సాక్షి, సిటీబ్యూరో: ఏ రంగంలోని వారిని చూసినా మానసిక ఒత్తిడి. ఉరుకులు, పరుగుల జీవితం. జీవనశైలిలో మునుపెన్నడూ లేనంతగా మార్పులు. ఈ పరిణామాలతో మానసిక, శారీరక రుగ్మతలు దాడి చేస్తున్నాయి. కాసింత ప్రశాంతత చేకూరే మార్గమే కనిపించడమే కరువయ్యింది. ఈ నేపథ్యంలో యోగాపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇందుకోసం శిక్షణ ఇచ్చే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. బయటికెళ్లి శిక్షణ పొందే సమయం దొరకనివారికి మంచి ఉపాయం అందుబాటులోకిచ్చింది. యోగా నేర్చుకునేందుకు యాప్‌లు వచ్చేశాయి. సమయం వృథా కాకుండా, పెద్దగా ఖర్చేమీ లేకుండా ఆన్‌లైన్‌లో వీడియో షేరింగ్ వెబ్‌సైట్స్ ద్వారా యోగా క్లాస్‌లు ఉచితంగా పొందగలిగే వీలుంది. వీటిలో కొన్ని పెయిడ్ యాప్స్ కాగా చాలా వరకుఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఒంటికి మంచిదేగా..
యోగా ప్రాధాన్యం తెలిసి, అలవాటు చేసుకుంటే జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగాను దానితో పాటు మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మంచిది. యోగా నేర్చుకోవాలకునే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యోగాను సులువుగా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే అవకాశం ఉంది. యోగా క్లాస్‌లకు రెగ్యులర్‌గా వెళ్లే అవకాశం లేనివారు ఇటువంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అనేక యోగా యాప్స్ ఉన్నప్పటికీ వీటిలో ఉపయోగపడే కొన్ని రకాల చక్కటి యాప్స్‌ను పరిశీలిద్దాం.
ఇంటర్నెట్ అవసరం లేకుండానే..
సాధారణంగా యాప్స్ పని చేయాలంటే తప్పకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆఫ్‌లైన్‌లో కూడా యాప్స్‌ను ఉపయోగించేలా యోగా యాప్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా యోగాలో స్టెప్ బై స్టెప్ చేయాల్సిన యోగాసనాల గురించి ఇమేజ్‌ల ద్వారా చక్కగా వివరిస్తుంది. మొదటగా నేర్చుకునే వారికి ఉపయోగపడేలా, నియమాలు లేకుండా పలు రకాల ఆసనాల ఇమేజ్‌లుంటాయి. దీనివల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొంత డబ్బు ఖర్చవుతుంది. తర్వాత ఎటువంటి ఖర్చూ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆసనాల డేటాను ఇమేజ్‌లు సహా అందిస్తుంది.
యోగా.కామ్
ఈ యాప్ ద్వారా యోగా క్లాస్‌లను పొందవచ్చు. ఇందులో మొత్తం 300 రకాల యోగాసనాల గురించి వివరణాత్మకంగా తెలుసుకునే వీలుంది. ఈ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు. ఇమేజ్‌లు, డయాగ్రామ్స్, వీడియో డెమోలతో ఈ యాప్ యోగా నేర్చుకోవాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment