మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం | Donald Trump bans Alipay and seven other Chinese apps | Sakshi
Sakshi News home page

మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం

Published Thu, Jan 7 2021 5:51 AM | Last Updated on Thu, Jan 7 2021 5:51 AM

Donald Trump bans Alipay and seven other Chinese apps - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదవి వీడే ముందు మరొక నిర్ణయం తీసుకున్నారు. అలీ పే, వీచాట్‌ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్‌ ఇట్, టెన్సెంట్‌ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్‌ పే, డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్‌లపై నిషేధం విధించారు. అమెరికాలో ఈ యా‹ప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారని, చైనా నుంచి ఆ అప్లికేషన్లని నియంత్రిస్తూ ఉండడంతో దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు ట్రంప్‌ స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement