తించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ నిశాంత్ వేమన, సైకియాట్రిస్ట్, సన్‌షైన్, చేతన హాస్పిటల్స్ జనంలో బద్ధకం పెరిగిపోతోంది విపరీతంగా మొబైల్, యాప్స్ వినియోగంతో జనంలో బద్ధకం పెరిగిపోతోంది. బంధువులు, స్నే హితులు, సన్నిహితులను కలుసుకునేందుకు కూడా ఉత్సాహం చూ పడం లేదు. ఊబకాయులు, మధుమేహ పీడితులు, ఇతర అనారోగ్యాల బాధితుల సంఖ్య కూడా ఎగబాకుతోంది. ఇది రాబోయే రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. వివిధ యాప్‌ల వినియోగం విషయంలో ప్రభుత్వపరంగా రెగ్యులేటరీ విధానం ఉండాలి. స్కూళ్లలో ఐదో తరగతి నుంచే ఈ యాప్‌లపై అవగాహన కల్పించాలి. –సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
రెడీ...సెట్...ప్లే; వికాసం నుంచి విజ్ఞానం వరకు
జ్ఞాపక శక్తికి పదునుపెట్టుకోవడానికి, పదసంపదను పెంచుకోవడానికి, సమస్యల పరిష్కారం విషయంలో బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకోవడానికి రకరకాల డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌పై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తుంది... బెంగళూరుకు చెందిన సహజకు చిన్న చిన్న రచనలు చేయడం అంటే ఇష్టం. భవిష్యత్‌లో రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక. ఒక పుస్తకం ఆదరణ పొందాలంటే కాన్సెప్ట్‌తో పాటు భాష కూడా బాగుండాలి అనేది పద్దెనిమిది సంవత్సరాల సహజకు తెలియని విషయమేమీ కాదు. అందుకే తన పదసంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ‘వొకాబులరీ బిల్డర్’ అనే గేమ్ యాప్‌ను సాధనంగా ఎంచుకుంది. కాల్పనిక రచనల కోసం మాత్రమే కాదు, ఆకట్టుకునే భాషలో ఇ–మెయిల్స్ రాయడానికి, రకరకాల విషయాలపై వ్యాసాలు రాయడానికి యువతరం ‘వొకాబులరీ బిల్డర్’ను ఉపయోగిస్తోంది. ‘సూపర్‌బెటర్’ అనేది రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చి, నైపుణ్యాలు పెంపొందించే ఆట. ‘ఎవ్రీవన్ హ్యాజ్ హీరోయిక్ పొటెన్షియల్’ అనేది ఈ ఆట నినాదం. ‘నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే బలవంతుడివి...అండగా నిలిచే ఆత్మీయులు నీకు బలమైన సైన్యమై ఉన్నారు...ఎందరికో నువ్వు రోలోమోడల్వి...ఇలాంటి సానుకూల ఆలోచనల్లో నుంచి సమస్యలను జయించే శక్తి పుడుతుంది’ అంటోంది ‘సూపర్‌బెటర్’ను రూపొందించిన జేన్మెక్ గోనిగల్. జేమ్మెక్ ఒకప్పుడు డిప్రెషన్ బారిన పడి అందులోంచి బయటపడింది. తాను కుంగుబాటు చీకటి నుంచి బయటపడిన విధానాన్ని ఒక ఆటగా మలిచి దీని గురించి తన బ్లాగ్‌లో రాసుకుంది. కొద్దికాలంలోనే బ్లాగ్‌లో నుంచి ‘సూపర్‌బెటర్’ రూపంలో డిజిటల్ ఆటగా మారింది. న్యూరోసైంటిస్ట్ల సలహాల ఆధారంగా రూపొందించిన గేమ్... లుమినోసిటీ. ఈ గేమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ‘మీరు ఎలాంటి స్కిల్స్ కోరుకుంటున్నారు?’ అని అడుగుతుంది. కోరుకునే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఆలోచించడానికి, ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారాలు ఆలోచించడానికి ఉపకరించే ఇండి పజిల్ గేమ్ మాన్యుమెంట్ వ్యాలీ. ఈ గేమ్ యాప్ యాపిల్ డిజైన్, పాకెట్ గేమర్ ‘గోల్డ్’ అవార్డ్‌లను గెలుచుకుంది. ‘మాన్యుమెంట్ వ్యాలీ’ ప్రత్యేకత రిలాక్సింగ్ సౌండ్ ట్రాకింగ్, ఆకర్షణీయమైన డిజైన్. సుడోకు ప్రేమికులను ‘గుడ్ సుడోకు’ ఆకట్టుకుంటోంది. ‘పజిల్ ప్రేమికులకు ఇదొక ప్రేమలేఖ’ అంటోంది కంపెనీ. ఇక ఫన్మెథడ్ వీడియో గేమ్ ‘బ్లాక్‌బాక్స్’లో డజన్ల కొద్దీ మినీ గేమ్స్ ఉంటాయి. ‘ఎలివేట్’లో ప్రత్యేకమైన వర్కవుట్ క్యాలెండర్ ఉంటుంది. ‘ఫన్ అండ్ క్లిక్’ పద్ధతిలో దీన్ని రూపొందించారు... ఇలా చెప్పుకుంటూ పోతే యువతరాన్ని ఆకట్టుకుంటున్న బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ‘బస్సు కోసం ఎదురుచూసే క్రమంలో టైమ్ వృథా అయ్యేది. ఇప్పుడు మాత్రం రకరకాల బ్రెయిన్ జిమ్ గేమ్స్ ఆడుతున్నాను. కొత్త ఉత్సాహం వస్తోంది’ అంటున్నాడు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాకేత్. ‘మా తాతయ్యకు సుడోకులాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడం అంటే ఇష్టం. ఆయన కాలక్షేపం కోసం పజిల్స్‌ను సాల్వ్ చేస్తున్నారనుకునేదాన్ని. పజిల్స్ సాల్వ్ చేసే ప్రక్రియ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాక వినోదంతో కూడిన బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది చెన్నైకి చెందిన భార్గవి. ‘మన జీవితమే పెద్ద పజిల్. చావు నుంచి పుట్టుక వరకు రకరకాల పజిల్స్‌ను పరిష్కరిస్తూనే ఉండాలి’ అనేది తాత్వికత ధ్వనించే మాట అయితే కావచ్చుగానీ రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి. వ్యక్తిత్వ వికాసానికి డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌ను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది యువతరం. -
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
మీ రైల్వే స్టేషన్లో గమనిస్తే ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్ కౌంటర్ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్ కలెక్టర్‌కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవ.. కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చింది. యూటీఎస్ యాప్ ఇన్స్టలేషన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. సబర్బన్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు తమ పరిధిలోని రైల్వే స్టేషన్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ. యూటీఎస్ మొబైల్ యాప్‌లను ఉపయోగించే వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. ►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి. ►అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ►ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. ►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్ లెస్ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. ►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్ టిక్కెట్‌ను బుక్ చేయలేరు. ►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్! -
పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం.. ఎందుకంటే?
పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు చెందిన 'విడ్లీ టీవీ' అనే ఓటీటీ ఫ్లామ్ఫామ్ను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్‌లపై కూడా నిషేధం విధించింది. ఇటీవల విడ్లీ టీవీ ఓటీటీలో విడుదలైన 'సేవక్: ది కన్ఫెషన్స్' అనే వెబ్ సిరీస్‌లో భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు తెచ్చేలా కంటెంట్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మూడు ఎపిసోడ్లు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెబ్ సిరీస్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ భారత చారిత్రక ఘటనలపై వ్యతిరేకతను పెంచేలా ఉందని.. పూర్తి అవాస్తవాలతో ప్రసారం చేస్తున్నారని భారత సీనియర్ అధికారి కంచన్ గుప్తా తన ట్విటర్లో వెల్లడించారు. IMPORTANT Ministry of Information & Broadcasting, using emergency powers under IT Rules 2021, has issued directions on 12 December 2022 for immediate blocking of the website, 2 mobile apps, 4 social media accounts, and one smart TV app of #Pakistan-based OTT Platform Vidly TV. n1 — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 12, 2022 -
దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ
కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థి కర్నూలు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గతేడాది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఎలా జరిగిందని ఆరా తీయగా.. మొబైల్‌యాప్‌లో ఓ మహిళ ఫోన్ నంబర్ సేకరించి ఆ విద్యార్థిని పిలిపించుకుని శారీరకంగా కలిసిన విషయం వెలుగు చూసింది. తనకు పాజిటివ్ అని తేలగానే బెంగ పెట్టుకుని చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. రాయదుర్గానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఇటీవల జ్వరం, కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లినపుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు బయటపడింది. తండ్రి తప్పిదాల కారణంగా తల్లికి.. ఆ తర్వాత విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. రాయదుర్గం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆటోను వదిలి జీపు డ్రైవర్‌గా చేరాడు. బయటి ప్రాంతాలకు వెళ్లినపుడు మద్యం మత్తులో పెడదారి పట్టాడు. చివరకు హెచ్ఐవీ బారినపడి కుంగిపోతున్నాడు. డీ హీరేహాళ్ మండలానికి చెందిన 22 ఏళ్ల హిజ్రాకు హెచ్ఐవీ సోకింది. హిజ్రాతో లైంగిక సంపర్కం కలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా వీరే కాదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూస్తుండటం కలవరం రేపుతోంది. రాయదుర్గం (అనంతపురం జిల్లా): అరక్షిత శృంగారం ప్రాణాంతక హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు దారితీస్తోంది. భాగస్వామితో కాకుండా ఇతరులతో శారీరకంగా కలవడం, సురక్షిత పద్ధతులు పాటించకపోవడంతో చాలామంది దీనిబారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం వల్ల వారితో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కబళిస్తోంది. 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. డిన్నర్ల పేరుతో రాత్రిళ్లు రోడ్ల మీద తీరగడం, మొబైల్ యాప్‌ల ద్వారా ఆకర్షణతో పెడదారిన పట్టడం వెరసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ప్రతి నెలా 90 పాజిటివ్ కేసులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఏఆర్టీ, మొబైల్ నెట్వర్క్, నర్సింగ్ హోమ్ తదితర కేంద్రాల్లో నిర్వíహిస్తున్న హెచ్ఐవీ పరీక్షల్లో ప్రతి నెలా 80 నుంచి 90 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన డీ హీరేహాళ్, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండతో పాటు అనంతపురం తదితర ప్రాంతాల్లో 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన ట్రాన్స్జెండర్స్లోనూ హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో 14,718 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరందరికీ క్రమం తప్పకుండా చికిత్సలందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. హెచ్ఐవీ నిర్ధారణ జరిగినా కొందరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం, చికిత్సకు వెళ్లకుండా బయట మందులు వాడడం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉన్నత చదువుల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు కొందరు ఈ మహమ్మారి వలలో చిక్కుకోవడం దురదృష్టకరం. కండోమ్ వినియోగిస్తే హెచ్ఐవీ వైరస్ బారినపడరని తెలిసినా మత్తు, వ్యామోహంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. యువత ఇకనైనా మేల్కొని వివాహేతర సంబంధాలు, అరక్షిత లైంగిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితం నాశనం చేసుకోవద్దు యువత అనాలోచిత నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇటీవల కొంతమంది యువకుల్లో హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం కాస్త ఆందోళనకర విషయమే. అయినా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అరికట్టాల్సిన అవసరం అందరిపైనా ఉంది. పాజిటివ్ ఉన్నవారు దాచిపెట్టడం మాని చికిత్స తీసుకుంటే మంచిది. – కె.సత్యనారాయణ, ఏఆర్టీ వైద్యులు, అనంతపురం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి అని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిరక్షరాస్యులు ఒకరో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడితే ఏమో అనుకోవచ్చు.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ వ్యాధి బారినపడటం విచారకరం. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, బయట తిరుగుళ్లు తిరిగే యువతపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తుండాలి. హెచ్ఐవీ వైరస్ ఒకసారి ప్రవేశించాక జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప ఇంకెక్కడా మందులు లభించవు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స పొందుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. లైంగిక చర్యలకు దూరంగా ఉంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలి. – డాక్టర్ అనుపమ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, అనంతపురం -
‘పొట్లం’ యువకుడి కథ.. ఏటా రూ.6 కోట్ల టర్నోవర్.. 200 మందికి ఉపాధి
ఆ యువకుడిది.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం. చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది. పేదరికంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. బీఏ మాత్రమే చదివినా పట్టుదలతో ఐటీ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. యాక్సెంచర్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేశాడు. అంతటితో ఆగని ఆ యువకుడు ‘పొట్లం’ పేరుతో ఆహారం, సరుకులను డోర్ డెలివరీ చేసే యాప్‌కు శ్రీకారం చుట్టాడు. చదువుకునేటప్పుడే ఖర్చుల కోసం కిరాణా కొట్టులో పనిచేస్తూ ‘పొట్లం’ కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన సొంత ఊరు జంగారెడ్డిగూడెం కేంద్రంగా 200 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పొట్లం యాప్ ద్వారా ఐదు పట్టణాల్లో ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం... అనే మాటను రుజువు చేస్తున్న ఆ యువకుడే.. శ్రీనివాస్ అలమండ. అతడి స్ఫూర్తిదాయక విజయగాథ ఇది.. సాక్షి, అమరావతి: పేదరికం కారణంగా అలమండ శ్రీనివాస్ ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే సమయంలో ఖర్చుల కోసం అనేక పనులు చేశాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ నెలకు రూ.1,500 జీతంతో ఉద్యోగం చేశాడు. ఇంగ్లిష్, అమీర్‌పేటలో ఐటీ కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, విప్రో కంపెనీల్లో 17ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అయితే, సొంత ఊరు జంగారెడ్డిగూడెంపై మమకారంతో తిరిగి వచ్చేశాడు. ఏదైనా మొబైల్ యాప్ తయారు చేయాలనే లక్ష్యంతో తన స్నేహితులు హరికృష్ణ, రఘు, సోదరుడు పవన్‌లతో కలిసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా 2020లో పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ‘పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్’కు శ్రీకారం చుట్టాడు. లక్ష మందికిపైగా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్‌కు ప్రస్తుతం లక్ష మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. పొట్లం యాప్ ద్వారా జంగారెడ్డిగూడెం, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో వినియోగదారులకు నిత్యం ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్ ద్వారా శ్రీనివాస్ ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. పొట్లంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2020లోనే పొట్లం మొదటి డార్క్ స్టోర్ పొట్లం యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా సరుకులు అందించేలా 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్స్టోర్ను శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్లైన్ యాప్, ఆఫ్‌లైన్ (ఫోన్ ద్వారా)లో ఆర్డర్ ఇస్తే సరుకులు డార్క్‌స్టోర్ నుంచి సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారు. రైతుకి వెన్నుదన్ను.. వ్యవసాయ కూలీ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీనివాస్ పొట్లం యాప్ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అక్కడికక్కడే మంచి ధర దక్కేలా చేస్తున్నాడు. దీనిద్వారా ఓవైపు రైతులకు దళారీల బాధ లేకుండా మంచి ధర దక్కుతుంటే.. వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే అందుతున్నాయి. మార్కెట్ ధరల కంటే కనీసం 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్లో దాదాపు రూ.400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం రూ.199కే డోర్ డెలివరీ ఇస్తున్నాడు. నిరక్షరాసులు సైతం.. ఆన్లైన్ కొనుగోళ్లు చేయాలంటే స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, చదువు తప్పనిసరి. ప్రస్తుతం బహుళజాతి సంస్థల యాప్‌లన్నీ ఈ కోణంలోనే ఉన్నాయి. కానీ పొట్లం యాప్ మాత్రం వీటికి భిన్నంగా ఆఫ్‌లైన్ విధానంలోనూ సేవలు అందిస్తోంది. పొట్లం వినియోగదారుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లేనివారే అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికి సరుకులు పంపే ఏర్పాటు ‘పొట్లం’ ప్రత్యేకత. కరోనా సమయంలోనూ ఉపాధి 2020లో కరోనా సమయంలో పొట్లం యాప్‌ను ప్రారంభించా. ఆ సమయంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల టీచర్లు చాలామంది ఉపాధి కోల్పోయి పొట్లం యాప్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరారు. కరోనా కష్టకాలంలో ఏ ఉద్యోగం లేక రోజు గడవడం కష్టమైన చాలామందికి ఉపాధి కల్పించా. ఔత్సాహిక యువతకు మొదటి పది బ్రాంచ్‌లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తా. ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా మొత్తం 14 యాప్‌ల అనుసంధానంతో పొట్లం యాప్ పనిచేస్తోంది. పొట్లం ఫ్రాంచైజీని ఉచితంగా ఎవరైనా తమ ప్రాంతంలో తీసుకోవడానికి యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో ఐదు వేల కేంద్రాలకు పొట్లం యాప్‌ను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నా. అధునాతన మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లను జోడించి వినియోగదారులకు సేవలందిస్తున్నా. – శ్రీనివాస్ అలమండ, ఎండీ, పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. -
ప్చ్..అధ్వాన్నంగా భారతీయ బ్యాంకుల్లో మొబైల్ యాప్స్ సేవలు!
భారత్‌కు చెందిన బ్యాంకులు కస్టమర్లకు మొబైల్ సర్వీసుల్ని అందించడంలో విఫలమవుతున్నాయి. కస్టమర్ల ఖర్చుల్ని, అప్పుల్ని అర్థం చేసుకోవడం, ఉపయోగకరమైన బడ్జెట్లను రూపొందించడం, ఆర్ధిక వృద్ధి సాధించేలా సలహాలు ఇవ్వడం, వారి ఆర్థిక స్థితుల్ని ట్రాక్ చేయడంలో బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఫర్ రెస్టర్..మనీ మేనేజ్మెంట్ సామర్థ్యాలలో దేశీయ బ్యాంకులకు అత్యల్ప స్కోర్‌ను ఇచ్చింది. తాజా క్యూ3లో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించే ఏ బ్యాంక్‌కు కూడా 60శాతం మించి స్కోర్ ఇవ్వలేదు. అందుకు కారణం బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది. బ్యాంకుల్లో నావిగేషన్ బాగున్నప్పటికీ యాప్స్‌లో సెర్చ్ బార్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ముఖ్యంగా వినియోగదారులు చేసిన ట్రాన్సాక్షన్లను గుర్తించేలా యాప్‌లో సులభమైన పద్దతులు లేవని ఫర్ రెస్టర్ తెలిపింది. దీంతో పాటు బ్యాంకులు గోప్యతా విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ సామాన్యులకు అర్ధం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. "చాలా బ్యాంకులు యాప్స్‌ను బిల్డ్ చేయడంలో రాజీ పడడం లేదు. మంచి విషయమే. మొబైల్ బ్యాకింగ్ వ్యవస్థతో యూజర్లకు ఉపయోగం, సులభంగా ఉంటుంది. తద్వారా బ్యాంకుల్ని వినియోగించేందుకు మక్కువ చూపుతారని పేర్కొంది. -
ఫోన్ యాప్ ద్వారానే టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1 నుంచి ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఫోన్ యాప్ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే.. ఆండ్రాయిడ్ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది. యాప్ ద్వారా హాజరు నమోదు.. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది. -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్‌కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్‌ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్‌కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్‌పే, గూగుల్‌పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్‌కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్‌కు చెందిన టి.శ్రావణ్‌కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్‌లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్‌కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
అమ్మో.. చైనా యాప్‌లు.. పేర్లు మార్చుకుని ఏకంగా 57 శాతం!
సాక్షి, అమరావతి: ‘చైనా దుకాణంలో దూరిన ఎద్దు..’ అనేది ఓ సామెత. అంటే పింగాణి సామగ్రి దుకాణంలో ఎద్దు దూరితే అది లోపలున్నా.. బయటకొచ్చినా.. దుకాణానికి నష్టమే. ఇక తాజాగా మన మొబైల్ ఫోన్లో చైనా యాప్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే కొన్ని చైనా యాప్‌లు చాపకింద నీరులా మన వ్యక్తిగత సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం అటువంటి చైనా యాప్‌లను నిషేధిస్తున్నప్పటికీ పేర్లు మార్చుకుని మరీ చలామణిలోకి వచ్చేస్తున్నాయి. చైనా యాప్‌లు 57 శాతానికిపైగా అదనపు సమాచారాన్ని సేకరించి ఇతరులకు చేరవేస్తున్నాయని పుణెకు చెందిన ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఆర్కా కన్సల్టెన్సీ జనవరిలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సరిహద్దులు దాటుతున్న సమాచారం మొబైల్ యాప్ సంస్థలు అవసరానికి మించి వినియోగదారుల సమాచారాన్ని కోరుతున్నాయి. వినియోగదారులకు తగిన అవగాహన లేకపోవడంతో యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే తొందర్లో ఆ సమాచారాన్ని ఫీడ్ చేస్తున్నారు. ప్రధానంగా కాంటాక్ట్ నంబర్లు, కెమెరా, మైక్రోఫోన్, సెన్సార్లు, లొకేషన్, టెక్టŠస్ మెస్సేజ్‌లు మొదలైన అంశాలతో అనుసంధానించమని అడుగుతున్నాయి. ఆ విధంగా యాప్ కంపెనీలు 57 శాతానికిపైగా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాయి. 90 శాతానికిపైగా యాప్‌లు అవసరం లేనప్పటికీ కెమెరా యాక్సెస్ కోరుతున్నాయి. వాటిలో వినోద, విద్య, ఇ–కామర్స్, న్యూస్, గేమింగ్ తదితర యాప్‌లున్నాయి. ఆ సమాచారాన్ని యాప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, సింగపూర్‌లతోపాటు గుర్తుతెలియని దేశాల్లోని సంస్థలకు విక్రయిస్తున్నాయి. ఆయా దేశాల్లోని సంస్థలు ఆ సమాచారాన్ని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మార్కెట్ రీసెర్చ్ కోసం అంటూ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెబుతున్నాయి. ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తున్నారా అన్నదానిపై సందేహాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలీబాబా వంటి ప్రముఖ సంస్థ యాప్‌లను భారత్‌లో ఏకంగా 43 కోట్లమంది వరకు డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. అంటే ఏ స్థాయిలో భారతీయుల సమాచారాన్ని ఆ సంస్థ సేకరించిందో తెలుస్తోంది. వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుండటం సైబర్ నేరాలకు కూడా కారణమవుతోందని ఆర్కా కన్సల్టెన్సీ గుర్తించింది. డిజిటల్ పేమెంట్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్లు పెరగడం దీనికి తార్కాణమని కూడా గుర్తుచేస్తున్నారు. పేరు మార్పుతో మళ్లీ.. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చైనా యాప్‌లను నిషేధిస్తోంది. 2020 నుంచి 278 చైనా యాప్‌లను నిషేధించింది. వాటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, వుయ్‌చాట్, లైకీ, బిగ్ లివ్, అలీ ఎక్స్‌ప్రెస్, అలీపే క్యాషియర్ మొదలైనవి ఉన్నాయి. భారత్‌లో ఆ యాప్‌లను బ్యాన్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్‌ను కేంద్రం ఆదేశించింది కూడా. కానీ ఆ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ దేశంలో అందుబాటులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. వాటిలో ప్రముఖ కంపెనీలు అలీబాబా, టెన్సెంట్, నెట్ఈజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందినవి కూడా ఉండటం గమనార్హం. దీనిపై వివరాల కోసం ఈ–మెయిల్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సంస్థలు స్పందించలేదని ఆర్కా కన్సల్టెన్సీ పేర్కొంది. అప్రమత్తతే పరిష్కారం యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. మనకు అవసరమైనమేరకే యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకు ముందు ఆ కంపెనీలు అడిగే సమాచారాన్ని పూర్తిగా చదవాలి. సమాచారం పెద్దగా ఉంది కదా అని చదవకుండా యాక్సెస్ ఇవ్వొద్దు. అవసరమైనంత వరకే సమాచారం ఇవ్వండి. యాప్‌లు ప్రతి వారం, పదిరోజులకు ఒకసారి అప్డేట్ అడుగుతుంటాయి. అప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఓకే చేయండి. ఇక బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్ధిక వ్యవహారాల అంశాలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారం లీకైందని భావించినా, తాము సైబర్ నేరాల బారిన పడ్డామని తెలిసినా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – రాధిక, ఎస్పీ, సైబర్ క్రైం -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
మరో 54 చైనీస్ యాప్‌లపై నిషేధం!
India plans to ban 54 Chinese apps: దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత్ యోచిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు నిషేధించిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మోజీఎరినా, యాప్‌లాక్, డ్యూయల్ స్పేస్ లైట్లు వంటివి ఉన్నాయి. గతేడాది జూన్‌లో దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ విస్తృతంగా ఉపయోగించే టిక్‌టాక్, వీచాట్, హెలో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. పైగా మే 2020లో చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యలంఓ భారత్ దాదాపు 300 యాప్‌లను బ్లాక్ చేసింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో జూన్ 2020లో తొలిసారిగా భారత్ ఈ నిషేధాన్ని ప్రకటించింది. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
ఫోన్లు చేయరు.. చాటింగ్ ద్వారా సంప్రదించి..
సాక్షి, హైదరాబాద్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. అంటే ఇదేనేమో! అరాచకాలకు పాల్పడి అడ్డంగా బుక్కైన చైనా లోన్, ఫోంజి యాప్ నిర్వాహకులు ఇప్పుడు సరికొత్త రూపంలో దందాలకు తెరలేపారు. కొంతకాలంగా ఈ లోన్ యాప్‌ల కారణంగా దేశంలో అలజడి రేగడంతో అప్పటి నుంచి అకస్మాత్తుగా వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాజాగా పేరు మార్చుకుని వస్తున్న ఈ ఫోంజి యాప్ (సులువుగా డబ్బు సంపాదించే)లకు ప్రచారం కల్పించేందుకు మనదేశంలోని యూట్యూబర్లకు యాడ్స్ పేరిట ఎరవేస్తున్నారు. బయటివారు ఇచ్చే దానికి పదింతలు అధికంగా చెల్లిస్తామని ఆశ చూపడంతో తమకు తెలియకుండానే అనేకమంది యూట్యూబర్లు చైనా యాజమాన్యాలకు సహకరిస్తున్నారు. వచ్చీ రాని ఇంగ్లిష్‌లో.. యూట్యూబర్లను సంప్రదించేవారిలో అధికంగా చైనీయులే. యూట్యూబర్లను నేరుగా ఫోన్లో సంప్రదించకుండా ఎక్కువగా వాట్సాప్ ద్వారా చాటింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం తొలుత లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లను ఎంచుకుంటున్నారు. చైనా భాషను గూగుల్ ట్రాన్స్లేటర్లో వేసి, అలా వచ్చిన ఇంగ్లిష్ కాపీని తిరిగి ఇక్కడివారికి పంపిస్తున్నారు. ఒక్కోసారి పొరబాటున చైనా భాషనే పంపించి వెంటనే డిలిట్ చేస్తున్నారు. దీనిపై బెంగళూరుకు చెందిన ఓ యూట్యూబర్ తనతో సంప్రదించేది చైనీయులు అని అనుమానించాడు. అదే సమయంలో తనకు రూ.500 ఇవ్వాల్సిన చోట రూ.5,000 ఇస్తామని, ఇంకా కావాలంటే రూ.50,000 కూడా ఇస్తామని ఆఫర్ చేయడంతో అతడు అప్రమత్తమయ్యాడు. వారి కుట్రలను అర్థం చేసుకోలేని చాలామంది డబ్బు కోసం వారికి వీడియోలు చేసి పెడుతూ చైనా యాప్ యాజమాన్యాలకు సహకరిస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచే యాప్‌లు.. బుర్స్, క్యాష్‌బ్యాక్, వాల్మార్ తదితర పేర్లతోటి మొన్నటిదాకా ప్లేస్టోర్‌లో ఈ యాప్‌లు అందుబాటులో ఉండేవి. ఆన్లైన్లో తమ ఉత్పత్తులకు లైక్ కొట్టే పార్ట్ టైం జాబులో చేరితే రోజూ కొంత డబ్బు చెల్లిస్తామని ఎరవేస్తారు. ఇందులో రూ.5,000 నుంచి రూ.1,50,000 వరకు ప్లాన్లు ఉంటాయి. ఈ చెల్లింపులన్నీ ఫోన్‌పే, గూగుల్ పే ద్వారానే. ఉదాహరణకు రూ.5,000 కట్టి బేసిక్ స్కీంలో చేరినవారు ఆయా ఉత్పత్తులకు లైక్ కొడితే వారి ఖాతాలో రోజుకు రూ.400 వేస్తారు. ఇందులో ట్యాక్సులు పోను రూ.328 జమా అవుతాయి. రూ.లక్షకుపైగా కట్టి స్కీంలో చేరితే రోజుకు రూ.9,000 పడతాయి. రెండువారాలు కొనసాగితే తమ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడే యాప్ నిర్వాహకులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. సెల్ లోకేషన్ ఆధారంగా తమ వినియోగదారుల్లో ఎక్కువమందిని పల్లెటూరు, బస్తీలను ఎంచుకుంటారు. వీరిలో కొందరికి రోజూ డబ్బులు ఠంఛన్‌గా ఇస్తారు. ఉదాహరణకు మీరు రిఫర్ చేసిన వ్యక్తి రూ.30,000 స్కీములో చేరితే మీకు రోజూ అదనంగా రూ.300 వస్తాయి. అదే అతడు రూ.లక్ష స్కీములో చేరితే రోజూ రూ.600 వరకు చెల్లిస్తారు. ఓ శుభముహూర్తాన యాప్ పనిచేయదు. అంతా పేదలు, గ్రామీణులు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయరన్నది వీరి ధీమా. లాక్డౌన్ కాలాన్ని ఈ యాప్ నిర్వాహకులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ముఖ్యంగా ఉపాధి కోల్పోయినవారు, విద్యార్థులు వీరి ఎత్తుగడలకు జేబులు ఖాళీ చేసుకున్నారు. -
ఉగ్రమూకల కొత్త యాప్ బాట
శ్రీనగర్: ఉగ్రమూకలు సరికొత్త పన్నాగాలకు తెరలేపుతున్నాయి. ఎన్క్రిప్షన్ సదుపాయం ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి యాప్‌లను వాడకుండా మరింత ఎన్క్రిప్షన్ ఉంటూనే తక్కువ నెట్‌వర్క్‌లోనూ సమర్ధవంతంగా పని చేయగల యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 3 యాప్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మూడే ఎందుకు ? భద్రతా కారణాల రీత్యా ఆయా యాప్‌ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు. అయితే ఆ మూడు యాప్‌లలో ఒకటి అమెరికా, రెండోది యూరోప్, మూడోది టర్కీకి చెందిన నిపుణులు తయారు చేసినవని వెల్లడించారు. ఈ యాప్‌లో ఎండ్ టు ఎండ్ డివైజ్ ఎన్క్రిప్షన్ ఉంటోంది. ప్రత్యేకించి ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్ర ఎన్కౌంటర్లలో మరణించిన వారి మొబైల్ ఫోన్లను పరిశీలించిన అధికారులకు టర్కీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. 2జీ నెట్వర్క్ కోసం... కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా కాలం పాటు ఆ ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిపేశారు. అనంతరం కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. 2జీ వేగంలో ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగల టర్కీ యాప్ వైపు ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లు కూడా ఫ్రీ సర్వీసులను అందించడం గమనార్హం. ఫోన్ నంబర్ అక్కర్లేదు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఈ మూడు యాప్‌లలో ఒకదానికి అసలు మొబైల్ నంబర్ కూడా అవసరం లేకుండానే రిజిస్టర్ చేసుకొని సమాచారం పంచుకోవచ్చు. ఒకరకంగా ఇది వర్చువల్ సిమ్‌లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. పుల్వామా–2019 ఘటనలోనూ ఇలాంటి వర్చువల్‌సిమ్ కార్డులను దాదాపు 40 వరకూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి వీడే ముందు మరొక నిర్ణయం తీసుకున్నారు. అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్లపై నిషేధం విధించారు. అమెరికాలో ఈ యా‹ప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారని, చైనా నుంచి ఆ అప్లికేషన్లని నియంత్రిస్తూ ఉండడంతో దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. -
ఇక రైల్వే టికెట్ బుకింగ్ మరింత ఈజీ
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీకానుంది. ఇందుకు వీలుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. యాప్‌ను సైతం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పులన్నీ 2021 జనవరి 1 నుంచీ అమల్లోకిరానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గురువారం అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లకు పచ్చజెండా ఊపారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను 6 కోట్లమందికిపైగా వినియోగిస్తున్నారు. రోజుకి సగటున 8 లక్షలకుపైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. రిజర్వ్డ్ టికెట్లలో 83 శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం విశేషం! ఐఆర్సీటీసీ అందించిన వివరాల ప్రకారం.. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్) - యూజర్లు లాగిన్ అయ్యాక టికెట్లతోపాటే భోజనం, వసతి గదుల(రిటైరింగ్ రూమ్స్) వంటివి బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. టికెట్ కోసం నింపిన యూజర్ల వివరాలతో ఒకే దఫాలో(వన్‌స్టాప్ సొల్యూషన్) వీటన్నిటినీ బుక్ చేసుకోవచ్చు. - బుకింగ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజర్ వెదుకుతున్న స్టేషన్లు లేదా ప్రయాణికుల వివరాలను వేగంగా అందిస్తుంది. - యూజర్ అకౌంట్స్ పేజీలో రిఫండ్ స్టేటస్‌ను అత్యంత సులభంగా పరిశీలించవచ్చు. గతంలో ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమయ్యేది. - రెగ్యులర్ లేదా ఫేవరెట్ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. - ట్రయిన్ సెర్చ్, సెలక్షన్‌కు సంబంధించి అన్ని వివరాలూ ఇకపై ఒకే పేజీలో కనిపించనున్నాయి. - వెదుకుతున్న రైళ్ల వివరాలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత, ధరలు వంటివి ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పేజీని స్ర్కోల్ చేయడం ద్వారా బుక్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రయిన్ వివరాలను మాత్రమే తెలుసుకునేందుకు వీలుండేది. - బ్యాకెండ్‌లో క్యాచ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో సీట్ల అందుబాటు సమాచారంలో మరింత వేగంగా లోడింగ్‌కు అవకాశముంటుంది. - వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి సీటు ఖరారయ్యే(కన్ఫర్మేషన్) అవకాశాలను సైతం సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్‌ను ప్రత్యేకంగా వెదకవలసి వచ్చేది. - ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు సైతం పేజీలో ప్రత్యక్షం కానున్నాయి. - టికెట్ బుకింగ్ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణ వివరాలు డిస్ప్లే కానున్నాయి. టైపింగ్ తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చాల వినియోగంతో సైబర్ సెక్యూరిటీకి వీలుంది. -
ఈ యాప్‌లను వెంటనే తొలగించండి!
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. ప్రతి చిన్న అవసరానికి మనం ఎక్కువ శాతం మొబైల్ మీద ఆధారపడుతున్నాం. ఏ చిన్న సమస్యకైనా మనకు ఏదో ఒక యాప్ రూపంలో పరిష్కారం లభిస్తుంది. ఈ యాప్స్ ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలూ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్స్ వల్ల మన ఫోన్ హ్యాకర్ల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సంస్థలు వాటి పేర్లను బహిర్గతం చేస్తున్నాయి. తాజాగా, డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి. ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది. (చదవండి: పీవీసీ ఆధార్: రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో పనిలేదు) వినియోగదారుల నుంచి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్ జాబితా ఇదే... Skins, Mods, Maps for Minecraft PE Skins for Roblox Live Wallpapers HD & 3D Background MasterCraft for Minecraft Master for Minecraft Boys and Girls Skins Maps Skins and Mods for Minecraft -
‘యాప్’సోపాలు.. యువతకు తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఫ్రెండ్ రాజేందర్‌కు యాక్సిడెంటైంది. అర్జంటుగా డబ్బులు పంపండి’ అంటూ సందేశాలు రావడంతో అవాక్కయిన మిత్రులు వెంటనే రాజేందర్‌కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ మెసేజ్‌లు ఎవరు పంపారో మొదట అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేందర్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని తేలింది. ‘మీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఏదుంటే అది ఎత్తుకు పోతాం..’ అంటూ ఫోన్లో వచ్చిన బెదిరింపుతో ఓ తండ్రి హతాశుడు అయ్యాడు. ఇంజనీరింగ్ చదివే తన కొడుకు రూ. లక్షలు అప్పు చేసిన ఫలితమని తెలిసి ఆయన తలపట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు. వీరంతా వివిధ మనీలెండింగ్ యాప్స్ (అప్పులు ఇచ్చే యాప్స్) కోసం పని చేస్తుంటారు. ఏం చేసైనా ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఇటీవల హద్దుమీరుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేస్తూ, ఆ నంబర్లకు ఫోన్లుచేసి, తప్పుడు సందేశాలు పంపి సమాజంలో చులకన చేస్తున్నారు. వారిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు దూకుడుగా వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా అప్పిచ్చి.. అలా వేధిస్తూ.. మనీ లెండింగ్ యాప్స్‌కు మొబైల్ ప్లేస్టోర్స్‌లో కొదవేం లేదు. ఇవి రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో కంపెనీ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ నంబర్ అందించాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్ నంబర్లన్నీ యాప్ యాజమాన్యానికి యాక్సెస్ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్‌లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇబ్బందుల పాల్జేస్తున్నారు. అప్పు మీద అప్పు.. పెరుగుతున్న ముప్పు లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, సినిమా టాకీస్ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలకు చెందినవారు ఏడు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తిరిగి తీర్చలేక, ఇంటి అవసరాల కోసమని మరోసారి అప్పులు చేసేందుకు అప్పుల యాప్‌లపై ఆధారపడుతున్నారు. చిన్నమొత్తంలో అప్పు చేసేవారికి ఫర్వాలేదు గానీ, భారీ మొత్తాల్లో అప్పుచేస్తే ఆ అప్పుల వసూళ్లకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ యాప్‌ల ద్వారా అప్పుచేసే యువకులు పెరిగారు. వీరు ఆన్లైన్ గేమ్స్ కోసం కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే తరహాలో అప్పుచేసి.. తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం అప్పు వసూలుకు వేధించడం, ఫోన్ కాంటాక్టులను యాక్సెస్చేసి బ్లాక్మెయిల్ చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూలులోనూ కలెక్షన్ ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరించడంపై బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్‌ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీ సహకారం లేకుండా.. కాంటాక్ట్స్ కలెక్షన్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు అంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే సంప్రదించండి అప్పు తీసుకున్న వారి కాంటాక్టులు యాక్సెస్ చేసి బ్లాక్మెయిల్ చేయడం చట్టవిరుద్ధం, నేరం. ఇలాంటి వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు. వెంటనే సైబర్ సెల్‌ను సంప్రదించాలి. బాధితులు విద్యార్థినులు, మహిళలైతే విమెన్ సేఫ్టీవింగ్‌ను ఆశ్రయించాలి. – స్వాతి లక్రా, ఏడీజీ ఆ ఉచ్చులో పడనీయొద్దు నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీ మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్, మనీలెండింగ్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి. –డాక్టర్ శారద, ప్రొఫెసర్, ఓయూ -
యాప్స్ వార్
-
ఐపీఎల్ రేటింగ్.. చీటింగ్!
సాక్షి, హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడుతున్న జట్ల బలాబలాలను ఆధారంగా చేసుకొని ఆన్లైన్ ద్వారానే బెట్టింగ్ కాస్తూ అందినకాడికి దండుకుంటున్న ఓ బుకీని, ఏడుగురు పంటర్లను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.22,89,400ల నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.13 లక్షల నగదు ఉన్న బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్‌లతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. జట్ల బలబలాను బట్టి రేటింగ్స్... కొంపల్లి ఓక్ ట్రీ ఎంక్లేవ్‌కు చెందిన చందూర్ శశాంక్ సుచిత్రా ఎక్స్‌రోడ్డు సమీపంలో ఓంకార్ అప్టికల్స్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆ షాప్‌నే క్రికెట్ బెట్టింగ్‌కి అడ్డాగా మార్చేశాడు. గోవాకు చెందిన ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో సంబంధాలు ఏర్పరుచుకొని హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని శశాంక్ క్రికెట్ బుకింగ్‌వైపు మళ్లించాడు. వాట్సాప్ కాల్ చేసి పంటర్లను డబ్బులను గూగుల్ పే, ఫోన్‌పేలకు పంపమనేవాడు. అయితే ఒక్కొక్కరు అంటే బెట్టింగ్ కాసేవాళ్లు రూ.50 వేలు డిపాజిట్ చేయమని సూచించేవాడు. ఆ తర్వాత క్రికెట్‌లైన్, క్రికెట్ ఎక్స్ఛేంజ్ మొబైల్ యాప్‌లను ఆధారంగా చేసుకొని బుకీ సొహైల్ రేటింగ్ ఇచ్చేవాడు. బలమైన టీమ్‌లకు రూ.పది వేలకు ఏడు వేలు, బలహీన జట్లు రూ.పది వేలకు రూ.తొమ్మిది వేలు అంటూ బెట్టింగ్ వేసేవారు. అయితే చాలా మంది పంటర్లు ఎక్కువ డబ్బులు రావాలనే ఆశతో రూ.పది వేలకు రూ.తొమ్మిది వేల రేటింగ్ ఇచ్చినవాటికే మొగ్గుచూపారు. అలాగే ప్రతి బంతికి కూడా ఆయా బ్యాట్స్‌మెన్ చేసే పరుగులకు కూడా రేటింగ్ ఇస్తూ పంటర్ల నుంచి బెట్టింగ్ ఉండేలా చూసుకునేవారు. ఇందులో వచ్చిన డబ్బులను గోవాలో ఉండే ప్రధాన బుకీ బర్కత్‌కు శశాంక్ పంపేవాడు. నిఘాతో దొరికిపోయాడు.. అయితే ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కావడంతో సైబరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రధానంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బాలానగర్ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్వోటీ) ఇన్స్పెక్టర్ పి.రమణారెడ్డి నేతృత్వంలోని బృందం పేట్‌బషీరాబాద్ పోలీసుల సహకారంతో సుచిత్రా ఎక్స్‌రోడ్డులోని అప్టికల్స్‌లో శశాంక్, ఏడుగురు పంటర్లను పట్టుకున్నారు. రూ.22,89,000ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో పాటు మరో ఏడుగురు పంటర్ల కోసం గాలిస్తున్నారు. విద్యార్థులూ పారాహుషార్ ‘బుకీలు చూపే అధిక ఆశతో చాలా మంది విద్యార్థులు ఈ క్రికెట్ బెట్టింగ్‌వైపు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం ఉంది. వివిధ ఫీజులు కావాలంటూ ఇంట్లో డబ్బులు అడిగే పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. బెట్టింగ్‌కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం అందించాలి’అని సీపీ సజ్జనార్ తెలిపారు. అనంతరం బెట్టింగ్ ముఠాను పట్టుకున్న బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డితో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. ఆ డీఎస్పీ ప్రొఫైల్ కేత్వాడ గ్యాంగ్ సృష్టే సాక్షి,హైదరాబాద్: ఏకంగా పోలీసు అధికారుల్నే టార్గెట్ చేసి, వారి వివరాలతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన రాజస్థాన్ గ్యాంగ్‌ను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో సిటీకి సంబంధించిన లింకు దొరికింది. అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) డీఎస్పీగా పని చేస్తున్న వి.రవికుమార్ పేరుతోనూ తామే నకిలీ ప్రొఫైల్ సృష్టించామని నల్లగొండ అధికారుల విచారణలో ఆ ముఠా అంగీకరించింది. దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.రవికుమార్ ఏసీబీలో మెదక్ రేంజ్‌కి నేతృత్వం వహిస్తున్నారు. ఈయనకు ఫేస్బుక్లో ప్రొఫైల్ ఉంది. దీనికి సెక్యూరిటీ లాక్ లేకపోవడంతో ఇందులోని వివరాలు కాపీ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన పేరు, ఫొటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించారు. దీని ఆధారంగా ఆయన స్నేహితులతో చాటింగ్ చేసి, అత్యవసరం అంటూ నగదు డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని గూగుల్ పే ద్వారా 77356 73646కు పంపాలంటూ కోరారు. తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న రవికుమార్ గత నెల 20న ఈ– మెయిల్ ద్వారా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలోనే నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ పేరుతోనూ ఓ నకిలీ ప్రొఫైల్ ఏర్పడింది. దీంతో ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి రాజస్థాన్‌కు చెందిన ముఠా పనిగా గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం భరత్‌పురా జిల్లాలోని కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తభీమ్ ఖాన్, ననీష్, షాహిద్, సద్దాం ఖాన్‌లను పట్టుకుని తీసుకువచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడైన ముస్తభీమ్ ఖాన్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 350 మంది పోలీసుల పేర్లతో వీళ్లు నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారని, వారిలో తెలంగాణకు చెందిన వారు 81 మంది ఉన్నట్లు బయటపడింది. ఈ వివరాలను ఆరా తీయగా.. రవి కుమార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. కేత్వాడ ముఠా అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని నల్లగొండ పోలీసులు సైబర్ క్రైమ్ అధికారులకు అందించారు. దీని ఆధారంగా న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేయడానికి సైబర్ కాప్స్ సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు దీన్ని జారీ చేసిన తర్వాత ఆ నలుగురు నిందితుల్నీ సిటీకి తీసుకురానున్నారు. ఫేస్బుక్లో ఈ తరహా నకిలీ ప్రొఫైల్స్ సృష్టికి సంబంధించి ఇటీవల కాలంలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి మాత్రమే నల్లగొండ పోలీసులకు చిక్కిన కేత్వాడ ముఠా పనిగా తేలింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇలాంటి ముఠాలు మరికొన్ని ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో ఆరా తీస్తూ ఆ కేసుల్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ చందానగర్: గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేసి..అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం... చందానగర్ బస్టాప్దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్‌ను వెంట తెచ్చుకొని ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న రూ.12,86,000 నగదును ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్ నాగోలు: అంతరాష్ట్ర గంజాయి సరఫరా ముఠాకు ఎల్బీనగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌లు చెక్ పెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా కంటైనర్‌లో తరలిస్తున్న 1010 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం...హర్యానాలోని నుహు జిల్లాకు చెందిన మహ్మద్ రంజాన్ అలియాస్ కల్లూ వృత్తి రీత్యా డ్రైవర్. ఉత్తరప్రదేశ్‌లోని కోరాపుట్ జిల్లాకు చెందిన శశికాంత్ గౌతమ్‌రావు హోటల్లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ఒడిశాకు గంజాయి సరాఫరా చేస్తూ ఉంటాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వివేక్ సింగ్ అలియాస్ అలోక్ వివిధ ప్రాంతాల నుండి వచ్చే గంజాయి కొనుగోలు చేస్తుంటాడు. హర్యానాకు చెందిన ఇమ్రాన్ కంటైనర్ ఓనర్. వీరందరూ అందరూ కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా బార్డర్ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కంటైనర్ లారీల ద్యారా అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నారు. కంటైనర్‌లో రహస్య క్యాబిన్ ఏర్పాటు చేసి ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. ఒడిశాలో స్థానికంగా పండించే వారి దగ్గర గంజాయి కొనుగోలు చేసి 5.5 కేజీల ప్యాకెట్లుగా ప్యాక్ చేసి కంటైనర్‌లో లోడ్ చేశారు. ఈ క్రమంలో ఇమ్రాన్ తన కంటైనర్‌ను విజయవాడ మీదుగా వారణాసికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. దీనిపై పక్కా సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీస్‌లు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సహకారంతో సోమవారం తెల్లవారు జామున కంటైనర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్ మహ్మద్ రంజాన్, శశికాంత్ గౌతమ్రావులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారికోసం పోలీస్‌లు గాలిస్తున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, వి.స్వామి, టి.రవికుమార్, అవినాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, 'జోకర్' మాల్వేర్ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. ఒక్కసారి మొబైల్‌లోకి ఎంటరైతే.. 'జోకర్' మాల్వేర్ అత్యంత ప్రమాదకరమైనదని టెక్ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ 'జోకర్' బారిన పడితే మీ మొబైల్ ఇక మీ మాట వినదు. మొబైల్లోని కాంటాక్ట్స్‌ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ యాక్సెస్ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. (చదవండి: సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్) ఇప్పటికే లక్షా 20 వేల డౌన్లోడ్స్ ఈ సెప్టెంబర్‌లో ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌ను గూగుల్ పరీక్షించింది. 17 యాప్స్ భారీగా ఇన్ఫెక్ట్ అయినట్టు గుర్తించి.. వెనువెంటనే వాటిని తొలగించింది. ఐతే.. అప్పటికే ఆ 17 యాప్స్‌ను దాదాపు లక్షా 20 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు గుర్తించిన గూగుల్.. తక్షణమే మొబైళ్ల నుంచి వాటిని అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఇటీవల గూగుల్ గుర్తించిన 17 ఇన్ఫెక్టెడ్ యాప్స్ ఇవే.. One Sentence Translator - Multifunctional Translator Style Photo Collage Meticulous Scanner Desire Translate Talent Photo Editor - Blur focus Care Message Part Message Paper Doc Scanner Blue Scanner Hummingbird PDF Converter - Photo to PDF All Good PDF Scanner Mint Leaf Message-Your Private Message Unique Keyboard - Fancy Fonts & Free Emoticons Tangram App Lock Direct Messenger Private SMS -
టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషే«ధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. టిక్ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. -
పబ్జీ ‘ఆట’కట్టు
-
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్‌లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్‌లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్‌లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్‌లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
'మొబైల్ యాప్స్ ఆరోగ్యస్థితిని గుర్తించలేవు'
సాక్షి, భువనగిరి : ' మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, హార్ట్ బీట్ మొదలైనవి చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగకరంగా ఉంది అంటూ నమ్మిస్తున్నారు. అయితే మొబైల్ యాప్స్ ఎలాంటి ఆరోగ్య స్థితి, ఆనారోగ్యం, బీపీ , పల్స్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించలేవు' అంటూ జిల్లా ఎస్పీ బాస్కరన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కరోనా సంక్షేమ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ చూపుడు వేలు వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించగలగాలి. గూగుల్ పే వంటి యాప్స్ డౌన్లోడ్ చేయగానే ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి.అయితే మన వేలిముద్రలను హ్యకర్లు దొంగలించే అవకాశం ఉంది. బ్యాంక్‌ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది హ్యాకర్లు ఇట్టే పసిగడతారు.ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్లోడ్ చేయవద్దు.' అంటూ పేర్కొన్నారు. -
పబ్జీ, లూడో గేమ్స్‌కూ చెక్!
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో 47 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. జూన్ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన మొబైల్ యాప్‌ల సంఖ్య 106 కి చేరింది. ఈ 47 యాప్‌లు సైతం, యిప్పటికే నిషేధించిన యాప్‌లకు సంబంధించినవే. శుక్రవారం ఈ యాప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ మొబైల్, ఈ–కామర్స్ విభాగానికి చెందిన ఆలీఎక్స్‌ప్రెస్, మరో ప్రముఖ గేమింగ్ ‘లూడో వరల్డ్’, జిలీ, మ్యూజిక్ యాప్ రెస్సో యాప్స్‌లనూ నిషేధించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ చైనాలోని షావోమీ, టెన్సెంట్, అలీబాబా, బైట్‌డాన్స్ లాంటి అతిపెద్ద కంపెనీలకు చెందిన యాప్‌లు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం 275 చైనా యాప్‌లపై కేంద్రం నిఘాపెట్టింది. చైనా నుంచి పనిచేసే అన్ని టెక్ కంపెనీలనూ, చైనా యాజమాన్యంలోని కంపెనీలనూ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ లా ఆఫ్ 2017’నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ యాప్‌లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. -
సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న ప్రవీణ్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. కానీ తానుండే ప్రదేశంలో తనలా ఆ ఆటపై ఆసక్తి ఉన్న వారెవరో తెలియదు. తన అభిరుచులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉన్నవారితో స్నేహం చేయడం మైలో యాప్ ద్వారా సాధ్యపడుతుంది. నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సిద్ధం చేసిన ఈ యాప్‌ను పలు గేటెడ్ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇరుగుపొరుగు వారిని మరింత దగ్గర చేయడం, ఇష్టాఇష్టాలు, అభిరుచులు పరస్పరం పంచుకోవడం.. కష్టసుఖాలు షేర్ చేసుకునేందుకు ఈ యాప్ ఓ అవకాశం కల్పిస్తుండటం విశేషం. మైగేట్తో మరో ముందడుగు... గేటెడ్ కమ్యూనిటీల్లో స్థానికుల అవసరాలను తీరుస్తోన్న మరో యాప్ మైగేట్ మొబైల్ యాప్. ఈయాప్ ద్వారా ఆయా నివాస సముదాయాలకు బయటి వ్యక్తులు, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు ఎవరు.. ఏఏ సమయాల్లో వచ్చారు..? క్యాబ్ సర్వీసులు ఏ సమయంలో లోనికి వచ్చాయి..? పనిమనిషి ఏ సమయంలో లోనికి ప్రవేశిస్తుంది.. తొలుత ఎవరి ఇంట్లో పనిచేస్తుంది. ఆమె తీరిక వేళలు ఏమిటి.. మీ ఇంటికి వచ్చేందుకు ఆమెకు ఏ సమయంలో వీలవుతుంది..? తదితర వివరాలన్నీ నోటిఫికేషన్స్, అలర్ట్ రూపంలో మొబైల్‌కు అందనుండటం సరికొత్త సమాచారం ఇచ్చినట్లవుతుంది. ఈయాప్‌లు భద్రమైనవేకాక... ఆయా పనులను సులభతరం చేస్తున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, చెన్నై తదితర మహా నగరాల్లో సూపర్ లోకల్ మొబైల్ యాప్స్‌ను గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు విరివిగా వినియోగిస్తున్నారని.. భాగ్య నగరంలోనూ ఈ ట్రెండ్ ఇటీవలికాలంలో జోరందుకుందని చెబుతున్నారు. యాప్‌ల కాలం.. నెటిజనుల్లానే సిటీజనులు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు, విద్యార్థులు, వయోధికులు, మహిళలు, చిన్నారులు, రోగులు ఇలా అన్ని వర్గాల వారికీ కోరిన సేవలు ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఆహారం, మెడిసిన్స్, వైద్యసేవలు, వైద్య పరీక్షలు, వివిధ రకాల సేవలు, షాపింగ్ తదితర అవసరాలను తీర్చే యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సూపర్ లోకల్ మొబైల్ యాప్స్‌కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. -
యాప్‌ల దునియా.. మేడిన్ ఇండియా
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్ యూజర్లలో దేశభక్తి ఉప్పొంగుతోంది. స్వదేశీ యాప్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. గల్వాన్‌లో భారత సైన్యంపై చైనా దాడి అనంతరం దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. యువతను, పెద్దలను ఉర్రూతలూగించిన చైనా యాప్ టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధించడంతో ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా స్వదేశీ యాప్‌లను గుర్తించి డౌన్లోడ్ చేసుకుంటున్న యూజర్ల సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతోంది. అంతా మేడిన్ ఇండియా.. ► టిక్‌టాక్, ఉయ్ చాట్, హెల్లో వంటి చైనా మొబైల్ అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారి, ట్రెల్, మోజ్, జోష్ వంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ► స్వదేశీ యాప్‌లకు మేడిన్ ఇండియా అనే ట్యాగ్‌లైన్ ఉండటంతో వాటిని గుర్తించడం సులభంగా ఉంటోంది. ► ‘చింగారి మేడిన్ ఇండియా’ యాప్‌లో వీడియో, ఆడియో, షేరింగ్ వంటి ఆప్షన్లు ఉండటంతో ప్రజాదరణ పొందుతోంది. ► బెంగళూరుకు చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్ సిద్ధార్థ్ గౌతమ్ అనే ప్రోగ్రామర్లు ఈ స్వదేశీ యాప్‌ను అభివృద్ధి చేశారు. ► టిక్‌టాక్ ఉన్న రోజుల్లో పాత చింగారి యాప్‌నకు పెద్దగా ఆదరణ లభించలేదు. ► వీడియో బ్లర్ అవుతోందని, సరిగా షేర్ కావడం లేదనే సాంకేతిక సమస్యలను యూజర్లు ఏకరువు పెట్టేవారు. ► ఇప్పుడు సాంకేతిక సమస్యలు అధిగమించడంతో చింగారి యాప్‌నకు క్రేజ్ పెరిగింది. ► వీడియో, ఆడియో, ఫొటో వంటి వాటితో షేరింగ్ ఆప్షన్లు గల స్వదేశీ యాప్‌లు ఇప్పుడు మన దేశంలో సత్తా చాటుతున్నాయి. ► చింగారి, ట్రెల్, మోజ్ వంటి స్వదేశీ యాప్‌లు కోటికి పైగా డౌన్ లోడ్స్ మైలు రాయిని దాటి రికార్డు సృష్టిస్తున్నాయి. ► ఇదే తరహాలో ‘జోష్’ యాప్ 50 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తుండటం విశేషం. -
చైనా యాప్స్ నిషేధించండి
వాషింగ్టన్: జాతీయ భద్రత దృష్ట్యా, చైనాకు సంబంధించిన 60 యాప్స్‌పై నిషేధం విధించి భారత్ అసాధారణ చర్యకు పూనుకుందని, ఇదే మాదిరిగా అమెరికాలో సైతం టిక్‌టాక్ తదితర చైనా యాప్‌లను నిషేధించాలని 24 మంది కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యుల బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉన్న టిక్ టాక్, ఇతర సామాజిక మాధ్యమాలను అమెరికా మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరుతూ చట్టసభ సభ్యులు ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ చట్టాలను బట్టి, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో సహా చైనా కంపెనీలు సామాజిక మాధ్యమాల వినియోగదారుల డేటాను అధికార కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని, ఇది అమెరికా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వైట్‌హౌస్ అధికారి మీడియాకు వెల్లడించారు. -
చైనాకు షాక్ : 4500 గేమ్స్ తొలగింపు
వాషింగ్టన్ : భారత్ నుంచి భారీ డిజిటల్ స్ట్రైక్స్‌ను చవిచూసిన చైనాకు దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ ఊహించిన షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్‌లోని 4500 మొబైల్ గేమ్స్‌ను తొలగించింది. గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించడంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గేమింగ్ లైసెన్స్ నింబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్ దానిలో భాగంగానే చైనా గేమ్స్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేని గేమ్స్ కూడా యాప్స్‌లో ఉంచుతున్నారని, ఇక మీదట అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అయితే ఇదేమీ తాము ఉన్న ఫలంగా తీసుకున్న చర్య కాదని, లైసెన్స్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని గత ఏడాదే ప్రకటించినట్లు గుర్తుచేసింది. దీనిలో భాగంగానే ముందుగా విధించిన గడువు ప్రకారం జూన్ 30 నుంచి చైనాకు చెందిన గేమ్స్‌ను యాప్ నుంచి తొలగిస్తున్నామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) లైసెన్స్ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన అనంతరం చట్ట ప్రకారం అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరిణామం చైనా కంపెనీలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 వేలకోట్ల రూపాయల వరకు చైనా కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ అంచనా వేస్తోంది. (టిక్‌టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా) -
‘రిమూవ్ చైనా యాప్స్’కు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన చైనా యాప్స్‌ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్‌తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్‌లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను వన్ టచ్ యాప్ల్యాబ్స్ రూపొందించింది. -
‘యాప్’న్న హస్తం
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కారణంగా నగరంలో చిక్కుకుపోయి, స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న వలస కార్మికుల కోసం రాష్ట్ర పోలీసు విభాగం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘టీఎస్ పోలీసు పాస్ మేనేజ్మెంట్’ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారానే వలస కార్మికుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పోలీస్స్టేషన్ల వద్ద వందలాది మంది వలస కూలీలు బారులు తీరుతున్నారు. మంగళవారం నగరం నుంచి బిహార్‌కు తొలి రైలు బయలుదేరే అవకాశముంది. మరోవైపు సోమవారం నాటికే చాలామంది కూలీలు మూటా ముల్లే సర్దుకుని కాలినడకన స్వస్థలాలకు వెళ్లారు. నగరంలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వీలున్నంత మందిని నిలువరించేందుకు అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఒక్కో రైలులో 1200 మంది.. వలస కార్మికుల్ని తరలించడానికి కేంద్రం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. ఒక్కో రైలులో గరిష్టంగా 1200 మందిని తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో వీరు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎవరికి వారు తాము వెళ్తామంటే తాము వెళ్తామంటూ పోలీసుస్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద బారులుదీరుతున్నారు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యలను తప్పించడానికి పోలీసు విభాగం ఠాణాల వారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టింది. ఇందుకోసం రూపొందించిన ‘టీఎస్ పోలీసు పాస్ మేనేజ్మెంట్’ యాప్‌ను ఆయా ఇన్స్పెక్టర్ల ఫోన్లలో నిక్షిప్తం చేశారు. దీని ద్వారా ఆయా అధికారులు వలస కార్మికుల రిజిస్ట్రేషన్ ప్ర క్రియ చేపడుతున్నారు. దాదాపు అన్ని ఠాణాలకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఒత్తిడి ఎక్కువ ఉన్న చోట్ల అదనపు ఇన్స్పెక్టర్లు సైతం రంగంలోకి దిగారు. సమన్వయకర్తల సాయంతో.. ఆయా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు కొందరు సమన్వయకర్తలు ఉన్నారు. ప్రధానంగా మేస్త్రీలు, కులపెద్దలు తదితరులు ఈ పాత్ర పోషిస్తున్నారు. వీరి సాయంతో కార్మికులు ఉండే ప్రాంతానికి వెళ్తున్న పోలీసులు ఈ యాప్‌లో వారి పేరు, ఆధార్, ఫోన్ నంబర్, స్వరాష్ట్రం, జిల్లా తదితర వివరాలు నింపుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారి వివరాలు ఇలా నమోదు చేసుకుంటున్నారు. ఆది, సోమవారాల్లో మూడు కమిషనరేట్లకు సంబంధించి 25 వేల మంది వివరాలు నమోదు చేశారు. ఈ డేటాబేస్ ఆధారంగా ఆరోహణ క్రమంలో రాష్ట్రాల వారీగా కార్మికులు, కూలీలను పంపనున్నారు. ఓ రాష్ట్రానికి వెళ్లడానికి రైలు సిద్ధమైన తర్వాత ఆ రాష్ట్రీయుల్లో మొదట ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయిన 1200 మందికి సంక్షిప్త సందేశాలు వస్తాయి. రైలు బయలుదేరడానికి నిర్ణీత సమయం ముందు వచ్చే వీటిని స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి చూపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ప్రింటెడ్ పాస్‌ను జారీ చేసే ఠాణా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్సులో రైల్వే స్టేషన్‌కు తరలిస్తారు. ఆది, సోమవారాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో బిహార్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో మంగళవారం తొలి రైలు ఆ రాష్ట్రానికే బయలుదేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపైకి భారీ సంఖ్యలో.. ఇటీవల సంగారెడ్డిలో చోటుచేసుకున్న ఘర్షణ, ఆ తర్వాత రహస్యంగా లింగంపల్లి నుంచి ఓ రైలు ఏర్పాటు కావడం తదతర పరిణామాలతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. రోడ్లపైకి వస్తే తప్ప తమను పంపించరనే ఉద్దేశంతో అనేక మంది వలస కార్మికులు ఆదివారం నుంచి నిరసనలకు దిగడం, పోలీసుస్టేషన్లకు వెళ్లి వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొందరు మూటాముల్లే సర్దుకుని కాలి నడకనే స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వీలున్నంత వరకు వలస కార్మికులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీరున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆహారం అందించడం, నిర్మాణాలను ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అందరికీ పని దొరుకుతుందంటూ వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆలోపు ఆహారం, వైద్యం తదితర సౌకర్యాలు కల్పిస్తూ వారిలో నమ్మకం కలుగజేస్తున్నారు. మండుటెండల్లోనూ కాలినడకన వెళ్లిపోతున్న వలస కార్మికుల్ని ఎక్కడిక్కడ ఆపి.. అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వచ్చేవారికి వైద్య పరీక్షలు.. మరోవైపు సిటీ నుంచి ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు వెళ్తున్నట్లే.. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడకూ వచ్చే అవకా«శం ఉంది. అలా వచ్చే వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉంటే ఆ ప్రభావం నగరంపై తీవ్రంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్లలోనే ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ప్రాథమిక పరీక్షలు చేయాలని యోచిస్తున్నారు. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను రికార్డులు రూపొందించనున్నారు. అనుమానిత లక్షణాలున్న వారికి నిర్ణీత కాలానికి హోం క్వారంటైన్ స్టాంపులు వేయాలని, వారు బయటకు రాకుండా నిఘా ఉంచాలని యోచిస్తున్నారు. మొత్తమ్మీద ఈ రాకపోకల కారణంగా ఎలాంటి అపశ్రుతులు, దుష్పరిణామాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. -
బెట్టింగ్స్ కోసం ప్రత్యేక యాప్
సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేయించారు వ్యవస్థీకృత బుకీలు... దీని లింకును నిర్వాహకులకు షేర్ చేయడం ద్వారా ప్రతి పందెం పైనా 3 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. దీంతో పందేలన్నీ యాప్ ద్వారా జరుగుతుండగా, నగదు మార్పిడి మాత్రం హవాలా మార్గంలో సాగుతున్నాయి. ఇలా హైటెక్ పంథాలో పందాలు నిర్వహిస్తున్న ఈ ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధా కిషన్‌రావు గురువారం తెలిపారు. బెట్టింగ్స్‌లో పందేలు నిర్వహించే వారిని బుకీ అని, వాటిని కాసే వారిని పంటర్ అని అంటారు. నగరంలోని బహదూర్‌పుర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అగర్వాల్, గౌలిగూడకు చెందిన లఖన్ శ్రద్ధ్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించే బుకీలుగా పని చేస్తున్నారు. తొలినాళ్ళల్లో బుకీలు పరిచయస్తులైన పంటర్ల నుంచి పందేలు అంగీకరిస్తూ ఆ లెక్కల్ని మాన్యువల్‌గా రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ రేష్యోను సూత్రధారుల నుంచి ఫోన్లో తెలుసుకునే వారు. ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్ను పంటర్లకు ఫోన్ ద్వారా వివరిస్తూ ఉండేవారు. ఇలా అవసరం లేకుండా అంతా ఆన్లైన్లో సాగే మాదిరిగా అంతర్జాతీయ బుకీలు ప్రత్యేకంగా ‘రాయల్ ఎక్ఛ్సేంజ్’ పేరుతో ఓ యాప్‌ను సృష్టించారు. రాజస్థాన్‌కు చెందిన సంకేత్ అనే కీలక బుకీ అనేక మంది చిన్న బుకీలకు దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ఉండటాడు. కొన్నాళ్ళ క్రితం ప్రవీణ్, లఖన్‌లకు ఇతడితో పరిచయం ఏర్పడింది. అతడు అందించిన వివరాల ఆధారంగా దీన్ని ప్రత్యేక పద్ధతిలో తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నారు. దానిలోకి లాగిన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను సంకేత్ రహస్యంగా అందిస్తాడు. ఇలా ఇచ్చినందుకు అతడు ఆ యాప్ ద్వారా జరిగే లావాదేవీల్లో 3 శాతం కమీషన్ తీసుకుంటారు. ప్రవీణ్, లఖన్ సైతం తమ పంటర్లకు ఈ యాప్ లింకు పంపడం ద్వారా తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఆ యాప్స్‌లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలు అక్కడే కనిపిస్తాయి. ఒక్క దేశీయ క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలో ఏ మూలన జరిగే, ఏ క్రీడకైనా పందాలు కాసేకోవచ్చు. ఇలా ఈ యాప్‌లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది వాటిలో రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు మాత్రం నేరుగా లేదా ఆన్లైన్లో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. ఏదైనా సందేశాలు, సమస్యలు ఉండే అతడితో ఇక్కడి బుకీలు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి. ఇప్పటికే అనేక మ్యాచ్‌లకు బెట్టింగ్ నిర్వహించిన ప్రవీణ్, లఖన్లు తాజాగా జరుగుతున్న టెస్ట్, టీ20 మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పర్మేశ్వర్ దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించిన అధికారులు పరారీలో ఉన్న సంకేత్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి నిరాకరణ
సాక్షి, సిటీబ్యూరో: సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మాల్ ప్రాక్టీస్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను ప్రత్యేకంగా నియమించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 404280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 462 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్నపత్రాలను మరో రెండు మూడు రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్స్టేషన్లకు తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపర్చనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో 26, మేడ్చల్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. సెంటర్ లొకేషన్ యాప్ ప్రారంభం.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సెంటర్ లొకేషన్ యాప్‌ను సిద్ధం చేశారు. గతేడాదే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది. ప్రస్తుతం ఈ యాప్ పని తీరును మరింత ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సెంటర్ లొకేషన్ యాప్ అని టైప్ చేసి, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. యాప్‌లో హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. విద్యార్థి ఉన్న చోటికి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. పరీక్ష కేంద్రానికి ఏ రూట్లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా హాల్‌టికెట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. కాలేజీ ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులకు ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు వారి హాల్ టికెట్లు ఇవ్వకుండా మొండికేస్తుండటం తెలిసిందే. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే యాజమాన్యాలకు చెక్ పెట్టేందుకే ఈ అవకాశాన్ని అందుబాటలోకి తెచ్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. నిర్దేశిత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు ఒత్తిడికిలోనుకావొద్దు పరీక్షల సమయం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలని, తమ కాలేజీకి మంచి గుర్తింపు తీసుకురావాలనే ఆశతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది చదువు.. అది చదువు అంటూ వారిని బలవంతం చేస్తున్నారు. కీలకమైన ఈ సమయంలో పిల్లలకు అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు కూడా మార్కులు లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మార్కులు, ర్యాంకులే జీవితం కాదు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు అండగా నిలవాలి. వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలి. – జయప్రదాబాయి, జిల్లాఇంటర్మీడియట్ ఆఫీసర్, హైదరాబాద్ పరీక్షల తేదీలు.. సమయం ఇలా ఫస్టియర్: మార్చి 4 నుంచి 21 వరకు సెకండియర్: మార్చి 5 నుంచి 23 వరకు సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు -
‘యాప్’తో ట్రాప్!.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ..
సాక్షి, సిటీబ్యూరో: కవాడిగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చింతల్ వాసి మంగళవారం మధ్యాహ్నం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు ఎవరూ కాల్ చేయలేదని, తాను ఓటీపీ కూడా చెప్పలేదని అయినా తన ఖాతా నుంచి రూ.1.8 లక్షలు పోయాయని పేర్కొన్నాడు. ఆయన ఫోన్‌ను పరిశీలించిన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ అందులో ‘క్విక్ వ్యూ’ అనే యాప్ ఉండటాన్ని గమనించారు. దీని ద్వారానే సైబర్ నేరగాళ్ళు ఖాతా ఖాళీ చేసినట్లు తేల్చారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. జమ్‌తార కేంద్రంగా మోసాలు... జార్ఖండ్‌లో రాష్ట్రంలో ఉన్న జమ్‌తార జిల్లాలోని ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలు చేయడమే తమ ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత తామే ప్రస్తుతం సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్ళకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి ఎప్పటికప్పుడు కొత్త సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే జమ్‌తార సైబర్ నేరగాళ్లు అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు ధ్వంసం చేస్తున్నారు. యాప్స్ డౌన్లోడ్ చేయించి... ఓ ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునే లోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. అయితే ప్రతి లావాదేవీకీ ఒక ఓటీపీ మాత్రం కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే డబ్బు కట్ కావడాన్ని గమనించి చెప్పకపోవచ్చు అని జామ్‌తార నేరగాళ్ళు కొత్త పంథా మొదలెట్టారు. తాము టార్గెట్ చేసిన వారిలో స్పార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్స్ లేదా లింకులు పంపడం ద్వారా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన వీటికి సంబంధించి ఓ పాస్వర్డ్ చెప్తున్న నేరగాళ్లు దాని యాక్టివ్ చేసుకునేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్యాంకునకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, ఈ తరహా అప్డేట్స్, లింకేజ్లు ఆటోమేటిక్‌గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు. బాధితుడు ఈ యాప్‌ను ఇన్‌స్టల్ చేసుకుని యాక్టివ్ చేసిన వెంటనే ఇతగాడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ఫోన్/ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుంటుంది. ఫలితంగా వచ్చిన ప్రతి ఓటీపీను అడగాల్సిన పని లేకుండా చేసేస్తూ వీలున్నంత వరకు ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అసలు విషయం తెలుసుకునేలోపు బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు బాధితులకు విషయం తెలియకుండానే వివిధ లింకుల ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్‌కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలలు, వాలెట్స్ బోగస్ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్‌గా పిలిచే వీరి నుంచి సైబర్ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టమని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికి 11 యాప్స్ గుర్తించాం ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటేనే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఓ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఎదుటి వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదు. అపరిచులు సూచించే ఎలాంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, లింకులు క్లిక్ చేయడం కూడదు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ప్రతి వీటిని అసవసరంగా ఎవరూ డౌన్లోడ్ చేసుకోవదు. ఇప్పటికే ఫోన్లలో ఉన్నాయా? అనే అంశాన్నీ ఓసారి పరిశీలించుకోవాలి. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్‌సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ -
యమపురికి 'యాప్' దారి
ఇంటర్నెట్లో, హెల్త్ యాప్‌లలో ఆరోగ్యపరమైన చిట్కాలు పాటిస్తూ అనేకమంది ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో ఈ సంఘటనలే పెద్ద ఉదాహరణ. ఇంటర్నెట్లో హెల్త్‌కు సంబంధించి సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలుగా సైట్లు, వీడియోలు, సమాచారం వస్తుంది. అలాంటి వాటిని నమ్మడం మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రసిద్ధి చెందిన వైద్యుల వీడియోలు, యాప్‌లను తప్ప ఇతరత్రా పాటించడం మంచిది కాదంటున్నారు. కొందరు వైద్యశాస్త్రాన్ని నమ్మకుండా చిట్కాలు పాటిస్తూ అవాం తరాలు తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల హెల్త్ యాప్‌లు, వెబ్సైట్లు ఉన్నాయి. కొన్ని యాప్‌లు ఎక్సర్‌సైజుకు సంబంధించినవి కాగా, కొన్ని ఆహార నియమాలకు సంబంధించినవి. కొన్నింటిలో ఏ జబ్బుకు ఏ మందులు వాడాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఉన్నాయి. కొన్ని ఆన్లైన్ వీడియోల్లోనైతే ఆరోగ్య చిట్కాల పేరుతో వందల సైట్లు కనిపిస్తుంటాయి. ఇంటర్నె ట్ విస్తృతి అదనుగా ప్రవేశించిన ఈ మాయదారి యాప్‌లు, వెబ్సైట్లు కిడ్నీలో రాళ్లు వస్తే ఈ చిట్కాలు పాటించండి.. బరువు ఎక్కువుంటే ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజుల్లో 10 కేజీలు తగ్గుతాయ ని చెబు తుంటాయి. కామెర్లు వస్తే పలానా ఆకురసం తాగాలి వంటివి కనిపిస్తాయి. పాత తరం వాళ్లు ఇలాం టివి పాటించడం వల్లే వారు ఆరోగ్యంగా ఉన్నారని కూడా నమ్మబలుకుతున్నాయి. ఇటువంటి వీడియోలు చూసి మోసపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంపై ప్రయోగాలు చేయొద్దు.. మానవ శరీరంపై ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేయకూడదన్న కీలకమైన విషయాన్ని వైద్యులు సూచిస్తున్నారు. మనిషి మనిషికి వారి అలవాట్లలో తేడాలుం టాయి. వారి శరీర నిర్మాణంలోనూ తేడాలుంటాయి. కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే సరిపడదు. వారికి అలర్జీలు వస్తాయి. కొందరికి కొన్ని రకాల మందులు కూడా సరిపడవు. ప్రతి మనిషి వారి వాతావరణ పరిస్థితులు, చిన్నప్పటి నుంచి వారి ఆహా ర అలవాట్లను బట్టి అనేక రకాల తేడాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా జబ్బు కానీ, అనారోగ్య సమస్యగానీ వస్తే డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొందరు షుగర్ పరీక్షలు చేయించుకుంటారు. సాధారణం కంటే కాస్తంత ఎక్కువ కనిపిస్తే తనకు షుగర్ ఉందని ఫిజీషి యన్ను కలవకుండానే నిర్ధారించుకుంటారు. కొంద రు అర్హతలేని ప్రైవేటు ప్రాక్టీషనర్‌ను కలిసి మందులు కూడా వాడతారని వైద్యులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వస్తే సరే.. ప్రస్తుతం యాప్‌లు, వెబ్సైట్లు, ఆన్లైన్ వీడియోలు సాధారణ లక్షణాలను మాత్రమే చెబుతుం టాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మున్ముం దు యాప్‌లు రానున్నాయి. అవి కొంతమేరకు ప్రాక్టికల్‌గా ఉండే అవకాశముందని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా వైద్యుడిని సంప్రదించకుండా ఆన్లైన్ వైద్యం ఏమాత్రం మంచిదికాదని స్పష్టం చేస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాంతకం యాప్‌లు, వెబ్సైట్లు, ఆన్లైన్ వీడియోలను చూసి వైద్యం చేసుకుంటే ఇక వైద్యులు ఎందుకు? నెట్ ఆధారంగా వైద్యం చేసుకోవడం, చిట్కాలు పాటించడం అశాస్త్రీయం. ప్రాణాంతకం కూడా. పైగా దుష్ప్రభావాలు వస్తుంటాయి. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్,డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ గుడ్డిగా అనుకరించొద్దు యాప్‌లు, వెబ్సైట్లలో ఆరోగ్య సమాచారం చూసి గుడ్డిగా ఫాలోకాకూడదు. వైద్యుల ప్రమేయం లేకుండా ఆహారంలో మార్పులు చేర్పులు అనవసరంగా చేయకూడదు. దీనివల్ల మన శరీర సహజ లక్షణం మారిపోతుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, పిజీషియన్,సిటీన్యూరో, హైదరాబాద్ ప్రయోగాలు వద్దు డాక్టర్ సలహా లేకుండా ఎవరూ శరీరంపై ఎలాంటి ప్రయోగం చేయకూడదు. ఆహార విషయమైనా, వైద్యమైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు. – డాక్టర్ రాజు, ఛాతీ వైద్య నిపుణులు,హైదరాబాద్ ట్యూమర్ అనుకుంటే ఎలా కొందరు సాధారణ తలనొప్పి వచ్చినా, వెబ్సైట్లలో వెతికితే బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చని కూడా ఉంటుంది. దాన్ని నమ్మి ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుంటున్న వారూ ఉంటున్నారు. వెబ్సైట్లను నమ్మి ప్రమాదకరమైన వాటిని కూడా చిన్నవిగా చూసే పరిస్థితి కూడా ఉంటుంది. –డాక్టర్ సాంబశివారెడ్డి, సిటీన్యూరో,హైదరాబాద్ -
నీళ్లు లేవు, కరెంట్ లేదు బొద్దింకలు..
సాక్షి, సిటీబ్యూరో: రైలు ప్రయాణం అంటే ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లడమే కాదు. ఒక మంచి అనుభూతి కూడా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ప్రయాణించే వారు తమ జర్నీ ఆహ్లాదంగా..ఆనందంగా..ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. కానీ, ఇప్పుడు రైలు జర్నీ ‘డర్టీ’గా మారింది. అపరిశుభ్ర వాతావరణం, ఎలుకలు, బొద్దింకలు, కంపుకొట్టే టాయిలెట్లు, నీళ్లు రాని నల్లాలు, మురికిమయమైన దుప్పట్లు, చిరిగిన బెర్త్‌లతో రైలు ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశాలపై ఇప్పుడు రైలు ప్రయాణికులు సీరియస్ అవుతున్నారు. పెద్ద ఎత్తున రైల్వే శాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సదుపాయాలను అందజేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన‘కోచ్మిత్ర’ యాప్‌నకు గతేడాది వివిధ సమస్యలపై ఏకంగా 5203 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిలో మరుగుదొడ్ల అపరిశుభ్రతపైనే 1675 ఫిర్యాదులు అందితే, నీటిసరఫరా లేకపోవడంపైన మరో 1106 మంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓవర్‌నైట్ జర్నీ చేసే ప్రయాణికులు చాలామంది బెడ్‌షీట్స్ అపరిశుభ్రంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేటరింగ్ సర్వీసులపైనా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. గతంలో రుచి,శుచీ లేని ఆహార పదార్థాలపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి యథావిధిగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏమిటీ కోచ్ మిత్ర... స్వచ్ఛమైన..పరిశుభ్రమైన రైళ్లలో ప్రయాణ సదుపాయం కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ 2016లో ‘క్లీన్‌మై కోచ్’ ఆన్లైన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బోగీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడమే ఈ యాప్ లక్ష్యం. ఇందుకోసం ఆన్‌బోర్డు హౌస్ కీపింగ్ (ఓబీహెచ్ఎస్) సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించే విధంగా ఈ యాప్‌ను మరింత అభివృద్ధి చేసి ‘కోచ్మిత్ర’గా ప్రవేశపెట్టారు. దక్షిణమధ్య రైల్వేలోని 144 రైళ్లలో ప్రస్తుతం ఈ కోచ్మిత్ర మొబైల్ అప్లికేషన్ వినియోగంలో ఉంది. ఈ రైళ్లలోనే 2019లో వివిధ సమస్యలపైన 5203 ఫిర్యాదులు అందాయి. వేలకు వేలు చెల్లించి ఏసీ బోగీల్లో వెళ్లే ప్రయాణికులకు తగిన సేవలు లభించడం లేదు. ఫస్ట్‌ఏసీ బోగీల్లోనే నీళ్లు రావడం లేదని, ఆన్‌బోర్డు హౌస్‌కీపింగ్ సకాలంలో స్పందించకపోవడమే ఇందుకు కారణమని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.‘చాలా సార్లు ఏసీలు పనిచేయవు. ఫ్యాన్లు తిరగవు.ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉండరు. ఒకవేళ ఉన్నా పట్టించుకోకుండా పెడచెవిన పెడతారు. టాయిలెట్లు దుర్గంధంతో కంపు కొడ్తాయి. రాత్రి వేళల్లో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తుంది’ అని హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే ఒక ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశారు. బెంబేలెత్తిస్తున్న బొద్దింకలు... ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో బొద్దింకలు, ఎలకలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏసీ బోగీల్లో ఎలుకలు తరచుగా విద్యుత్ వైర్లను కొరకడంతో షార్ట్‌సర్క్యూట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కోచ్‌లు పరిశుభ్రంగా లేకపోవడంపైనే గతేడాది 876 ఫిర్యాదులు కోచ్‌మిత్రకు అందాయి. ఇక బొద్దింకలు, క్రిమికీటకాలపైన 154 ఫిర్యాదులు వచ్చాయి. యార్డుల్లో రైళ్లు పార్క్ చేసినప్పుడు చెత్తా చెదారంతో పాటు బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. కానీ శుభ్రం చేసేటప్పుడు వీటి గురించి శ్రద్ధ చూపడం లేదు. దీంతో మహిళా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. యాప్ సేవల్లో 10 వేల మంది... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 10 వేల మంది ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో, ఆన్లైన్ ద్వారా కోచ్మిత్ర సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కోచ్‌మిత్రకు ఫిర్యాదు అందిన వెంటనే ప్రయాణికుడికి ఒక కోడ్ నెంబర్‌ను కేటాయిస్తారు. తరువాత ఆన్‌బోర్డు హౌస్‌కీపింగ్ సిబ్బంది వచ్చి సేవలను అందజేస్తారు. ప్రతి నెలా సగటున 433 ఫిర్యాదులు అందుతున్నాయని, 87 శాతం ఫిర్యాదులను అరగంట వ్యవధిలో పరిష్కరిస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. కోచ్మిత్రపైన విస్తృత ప్రచారంచేపట్టినట్లు చెప్పారు. -
అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇక నుంచి అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఇందుకు అవసరమైన మొబైల్ ఎడెడ్ నోట్ ఐడెంటిఫయర్ (ఎంఏఎన్ఐ–మనీ) యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ‘కలర్ బ్లైండ్నెస్, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్లు కూడా గుర్తించేందుకు వీలుగా ఇండియన్ కరెన్సీ నోట్లలో ఇంటాగ్లియో ప్రింటింగ్, స్పర్శ, నోట్ల పరిమాణం, సంఖ్యలు, ఏక వర్ణ రంగులు, నమూనాలు’ వంటివి ఉన్నాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యాప్ ఎలా పని చేస్తుందంటే? యాప్‌లోని కెమెరాను ఆన్ చేసి నోట్ల మీద ఉంచగానే ఈ యాప్ కరెన్సీ నోట్ల మీద ఉండే మహాత్మా గాంధీ బొమ్మను, సిరీస్‌ను లేదా వెనక వైపున ఉండే నోట్ భాగాన్ని గుర్తిస్తుంది. నోట్ విలువ ఎంతనేది హిందీ, ఇంగ్లీష్ భాషలో ఆడియో ద్వారా తెలుపుతుంది. వినికిడి సమస్య ఉన్న వాళ్ల కోసం వైబ్రేషన్స్ ద్వారా కూడా చెబుతుంది. ఈ యాప్ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా పని చేస్తుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ ఆఫ్‌లైన్‌లో, వాయిస్ ఆధారిత అపరేటింగ్ సిస్టమ్ ద్వారా కూడా పని చేయటం ఈ యాప్ ప్రత్యేకతలు. -
‘టిక్‌టాక్’ విశేషాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు సోషల్ మీడియా అన్నింటిలోకెల్లా ‘టిక్ టాక్’ యాప్ భారత్‌లో అతి వేగంగా విస్తరిస్తోంది. వినోద ప్రధానమైన ఈ యాప్‌ను చైనా డెవలపర్ బైట్ డాన్స్ 2017లోనే ప్రవేశపెట్టినప్పటికీ భారత్‌లోకి 2018 జనవరిలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి 2019, ఆగస్టు నాటికి 18 నెలల కాలంలోనే ఇది భారత్‌లోని అన్ని స్మార్ట్ఫోన్లలో 30 శాతానికి విస్తరించింది. దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న వారంతా 18–35 ఏళ్ల లోపు వారవడం విశేషం. వారంతా కూడా టూ టైర్, త్రీటైర్ నగరాలకు చెందిన వారే అవడం మరో విశేషమని ‘కాలాగాటో’ వ్యాపార విశ్లేషణా సంస్థ తెలియజేసింది. ‘టిక్‌టాక్’ వినియోగదారుల్లో అధిక జీతాలు అందుకునే వారు కాకుండా తక్కువ జీతాలు అందుకునే వారే ఎక్కువగా ఉండడం ఇంకో విశేషం. భారత టిక్‌టాక్ యూజర్లలో 52 శాతం మంది నెలకు 25 వేల రూపాయల లోపు సంపాదించేవారే! వీరందరికి ఈ రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో వినోదం లభించడమే కాకుండా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు, తద్వారా తన తోటి సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ‘టాక్‌టాక్’ తోడ్పడుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. జియో కారణంగా ఇంటర్నెట్ ధరలు దిగివస్తున్న పరిస్థితుల్లో ‘టిక్‌టాక్’ రావడం దాన్ని సక్సెస్‌కు ఒక కారణమని చెప్పవచ్చు. టిక్‌టాక్‌లో అతి తక్కువ వీడియో, అంటే 15 సెకండ్ల ఫార్మట్ ఉపయుక్కంగా ఉండడం, ఔత్సాహిక నటులు, డ్యాన్సర్లు, ఇతర పర్ఫామర్లకు తొందరగా గుర్తింపు రావడానికి దోహద పడడం కూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. అన్ని యాప్స్‌కన్నా టిక్‌టాక్ కోసమే భారతీయులు ఎక్కువ సమయాన్ని కేటాయించడం కూడా విశేషమనే చెప్పవచ్చు. ‘లైకీ, ఇన్స్టాగ్రామ్, హెలో, స్నాప్‌చాట్‌లకన్నా ఎక్కువగా యూజర్ సరాసరి 30 నిమిషాలపాటు టిక్‌టాక్‌కు కేటాయిస్తున్నారు. స్నాప్‌చాట్‌కు సరాసరి 9.5 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో ప్రపంచంలో అన్ని యాప్‌లకన్నా ఎక్కువగా టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో 44 శాతం భారత్‌లోనే జరగడం కూడా విశేషమే. టిక్‌టాక్‌కు పోటీగా గత సెప్టెంబర్ నెలలోనే ‘ఫైర్‌వర్క్’ అనే మరో వీడియో షేరింగ్ యాప్ వచ్చింది. సిల్లీ జోకులు, సిల్లీ లిప్ సింకింగ్ వీడియోలను తీసుకోమని స్పష్టం చేసిన ‘ఫైర్‌వర్క్ ఇండియా’ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నాయర్, ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. -
కొత్త యాహూ మెయిల్ ఇన్‌బాక్స్
న్యూఢిల్లీ: యాహూ నూతన వెర్షన్ మెయిల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌ను యూజర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది. నచ్చని ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకునే టూల్‌ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, యాహూ మెయిల్ యాప్ నుంచే జీమెయిల్, అవుట్‌లుక్ వంటి వాటిల్లోకి లాగిన్ అవ్వొచ్చని యాహూ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఐ గురు ఎలా పనిచేస్తుందంటే..
ఐ గురు (iguru) యాప్‌ను సృష్టించి స్కూల్లో చదివే పిల్లలకు, ముఖ్యంగా పేరెంట్స్‌కు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా పిల్లలు– పేరెంట్స్ మధ్య వారధిగా మార్చారు డాక్టర్ హర్షవర్ధన్ కృష్ణ. హాజరు నుంచి లీవ్ లెటర్ వరకు అన్నీ యాప్ ద్వారానే పొందేలా చేశారు. అంతేకాదు.. స్కూలుకు వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారు.. ఇంటికి వచ్చేటప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా సులభంగా తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారు. శ్రీనగర్‌కాలనీ: అతనో డాక్టర్.. విదేశాల్లో పనిచేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఉచిత వైద్య శిబిరాలు వంటి సామాజిక సేవల్లోనూ ముందున్నారు. అయినా ఆయనలో ఏదో వెలితి. తాను పుట్టిన గడ్డకు.. ఇక్కడి సమాజానికి సేవ చేయాలని పరితపించి తిరిగి భారత దేశం వచేంచశారు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న ఆయన పర్యావరణానికి మేలు చేసేందుకు ‘పేపర్’ వినియోగాన్ని తగ్గించాలను నిర్ణయించుకున్నారు. చెట్లను నరికి కాగితాన్ని తయారు చేయడం వల్ల భూతాపం పెరిగిపోయిందని గ్రహించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పేపర్ వాడకం ఎక్కువగా మారిందని అంచనా వేసిన ఆయన ‘పేపర్‌లెస్’ విధానానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దాదాపు అన్ని విధులకు ఉపయోగపడేలా సౌకర్యాలు, హుంగులతో సరికొత్త యాప్‌కు శ్రీకారం చుట్టారు నగరానికి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ కృష్ణ. అంతేకాదు.. ఆ యాప్‌ను స్కూల్స్, కాలేజీలకు ఉచితంగా అందింది టెక్నాలజీ వైపు వారిని మార్చి పేపర్‌లెస్ విధానం అవలంబించేలా చేశారు. ఎంతోమంది పేరెంట్స్‌కు ఉపయోపడే యాప్‌ను అందించిన ఆయన తన ప్రస్థానాన్ని, యాప్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పర్యావరణానికి మేలు చేయాలని.. మాది మహబూబ్‌నగర్ జిల్లా తాండ్ర గ్రామం. ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశాను. విదేశాల్లో 25 సంవత్సరాలు డాక్టర్‌గా సేవలందించాను. పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, సామాజిక సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో దేశీ, విదేశాల్లో నిర్వహించేవాడిని. అయితే, పుట్టిన దేశానికి, సమాజానికి నా వంతు సాయం చేయాలన్న తపన నన్ను వెంటాడేది. అందుకోసం నగరానికి వచ్చేశాను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలో పేపర్ కోసం చెట్లను అధికంగా నరికేస్తున్నారని తెలుసుకున్నాను. అందుకు అనుగుణంగా పేపర్‌లెస్ విధానం తీసుకు రావాలని భావించాను. ‘స్మార్ట్ టెక్నాలజీ’తోనే అది సాధ్యమవుతుందని.. అందుకు ‘ఐ గురు’ యాప్‌ను తయారు చేశాం. ఐ గురు ఎలా పనిచేస్తుందంటే.. స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ఇనిస్టిట్యూషన్స్‌లో పేపర్‌ను పూర్తిస్థాయిలో తగ్గించేలా అన్ని సౌకర్యాలతో ఐగురు యాప్ రూపకల్పన చేశాం. విద్యార్థులకు కాకుండా పేరెంట్స్‌కు ఈ యాప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. స్కూల్‌కు వెళుతూ, తిగిచి వచ్చే పిల్లలు ఎక్కడ ఉన్నారో స్పష్టంగా యాప్ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు యాప్ ద్వారా క్షణాల్లో సెలవును తీసుకోవచ్చు. స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని, పిల్లల చదువుతో పాటు వారి రోజువారి దినచర్యలను ఈ యాప్‌తో తెలుసుకునే ఏర్పాట్లు కల్పించాం. ఇళ్లు, ఫోన్ నంబర్ మారినా సరే.. యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. విద్యార్థులు బోనఫైడ్‌తో పాటు ఎలాంటి సర్టిఫికెట్లను సులువుగా అప్లై చేయవచ్చు. ఫీజులు సైతం వాయిదాల పద్ధతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టవచ్చు. పేరెంట్స్‌కు సింహభాగంగా పెద్దపీట వేసే విధంగా అన్ని హంగులతో యాప్‌ను తయారు చేసి పేపర్‌లెస్ గో గ్రీన్ ఇనిస్టిట్యూషన్స్‌కు అందించాం. సామాజిక దృక్పథంతో స్కూల్స్, కాలేజీలకు ఏడాది పాటు ఉచితంగా యాప్‌ను అందించాం. వందలాది స్కూల్స్‌కు యాప్‌ను ఎలా వాడాలో తెలిపే టీమ్‌తో వారికి అవగాహన కల్పించాం. యాప్‌ను వాడిన ఇనిస్టిట్యూషన్స్ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏడాది తర్వాత కేవలం మెయింటనెన్స్ కోసం ఒక్కో విద్యార్థికి చాలా తక్కువ ఫీజుతో ఈ యాప్‌ను ఇనిస్టిట్యూషన్స్‌కు అందిస్తున్నాం. ఐ–గురు యాప్ వాడిన పేరెంట్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను డాక్టర్‌గా పనిచేసినా ఓ సదుద్దేశంతో చేస్తున్న ఈ పని చాలా సంతృప్తినిస్తోంది.. అంటూ ముగించారు. -
వారెవ్వా ‘వాలెట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఎం–వాలెట్. ఇప్పుడు మరోసారి వాహనదారులంతా దీనిపైనే దృష్టిసారించారు. వివిధ రకాల ధృవపత్రాలను మొబైల్ ఫోన్లోనే భద్రపరుచుకొనే అద్భుతమైన సదుపాయం, డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేకపోవడం, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే వీలుండడంతో వాహనదారులు ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ యాప్ ఉంటే అన్నిరకాల డాక్యుమెంట్లు జేబులో ఉన్నట్లే లెక్క. డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వంటి వివిధ రకాల సర్టిఫికెట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొనేవిధంగా రవాణాశాఖ ఎం–వాలెట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. డాక్యుమెంట్లను ఎం–వాలెట్లో భద్రపరుచుకున్నారు. ఈ వాలెట్‌కు రవాణాశాఖ చట్టబద్ధత కల్పించడంతో అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. ఇటీవల కేంద్రంకూడా ఈ వాలెట్‌ను గుర్తించింది. దీంతో దేశంలో ఎక్కడైనా ఎం–వాలెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ తాజాగా మరోసారి వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా సవరించిన రోడ్డు భద్రతా చట్టం దృష్ట్యా మరో సారి ఎం–వాలెట్‌కు డిమాండ్ ఏర్పడింది. ఒక్క వాలెట్ చాలు... రోడ్డు భద్రత నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంతో వాహనదారులంతా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ ఈ చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల ఉల్లంఘనలపై రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేంద్రం విధించిన జరిమానాలను తగ్గించి అమలు చేసే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త చట్టంకొరడా ఝళిపించే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం జరిమానాలను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న పెనాల్టీల కంటే పెద్ద మొత్తంలోనే భారం పెరగనుంది. దీంతో వాహనదారులు ఇప్పటి నుంచే కొత్త చట్టానికి అనుగుణంగా నిబంధనలను పాటిస్తున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ వంటి వివిధ రకాల డాక్యుమెంట్లపైన కూడా శ్రద్ధ చూపుతున్నారు. దీంతో మూడేళ్ల క్రితమే రవాణాశాఖ అమల్లోకి తెచ్చిన ఎం–వాలెట్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా మారింది. అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పత్రాల రూపంలో ఈ వాలెట్ ద్వారా భద్రపరుచుకుంటున్నారు. గత వారం రోజుల్లో సుమారు 15 వేల మందికి పైగా వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. 33 లక్షలకు పైగా వాహనదారులు మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎం–వాలెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 33.31 లక్షలకు పెరిగింది. ఈ వాహనదారులు 68.81 లక్షల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కువ శాతం డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలు, ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఆ తరువాత పర్మిట్లు, ఫిట్నెస్ పత్రాలను ఎక్కువ మంది తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్ యాప్ ద్వారా భద్రపరుచుకున్నారు. త్వరలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లను కూడా ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. మరోవైపు తమ వాహనాలపైన నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలను సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో చెల్లించే సదుపాయం ఉంది. తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడైనా సరే ఎం–వాలెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో ఈ వాలెట్ వినియోగం బాగా పెరిగింది. ఆన్లైన్ సేవల వినియోగంలో రవాణాశాఖ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రవాణాశాఖలో ఇటీవల కాలంలో స్మార్ట్‌కార్డులకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది, స్టేషనరీ మెటీరియల్ లేకపోవడంతో లక్షలాది స్మార్ట్ కార్డుల ముద్రణ నిలిచిపోయింది. దీంతో ఎం–వాలెట్ వినియోగం మరింత పెరిగిపోయింది. -
ఎస్బీఐ కార్డు మొబైల్ యాప్‌లో ఐఎల్ఏ
ఎస్బీఐ కార్డ్ సంస్థ తన మొబైల్ యాప్‌లోకి చాట్‌బాట్ ఐఎల్ఏ (ఇంటరాక్టివ్ లైవ్ అసిస్టెంట్) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఎస్బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్, బ్యాలన్స్ బదిలీ, క్రెడిట్ కార్డుపై రుణం, ఇతర అకౌంట్ నిర్వహణ ఆప్షన్లు అన్నవి పరిశ్రమలోనే మొబైల్ చాట్‌బాట్ ద్వారా ఆఫర్ చేస్తుండడం మొదటిసారి అని పేర్కొంది. చాట్ బాట్‌పై లైవ్ చాట్ ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా ప్రత్యేకమైన కేసుల్లో పరిష్కారాన్ని నేరుగా కస్టమర్ కేర్ ప్రతినిధి అందించడం జరుగుతుంది. ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్‌పై ఐఎల్ఏ సేవను గతేడాది ప్రవేశపెట్టగా, తాజాగా దీన్ని మొబైల్ యాప్‌నకూ తీసుకొచ్చినట్టు అయింది. -
డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: గస్తీ పేరుతో షికార్లు కొట్టే పోలీసులకు ఇకకాలం చెల్లింది. గస్తీ తిరిగే పోలీసు వాహనాలను కదలికలను గుర్తించేందుకు మొబైల్ యాప్‌ను చెన్నై పోలీస్ ప్రవేశపెట్టింది. దీంతో గస్తీ పేరుతో విధులకు డుమ్మా కొట్టే పోలీసులకు కళ్లెం వేసామని, ఇలాంటి పనిదొంగ పోలీసులు మొబైల్ యాప్‌తో సులభంగా చిక్కిపోతారని ఉన్నతాధికారులు తెలిపారు. చెన్నై నగరం, శివార్లలోని 135 పోలీస్స్టేషన్ల పరిధిలో జనాభాశాతానికి అనుగుణంగా పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ఇందు కోసం ఇన్నోవా, జిప్సీ, బోలెరో తదితర 360 కార్లు, 403 ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ ఆఫీసర్లు తమ పరిధిలో ఇప్పటికే చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్, దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, నేరస్థులు సులువుగా పారిపోయే ప్రాంతాల్లో తమకు కేటాయించిన వాహనాల్లో సంచరిస్తూ నేరాలను అరికట్టాల్సి ఉంది. ఇరుకైన ప్రాంతాల్లో గస్తీకి 250 సైకిళ్లను సైతం ప్రభుత్వం గతంలో కేటాయించింది. అయితే అవన్నీ పర్యవేక్షణ లోపం వల్ల పాత ఇనుప సామన్లకు వేసే స్థితికి చేరుకున్నాయి. గస్తీ తిరగాల్సిన పోలీసులు అధికారిక వాహనాలను మరుగైన ప్రదేశంలో పెట్టేసి సొంత పనులు చక్కబెట్టేందుకు వెళ్లిపోతున్నట్లు ఉన్నతాధికారులకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందాయి. మరికొందరు పోలీసులు సమీపంలోని కల్యాణ మండపాలకు చేరుకుని గురకలు పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొందరైతే పరిసరాల్లో సినిమా హాళ్లలో కూర్చుని చక్కగా ఎంజాయి చేసేస్తున్నారు. గస్తీ పోలీసుల నిర్లక్ష్య వైఖరి దొంగలకు అనువుగా మారింది. దీంతో గస్తీ వాహనాలను మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షించాలని పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ‘మొబైల్ డేటా టెర్మినల్ సిస్టమ్’ (ఎండీటీఎస్) అనే మొబైల్ యాప్‌ను సిద్ధ్దం చేశారు. తొలిదశగా చెన్నై పోలీసు పరిధిలో ప్రయోగాత్మకంగా 360 నాలుగు చక్రాల వాహనాలకు మొబైల్ యాప్ ను అమర్చారు. ఈ కొత్త విధానంపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, గస్తీ విధుల్లో ఉండే పోలీసులకు స్మార్ట్ ఫోన్లను అందజేశామని, వీరంతా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఎండీటీసీ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని తెలిపారు. వారి మొబైల్ ఫోన్లను చెన్నై కమిషనర్ కార్యాలయంలోని కంట్రోలు రూముతో అనుసంధానం చేశాము. దీంతో గస్తీ విధులకు డుమ్మా కొట్టే పోలీసులు సులభంగా దొరికిపోతారు. చార్జింగ్ పెట్టడం మరిచిపోయామని తప్పించుకునే వీలులేకుండా వారికి కేటాయించిన వాహనాల్లో మొబైల్ చార్జింగ్ వసతిని కూడా కల్పించాం. మొబైల్ వినియోగంలో ఉందని పేర్కొంటూ తమ సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసుకుని ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టింగ్ పెట్టాలి. గస్తీ పోలీసులు సరిగా విధులు నిర్వర్తిస్తున్నారా అని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్లను నియమించాం. మొబైల్ యాప్ పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచే తగిన ఆదేశాలు జారీచేస్తూ అవసరమైన సహాయం కోసం సమీపంలోని గస్తీ వాహనాలను ఆయా ప్రదేశాలకు పంపే వీలుకలుగుతుందని ఆయన తెలిపారు. -
‘గే’లి చేస్తే.. గల్లా పడతాం..
సాక్షి, సిటీబ్యూరో :‘గే’లి చేస్తే.. గల్లా పడతాం.. అంటోంది బ్లూడ్ అనే గే సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఇంటా, బయటా, సోషల్ మీడియాలో స్వలింగ సంపర్కలను అవహేళన చేస్తూ, అసభ్యంగా, అశ్లీల కామెంట్లు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తోంది. కొంతకాలంగా స్వలింగ సంపర్కులకు చెందిన ఎల్జిటిబిక్యు కమ్యూనిటీకి మద్దతుగా పనిచేస్తోంది. తాజాగా సిటీలోని సదరు కమ్యూనిటీ సభ్యులకు శుభవార్త చెప్పింది. స్వలింగ సంపర్కుల హక్కులపై అందరిలో అవగాహన కల్పించేందుకు యాంటి సైబర్ బుల్లీయింగ్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ కంట్రీ మేనేజర్ యుజున్ తెలిపారు. దీని కోసం తమ సంస్థ క్వీరిథిమ్, యా డాట్ ఆల్ సంస్థలతో చేతులు కలిపిందని వివరించారు. దీనిలో భాగంగా పలు వీడియోల ఆధారంగా స్వలింగ సంపర్కులపై వేధింపులు, వారి వ్యథలు కూడా చూపించడం కూడా జరుగుతుందన్నారు. అంతేగాకుండా దీంతో పాటు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వాటి కార్యకలాపాలపై కూడా అవగాహన పెంచుతామన్నారు. దీనిపై అదనపు సమాచారం కోసం తమ హెల్ప్‌లైన్ నంబర్లు 97.4554.5559, 60.0903.2883లో సంప్రదించాలన్నారు. -
ఆ ఆరోపణలు నిరాధారమైనవి: టిక్‌టాక్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్–వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థలో భాగమైన టిక్‌టాక్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది. యూజర్ల డేటాను టిక్‌టాక్ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యని లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆరోపించిన నేపథ్యంలో టిక్‌టాక్ తాజా వివరణనిచ్చింది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు చైనాలో లేవని, అక్కడి ప్రభుత్వానికి, చైనా టెలికం సంస్థకు గానీ టిక్‌టాక్ యూజర్ల డేటా లభించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారతీయ యూజర్ల డేటాను అమెరికా, సింగపూర్‌లోని ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్స్‌లో భద్రపరుస్తున్నట్లు టిక్‌టాక్ తెలిపింది. -
ఓఎల్ఎక్స్లో మరిన్ని భద్రతా ఫీచర్లు
హైదరాబాద్: ఆన్లైన్ ప్రకటనల వేదిక ఓఎల్ఎక్స్ వినియోగదారుల భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్లైన్లో సురక్షిత లావాదేవీల నిర్వహణ, సైబర్ భద్రత పట్ల వారిలో అవగాహన కల్పించనుంది. ఉత్పత్తుల ఉన్నతీకరణ, యూజర్ల భద్రత మార్గదర్శకాలు, సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచారం చర్యలను కూడా చేపట్టనుంది. సైబర్ పీస్ ఫౌండేషన్ తో ఓఎల్ఎక్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సైబర్ భద్రతా అవగాహన సదస్సులను తొలిదశ కింద రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించనుంది. యూజర్ల భద్రత కోణంలో ఓఎల్ఎక్స్ యాప్‌లో సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రకటించింది. స్పామ్, హానికారక కంటెంట్ గురించి రిపోర్ట్ చేయవచ్చని తెలిపింది. -
మొబైల్ యాప్స్ నుంచే ఇన్వెస్ట్మెంట్
ఆన్లైన్ షాపింగ్ ఎంత సులభమో... ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా అంతసులభతరం చేస్తున్నాయి కొన్ని మొబైల్ అప్లికేషన్లు (యాప్స్). ఎన్నో స్టార్టప్ సంస్థలు ఇలా వివిధ లక్ష్యాలకు సంబంధించిన యాప్స్‌తో యూజర్ల ముందుకు వచ్చేస్తున్నాయి. ఏ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి..? ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? డెట్ ఫండ్స్‌కు ఎంత కేటాయించాలి..? అన్నది తెలియకపోతే ఆందోళన చెందక్కర్లేదు. ఇటువంటి యాప్స్‌తో సులభంగానే ఆ పని చేసేసుకోవచ్చు. కేవలం మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, ఓపెన్ చేయడం, తర్వాత కొన్ని క్లిక్‌లతో ఒకటి రెండు నిమిషాల్లోపే పనిపూర్తవుతుంది. ఉదాహరణకు ఓ ఇంటి కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాప్‌ను ఓపెన్ చేసి ఎంత కాల వ్యవధి, ఎంత మొత్తం అవసరం అన్న వివరాలను అక్కడ నమోదు చేస్తే చాలు. అలాగే, ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలను యాప్ సంధిస్తుంది. వాటికి సమాధానం ఇచ్చేస్తే... ప్రతీ నెలా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మీ లక్ష్యాలకు సరిపోలే ఈక్విటీ, డెట్ ఫండ్స్ వివరాలను యాప్ సూచిస్తుంది. ప్రతి పథకంలో ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్న సమాచారం కూడా ఇస్తుంది. ఎంపిక చేసుకుని, నెలలో సౌకర్యమైన తేదీ ఇచ్చేస్తే, ప్రతి నెలా ఆ తేదీన సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధమైనట్టే. అయితే వీటిల్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ‘‘ఇవి పరిమిత ఉత్పత్తులనే ఆఫర్ చేస్తాయి. ఒకవేళ మీరు రిటైర్మెంట్ను లక్ష్యంగా ఎంచుకుంటే సంబంధిత వ్యక్తులు అప్పటికే ఈపీఎఫ్, పీపీఎఫ్ పథకాల్లో చేసే పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రణాళికను డిజైన్ చేసి చూపిస్తాయి. రిటైర్మెంట్ ప్రణాళికల్లో ఈపీఎఫ్, పీపీఎఫ్ అన్నవి చాలా ముఖ్యమైనవి’’ అని ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ మ్రిన్ అగర్వాల్ వివరించారు. అన్నీ గోల్ ఆధారితమైనవి కావు... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఇన్వెస్టర్లకు సాయపడే యాప్స్ డజనకు పైనే ఉన్నాయి. వీటిల్లో పేటీఎం మనీ, మొబిక్విక్, జెరోదా కాయిన్, గ్రోవ్ తదితర యాప్స్ ప్రముఖమైనవి. ఈ యాప్స్ డిఫాల్ట్‌గా కొన్ని ఫండ్స్‌ను షార్ట్ లిస్ట్ చేసి బెస్ట్ ఈక్విటీ ఫండ్స్ లేదా డెట్ ఫండ్స్ అంటూ ఆ సమాచారం కనిపించేలా ఉంచుతాయి. వీటిని ఎంచుకునే వారు తమ వంతుగా అధ్యయనం చేసుకోవాలన్నది సలహా. ‘‘లావాదేవీలను సులభతరం చేయడం, నిర్వహించడంపైనే మా దృష్టంతా. యూజర్ సిప్‌ను ఆరంభించేందుకు, తిరిగి దాన్ని సవరించుకునేందుకు ఎటువంటి పేపర్ పని అవసరం ఉండదు. ఇన్వెస్టర్ ఇన్‌స్టంట్‌గా ఈ పని చేసుకోవచ్చు’’ అని అన్నారు గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్‡్షజైన్. ఫిస్డమ్, కువెరా, ఓరోవెల్త్, గోల్వైజ్, స్క్రిప్‌బాక్స్ అనే సంస్థలు లక్ష్యం ఆధారిత ఫండ్స్‌ను సిఫారసు చేయడంతోపాటు, అస్సెట్ అలోకేషన్ సేవలను అందిస్తున్నాయి. ఇన్వెస్టర్ల భిన్న అవసరాలకు అనువైన సాధనాలను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు ఫిస్డమ్ సంస్థ టర్మ్ ఇన్సూరెన్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, డిజిటల్ గోల్డ్ వంటి సేవలను ఆఫర్ చేస్తోంది. ఓరోవెల్త్ అయితే, ఫైనాన్షియల్ ప్లానర్‌తో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. కాకపోతే ఇందుకు కొంత చార్జ్ చెల్లించుకోవాలి. గోల్వైజ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌తో ఉచితంగానే సంప్రదింపులు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు కుటుంబ సభ్యులు అందరికీ కలిపి ఒకటే ఖాతాను అందిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యులందరి పెట్టుబడులను ఒకే ఖాతాతో నిర్వహించుకోవచ్చు. ఆరంభానికి మంచిది... ఆర్థిక ప్రణాళిక అన్నది చాలా విస్తృతమైనది. ఆర్థిక సలహాదారులు అయితే ఓ ప్రణాళికను రూపొందించడంతోపాటు ఏటా దాన్ని సమీక్షించి ఇన్వెస్టర్ల అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సవరిస్తుంటారు. అయితే, చాలా మంది ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్ అన్నది వారి పెట్టుబడుల్లో వచ్చిన లాభాలు, నష్టాల ఆధారంగా మారుతుంటుంది. కనుక సలహాదారులు రిస్క్‌ను తట్టుకునే పోర్ట్‌ఫోలియోను సూచిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాలతో కూడిన పోర్ట్‌ఫోలియోను డిజైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ ఉంటుంది. కానీ, పైన చెప్పుకున్న మొబైల్ యాప్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సమీక్ష, రక్షణ బాధ్యతలకు దూరమేనంటున్నారు నిపుణులు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు తగిన సూచనలు చేసినందుకు గాను ఏటా రూ.15,000 నుంచి రూ.40,000 వరకు చార్జ్ చేస్తుంటారు. మొబైల్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్‌ను ఎక్కువగా వినియోగించే వారిలో అధిక శాతం మిలీనియల్స్ (1981–96 మధ్య జన్మించిన వారు) కావడం గమనించాలి. వీరిలోనూ ఎక్కువ మంది మొదటిసారి ఇన్వెస్టర్లే. ‘‘30 ఏళ్లలోపు వారిలో ఎక్కువ మంది స్వల్పకాల అవసరాల కోసం పొదుపు చేయడానికి కూడా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు పొదుపు విషయంలో సాయపడుతున్నాయి’’ అని వైజ్లీ సీఈవో విజయ్బొబ్బ పేర్కొన్నారు. ఈ సంస్థ యువతను గుర్తించి వారికి స్వల్పకాల అవసరాల (300 రోజుల్లోపు) కోసం పొదుపు చేయడాన్ని ప్రోత్సహిస్తోంది. మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారికి నిజంగానే ఆన్లైన్ ఓ మార్గసూచిగా ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యాప్స్‌లో సేవలపై చార్జీలు చాలా తక్కువ. పోటీ కారణంగా చాలా సంస్థలు ఇప్పటికైతే ప్రాథమిక సేవలను ఉచితంగానే ఆఫర్ చేస్తున్నాయి. చాలా సంస్థలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్లనే అందిస్తున్నాయి. ‘‘వయసు, బాధ్యతలు, ఆదాయం, అవసరాలన్నవి వ్యక్తులను బట్టి మారిపోతుంటాయి. 30 ఏళ్ల పైన వయసు ఉన్న వారిలో ఎక్కువ మందికి సాధారణంగా కుటుంబం ఉంటుంది. వీరికి మరింత సమగ్రమైన ప్రణాళిక అవసరం అవుతుంది. వీరికి పోర్ట్‌ఫోలియో నిర్మాణం అన్నది క్లిష్టమైనది కూడా. ఈ తరహా అవసరాలున్న వారికి ఫోన్ ద్వారా సలహా సేవలను అందిస్తున్నాం. వారి అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సూచనలు చేస్తాం’’ అన్నారు. గోల్వైజ్ డాట్ కామ్ సహ వ్యవస్థాపకుడు అంకుర్చౌదరి. ఫండ్స్ సిఫారసుల పట్ల జాగ్రత్త! దాదాపు అన్ని ఇన్వెస్టింగ్ యాప్స్ భిన్న అంశాల ఆధారంగా ఫండ్స్‌ను విశ్లేషించే అల్గోరిథమ్స్ (సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్)ను వినియోగిస్తున్నాయి. మరి ఈ అంశాల్లో కొంత తేడా ఉన్నా ఫలితం పూర్తి భిన్నంగానూ రావచ్చు. ఉదాహరణకు ఓ ప్లాట్‌ఫామ్, మ్యూచువల్ ఫండ్స్ పథకాల పనితీరు విశ్లేషణకు ఐదేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, మరో ప్లాట్‌ఫామ్ మూడేళ్ల పనితీరునే పరిగణించొచ్చు. ఇలాంటప్పుడు ఫలితం కూడా మారిపోతుంది. మొబైల్ ఇన్వెస్టింగ్ యాప్స్ విషయంలో ఇదే జరుగుతుంటుంది. ఓ వ్యక్తి రిస్క్ ప్రొఫైల్, లక్ష్యం, కాల వ్యవధికి రెండు ప్లాట్‌ఫామ్‌లు భిన్నమైన పథకాలు, అస్సెట్ అలోకేషన్‌ను సిఫారసు చేయవచ్చు. అందుకని, ఫండ్స్ ఎంపికకు పరిగణనలోకి తీసుకున్న అంశాల వివరాలను వెబ్సైట్లో ఇన్వెస్టర్లకు తెలియజేసేలా అందుబాటులో ఉంచడం వంటి పారదర్శకత పాటించే యాప్స్‌ను ఆశ్రయించడం మంచిదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. అలాగే, కొన్ని ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు సిఫారసుల విషయంలో కనీస సూత్రాలను కూడా పాటించకపోవచ్చు. ఉదాహరణకు రెండేళ్ల తర్వాత వెకేషన్ లక్ష్యం కోసం గిల్ట్ఫండ్లో నూరు శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచించొచ్చు. కానీ, గిల్ట్ ఫండ్స్ చాలా అస్థిరతలతో కొనసాగుతుంటాయి. సాధారణంగా వీటిల్లో పెట్టుబడులకు ఆర్థిక సలహాదారులు సిఫారసు చేయరు. ఇలా ఆయా ఇన్వెస్టింగ్ యాప్స్‌ను బట్టి సిఫారసులు భిన్నంగా ఉండొచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక విషయ సమాచారాన్ని తెలుసుకోవడం అవసరమంటున్నారు నిపుణులు. లేదంటే వీటిని నమ్ముకోకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
చీట్స్‌కు చెక్
సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో జరుగుతున్న చిట్ ఫండ్ కంపెనీల మోసాలను కళ్లెం వేసేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ చర్యలు చేపట్టింది. చిట్çఫండ్ కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకునేందుకు దేశంలోనే మొదటిసారి బ్లాక్ చైన్ సిస్టంను అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక ‘టీ–చిట్’ యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్–మేడ్చల్– రంగారెడ్డి జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో నాలుగు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు చిట్ సబ్ రిజిస్ట్రార్ అఫీసుల్లో కార్యకలాపాలను ప్రారంభించింది. వాస్తవానికి చిట్ఫండ్లపై నియంత్రణ చాలా అవసరం. అది లేకపోవంతో ఆయా సంస్థలు మోసాలకు పాల్పడటం, బోర్డు తీప్పేయడం పరిపాటిగా మారింది. కొన్ని చిట్‌ఫండ్స్ సంస్థలు రూ.వందల కోట్లకు ప్రజలను ముంచి బిచాణా ఎత్తేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రైజ్ బిడ్డర్‌కు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ప్రజల సొమ్మును ఇతర అవసరాలకు వాడుకోవడం సర్వసాధారణమైంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ చిట్‌ఫండ్స్‌పై దృష్టి సారించింది. చిట్‌ఫండ్ కంపెనీలన్నింటీని రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి తెచ్చి వాటి ఆటలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. 15 వేల కోట్లపైనే లావాదేవీలు హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు రూ.15 వేల కోట్ల వరకు చిట్ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. నగరం మొత్తం మీద 300 చిట్‌ఫండ్ కంపెనీలు ఉండగా, వాటికి మరో 845 శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రెండువేలకు పైగా గ్రూపులను నిర్వహిస్తున్నారు. చిట్‌ఫండ్ వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఖాతాదారులు తెలుసుకునేందుకు వీలుగా పారదర్శకంగా ఉండాలి. కానీ కంపెనీలు మాత్రం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిస్తూన్నాయనే ఆరోపణలుకు జరుగుతున్న సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. తాజగా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి తెస్తున్నకారణంగా చిట్స్ కంపెనీ పూర్తి వివరాలు, డైరెకర్టర్లు, బ్యాంక్ ఖాతాలు, చిట్స్ గ్రూపులు, ఖాతాదారుల వివరాలు, ప్రతిని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు ఆన్లైన్లో పంపించి ఆమోదం పొందాలి. దీంతో చిట్స్‌ఫండ్ కంపెనీలు మోసాలకు పాల్పడేందుకు వీలుండదని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
మహిళల రక్షణకు ఎయిర్టెల్, ఎఫ్‌ఎల్‌వోల నుంచి యాప్
న్యూఢిల్లీ: మై సర్కిల్ పేరుతో మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే యాప్‌ను భారతీ ఎయిర్టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) విడుదల చేశాయి. కేవలం ఎయిర్టెల్ యూజర్లనే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ యాప్ సాయంతో తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లి ష్, హిందీ సహా 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్ఓఎస్ అలర్ట్స్‌ను పంపించొచ్చని విడుదలైన ప్రకటన తెలిపింది. తద్వారా తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమను చేరుకోవాలని సందేశాన్ని పంపొచ్చని పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐవోఎస్ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. -
ఓట్ల పండగ.. ఇక స్మార్ట్ గురూ..!
సాక్షి, శ్రీకాకుళం: ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ఆధునిక టెక్నాలజీతో జరగనున్నాయి. ఓటరు సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్ చాలా రకాల యాప్‌లను అందుబాటులో తీసుకువచ్చింది. ఓటు నమోదు, నమోదైన ఓటు ఉందో లేదో తెలుసుకోవడం, ఫిర్యాదు చేయడం, ఎన్నికల నియమావళిపై ప్రజల నిఘా, ఇలా పలు అంశాల్లో యాప్‌లను రూపొందించారు. కేవలం అండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి కానీ, ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా దరఖాస్తు, ఫిర్యాదు, సమాచారం ఇచ్చే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ‘నా ఓటు’, ఓటరు సర్వీస్, సమాధాన్, సి విజల్, సుగం, వీవీప్యాట్ వంటి యాప్‌లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ యాప్‌లను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఈ సదుపాయాలు పొందవచ్చు. ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓటు నమోదు కోసం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ యాప్‌ను ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటిలో ఉండే ఓటు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వీసు పోర్టల్ యాప్‌లో మన ఓటు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ధ్రువీకరించిన తరువాత గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి పొందవచ్చు. దీని వల్ల ఓటు నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సీ విజల్ పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన వంటి అంశాలపై ఫిర్యాదు చేయాలంటే ఇంతవరకు నేరుగా అధికారులను కలిసి తెలియజేయాల్సి వచ్చేది. అయితే ఈ ఎన్నికల కమిషన్ రూపొం దించిన సీ విజల్ యాప్ ద్వారా ఉన్నచోట నుంచే ఫిర్యాదు చేయవచ్చు. దీనికి కావాల్సిన ఆధారాలు, ఫొటోలు కూడా అప్పుడే అప్లోడ్ చేయవచ్చు. దీంతో ఆ ఫిర్యాదు అ«ధికారులకు వెంటనే చేరుతుంది. దీని నిర్వహణకు కలెక్టరేట్లో ఒక సెల్ కూడా నిర్వహిస్తారు. ఫిర్యాదులపై వెంటవెంటనే చర్యలు కూడా ఉంటాయి. ‘నా ఓటు’ ఓటరు సెర్చ్ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేస్తే, తొలుత మనకు సంబంధించిన ఓటరు గుర్తింపు నంబర్ వస్తుంది. నియోజకవర్గం పేరు. పోలింగ్ స్టేషన్ వివరాలు వస్తాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలు, పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు మార్గం, తదితర వివరాలు వస్తాయి. సెర్చిలోకి వెళ్లి ఎపిక్ నంబర్ టైప్ చేస్తే దారి చూపుతుంది. దివ్యాంగులకు వాహనాలు కావాలన్నా ఆ యాప్‌లో కోరుకోవచ్చు. సమాధాన్ యాప్ ఎన్నికల సమయంలో ఓటరు సందేహాల నివృత్తికి ఆర్డీవో (ఆర్వో), కలెక్టరేట్ (జిల్లా ఎన్నికల అ«ధికారి)లలో టోల్ ఫ్రీ నంబర్ 1950ను అందుబాటులో ఉంచారు. నేరుగా ఫోన్ చేయడం, ఈమెయిల్, ఎస్ఎంఎస్, ఫ్యాక్స్, తపాలా ద్వారా ఫిర్యాదు, సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ ద్వారా సందేహలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఫిర్యాదుకు సమాచారం అందుతుంది. సువిధ యాప్ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు పలు రకాల ప్రచార కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి గాను అధి కారుల అనుమతి తప్పనిసరి. మాటిమాటికీ కార్యాలయాలకు వెళ్లకుండా ఈ యాప్ ద్వారా వారు పలు అనుమతులు తీసుకోవచ్చు. సుగం యాప్ ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచార నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి రూపొందించిందే సుగం యాప్. ప్రచారం కోసం అభ్యర్థులు, పార్టీలు పోలింగ్ సందర్భంగా అధికారులు వినియోగించే వాహనాల రాకపోకల వివరాలన్నీ ఈ యాప్‌లో నమోదవుతాయి. ఆ వాహనాల్లో ఉన్నవారి వివరాలు, డ్రైవర్ల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఓటర్లు జాబితా సరిచూసుకునే యాప్‌ను కూడా పొందుపరిచారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఓటు హక్కును కల్పించేందుకు ఈఆర్వో నెట్. 20 వెర్షన్ సాఫ్ట్ వేర్‌ను ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టింది. ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను పట్టణ ప్రాంతాల ఓటరు జాబితాలో ఉపయోగించి ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు ఉంటే సంబంధిత ఓటరుకు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక ఓటును తొలగిస్తారు. -
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సీ–విజిల్
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ఓటరు దరఖాస్తు అప్లోడ్ చేయడంతోపాటు.. ప్రచారం, పోలింగ్‌లో అక్రమాలపై ఈ యాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాహనాల నియంత్రణకు కూడా ప్రత్యేక యాప్ వచ్చేసింది. ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన యాప్‌లు..వాటి ఉపయోగాలు ఇవీ.. సి విజిల్ - యాప్‌లో పౌరులు/ఓటర్లు మొబైల్ నంబర్, చిరునామాతో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. - నగదు, మద్యం పంపిణీ, బెదిరింపు, ఆస్తులు పాడుచేయడం మొదలైన వాటిని తన కెమెరాతో మాత్రమే తీసి అప్లోడ్ చేయవచ్చు. గాలరీ నుంచి ఫొటోలను ఇందులో అప్లోడ్ చేయలేరు. ఒకే పర్యాయం 1 నుంచి 2 ఫొటోలు మాత్రమే అప్లోడ్ చేయడానికి వీలుంటుంది. కేవలం 2 నిమిషాల వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయగలుగుతారు. ప్రజలు చేసే ఫిర్యాదులపై 100 నిముషాల్లో ప్రాథమిక నివేదికను, 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తారు. సుగం ఎన్నికల సమయంలో కొందరు రెండు వాహనాలకు అనుమతులు తీసుకుంటే 4 వాహనాలు తిప్పుతున్న సందర్భాలు ఉన్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్నికల యంత్రాంగానికి సుగం యాప్ దోహదపడుతుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారం కోసం వినియోగించే వాహనాలు నిబం ధనలకు లోబడి ఉంటున్నాయో.. లేదో ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ విధిగా అమర్చుకోవాల్సి ఉంది. సువిధ - నామినేషన్ల వరకు రాజకీయ పార్టీలు అనుమతుల కోసం మాన్యువల్‌గా ఆర్వోల నుంచి అనుమతులు పొందవచ్చు. నామినేషన్లు వేసిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనాలు, మైక్సెట్ల వినియోగానికి, బహిరంగసభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించుకోవడానికి, ఇతరత్రా అనుమతులకు సువిధ యాప్ ద్వారా సంబందిత అధికారులకు పంపుకోవచ్చు. దీనిపై 24 గంటల నుంచి 48 గంటల్లో అనుమతులు ఇస్తారు. -
యాప్ యోగం
సాక్షి, సిటీబ్యూరో: ఏ రంగంలోని వారిని చూసినా మానసిక ఒత్తిడి. ఉరుకులు, పరుగుల జీవితం. జీవనశైలిలో మునుపెన్నడూ లేనంతగా మార్పులు. ఈ పరిణామాలతో మానసిక, శారీరక రుగ్మతలు దాడి చేస్తున్నాయి. కాసింత ప్రశాంతత చేకూరే మార్గమే కనిపించడమే కరువయ్యింది. ఈ నేపథ్యంలో యోగాపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇందుకోసం శిక్షణ ఇచ్చే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. బయటికెళ్లి శిక్షణ పొందే సమయం దొరకనివారికి మంచి ఉపాయం అందుబాటులోకిచ్చింది. యోగా నేర్చుకునేందుకు యాప్‌లు వచ్చేశాయి. సమయం వృథా కాకుండా, పెద్దగా ఖర్చేమీ లేకుండా ఆన్లైన్లో వీడియో షేరింగ్ వెబ్‌సైట్స్ ద్వారా యోగా క్లాస్‌లు ఉచితంగా పొందగలిగే వీలుంది. వీటిలో కొన్ని పెయిడ్ యాప్స్ కాగా చాలా వరకుఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒంటికి మంచిదేగా.. యోగా ప్రాధాన్యం తెలిసి, అలవాటు చేసుకుంటే జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగాను దానితో పాటు మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మంచిది. యోగా నేర్చుకోవాలకునే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యోగాను సులువుగా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే అవకాశం ఉంది. యోగా క్లాస్‌లకు రెగ్యులర్‌గా వెళ్లే అవకాశం లేనివారు ఇటువంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్లో అనేక యోగా యాప్స్ ఉన్నప్పటికీ వీటిలో ఉపయోగపడే కొన్ని రకాల చక్కటి యాప్స్‌ను పరిశీలిద్దాం. ఇంటర్నెట్ అవసరం లేకుండానే.. సాధారణంగా యాప్స్ పని చేయాలంటే తప్పకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆఫ్‌లైన్‌లో కూడా యాప్స్‌ను ఉపయోగించేలా యోగా యాప్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా యోగాలో స్టెప్ బై స్టెప్ చేయాల్సిన యోగాసనాల గురించి ఇమేజ్‌ల ద్వారా చక్కగా వివరిస్తుంది. మొదటగా నేర్చుకునే వారికి ఉపయోగపడేలా, నియమాలు లేకుండా పలు రకాల ఆసనాల ఇమేజ్లుంటాయి. దీనివల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి కొంత డబ్బు ఖర్చవుతుంది. తర్వాత ఎటువంటి ఖర్చూ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆసనాల డేటాను ఇమేజ్‌లు సహా అందిస్తుంది. యోగా.కామ్ ఈ యాప్ ద్వారా యోగా క్లాస్‌లను పొందవచ్చు. ఇందులో మొత్తం 300 రకాల యోగాసనాల గురించి వివరణాత్మకంగా తెలుసుకునే వీలుంది. ఈ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు. ఇమేజ్‌లు, డయాగ్రామ్స్, వీడియో డెమోలతో ఈ యాప్ యోగా నేర్చుకోవాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. -
అరచేతిలో ఎన్నికల యాప్స్
సాక్షి, విశాఖపట్నం :ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం వంటిది. ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించడానికి ఎన్నికల సంఘం(ఈసీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కొంటోంది. ఈ నేపథ్యంలోనే యాప్‌లు, సాఫ్ట్వేర్ వినియోగం అందుబాటులోకి తీసుకొచ్చింది. నా ఓటు, సమాధాన్ , మ్యాట్ డాటా, సీ విజిల్,సుగం, మాట్‌దాన్ , సువిధ యాప్‌లతో ఎన్నికల్లోలోటుపాట్లపై ఇంటర్నెట్ ద్వారా ఫిర్యాదుచేయొచ్చు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల ప్రకటనవెలువడిన క్రమంలో ఆయా యాప్‌లపై ఓటర్లు పరిజ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వాటి గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నా ఓటు యాప్ ఓటర్ సెర్చ్ ఆప్షన్ లో డిటెయిల్ఎంటర్ చేస్తే తొలుత మనకుసంబంధించిన ఓటర్ ఐడీ వస్తుంది.నియోజకవర్గం, పేరు, పోలింగ్‌స్టేషన్ వివరాలు వస్తాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది. వలంటీర్ల వివరాలు, పోలింగ్‌స్టేషన్‌కు ఎలా వెళ్లాలి తదితర వివరాలు వస్తాయి. సెర్చ్‌లోకి వెళ్లి ఎపిక్‌నంబర్ కొడితే దారి చూపుతుంది.వికలాంగులకు వాహనాలు రావాలన్నా కోరవచ్చు. ఓటరు వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్.. ఎన్నికల్లో పారదర్శకత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిందే ఓటరు వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్. దీన్నే వీవీ ప్యాట్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఉన్న యంత్రం ఒకటి ఈవీఎంతో పాటు పక్కన ఉంటుంది. ఓటు వేశాక వీవీ ప్యాట్ తెరపై మనం ఏ గుర్తుకు ఎంపిక చేసుకున్నామో కనిపిస్తుంది. ఇది కేవలం 7 సెకన్లు అందుబాటులో ఉంటుంది.ఇది ట్యాంపరింగ్ జరగలేదని ఓటరు నిర్ధరణ చేసుకోవచ్చు. సుగం యాప్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచార నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి రూపొందించిందే సుగం యాప్. ప్రచారం కోసం అభ్యర్థులు, పార్టీలు పోలింగ్ సందర్భంగా అధికా రులు వినియోగించే వాహనాల రాకపోకల వివరాలన్నీ యాప్‌లో నమోదవుతాయి. వినియోగించే వాహనాలు, వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలు ఉంటాయి. ఓటర్ల జాబితాను చూసుకొనే యాప్‌లు కూడా ఉన్నాయి. డబుల్ ఓటుంటే అంతే.. ఏదైన ఒక ప్రాంతంలో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈఆర్వో నెట్.20 వర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం. అధికారులు ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను వివిధ ప్రాంతాల్లో ఓటరు జాబితాలో ఉపయోస్తారు. ఆ తర్వాత నగరంలోని ఓటరు జాబితాలో ఉపయోగించి ఒకే వ్యక్తి పేరిట రెండుఓట్లు ఉంటే సంబంధిత ఓటరుకు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక ఓటును తొలగిస్తారు. సీ విజిల్ .. ఓటర్లను ప్రలోభానికి గురిచేసే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలంటే అధికారులను నేరుగా కలవాల్సిందే. విచారణ జరిపినా ఆధారాలు లభించకపోవచ్చు. ఇప్పుడు ఉల్లంఘన జరిగిన చోటు నుంచి విజిల్ ఊదే సదుపాయం ఎన్నికల సంఘం ఈ యాప్ ద్వారా అందించింది.సీ విజిల్ యాప్‌లో ఉల్లంఘనులకు సంబంధించిన చిత్రాలనుతీసి పంపవచ్చు. నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించాలి. లేదంటే వారే బాధ్యులవుతారు. సమాధాన్ ... ఎన్నికల సమయంలో ఓటర్ల సందేహాల నివృత్తికి అధికారులు ఆర్డీవో, కలెక్టర్ల కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నంబర్ 1950, ఈ మెయిల్, ఫ్యాక్స్,ఎస్ఎంఎస్, తపాలా ద్వారా ఫిర్యాదు చేసే మార్గాలున్నాయి. ఈక్రమంలో ఇప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ ల ద్వారానే సందేహాలను నివృత్తిచేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లో సమాధాన్ యాప్‌ను దిగుమతి చేసుకుని ఆ యాప్ ద్వారా సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించి సమాధానమిస్తుంది. ఓటరు సర్వీసు పోర్టల్ ఓటు నమోదు కోసం నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్ యాప్అందుబాటులోకి తెచ్చింది. మన ఇంట్లోనే ఉండి ఓటునునమోదు చేసుకోవచ్చు. ఈ సర్వీసు పోర్టల్, యాప్‌లో మన ఓటుఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ధ్రువీకరించినతర్వాత గుర్తింపు కార్డుని సర్వీసు పోర్టల్ నుంచి పొందే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఓటు నమోదు చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. -
అదిగో అద్దె గది
సికింద్రాబాద్ స్టేషన్లో బస్సు దిగిన కావ్య.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణంతో బాగా అలసిపోయింది. మాదాపూర్‌లో ఇంటర్వ్యూకి ఇంకా మూడు గంటల సమయం ఉంది. కాసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకుని తర్వాత ఇంటర్వ్యూకి వెళితే బాగుంటుందనుకుంది. కానీ ఆమెకునగరంలో తెలిసిన వారెవరూ లేరు. మరెలా? అవినాష్ ఆఫీస్గచ్చిబౌలిలో ఉంది. వర్క్ కూడా అయిపోయింది. కాసేపట్లో తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి జూబ్లీహిల్స్ వెళ్లాలి. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవకుండా పార్టీకి వెళితే బాగుండదు. కానీ బోడుప్పల్లో ఉన్నఇంటికి వెళ్లి వస్తే పార్టీ సమయం దాటిపోతోంది ఇప్పుడెలా? సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొనేవే. ఇవే కాదు ఇలాంటి మరెన్నో ఇబ్బందులకు సమాధానం తమ ‘పోబైట్’ యాప్ (www.pobyt.co) చెబుతుందంటున్నారు నిఖిల్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా గుర్రాలకు చెందిన ఆయన అమెరికాలో ఉన్నత చదువు, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ ‘పోబైట్’ అని వెల్లడించారు. సింగపూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన నిఖిల్ సోదరుడు నిహాల్‌రెడ్డి, ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ చేసిన భార్య మేఘన కోలన్ కలిసి యాప్ ద్వారా అచ్చంగా క్యాబ్ బుకింగ్ తరహాలో తక్షణ అవసరాల కోసం హోటల్ రూమ్స్ అందిస్తుండడం విశేషం. అవసరమైన వెంటనే బుక్ చేసుకోగలగడంతో పాటు ఎంతసేపు వినియోగిస్తే అంత సమయానికి మాత్రమే డబ్బులు చెల్లించేందుకు వీలుగా నిఖిల్‌రెడ్డి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నిఖిల్, నిహాల్ , మేఘన మారుతున్న అవసరాలకుఅనుగుణంగా.. రియల్ ఎస్టేట్ ధరల పుణ్యమాని సిటీలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది సిటీలో ఉద్యోగాలు చేస్తూ శివార్లలో నివాసముంటున్నారు. దీనివల్ల ఇంటి అద్దె భారం తగ్గినా ఆఫీసులకు ఉద్యోగుల రాకపోకల సమయం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో రిలాక్స్ అవడానికో, రెస్ట్ కోసమో ఇంటికి, ఆఫీసుకి మధ్య కొన్నిసార్లు తాత్కాలిక బస అవసరం అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశాలతో, ఈవెంట్స్‌తో అలసిపోయాక పార్టీలకో, మరేదైన ముఖ్యమైన మీట్కో వెళ్లాల్సి ఉంటే కాసింత ఫ్రెష్ అవడానికి ఏదైనా రూమ్ దొరికితే బాగుండుననిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఏ ఫ్రెండ్‌నో.. బంధువులనో అడగాలంటే సమయానికి వారు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఓ గంట.. రెండు గంటలు రెస్ట్ తీసుకునేందుకు గది దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా హోటల్కువెళితే మాత్రం ఫుల్ డే డబ్బులు చెల్లించాల్సిందే. కిలోమీర్కు ఇంత అని క్యాబ్‌కు చెల్లిస్తున్నప్పుడు.. గది అద్దె కూడా అలా చెల్లించే వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా..! ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ‘పోబైట్’ యాప్. ‘నిమిషాల్లో క్యాబ్‌ని అందించగలుగుతున్నప్పుడు హోటల్ రూమ్‌ని ఎందుకు అందించలేం? అని ఆలోచించాం. కేవలం రిలాక్స్ అవడానికో, రెస్ట్ తీసుకోవడానికో మాత్రమే కాక ఏకాంతంగా ఉండే ప్రదేశంలో కొన్ని గంటల్లో పర్సనల్ కంప్యూటర్ ద్వారా పనులు చక్కబెట్టుకునేవారికి, దూర ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తూ మధ్య ఏదైనా సిటీలో బ్రేక్ జర్నీ చేసేవారికి ఉపయోగపడేలా ఏదన్నా చేయాలనుకున్నాం. అదే ఈ యాప్ ద్వారా అందిస్తున్నాం’ అని చెప్పారు నిఖిల్. ఉభయులకుఅనుకూలంగా.. విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్, ఎయిర్ కండిషన్, వైఫై సేవలు, ఇంకా కావాలనిపిస్తే డ్రింక్స్, స్నాక్స్.. అన్నీ అందించే తాత్కాలిక బస అంటే హోటల్ రూమ్‌ని మించి ఏముంటుంది? ‘కనీసం 3 స్టార్ హోటల్స్ మా ప్రాధాన్యం’ అంటున్నారు నిఖిల్. ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుంటే ఒక లగ్జరీ బెడ్, బాత్‌టబ్ సహా అన్ని సౌకర్యాలను జేబులో పెట్టుకున్నట్టే అంటున్నారాయన. మరోవైపు చాలా నగరాల్లో హోటల్స్ నిర్వాహకులు కూడా రద్దీ సమయాల్లో తప్ప గదులు ఖాళీగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి తమ యాప్ ద్వారా ఆక్యుపెన్సీ, ఆదాయం రెండూ పెరుగుతాయని అంటోందీ బృందం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పలు హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అధికారికంగా వినియోగదారులకు గైడ్ చేసేలా ఆటోవాలాలకు కూడా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. -
‘స్మార్ట్’గా చదివేద్దాం
హిమాయత్‌నగర్ :స్మార్ట్‌ఫోన్.. దీనిపై కొంచెం అవగాహన, మరికొంచెం ఆసక్తి ఉంటే చాలు ప్రపంచం మీ ముందున్నట్లే. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడుగా నిత్య నూతన విషయాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలే తెలుసు.. కానీ నిత్య జీవితంలో, చదువులో ఉపయోగపడే యాప్‌లు కూడా ప్రస్తుతం బోలెడు లభ్యమవుతున్నాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేస్తే చాలు సమస్యలకు సులువుగా పరిష్కారాలు లభిస్తాయి. మార్కెటింగ్, వ్యాపారం, చదువు, ఇలా అనేక రంగాలకు సంబంధించిన యాప్‌లు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడంతో ఆయా రంగాల్లోని ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సహాయకారిగా ఉండే యాప్‌లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. గణితంలో చతుర్విధ ప్రక్రియలు, పరిసరాల పరిజ్ఞానం నుంచి ఇంజినీరింగ్ స్థాయి వరకు, కెమిస్ట్రీ ఈక్వేషన్ల నుంచి అనాటమీ వరకు అనేక యాప్‌లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విద్యారంగానికి సంబంధించిన గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే మంచి రేటింగ్ ఉన్న యాప్స్ సమాచారం మీ కోసం. సైంటిఫిక్ కాలిక్యులేటర్ ఇంటర్ ఎంపీసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సాధారణ కాలిక్యులేటర్లో చేయలేని ఎన్నో క్లిష్టమైన లెక్కలను దీంతో చేసుకోవచ్చు. గుర్తించడానికి కష్టతరమైన గణిత ఫార్ములాలతో పాటు ప్రోగ్రామింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉండడం ఈ యాప్ ప్రత్యేకత. ప్రోగ్రాం స్క్రిప్ట్ చేసుకుని కావాల్సినప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది. మై హోంవర్క్ స్టూడెంట్ ప్లానర్ ఈ యాప్ ఉంటే హోమ్ వర్క్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మర్చిపోయిన విషయాల్ని సైతం రిమైండర్ రూపంలో ఎప్పటికప్పుడు గుర్తించేలా చేస్తుందీ యాప్. స్కూల్ లేదా కాలేజీ తరగతి టైమ్ టేబుల్, పరీక్షల తేదీలు, మార్కులు, ప్రాజెక్టులు తదితర వివరాలు ఈ యాప్‌లో దాచుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది ఒక డిజిటల్ ప్లానర్‌గా ఉపయోగపడుతుంది. యూనిట్ కన్వర్టర్ ఈ యాప్ సహాయంతో దూరం, బరువు, ఉష్ణోగ్రత, స్థలం చుట్టుకొలత, వేగం, కాలం తదితర గణాంకాలను తేలికగా కన్వర్ట్ చేయవచ్చు. ఒక హెక్టారుకు ఎన్ని గజాలు, ఎకరాలు తెలుసుకోవడం చాలా తేలిక. డిగ్రీలను సెల్సియస్, ఫారన్‌హీట్, కెల్లిన్లోకి మార్చుకోవడం, టన్నులను గ్రాములు, మిల్లీగ్రాములు, కిల్చోగ్రాములు వంటి వాటిని సులభంగా చేయవచ్చు. మూలకాల పట్టిక ఈ యాప్ ఉంటే హోమ్ వర్క్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మర్చిపోయిన విషయాల్ని సైతం రిమైండర్ రూపంలో ఎప్పటికప్పుడు గుర్తించేలా చేస్తుందీ యాప్. స్కూల్ లేదా కాలేజీ తరగతి టైమ్ టేబుల్, పరీక్షల తేదీలు, మార్కులు, ప్రాజెక్టులు తదితర వివరాలు ఈ యాప్‌లో దాచుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది ఒక డిజిటల్ ప్లానర్‌గా ఉపయోగపడుతుంది. అనాటమీ లెర్నింగ్(త్రీడీ) మానవ శరీరానికి సంబంధించిన అవయవాల తీరుని తెలుసుకునేందుకు ఉపయోగపడే యాప్ అనాటమీ లెర్నింగ్. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, వివిధ నాడుల పనితీరు, అమరిక తదితర అంశాల్ని త్రీడీ రూపంలో వీక్షిస్తూ తెలుసుకోవచ్చు. ఇందులో స్త్రీ, పురుషుల శరీర భాగాలకు సంబంధించి విడివిడిగా అధ్యయనం చేసుకునేందుకు వీలవుతుంది. మెడిసిన్ విద్యార్థులకు ఈ యాప్ ఉపయుక్తంగా ఉంటుంది. యాప్స్ ఎంతో ఉపయోగకరం ఆన్లైన్లో ఉన్న ఈ యాప్స్ ఎంతో ఉపయోగకరం. ఏదైనా సబ్జెక్ట్‌లో సందేహం ఉంటే స్మార్ట్ ఫోన్ ఆధారంగా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేం కూడా విద్యార్థులకు ఈ యాప్స్ వల్ల ఉన్న ప్రయోజనాలను వివరిస్తున్నాం. నిజంగా ఇటువంటి యాప్స్ వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రయోజనం పొందడం అభినందనీయం. – వి.ఉమామహేశ్వరి, ప్రిన్సిపాల్, జ్యోతివిద్యాలయ హైస్కూల్, బీహెచ్ఈఎల్ -
2 నెలల్లో 200 మంది నియామకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెంటరీ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ మార్గ్ ఈఆర్పీ వచ్చే రెండు నెలల్లో 200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లకి‡్ష్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా పది మంది ఉద్యోగులొస్తారని మార్గ్ ఈఆర్పీ నేషనల్ హెడ్ ప్రితేష్ ప్రభాకర్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మార్గ్ ఈఆర్పీకి 650 మంది ఉద్యోగులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లో కార్యాలయం ఉందని... ఈ ఏడాది చివరి నాటికి విజయవాడలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ‘‘జీఎస్టీ కంటే ముందు దేశంలో 9 లక్షల మంది కస్టమర్లుండేవారు. జీఎస్టీ తర్వాత 2 లక్షల మంది అదనంగా జతయ్యారు. జీఎస్టీ కంటే ముందు తెలంగాణ, ఏపీల్లో 16 వేలుగా ఉన్న కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 24 వేలను దాటింది. ఏడాదిలో ఈ సంఖ్యను 48 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం’’ అని ఆయన వివరించారు. దేశంలో ఏటా 12 వేల అకౌంటింగ్ లైసెన్స్‌లను విక్రయిస్తున్నామని.. ఇందులో 450–500 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పారు. ఒక్క లైసెన్స్ రూ.7,200–25,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఏడాదిలో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్.. ప్రస్తుతం క్లౌడ్ ఆధారిత అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిపై పరిశోదన చేస్తున్నామని.. ఏడాదిలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని పాటిల్ చెప్పారు. మొబైల్, ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్ ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణంలోనైనా వినియోగించుకునే వీలుండటమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.125 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని, ఇందులో రూ.6.5 కోట్లు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.180 కోట్లు లకి‡్ష్యంచామని తెలిపారు. -
వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు ’యోనో’ యూజర్లు!
ముంబై: డిజిటల్ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒకే యాప్ ద్వారా నిర్వహించుకునేలా ’యోనో’ (యూ ఓన్లీ నీడ్ వన్) పేమెంట్ యూప్‌ను అందుబాటులో ఉంచిన ఎస్బీఐ... ఈ యాప్ వినియోగాన్ని వేగంగా విస్తృత పరుస్తోంది. నగదు బదిలీ, డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, డిజిటల్‌గానే బ్యాంక్ ఖాతా ప్రారంభం వంటివి ఇపుడు యోనో ప్రత్యేకతలుగా ఉన్నాయి. ప్రస్తుతం 25 లక్షల మంది యూజర్లు ఉన్న ఈ యాప్ వినియోగదారుల సంఖ్యను వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు చేర్చడానికి లకి‡్ష్యంచామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. యోనో ప్రస్తుతం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌గా ఉందని, దీన్ని త్వరలోనే బడ్డీతో అనుసంధానం చేస్తామని తెలియజేశారు. బుధవారమిక్కడ మోప్యాడ్ (మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైస్) పేరిట పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ పరికరాన్ని ఆరంభించారు. కార్డులు, భారత్ క్యూఆర్, యూపీఐ, ఎస్బీఐ బడ్డీ (ఈ– వాలెట్) ద్వారా ఈ పీఓఎస్ వద్ద చెల్లింపులు చేయొచ్చు. -
ముఖం చూసి పట్టిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ మరో టెక్నాలజీ ఆయుధాన్ని అందిపుచ్చుకుంది. మోస్ట్ వాంటెడ్ నేరస్తులు, పాతనేరస్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఈ యాప్ ఎంతో ఉపకరించనుందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో గురువారం ఈ వ్యవస్థను ఆయన ఆవిష్కరించారు. ఈ సర్వీస్‌ను టీఎస్‌కాప్ యాప్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. 30 సెకన్లలో సర్వర్ నుంచి.. ఈ యాప్‌లో ఇప్పటి వరకు లక్ష మంది పాతనేరస్తుల ఫొటోలు, అదృశ్యమైన వారి ఫొటోలు, దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల ఫొటోలను సైతం చెక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. తనిఖీల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి తారసపడితే సంబంధిత వ్యక్తి ఫొటోను తీసుకొని యాప్‌లో సర్వర్‌కు కనెక్ట్ చేస్తే 30 సెకన్లలో సంబంధిత వ్యక్తి పాతనేరస్తుడైనా, అదృశ్యమైన వ్యక్తి అయినా తెలిసిపోతుందని డీజీపీ తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లోని నేరస్తుల ఫొటోలు, దర్యాప్తు సంస్థల మోస్ట్‌వాంటెడ్, అరెస్ట్‌చేసిన వారి ఫొటోలు అప్డేట్ అవుతాయని, దీంతో ఈ యాప్ టీఎస్‌కాప్‌లోకి అప్డేట్ ఫొటోలను చేరవేస్తుందన్నారు. ఎవిడెన్స్ యాక్ట్ కిందకు రాదు.. ఈ సాంకేతికత ద్వారా గుర్తించిన నిందితుల చార్జిషీట్ దాఖలులో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని డీజీపీ పేర్కొన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం దీన్ని ఆధారం కింద పరిగణించలేమన్నారు. కికీ చాలెంజ్‌పై వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కికీ చాలెంజ్‌పై డీజీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రాణాంతక చాలెం జ్ను ఎవరు స్వీకరించినా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి వల్ల ఇతరుల ప్రాణాలకు హాని ఉందని, చేసే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. -
సాంకేతికతలో మనమే ముందుండాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఏటా 7 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదవుతున్నారు. వారంతా యువకులు కావడంతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఎక్కువ ఉంటుంది. అదే పరిజ్ఞానంతో కొత్త ఓటర్లను ఆకర్షించడంలో సఫలం కావాలి. ఈ విషయంలో రాజ కీయ ప్రత్యర్థి కన్నా మనం ముందుండాలి. వారి వేగాన్ని అందుకునేలా శక్తి యాప్ లో సభ్యులను చేర్పించాలి’అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన శక్తి యాప్ సమీక్ష సమావేశానికి చిదంబరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 2.2 కోట్ల ఓటర్లు ఉన్నారని, వారిలో కనీసం 10% (22 లక్షలు) మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న లక్ష సభ్యత్వాలు చాలా తక్కువని, ›ప్రతి పోలింగ్ బూత్ లో 25 మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. ‘కాంగ్రెస్ నేతల కాళ్లు ఆఫీసుల్లో, సొంత పనుల్లో కాకుండా క్షేత్రంలో ఉండాలి. యాప్ ద్వారా నాయకత్వ స్థాయి నుంచి కింది స్థాయి వరకు సమాచారం వస్తుంది, దీన్ని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆలోగా ప్రతి నెలా 2 లక్షల మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించేలా నేతలు పనిచేయాలి’అని సూచించారు. అత్యధికంగా అంబర్‌పేటలో.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు శక్తి యాప్ చాలా ఉపయోగపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శక్తి యాప్ ప్రాజెక్టును రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీన్ని విజయవంతం చేసేందుకు శ్రద్ధతో పనిచేయాలని కోరారు. పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. యాప్ రాష్ట్ర ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో తెలంగాణలో లక్ష మందిని యాప్ సభ్యులుగా చేర్పించగలిగామన్నారు. అత్యధికంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 13,240 మంది.. కోదాడలో 6,467, హుజూర్‌నగర్‌లో 6,120 మంది యాప్‌లో సభ్యులుగా చేరారని చెప్పా రు. యాప్ నమోదు విషయంలో నేతలు అడిగిన సాంకేతిక సమస్యలకు చిదంబరంతో పాటు ఏఐసీసీ విశ్లేషణ డేటా విభాగం ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి సమాధానాలు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై రాహుల్‌తో చర్చించా: ఉత్తమ్ సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శక్తినివ్వాలనే ఆలోచనతో శక్తి యాప్‌కు రాహుల్ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకే చిదంబరం వచ్చారని వెల్లడించారు. శనివారం తన ఢిల్లీ పర్యటనపై మీడియా ప్రశ్నించగా, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. పలువురు నేతల గైర్హాజరు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులంతా సమావేశానికి హాజరవాలని పీసీసీ నుంచి ఆహ్వానం వెళ్లింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలే హాజరయ్యారు. సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి మాట్లాడాలని గ్రేటర్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌ను కోరగా వీహెచ్ అడ్డుచెప్పినట్లు తెలిసింది. అనంతరం చిదంబరం మాట్లాడుతూ.. యువ నాయకులను తక్కువ అంచనా వేయొద్దని, నేతలందరూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హితవు పలికినట్లు సమాచారం. -
దేశంలో 3 లక్షల మంది రియల్టీ ఏజెంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ టాగోన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ‘గోల్డ్ పిల్లర్’ పేరిట రియల్ ఎస్టేట్ వెబ్, యాప్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన పోలార్ ఐటీ సర్వీసెస్‌కు చెందిన డెవలప్మెంట్ సెంటరే టాగోన్ సాఫ్ట్వేర్. సోమవారమిక్కడ విలేకరులతో పోలార్ ఐటీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ రఘు పాటిబండ్ల మాట్లాడుతూ.. గోల్డ్ పిల్లర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డెవలపర్లు, కస్టమర్లకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో సంఘటిత, అసంఘటిత రంగం కలిపి సుమారు 3 లక్షల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారని వీరందరినీ గోల్డ్పిల్లర్ అప్లికేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఏజెంట్లు, డెవలపర్లు ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవటంతో పాటూ కస్టమర్ల నుంచి లీడ్స్ పొందే వీలుంటుందని తెలియజేశారు. -
నిల్చున్న చోటే నిగ్గుతేలుస్తారు!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు ఓ రోజు రాత్రి సిటీ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన వ్యక్తి కదలికలపై వారికి అనుమానం కలిగి ‘లైవ్ స్కానర్’ద్వారా పరీక్షించారు. ఎలాంటి ‘అలెర్ట్’ రాకపోవడంతో వదిలేశారు. అతడు పొరుగు రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉండటంతో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. ఇలాంటి ఆస్కారం నేరగాళ్లకు ఇవ్వకుండా ఉండేందుకు, మిస్సింగ్, గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులను కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర పోలీసు విభాగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. తమ అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2012 నుంచి రాష్ట్రంలో అరెస్టైన నేరగాళ్లల్లో 50 వేల మంది ఫొటోలతో ఏర్పాటు చేసిన డేటాబేస్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వాంటెడ్ లిస్ట్‌తో దీనిని అనుసంధానించారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ లింకును మరో వారం రోజుల్లో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. లైవ్ స్కానర్లతో... ఇప్పటికే పోలీసు విభాగం అనేక పోలీసుస్టేషన్లకు లైవ్ స్కానర్లు అందించింది. ఇవి అనునిత్యం గస్తీ పోలీసుల వద్ద అందుబాటులో ఉంటున్నాయి. రాష్ట్రంలో అరెస్టైన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్ల వేలిముద్రలను డిజిటలైజ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ బ్యూరో వాటిని ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేసింది. ఈ డేటాబేస్‌ను యాప్ రూపంలో సిబ్బంది స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కనెక్ట్ చేసుకోవడానికి, వేలిముద్రలు తీసుకోవడానికి అనువైన అత్యాధునికమైన స్కానర్లను సైతం పంపిణీ చేశారు. సిబ్బంది తనిఖీ సమయాల్లో అనుమానితుల వేలిముద్రను లైవ్ స్కానర్ ద్వారా సేకరిస్తారు. దీనిని పూర్తిస్థాయిలో సర్వర్ సెర్చ్ చేసి గతంలో ఇతడిపై కేసులు ఉన్నాయా.. ఎక్కడైనా వాంటెడ్‌గా ఉన్నాడా.. అనే విషయం గుర్తిం చి అప్పటికప్పుడే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. లైవ్ స్కానర్ డేటాబేస్‌లో బయటి రాష్ట్రాలకు చెందినవారి వేలిముద్రలు ఉండవు. మరోపక్క అవతలి వ్యక్తి తన వేలిముద్రలను ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతం చేసే ఆస్కారం తక్కువ. ఫొటో తీస్తే సరి... ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి తనిఖీ సిబ్బంది యాప్‌లోని ఈ లింకులోకి వెళ్లి అనుమానిత వ్యక్తిని ఫొటో తీస్తే సరిపోతుంది. డేటాబేస్‌లోని నేరగాళ్ల ఫొటోలను క్షణాల్లో సెర్చ్ చేసి గుర్తిస్తుంది. గతంలో చిన్న, చిన్న నేరాలతో పోలీసు రికార్డులకు ఎక్కిన, కేసులు వీగిపోయినవారికి ఈ డేటాబేస్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 90 శాతం కంటే ఎక్కువ పోలికలు సరిపోయినవారిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తారు. మరికొన్ని అంశాలు సైతం... ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థకు మరో మూడు అంశాలనూ చేరుస్తున్నారు. అంతర్జాతీయ పోలీసు ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సహా అనేక విభాగాలు తమకు వాంటెడ్‌గా ఉన్న వ్యక్తుల వివరాలను ఫొటోలతో సహా అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. ఈ కేటగిరీల నుంచి సేకరించిన ఫొటోలనూ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వీటికి తోడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైనవారి ఫొటోలను డేటాబేస్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడైనా గుర్తుతెలియని మృతదేహం లభించినా, తాను ఎవరో చెప్పుకోలేని స్థితిలో దొరికినా సెర్చ్ చేస్తారు. ఆయా వ్యక్తులు ఎక్కడైనా అదృశ్యమైన వారు అయితే ఆ వివరాలను సర్వర్ గుర్తించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. -
ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుకు యాప్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అక్రమాలపై రహస్యంగా ఫిర్యాదు చేసేందుకు ఓటర్ల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ఎన్నికల కమిషన్ (ఈసీ) రూపొందించింది. ఈ యాప్‌ను వినియోగించి ఎన్నికల సమయంలో విద్వేష ప్రసంగాలు చేస్తున్న, అక్రమంగా డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల వీడియోలు, ఫొటోలను చిత్రీకరించి రహస్యంగా ఈసీకి పంపవచ్చు. ఇంటర్నెట్తో నడిచే యాప్‌నకు సీవిజిల్ (సిటిజెన్స్ విజిల్) అని ఈసీ పేరు పెట్టింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యాప్‌ను తొలిసారి వినియోగించనున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడే ఈ యాప్ పని చేస్తుంది. ‘ఎన్నికల్లో జరిగే అక్రమాల గురించి మాకు తెలియజేసేలా ఫిర్యాదుదారులను ప్రోత్సహించేందుకు.. వారి గుర్తింపు, ఫోన్ నంబర్‌ను గోప్యంగా ఉంచుతాం’ అని ఈసీ తెలిపింది. ‘ఫిర్యాదుదారులు పంపే ఫొటోలు, వీడియోలు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా ట్యాగ్ అవుతాయి. ఈ సమాచారం ఆధారంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘ న జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా నిఘా బృందాలకు ఆదేశాలు జారీ చేస్తాం’ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ‘ఈ యాప్ ద్వారా వీడియో, ఫొటోలను చిత్రీకరించి పంపే వారి ఫోన్లలో ఆయా వీడియోలు, ఫొటోలు సేవ్ కావు. చిత్రీకరించిన ఐదు నిమిషాల్లోగా స్థానికంగా ఈసీ నియమించిన క్షేత్రస్థాయి బృందానికి పంపాలి. దీంతో ఆ బృందాలు వెంటనే సంబంధిత ప్రాంతానికి వెళ్తాయి. ఫిర్యాదు నిజమైతే.. ఫొటో లేదా వీడియో పంపిన ఫిర్యాదుదారుకు 100 నిమిషాల్లోగా సమాచారం వెళ్తుంది’ అని డిప్యూటీ ఈసీ సందీప్ సక్సేనా తెలిపారు. -
మళ్లీ ‘బెల్టు’ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లు మద్యం మార్కెట్‌పై మళ్లీ పట్టు సాధించారు. బెల్టు దుకాణాల ద్వారా ఎమ్మార్పీ ధరలను ఉల్లంఘిస్తూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.40 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను నిండా ముంచుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని బెల్టు దుకాణాల్లో ఫుల్ బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ. 80 అదనంగా వసూలు చేస్తుండగా.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల్లాలోని ఏ4 దుకాణాల్లో క్వార్టర్‌కు రూ. 10, ఫుల్ బాటిల్‌కు రూ. 40 చొప్పున వసూలు చేస్తున్నట్లు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. ఆదివారం ఈ జిల్లాల్లోని 3 దుకాణాల్లో విక్రయాల తీరును ‘సాక్షి’పరిశీలించింది. మద్యం విక్రయాల రేటు 3 జిల్లాల్లో దాదాపు ఒకేలా ఉంది. బెల్టు దుకాణాలపై దాడులు జరగకుండా ఏ4 దుకాణ యజమానులే చూసుకుంటున్నారని, ఇందుకు పోలీసులకు నెలకు రూ. 20 వేలు, ఎక్సైజ్ అధికారులకు రూ. 8 వేల చొప్పన మామూళ్లు ఇస్తున్నారని తెలిసింది. దుకాణాదారుల ‘కొత్త’ రూటు ఎక్సైజ్ శాఖ లిక్కర్ ప్రైస్ యాప్ అమల్లోకి తెచ్చాక ఎమ్మార్పీ ఉల్లంఘనలపై భారీగా ఫిర్యాదు లొచ్చాయి. తొలిరోజుల్లో ఎౖMð్సజ్ ఎన్ఫోర్స్మెంట్ భారీగా దాడులు చేయడంతో దుకాణాదారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఏ4 దుకాణంలో నేరుగా జరిగే విక్రయాల్లో, బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలపై కేసులు పెట్టొద్దని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బెల్టు దుకాణాలకిచ్చే ప్రతి క్వార్టర్ సీసా ఎమ్మార్పీ మీద రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ.40 అదనంగా తీసుకోవడం మొదలైంది. వారం వారం జాతర జరిగే దేవాలయాల పరిధిలోని దుకాణాల నిర్వాహకులైతే ఫుల్ బాటిల్‌కు రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బెల్టు దుకాణదారులు అదనపు సొమ్మకు రెట్టింపు సంఖ్యలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా ‘బెల్టు’లు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా బెల్టు దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.16 వేల కోట్ల మద్యం వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. బెల్టు దుకాణాల నిర్వాహణలో చూసి చూడనట్లుగా ఉండాలని ఎక్సైజ్ బాస్ నుంచి సంకేతాలు వెళ్లడంతో లిక్కర్ సిండికేట్లు రెచిపోతున్నారు. నేరుగా దుకాణాల్లో మద్యం తీసుకునే వినియోగదారులనూ బాదేస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ ఎమ్మార్పీ మీద రూ. 2 అదనంగా తీసుకుంటున్నారు. -
‘జాడ’ను ఇట్టే పట్టేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ గుర్తు తెలియని మహిళ పోలీసులకు కనిపించింది. ఆమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అన్న వివరాలు ఎలా గుర్తించాలో కష్టసాధ్యమైంది. అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన టీఎస్‌కాప్ యాప్ ద్వారా క్షణాల్లో ఆ మహిళ వివరాలన్నీ ఆన్లైన్ ద్వారా తెలిసిపోతాయి. రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన వారి జాబితా, ఫొటోలు టీఎస్‌కాప్ యాప్‌కు అనుసంధానించారు. దీంతోపాటు అదృశ్యమైన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఫొటోలను ట్యాబ్ ద్వారా తీసి ఫేస్ రికగ్నైజేషన్‌తో సరిపోల్చే సౌకర్యాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన మహిళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఇలా ఏళ్ల నుంచి ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియని వారి జాడను టెక్నాలజీ ద్వారా సులువుగా గుర్తించే విధానం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వచ్చింది. ‘వాంటెడ్ క్రిమినల్స్’కి సైతం.. నేరాల నియంత్రణలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో అనుమానిత వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించేందుకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఉపయోగపడుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. నేరాలు జరిగిన ప్రాంతాలను ఇప్పటికే క్రైమ్ హాట్‌స్పాట్స్‌గా గుర్తించింది. అలాగే 70 వేల మందికి పైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను టీఎస్‌కాప్ డేటా సర్వర్లోకి అప్లోడ్ చేశారు. పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో కానీ, నాకాబందీ చేస్తున్న సమయంలో కానీ, వేరే సమయంలో కానీ అనుమానిత వ్యక్తి కనిపిస్తే అతడు పాతనేరస్తుడా.. లేదా కొత్త వ్యక్తా అన్న వివరాలను తెలుసుకునేందుకు ఫేస్ రికగ్నైజేషన్ ఉపయోగపడనుంది. అనుమానితు డిని ట్యాబ్ ద్వారా ఫొటో తీసి టీఎస్‌కాప్ పాత చిత్రంతో పోలుస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తి అయితే వదిలేస్తారు. పాత నేరస్తుడిగా రుజువైతే అదుపులోకి తీసుకొని విచారించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానితులపై ఉన్న పాత కేసులను రికార్డులు తిరగేస్తే కానీ తెలిసేవి కావు. ఈ కొత్త విధానం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఇది కీలకంగా మారుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మూడు రకాల ఆప్షన్లు.. అదృశ్యమైన వారి వివరాలు, వాంటెడ్ క్రిమినల్స్ వివరాలను సరిపోల్చుకునేందుకు మూడు ఆప్షన్స్‌ను టీఎస్‌కాప్ యాప్‌లో క్రోఢీకరిస్తున్నారు. ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది వాంటెడ్ ఆప్షన్, మూడోది మీడియా ఆప్షన్ కింద అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ నేరంలో అరెస్టయినా మీడియా ముందు ప్రవేశపెట్టినప్పటి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేశారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు నిందితుల డేటా అప్డేట్ అవడంతో పాటు అదృశ్యమైన వారి వివరాలు యాప్‌లో ఉండేలా చేస్తున్నారు. -
‘ఇది ఏసీ-సోఫా ధర్నా కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కోసమే తాము పోరాటం చేస్తున్నామని, అంతేకాని సొంత ప్రయోజనాల కోసం ధర్నా చేయడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు కూడా వారి నిరసన కొనసాగుతోంది. కాగా కొన్ని టీవీ చానెళ్లు తమ పోరాటాన్ని ‘ ఏసీ -సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఈ ధర్నా వల్ల వ్యక్తిగతంగా నాకు ఏం ఉపయోగం లేదు. నా కోసమో, నా పిల్లల కోసమో ధర్నా చేయడం లేదు. ఇది సరదా కోసం చేస్తుంది కాదు. కొన్ని టీవీ చానెళ్లు మా నిరసను ‘ ఏసీ సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేసే ధర్నా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరాహార దీక్ష చేస్తోన్న తమ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బలవంతంగా తరలిస్తే మంచి నీళ్లు కూడా తీసుకోం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి తమను బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లను కూడా తీసుకోబోమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే వరకూ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘25 మంది ఇక్కడకు వచ్చారు. వారు మమల్ని తరలించడానికే వచ్చారనుకుంటాను. కానీ మా దీక్ష మాత్రం విరమించేది లేదు. ఒక వేళ మమల్ని బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకో’ అని వీడియోలో తెలిపారు. కాగా బీజేపీ, ఆప్ కలిసి ధర్నా నాటకం ఆడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. పాలనను వదిలేసి ధర్నా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని మండిపడ్డారు. మరో వైపు బీజేపీ కూడా ధర్నాకు దిగింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, నీటి కొరతను తీర్చాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖను కూడా రాశారు. -
‘సీఎం గారు.. ప్లీజ్ బట్టలు మార్చుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నాపై రెబల్ ఎమ్మెల్యే, ఆప్ మాజీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా వ్యంగ్యంగా స్పందించారు. కనీసం బట్టలు అయినా మార్చుకోండంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం గారు.. దయచేసి మీరు, మీ బృందం బట్టలు మార్చుకోండి. అలాగే ఉంటే అనారోగ్యపాలవుతారు. బట్టలు మార్చుకోవద్దని మోదీ ఏం చెప్పలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా తమ ప్రభుత్వ డిమాండ్ల సాధనకు... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నానాలుగో రోజుకు చేరింది. మరో వైపు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్లు ఆమర నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ నివాసం నుంచి గవర్నర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి, భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదికూడా చదవండి కేజ్రీవాల్‌కు షాక్ -
మూడోరోజూ గవర్నర్ ఇంటిముందే సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరోస్తోందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ధర్నాకు దిగిన ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. మూడో రోజు కూడా ధర్నాను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు ధర్నా ఆపేది లేదని బీష్మీంచుకొని కూర్చున్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కాగా తమ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు ట్విటర్లో వీడియోల ద్వారా చేరవేస్తున్నారు. ఢిల్లీ ప్రజల హక్కులను కేంద్రం హరిస్తుందని మండిపడ్డారు. తాము 24 గంటలుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో బైఠాయించినా.. తమతో మాట్లాడేందుకు ఆయన చొరవ చూపడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. మరో వైపు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఢిల్లీ వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, బుధవారం మరో నేత మనీష్ సిసోడియా కూడా నిరాహార దీక్ష చేపట్టారు. -
రైల్వేలు: ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ ఈజీ
సాక్షి, చెన్నై: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రయాణీకులు మరింత చేరువ దిశగా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా రెండు మొబైల్ యాప్‌లను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెన్నైలో లాంచ్ చేశారు. ‘రైల్ మదద్’, ‘మెనూ ఆన్ రైల్స్’ పేరిట రెండు రైల్వే యాప్‌లు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ప్రయాణీకులు ఫిర్యాదులను సమర్పించటానికి రైల్ మదద్ అనుమతినిస్తుండగా, మెనూ ఆన్ రైల్స్ ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఉపయోగడనుంది. రైలు మదద్: ప్రయాణికుల ఫిర్యాదుల కుద్దేశించింది ‘రైల్ మదద్’ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వార సమస్యలపై ప్రయాణికులు రైల్వే శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికుల భద్రత, ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించామని రైల్వే మంత్రి ప్రకటించారు. మెనూ ఆన్ రైల్స్: మెనూ యాప్ సాయంతో ప్రయాణికులు తమకిష్టమైన ఆహారం, పానీయాలు, వాటి ధరలను తెలుసుకోవచ్చు. 96 రకాల బ్రేక్ ఫాస్ట్, ఆహార పదార్థాలు మెనూలో అందుబాటులో ఉన్నాయి. జైన్ ఫుడ్, డయాబెటిక్ ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉంచారు. శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ముందుగా ఆర్డరిస్తే అన్నిరకాల ఆహారపదార్థాలు సప్లయి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు. గత నాలుగేళ్ళలో రైల్వేల అభివృద్ధి గురించి కేంద్రమంత్రి గోయల్, రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా మీడియాతోమాట్లాడారు. 'సాఫ్ నియత్, సహీ వికాస్' అనే దృక్పథంతో పని చేస్తున్నామని, ముఖ్యంగా రైల్వేలో భద్రతకు ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. తద్వారా రైలు ప్రమాదాల సంఖ్యను తగ్గించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. 2013-14లో 118 రైలు ప్రమాదాలు జరగ్గా 2017-18లో వీటి సంఖ్యను 73కు తగ్గించామని మంత్రి వివరించారు. -
రైతు బీమాకు ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు జీవిత బీమా కోసం ప్రత్యేక యాప్‌ను వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) తయారు చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) ట్యాబ్‌ల్లో ఇన్స్టాల్ చేశారు. నామినీ, బీమా దరఖాస్తుల నమూనా ఆధారంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతుబంధు జీవిత బీమా పథకం అమలుకు ఈ నెల 4న ఎల్ఐసీతో వ్యవసాయశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 30 జిల్లాలకు బీమాతో పాటు నామినీ దరఖాస్తులను పంపామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏఈవోలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులోని వివరాలను యాప్‌లో నమోదు చేసి, ఆ సమాచారాన్ని ఎల్ఐసీకి పంపనున్నారు. ఇక, క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఎప్పటికప్పుడు పరిశీలించనున్నది. ఆధార్ కార్డు ఆధారంగా రైతుల వయసును నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జూలై మొదటి తేదీని పుట్టిన రోజుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్‌లో రైతుల సమాచారంతో పాటు ఆధార్ నెంబర్‌ను నమోదు చేయడం వల్ల డూప్లికేషన్‌కు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నమోదు చేస్తున్న వివరాల్లో ఏమైనా మార్పులు చేర్పులుంటే సవరించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. భూ రికార్డుల్లో చేస్తున్న మార్పులకనుగుణంగా సమాచారాన్ని నవీకరించుకునేలా ఆప్షన్లు ఇవ్వనున్నారు. -
కాంగ్రెస్‌కు‘శక్తి’
సాక్షి, రంగారెడ్డి : పార్టీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రస్తుతం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నసామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని మరింత ప్రజల దరికి చేర్చాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో సంస్థాగత కార్యక్రమాలేగాకుం డా సమకాలీన రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని ఏఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ‘శక్తి’ యాప్‌పై పార్టీ నేతలకు జాతీయ కోఆర్డినేటర్ యశ్వంత్ శుక్లా, పార్టీ ప్రతినిధులు స్వప్న, ఆశోక్ వర్గీస్ గాంధీభవన్‌లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, పార్టీ నేతలు నందికంటి శ్రీధర్, రవికుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
15 నిమిషాల్లో యాప్
సాక్షి, సిటీబ్యూరో : మీ వ్యాపారం.. చిన్నదైనా.. పెద్దదైనా.. డిజిటల్, ఆన్లైన్ మాధ్యమంలో స్మార్ట్‌గా వినియోగదారులను చేరేందుకు ఓ వినూత్న మొబైల్యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌గో సంస్థ వినూత్న సృష్టితో కేవలం 15 నిమిషాల్లో మీ వ్యాపారానికి చోదకశక్తిని అందించే మొబైల్‌యాప్‌ను ఈ సంస్థ సృష్టిస్తోంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం యాప్ సిద్ధంచేస్తే రూ.2 వేలు, ఐఓఎస్ మొబైల్స్‌కు సిద్ధం చేస్తే రూ.3 వేలు మాత్రమే చార్జీ చేస్తుండడం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా వెలసిన ఈ అంకుర సంస్థ చిన్నవ్యాపారులకు ఓ వరంలా మారింది. ఉపాధి కల్పన.. పెట్టుబడుల ప్రవాహం.. వినియోగదారులకు అవసరమైన వినియోగ వస్తువుల తయారీ, ఎగుమతుల్లో కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ యాప్ చోదకశక్తిని అందిస్తుండడం విశేషం. ఆయా సంస్థలు తయారుచేస్తున్న ఉత్పత్తులను, వాటి విశిష్టతలు, ధరలు, ఉపయోగాలు, ఇతర ఉత్పత్తులకంటే భిన్నంగా లభ్యమవుతున్న సౌకర్యాలు, రాయితీలపై డిజిటల్ మాధ్యమంలో వినియోగదారులకు సమస్త సమాచారాన్ని అందించడమే మొబైల్యాప్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు వెయ్యి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మొబైల్‌యాప్‌లను సిద్ధం చేయడమే కాదు.. వీటిని గూగుల్ ప్లేస్లోర్లో అందుబాటులో ఉంచారు. యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుల మొబైల్స్‌కు లింక్ రూపంలో పంపిస్తుండడం విశేషం. యాప్‌ల తయారీ, నిర్వహణ బాధ్యతలను రెండింటినీ ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు సుమారు వెయ్యి చిన్న సంస్థలు, 65 బడా సంస్థలు, 475 సూక్ష్మ పరిశ్రమలు, మరో 25 స్టార్టప్‌లకు సంబంధించిన యాప్స్ సిద్ధం చేసినట్లు సంస్థ సీఈఓ రామకుప్ప తెలిపారు. ప్రత్యేకతలివీ.. 15 నిమిషాల్లో మీ వ్యాపారానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను సృష్టిస్తుంది. కృత్రిమ మేధస్సు అనువర్తనాలను వినియోగించుకొని అన్నిరకాల వ్యాపారాలకు అవసరమైన యాప్‌లను సిద్ధం చేస్తుంది. ఉదా: హోటల్స్, రెస్టారెంట్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు మొదలైనవి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మొబైల్‌తోపాటు వెబ్బేస్డ్ యాప్‌లను తక్కువ ఖర్చుతో తయారు చేసి అందిస్తుంది. మొబైల్ ఫస్ట్,లో కోడ్,నో–కోడ్ ప్రత్యేకతలతో ఈ సంస్థ యాప్‌ను సిద్ధంచేస్తుంది. చిన్నవ్యాపారులు మార్కెట్అవకాశాలను విస్తృతం చేసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. మొబైల్, స్థానిక క్లౌడ్, ఆండ్రాయిడ్ అనువర్తనాలు, వెబ్ ఆధారిత అనువర్తనాలను రూపొందించడం. చిన్నవ్యాపారులు ఎవరైనా తేలికగా డిజిటల్ వినియోగదారులకి చేరుకోవడం, మార్కెట్ అవకాశాలను విస్తృతం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. మీకూ కావాలా.. అయితే సంప్రదించండి.. www.ongoframework.com, 040 - 48532121 -
శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘శక్తి’ యాప్‌లో కార్యకర్తలు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల కార్యకర్తలంతా ఓటర్ ఐడీ నంబర్‌ను 7996179961కు ఎస్ఎంఎస్ చేసి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రాహుల్ ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలంతా జూన్ 15 లోపు రిజిస్టర్ చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీ గా కార్యకర్తలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్న పార్టీ.. తాజాగా కార్యకర్తలను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తోంది. దీనికి ‘శక్తి’పేరుతో ప్రత్యేకంగా యాప్ రూపొందించి అన్ని స్థాయిల్లోని కార్యకర్తల వివరాలను నమోదు చేస్తోంది. యాప్ ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారం సులువుగా కార్యకర్తలకు చేరవేయొచ్చని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో యాప్ ద్వారా కార్యకర్తల నమోదు మొదలవగా తెలంగాణలోనూ వెంటనే ప్రారంభించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. -
కింభో కథ కంచికేనా ?
స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి సంస్థ డిజిటల్ రంగంలోనూ తన సత్తా చాటాలనుకుంది. వాట్సాప్‌కి ఈ స్వదేశీ యాప్‌తో సవాల్ విసురుతున్నాం అంటూ కొత్త మెసేజింగ్ యాప్ కింభోను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారత్ మాట్లాడుతోంది అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్ ప్రవేశపెట్టి 24 గంటలు తిరగక ముందే దాని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా కింభో అదృశ్యమైంది. ఈ యాప్‌కి ఏ మాత్రం సెక్యూరిటీ లేదన్న విమర్శలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎందుకు తొలగించారు ? కింభో యాప్ తయారీదారులు పతంజలి కమ్యూనికేషన్స్ దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. పూర్తి స్వదేశీ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ మెసెంజర్ యాప్‌లో పాకిస్తాన్ నటీమణి మావ్రా హోకేన్ ఫోటోను వాడడం ఇబ్బందికరంగా మారింది. అదీ కాకుండా కింభో యాప్ బోలో అన్న యాప్‌కి మక్కీకి మక్కీ కాపీ అంటూ ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తాయి. ఇది స్వదేశీ యాప్ కాదు కాపీ క్యాట్ అంటూ రెండు యాప్‌ల స్క్రీన్షాట్లు పక్క పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల్లో ట్రాల్ కావడంతో దీనిని ప్రస్తుతానికి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ కనిపించకపోవడంపై కింభో సాంకేతిక బృందం వివరణ ఇచ్చింది. తాము ఊహించని దానికంటే అధికంగా స్పందన రావడంతో సర్వర్లు అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ ట్వీట్ చేసింది. కింభో ఒక భద్రతా విపత్తు : ఫ్రెంచి నిపుణులు కింభో యాప్ వచ్చిన ఒక్క రోజులోనే దాని చుట్టూ ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. భద్రతాపరంగా అదొక పైఫల్యాల పుట్ట అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కింభో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని ఫ్రెంచి సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఎలియట్ ఆల్డర్సన్ కింభో యాప్‌ని ఒక పెద్ద జోక్ అంటూ అభివర్ణించారు..‘ కింభో యాప్ నిండా సాంకేతిక లోపాలే ఉన్నాయి. దీనిని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇది అచ్చంగా బోలో అన్న అప్లికేషన్‌కు కాపీలా ఉంది. అంతేకాదు కింభో యాప్ బోలోమెసేంజర్.కామ్‌కి రిక్వెస్ట్ కూడా పంపుతోంది‘ అని అల్డర్సన్ ట్వీట్ చేశారు. ఈ యాప్‌ని వినియోగించే ప్రతీ ఒక్కరికీ తాను యాక్సెస్ అయి వారి మెసేజ్‌లు చదవగలుగుతున్నానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. కింభో ఎలా ఉంది ? కింభో అచ్చంగా వాట్సాప్‌ని తలపించేలా ఉంది. మెసేజింగ్, ఆడియా చాట్, వీడియో కాలింగ్, గ్రూప్స్ ఏర్పాటు, ఫోటోలు వీడియోల షేరింగ్, స్టిక్కర్స్, క్వికీస్, గ్రాఫిక్స్ ఇలా అన్ని రకాల ఫీచర్లతో వాట్సాప్‌ను పోలి ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇంతే కాకుండా సెలిబ్రిటీలను ఫాలో అయ్యే కొత్త ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు. కింభో అంటే సంస్కృతంలో ఎలా ఉన్నారు ? ఏంటి కొత్త విషయాలు ? అని అర్థం. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ యాప్‌కి అందరూ అడిగే మొట్టమొదటి కుశల ప్రశ్న ఎలా ఉన్నారు అన్న అర్థం వచ్చేలా కింభో అన్న పేరు పెట్టారు. ఇక లోగో దగ్గర్నుంచి మిగిలినవన్నీ ఇంచుమించుగా వాట్సాప్ మాదిరిగానే ఉన్నాయి. భారత్‌లో మొట్టమొదటి మెసేజింగ్ యాప్ ఇదే.. ‘ఇది మన స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. వాట్సాప్‌ను సవాల్ చేసేలా ఈ యాప్ డిజైన్ చేశాం.‘ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. తిజరావాలా ట్వీట్ చేశారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడంతో దీని కథ ఇక కంచికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వాట్సాప్ డౌన్లోడ్లు 100 కోట్లు దాటిపోవడంతో, ఎంత స్వదేశీ రంగు పూసినా ఏ మెసేజింగ్ యాప్‌కి వాట్సాప్‌ని ఎదుర్కొనే సత్తా సమీప భవిష్యత్‌లో ఉండదనే అభిప్రాయమైతే వినిపిస్తోంది. -
ఐఆర్సీటీసీలో విమాన టికెట్లు
సాక్షి, ముంబై: భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే.. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారికి చల్లని కబురు చెప్పింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన టికెట్ల బుకింగ్‌పై నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ అధికారిక ట్విటర్ ద్వారా ఈ తీపి వార్తను వినియోగదారులకు అందించింది. వినియోగదారుడు నేరుగా ఐఆర్సీటీసీ ఎయిర్ వెబ్సైట్ (air.irctc.co.in) ద్వారా గానీ ఐఆర్సీటీసీ ఎయిర్ యాప్ ద్వారా విమాన టిక్లెకు బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఇందుకు కేవలం 59 రూపాయల నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని తెలిపింది. ఎలాంటి హిడ్డెన్ చార్జీలు వుండవని స్పష్టం చేసింది. ప్రతి విభాగంలోనూ విమాన టికెట్ల బుకింగ్‌పై భారీ సేవింగ్స్‌ను అందిస్తున్నట్టు తెలిపింది . వినియోగదారుల సౌలభ్యంకోసం 24గంటలు తమ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతేకాదు కస్టమర్ల సమస్యలు, సందేహాల నివారణకోసం 1800110139 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులో ఉంది. అలాగే flights@irctc.co.in. అనే మెయిల్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆన్లైన్ టికెట్ టిక్కెట్లను బుకింగ్ కోసం 50కిపైగా పేమెంట్ ఆప్షన్లను అందుబాటులో ఉన్నాయనీ, దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల నెట్ బ్యాంకింగ్‌తో సహా అన్ని ప్రధాన కార్డుల చెల్లింపుల సౌలభ్యం వెబ్సైట్, యాప్‌లో లభ్యమవుతాయని తెలిపింది. విమాన టికెట్ల బుకింగ్‌లో ఎల్టీసీ (ప్రయాణ రాయితీ) ధరల సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది. దీంతోపాటు టికెట్ కాన్సిలేషన్,బుకింగ్ సదుపాయం సరళీకరణతో యూజర్లకు ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తున్నామని పేర్కొంది. Get the #best #deals on #flight #tickets when you #travel both within #India and #Abroad! Take your family in full-fledged comfort via the #IRCTCAir app, available for both #iOS & #Android! Log on to https://t.co/3j431pWZPj pic.twitter.com/lO2jMh9ZtM — IRCTC (@IRCTCofficial) May 11, 2018 -
వర్షం పడొచ్చు.. గొడుగు పట్టుకెళ్లండి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా అకస్మాత్తుగా మబ్బులు కమ్మి వర్షాలు కురుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వరకు ఎర్రటి ఎండ ఉన్నా కాసేపట్లోనే వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌లో ఎండ వేడి తాళలేకపోతుంటే.. హయత్‌నగర్‌లో వాన దంచి కొడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘గ్రేటర్’ప్రజలకు నగర వాతావరణ వివరాలు తెలిసేలా వాతావరణ శాఖ అనుసంధానించిన సమాచారంతో ‘మై జీహెచ్ఎంసీ’యాప్‌ను అప్డేట్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఐటీ) ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. వర్షం కురిసినపుడు వర్షపాతం, వర్షం కురిసిన ప్రాంతం వివరాలు, ఇతర సమయాల్లో వాతావరణ ఉష్ణోగ్రతల సమాచారం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. వీటితోపాటు రాబోయే 5 రోజుల్లోని వాతావరణ సూచనలు, హెచ్చరికలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. నగరానికి కొత్తగా వచ్చేవారు తామెక్కడున్నామో, ఆ ప్రాంతం జీహెచ్ఎంసీ ఏ సర్కిల్, జోన్ పరిధిలోకి వస్తుందో తెలుస్తుందని, రూ.5 భోజన కేంద్రాలు, ప్లే గ్రౌండ్, పబ్లిక్ టాయ్లెట్లు ఎంత దూరంలో ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. మొత్తంగా 120 సర్వీసులు యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా యాప్‌లో అందుబాటులో ఉండటం తెలిసిందే. -
స్తంభించిన ఐఆర్సీటీసీ సేవలు
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ) సేవలు స్తంభించిపోయాయి. నేటి ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్ irctc.co.in, మొబైల్ ఫోన్ యాప్ ఆగిపోయాయి. ‘నిర్వహణ చర్య వల్ల ఈ-టిక్కెటింగ్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదు. కొద్దిసేపు అయ్యాక ప్రయత్నించండి. క్యాన్సిలేషన్/టీడీఆర్ ఫైల్ కోసం కస్టమర్ కేర్ నెంబర్. 011-39340000,011-23340000 కు కాల్ చేయండి లేదా etickets@irctc.co.in కు మెయిల్ పెట్టండి’ అనే మెసేజ్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో, యాప్‌లో దర్శనమిచ్చింది. అయితే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఏమైనా హ్యాకింగ్‌కు గురైందా? అనే సందేహాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో, యూజర్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, దేశీయ రైల్వేను కోట్ చేస్తూ.. యూజర్లు ట్వీట్లు చేశారు. ఎందుకు వెబ్సైట్, యాప్ పనిచేయడం లేదని ప్రశ్నించారు. యూజర్లు ఇంతలా ప్రశ్నించినప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గానీ, రైల్వే అధికారుల నుంచి గానీ ఇసుమంతైన సమాధానం రాకపోవడం గమనార్హం. అసలేమైందో కూడా వారు తెలుప లేదు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ యథాతథ స్థితికి వచ్చాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌ల్లో నిర్వహణ కార్యకలాపాలను చేపడతామని దేశీయ రైల్వే నుంచి ముందస్తుగా ఎలాంటి ప్రకటన కూడా వెలువడ కాలేదు. ఎలాంటి ప్రకటనలు లేకుండా... ఇలా ఐఆర్సీటీసీ సేవలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 11 గంటల నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ క్రాష్ అయ్యాయి. గంటల కొద్దీ ఐఆర్సీటీసీ సైట్ డౌన్ అయినట్టే చూపించింది. సైట్ లేదా యాప్‌లో టిక్కెట్ క్యాన్సిలేషన్ కూడా అవ్వలేదు. కాగ, మే 2న కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయడం కోసం దేశీయ రైల్వేకి చెందిన ఆన్లైన్ పోర్టల్స్‌ను, ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను రాత్రి 10.45 నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేశారు. కానీ ప్రస్తుతం ఎందుకు ఈ సైట్ క్లోజ్ అయిందో తెలియక యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఏటీఎం కార్డును స్విచాఫ్ చెయ్యండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లో ఫ్యాన్ లేదా లైట్‌కు ఆన్–ఆఫ్ బటన్ ఉన్నట్టే.. చేతిలోని డెబిట్, క్రెడిట్ కార్డులనూ స్విచాఫ్ చేసే వీలుంటే? లేకనేం... ఆగస్టు నుంచి ఈ సరికొత్త సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయ్. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అనుసంధానిత ఈ–షీల్డ్ యాప్‌ను దేశంలో పరిచయం చేస్తోంది ముంబైకి చెందిన ఆటమ్ టెక్నాలజీస్. డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్–ఆఫ్ చేయటం ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్ చెప్పడంతో పాటూ బ్యాంక్‌లకు కస్టమర్ కేర్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని ఆటమ్ సీఈఓ దేవాంగ్ నేరళ్ల ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. స్మార్ట్‌ఫోన్ లేకున్నా సేవల వినియోగం.. వాస్తవానికి ఈ–షీల్డ్ సాంకేతికతను ఆస్ట్రేలియాకు చెందిన ట్రాన్వాల్ అభివృద్ధి చేసింది. మధ్య ప్రాచ్య, ఆఫ్రికాలోని ఐదారు దేశాల్లో వీటిని అందిస్తోంది కూడా. ముంబైకి చెందిన ఆటమ్ టెక్నాలజీస్‌తో ప్రత్యేక ఒప్పందం చేసుకొని భారత్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. భారతీయుల అవసరాలు, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా టెక్నాలజీలో కొద్ది మార్పులు చేశామని దేవాంగ్ తెలిపారు. ఈ–షీల్డ్ ఎలా పనిచేస్తుందంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) అనుసంధానిత యాప్. వాయిస్, చాట్ ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్–ఆఫ్ చేయటమే కాకుండా పరిమిత లావాదేవీలు, ఏరియాల వారీగా, విదేశీ లావాదేవీలనూ నియంత్రించవచ్చు. కార్డు, అకౌంట్ స్టేటస్, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను వినియోగించుకోవ చ్చు. స్మార్ట్‌ఫోన్ లేని కస్టమర్లు ఎస్ఎంఎస్ ద్వారా ఈ–షీల్డ్ సేవలను వినియోగించుకునే వీలుంది. ఈ–షీల్డ్ సేవల కోసం దేశంలోని ఒకటిరెండు ప్రధాన బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు దేవాంగ్ తెలిపారు. ఈ బ్యాంక్‌లకు ప్రతి కార్డుకూ నెలకు రూ.1–3 చార్జీ ఉంటుందని చెప్పారు. రిటైలర్ల కోసం ‘ఎం గల్లా’.. ఒకే వేదికపై అన్ని పేమెంట్ ఆప్షన్లనూ ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే ‘ఎం గల్లా’ రిటైలర్స్ యాప్‌ను దేవాంగ్ ఈ సందర్భంగా విడుదల చేశారు. భారత్ క్యూఆర్, పీఓఎస్, ఐవీఆర్, యూపీఐ, భీమ్, ఆధార్, లింక్ ఆధారిత లావాదేవీల వంటి అన్ని రకాల పేమెంట్లనూ ఎంగల్లా యాప్ నుంచి చేసుకునే వీలుందని చెప్పారాయన. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 5,000 మంది వర్తకులు ఎం గల్లా యాప్‌ను వాడుతున్నారని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 10 వేల మంది వర్తకులకు చేరాలని, నెలకు రూ.200 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని లకి‡్ష్యంచినట్లు ఆయన తెలియజేశారు. ఏటా రూ.50 వేల కోట్ల లావాదేవీలు..: ‘‘ఎండ్ టు ఎండ్ పేమెంట్ సేవలందించే ఆటమ్... 2006లో ప్రారంభమైంది. రిటైల్, ప్రభుత్వ విభాగాలు, డీటీహెచ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం, టెలీకమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో లక్షకు పైగా వర్తకులు ప్రస్తుతం ఆటమ్ సేవలను వినియోగిస్తున్నారు. మొత్తం వర్తకుల్లో 2 వేల మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.1,000 కోట్ల లావాదేవీలు మా ద్వారా జరుగుతున్నాయి. గతేడాది ఆటమ్ వేదికగా రూ.50 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) రూ.85,000–90,000 కోట్ల లావాదేవీలు లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలో 30 లక్షల పీఓఎస్ మిషన్లున్నాయి. వీటిలో 80 వేల మిషన్లను ఆటమ్ నిర్వహిస్తోంది. వచ్చే 6 నెలల్లో మలేషియా, వియత్నాం, ఇండోనేషియా దేశాలకు విస్తరిస్తాం’’ అని దేవాంగ్ వివరించారు. -
విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్
-
అరచేతిలోనే అన్ని సేవలు
సత్తెనపల్లి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీని) లాభాల బాట పట్టించేందుకు, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతోంది. బస్సు ఎక్కడుందో ప్రత్యేక ట్రాకింగ్ ద్వారా తెలుసుకునేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బస్సులు మరమ్మతులు చేసే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు ఇ–వాలెట్ (ఎలక్ట్రానిక్ పర్స్)ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కంప్యూటర్ ద్వారా సెల్ఫోన్లోనూ సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా త్వరితగతిన టికెట్ బుకింగ్, ప్రచార రాయితీలు, ఒక ఇ–వాలెట్ నుంచి వేరొక ఈ – వాలెట్‌కు అదనపు ఖర్చు లేకుండా వేగంగా నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇ–వాలెట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అడ్వాన్సుడు రిజర్వేషన్, టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయడం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ– వ్యాలెట్ ఇలా.. గూగుల్‌ప్లే స్టోర్ నుంచి వ్యాలెట్ యాప్నును డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ అయి మీ ఖాతాను ప్రారంభించాలి. జీరో బ్యాలెన్స్‌తో కూడా ఈ–వ్యాలెట్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. వ్యాలెట్ ఖాతా కలిగి టికెట్ కొనుగోలు చేస్తే టికెట్ ధరపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ప్రయాణికులు ఆర్టీసీకి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ పేజీల ద్వారా నేరుగా తెలియజేయవచ్చు. మొబైల్ యాప్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఎంతో ముఖ్యమైంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్టీసీ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్, రద్దు, ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. లైవ్ ట్రాక్ ఆప్షన్లో ఎక్కాల్సిన బస్ సర్వీస్ నెంబర్ ప్రెస్ చేయడం ద్వారా ఆ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఇలా.. n గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. n ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు. n బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. n అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఇలా.. n గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. n ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు. n బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. n అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. -
ఓలా గూటికి రైడ్లర్ యాప్
న్యూఢిల్లీ: టికెటింగ్, కమ్యూటింగ్ యాప్ రైడ్లర్‌ను క్యాబ్ అగ్రిగేటర్ ఓలా కొనుగోలు చేసింది. మొటిలిటీ ప్లాట్ఫార్మ్ను ప్రజారవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానించే యత్నాలకు ఈ కొనుగోలు తోడ్పాటునందిస్తుందని ఓలా తెలిపింది. రవాణా సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి రైడ్లర్ కొనుగోలు ఉపకరిస్తుందని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. రైడ్లర్లోని 64 మంది ఉద్యోగులు ఓలాలో ఒక భాగమవుతారని, ఇక నుంచి రైడ్లర్ ఏఎన్ఐ టెక్నాలజీస్ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుందని అగర్వాల్ పేర్కొన్నారు. 2012లో ముంబై కేంద్రంగా రైడ్లర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ యాప్‌తో ప్రజా రవాణా ఆప్షన్స్ సెర్చి చేయడం, బుక్ చేయడం చేసుకోవచ్చు. -
ఇక క్షణాల్లో కేసుల నమోదు..
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న నేరాలను అదుపు చేసేందుకు ప్రొటెక్టివ్ పోలీసింగ్‌లో భాగంగా ‘ఈ – పెట్టి’ కేస్ యాప్‌ను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ రవీందర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నపాటి నేరాలకు పాల్పడినవారిపై నేరం జరిగిన స్థలంలోనే పోలీసులు ‘ఈ – పెట్టి’ యాప్ ద్వారా కేసులను నమోదు చేసేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశల మేరకు పెట్టి’ కేసులపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా చిన్నపాటి నేరాలకు పాల్పడుతున్నవారిపై నేరం జరిగిన ప్రాంతంలో కేసులను నమోదు చేయడంతో పాటు నేరానికి గల సాక్ష్యాలను కూడా సేకరించి నేరస్తులకు సంబంధిచిన పూర్తి వివరాలు, ఫొటోలు, డాటా బెస్ ద్వారా పంపిస్తామని తెలిపారు. ట్యాబ్‌లో ఈ అప్లికేషన్ ద్వారా కేసులు నమోదు చేయడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిందితుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు ఉండదని పేర్కొన్నారు. ఫలితంగా నిందితులపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 లా అండ్ అర్డర్ పోలీస్ స్టేషన్లకు చెందిన 147 మంది అధికారులన్లీ ట్యాబ్‌లను అందజేశారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ పూజ, ఏసీపీ మదన్‌లాల్ పాల్గొన్నారు. -
'యూజ్ మీ' ఇట్స్ లోకల్ గురూ!
ఆన్లైన్ కొనుగోళ్లకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రముఖ సంస్థలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి మనకు దగ్గర్లోని దుకాణాలు అందుబాటులో ఉండే యాప్స్ ఉన్నాయా? వాటిలో ధరలు సరిపోల్చుకునే అవకాశం ఉందా? అంటే ఉంది. సరికొత్తగానగరవాసులకు పరిచయమైనయూజ్ మీ యాప్‌తో ఇవి సాధ్యమే. సాక్షి, సిటీబ్యూరో :నగరానికి చెందిన సంజయ్ కప్పగంతుల మెకానికల్ ఇంజినీర్. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో నాలుగేళ్లు పనిచేసి 1999లో అమెరికా వెళ్లాడు. 13ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకొని 2013లో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీ కంటే సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ ఏదైనా తీసుకురావాలని ఆలోచించాడు. ఒక్క ఫోన్‌కాల్‌తో అన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టాడు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత యాప్ రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే జస్ట్ డయల్ లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో ఫీడ్‌బ్యాక్ ప్రధాన సమస్య అని గుర్తించి ‘యూజ్ మీ’ యాప్ రూపొందిచినట్లు సంజయ్ చెప్పారు. యూజర్స్–వెండర్స్ కనెక్ట్.. ‘ఆన్లైన్ సేవల విషయంలో ఇప్పటికే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా పెద్ద దుకాణాలు, ప్రముఖ సేవల సంస్థలే అందుబాటులో ఉంచారు. మన దగ్గర్లోని కిరాణ దుకాణాలు, స్వీట్ షాప్స్, కూల్ డ్రింక్స్, బైక్ మెకానిక్ సెంటర్స్, ప్లంబర్ తదితర అందులో ఉండవు. 70 శాతం మంది ఇలాంటి అవసరాలున్నవారే ఉన్నారు. పైగా వినియోగదారుడికి, దుకాణాదారుకు మధ్య అనుసంధానం ఉండదు. అందుకే ‘యూజ్ మీ’ యాప్ రూపొందించాం. యూజర్స్, వెండర్స్‌ను కనెక్ట్ చేశాం. ప్రస్తుతం చాటింగ్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అందుకే చాట్ ద్వారానే ఈ ప్రకియ పూర్తి చేసేలా యాప్‌ను తీర్చిదిద్దామ’ని సంజయ్ వివరించారు. గల్లీ కొట్టులో కొనుగోలు చేయొచ్చు... ‘ఈ యాప్ సహాయంతో వినియోగదారులకు సమీపంలోని వ్యాపార సంస్థలు, సేవలందించే వాటి వివరాలు జీపీఎస్ ఆధారంగా తెలియజేస్తున్నాం. తద్వారా నచ్చిన సేవలు పొందొచ్చు. సేవలు, వ్యాపార విధానంలో ఇదో విప్లవాత్మక మార్పు. సమీపంలోని కిరాణా దుకాణాలకు ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు కొనుగోలు చేయబోయే వస్తువును ఇతర దుకాణాల్లో ఎంతకు విక్రయిస్తున్నారో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఈ తరహా సేవలందించే వాళ్లు ప్రమోషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా వద్ద 56 కేటగిరీలు, 3 లక్షల వెండర్ల డాటా ఉంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత నెలలో హైదరాబాద్, విజయవాడలో ప్రారంభించాం. మా సేవలకు సానుకూల స్పందన వస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యాప్ తీసుకురానున్నామ’ని చెప్పారు సంజయ్. -
రకుల్ ఇన్ యాప్
తన పేరిట రూపొందించిన యాప్‌ను మంగళవారం నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ఫొటోలకు ఇలా ఫోజులిచ్చారు. జూబ్లీహిల్స్: కూల్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అభిమానులతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు, సినీ విశేషాలు పంచుకునేందుకు తన పేరుతో రూపొందించిన యాప్‌ను ఆమె మంగళవారం ఆవిష్కరించారు. న్యూయార్క్‌కు చెందిన ఎస్కేపెక్స్ టెక్నాలజీస్ దీనిని రూపొందించింది. ఈ సందర్భంగా రకుల్ యాప్‌లో తన ఫొటోలను చూపుతూ కెమెరాకు పోజులిచ్చింది. కార్యక్రమంలో ఎస్కేపెక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షామిక్ తాలూక్దార్ పాల్గొన్నారు. -
లవ్లీ ప్లేయో ఆడేద్దాం యో..యో..
హిమాయత్‌నగర్: ప్రసాద్ బ్యాచ్‌కి క్రికెట్ అంటే ఇష్టం.. జోసెఫ్ అండ్ ఫ్రెండ్స్‌కు టెన్నిస్ అంటే ప్రేమ.. రమేష్‌కు వాలీబాల్ అంటే మక్కువ. చదువుకునే రోజుల్లో స్కూలు, కాలేజీ గ్రౌండ్స్‌లో ఆడుకున్న ఆనందమే.. ఉద్యోగం, వ్యాపారం వంటి వ్యాపకాల్లో పడిపోయాక ఆ అవకాశమే లేకుండా పోయింది. వీకెండ్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడన్నా ఆడుకుని పాత రోజులను గుర్తు చేసుకోవాలనుకున్నా.. మహానగరంలో కుదరనిపని. ఎందుకంటే ఈ బ్యాచ్ గ్రౌండ్స్‌కు వెళ్లేసరికే అక్కడ ఇంకెవరో ఆడుకుంటూ కనిపిస్తారు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఇలాంటి క్రీడాభిమానుల కోరిక నెరవేరుస్తుంది ‘ప్లేయో’ సంస్థ. మీ నగరంలోనే గ్రౌండ్‌ను మేం సెట్ చేస్తాం.. ఆనందంగా ఆడుకోండి అంటోంది. మనకు నచ్చిన ఆటను నగరంలోని ప్రముఖ ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల్లో ఆడుకునే వెసులుబాటును కల్పిస్తోందీ సంస్థ. ఇందుకోసం ఓ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన గౌరవ్ జిత్‌సింగ్, అమిత్ రౌషన్, కార్తీక్ ఇగూర్, దానియా సుహాయిల్, ఉమాశంకర్ వ్యాపారులు. అయితే వీరికి ఆటలంటే చాలా ఇష్టం. వీరి గ్రూప్ ఆడుకునేందుకు అనువైన గ్రౌండ్ లేక ఇబ్బంది పడేవారు. తమ లాగే మెట్రో నగరాల్లో ఎంతోమంది ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గుర్తించిన వీరు.. అన్ని నగరాలను ఓ వేదికగా మార్చి.. ‘ప్లేయో’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆడుకుందామని భావించేవారు ఈ సంస్థను సంప్రదిస్తే అందుబాటులో ఉన్న నగరాల్లో నచ్చిన సమయంలో ఏ గ్రౌండ్ ఖాళీగా ఉందో సూచిస్తుంది. తొలుత బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సేవలు అందించిన ‘ప్లేయో’.. ఇటీవలే మన నగరంలో సైతం తన సేవలను విస్తరించింది. ఆట మీది.. వేదిక మాది.. నచ్చిన సమయంలో ఆట ఆడాలనుకునే వారు ముందుగా ‘p ్చyౌ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిష్టర్ కావాలి. తరువాత సిటీని ఎంచుకుని, ఏయే ఆటలు కావాలో సెలక్ట్ చేసుకోవచ్చు. అధికారికంగా రిజిష్టర్ అయ్యాక ఆడాలనుకున్న వారు ఈ యాప్ ద్వారా గ్రౌండ్‌ను బక్ చేసుకోవచ్చు. గంట, రెండు గంటలు.. ఇలా ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ఆయా గ్రౌండ్స్‌లో ఆడుకునే వెసులుబాటును ‘ప్లేయో’ కల్పిస్తోంది. ఒక్కో క్రీడకు ఒక్కో గ్రౌండ్.. క్రికెట్, ఆర్చెరీ, బాడ్మింటన్, టెన్నిస్, బేస్‌బాల్ అండ్ సాఫ్ట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్లైంబింగ్, ఫీల్డ్హాకీ, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, కరాటే, రోలర్స్పోర్ట్, నెట్‌బాల్, వాలీబాల్.. ఇలా 40కి పైగా క్రీడలు ఆడుకునే వెసులుబాటు ఈ యాప్ అందిస్తోంది. ఈ ఆటలకు అనుసంధానంగా నగరంలోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, ఉప్పల్, యూసుఫ్‌గూడ, మెహదీపట్నం, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు వంటి ప్రాంతాల్లోని ఇండోర్ ఔట్‌డోర్ గ్రౌండ్స్‌ను ఎంచుకున్నారు. ఆటను బట్టి ధరలు.. క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుడ్‌బాల్, టేబుల్ టెన్నిస్‌తో పాటు మరెన్నో ఆటలు ఆ యాప్ ద్వారా ఆడుకోవచ్చు. బ్యాడ్మింటన్.. గంటకు రూ.400, క్రికెట్‌కు టీం మొత్తానికి రూ.1500, ఫుడ్‌బాల్ టీంకు రూ.1000, టేబుల్ టెన్నిస్‌కు రూ.100 చొప్పున చార్జి చేస్తున్నారు. మరింతగా విస్తరిస్తాం సిటీలో ఈ యాప్ ద్వారా చాలామంది ఆటలు ఆడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు కూడా ఈ కాన్సెప్ట్ బాగుందంటున్నారు. రానున్న రోజుల్లో విజయవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభిస్తాం. దీంతో పాటు క్రీడాకారులకు అవసమైన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – రోణక్, హైదరాబాద్ రీజనల్ మేనేజర్ -
పెట్టీ కేసులకు చెక్ పెట్టేందుకు...
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చిన్న చిన్న తగాదాలపై నమోదయ్యే ‘పెట్టీ’కేసులకు చెక్‌పెట్టేలా పోలీస్‌శాఖ ఒక యాప్‌ను రూపొందించింది. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ‘ఈ–పెట్టీ కేసెస్’యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి, పర్యవేక్షించడం వల్ల భవిష్యత్‌లో తీవ్రత కల్గిన నేరాలకు పాల్పడకుండా నియంత్రించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పబ్లిక్ న్యూసెన్స్, బహిరంగ మద్యపానం, రాష్ డ్రైవింగ్, పేకాట వంటి పెట్టీ కేసుల్లో సంఘటనా స్థలం నుంచే చార్జిషీట్ దాఖలు చే సేందుకు యాప్ దోహదపడుతుందని చెప్పా రు. గతంలో ఈ యాప్‌ను హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో అమలు చేయగా పెట్టీ కేసుల సమస్య 35 శాతం తగ్గిందన్నారు. యాప్‌ను ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాల్సి ఉందని, ఇందులో భాగంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లోని అధికారులకు శిక్షణ ఇచ్చి త్వరలోనే అక్కడ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. యాప్ ద్వారా పోలీసులు చేసేవి... ఐపీసీ సెక్షన్లు, సిటీ పోలీస్ యాక్ట్, గేమింగ్ చట్టం, సీఓటీఏపీ–2003 యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసుల నమోదు. ట్యాబ్‌ల ద్వారా ఘటనాస్థలిలో ఫొటోలు, వీడియోలు, వస్తువులు గుర్తించి అప్లోడ్. నేరస్తుడి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆ ప్రాంత జియోట్యాగ్‌ను యాప్‌తో అనుసంధానించడం. సాక్షులను విచారించి ఘటనా స్థలి నుంచే వారి వాంగ్మూలం సేకరణ. కేసు నమోదుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రింట్ నిందితుడికి అప్పగింత. ఆటోమెటిక్ విధానం ద్వారా అప్లోడ్ చేసిన అన్ని వివరాలతో కూడిన చార్జిషీట్ ఈ–ఫైల్ రూపంలో తయారీ. మరుసటి రోజున నిందితుడు తాను స్వీకరించిన కేసు వివరాల రశీదుతో కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. యాప్ వల్ల ప్రయోజనాలు... అవసరం లేకున్నా పెట్టీ కేసులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడవు. పబ్లిక్ న్యూసెన్స్‌కు సంబంధించి హాట్స్పాట్లను గుర్తించడం సులభతరమవుతుంది. పెట్టీ కేసులకు ప్రధాన కారణాలను గుర్తించడం, మరింత తీవ్ర సంఘటనలు జరగకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెరగడంతో శాంతిభద్రతల పరిరక్షణ సులభమవుతుంది. నేనే డయల్ 100కు ఫోన్ చేస్తుంటా... ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించే డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలపై డీజీపీ మహేందర్‌రెడ్డిని మీడియా ప్రశ్నించగా తానే మూడు రోజులకోసారి 100 నంబర్‌కు ఫోన్ చేసి పరీక్షిస్తుంటానని డీజీపీ చెప్పారు. తాను చేసిన సందర్భాల్లో 5 నిమిషాల్లోపే ఘటనా స్థలికి పోలీసులు చేరుకుంటున్నారని వివరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయం 5 నిమిషాల్లోపే ఉంటోందని, అదే విధంగా రాచకొండ, సైబరాబాద్‌లో 10 నిమిషాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ–చలాన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు కూడా పాయింట్ల పద్ధతిని అమలు చేçస్తామన్నారు. యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు డీజీపీలు గోవింద్‌సింగ్, రవిగుప్తా, జితేందర్, రాజీవ్ రతన్, ఐజీలు సౌమ్యా మిశ్రా, సజ్జనార్, మహేశ్ భగవత్, నాగిరెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చోరీ’ సెర్చ్!
మలక్‌పేట ప్రాంతానికి చెందిన ప్రతాప్ ఆన్లైన్లో ఈ–కామర్స్ సైట్ ద్వారా సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. కూకట్పల్లి నివాసి శ్రీకాంత్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి ఓ ద్విచక్ర వాహనం ఖరీదు చేశాడు. ఈ రెండూ చోరీ సొత్తులే కావడంతో కొన్ని రోజుల తర్వాత వీరి వద్దకు వచ్చిన పోలీసులు రికవరీ చేసుకువెళ్లారు. అవి చోరీ వస్తువులని తెలియక కొన్నామని మొత్తుకున్నా ఫలితం లేదు. దీంతో అటు ఖరీదు చేయడానికి వెచ్చించిన డబ్బు, ఇటు వస్తువు రెండూ నష్టపోవాల్సి వచ్చింది. సెకండ్ హ్యాండ్లో ఏదైనా సెల్‌ఫోన్, వాహనం ఖరీదు చేసే ముందు అవి ఎక్కడైనా చోరీకి గురైనవా? కాదా? అని తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం లేని కారణంగానే ఇలా జరిగింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగం ఓ సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. పోలీసు అధికారిక యాప్ ‘హాక్–ఐ’లో ఈమేరకు ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ పేరుతో లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్త వస్తువుల క్రమవిక్రయాలు ఏ స్థాయిలో జరుగుతాయో... సెకండ్ హ్యాండ్ మార్కెట్ సైతం దాదాపు అదే స్థాయిలో ఉంటోంది. తరచు వాహనం/సెల్‌ఫోన్ మోడల్స్‌ను మార్చడం కొందరికి హాబీ కావడంతో పాటు కొత్తవి కొనుగోలు చేసుకునే స్థోమత లేని వాళ్ళూ సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, రామ్‌కోఠి, కింగ్‌కోఠి తదితర ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లు వెలిశాయి. ఇక్కడకు అనునిత్యం అనేక మంది వచ్చి తాము వినియోగిస్తున్న సెల్‌ఫోన్/వాహనం అమ్మేయడమో, సెకండ్ హ్యాండ్‌కు ఖరీదు చేసుకుని వెళ్ళడమో జరుగుతోంది. దీన్ని చోరులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన వాహనాలు/సెల్ఫోన్లను తీసువచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇలాంటి చోరీ సొత్తును ఖరీదు చేస్తున్న వినియోగదారులు రికవరీల సందర్భంలో నిండా మునుగుతున్నారు. యాప్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు... ఇలాంటి వ్యవహారాలను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం చోరీ అయిన సెల్‌ఫోన్/వాహనాల వివరాలతో పాటు గుర్తుతెలియని వాహనాల జాబితాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ వివరాలు ఏదో ఓ చోట ఉండే ప్రయోజనం శూన్యమని, డేటాబేస్ రూపంలో సెర్చ్ ఆప్షన్‌తో ఆన్లైన్ ఏర్పాటు చేసింది. పోలీసు అధికారిక యాప్ ‘హాక్–ఐ’ ద్వారా ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ పేరుతో ఇది ఏర్పాటైంది. నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుల రూపంలో, పోలీసు యాప్ ‘లాస్ట్ రిపోర్ట్’ ద్వారా తమ దృష్టికి వచ్చిన వాహనం/సెల్‌ఫోన్ చోరీలు, పోగొట్టుకోవడాలకు సంబంధించిన రిపోర్టుల్ని క్రోడీకరిస్తున్నారు. వీటిని వాహనాలకు సంబంధించిన ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నెంబర్లతో ఈ సెర్చ్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఖరీదు చేసే ముందు సెర్చ్... మరోపక్క వాహనాలు/సెల్ఫోన్ల పోగొట్టుకున్న వారు సైతం ఈ ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ ద్వారా వాటి వివరాలను డేటాబేస్‌లో పొందుపరచవచ్చు. ఫిర్యాదు చేసినా, ఇలా పొందుపరిచినా తక్షణం ఆ వివరాలు అప్డేట్ అవుతాయి. ఈ డేటాబేస్ హాక్–ఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ వ్యాపారులు తమ వద్దకు ఆయా వస్తువుల్ని అమ్మడానికి వచ్చే వారి నుంచి వీలైనంత వరకు గుర్తింపుకార్డు ప్రతులు, సెల్‌ఫోన్ నెంబర్లని తీసుకుంటున్నారు. నేరగాళ్ళు తెలివిగా వ్యవహరిస్తూ ఇవీ నకిలీవి, తాత్కాలికమైనవి ఇస్తుండటంతో ఆనక ఆయా వస్తువులు చోరీ సొత్తని తెలిసినా వ్యాపారులు, ఖరీదు చేసిన వారు ఏమీ చేయలేక మిన్నకుండిపోవాల్సి వస్తోంది. అయితే ఈ యాప్‌లోని లింకును వినియోగించుకోవడం ద్వారా ఏదైనా సెకండ్ హ్యాండ్ వాహనం/సెల్‌ఫోన్ ఎవరైనా అమ్మడానికి వచ్చినప్పుడు దాని వివరాలు సెర్చ్ చేసి చోరీ సొత్తా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. వినియోగదారులు సైతం సెకండ్ హ్యాండ్‌వి కొనేప్పుడు ఈ సెర్చ్ ద్వారా సరిచూసుకుని ఖరీదు చేసే అవకాశం ఏర్పడింది. రానున్న రోజుల్లో దేశ వ్యాప్త లింకేజ్... ప్రస్తుతం ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ లింకులో నగరంలోని చోరీ వాహనాలు/సెల్ఫోన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన వివరాలు పొందుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు పూర్తయి, లింకేజీ వస్తే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పోలీసుస్టేషన్లలోని వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఓ ప్రాంతం/రాష్ట్రంలో చోరీ చేసి మరో చోట విక్రయించే వారికీ చెక్ చెప్పడానికి అవకాశం లభిస్తుంది. -
న్యాయ సేవలకు సాంకేతికత
సాక్షి, రాజమహేంద్రవరం: న్యాయసేవలకు సాంకేతిక సొబగులు అద్దుతున్నారు. ఇప్పటి వరకు కోర్టు గుమాస్తాలపై న్యాయవాదులు, న్యాయవాదులపై కక్షిదారులు సమాచారం కోసం ఆధారపడేవారు. ఇకపై ఆ సమస్య లేకుండా న్యాయశాఖ ‘ఈ కోర్ట్స్సర్వీసెస్’ ప్రవేశపెట్టింది. ‘సర్వీసెస్.ఈకోర్ట్స్.జీవోవి.ఇన్’ పేరుతో వెబ్సైట్, ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. జాతీయ స్థాయిలో అన్ని కోర్టులను సాంకేతిక పరంగా ఒకే గొడుగుకు కిందకు తెచ్చారు. ఆయా న్యాయస్థానాల్లో పని చేసే న్యాయవాదులు తాము పనిచేసే న్యాయస్థాన ప్రాంతం, పేరు, జన్మించిన తేదీ, ఆధార్ నంబర్, బార్‌కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, కార్యాలయం, నివాసం చిరునామా, ఫ్యాక్స్ నంబర్ సమాచారాన్ని ఆయా న్యాయస్థానాలు సేకరించి ‘ఈకోర్ట్స్సర్వీసెస్’లో నమోదు చేస్తున్నాయి. ప్రతి న్యాయవాదికి ప్రత్యేకంగా సీఎన్ఆర్ నంబర్ కేటాయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఈ ప్రక్రియ పూర్తయింది. న్యాయవాదుల సమాచారంతోపాటు ఆయా న్యాయస్థానాల్లో వారు దాఖలు చేసిన కేసుల సమాచారం, కక్షిదారుడు, అతని ఫోన్ నంబర్, చిరునామా, ఆధార్ తదితర వివరాలతో కేసు నమోదు చేసే సమయంలో కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. కేసు నంబర్‌ను కోర్టు కేటాయిస్తుంది. ఆ కేసు నంబర్‌తో న్యాయవాదులు, కక్షిదారులు తమ ఇంటి నుంచే ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ ద్వారా తమ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? కేసు వాయిదా ఎప్పుడు? తుది విచారణ ఎప్పుడు జరుగుతుంది? ప్రతివాది ఎవరు? వారి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎవరు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. కోర్టులు జారీ చేస్తున్న నోటీసులు కూడా నేరుగా ఆయా న్యాయవాదులు, కక్షిదారులకు చేరుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. గిమ్మిక్కులకు ఇకపై చెక్... ఏదైనా ఒక కోర్టులో దాఖలు చేసిన కేసు వివరాలను దేశంలో ఎక్కడ నుంచైనా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ ఎంతగానో ఉపయోగపడుతోంది. కేసు నంబర్ ద్వారా న్యాయవాది, కక్షిదారు తమ కేసు తాజా స్థితిని ఎక్కడ నుంచైనా తెలుసుకోవచ్చు. కేసు దాఖలు చేయకుండా చేశామని, వాయిదా లేకపోయినా ఫలానా రోజున వాయిదా అంటూ కొంతమంది న్యాయవాదులు గిమ్మిక్కులు చేసి ఫీజు వసూలు చేసేవారు. అయితే ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ వల్ల ఆ గిమ్మిక్కులకు ఇక కాలం చెల్లినట్టయింది. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కక్షిదారులు తమ కేసు విచారణ స్థితిని తెలుసుకోవచ్చు. న్యాయవాదులు తాము దాఖలు చేసిన కేసు ఎప్పుడు వాయిదాకు వస్తుందన్న సమాచారం కోసం కోర్టు గుమస్తాలపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండదు. కేసు వాయిదా ఎప్పుడనేది నేరుగా తమ మొబైల్‌కు సంక్షిప్త సందేశం ద్వారా వస్తుంది. త్వరలో న్యాయవాదులు సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇలా ఏ కోర్టులోనైనా తాము ఉంటున్న ప్రాంతం నుంచే ఆన్లైన్లో కేసులు దాఖలు చేసేలా ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ను అభివృద్ధి పరచనున్నారు. తద్వారా రాజమహేంద్రవరం నుంచే ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. న్యాయవాదులు, కక్షిదారులకు రవాణా, ఇతర ఖర్చులు పెద్ద మొత్తంలో మిగలనున్నాయి. సాంకేతికతఅందిపుచ్చుకోవాలి ఈ కోర్ట్స్ సర్వీసెస్ ద్వారా వేగవంతమైన సేవలు అందుతాయి. అన్ని రంగాల్లో సాంకేతికత పెరుగుతోంది. న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో కేసులు కూడా ఆన్లైన్ ద్వారానే దాఖలు చేసే పరిస్థితి వస్తుంది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ న్యాయవాదులకే గాక కక్షిదారులకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. – ముప్పాళ్ల సుబ్బారావు,రాజమహేంద్రవరం బార్‌కౌన్సిల్‌అధ్యక్షుడు -
ప్రేమికులకు ప్రొ'టెక్'షన్
మళ్లీ ఒక పరువు హత్య! అగ్రకులానికి చెందిన అమ్మాయి దళితుడిని ప్రేమించి, కుటుంబాన్ని ఎదురించి పెళ్లి చేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకొని కుటుంబ పరువు గంగలో కలిపిందని అగ్రహోదగ్రులయ్యారు కుటుంబసభ్యులు. అమ్మాయిని వెదికి, నయానా, భయానా ఇంటికి తీసుకొచ్చి, మూడో కంటికి తెలియకుండా అమ్మాయిని చంపేసి, అబ్బాయి మీద కిడ్నాప్ కేస్ పెట్టారు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన గురించి తమిళ పేపర్లో వార్తగా వచ్చింది. ఇలాంటివి ఈ మధ్య బాగా వింటోంది చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వసుమతి వాసంతి. కుల వివక్ష మీద పెరియార్ రామస్వామి యుద్ధం ప్రకటించిన నేల మీద పరువు హత్యలా? ఇవి అనాగరికమని, ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్లకు తగిన శిక్ష ఉంటుందని 2006లో అపెక్స్ కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది. అయినా ఆగలేదే?! 2013 నుంచి 2017 వరకు నాలుగేళ్లలో 187 పరువు హత్యలు జరిగాయని ఓ రిపోర్ట్ చెప్తోంది. అన్యాయం! ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో వాళ్లను విడదీయడమే కాకుండా చంపడం ఏమిటి? వసుమతి మనసు కలత చెందింది. ఏదైనా చేయాలి... సహపంక్తి భోజనాల ద్వారా కాదు, కులాంతర వివాహాల ద్వారా కులం నశిస్తుంది అని చెప్పాడు అంబేద్కర్. ప్రేమ ఆ పని చేస్తోంది. కానీ సమాజం అడ్డుకుంటోంది. తను అలాంటి ప్రేమికులకు రక్షణ కల్పించాలి. ఏం చేయాలి? ఆలోచించింది. ఈ కాలంలో దేన్నయినా మేడ్ ఈజీ చెస్తున్నవి యాప్సే. గడప దాటకుండానే ప్రపంచాన్ని ఇంట్లో పెడుతున్నాయి. ఈ ప్రేమ పక్షులకు అలాంటి సురక్షితమైన యాప్ గూడును అల్లేస్తే? యెస్.. తట్టింది ఆమెకు. ఆపరేషన్‌లో మునిగింది. పెళ్లి చేస్తారు.. ఇల్లూ చూస్తారు! వసుమతి డెవలప్ చేసిన యాప్ పేరు.. కాదల్ అరణ్. అంటే ప్రొటెక్టర్ ఆఫ్ లవ్. ఇదెలా పనిచేస్తుందంటే.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వలంటీర్స్ ఉంటారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే యూజర్ తన కాంటాక్ట్ వివరాలన్నీ అందులో పొందుపర్చాలి. అలాగే ఆ జంట ఎలాంటి సహాయం కోరుకునుందో కూడా అందులో నమోదు చేయాలి. ఆ సమాచారాన్ని అనుసరించి వలంటీర్స్ ఆ జంటకు ఫోన్ చేస్తారు. వాళ్లున్న పరిస్థితిని బట్టి వారికి అవసరమైన న్యాయ సంబంధమైన, పోలీసుల సహకారం,షెల్టర్.. అంటే అద్దెకు ఇల్లు చూపెట్టడం వంటివి సహాయాన్ని అందిస్తారు. ఇవన్నీ కాక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలోని ముందుంటారు. ‘‘తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఉన్నారు. ఇలా కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు స్వచ్ఛందంగా సహాయం అందించాల నుకునే వాళ్లు మా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇస్తాం’’ అని చెబుతున్నారు వసుమతి వాసంతి. ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో ప్రేమికులను విడదీయడమే కాక చంపిపారేయడం ఏంటి? వసుమతి మనసు కలత చెందింది. ఆ కలతలోంచి వచ్చిన ఆలోచనే.. కాదల్ అరణ్ యాప్! -
అక్రమాలకు యాప్‌తో చెక్..!
సాక్షి, హైదరాబాద్ : బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న భవనాల పరిశీలనకు ప్రత్యేక యాప్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విని యోగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ను తెచ్చిందే అక్రమ నిర్మాణాల కోసం. ఈ అక్రమాల్లోనూ అక్రమాలకు పాల్పడ్డవారు ఎందరో ఉన్నారు. వీరి అక్రమాలను రెగ్యుల రైజ్ చేయకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. బీఆర్ఎస్కు ప్రభుత్వం అనుమతించిన తేదీ (కటాఫ్ తేదీ) తర్వాత నిర్మించిన అక్రమ భవనాలను క్రమబద్ధీకరించకూడదని భావిస్తోంది. దీనికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) సహకారంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సదరు అక్రమ భవనాలను గుర్తించనున్నారు. దీనికోసం ఎన్ఆర్ఎస్ఏ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను వినియోగించనున్నా రు. ఈ యాప్, ఉపగ్రహ ఛాయాచిత్రాలతో కటాఫ్ తేదీ తర్వాత నిర్మించిన భవనాలను, అదనపు అంతస్తులను గుర్తిస్తారు. యాప్ ద్వారా గుర్తిస్తారిలా.. ♦ ప్రస్తుతం తుది దశలో ఉన్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యాక.. వచ్చే నెల నుంచి బీఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ పరిశీలన ప్రారంభించనున్నారు. ♦దరఖాస్తులన్నీ సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో ఉంచుతారు. ♦ క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించి, ప్రస్తుతం ఉన్న నిర్మాణం ఫొటోలను అప్లోడ్ చేసేందుకు ఎన్ఆర్ఎస్ఏ రూపొందించిన యాప్‌ను వినియోగిస్తారు. ♦ఉదాహరణకు ఒక దరఖాస్తును ఆన్లైన్లో పరిశీలించిన అధికారులు.. సదరు వివరాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. దరఖాస్తులో పేర్కొన్న భవనాన్ని వివిధ కోణాల్లో ఫొటోలు తీసి, యాప్‌లో అప్లోడ్ చేసి ఎన్‌ఆర్‌ఎస్‌ఏకు పంపిస్తారు. ♦ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ఎన్ఆర్ఎస్ఏ సదరు భవనం కటాఫ్ తేదీకి ముందు నిర్మించినదేనా.. లేక ఆ తర్వాత ఏవైనా అదనపు అంతస్తులు నిర్మించారా.. కటాఫ్ తర్వాతే మొత్తం భవనం నిర్మించారా తదితర వివరాలను గుర్తిస్తుంది. ఆ వివరాలు సీజీజీ ద్వారా జీహెచ్ఎంసీకి తెలుస్తాయి. ♦కటాఫ్ తేదీకి ముందు నిర్మించిన వాటికి నిర్ణీత పెనాల్టీలు విధించి క్రమబద్ధీకరిస్తారు. కటాఫ్ తర్వాత నిర్మించినవైతే కూల్చేస్తారు. ♦ పదేళ్ల క్రితం బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) అమలు చేసినప్పుడు కటాఫ్ తేదీ తర్వాత నిర్మించిన భవనాలెన్నో రెగ్యులరైజ్ అయ్యాయి. పలువురు బిల్డర్లు, కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు కుమ్మకై కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దీంతో బీఆర్ఎస్లో అది పునరావృతమవకుండా చర్యలు చేపట్టారు.యాప్ వినియోగంపై టౌన్ ప్లానింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు. కటాఫ్ తేదీ తర్వాత కూడా.. నగరంలో అక్రమ భవనాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015లో బీఆర్ ఎస్‌ను ప్రకటించింది. ఆ ఏడాది అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఆ తేదీలోగా అక్రమ భవనాలు లేని వారు సైతం బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని, ఆ తర్వాత అడ్డదిడ్డంగా భవనాలు నిర్మించారు. బీఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరిస్తారని, కటాఫ్ తేదీ తర్వాత సైతం అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు. ఇలా ఎన్నో అదనపు అంతస్తుల నిర్మాణం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు.. అలాం టి వాటిని క్రమబద్ధీకరించకుండా ఎన్ఆర్ఎస్ఏ సహకారం తీసుకుంటున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ప్రత్యేక యాప్‌ను వినియోగించి కటాఫ్ తేదీ తర్వాత నిర్మించిన అదనపు అంతస్తులు, భవనాలు గుర్తిస్తారు. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించరు. వాటిని కూల్చేయాల్సిందిగా సంబంధిత యజమానులకు నోటీసులిస్తారు. వారు కూల్చివేయని పక్షంలో జీహెచ్ఎంసీయే కూల్చివేసి, ఆ మేరకు చార్జీలు వసూలు చేయనుంది. జీహెచ్ఎంసీలో నివాస భవనాలు దాదాపు - 12,50,000 నివాసేతర భవనాలు దాదాపు - 2,75,000 బీఆర్ఎస్కు అందిన మొత్తం దరఖాస్తులు - 1,21,019 -
ఇదిగో ఇంటర్సెంటర్
నేరేడ్మెట్: ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునేందుకు వీలుగా ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్ బోర్డు రూపొందించిన ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమ పరీక్ష కేంద్రానికి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ఎగ్జామ్ సెంటర్ లోకేటర్గా పిలుస్తున్న ఈ యాప్ (tsbie exam center locator 2018) ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్‌లో విద్యార్థి తన హాల్ టికెట్ నంబర్‌ను ఎంట్రీ చేసి క్లిక్ చేస్తే వెంటనే పరీక్ష కేంద్రం ఫోటో, పూర్తి వివరాలు వస్తాయి. కింది భాగంలో డైరెక్షన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పరీక్ష కేంద్రానికి రూట్ మ్యాప్ కన్పిస్తుంది. ఎన్ని కి.మీ.దూరంలో సెంటర్ ఉంది..ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు తదితర సమాచారం తెలుసుకునేందుకు విద్యార్థులకు వీలు కలుగుతుంది. -
యాప్‌కీ కహానీ...
మీకు వచ్చే జీతంలో మీరు ప్రతి నెల ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అలాగే మీ ఖర్చులను వేటి కోసం అధికంగా చేస్తున్నారో ట్రాక్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి తికమక, గందరగోళం లేకుండా సులభంగా మీ ఆర్థిక లావాదేవీలపై పట్టు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారా? అయితే ఇంకేం.. ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం ‘డైలీ ఎక్స్పెన్సెస్–2’ అనే యాప్‌ను ఉపయోగించి చూడండి. యూజర్లు దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ ఎయూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ♦ ఎఆదాయం, ఖర్చులకు సంబంధించిన లావాదేవీలను ♦ కేటగరైజ్ చేసుకోవచ్చు. ♦ ముందుగా క్రియేట్ చేసుకున్న రికార్డులను తొలగించవచ్చు. ♦ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బకాయిల చెల్లింపుల కోసం బిల్స్ రిమైండర్లను, అలర్ట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ♦ ఆదాయ, వ్యయాలను రోజూ, వారం, నెల, ఏడాది వారీగా చూసుకోవచ్చు. ♦ డేటా బ్యాకప్ ఫీచర్ ఉంది. యాప్‌కు పాస్‌వర్డ్‌ను పెట్టుకోవచ్చు. ♦ రిపోర్టులను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూడొచ్చు. -
యాప్ కీ కసమ్
ఉష ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె బావ సంచిత్ పది రోజుల్లో అమెరికా వెళుతున్నాడు. ఇద్దరికీ చిన్నప్పుడే పెళ్లి నిశ్చయమైంది కానీ, ఉషకి డిగ్రీ పూర్తయ్యాకనే పెళ్లి అనుకున్నారు. సంచిత్ నిన్న సాయంత్రమే అక్కడికొచ్చాడు. వాళ్లు సరదాగా గడపడానికి కొద్ది రోజులే ఉన్నాయి. ఆ రాత్రి కబుర్లలో పడి, పడుకునేసరికి పన్నెండు దాటినా మర్నాడుదయం ఆరు కాకముందే లేచారిద్దరూ. ఇంట్లో మిగతావాళ్లెవరూ ఇంకా నిద్ర లేవలేదు. వీళ్లిద్దరూ హాల్లో కూర్చుని, టీవీ ఆన్ చేసి సౌండ్ మినిమమ్‌లో ఉంచారు. ‘‘చందన థియేటర్లో ఫస్ట్ షోకి వెడదామా?’’ అన్నాడు సంచిత్.‘‘సినిమా ఏంటి?’’ అంది ఉష. సంచిత్ నవ్వి, ‘‘ఏదో సినిమా, ఏదైనా ఓకే! అక్కడ రన్నయేవి పాత సినిమాలు కదా, జనమట్టే ఉండరు. నువ్వు సినిమా చూద్దువు. నేను నిన్ను చూస్తా’’ అన్నాడు.ఉష ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ‘‘నన్ను చూడ్డానికి సినిమాకెందుకు? ఇంట్లోనే కూర్చోవచ్చు’’ అంది. ‘‘థియేటర్లో నాన్స్టాపుగా గంటల తరబడి నిన్ను చూడొచ్చు. ఎవరూ ఏమీ అనరు, అనుకోరు. ఇక్కడలా కుదురుతుందంటే చెప్పు. ఈ హాలే నాకు సినిమా హాలు’’ అన్నాడు. సంచిత్ అలా మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది ఉషకి. రోజంతా బావతోనే గడపాలి అనుకుంది. అంతలో పక్కనున్న ల్యాండ్‌లైన్ మ్రోగింది. ‘‘హలో! లావణ్యని. నా కొత్త యాప్ గురించి అర్జెంటుగా నీతో షేర్ చేసుకోవాలి. నువ్వీ రోజు పూర్తిగా నాకోసం కేటాయించాలి. అడక్క అడక్క అడుగుతున్నా – బెస్ట్ ఫ్రెండుని. కాదనకు. ప్రోగ్రాం కాసేపట్లో చెబుతాను. వెయిట్ చెయ్’’.ఉష రిసీవర్ పెట్టేసి సంచిత్కి విషయం చెప్పి, ‘‘అది నా క్లాస్‌మేటూ, బెస్ట్ ఫ్రెండూ. నాకోసం ఎన్నోసార్లు ఎన్నో చేసింది. దానికీ సరిగ్గా ఈరోజే ముహూర్తం దొరకడం మన దురదృష్టం’’ అంది. సంచిత్ చిరాగ్గా, ‘‘ఇప్పుడామె నాకు వరస్ట్ ఎనిమీ. నేనంటే నీకిష్టమైతే, నువ్వూ తన గురించి అలాగే అనుకోవాలి. మన ప్రోగ్రాం గురించి తనకి చెప్పు. అర్థం చేసుకుంటుంది’’ అన్నాడు.‘‘నేను చెప్పలేను. ఏం చెయ్యాలో తోచడం లేదు.’’ అంది ఉష దిగాలుగా. సరిగ్గా అప్పుడే మళ్లీ ల్యాండ్‌లైన్ మోగింది. మళ్లీ లావణ్యే!‘‘సారీయే, సడెన్‌గా గోపాల్ గుర్తుకొచ్చాడు. నా మొదటి యాప్ కబురు ముందు తనతో షేర్ చేసుకున్నా. ఇది ముందు నీతో షేర్ చేసుకున్నానని తెలిస్తే ఫీలౌతాడు. మన ప్రోగ్రాం కాన్సిల్!’’ అందామె. ఉష ఫోన్ పెట్టేసి, ‘‘హుర్రే’’ అంది. వారం రోజులుగా రెండో యాప్‌కోసం పడుతున్న శ్రమ ఫలించిందని లావణ్యకు మహోత్సాహంగా ఉంది. యాప్స్ తయారీ ఆమె హాబీ. ఆమె పెదనాన్న అమెరికాలో ఉంటున్నాడు. ఆయనకిద్దరు పిల్లలు. ఇద్దరికీ తెలుగు రాదు. వాళ్ల నానమ్మకి వాళ్లతో మాట్లాడాలని మహా సరదా. వాళ్లకోసం ఇంగ్లీషూ నేర్చుకున్నా, ఆ యాక్సెంట్ పిల్లలు పట్టుకోలేరు. అందుకని లావణ్య ఓ యాప్ తయారు చేసింది. నానమ్మ తెలుగులో మాట్లాడితే, అది ఇంగ్లీష్‌లోకి అనువాదమై పిల్లలకి వాళ్లకి అర్థమయ్యే యాక్సెంట్లో వినిపిస్తుంది. పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే, అది తెలుగులోకి అనువాదమై చక్కని తెలుగు యాక్సెంటులో నానమ్మకి వినిపిస్తుంది.మూడు వారాలక్రితం ఈ మొదటి యాప్ తయారు చేసినప్పుడు – ఆ ఉత్సాహాన్ని నానమ్మకంటే ముందు గోపాల్‌తో పంచుకుంది లావణ్య. అతడామెని మూడు నెలలక్రితం ఓ థియేటర్ వద్ద కలిశాడు. తనే పలకరించి, ‘‘నాకు బాగా డబ్బుంది. ఖర్చు చేస్తూ సరదాగా గడిపెయ్యడం నా హాబీ. పేరుకో డిగ్రీ కూడా ఉంది. ఇటీవల మీరు లాస్య అనే అమ్మాయిని వాసు అనే జులాయి నుంచి రక్షించడంలో గొప్ప సాహసం చేశారు. మీతో స్నేహం చేసి, మీ లక్ష్యాలను నా లక్ష్యాలు చేసుకోవాలని ఆశ పడుతున్నాను’’ అన్నాడు.అతడు మాట్లాడిన పద్ధతి నచ్చిందామెకి. వారంలోగానే ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. మరుసటి వారం కలిసి సినిమా చూశారు. నెల తిరక్కుండా ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకున్నారు. ఆమె మొదటి యాప్ గురించి వినగానే, ‘‘దీన్ని కమర్షియలైజ్ చేద్దాం’’ అన్నాడతడు. లావణ్య మురిసిపోయింది. ‘ఇప్పుడీ రెండో యాప్ గురించి వింటే గోపాల్ ఏమంటాడో’ ఆనుకుంటూ ల్యాండ్‌లైన్ డయల్ చేసింది లావణ్య. అది గోపాల్ ఇల్లు. ఇంట్లో పెద్దవాళ్లు లేరని ఫ్రెండ్స్ అంతా ధైర్యంగా రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. పెద్దవాళ్లిచ్చే డబ్బులు ఖర్చు చెయ్యడం తప్ప వాళ్లకింకో బాధ్యత లేదు. ఆడపిల్లల్ని వలలో వేసుకోవడం తప్ప ఇంకో పని లేదు. వాళ్ల చేతుల్లో మోసపోయిన అమ్మాయిల్లో కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఊరుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రం వలలో పడ్డట్లే పడి జారిపోతారు. వాళ్లలో కొందరు ఎదురు తిరగొచ్చని లాస్య నిరూపించింది.వాసు ఇంటర్ చదువుతున్న లాస్యని ఇష్టపడ్డాడు. చొరవ చేసి పరిచయం చేసుకున్నాడు. మర్యాదస్తుడిలా పోజు కొడుతూ, ఆదర్శాలు వల్లించాడు. ఐ లవ్యూ తను చెప్పి, ఆమె చేతా చెప్పించాడు. ఒక రోజు పార్కులో ఓ పొద మాటున మరింత చొరవ చేశాడు. అప్పుడు మాత్రం ఆమె సహకరించలేదు సరికదా, ‘‘తప్పు నీది కాదు. నీతో పార్కుకి వచ్చానుగా, అదీ నా తప్పు’’ అని రుసరుసలాడింది. ఐతే వాసుకి ప్లాన్ బి సిద్ధంగా ఉంది. ‘‘తప్పు నాదే! మళ్లీ ఇలా జరగదని నువ్వు నమ్మేదాకా నాకు నిద్ర పట్టదు. మా గెస్ట్‌హౌస్‌కి రా. అక్కడ నువ్వూ, నేనూ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. పబ్లిక్ పార్కులో జరిగిన పొరపాటు ఏకాంతంలో కూడా నావల్ల జరగదని తెలుసుకుంటావు’’ అన్నాడు.లాస్య వెంటనే ఒప్పుకోలేదు. కానీ వాసుకి తెలుసు. ఏ ఆడపిల్లకైనా సరే ఆ వయసులో నమ్మాలి, ఒప్పుకోవాలి – అనిపిస్తుందని. అలాగే చివరకు లాస్య ఒప్పుకుంది. వాసు ఉత్సాహం పట్టలేకపోయాడు. మిత్రులకి ఫోన్ చేసి, విషయం చెప్పాడు. వాళ్లతణ్ణి అభినందించి, త్వరలోనే ఆమె తమకూ సొంతం కానున్నదని ఆశించారు. కానీ వాసు లాస్యని తక్కువ అంచనా వేశాడు. ఆమెకి అతడి మీద అనుమానమొచ్చింది. తనకి పరిచయమున్న లావణ్యకి చెప్పింది. లావణ్య తండ్రికి చెప్పింది. వాసు పోలీసులకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తండ్రి పలుకుబడితో బెయిలు మీద బయటకు వచ్చాడు. అతడిప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే లావణ్యని లక్ష్యం చేసుకోవాలి. ఆ ఉద్దేశ్యంతోనే గోపాల్ లావణ్యని పరిచయం చేసుకుని ప్రేమలోకి దింపాడు. ‘‘ఈ రోజే ఆ లావణ్య పొగరు దించి మనకి దాసోహం చేసుకోవాలి’’ అన్నాడు వాసు చర్చకి ఉపక్రమిస్తూ. అంతలో గోపాల్ పక్కనున్న ల్యాండ్‌లైన్ మోగింది. రిసీవర్ తీసి, ‘‘ఎవరూ?’’ అన్నాడు గోపాల్ విసుగ్గా. ‘‘ఎవరూ గోపాలేనా – నేను లావణ్యని?’’‘‘అరే, లావణ్యా నువ్వా? థాంక్ గాడ్! ఏమయింది నీకు? నువ్వు ఫోన్ చెయ్యవు. నేను చేస్తే తియ్యవు. మనం ఫోన్లో మాట్లాడుకుని వారం దాటిపోయింది తెలుసా?’’ అన్నాడు గోపాల్.‘‘అందుక్కారణం కొత్త యాప్ డెవలప్ చేస్తూ బిజీగా ఉండడం! అది నిన్న రాత్రే సక్సెసవడం నాకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. నీతో పంచుకోవాలనిపించి ఆగలేక ఇప్పుడే ఫోన్ చేసేశాను’’ అంది లావణ్య.‘‘యు ఆర్ గ్రేట్ లావణ్యా! పాత యాప్ మీద ఆల్రెడీ ఒకరు స్పాన్సర్షిప్కి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా దాంతో కలిపేద్దాం’’ అని గోపాల్ ఇంకా ఏదో అనబోతుండగా – ‘‘కమర్షియలైజేషన్ విషయం తర్వాత. ముందు నా యాప్ డిటెయిల్స్ విను...’’ అంది లావణ్య.‘‘టెక్నికల్ విషయాల మీద నాకంత ఆసక్తి లేదు. నీ పేరు నలుదిక్కులా మోగిపోవాలి. అంతే నాక్కావలసింది. సాయంత్రం ఆరుకి మా ఇంటికి రా. అమ్మానాన్నా ఊళ్లో లేరు. ఈరోజు మధ్యాహ్నానికి వస్తారు. వాళ్లకి నిన్ను పరిచయం చేస్తా. నువ్వేమో యాప్ గురించి చెప్పడానికి వచ్చినట్లు అందువుగాని. నేనేమో నీ గురించి అమ్మానాన్నలకు చెబుతాను. అదే సమయంలో నువ్వు నీ యాప్‌ని కూడా డెమాన్స్ట్రేట్ చెయ్యాలి సుమా!’’ నవ్వాడు గోపాల్. ‘‘సరేలే కానీ ఎవరో స్పాన్సర్ అన్నావు! అతణ్ణీ పిలువు.. యాప్ గురించి నేనే చెబుతాను..’’‘‘అతడు కాదు, ఆమె! ఒక్కణ్ణే ఉన్నప్పుడు పిలిస్తే బాగుండదుగా.. అమ్మానాన్నా వచ్చాక చెబుదామనుకున్నా. నువ్వొస్తున్నావు కాబట్టి ఇప్పుడే చెబుతాను’’ అన్నాడు గోపాల్.‘‘సాయంత్రం కోసం ఎదురు చూస్తుంటాను. అప్పుడు నీ ఊహకందని సర్ప్రైజ్ కూడా తెస్తాను. నువ్వూ, ఆ స్పాన్సర్ కూడా ఫ్లాట్ అయిపోతారు. నీ మీదొట్టు’’ అని ఫోన్ పెట్టేసింది లావణ్య.గోపాల్ ఫోన్ పెట్టేసి, ‘‘చేప తనే వచ్చి వలలో పడతానంటోంది’’ అని ఫోన్ సంభాషణ సారాంశం వివరించాడు మిత్రులకి.‘‘సర్ప్రైజ్ అంటే లాస్య విషయంలో లాంటిది కాదు కదా!’’ అనుమానంగా అన్నాడు మూర్తి.‘‘వాసు ఫూలిష్‌గా గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నాడు. దాంతో ఆ పిల్లకి అనుమానమొచ్చింది. మనం నేరుగా ఇంటికి పిలుస్తున్నాం. డౌటు రానే రాదు. తను రావడం ఖాయం’’ అన్నాడు గోపాల్. ‘‘నిజంగా వస్తుందా? వచ్చినా లొంగు తుందా?’’ అన్నాడు మూర్తి.‘‘ఒక ఆడపిల్లని చెప్పుచేతల్లో ఉంచాలంటే, ముందామె చెప్పు చేతల్లో మనమున్నామన్న భ్రమ కలిగించాలి. అది ఫస్ట్ స్టెప్. ఆమెకై ప్రాణమైనా ఇస్తామన్న నమ్మకం కలిగించడం రెండో స్టెప్. నమ్మించి మోసం చెయ్యడం మూడో స్టెప్. మోసపోయిన అమ్మాయిని బ్లాక్మెయిల్ చెయ్యడం నాలుగో స్టెప్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫార్ములా. ఈరోజు మనం మూడో స్టెప్‌లోకి వస్తున్నాం. నో డౌట్స్’’ అన్నాడు గోపాల్ మిత్రబృందానికి కన్ను గీటి. ‘‘అందరికీ తెలిసిన ఈ ఫార్ములా లావణ్యకి తెలియదా. పోలీసాఫీసరు కూతురు’’ అన్నాడు వాసు. ‘‘లావణ్యకి మన దగ్గర జాగ్రత్త అవసరం లేదనిపించడమే రెండో స్టెప్. ఆమె విషయంలో అది దాటేశాం. అయినా ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండే అమ్మాయిలు నూటికొక్కరే ఉంటారు. మిగతా తొంభైతొమ్మిదిమందీ అబ్బాయిల వల కోసం సిద్ధంగా ఉంటారు. అది వయసు మహిమ. ఇదీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే్ట’’ అన్నాడు గోపాల్.‘‘ఇంతకీ ప్లానేమిటి? లావణ్య మీద నీ మోజు తీర్చుకోవడమా? నా పగ తీర్చడమా?’’ అన్నాడు వాసు. ‘‘ఎందుకురా నీకంత తొందర?’’ అన్నాడు గోపాల్. ‘‘బెయిలు మీదున్నవాణ్ణి. తొందరే మరి! ఈవేళైతేనే ఇంట్లో అంకులూ, ఆంటీ లేరు’’ అన్నాడు వాసు. ‘‘ఇంతకీ లావణ్య మీద నాకు మరీ మోజేం లేదు. అంతా నీ పగ కోసమే! మా బెడ్రూమ్ సౌండ్‌ప్రూఫ్ అని తెలుసుగా. అక్కడ ఈరోజు మనం లావణ్యపై తీసే వీడియోలు నీకు జైలు తప్పించడమే కాదు. ఓ పోలీసాఫీసర్ని కూడా మనకి తొత్తుని చేస్తాయి. మనం ఆ వీడియో ఆపరేషన్ గురించి చర్చిద్దాం’’ అన్నాడు గోపాల్. రాత్రి ఎనిమిది. చందన థియేటర్లో సినిమా చూస్తున్నారు ఉష, సంచిత్. ఉన్నట్లుండి ఉష మొబైల్ మోగింది. లావణ్య. ‘‘థియేటర్లో ఉన్నానే! తర్వాత మాట్లాడతా’’ అంది ఉష కొంచెం విసుగ్గా.‘‘ఉషా పరిణయం చూడాల్సింది నేను. కానీ, నువ్వు చూడ్డమేమిటే..’’ ‘మేము ఉషా పరిణయం సినిమాకు వెళుతున్నట్లు ఇంట్లో కూడా తెలియదే, దీనికెలా తెలిసింది?’ అనుకుంటూ ఉలిక్కిపడింది ఉష. ‘ఔనూ బావ ఉదయం అగ్లీ క్రీచర్ అన్న విషయం లావణ్యకెలా తెలిసింది?’ ‘‘నువ్వు షాక్‌లో ఉన్నావని తెలుసులే! ముందు అసలు విషయం విను. ఉదయం నేను చెప్పానే కొత్త యాప్ గురించి.. అదేమిటంటే, అవతలివాళ్లు ఫోన్ పెట్టేసేక కూడా మళ్లీ వాళ్లు మరొకరికి డయల్ చేసేదాకా అక్కడి మాటలు వినగలిగేలా చేస్తుంది. ఇది ల్యాండ్‌లైన్లకే పని చేస్తుంది. ముందు నీ ల్యాండ్లైనుకి టెస్టు చేసి, మీ ఇద్దరి మాటలు రికార్డు చేశాను. అవి మీకే వినిపించి థ్రిల్ చెయ్యా లను కున్నాను. టెస్టు ఫలించడంతో హుషారెక్కి పోయి ఆ విషయం గోపాల్‌తో షేర్ చెయ్యాలను కున్నాను. అప్పుడు....’’అప్పుడు ఉషకి కలిగిన థ్రిల్ వర్ణనాతీతం. లావణ్య ఇంకా ఏదో చెప్పబోతుంటే, ‘‘యు ఆర్ ఎక్స్ట్రార్డినరీ లావణ్యా! మరి యాప్ గురించి షేర్ చేశావా? గోపాల్ థ్రిల్లయ్యాడా?’’ అంది ఉష ఆత్రుతగా. అవతల పెద్ద నిట్టూర్పు వినిపించింది, ‘‘గోపాల్‌తో షేరింగా, ఇప్పుడా ఛాప్టర్ క్లోజ్!’’ అంది.‘‘అదేమిటి? ఏం జరిగింది?’’‘‘యాప్ కీ కసమ్, గోపాల్ ఇప్పుడు తన నలుగురు మిత్రులతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి, జైల్లో ఊచలు లెక్కెడుతున్నాడు’’ అంది లావణ్య. - వసుంధర -
ఆబ్కారీ ఆన్లైన్
విధిగా ధరల పట్టికను ప్రదర్శించడం.. మందు పోసే విధానంలో అక్రమాలను అరికట్టడం.. నకిలీ మద్యానికి చెక్‌పెట్టడం.. సిండికేట్, అనుమతి లేని సిట్టింగ్‌లకు స్వస్తి చెప్పడం.. ధరలను అదుపు చేయడం.. మద్యం దుకాణాలపై పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు వ్యాపారులు చేస్తున్న ఇటువంటì అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను తెరమీదకు తెచ్చి అక్రమాలకు చెక్ పెట్టేందుకు పూనుకుంది. యాప్‌లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పొందుపరచగా.. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మద్యం ప్రియులకు త్వరలోనే అవగాహన కల్పించేందుకు.. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. ఖమ్మం, వైరా: మద్యం దుకాణాల్లో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి మద్యం షాపులో యజమాని రెండు సీసీ కెమెరాలను రికార్డింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఆ సొమ్మును ఎలాగోలా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. కల్తీ మద్యంతోపాటు ఎమ్మార్పీ ధరలకు మించి మద్యం విక్రయిస్తున్నారు. సిట్టింగ్‌లు అనుమతి లేకుండా నిర్వహించడంతోపాటు కౌంటర్ వద్దే మద్యం ప్రియులకు పెగ్గుల ద్వారా మద్యం విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో ఎక్కువ సమయం వరకు వైన్ షాపులు, బార్లు తెరిచి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ కళ్లెం వేసేందుకే ప్రభుత్వం ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రంలో లభించే 880 లిక్కర్ బ్రాండ్ల ధరలు పొందుపరిచారు. విస్కీ, బ్రాందీ, రమ్, బీరు.. ఇలా రకాలవారీగా వివరాలున్నాయి. యాప్‌లోకి వెళ్లి కావాల్సిన మద్యం రకంపై క్లిక్ చేసి.. సైజులు నమోదు చేస్తే మద్యం ధర ఫోన్ తెరపై వెనువెంటనే ప్రత్యక్షమవుతుంది. ఫిర్యాదు చేయడం ఇలా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 162 మద్యం దుకాణాలను ఇటీవలే లక్కీడిప్ ద్వారా సొంతం చేసుకున్నారు. కొందరు పట్టణ ప్రాంతాల్లో సిండికేట్‌గా మారి మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు నాసికరమైన మద్యాన్ని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. వీటన్నింటినీ నిరోధించడం.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు దుకాణం యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన వాట్సప్ నంబర్ 7989111222కు ఫిర్యాదు చేయొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2533కు ఉచిత ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా హైదరాబాద్‌లోని ప్రధాన కాల్ సెంటర్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఫిర్యాదుదారు తన ఫిర్యాదు పరిస్థితిని తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ ద్వారా ‘లిక్కర్ ప్రైస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే యాప్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అ«ధికారులు అధికారికంగా విడుదల చేసిన విషయం విదితమే. ధరల పట్టిక తప్పనిసరి.. కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రతి దుకాణంలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దుకాణాల ఎదుట ధరల పట్టిక కూడా ఉంచాలి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలు, 5 బీర్ బ్రాండ్ల ధరలు పట్టికపై ముద్రించాలి. 12 నెలల అమ్మకాలను ప్రామాణికంగా తీసుకొని వివిధ బ్రాండ్ల ధరలను పట్టికపై ముద్రిస్తారు. ఇది మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పులో ఉండేలా.. తెలుగులో ప్రతి బ్రాండ్ ఎమ్మార్పీని పొందుపరచాల్సి ఉంటుంది. మద్యం దుకాణం పేరు, గెజిట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. అవగాహన కల్పిస్తాం.. మద్యం దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు తలెత్తకుండా యాప్ ఉపయోగపడుతుంది. ఇటీవలే యాప్‌ను అధికారంగా విడుదల చేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మూడు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపడతాం. బాధితులకు న్యాయం చేస్తాం. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగకరం. మద్యం ప్రియులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సోమిరెడ్డి,ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం -
యాప్‌కీ కహానీ...
ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లు ఉపయోగించొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఈ ‘పారలల్ స్పేస్–మల్టీ అకౌంట్స్’ యాప్‌తో. కేవలం వాట్సప్ మాత్రమే కాదు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ వంటి పలు యాప్‌లను క్లోన్ చేసుకొని రెండు అకౌంట్లు ఉపయోగించొచ్చు. ప్రత్యేకతలు ♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ♦ ఒక స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్/గేమ్స్/ఇతర యాప్స్ మల్టీపుల్ అకౌంట్స్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ♦ ఫోన్లోని వాట్సప్ యాప్‌లో ఒక నెంబర్‌పై అకౌంట్ ఉంటుంది. ఇక పారలల్ యాప్‌లో వేరొక నెంబర్‌పై రెండో వాట్సప్ అకౌంట్‌ను ఉపయోగించొచ్చు. దీనిలాగే ఫేస్బుక్ కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకోని లాగిన్ అవ్వొచ్చు. ♦ యాప్‌కు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. గమనిక: పలు సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌లో ఒకే నెంబర్‌పై రెండు అకౌంట్లను ఉపయోగించడం కుదరదు. ఇకపోతే పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాటి లేటెస్ట్ స్మార్ట్ఫోన్లలో రెండు అకౌంట్లను ఉపయోగించేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు హువావే కంపెనీ తన హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్, ఫేస్బుక్, మెసెంజర్ అకౌంట్లను ఉపయోగించేందుకు యాప్ ట్విన్ అనే ఫీచర్‌ను పొందుపరిచింది. దీని వల్ల రెండేసి వాట్సప్, ఫేస్బుక్, మెసెంజర్ యాప్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిల్లోకి వేర్వేరు అకౌంట్లతో లాగిన్ అవ్వొచ్చు. -
యువతుల సమస్యకు పరిష్కారం..
వాషింగ్టన్: ఒంటరిగా నడవటం ఎందుకనుకుందోగానీ భారతీయ సంతతికి చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి చేసిన ప్రయత్నం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సేఫ్ ట్రావెల్ పేరిట ఓ యాప్‌ను రూపొందించి..యాప్ ఛాలెంజ్‌కు పంపింది. ‘సమస్య ఉందని నాకు తెలుసు. అందుకే పరిష్కారాన్ని కూడా నేనే కనుగొన్నా’ అని ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను విపరీతంగా ఆకట్టుకుంది. తల్లి సరదాగా అన్నా.. వర్జినియాలోని హెర్న్‌డోన్‌కు చెందిన మేధా గుప్తా, థామస్ జెఫ్ఫర్ సన్ హైస్కూల్లో చదువుతోంది. రోజు తన స్కూల్ బస్సు పాయింట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేది. 20 నిమిషాల నడక పెద్ద కష్టంగా అనిపించేది కాదు. అయితే శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుండటంతో ఆమెకు భయంగా అనిపించేది. పైగా ఆ ప్రాంతంలో ఆకతాయిల వేధింపులు చాలా ఎక్కువ. దీంతో ఆమె తల్లి దగ్గర వాపోయింది. వెంటనే ఆ యువతి తల్లి దివ్య గుప్తా ఓ యాప్ తయారు చేయమని చెప్పింది. తల్లి అనుకోకుండా అన్న ఆ మాటలను మేధ సీరియస్‌గా తీసుకుని, ఒంటరిగా వెళ్లే ప్రయాణికుల కోసం ఓ యాప్‌ను రూపకల్పన చేసింది. సేఫ్ ట్రావెల్ అని దానికి నామకరణం చేసింది. తొలి ప్రయత్నంలో అది అంతగా విజయం సాధించలేకపోయినా.. తర్వాత మాత్రం అది పని చేయటం ప్రారంభించింది. అది గమనించిన తండ్రి మన్మోహన్ గుప్తా.. ‘కాంగ్రెస్సియోనల్ యాప్ ఛాలెంజ్’కు ఎంట్రీగా ‘సేఫ్ ట్రావెల్’ను పంపాడు. 1300 యాప్‌లలో విజేతగా.. పోటీలో మొత్తం 4100 స్టూడెంట్లు.. 1300 యాప్‌లను పంపించారు. ప్రతీ డిస్ట్రిక్ నుంచి ఒక్కో విజేతను నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వర్జినీయా నుంచి 200 మందికి పైగానే పోటీ పడ్డారు. చివరకు మేధా గుప్తా యాప్‌కు అవార్డు దక్కింది. యాప్ రూపకల్పన కోసం మేధా వాడిన సాంకేతికత, ఆమె చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయని న్యాయనిర్ణేత ముర్ఫే ప్రకటించారు. ప్రస్తుతం ఈ యాప్ ఫ్రీ డౌన్‌లోడ్‌కు అందుబాటులో లేదు. కానీ, భవిష్యత్తులో ఉంటుందని మేధా చెబుతూ.. ‘మనం ఏదైనా పని చేయాలంటే దానికి అడ్డు మనమే. దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలని మేధా అన్నారు. -
ఒంటరిగా నడవటం ఎందుకని...
వాషింగ్టన్ : ఒంటరిగా నడవటం ఎందుకనుకుందోగానీ 16 ఏళ్ల ఆ అమ్మాయి చేసిన ప్రయత్నం వార్తల్లో నిలిచింది. సేఫ్ ట్రావెల్ పేరిట ఓ యాప్‌ను రూపకల్పన చేసి యాప్ ఛాలెంజ్‌కు పంపింది. ‘సమస్య ఉందని నాకు తెలుసు. అందుకే పరిష్కారాన్ని కూడా నేనే కనుగొన్న’ అని ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను విపరీతంగా ఆకట్టుకుంది. వర్జినియాలోని హెర్న్‌డోన్‌కు చెందిన మేధా గుప్తా, థామస్ జెఫ్ఫర్ సన్ హైస్కూల్లో చదువుతోంది. రోజు తన స్కూల్ బస్సు పాయింట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేది. 20 నిమిషాల నడక ఆమెకు పెద్ద కష్టంగా అనిపించేది కాదు. అయితే శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుండటంతో ఆమెకు భయంగా అనిపించేది. పైగా ఆ ప్రాంతంలో ఆకతాయిల వేధింపులు చాలా ఎక్కువ. దీంతో ఆమె తల్లి దగ్గర వాపోయింది. వెంటనే ఆ యువతి తల్లి దివ్య గుప్తా ఓ యాప్ తయారు చేయమని చెప్పింది. తల్లి అనుకోకుండా అన్న ఆ మాటలను మేధ సీరియస్‌గా తీసుకుంది. ఒంటరిగా వెళ్లే ప్రయాణికుల కోసం ఓ యాప్‌ను రూపకల్పన చేసింది. సేఫ్ ట్రావెల్ అని దానికి నామకరణం చేసింది. తొలి ప్రయత్నంలో అది అంతగా విజయం సాధించలేకపోయినా.. తర్వాత మాత్రం అది పని చేయటం ప్రారంభించింది. అది గమనించిన తండ్రి మన్మోహన్ గుప్తా.. ‘కాంగ్రెస్సియోనల్ యాప్ ఛాలెంజ్’కు ఎంట్రీగా ‘సేఫ్ ట్రావెల్’ను పంపాడు. పోటీలో మొత్తం 4100 స్టూడెంట్లు.. 1300 యాప్‌లను పంపించారు. ప్రతీ డిస్ట్రిక్ నుంచి ఒక్కో విజేతను నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వర్జినీయా నుంచి 200 మందికి పైగానే పోటీ పడ్డారు. చివరకు మేధా గుప్తా యాప్‌కు అవార్డు దక్కింది. యాప్ రూపకల్పన కోసం మేధా వాడిన సాంకేతికత, ఆమె చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయని న్యాయనిర్ణేత ముర్ఫే ప్రకటించారు. ప్రస్తుతం ఈ యాప్ ఫ్రీ డౌన్‌లోడ్‌కు అందుబాటులో లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తానని మేధా చెబుతోంది. ‘మనం ఏదైనా పని చేయాలంటే దానికి అడ్డు మనమే. అందుకే దేన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలి’ అని మేధా చెబుతోంది. -
ఆర్బీఎల్ బ్యాంక్ మొ–క్యాష్
డబ్బులు అత్యవసరమా? అయితే ఇంకేం తక్షణమే పొందండి. అదేలా అనుకుంటున్నారా? ఆర్బీఎల్ బ్యాంక్ మొ–క్యాష్ మొబైల్ యాప్ సాయంతో. ఇన్స్టంట్ లోన్, క్రెడిట్ కార్డు ఫీచర్ల అనుసంధానంతో బ్యాంక్ ఈ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు... ♦ ఇన్స్టంట్ అప్రూవల్: కేవలం మూడు నిమిషాల్లో క్రెడిట్ లిమిట్‌ను తెలుసుకోవచ్చు. ♦ క్రెడిట్ లిమిట్లో ఎంత అవసరమో అంతే వాడుకోవచ్చు. ఈ విధంగా రుణంగా తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అంటే క్రెడిట్ లిమిట్ రూ.5,00,000 ఉంటే దానిలో రూ.2,00,000 ఉపయోగించాం. అప్పుడు రూ.2 లక్షలను వడ్డతో సహా చెల్లించాలి. ♦ ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొత్తం 100 శాతం క్రెడిట్ లిమిట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు. ♦ రుణాన్ని తిరిగి సరళమైన ఈఎంఐల రూపంలో చెల్లించొచ్చు. ♦ క్రెడిట్ కార్డు కూడా పొందొచ్చు. దీన్ని రిటైల్, ఆన్లైన్ షాపింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్లకు పలు ప్రయోజనాలను, ఆఫర్లను అందిస్తోంది. గమనిక: ఉద్యోగం చేసేవారు, స్వయం ఉపాధి పొందేవారు ఈ సేవలు పొందడానికి అర్హులు. నెలవారీజీతం రూ.25,000కు పైన ఉండాలి. -
ఇల్ టేక్ కేర్
ప్రైవేట్ రంగ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఐసీఐసీఐ లంబార్డ్ జీఐసీ’ తాజాగా ‘ఇల్ టేక్ కేర్’ అనే మొబైల్ హెల్త్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ దగ్గరిలో ఉన్న డాక్టర్లు, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ వివరాలు పొందొచ్చు. ♦ రియల్ టైమ్‌లో డాక్టర్ల అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్‌తో ఫోన్లో మాట్లాడే వెసులుబాటు ఉంది. ♦ దగ్గరిలోని డయాగ్నస్టిక్ సెంటర్లలో టెస్ట్‌లు చేయించుకోవచ్చు. ♦ స్టోర్‌లో మెడిసిన్స్‌ను డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. హోమ్ డెలివరీ కూడా పొందొచ్చు. ♦ షెడ్యూల్ హె ల్త్ చెకప్‌లు చేయించుకునే అవకాశముంది. ♦ ఐసీఐసీఐ లంబార్డ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి రియల్ టైమ్ క్యాష్‌లెస్ అప్రూవల్ పొందొచ్చు. ♦ పాలసీ అర్హత, ప్రయోజనాలు, లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు. ♦ మెడిసిన్ రిమైండర్స్ సెట్ చేసుకోవచ్చు. మెడికల్ రికార్డ్లను యాప్‌లో భద్రంగా ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. సేవలపై సంబంధిత సంస్థలకు రేటింగ్ ఇవ్వొచ్చు. -
గుడ్డిగా యాప్స్ వాడితే అంతే సంగతి..!
వాషింగ్టన్: ప్రస్తుతం ఎక్కువగా టెక్నాలజీ మీదే ఆధారపడి పనులు లాగించేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అది మన ప్రాణాల మీదకి తెస్తుందనడానికి అమెరికాలో ఇటీవల ఓ ప్రమాదం ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అసలేమైందంటే.. ఓ వ్యక్తి వద్ద ఇద్దరు మిత్రులు కారు అద్దెకు తీసుకున్నారు. ఈశాన్యరాష్ట్రం వెర్మాంట్ లోని బర్లింగ్టన్ నగరంలో ఎస్యూవీ కారును ఈ వ్యక్తుల డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ డ్రైవర్ ట్రాఫిక్ తగ్గుతుందని భావించి తరచుగా జీపీఎస్ మ్యాప్ ఫాలో అయ్యేవాడు. అందులో భాగంగానే తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న వేజ్ యాప్ (Waze app)ను వాడాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశానికి రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, రద్దీ తక్కువగా ఉండే రూట్ కోసం వేజ్ యాప్‌లో జీపీఎస్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కాస్త ముందుకు నడపగానే మంచుతో గడ్డకట్టి ఉన్న చిన్న సరసులోకి కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. భయబ్రాంతులకు లోనవడం కారులోని వారి వంతయింది. మంచుగడ్డలు చూపిన నరకం కన్నా యాప్ చూపిన నరకమే ఆ ముగ్గురు బాధితుల్ని తెగ ఇబ్బంది పెట్టిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ప్రమాదం విషయం తెలియగానే యజమాని టారా గుర్టిన్ షాకయ్యారు. కారులోని వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఎస్యూవీ జీపును నీటి మడుగు నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. గూగుల్ అధికార ప్రతినిధి జూలీ మోస్లర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వేజ్ యాప్‌లో ఇప్పటికే కొన్ని లక్షలసార్లు మార్పులు చేశాం. నిత్యం రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజూ అప్డేట్ చేస్తుంటాం. డ్రైవర్లు యాప్‌తో పాటు రోడ్డుపై ఓ కన్నేసి ఉంచి వాహనాలు నడిపితే కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. -
యాప్‌కీ కహానీ...
రానున్న ఐపీఓలు, ఎస్ఎంఈ ఐపీఓలు, ఎన్సీడీలు, బాండ్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘ఐపీఓ గైడ్’ యాప్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ రన్నింగ్/అప్‌కమింగ్ ఐపీఓల సమాచారం తెలుసుకోవచ్చు. ♦ రానున్న ఎస్ఎంఈ ఐపీఓలు, ఎన్సీడీలు, బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు. ♦ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన స్టాక్ టిప్స్ పొందొచ్చు. ♦ ఐపీఓలో పాల్గొన్నవారు అలాట్మెంట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. అలాగే రానున్న ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నవారు బేసిక్ వివరాలు అందిస్తే సంస్థ ఎగ్జిక్యూటివ్స్ ఐపీఓ/ఎన్సీడీ/బాండ్ల దరఖాస్తుకు సహాయపడతారు. ♦ యాప్‌లో ఐపీఓ/ఎన్సీడీ/ ఎస్ఎంఈ ఐపీఓ/ బాండ్లకు సంబంధించిన ఐపీఓ తేదీ, ప్రైస్ బ్యాండ్, లిస్టింగ్ తేదీ, సబ్స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ సమాచారం వంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ♦ ఐపీఓల పనితీరు ఎలా ఉందో గమనించొచ్చు. ♦ ఐపీఓ ఎప్పుడు ప్రారంభమౌతుంది.. ఎప్పుడు ముగుస్తుంది.. ఎప్పుడు లిస్టవుతుంది.. వంటి విషయాలను అలర్ట్స్ రూపంలో పొందొచ్చు. ♦ ఐపీఓ క్యాలెండర్ కూడా అందుబాటులో ఉంది. గమనిక: కేవలం ఈ యాప్ ఆధారంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. -
యాప్‌కీ కహానీ...
ఉమాంగ్ ప్రభుత్వపు ఈ–గవర్నెన్స్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ‘ఉమాంగ్’ యాప్‌ను తీసుకువచ్చింది. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు అందించే వివిధ రకాల సేవలన్నింటినీ ఈ యాప్ ద్వారా పొందొచ్చు. కాగా ఉమాంగ్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ ఇది యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. ప్రభుత్వ విభాగాలు, వాటి సేవలన్నింటినీ ఈ మొబైల్ యాప్ ద్వారా పొందొచ్చు. ♦ ఇందులో ఆధార్, డిజిలాకర్, పేగౌ వంటి పలు డిజిటల్ ఇండియాæసేవలు కూడా అందుబా టులో ఉన్నాయి. ♦ ప్రభుత్వ సేవలను ప్రజలు సులభంగా వినియోగించుకోవాలనేదే ఈ యాప్ లక్ష్యం. ♦ యాప్ డేటా భద్రతకు ఢోకాలేదని ప్రభుత్వం పేర్కొంది. ♦ హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎనర్జీ, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, యుటిలిటీ, ఎంప్లాయిమెంట్ వంటి పలు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ళీ ఈ యాప్‌ను తెలుగు భాషలోనూ ఉపయోగించవచ్చు. -
పోలీసు చేతికి వజ్రాయుధం!
రాష్ట్ర పోలీసుల చేతికి ‘టెక్నాలజీ’వజ్రాయుధం అందింది. నేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా ‘టీఎస్ కాప్’అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌కు తోడ్పడేలా రూపొందిన ఈ యాప్‌ను సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో పరిశీలించగా.. పెట్రోలింగ్ సిబ్బంది, సెక్టార్ ఎస్సైలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి చాలా ఉపయోగపడింది. మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసు శాఖలోని దాదాపు 14 ప్రధాన విభాగాలు టీఎస్ కాప్ యాప్‌ను ఉపయోగించుకునేలా రూపొందించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ పకడ్బందీ దర్యాప్తునకు అప్పటికప్పుడు ఘటనా స్థలం (ఫీల్డ్)లోనే ఫిర్యాదు తీసుకోవడం, అక్కడే ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, సాక్షుల వాంగ్మూలం తీసుకుని యాప్‌లో అప్లోడ్ చేయడం, ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదుల పరిస్థితులను పర్యవేక్షించడం, రోజూ కేసుల దర్యాప్తును పరిశీలించడం ఈ యాప్‌తో చేయవచ్చు. డీఎస్ఆర్లు సైతం యాప్ ద్వారా పంపించడం, స్వీకరించడం, అనాలిసిస్ చేయడం, రిపోర్ట్ అప్డేట్ చేయ డం వంటివాటికీ తోడ్పడుతుంది. సిబ్బంది హెచ్ఆర్ విషయాల్లోనూ.. పోలీసు అధికారులు, సిబ్బంది పే స్లిప్‌లు, లీవ్ మేనేజ్మెంట్, డైలీ పెర్ఫార్మెన్స్, ఆరోగ్య భద్రత స్కీమ్, సర్వీసు రికార్డులు, బదిలీ వ్యవహారాలతో పాటు శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. కోర్టులు, విచారణాంశాలు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లు, విచారణ ఏ దశలో ఉందన్న విషయాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి విషయాన్ని యాప్ ద్వారా అప్డేట్ చేస్తారు. స్టే ఆర్డర్లు, అప్పీళ్లు, పరిష్కరించిన కేసులు, నోటీసులు, సమన్లు, వారెంట్లు, రోజువారీ కేసు డైరీలు వంటివీ పరిశీలించవచ్చు. నిఘా వేయడంలోనూ తోడ్పాటు నేరాలు జరగకుండా ప్రతిక్షణం అప్రమత్తం చేసే ఇంటెలిజెన్స్ డ్యూటీలోనూ టీఎస్ కాప్ యాప్ కీలకం కానుంది. ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ ఇన్ఫర్మేషన్ హబ్‌గా ఉపయోగపడుతుంది. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం ఇంటెలిజెన్స్ విభాగం ఈ యాప్ ద్వారా అధికారులకు చేరవేయనుంది. నేర నియంత్రణకు చర్యలు నేరం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కావాల్సిన అంశాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ టవర్లు, ప్రవేశ, నిష్క్రమణ దారులు, లుక్ ఔట్ నోటీసులు, పదే పదే నేరాలకు పాల్పడే వారి జాబితా, నేరస్థలంలో సేకరించాల్సిన ఆధారాలు, నిందితులకు సంబంధించి 360 డిగ్రీ ప్రొఫైల్, ఇతర రాష్ట్రాల్లోని నేరస్తుల జాబితాలు, రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల సీసీ కెమెరాలు వంటి వాటిని ఈ యాప్ ద్వారా చెక్ చేయవచ్చు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్, చలానాలు, స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు, సిబ్బంది డ్యూటీలు, ఉల్లంఘనుల జాబితా, ల్యాండ్ మార్క్‌లు, ప్రమాదాల హాట్ స్పాట్లు, వాటి గుర్తింపు, అనాలి సిస్, వాటర్ లాగింగ్ ప్రాంతాలు, పార్కింగ్ వివరాలు తదితర సమా చారాన్ని యాప్‌తో పొందవచ్చు. అందుబాటులో విస్తృత సమాచారం డయల్ 100కు వచ్చే ఫోన్‌కాల్ నుంచి నేరం, దర్యాప్తు, నిందితుల గుర్తింపు, చార్జిషీటు.. శిక్ష పడిన విషయం వరకు ప్రతి అంశంలో టీఎస్ కాప్ యాప్ సిబ్బందికి ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో 54 సర్వీసులను 8 విభాగాలుగా పొందుపరిచారు. యాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు 2,500 ట్యాబ్‌లు ఇచ్చినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ 54 సర్వీసులను యాప్‌లో అందుబాటులో ఉన్న రూల్ ఆఫ్ డ్యూటీ ప్రకారం ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని సర్వీసులు అందరు సిబ్బందికి ఓపెన్ కావన్నారు. క్రైమ్ సిబ్బందికి నేర నియంత్రణ, ట్రాఫిక్ వాళ్లకు ట్రాఫిక్ మేనేజ్మెంట్.. ఇలా ఏ విభాగం సిబ్బందికి అవసరమైన సమాచారం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. సిబ్బందికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. నేరస్తుల గుర్తింపు, నిర్ధారణ అంశాలు నేరం జరిగిన ప్రాంతంలో అనుమానిత వాహనాలు, వ్యక్తుల వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ చిరునామా పరిశీలన వంటి వివరాలను యాప్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. నేరం చేసిన తీరును బట్టి ఏ ముఠా చేసింది, ఇంతకు ముందు ఈ తరహాలో నేరం జరిగిందా అన్నది పరిశీలించవచ్చు. ముఠాల్లోని నేరస్తులు, వారి హిస్టరీ షీట్ డేటా బేస్ అందుబాటులో ఉంటుంది. శిక్ష అనుభవించి జైల్లోంచి విడుదలైన వారి జాబితా, క్రైమ్ మ్యాపింగ్, ఆన్లైన్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ కూడా కీలక తోడ్పాటు ఇవ్వనున్నాయి. శిక్ష పడిన నేరస్తులు, నిందితులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 16 వేల కోర్టుల నుంచి సమాచారం అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. అత్యవసర స్పందన (ఎమర్జెన్సీ రెస్పాన్స్) బాధితులు డయల్ 100కు కాల్ చేయడం, కాల్ సెంటర్ నుంచి పెట్రోలింగ్ వాహనాన్ని అలర్ట్ చేయడం ఈ యాప్ సాయంతో సులువవుతుంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు సిబ్బంది ఘటన తీవ్రతను బట్టి యాప్ ద్వారా దగ్గర్లో ఉన్న మిగతా పెట్రోలింగ్ వాహనాలను, దగ్గర్లోని పోలీసు అధికారులను అప్రమత్తం చేయవచ్చు. యాప్‌లోని బజర్ నొక్కడం ద్వారా అదనపు బలగాలను ఘటనా స్థలికి రప్పించుకోవచ్చు. -
యాప్‌కీ కహానీ...
రవి ఎస్బీఐ చెక్‌బుక్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో బైక్‌ను రోడ్డుపైనే ఆపాడు. పని అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత రోజూవారీ కార్యకలాపాల్లో బిజీ అయ్యాడు. ఒకరోజు రోడ్డుపై బైక్‌లో వెళ్తుంటే రవిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. డాక్యుమెంట్లు అడిగారు. చూపించాడు. అయితే హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో వారు జరిమానా వేసి పంపించారు. దాన్ని కట్టేదామని ఈ–సేవకు వెళ్లాడు. అక్కడ రవి షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని బైక్‌పై రెండు చలానాలు ఉన్నాయి. ఒకటేమో హెల్మెట్ది అయితే. మరొకటేమో పార్కింగ్‌కు సంబంధించినది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే మన వాహనంపై చలానాలు ఏమైనా ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ‘తెలంగాణ ఇ–చలాన్’ అనే యాప్ అందుబాటులో ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆవిష్కరించింది. ఈ యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ వెహికల్ నంబర్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ సాయంతో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ♦ ట్రాఫిక్ పెండిగ్ చలానాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవచ్చు. ఉంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పొందొచ్చు. ♦ చలానా మొత్తాన్ని యాప్ ద్వారా చెల్లించొచ్చు. -
ఎయిర్టెల్ టీవీ యాప్‌లో కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తాజాగా తన ఎయిర్టెల్ టీవీ యాప్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో, ఎక్కువ కంటెంట్‌తో ఈ యాప్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, ప్రి–పెయిడ్ కస్టమర్లు యాప్‌లోని కంటెంట్‌ను ఫ్రీ–సబ్స్క్రిప్షన్ విధానంలో 2018 జూన్ వరకు ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. సంస్థ యూజర్లు ఎయిర్టెల్ టీవీ యాప్‌ను వారి స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌పై పనిచేస్తుంది. ‘ఎయిర్టెల్ టీవీ యాప్‌లో 29 హెచ్డీ చానళ్లు సహా 300లకు పైగా లైవ్ టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నాయి. 6,000కు పైగా సినిమాలు, ప్రముఖ టీవీ షోలు చూడొచ్చు. ప్రాంతీయ వినియోగదారుల కోసం రీజినల్ కంటెంట్‌ను కూడా పొందుపరిచాం’ అని వివరించింది. ఎయిర్టెల్ టీవీ ప్రస్తుతం ఈరోస్ నౌ, సోనీ లైవ్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా ఎయిర్‌టెల్‌కు 28.2 కోట్లకుపైగా మొబైల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
'పీవీ సింధు మొబైల్ యాప్' ప్రారంభం
హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్, తెలుగు తేజం పీవీ సింధు తన అధికారిక మొబైల్ యాప్ ను బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్టు సింధు పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. 'నా అధికారిక మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్‌లలో పీవీ సింధు అధికారిక యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని నాతో కనెక్ట్ అవ్వండి అంటూ' సింధు ట్విట్ చేశారు. మొబైల్ యాప్‌కు సంబంధించి లింక్‌ను కూడా పోస్ట్ చేశారు. ఈ యాప్ ద్వారా అభిమానులు సింధు పోస్ట్ చేసిన వీడియోలు, ఆమె పోస్టులను తిలకించవచ్చు. అంతేకాకుండా పీవీ సింధుతో యాప్ ద్వారా లైవ్ చాట్ చేసే అవకాశం కూడా ఉంది. యాప్‌లో సింధు తొలి వీడియోను పోస్ట్ చేశారు. తనకు అండగా ఉంటూ తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నందకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. యాప్‌ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని తన అభిమానులను ఆమె కోరారు. పీపీ సింధు మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్‌ను క్లిక్ చేయండి.. smarturl.it/pvsindhu Hey guys, I'm extremely excited to announce the launch of my official app. PV SINDHU OFFICIAL APP is now available on iOS & Android. Go Download it immediately and connect with me! Just go to https://t.co/9VCIBHCqa6#PvSindhuOfficialApp pic.twitter.com/2nCiGIWGpn — Pvsindhu (@Pvsindhu1) December 27, 2017 -
APPకీ కహానీ...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్– లోన్ అసిస్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? పర్సనల్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ ఏదైనా కావొచ్చు. రుణ అర్హత తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేం ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్– లోన్ అసిస్ట్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. దీని ద్వారా బ్యాంక్ ఆఫర్ చేసే అన్ని రకాల లోన్ల వివరాలు పొందొచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ♦రుణం తీసుకోవాలనుకుంటున్నవారు యాప్ నుంచే రుణ అర్హత తెలుసుకోవచ్చు. ఇన్స్టంట్ అప్రూవల్ కూడా పొందొచ్చు. ♦పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్, బిజినెస్లోన్, గోల్డ్ లోన్ వంటి పలు రుణాలకు సంబంధించిన వివరాలు, వాటికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ♦మీరు ఒకవేళ ఇదివరకే బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటే.. ఆ రుణానికి సంబంధించిన వివరాలు, పేమెంట్ సమాచారాన్ని పొందొచ్చు. ♦ఈఎంఐ కాలిక్యులేటర్, ఎక్స్పెన్స్ ట్రాకర్ వంటి టూల్స్ సౌలభ్యం ఉంది. ♦అవసరమైన సాయం కోసం కస్టమర్ కేర్‌తో మాట్లాడవచ్చు. -
ఫొటో తీయండి.. పోస్ట్ చేయండి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో సమస్యలు ఉంటే.. ఆ ఫొటో తీసి పాలికె యాప్‌లో అప్లోడ్ చేస్తేచాలు, పరిష్కారం బాధ్యత పాలికెదే. సోమవారం పాలికె కేంద్రకార్యాలయంలో మేయర్ సంపత్‌రాజ్, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ ‘మా వీధులను సరిచేయండి’ అనే యాప్‌ను విడుదల చేశారు. మేయర్ మాట్లాడుతూ పాలికె పరిధిలోని రోడ్లు, చెత్త తదితర ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఈ యాప్ ఎంతో అనుకూలమవుతుందని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. bbmpfixmystreet యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోడ్డుపై గుంత, చెత్త, మురుగు సమస్య ఉన్నట్టయితే, ఒక ఫొటో తీసియాప్‌లో అప్లోడ్ చేయాలి. దానిపై అధికారులు స్పందిస్తారు. డ్యాష్‌బోర్డు ద్వారా సమస్యల పరిష్కారానికి అదికారుల నుంచి చర్యలు తీసుకుంటామని సంపత్‌రాజ్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో ఇబ్బందులపై ప్రజలు బీబీఎంపీ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయాల్సివచ్చేది. అక్కడి నుంచి వార్డుకు, అధికారులకు సమాచారం అందించి అప్రమత్తం చేయడానికి సమయం పట్టేది. ప్రస్తుతం విడుదల చేసిన యాప్ ద్వారా నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్ చెప్పారు. ఏ సమస్యకు ఎంత సమయం? చెత్త సమస్య ఉంటే ఒక్కరోజులోగా పరిష్కరించాలని అధికారులకు మేయర్ సూచించారు. వీధి దీపాల సమస్యను రెండురోజులు, రోడ్లు గుంతల సమస్యలను ఒక వారంలోగా పరిష్కరించాలని చెప్పారు. బెస్కాం, ఆరోగ్య శాఖ, బీడీఏ, ఉద్యానవనశాఖ తో పాటు వివిద శాఖలు యాప్ సమాచారాన్ని అందుకుంటాయి. ప్రతి అధికారి, కార్పొరేటర్లకు సమాచారం వెళ్తుందని మేయర్ తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ ఫోటోను అప్లోడ్ కోరారు. నగరమంతటా ఎల్ఈడీ బల్బులు అనంతరం పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ... యాప్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలస్యమైతే అధికారులు అందుకు కారణాన్ని ఫిర్యాదిదారుకు తెలియజేయాలి. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో పాత విద్యుత్దీపాలను తొలగించి ఎల్ఇడి బల్ప్‌లను ఏర్పాటు చేయడానికి నివేదికను సిద్ధం చేశామని, మూడునాలుగు నెలల్లోగా టెండర్లు ఆహ్వానించి 8 నెలల్లోగా నగరంలోని అన్ని వీదులకు విద్యుత్దీపాలను ఎల్‌ఇడీగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె పాలనా విభాగం నేత రిజ్వాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
యాప్‌కీ కహానీ...
డేటాలీ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా మొబైల్ డేటా సేవింగ్, వై–ఫై యాప్ ‘డేటాలీ’ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని సాయంతో యూజర్లు వారి మొబైల్ డేటా వినియోగాన్ని నియంత్రించుకోవచ్చు. రియల్‌టైమ్‌లో డేటా యూసేజ్‌ను ట్రాక్ చేయవచ్చు. డేటా ఆదా చేసుకునేందుకు పర్సనలైజ్డ్ సిఫార్సులు పొందొచ్చు. పబ్లిక్ వై–ఫై స్పాట్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. డేటాలీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్ డేటా మేనేజర్ యాప్ కేవలం ఆండ్రాయిడ్ 5.0, ఆపై ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ఫోన్లపై మాత్రమే పనిచేస్తుంది. ‘ప్రపంచంలో చాలా మందికి మొబైల్ డేటా చాలా ఖరీదైన వ్యవహారంగానే ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ డేటా ఎలా ఖర్చవుతోందన్నది అర్థం కాదు. అందుకే మేం డేటాలీని రూపొందించాం. ఇది మీరు మీ డేటాను నియంత్రించుకునేందుకు, మరింత ఆదా చేసుకునేందుకు దోహదపడుతుంది’ అని గూగుల్ నెకట్స్ బిలియన్ యూజర్స్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా వివరించారు. ప్రత్యేకతలు డేటా వినియోగం: డేటా వినియోగాన్ని గంట, రోజు, వారం, నెల ప్రాతిపదికన చూసుకోవచ్చు. డేటా మరింత ఆదాకు వ్యక్తిగత సిఫార్సులు కూడా పొందొచ్చు . డేటా నియంత్రణ : బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్‌ను బ్లాక్ చేసుకునేందుకు, రియల్‌టైమ్ డేటా యూసేజ్‌ను ట్రాక్ చేసేందుకు డేటా సేవర్ బబుల్‌ను ఆన్ చేసుకోవాలి. ఇది మీ డేటాకు స్పీడోమీటర్ లాంటిది. ఒక యాప్ డేటా యూసేజ్ నియంత్రణ దాటితే ఒక్క ట్యాప్‌తో డేటాను బ్లాక్ చేయవచ్చు. డేటా ఆదా: కొన్ని సందర్భాల్లో మీకు మీ డేటా ప్లాన్‌పై పొందిన డేటా కన్నా కొంత ఎక్కువగానే అవసరమౌతుంది. అలాంటి సందర్భాల్లో డేటాలీ మీకు దగ్గరిలోని పబ్లిక్ వై–ఫై గురించి తెలియజేసి కనెక్ట్ అయ్యేందుకు తోడ్పడుతుంది. -
యాప్ ఆకలి తగ్గించుకోండి
మార్కెట్లో ఆపిల్‌పండు దొరుకుద్దోలేదో తెలీదుగానీ, దొరికినా కొనగలుగుతామో లేదో తెలియదు కానీ, తిన్నా ఆరోగ్యంగా ఉంటామో లేదో తెలియదు కానీ, తిన్నది కాశ్మీర్దా ఆస్ట్రేలియాదా అర్థం కాదు కానీ, యాప్‌లు మాత్రం అందరికీ అర్థమౌతున్నాయి. ముక్కు తుడుచుకోడానికి, మూతి తుడుచుకోడానికి కూడా యాప్‌లు ఉన్నాయి. యాప్‌లకు అంత వ్యాప్తి ఉంది. ‘ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పూస్తా’ లాంటి యాప్‌లు కూడా ఉన్నాయి. కానీ ఆకలి కాక ముందే మీకు ఆకలి ఎప్పుడు వేస్తుందో కనుక్కుని, మీ ఆకలిని నింపడానికి కూడా యాప్ ఉందట! వెటకారం అయినా, వచ్చినా వస్తుంది లెండి అలాంటిది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీ ఎత్తు, బరువు, లైక్స్, డిస్‌లైక్స్, మీ పేరెంట్ జీన్సు, మీరు చదువుకున్న చదువు, మీరు ఏడుస్తున్న ఉద్యోగం వగైరా వగైరా వగైరాలను బట్టి మీకు ఆకలి వెయ్యకముందే ఈ కొత్త యాప్ గంట కొట్టుద్దంట. కొట్టి, మీకిష్టమైన ఫుడ్డు ప్యాక్ చేసి పంపిస్తుందట. ‘ఔరా! నిజమేనా..’ అంటూ ఓ ప్రబుద్ధుడు.. ‘మరి ముద్ద కలిపి నోట్లో కూడా పెట్టుద్దా?’ అని అడిగాడట. ఇదమ్మా నేటి యటకారం వైరలు. -
ఆర్థిక సేవలన్నింటికీ ఎస్బీఐ ఒకే యాప్
ముంబై: డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్లైన్లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐతో పాటు దాని అనుబంధ సంస్థలైన ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ క్యాప్స్, ఎస్బీఐ కార్డ్స్ ఆర్థిక పథకాలన్నింటిని ఈ యాప్‌కి అనుసంధానం చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ఇది ఒక రకంగా డిజిటల్ బ్యాంకులాంటిదేనని పేర్కొన్నారు. ఆధార్ నంబరు, వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా ఇంటి నుంచి కదలకుండా ఆన్లైన్లోనే పూర్తి స్థాయి సేవింగ్స్ అకౌంటును తెరిచే వెసులుబాటు ఈ యాప్‌తో లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులతో పాటు యూజర్ల లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా 14 కేటగిరీల్లో యోనో యాప్ ద్వారా షాపింగ్ కూడా చేయొచ్చని బ్యాంకు తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ–కామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది. అమెజాన్, ఉబెర్, ఓలా, మింత్రా, జబాంగ్, స్విగీ, బైజూస్ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. డిజిటల్ ఎకానమీగా భారత్.. నగదు ఆధారిత ఎకానమీ స్థితి నుంచి సంఘటిత, డిజిటల్ ఎకానమీగా భారత్ ప్రస్తుతం రూపాంతరం చెందుతోందని ఎస్బీఐ యోనో యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఎకానమీ స్థిరీకరణ అత్యంత వేగంగా జరిగిన దశగా .. ప్రస్తుత పరిణామ క్రమాన్ని గురించి ఇరవై ఏళ్ల తర్వాత అంతా చెప్పుకుంటారని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటైజేషన్ ప్రక్రియ మరింత వేగవంతమైందని జైట్లీ తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా బీమా, మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. -
ఇక ప్రజల్లోకి వెళ్తా!
సాక్షి, చెన్నై: తాను రాజకీయాల్లోకి వచ్చేశానని, ఈ విషయమై ఇప్పటికే పలువురు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించుతూ.. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు త్వరలో ఒక మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 63వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో మంగళవారం మీడియాతో కమల్ హాసన్ ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ ఏర్పాటుపై కమల్ స్పందిస్తూ.. ‘నేను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశాను. మార్పు కోసం మీరు, నేను ఎన్నో ఏళ్లు ఎదురుచూశాం. అందువల్ల హడావుడి అవసరం లేదు. అందరూ చేస్తున్నట్లు మనం చేయడం లేదు. నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన రోజు. పురోగతి దిశగా ముందడుగుగా భావిస్తున్నా. కేవలం వ్యక్తిగత పురోగతే కాదు మొత్తం తమిళనాడు పురోగతి దిశగా ముందడుగు’ అని పేర్కొన్నారు. ప్రజలకు చేరువయ్యే వేదిక ‘మయ్యం విజిల్’ యాప్ వెతుకు.. పరిష్కరించు ఇదే యాప్ ప్రధాన నినాదమని, ప్రజలకు చేరువయ్యేలా ఒక వేదికని కమల్ పేర్కొన్నారు. ‘మయ్యం విజిల్ యాప్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. జనవరిలో ప్రారంభిస్తాం. ప్రజలు తమ సమస్యలను, ప్రభుత్వంపై ఫిర్యాదులను యాప్‌లో నమోదు చేయవచ్చు. నేను తప్పు చేస్తున్నా ఎత్తిచూపవచ్చు.పారదర్శకంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదుల్ని అప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్ అనుసంధానంగా ఉంటుంది. యాప్‌ను ప్రారంభించాక అది ఎలా పనిచేస్తుందో అందరికీ తెలియచేస్తా. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రకటనలు చేస్తాం’ అని వెల్లడించారు. వివేకానంద, గాంధీజీలే ఆదర్శంగా.. మొబైల్ యాప్ ప్రారంభించాక తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘ఇప్పటికే అనేకమందితో చర్చలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యేందుకు తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తా. తమిళనాడు పర్యటనలో ప్రజలు నన్ను ఒక నటుడిగా కాకుండా వేరే దృష్టితో అర్థం చేసుకునేలా వివరిస్తాం’ అని చెప్పారు. యువతను ఉత్తేజితులను చేస్తూ సమాజంపై అవగాహన కోసం స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ ప్రజల్లో తిరిగారని, వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. హిందూ వ్యతిరేకి ముద్రవేస్తే అంగీకరించను దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతుందని గతవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఏ మతం హింసను బోధించదు. మతం పేరిట హింసను వ్యతిరేకించాను. ఉగ్రవాదం అనే పదం నేనెప్పుడూ వాడలేదు. హిందువుల్ని బాధించేలా నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఆ కుటుంబం నుంచే వచ్చాను. ఆ భావాల నుంచి బయటకు వచ్చి లౌకికవాదిగా మారాను. అలాగని హిందూ వ్యతిరేకి, నాస్తికుడు అని ముద్రవేస్తే అంగీకరించను’అని కమల్ పేర్కొన్నారు. -
పార్టీ ఏర్పాటు పై కమల్ క్లారిటీ
-
హిందూ కుటుంబంలో పుట్టాను
సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు కమల్ హసన్ పార్టీ గురించి ఓ స్పష్టత ఇచ్చారు. మంగళవారం తన 63వ పుట్టినరోజు సందర్భంగా ‘మైఎం విజిల్’ పేరిట యాప్‌ను ప్రారంబించిన ఆయన అనంతరం ప్రసంగించారు. తమిళనాడు ప్రజలు రాజకీయాల్లో బలమైన మార్పును కోరుకుంటున్నారని అందుకే వాళ్లు తన ఆరంగ్రేటాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలేవైనా యాప్ ద్వారా తెలియజేయవచ్చని... ప్రజలకు దగ్గరయ్యేందుకే ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని ఆయన పేర్కొన్నారు. కాగా, యాప్ గురించి 20 నుంచి 25 మంది రాత్రింబవళు కృషిచేస్తున్నారన్నఆయన జనవరి నుంచి అది ప్రజలకు పూర్తి స్థాయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు . ఇక పుట్టిను రోజు నాడే పార్టీ ప్రకటిస్తానని అంతా భావించారని... అయితే దానికి చాలా క్షేత్రస్తాయి శ్రమ అవసరం ఉందని, కార్యకర్తలతో ఇంకా చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన ముందు పెద్ద లక్ష్యాలే ఉన్నాయన్న కమల్ వాటి సాధనకు చాలా సమయం పడుతుంది కాబట్టే పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టేందుకు కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ఒంటరిగా రాజకీయాల్లోకి వస్తే మాత్రం గట్టి పునాది అవసరం కాబట్టే జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు . పనులు మొదలుపెట్టాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. రాజకీయాల్లో రావటం తథ్యమని ఆయన ప్రకటించారు. హిందూ ఉగ్రవాద కామెంట్లపై... నా వ్యాసంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశానని కొందరు నన్ను తిట్టి పోశారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన వాడిగా ఏనాడూ ఆ పని నేను చేయబోను. తాను ఎంచుకున్న మార్గం వేరేదైనా హింసను మాత్రం వ్యతిరేకిస్తానని కమల్ పేర్కొన్నాడు. ఇక టెర్రర్(ఉగ్రవాదం) అనే పదం తాను వాడలేదని.. సమస్య తీవ్రత గురించే తాను ప్రస్తావించానని కమల్ స్పష్టం చేశారు . -
పెళ్లి చేసుకుంటారా..?కర్మ అంటూ వదిలేస్తారా..?
చిత్తూరు అర్బన్: ‘‘మీరు ఓ వ్యక్తిని ప్రేమిం చారు. అతడు మిమ్మల్ని మోసం చేశాడు. పోలీసుల్ని ఆశ్రయిస్తారా..? అఘాయిత్యం చేసుకుంటారా..?’’ ‘‘ ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారా..? నీ కర్మ అంటూ వదిలేస్తారా..? ఇలాంటి ప్రశ్నలకు ఎంతటి వారైనా పాజిటివ్ కోణంలోనే సమాధానాలిస్తారు. ఇలా సానుకూల దృక్పథంతో సమాధానాలు ఇచ్చే వారి ఆలోచన తీరులో తప్పకుండా మార్పు వచ్చే తీరుతుంది. ఈ దిశగా వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చి వ్యవస్థను బాగు చేయడానికి చిత్తూరు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఆలోచనల్లో మార్పు.. జిల్లాలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. వీటిపై విద్యావంతులైన యువతలో మార్పు తీసుకురావడానికి చిత్తూరు పోలీసు యంత్రాంగం వినూత్నంగా ఆలోచించింది. అందరికీ తెలిసిన ప్రశ్నలకు సానుకూల సమాధానాలు వచ్చేలా కొన్ని ప్రశ్నలు రూపొంది స్తోంది. ఏ, బీ అనే రెండు ఆప్షన్లు పెడుతున్నారు. ఒకటి ప్రతికూల సమాధానం, మరొకటి సానుకూల సమాధానాన్ని సూచిస్తుంది. ఎంతటివారైనా ఇలాంటి సమాధానాలకు పాజిటివ్‌గానే స్పందిస్తారు. పాజిటివ్‌ను ఆచరణలో పెట్టలేని వారు సైతం ఒపీనియన్ పోల్‌కు వచ్చేసరికి కచ్చితంగా సానుకూల సమాధానమే ఇస్తారు. ఇలా సమాధానాలిచ్చి న వ్యక్తి ఆలోచనలో కాలక్రమేనా తప్పకుండా మార్పు వస్తుంది. ఫలితంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని గుర్తించిన చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఇలాంటి ప్రశ్నలను రూపొం దించి స్మార్ట్ ఫోన్ ద్వారా యువతకు, మహిళలకు లింక్ ద్వారా పంపిస్తూ సమాధానాలు రాబడుతారు. తర్వాత ఎంత శాతం మంది ఏ సమాధానాలను సమర్థించారో తెలియజేస్తారు. దీనిద్వారా మహిళలపై నేరాల శాతం తగ్గించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించినట్లు అవుతుందని భావిస్తున్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు దీన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఎస్పీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
గూగుల్ అసిస్టెంట్
బాస్‌లే కాదండోయ్.. మనం కూడా అసిస్టెంట్‌ను పెట్టుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్‌లో అండి. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్ ఇప్పటికే ‘గూగుల్ అసిస్టెంట్’ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ పలు స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్‌గా కూడా ఉండొచ్చు. ఫోన్ హోమ్ బటన్‌ను నొక్కి పట్టుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. ప్రత్యేకతలు ♦ ఏదైనా పనిలో ఉన్నా.. డ్రైవింగ్‌లో ఉన్నా.. త్వరితగతిన ఫోన్ కాల్స్ చేయవచ్చు. కాల్ మామ్ అని చెబితే వెంటనే అమ్మకు ఫోన్ కాల్ వెళ్తుంది. ♦ అలాగే మెసేజ్‌లను కూడా పంపుతుంది. ♦ స్నేహితుడి పుట్టిన రోజుకు బహుమతి కొనాలి అనుకుంటే.. ఆ బర్త్‌డే ఎప్పుడో రిమైండ్ సెట్ చేసుకోవచ్చు. దీనిలాగే ఇతర ముఖ్యమైన అంశాలను రిమైండ్లో పెట్టుకోవచ్చు. టేక్ సెల్ఫీ అని చెబితే సెల్ఫీ తీసి పెడుతుంది. ♦ క్యాలెండర్ ఈవెంట్లను సెట్ చేసుకోవచ్చు. ♦ రూట్ డైరెక్షన్స్ చెబుతుంది. వాతావరణం గురించి తెలియజేస్తుంది. ♦ యూట్యూబ్‌లో పాటలు ప్లే చేయంటే ప్లే చేస్తుంది. ♦ టెల్ మి ద న్యూస్ అని చెబితే తాజా వార్తలను తెలియజేస్తుంది. ♦ ఈ యాప్ కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ (6.0 మొదలు) కలిగిన ఫోన్లలోనే పని చేస్తుంది. ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటే మళ్లీ ఈ యాప్‌ను ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. -
మొబైల్ యాప్‌లో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్
ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్లలో దూసుకుపోతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ రిటైలర్ యాప్ 100 మిలియన్ డౌన్లోడ్లను అంటే 10 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మైలురాయిని అధిగమించిన దేశంలోనే తొలి ఈ-కామర్స్ యాప్ ఫ్లిప్కార్ట్దేనని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 300 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లున్నారు. అంటే దేశంలోని అన్ని స్మార్ట్ఫోన్లలో ఫ్లిప్‌కార్ట్ మూడోవంతులున్నట్టు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇచ్చే రేటింగ్‌లోనూ ఫ్లిప్‌కార్ట్ యాప్‌కు మంచి రేటింగ్ వస్తుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్‌కు సగటున 4.4 రేటింగ్ వస్తుందని కంపెనీ చెప్పింది. కొత్త కొత్త ఫీచర్ల అభివృద్ధికి తాము ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నామని, తమ యాప్‌లో తాజా డిజైన్లను చేకూరుస్తూ.. యూజర్లకు అనుకూలంగా మారుస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీటీఓ రవి గరికిపాటి చెప్పారు. కాగ, ప్లిప్‌కార్ట్ తన బిగ్ దివాలి సేల్‌ను నేటి నుంచి ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్, ఫర్నీచర్ వంటి కేటగిరీ ఉత్పత్తులపై డీల్స్‌ను, డిస్కౌంట్లను అందిస్తోంది. కొన్ని ఉత్పత్తులపై 90 శాతం వరకు డిస్కౌంట్లను కూడా ఈ ఈ-కామర్స్ స్టార్టప్ ఆఫర్ చేస్తోంది. -
టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో యాప్ చెప్పేస్తుంది!
న్యూఢిల్లీ: టెక్నాలజీ మనుషుల ఎన్నో అవసరాలను తీరుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక సామాన్యుడికి సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది. అదే స్మార్ట్‌ఫోన్ మరో కీలకమైన సమస్యను పరిష్కరించనుంది. అదేం టంటే... టాయిలెట్ల అడ్రస్ చెప్పడం. నిజమే... మహానగరంలో ‘అత్యవసర’ పరిస్థితి ఏర్పడితే ఎక్కడికెళ్లాలో తెలియక నానా అవస్థలు పడేవారు ఎందరో. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా.. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మహానగర పాలక సంస్థ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. పబ్లిక్ టాయిలెట్లను జియోట్యాగింగ్ చేయడం ద్వారా నగరవాసులు తమకు సమీపంలోనే ఉన్న మరుగుదొడ్లను సులభంగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛభారత్ కల సాకారం కావడానికి కూడా ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎం తో అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
రోజుకి నాలుగు గంటలు యాప్‌ల్లోనే..
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ యూజర్స్ రోజుకు 4 గంటలు యాప్‌లతోనే గడుపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. యాప్ అనలైటిక్స్ సంస్థ ‘యాప్ అన్నీ’ 9 దేశాల్లో జరిపిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మొబైల్ యూజర్స్ ఎక్కువగా ఉండే భారత్, సౌత్‌కొరియా, మెక్సికో, బ్రెజిల్, జపాన్, అమెరికా, యూకేలో అన్నీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ దేశాల్లో ఎక్కువగా, మధ్యస్థంగా, మాములుగా మొబైల్ ఉపయోగించే వారిని మూడు విభాగాలుగా విభజించి సర్వే నిర్వహించారు. ఎక్కువగా ఉపయోగించేవారు రోజుకు నాలుగు గంటలు యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఇక మధ్యస్థంగా మొబైల్ వాడే వారు బ్రెజిల్లో రోజుకు మూడు గంటలు, భారత్‌లో రెండున్నర గంటలు యాప్స్‌తోనే గడుపుతున్నారని తెలిపింది. ఇక మాములుగా మొబైల్ ఉపయోగించేవారు గరిష్టంగా యాప్‌లను గంటన్నర ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఎక్కువగా ఆండ్రాయిడ్ మెబైల్ యాప్స్‌నే ఉపయోగిస్తున్నట్లు అన్నీ సంస్థ ప్రకటించింది. -
వాహన చోదకులూ... పారాహుషార్!
– నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంటికే ఈ–చలానా – అమలు విధానాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ కర్నూలు : చోరీ వాహనంతో దొంగ రోడ్డుపైకి వస్తే దొరికిపోయినట్లే. రాంగ్ రూట్లో వెళ్లినా, మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడిపినా, హెల్మెట్ లేకుండా వెళ్లినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, త్రిబుల్ రైడింగ్‌తో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసినా ఇకపై మీకు తెలియకుండానే ఎంవీ యాక్ట్ ప్రకారం ఇళ్లకు నోటీసు వస్తుంది. వాహన వివరాలు గుట్టు విప్పే ప్రత్యేక యాప్‌ను పోలీసు శాఖ అమల్లోకి తెచ్చింది. అమల్లోకి వచ్చిన ఈ చలానా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ–చలానా అమలు విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్పీ గోపీనాథ్ జట్టి కర్నూలులో ఈ–చలానా అమలు విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డేటా ఇవాల్స్ అనే సంస్థ ఈ–చలానా యాప్‌ను రూపొందించింది. సంస్థ ఎండీ చింతా అనిల్, ఎస్పీ గోపీనాథ్ జట్టితో కలసి ఈ–చలానా అమలు విధానాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రయోగాత్మకంగా వివరించారు. పోలీసు సిబ్బంది తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలో ఈ–చలానా యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫొటోలు ఎలా తీయాలి, వాహన చోదకుడి సెల్‌ఫోన్‌కి మెసేజ్ ఎలా పంపించాలి, స్వైపింగ్ మిషన్‌లో ఏటీఎం కార్డులతో స్వైపింగ్ చేసే విధానం, బ్లూటూత్ ద్వారా చలానా రశీదు ఇచ్చే విధానం, మిషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ చలానా విధానం అమల్లో ఉందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ట్యాబ్, స్వైపింగ్ మిషన్, బ్లూటూత్ ప్రింటర్ అందజేస్తామన్నారు. అందులో యాప్ డౌన్లోడ్ అయి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారే కాకుండా వాహన తనిఖీల సమయంలో అందుకు సంబంధించిన రికార్డు లేకున్నా ఈ–చలానా ద్వారా జరిమానా విధిస్తామన్నారు. అక్కడే నగదు రూపంలో కానీ, ఏటీఎం ద్వారా కానీ, మీ–సేవ ద్వారా కానీ జరిమానాలు చెల్లించవచ్చునన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనం నెంబర్‌ను ఈ–చలానా యాప్‌లో నమోదు చేయగా యజమాని పేరు, చిరునామా సహా వివరాలన్నీ తెలుస్తాయన్నారు. సంబంధిత వాహన చోదకులు జరిమానా చెల్లిస్తే రశీదు ఇస్తామన్నారు. లేదంటే 15 రోజుల్లో వాహన యజమాని ఇంటికి లీగల్ నోటీసు వెళ్తుందన్నారు. మూడుసార్లు నిబంధనలు అతిక్రమించి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందన్నారు. ఎక్కువమంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని, వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర, వినోద్‌కుమార్, హుసేన్ పీరా, సీఐలు మహేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం, దివాకర్‌రెడ్డి, ఈ–కాప్స్ ఇన్చార్జి రాఘవరెడ్డి, ఎస్ఐలు తిమ్మారెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ జయప్రకాష్, ఈ–చలానా యాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాతకు యాప్ అండ
’ప్లాంటిక్స్’తో రైతులకు మేలు తెగుళ్లు, నివారణ సూచనలు వెంటనే తెలుగులోనూ సమాచారం సహకారం అందిస్తున్న ఇక్రిశాట్ ఏలూరు (మెట్రో): మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ ఉంటుంది. రైతు వెచ్చించే ఖర్చులో పురుగు మందులదే సింహభాగం. పంటలో తెగులు కనిపిస్తే చాలు ఏ మందులు పిచికారీ చేయాలో అర్థంకాక అన్నదాతలు ఆందోళన చెందుతుంటారు. దీంతో పంటలు పరిశీలించకుండానే వ్యాపారులు చెప్పిందే వేదంగా రైతులు పురుగుమందులు వాడేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను పరిశీలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేకంగా తెగుళ్ల నివారణలు సూచించేందుకు మొబైల్ యాప్‌ను ఇటీవల రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాంటిక్స్ (పిఎల్ఎఎన్టిఐఎఎక్స్) అనే ఈ యాప్ ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. మారుతున్న ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఓ ప్రయివేటు మొబైల్ కంపెనీ సర్వే ప్రకారం ప్రస్తుతం 80 శాతం మంది రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇలాంటి వారికి ఈ నూతన యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఈ యాప్‌ను ఉపయోగించుకుని తెగుళ్ల సమాచారాన్ని గుర్తించగలుగుతున్నారని వ్యవసాయాధికారులు అంచనా. ఈ యాప్ జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది అక్కడ ఫలితాలు సాధించడంతో మన దేశంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్రిశాట్ అధికారులు జర్మనీతో ఒప్పందం చేసుకున్నారు. మొదటిగా హిందీ భాషలో అందుబాటులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ చొరవతో ఈ సంవత్సరం జూన్ నుండి తెలుగు భాషలో లభ్యమయ్యేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ యాప్ డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, పోర్చుగీసు, హిందీ, తెలుగు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. నిమిషాల్లో సమచారం: ఆండ్రాయిడ్ వెర్షన్లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. తర్వాత పంటల వారీగా ఆప్షన్లు కనిపిస్తాయి. ఏ పంటపై తెగుళ్ల సమాచారం కావాలో ఆ పంట ఐకాన్‌పై క్లిక్ చేస్తే కెమెరా తెరుచుకుంటుంది. చెట్టుకు తెగులు ఉన్న చోట ఫొటో తీసి ఆప్‌లోడ్ చేస్తే కొద్ది సేపటికే ఆ తెగులుకు సంబంధించిన వివరాలు, లక్షణాలు, పిచికారీ చేయాల్సిన మందుల వివరాలతో శాస్త్రవేత్తలుగానీ, అనుభవజ్ఞులైన రైతులు నుంచి కానీ సమాచారం వస్తుంది. సూచించిన మందులు తెచ్చుకుని పిచికారీ చేస్తే సరిపోతుంది. ఎంత మోతాదులో వాడాలో కూడా వివరాల్లో ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వరి, అరటి, కంది, గోధుమ, చిక్కుడు, టమాట, దానిమ్మ, పత్తి, బంగాళాదుంప, బొప్పాయి, మామిడి, పెసలు, మినుములు, మిర్చి, మొక్కజొన్న, వంకాయ, సెనగ, సోయాబీన్ వంటి 18 రకాల పంటలకు సంబంధించి ఐకాన్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర పంటలు అనే ఐకాన్ కూడా ఏర్పాటు చేయడంతో ఇతర పంటల వివరాల కోసం ఆ ఐకాన్‌ను ఎంచుకుంటే మిగిలిన పంటలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. జీపీఎస్ సహకారంతో వాతావరణ సూచనలు : వాతావరణ పరిస్థితులు, గాలిలో తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో ఆప్షన్లు ఉన్నాయి. మొబైల్ జీపీఎస్ ఆప్షన్ ఆన్‌చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారం తెలుస్తుంది. -
సిక్కోల్లో కాల్ అంబులెన్స్
► రాష్ట్రంలో తొలిసారి సిక్కోల్లోనే అమలు ►యాప్‌ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ►తగిన శిక్షణతో క్షతగాత్రులకు తక్షణ సేవలు శ్రీకాకుళం సిటీ: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెచ్చు మీరుతున్నాయి. పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు గల జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలకు గురవుతున్న వారు సకాలంలో వైద్య సాయం అందక మృత్యుకోరల్లోకి వెళ్తున్నారు. ఇకపై ఈ ఇబ్బంది ఉండకూడదని పోలీసులు కొత్త యాప్‌ను సిక్కోల్లో కాల్ అంబులెన్స్ తీసుకువచ్చారు. ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ చొరవతో కాల్ అంబులెన్స్ అనే యాప్ రాష్ట్రంలోనే తొలిసారిగా సిక్కోలులో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ యాప్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. తక్షణ సాయం కోసం.. కాల్ అంబులెన్స్ సాయంతో ఆండ్రాయిడ్ మొబైల్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అత్యవసర స్థితిలో అందుబాటులోకి వస్తాయి. ఏ ప్రమాదం సంభవించినా, జిల్లాలో ఎక్కడ ఘటన జరిగినా ఈ యాప్ సాయంతో క్షణాల్లో అత్యవసర వైద్యసేవల వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. సమీపంలో ఉన్న ఆస్పత్రి వైద్యులను అప్రమత్తం చేయడంతో పాటు ముందుగానే క్షతగాత్రుని రక్తగ్రూపులను సిద్ధం చేస్తుంది. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కాల్ అంబులెన్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే అని పోలీసులు చెబుతున్నారు. ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న కాల్ అంబులెన్స్ యాప్‌లో ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్‌తో పాటు నివాసిత ప్రాంతం తదితర వివరాలను పూరించాలి. ఉదాహరణకు శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యక్తికి ఇచ్ఛాపురంలో ప్రమాదం జరిగితే.. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంటే సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయి. అంబులెన్స్‌ల పరిస్థితి. ఆస్పత్రుల్లో ఉన్న రక్తనిల్వలు, ఆస్పత్రిలో ఉన్న వైద్యుని నుంచి అందరి ఫోన్ నంబర్లు కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అతికొద్ది సమయంలోనే ప్రమాదం బారిన పడిన వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోండి.. రహదారిపై ప్రయాణిస్తున్న, వెళ్తున్న సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ముందుకు వచ్చేవారు కారు. ఏమైనా పో లీస్ కేసులు అవుతాయేమోనన్న సందేహాలు అందరిలో గతంలో ఉండేవి. దీంతో చాలా మంది ప్రమాద బాధితులను కాపాడడానికి ముందుకు వచ్చే వారు కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఈ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నారు. వారికి బ్యాడ్జీలను కూడా ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో ఎవరు గాయపడినా సమీపంలో ఆస్పత్రికి నిర్భయంగా చేర్చి వారి ప్రాణాలను కాపాడాలని సూచిస్తున్నారు. వినియోగించుకోండి రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో అమలుచేయనున్న కాల్ అంబులెన్స్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ, అర్బన్ ప్రాంత యువత ముందుకు రావాలి. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలో ఆ స్పత్రికి తీసుకువచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేం దుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తగిన శిక్షణను ఇస్తాం. వారికి బ్యాడ్జీలను కూడా ఏర్పాటుచేస్తాం. ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయపడేందుకు ముందుకు రావాలి. – సీఎం త్రివిక్రమ వర్మ, ఎస్పీ -
అప్పు కోసం యాప్ చాలు!
► లేదంటే ఏటీఎంకు వెళితే సరి! ► పోటీ నేపథ్యంలో కస్టమర్ల చెంతకే ‘రుణ’ సేవలు ► ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆఫర్ ► వాటితో జతకట్టి స్టార్టప్‌లూ రంగంలోకి... ఒకప్పుడు రుణం కావాలంటే చెప్పులు అరిగిపోయేలా బ్యాంకులో లేకపోతే ఆర్థిక సంస్థల చుట్టూనో తిరగాల్సి వచ్చేది. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడంతా ‘రుణం తీసుకోండి’ అంటూ వెంటపడే రోజులు. ‘బ్యాంకు వరకూ రావక్కర్లేదు ఏటీఎం మెషీన్ నుంచే దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే రోజు రుణం మొత్తం ఖాతాలో జమ అవుతుంది’ ఇదీ తాజాగా బ్యాంకులిస్తున్న ఆఫర్. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చిటికెలో రుణాలిచ్చే ఫైనాన్షియల్ యాప్స్ కూడా ఎన్నో వచ్చేశాయి. ఆ వివరాలివిగో... ఏటీఎంల నుంచే... ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ... ఇటీవలే ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను మంజూరు చేసే వినూత్న విధానాన్ని ప్రారంభించింది. కాకపోతే అందరికీ కాకుండా తన బ్యాంకులో వేతన ఖాతాలున్న ఎంపిక చేసిన కొందరికే తొలుత దీన్ని పరిమితం చేసింది. రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచించే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి ఈ అవకాశం కల్పించింది. తర్వాత కాలంలో మరింత మందికి ఈ విధంగా రుణాలు మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామనీ తెలిపింది. అర్హత కలిగిన వారు ఏటీఎంలో ఏదైనా లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణానికి సంబంధించిన సందేశం కనిపిస్తుంది. ఓకే చెబితే చాలు! కస్టమర్ ఖాతాలో రుణం జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పైనే రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వివరాలన్నీ కనిపిస్తాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం నెట్‌బ్యాంకింగ్ నుంచే పర్సనల్ లోన్ తీసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. బ్యాంకుల్లో రుణం లభించాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ మీకు క్రెడిట్ హిస్టరీ లేకున్నా, లేదా బ్యాంకుతో దీర్ఘకాలిక అనుబంధం లేకున్నా సులభంగా రుణం కావాలనుకున్నా స్టార్టప్ యాప్‌లను సంప్రదించాల్సిందే. ఎర్లీశాలరీ డాట్ కామ్, లోన్‌ట్యాప్ ఇటువంటివే. యాప్ ఉంటే చాలు ఎటువంటి రుణ చరిత్రలేని కస్టమర్లను స్టార్టప్‌లు తమ వ్యాపార విస్తరణకు ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కాకపోతే వివిధ రకాల అంశాల ఆధారంగా రుణ అర్హతను తేల్చేస్తాయి. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, స్నేహితుల జాబితా, వారి ఖర్చుల తీరు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ ఆధారంగా ఆర్థిక సామర్థ్యం, చరిత్రను విశ్లేషించి చూస్తాయి. ఎర్లీశాలరీ డాట్‌కామ్ అయితే ఒక రోజు నుంచి ఒక నెల కాలానికి పర్సనల్ లోన్స్‌ను మంజూరు చేస్తోంది. యాప్ ద్వారా రుణ దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ పత్రాలను జత చేసిన తర్వాత, అర్హత ఉంటే కొన్ని గంటల్లోపే రుణం మంజూరు అవుతుంది. కేవైసీ అన్నది మొదటిసారి మాత్రమే. ఒకసారి కేవైసీ ఇచ్చి, పర్సనల్ లోన్ తీసుకుని ఉన్నవారు, ఆ తర్వాత ఎప్పుడు రుణం కావాలన్నా అప్పటికప్పుడే పొందొచ్చు. దరఖాస్తుదారుల్లో 35% మంది కొత్తగా రుణాలు తీసుకుంటున్నవారే ఉంటున్నారని ఎర్లీశాలరీ సహ వ్యవస్థాపకుడు మెహరోత్రా తెలిపారు. ఇక లోన్‌ట్యాప్ అయితే రూ.5 లక్షల్లోపు రుణం ఆఫర్ చేస్తోంది. ఒక రోజు నుంచి ఐదేళ్ల వ్యవధికి రుణాన్ని తీసుకోవచ్చు. ఈ సంస్థ అందించే రుణం క్రెడిట్‌కార్డును పోలి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత కనీస మొత్తం చెల్లించి, మిగిలిన రుణంపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని లోన్‌ట్యాప్ సీఈవో సత్యం తెలిపారు. ఇతర సంస్థలు సైతం ఇక క్యుబెరా డాట్ కామ్ వంటి మధ్యవర్తిత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్, పేసెన్స్తో జతకట్టి రుణాలను ఆఫర్ చేస్తోంది. ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ కూడా ఈ తరహాలోనే పనిచేస్తోంది. క్యుబెరా, పేసెన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్న వారిలో పెద్ద బ్యాంకుల ఖాతాదారులు సైతం ఉంటున్నారు. రుణ మంజూరులో ఉన్న వెసులుబాటే అందుకు కారణం. ఒకసారి కస్టమర్‌కు రుణాన్ని మంజూరు చేసి వారితో అనుబంధం ఏర్పడితే ఇక ఆ తర్వాత ఇన్‌స్టంట్‌గానే రుణాన్ని అందిస్తున్నట్టు పేసెన్స్ వ్యవస్థాపకుడు సయాలి కరంజ్‌కార్ తెలిపారు. అయితే, రుణాలు తీసుకోవడంలో ఉన్న ఈ సౌలభ్యాన్ని చూసి రుణ ఉచ్చులో చిక్కుకోవద్దని ఆర్థిక పండితులు సూచిస్తున్నారు. రుణం చెల్లించడంలో విఫలమైతే అవి క్రెడిట్ బ్యూరోకు సమాచారం చేరవేస్తాయి. దీంతో ఆ తర్వాత ప్రైవేటు సంస్థల వద్ద కూడా రుణం లభించడం కష్టతరమవుతుంది. అత్యవసరమైతేనే అత్యవసర పరిస్థితుల్లోనే ఈ తరహా సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, సాధారణ ఖర్చుల కోసం రుణాన్ని ఆశ్రయించి చిక్కులు తెచ్చుకోవద్దంటున్నారు. వ్యయాలు నియంత్రించుకోలేని పరిస్థితుల్లోనే సాధారణ వ్యక్తులు ఎక్కువ సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారని హెచ్చరిస్తున్నారు. ఒకసారి రుణం తీసుకున్న తర్వాత మరోసారి తిరిగి రుణం తీసుకోకుండా ఉండడం కష్టమేనని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మల్హార్ మజుందార్ పేర్కొన్నారు. -
చైనాలో యాపిల్‌కు మరో ఎదురు దెబ్బ
బీజింగ్: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ కు చైనాలో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా 28 యాప్ డెవలపింగ్ కంపెనీలు యాపిల్ కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు చేశాయి. మార్కెట్ పవర్ దుర్వినియోగం, యాపిల్ స్టోర్ కంట్రోల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ 28 యాప్ డెవలపర్లు గ్రూప్ ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. యాపిల్ తన ఆపరేటింగ్ సిస్టం దుర్వినియోగం చేస్తూ చైనా యాప్ డెవలర్లను మోసం చేస్తోందని ఈ గ్రూపు ఆరోపించింది. అలాగే ఎలాంటి కారణం లేకుండా చైనా యాప్‌లను తొలగిస్తూ , యాప్ కొనుగోలుకు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తోందనేది చైనా రెగ్యులేటరీ ప్రధాన ఆరోపణ. బీజింగ్-ఆధారిత డేర్ అండ్ సుయర్ అనే న్యాయ సంస్థ చైనాలో ఈ కేసుని నమోదు చేసింది. దీంతో ఇప్పటికే చైనాలో నియంత్రణ సమస్యలు ఎదుర్కొంటున్న కుపెర్టినో ఆధారిత అమెరికన్ బహుళజాతి సాంకేతిక దిగ్గజం యాపిల్ మరిన్ని ఇబ్బందుల్లో పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ పిర్యాదుపై యాపిల్ స్పందించింది. "స్థానిక చట్టాలు, నిబంధనలకు" కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. చైనాలో లోకల్ డెవలపర్లతో తమ సత్సంబంధాలను మరింత విస్తరించనున్నామని చెప్పింది. కాగా గత నెల, ఆపిల్ చైనాలోని యాప్ స్టోర్ నుండి అన్ని ప్రధాన వీపీఎన్ యాప్‌లను తొలగించింది. చైనాలో వీపీఎన్ సర్వీసు ప్రొవైడర్లు ఆపిల్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టుగా యాపిల్ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. చైనాలో చట్టవిరుద్ధమైన కంటెంట్ కలిగి ఉన్న కారణంగా వీటిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. -
పేసెన్స్
యాప్‌కీ కహానీ... రవి ల్యాప్‌టాప్ కొందామనుకున్నాడు. అది అతనికి చాలా అవసరం. కానీ రవి వద్ద డబ్బులు లేవు. అప్పుడు తెలిసిన వారిని సాయమడిగాడు. వారేమో ఒట్టి చేతులు చూపించారు. సరిగ్గా అదే సమయంలో రవి స్నేహితుడైన వలి అతనికి ‘పేసెన్స్ యాప్’ గురించి చెప్పాడు. దీని సాయంతో రవి ల్యాప్‌టాప్ కొని తన సమస్య నుంచి గట్టెక్కాడు. ఇక్కడ రవి ‘పేసెన్స్’ అనే యాప్ ద్వారా రుణం పొందాడు. దీని ద్వారా తనకు కావాల్సిన ప్రొడక్ట్‌ను కొన్నాడు. ఇక పేసెన్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇔ యూజర్ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ⇔ దీని ద్వారా రూ.5,000–రూ.1,00,000 వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ⇔ ఉద్యోగం చేస్తున్నవారు వెంటనే లోన్ కోసం అప్లై చేయవచ్చు. సరళ విధానంలో 4–7 రోజుల్లో రుణాన్ని పొందొచ్చు. ఇది డైరెక్ట్‌గా మన బ్యాంక్ ఖాతాకు వచ్చి చేరుతుంది. ⇔ తీసుకున్న రుణాన్ని సులభమైన ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. ⇔ చెన్నై, బెంగళూరు, ముంబై సహా పది పట్టణాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లోనూ పేసెన్స్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
అందుబాటులో పీహెచ్ఎల్వీ ’ 94949 33233
పోలీస్ ఫేస్బుక్ కూడా ఆవిష్కరించిన ఎస్పీ విశాల్ గున్ని కాకినాడ క్రైం: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సప్ (పీహెచ్ఎల్వీ) ను ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన వాట్సప్ హెల్ప్‌లైన్ తూర్పు గోదావరి జిల్లా పోలీస్ నం. 94949 33233ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో పోలీస్ సేవల సరళీకృతం, పారదర్శక పాలన అందించేందుకు వీలవుతుందన్నారు. అందరి చేతుల్లో ఆధునికమైన ఫోన్లు ఉంటున్నాయని, ఎక్కడైనా సమస్య, సంఘటన సంభవిస్తే తక్షణమే వాట్సప్ నంబర్‌కు పోస్టింగ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా పోస్ట్ చేసిన మరుక్షణమే జిల్లా పోలీస్ కార్యాలయంలోని కంట్రోల్ రూం నుంచి సంబంధిత ఎస్సై, సీఐ, డీఎస్పీలకు క్షణాల్లో సమాచారం చేరుతుందన్నారు. వెనువెంటనే సమస్య పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఎమర్జెన్సీ సంఘటనలపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వీలు లేనప్పుడు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లే సంఘటనలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలను వాట్సప్ చేస్తే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతికతను అందుపుచ్చుకుంటూ నేరాల నియంత్రణకు సామాజిక స్పృహతో పోలీసులతో కలసి పనిచేసేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫేస్బుక్లో యువతతో పోలీసింగ్, ప్రజా సంబంధాలు, పారదర్శనపై సలహాలు, సూచనలను పంచుకుంటామన్నారు. పలు ఫిర్యాదులపై ఎస్పీ, సీఐ, ఎస్సైలను కలసి ఫిర్యాదు చేయలేకపోయామనే భావన రాకుండా వాట్సప్, ఫేస్బుక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ రహదారుల్లో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత పోలీస్ అధికారులకు పంపించేందుకు ఇరవై నాలుగు గంటల పాటూ మూడు ఫిప్టుల్లో పని చేసేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించినట్టు ఎస్పీ తెలిపారు. వీరు నిరంతరం కంట్రోల్ రూమ్‌లో ఉంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు పంపుతారన్నారు. ఫిర్యాదుదారులకు వాట్సప్‌లో ఆన్లైన్లో ఎఫ్ఐఆర్/రసీదు ఇస్తారన్నారు. సమస్య పరిష్కారం తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలపై సమాచారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
యాప్స్ ద్వారా ఫండ్స్ కొనుగోళ్లు సురక్షితమేనా?
మొబైల్ యాప్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చా? ఇలా కొనుగోలు చేయడం ఎంత వరకు సురక్షితం? –సుచరిత, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను వివిధ యాప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే మొబైల్ యాప్‌ల ద్వారా మొబైల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసేటప్పుడు.. మీరు రెగ్యులర్ ప్లాన్ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారా ? లేక డైరెక్ట్ ప్లాన్ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారా అనే విషయాన్ని గమనించాలి. ఉదాహరణకు ఫండ్స్ఇండియా, స్క్రిప్‌బాక్స్ అనే మొబైల్‌యాప్‌లను ఉపయోగిస్తే రెగ్యులర్ ప్లాన్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. మొబైల్ యాప్‌లు, లేదా ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం సురక్షితమేనని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలు కోసం మీరు పంపించే సొమ్ములు ఆ యాప్‌లకు కాకుండా ఫండ్‌హౌస్‌లకు చేరతాయి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి మ్యూచువల్ ఫండ్ యుటిలిటిస్ మంచి సౌకర్యవంతమైన, సురక్షితమైన మార్గం. ఈ ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటిస్’ పోర్టల్ ద్వారా వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల డైరెక్ట్ ప్లాన్‌ల్లో ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేకాకుండా యూనిట్లను విక్రయిస్తే, ఆ సొమ్ములు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తాయి. మొబైల్ యాప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహిస్తే, సదరు యాప్‌ల ద్వారానే కాకుండా ఆ ఫండ్‌హౌస్‌కు సంబంధించిన రిజిస్ట్రార్ల ద్వారా కూడా మీకు సమాచారం వస్తుంది. ఆల్ట్రాషార్ట్‌టర్మ్ ఫండ్స్ అంటే ఏమిటి? ఈ ఫండ్స్‌కు లాక్–ఇన్ పీరియడ్ ఉంటుందా? సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తంలో ఉన్న డిపాజిట్లను విత్‌గ్రా చేసి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఆల్ట్రాషార్ట్‌టర్మ్ ఫండ్స్‌ను సూచించండి. –వికాస్, విజయవాడ ఏడాది కంటే తక్కువ మెచ్యూరిటీ ఉండే సెక్యూరిటీల్లో ఆల్ట్రాషార్ట్‌టర్మ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని నెలల నుంచి ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఈ ఫండ్స్.. మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫండ్స్ గ్యారంటీగా ఇంత రాబడులనిస్తాయని, మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితమని చెప్పలేము. అయినప్పటికీ, ఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమంత రిస్క్ కాదని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతా కంటే కూడా కొంచెం అధిక రాబడులను పొందవచ్చు. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ లేదు. రిడంప్షన్ రిక్వెస్ట్ సమర్పించిన 1 లేదా 2 రోజుల్లోనే మీరు మీ సొమ్ములను పొందవచ్చు. కొన్ని ఫండ్‌హౌజ్‌లు తక్షణ రిడంప్షన్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలోనే ఉంచి మిగిలిన మొత్తాన్ని ఈ ఆల్ట్రాషార్ట్‌టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. డెట్ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఈ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి. మూడేళ్లలోపు ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ యూనిట్ల విక్రయంపై వచ్చిన లాభాన్ని మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత ఫండ్స్‌ను విక్రయిస్తే, వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై 20 శాతం పన్ను(ఇండెక్సేషన్ ప్రయోజనంతో) విధిస్తారు. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కింద ఉదహరించిన ఆల్ట్రాషార్ట్‌టర్మ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రాషార్ట్ బాండ్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఎక్స్ఏ ట్రెజరీ అడ్వాండేజ్ ఫండ్, బరోడా పయనీర్ ట్రెజరీ అడ్వాండేజ్, కోటక్ లో డ్యూరేషన్ ఫండ్–స్టాండర్డ్ ప్లాన్. నేను వ్యాపారం చేస్తున్నాను. నెలవారీగా నిర్దేశిత మొత్తంలో ఆదాయం రాదు. ఒక్కో నెలలో పెద్ద మొత్తం ఆదాయం వస్తుంది. ఒక్కోసారి మూడు నెలల వరకూ ఎలాంటి ఆదాయమూ రాదు. నాలాంటి వాళ్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని ఎలా అనుసరిస్తారు? మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? – రఘు, విశాఖపట్టణం నెలవారీగా నిర్దేశిత మొత్తాల్లో ఆదాయం రానివాళ్లు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక నెలలో రూ. లక్ష ఆదాయం వచ్చిందనుకుందాం. తర్వాత 3 నెలల వరకూ ఎలాంటి ఆదాయం రాలేదనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్‌ను గానీ, ఆల్ట్రాషార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్‌ను గానీ ఎంచుకోవాలి. పెద్ద మొత్తంలో ఆదాయం రాగానే వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్స్ నుంచి మూడు నుంచి ఆరు నెలల కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి బదిలీ చేసుకోవాలి. మీకు ప్రతి నెలా పెద్దమొత్తంలో ఆదాయం వచ్చిందనుకుందాం. అప్పుడు ప్రతి నెలా పెద్దమొత్తంలోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆదాయం రాని నెలల్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోయినా పర్వాలేదు. వడ్డీరేట్లు 9–10 శాతం రేంజ్లో ఉన్నప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్12–18 శాతం రాబడులనిచ్చాయి. ఇప్పుడు వడ్డీరేట్లు 6–7 శాతం రేంజ్‌కు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో 12–15 శాతం రాబడులు ఆశించవచ్చా? – జావేద్, బెంగళూరు మన ఆర్థిక వ్యవస్థ, మన కంపెనీల పనితీరు ఎలా ఉంటుందనే అంశాలపై మల్టీక్యాప్ ఫండ్స్ రాబడులు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత సంస్కరణల కారణంగా మల్టీక్యాప్ ఫండ్స్ భవిష్యత్తులో మంచి రాబడులే ఇస్తాయని చెప్పవచ్చు. మల్టీక్యాప్ ఫండ్స్ 15–20 ఏళ్ల క్రితం ఎంతైతే రాబడులనిచ్చాయో, అంతకు మించి భవిష్యత్తులో రాబడులనిచ్చే అవకాశాలున్నాయి. -
నేను నిద్రపోనివ్వనుగా ..!
బీజింగ్: వాహనాన్ని నడిపే సమయంలో నిద్రమత్తు, అలసటకు గురయ్యే డ్రైవర్లను అప్రమత్తత చేసేందుకుగాను నూతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. నిద్రమత్తు కారణంగా జరిగే ఘోర ప్రమాదాలను నివారించేందుకు ఈ నూతన యాప్ ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రైవర్లు ముందుగా ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం డ్రైవింగ్ చేసే సమయాల్లో యాప్‌ను ఆన్ చేసి ఫోన్‌ను డ్రైవర్ తలకు ఎదురుగా.. స్టీరింగ్‌కు దగ్గర్లో ఉంచాలి. ప్రయాణ సమయంలో ఈ యాప్ డ్రైవర్ల ముఖకవళికలను గమనిస్తూ ఉంటుంది. డ్రైవర్ ముఖంలో ముఖ్యంగా కనురెప్పలు, తల పొజిషిన్‌ను ఫోన్ కెమెరాతో వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఈ రెండింటిలో ఏవైనా మార్పులు కలిగినట్లయితే ఈ యాప్ తక్షణమే పెద్దగా శబ్ధం చేస్తుందని యాప్‌ను అభివృద్ధి చేసిన చైనాలోని హాంగ్‌కాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వివరించారు. సెన్సార్లు, ఇతర పరికరాల సహాయం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌తోనే ప్రమాదాలను కాపాడవచ్చని, అదనంగా ఖర్చు కూడా అవసరం లేదని వారు పరిశోధకులు తెలిపారు. -
కాల్ నాణ్యత కోసం ట్రాయ్ యాప్
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన టెలికం రంగ నియంత్రణ సంస్థ తాజాగా కాల్ నాణ్యతను సమీక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తేనుంది. కాల్ పూర్తయిన తర్వాత సబ్‌స్క్రయిబర్స్.. సేవల నాణ్యతకు రేటింగ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడనుంది. అలాగే మొబైల్ యూజర్లకు టెలీమార్కెటర్స్ బెడద తప్పించే దిశగా ’డు నాట్ డిస్టర్బ్’ రిజిస్ట్రీని మరింత పటిష్టం చేయనుంది. ట్రాయ్ ఏర్పాటై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే డీఎన్డీ రిజిస్ట్రీ అమల్లో ఉంది. ఇందులో నమోదు చేసుకున్న సబ్స్క్రయిబర్స్కు కాల్స్ చేసే టెలీమార్కెటింగ్ కంపెనీలకు భారీగా జరిమానాలకు ఆస్కారం ఉంది. -
మధుమేహ రోగులకు ఓ యాప్
న్యూయార్క్: మధుమేహంతో బాధపడుతున్నవారు తమ రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ కొత్త యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. ‘గ్లూకోరాకిల్’అనే ఈ యాప్ ఓ వ్యక్తి తీసుకునే ఆహారాన్ని బట్టి అతనిలోని చక్కెర స్థాయి ఎంత పెరుగుతాయో అంచనా వేస్తుందని అమెరికాలోని కొలంబియా వర్సిటీ మెడికల్ సెంటర్(సీయూఎమ్సీ)కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. అయితే ఏ ఆహారం తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు తమ యాప్ ఉపయోగపడుతుందని సీయూఎమ్సీ పరిశోధకుడు డేవిడ్ అల్బర్స్ తెలిపారు. మొదటగా యాప్‌లోకి రక్తంలోని చక్కెర స్థాయిల వివరాల్ని అప్లోడ్ చేయాలి. అనంతరం వారు తీసుకునే ఆహారాన్ని ఫొటో తీసి.. సుమారుగా దానిలో ఉండే పోషక విలువలను అప్లోడ్ చేయాలి. దీంతో ఈ యాప్ మీరు అప్లోడ్ చేసిన ఆహారం తీసుకున్న తర్వాత చక్కెర స్థాయిలను అంచనా వేసి చూపిస్తుందని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘పీఎల్వోఎస్ కాంప్యూటేషనల్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
సీఈవో 'పూర్' కామెంట్స్: స్పందించిన కంపెనీ
సీఈవోపై ఆరోపణలను ఖండిస్తున్న స్నాప్ చాట్ న్యూయార్క్ : భారత్, స్పెయిన్ మార్కెట్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై కంపెనీ స్పందించింది. కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి, సీఈవోపై చేస్తున్న ఆరోపణలను స్నాప్‌చాట్ కొట్టిపారేసింది. తమ మల్టిమీడియా మొబైల్ యాప్ ప్రతిఒక్కరికీ అంటూ సీఈవోను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. కంపెనీ ఎల్లవేళలా భారత యూజర్లకు ''కృతజ్ఞత'' భావంతో ఉంటుందని పేర్కొంటోంది. '' స్నాప్‌చాట్ ప్రతిఒక్కరికీ! ఉచితంగా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులో ఉంది'' అని కంపెనీ అధికారప్రతినిధి ఓ ప్రకటించారు. కంపెనీ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియాన్ చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్నాప్ చాట్ యాప్ కేవలం ధనిక వ్యక్తులకేనని, భారత్, స్పెయిన్ లాంటి పేదదేశాలకి విస్తరించాలనుకోవడం లేదని స్పీగల్ వ్యాఖ్యానించినట్టు మాజీ ఉద్యోగి ఆరోపించారు. స్పీగల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు వెలువడగానే, కంపెనీపై యూజర్లు మండిపడుతున్నారు. ట్విట్టర్లో స్నాప్ చాట్ పై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. చాలామంది ఇప్పటికే తమ స్నాప్ చాట్ యాప్ ను అన్ఇన్స్టాల్ చేసి, బాయ్ కాట్‌కు పిలుపునిచ్చారు. కొంతమంది తెలియక, స్నాప్ చాట్ బదులు స్నాప్ డీల్ ను అన్ఇన్స్టాల్ చేశారు. -
ఒక్కసారిగా స్నాప్‌చాట్ రేటింగ్స్ ఢమాల్
న్యూఢిల్లీ : భారత్, స్పెయిన్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ చేసిన సంచలన వ్యాఖ్యలు కంపెనీకి భారీగా దెబ్బకొడుతున్నాయి. ట్విట్టర్లో ఇప్పటికే ఈ కంపెనీపై పలు రకాలుగా కామెంట్లు వెల్లువెత్తుతుండగా.. చాలామంది తమ మొబైల్ నుంచి స్నాప్ చాట్ ను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. అంతేకాక యాప్ స్టోర్‌లోనూ కంపెనీ రేటింగ్స్ కూడా భారీగా పడిపోతున్నట్టు తెలిసింది. యాప్ స్టోర్‌లో అంతకమునుపు 'ఫైవ్ స్టార్' రేటింగ్ ను సంపాదించుకున్న స్నాప్ చాట్ ఆ రేటింగ్ ను ఒక శాతానికి పడగొట్టుకుంది. యాప్ స్టోర్‌లోని యాప్ సమాచారం ప్రకారం ప్రస్తుత వెర్షన్కున్న కస్టమర్ రేటింగ్స్ ఆదివారం ఉదయానికి 'సింగిల్ స్టార్'(6099 రేటింగ్స్ ఆధారితంగా) నమోదైనట్టు తెలిసింది. మొత్తం వెర్షన్ల రేటింగ్ కూడా 'వన్ అండ్ ఆఫ్ స్టార్'(9527 రేటింగ్స్ ఆధారితంగా) మాత్రంగానే ఉన్నట్టు వెల్లడైంది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో మాత్రమే 'ఫోర్ స్టార్' దక్కించుకుంది. తమ మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ ధనవంతులకే తప్ప పేదవాళ్లకి కాదని ఇవాన్ 2015 సెప్టెంబర్ లో వ్యాఖ్యానించినట్టు కంపెనీ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియాన్ చేసిన ఆరోపణలను వెరైటీ రిపోర్టు చేసింది. భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఉన్నాయని తాను చెప్పానని కానీ అప్పుడు ఇవాన్ స్పీగెల్ జోక్యం చేసుకుని 'స్నాప్‌చాట్ కేవలం సంపన్నులకు మాత్రమేనని, పేదదేశాలకు కాదని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఆంథోనీ ఆరోపించినట్లు వెరైటీ తన కథనంలో పేర్కొంది. ఇవాన్ స్పీగల్ కామెంట్లు బయటికి రాగానే, ఒక్కసారిగా స్నాప్ చాట్ పై యూజర్లు మండిపడుతున్నారు. పేద దేశాలు భారత్, స్పెయిన్ లు స్నాప్ చాట్ కంటే బెటర్ అని కొంతమంది యూజర్లు తన పోస్ట్ లో చెబుతున్నారు. స్నాప్ చాట్ అకౌంట్ ను అన్ఇన్స్టాల్ చేస్తూ.. యాప్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. I was addicted to @Snapchat but I love my country more than this app. Let's see how you earn without Indians. @evanspiegel #boycottsnapchat — Shreya Tewari (@SarcasticSheeya) April 16, 2017 -
ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ యాప్ క్యాష్
యువ ప్రొఫెషనల్స్.. స్వల్పకాలిక అవసరాల కోసం రుణాలను అప్పటికప్పుడు పొందేందుకు క్యాష్‌ఇ (CASHe) యాప్ ఉపయోగపడుతుంది. సుమారు రూ.5,000 నుంచి రూ. 1,00,000 దాకా రుణాలను 15, 30, 90 రోజుల వ్యవధికి పొందవచ్చు. ఫేస్బుక్, గూగుల్ ప్లస్ లేదా లింక్డ్ఇన్ ద్వారా ఈ మొబైల్ యాప్‌లోకి లాగిన్ కావచ్చు. దరఖాస్తుదారు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కింద తాము నివసించే నగరం, పనిచేసే సంస్థ, జీతం మొదలైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, లేటెస్ట్ శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ మొదలైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. రెండు గంటల్లోగా ఎంత రుణం పొందేందుకు అర్హత ఉందనేది యాప్ తెలియజేస్తుంది. అర్హత ప్రకారం రుణమొత్తం, వ్యవధి, వడ్డీ రేటు తదితర వివరాలు చూపిస్తుంది. అవసరానికి అనుగుణమైనది ఎంచుకుంటే.. సదరు రుణ మొత్తం కొంత వ్యవధిలో బ్యాంక్ ఖాతాలోకి జమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌కి 4.2 రేటింగ్ ఉంది. -
వ్యక్తిగత రహస్యాలను తస్కరిస్తున్న యాప్స్!
వాషింగ్టన్: నిమిషాల్లో పనులవుతున్నాయని అందరం యాప్‌లను తెగ వినియోగించుకుంటున్నాం. కానీ అవి ఎంత వరకు సురక్షితమో ఒక్కసారి ఆలోచించండి. రెగ్యులర్‌గా వాడే యాప్‌లు మన వ్యక్తిగత వివరాలను తస్కరించే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక ఆన్లైన్లో జరిపే లావాదేవీలపై జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్స్ ఎంత వరకు సేఫ్ అనేదానిపై పరిశోధకులు అధ్యయనాన్ని జరిపారు. ఇందుకోసం దాదాపు 300పైగా యాప్‌లతోపాటు మన ఫోన్లోకి వైరస్‌లను పంపే మరో 9,994 మాల్వేర్ యాప్‌లను శాస్త్రవేత్తలు పరిశోధించారు. అయితే ఈ యాప్‌లలో ఎక్కువశాతం వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై వర్జినియా యూనివర్శిటికి చెందిన అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గాంగ్ వాంగ్ మాట్లాడుతూ.. ఫేస్బుక్ , వాట్సప్ వంటి యాప్‌ల ద్వారా కాల్స్ చేసుకోవద్దని హెచ్చరించారు. -
యాప్‌కీ కహానీ క్యాష్‌కేర్
మీ వద్ద్ద క్రెడిట్ కార్డు లేదా? కానీ వాయిదాల్లో ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ వంటి పలు వస్తువులను కొందామనుకుంటున్నారా? ఇంకేం ‘క్యాష్‌కేర్’ అనే యాప్‌ను ఉపయోగించి చూడండి. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇒ క్రెడిట్ కార్డు లేకుండానే ఈఎంఐ విధానంలో ఆన్లైన్లో ప్రొడక్టులను కొనుగోలు చేయవచ్చు. ⇒ అర్హతను బట్టి తక్షణ రుణ ఆమోదం. కనీస డాక్యుమెంట్లు ఉంటే చాలు. ⇒ రుణాన్ని 3–12 ఈఎంఐలలో చెల్లించొచ్చు. ⇒ షాప్‌క్లూస్ వంటి ఆన్లైన్ పోర్టళ్లలో షాపింగ్ చేయవచ్చు. లేదా క్యాష్‌కేర్ యాప్‌లోనే పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. నచ్చిన వాటిని కొనుగోలు చేయవచ్చు. -
రెంటోమోజో
యాప్‌కీ కహానీ... ఉద్యోగులకు బదిలీ అయితే లగేజ్‌తో సమస్యే. మనమైతే వెంటనే బస్సో, రైలో ఎక్కి వెళ్ళిపోతాం. లగేజ్ సంగతి వేరు. దాన్ని తీసుకెళ్లాలంటే ఎన్నో తిప్పలు. ఇంట్లోకి కావలసిన ఫర్నిచర్, ప్రొడక్టులను అద్దెకిచ్చే వారు దొరికితే.. లగేజ్ ట్రాన్స్ఫర్ సమస్యలుండవు. ప్రస్తుతం ‘రెంటోమోజో ఫర్నిచర్ రెంటల్’ అనే యాప్ ఈ సేవలనే అందిస్తోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు నచ్చిన ప్రొడక్టులను నెలవారీ అద్దెకు తీసుకోవచ్చు. ఉచిత డెలివరీ, ఇన్స్టలేషన్, సెటప్. ఫ్రీ–పికప్ సౌకర్యం. నాణ్యతకు 100 శాతం గ్యారెంటీ. బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్, స్టడీ రూమ్ సంబంధిత ఫర్నిచర్.. టీవీలు, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, మైక్రోఒవెన్ వంటి ప్రొడక్ట్స్.. ఆఫీస్ ఫర్నిచర్, వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐలను యాప్ ద్వారానే చెల్లించొచ్చు. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. -
జియో క్యాబ్‌లపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
ముంబై: యాప్ ఆధారిత టాక్సీ సేవలపై రిలయన్స్ స్పందించింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టాక్సీ సేవల రంగంలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలను రిలయన్స్ వర్గాలు వ్యతిరేకించాయి. ప్రత్యక్షంగా రిలయన్స్ జియో నేరుగా స్పందించ కపోయినప్పటికీ, రిలయన్స్ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ద్వారా ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రణాళికలేవీ లేవని వివరణ ఇచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ కంపెనీ త్వరలోనే జియో ప్రారంభించనుందన్న వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ వార్తలు తప్పు అంటూ కొట్టి పారేశారు. మరోవైపు రిలయన్స్ జియో సంబంధంలేని రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఏదీ లేదని రిలయన్స్ అధికారి ఒకరు వివరించారు. జియో ప్రీపెయిడ్ వాలెట్ జియో మనీ ద్వారా టాక్సీ చెల్లింపులకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఈ వారం టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జిమో మనీ ద్వారా ఈ ఉబెర్ సేవలను వినియోగించుకుని చెల్లింపులు చేసిన వినియోగదారులకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా 170 రోజుల్లో 100 మిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న జియో ప్రారంభ ఆఫర్ లోనే టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి దిగ్గజ కంపెనీలకు సైతం చుక్కలు చూపించింది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు క్యాబ్ సర్వీసుల మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలో ఉందన్నవార్తలు ఇటీవల బాగా వ్యాపించాయి. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ క్యాబ్ మార్కెట్‌ను పూర్తిగా స్టడీ చేస్తున్నారనీ జియో క్యాబ్స్ పేరిట సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నారని నివేదికలొచ్చాయి. ఏప్రిల్‌లోనే లాంచ్ చేయనున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలల్లోనే కమర్షియల్‌గా అందుబాటులోకి తేనున్నారన్న అంచనాలు బాగా వచ్చాయి. ఇందుకోసం ఇప్పటికే మహింద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపారనీ, 600 కార్లను కూడా ఆర్డర్ ఇచ్చిందని, తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి అనంతరం ఢిల్లీ, ముంబై విస్తరిస్తుందని వెల్లడించిన సంగతి విదితమే. -
జియో కొత్త సర్వీసులు.. ఈ ఏడాది తర్వాతనే
టెలికాం రంగంలో సంచలనాలు సష్టిస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఈ ఏడాది తర్వాత మరో ఎత్తుగడకు ప్లాన్ చేస్తోంది. సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ఈ ఏడాది తర్వాత ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. రిలయన్స్ జియో క్యాబ్స్‌గా వీటిని నామకరణం చేయనుందట. ఏప్రిల్ లోనే లాంచ్ చేద్దామనుకున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలలు ఆలస్యంగా కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఫాక్టర్ డైలీ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే కంపెనీ మహింద్రా, హ్యుందాయ్ వంటి వాటితో సంప్రదింపులు చేస్తుందని తెలుస్తోంది. 600 కార్లను కూడా ఆర్డర్ చేసిందట. తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి, అనంతరం ఈ సర్వీసులను ఢిల్లీ, ముంబాయిలకు విస్తరిస్తుందని ఫాక్టర్ డైలీ పేర్కొంది. అదేసమయంలో చిన్న మార్కెట్లలో కూడా తన సర్వీసులను ప్రారంభిస్తుందట. జియో ఇటీవలనే టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో కష్టమర్లు ఇకపై ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా చెల్లింపులు జరుపుకునేలా ఈ భాగస్వామ్యం సహకరించనుంది. టెలికాం రంగంలో ఉచిత ఆఫర్లతో దూసుకెళ్తున్న జియో తన కస్టమర్ల బేసిస్‌ను కూడా 10 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. -
ఉచితంగా యాంటీ–వైరస్ టూల్స్
‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ను ప్రారంభించిన ఐటీ శాఖ న్యూఢిల్లీ: సైబర్ దాడుల నుంచి కంప్యూటర్/ల్యాప్‌టాప్/మొబైల్ ఫోన్‌ను రక్షించుకునేందుకు మీరు ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్ లేదా సైబర్ స్వచ్ఛత కేంద్ర వెబ్సైట్ (www.cyberswachhtakendra.gov.in) నుంచి ఉచితంగా ప్రభుత్వం రూపొందించిన ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైబర్ దాడుల బెడద రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సాయంతో ‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ద్వారా కొత్త డెస్క్‌టాప్ అండ్ మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో వైరస్, మాల్వేర్ను విశ్లేషించే యాప్‌సంవిద్/యాప్వైట్ లిస్టింగ్, యూఎస్బీ ప్రతిరోద్ అనే టూల్స్ ఉన్నాయి. వీటిని సి–డాక్ అభివృద్ధి చేసింది. యూఎస్బీ ప్రతిరోద్ అనేది పోర్టబుల్ యూఎస్బీ స్టోరేజ్ పరికరాల అనధికార వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఇక యాప్‌సంవిద్ టూల్ విండోస్ పీసీలపై పనిచేస్తుంది. ఇది ముందస్తు అనుమతి ఉన్న యాప్స్, ఫైల్స్‌ను మాత్రమే అనుమతిస్తుంది. మిగతా అన్ని వైరస్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. ఇక్కడ ఇంకొక ‘ఎం–కవచ్’ టూల్ ఉంది. మొబైల్ ఫోన్ల భద్రతే లక్ష్యంగా దీన్ని తీసుకువచ్చారు. కాగా ఈ సొల్యూషన్స్ అన్నీ ఉచితం. ‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో రూ.90 కోట్లు వెచ్చిస్తామని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘దేశీ సైబర్ సెక్యూరిటీ నియంత్రణ సంస్థ కర్టిన్.. ప్రభావితమైన సిస్టమ్స్ డేటాను సేకరించి దాన్ని ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్), బ్యాంక్‌లకు చేరవేస్తుంది. అప్పుడు ఇవి.. యూజర్‌ను గుర్తించి వారికి ఒక లింక్‌ను పంపిస్తాయి. దానిపై క్లిక్ చేసి యాంటీ–వైరస్/యాంటీ–మాల్వేర్ టూల్‌ను డౌన్లోడ్ చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని వివరించారు. ప్రస్తుతం 58 ఐఎస్పీలు, 13 బ్యాంకులు ఈ వ్యవస్థను ఉపయోగించడానికి ముందుకొచ్చాయని తెలిపారు. నేషనల్ సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీసీసీ)ని జూన్ నాటికి ఏర్పాటు చేయాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను ఆదేశించామన్నారు. కేంద్రం దీనికోసం రూ.900 కోట్ల నిధులను కేటాయించింది. ఇది దేశీ ఇంటర్నెట్ వ్యవస్థపై జరిగే సైబర్ దాడులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను రాష్ట్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ప్రజారోగ్యంపై పెట్టుబడులు అవసరం
అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా మనం వెనుకబడ్డాం దేశంలో 49 శాతం ఫిజీషియన్ల సంఖ్య పెరగాలి దీర్ఘకాలిక వ్యాధులతో దేశంలో 60 శాతం మరణాలు బయో ఏషియా సదస్సులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజారోగ్యంపై తక్షణం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా ఆరోగ్య రంగంలో మనం వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంపై బుధవారం జరిగిన బయో ఏషియా–2017 సదస్సులో ఆయన మాట్లాడా రు. దేశంలో సగటు ఆయుర్దాయం 1960లో 45 ఏళ్లుంటే.. 2010 నాటికి అది 67 ఏళ్లకు చేరుకుందని.. చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని వివరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే మనం ఆరోగ్య రంగంలో వెనుకబడి ఉన్నామని చెప్పారు. శిశు మరణాల రేటు 1995–2015 మధ్య 25కు తగ్గిందని.. అయితే మిలీనియం డెవలప్మెంట్ గోల్‌కు చేరుకోలేక పోయామన్నారు. దక్షిణ భారతదేశంలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉన్నామన్నారు. ఇమ్యునైజేషన్లోనూ మనదేశం వెనుకబడి ఉందన్నారు. టీబీ వ్యాధులు తగ్గినా.. అంతర్జాతీయంగా పోలిస్తే మాత్రం వెనుకబడే ఉన్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల (జీవనశైలి)తో దేశంలో 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా పనిచేసే దశలో ఉండే 35–65 ఏళ్ల వయసు వారే ఈ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యాధుల నిర్థారణ, నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ముఖ్యంగా మొబైల్ యాప్స్ కూడా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయని, యాపిల్ వాచ్‌తో హార్ట్ బీట్, ఫిట్నెస్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలో డాక్టర్ల సంఖ్య పెరగాల్సిన అవసరముందని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఫిజీషియన్లు 49 శాతం, దంత వైద్యులు 109 శాతం, నర్సులు 177 శాతం, మిడ్ వైవ్స్ 185 శాతం, మహిళా వైద్య నిపుణులు 62 శాతం, పిల్లల వైద్యులు 68 శాతం పెరగాల్సిన అవసరముందన్నారు. వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు మనకు సరైన ప్రజారోగ్య నిర్వహణ వ్యవస్థ, ఆరోగ్య సమాచార సేకరణ, విశ్లేషణ ఉండాలన్నారు. రెండంకెల స్థాయిలో ఫార్మా ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమ తుల వృద్ధి రెండంకెల స్థాయిలో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సుధాంశు పాండే వెల్లడించారు. బయో ఏషియా సదస్సులో మాట్లాడుతూ.. ఇతర రంగాల కంటే సాపేక్షికంగా ఫార్మా రంగమే మెరుగ్గా ఉందని, గత నెల వృద్ధి 8 శాతంగా ఉందని తెలిపారు. ముగిసిన సదస్సు మూడ్రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో జరిగిన బయో ఏషియా–2017 సదస్సు బుధవారం ముగిసింది. ఈ సదస్సులో 51 దేశాల నుంచి 1,480 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు వేదికగా వ్యాపారం, భాగస్వామ్య అం శాలపై వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల మధ్య 1,200 వరకు సమా వేశాలు జరిగాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ సదస్సులో ప్రపంచ దిగ్గజ ఔషధ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే, నోవార్టిస్, గ్లెన్‌మార్క్, వోకార్డ్, ఫిలిప్స్, డెలైట్ తదితర కంపెనీలతో చర్చలు జరిపారు. జీవ వైజ్ఞానిక శాస్త్రం, ఔషధ పరిశ్రమల రంగాల్లో రాష్ట్ర ఆధిపత్యాన్ని నిలుపుకుంటా మని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత బయోటెక్ క్లస్టర్, జినోమ్ వ్యాలీలతో పాటు త్వరతో ఏర్పాటుకానున్న మెడ్‌టెక్ క్లస్టర్, మెడికల్ డివైసెస్ అండ్ ఎలక్రానిక్స్ పార్క్, ఫార్మా క్లస్టర్, హైదరాబాద్ ఫార్మా సిటీల విశేషాలను మంత్రి కేటీఆర్ కంపెనీలకు తెలియజేశారు. హైదరాబాద్‌లో వ్యాపార విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, నైపుణ్యభివృద్ధి అంశంపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)తో నోవార్టిస్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
ఫైనాన్షియల్ కాలిక్యులేటర్ ఇండియా...
దేశీయంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్కీమ్స్‌కి సంబంధించిన లెక్కలను తక్షణం అందించే కాలిక్యులేటర్ ఇది. ఇందులో బ్యాంక్, పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ స్కీమ్స్, బీమా పథకాలు, సాధారణ అంశాలకు సంబంధించిన కాలిక్యులేటర్స్ ఉన్నాయి. బ్యాంక్‌లు లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు .. రికవరింగ్ డిపాజిట్లు చేస్తే ఎంత వడ్డీ రేటుకి ఎంత మొత్తం వస్తుంది వంటి వివరాలు అందిస్తుంది. అలాగే వడ్డీ రేటు ఆధారంగా రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలను కూడా లెక్కవేసుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్ల శ్రేణి వివరాలను ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) వంటి పెట్టుబడి సాధనాల గురించిన సమగ్రమైన సమాచారం ఈ యాప్ అందిస్తుంది. అలాగే సిప్ రూపంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడులు వచ్చే అవకాశముందో తెలియజేస్తుంది. ఇక ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా వంటి బీమా పథకాల్లో ఏ వయస్సు వారు ఎంత ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది తదితర వివరాలు పొందవచ్చు. అలాగే రిటైర్మెంట్ ప్లాన్స్ కి సంబంధించిన పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా ఎంత పొందాలనుకుంటున్న దానిపై అటల్ పెన్షన్ యోజన మొదలైన వాటిల్లో ఎంత కట్టాల్సి ఉంటుందన్నది తెలుసుకోవచ్చు. -
సిస్కో చేతికి ‘దేశీ’ స్టార్టప్ సంస్థ
3.7 బిలియన్ డాలర్లకు యాప్‌డైనమిక్స్ కొనుగోలు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ వ్యాపారవేత్త జ్యోతి బన్సల్ నెలకొల్పిన ‘యాప్‌డైనమిక్స్’ స్టార్టప్ సంస్థను దిగ్గజ కంపెనీ సిస్కో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 3.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కంపెనీలు తమ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌ను మెరుగ్గా నిర్వహించుకునేందుకు, వ్యాపార పనితీరునును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సేవలను యాప్‌డైనమిక్స్ అందిస్తోంది. ఢిల్లీలోని ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన బన్సల్.. 2008లో యాప్‌డైనమిక్స్‌ను ప్రారంభించారు. 2015 సెప్టెంబర్‌లో సీఈవో హోదా నుంచి బన్సల్ తప్పుకున్న తర్వాత డేవిడ్ వాధ్వానీ ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బన్సల్ కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాప్‌డైనమిక్స్ సంస్థ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డీల్ పూర్తి కావొచ్చని అంచనా. -
టూరిజంతో ఉపాధి కోసం సరికొత్త యాప్
-
భీమ్ యాప్ తెలుగులో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌నకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వెల్లడించింది. అప్డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్‌నకు ఇది రెండో అప్డేట్. లబ్ధిదారు బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఆధార్ నంబరుకు నగదు బదిలీ చేసే విధంగా పే టు ఆధార్ నంబర్ ఫీచర్‌ను ఇందులో చేరుస్తున్నట్లు ఎన్పీసీఐ పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల నిబంధనలపై కసరత్తు వినియోగదారుల వివరాల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సురక్షితం చేసే దిశగా మార్గదర్శకాల రూపకల్పనపై కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో వర్తకులనూ భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు గానీ నియంత్రణ వ్యవస్థ గానీ లేదు. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెర గడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. -
టెర్రరిస్టుల కోసం ఓ యాప్..!
► ఉగ్రవాదుల కోసం రూపొందించిన ఐసిస్ ► జేకేబీహెచ్ మాడ్యుల్ విచారణలో వెలుగులోకి.. సాక్షి, హైదరాబాద్: ‘అమన్ అల్ ముజాహిద్’పేరుతో ఓ ప్రత్యేక మొబైల్ యాప్.. ఈ–మెయిల్స్ మార్పిడికి ఎన్క్రిప్టెడ్ విధానం.. టోర్ ఆధారంగా డార్క్ నెట్ వినియోగం.. ఉగ్రవాదుల గోప్యత, భద్రత కోసం అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫ్ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్)’ఉగ్రవాదులు మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ అథవుర్ రెహ్మాన్, అబ్దుల్ బిన్ అహమద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, హబీబ్ మహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, మహ్మద్ ఇర్ఫాన్‌ల విచారణ, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ద్వారా ఈ కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల్లో నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో ఈ వివరాలను ఎన్ఐఏ అధికారులు పొందుపరిచారు. హైటెక్ విస్తరణ.. నిఘాకు చిక్కకుండా, ఉగ్రవాదుల ఉనికి బయటపడకుండా ఐసిస్ అనేక జాగ్రత్తలు తీసు కుంటోంది. ఇందుకోసం అల్ ఫజర్ మీడియా సెంటర్ పేరుతో ఓ మీడియా వింగ్ పని చేస్తోంది. ఈ విభాగం యాప్స్, డార్క్ నెట్ సైట్స్ నిర్వహిస్తోంది. వీటి ఆవిష్క రణ, అభివృద్ధికి అల్ ఫజర్ టెక్నికల్ కమిటీ సైతం ఏర్పాటైం ది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా పని చేసే అమన్ అల్ మజా హిద్ పేరుతో ఓ యాప్‌ను, టుటానోటా యాప్, డార్క్ నెట్ వినియోగంపై మాన్యువల్‌ని ఎఫ్‌టీసీ రూపొందించింది. ఏమిటీ ‘క్రిప్షన్స్’... యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించిన పరిజ్ఞానమే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్ చేస్తే అది ఎన్‌క్రిప్ట్ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. సెండర్ నుంచి సర్వీసు ప్రొవైడర్ ద్వారా సాంకేతిక రూపంలో రిసీవర్ వరకు జరిగే ప్రయాణం మొత్తం ఆ సందేశం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరుగుతుంది. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న సందేశాన్ని డీక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిç Ü్తుంది. ఈ కీల్లోనూ 2 రకాలు ఉంటాయి. పబ్లిక్ కీతో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని ‘మధ్య’లో ఎవరైనా సంగ్రహించే ఆస్కారం ఉన్నప్పటికీ... ప్రైవేట్ కీతో ఉండే సందేశాన్ని డీక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. కేంద్ర నిఘా వర్గాలు ‘మ్యాన్ ఇన్ మిడిల్’అనే విధానం ద్వారా అనుమానిత నంబర్లపై కన్నేసి ఉంచుతారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండే యాప్‌ల ద్వారా జరిగే సమాచార మార్పిడిని ఎంఐఎం ద్వారా నిఘా వర్గాలు సంగ్రహించినా.. కేవలం కీ తెలుసుకోవడం తప్ప అందులోని వర్డ్స్‌ను గుర్తించలేదు. టోర్ ద్వారా డార్క్ నెట్ వినియోగం.. ఐసిస్ అనుబంధ జేకేబీహెచ్ ఉగ్రవాదులు డార్క్ నెట్‌ను వినియోగించారని వారి సెల్ఫోన్ల విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. పోలీసు, నిఘా వర్గాలకు చిక్కకుండా, ‘తమ వారికి’మినహా మిగిలిన వారికి కనిపించకుండా ఉగ్రమూకలు ‘డార్క్ నెట్’ను వినియో గిస్తున్నాయి. దీనికోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరే టింగ్ సిస్టంను ఇన్‌స్టల్ చేసుకుంటారు. దీంతోపాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఆటోమాటిగ్గా ఇన్‌స్టల్ అయిపోతుంది. వీటిని తమ సెల్ఫోన్లు, ల్యాప్ టాప్స్‌లో ఇన్‌స్టల్ చేసుకున్న జేకే బీహెచ్ ఉగ్రవాదులు సమాచారమార్పిడి చేసుకున్నారు. ‘డార్క్ నెట్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునా మాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు.