సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు కమల్ హసన్ పార్టీ గురించి ఓ స్పష్టత ఇచ్చారు. మంగళవారం తన 63వ పుట్టినరోజు సందర్భంగా ‘మైఎం విజిల్’ పేరిట యాప్‌ను ప్రారంబించిన ఆయన అనంతరం ప్రసంగించారు.
తమిళనాడు ప్రజలు రాజకీయాల్లో బలమైన మార్పును కోరుకుంటున్నారని అందుకే వాళ్లు తన ఆరంగ్రేటాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలేవైనా యాప్ ద్వారా తెలియజేయవచ్చని... ప్రజలకు దగ్గరయ్యేందుకే ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని ఆయన పేర్కొన్నారు. కాగా, యాప్ గురించి 20 నుంచి 25 మంది రాత్రింబవళు కృషిచేస్తున్నారన్నఆయన జనవరి నుంచి అది ప్రజలకు పూర్తి స్థాయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు . ఇక పుట్టిను రోజు నాడే పార్టీ ప్రకటిస్తానని అంతా భావించారని... అయితే దానికి చాలా క్షేత్రస్తాయి శ్రమ అవసరం ఉందని, కార్యకర్తలతో ఇంకా చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తన ముందు పెద్ద లక్ష్యాలే ఉన్నాయన్న కమల్ వాటి సాధనకు చాలా సమయం పడుతుంది కాబట్టే పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టేందుకు కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ఒంటరిగా రాజకీయాల్లోకి వస్తే మాత్రం గట్టి పునాది అవసరం కాబట్టే జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు . పనులు మొదలుపెట్టాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. రాజకీయాల్లో రావటం తథ్యమని ఆయన ప్రకటించారు.
హిందూ ఉగ్రవాద కామెంట్లపై...
నా వ్యాసంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశానని కొందరు నన్ను తిట్టి పోశారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన వాడిగా ఏనాడూ ఆ పని నేను చేయబోను. తాను ఎంచుకున్న మార్గం వేరేదైనా హింసను మాత్రం వ్యతిరేకిస్తానని కమల్ పేర్కొన్నాడు. ఇక టెర్రర్(ఉగ్రవాదం) అనే పదం తాను వాడలేదని.. సమస్య తీవ్రత గురించే తాను ప్రస్తావించానని కమల్ స్పష్టం చేశారు .
Comments
Please login to add a commentAdd a comment