-
వీచాట్, క్యాస్పర్స్కైపై నిషేధం.. కారణం ఇదే..
కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్‌ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్ యాప్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. వీచాట్ యాప్ నుంచి కీలకమైన డేటా లీక్ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్ యజమాని అయిన టెన్సెంట్ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
'రిలయెన్స్ జియో' మరో రికార్డ్
ముంబయి: భారత టెలికాం రంగంలో అనేక రికార్డులను సృష్టించిన రిలయెన్స్ జియో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన ఫెరారీ, కోకాకోలా వంటి కంపెనీల సరసన రిలయన్స్ జియో నిలచింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన(స్ట్రాంగెస్ట్) బ్రాండ్స్‌లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ఘనత దక్కింది. మొదటి స్థానంలో వీచాట్(చైనా) ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన ఎస్ బిఈఆర్ బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఇండియాకు చెందిన రిలయెన్స్ జియో ఉండటం విశేషం.(చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త!) 2016లో స్థాపించిన జియో అతి తక్కువ కాలంలోనే జియో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా నిలిచింది. అలాగే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా ఉంది. ప్రస్తుతం జియోకు దాదాపు 40 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. మార్కెటింగ్ పెట్టుబడి, వాటాదారుల ఈక్విటీ, వ్యాపార పనితీరు వంటి కొలమానాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ మార్కెట్ రీసెర్చ్ ర్యాంకింగ్ ఇచ్చిందని తెలిపింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే వీటిలో జియో అత్యధికంగా స్కోర్ చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది. అలాగే బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్ టాప్ 25లో మన దేశానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు 25వ స్థానంలో ఉండటం విశేషం. -
మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి వీడే ముందు మరొక నిర్ణయం తీసుకున్నారు. అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్లపై నిషేధం విధించారు. అమెరికాలో ఈ యా‹ప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారని, చైనా నుంచి ఆ అప్లికేషన్లని నియంత్రిస్తూ ఉండడంతో దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. -
టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
వాషింగ్టన్ : చైనా సోషల్ మీడియా యాప్స్ టిక్‌టాక్, వీచాట్ డౌన్లోడ్ల నిషేధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వీచాట్, టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేయకుండా నిరోధించే ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని కోర్టు న్యాయమూర్తి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11:59 గంటలకు అమలులోకి వస్తుందని తెలిపారు. తాజా ఉత్తర్వులపై టిక్‌టాక్ సంతోషం వ్యక్తం చేసింది. (వీచాట్ బ్యాన్ : ట్రంప్ సర్కారుకు షాక్) యాపిల్, గూగుల్ సోర్లలో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. అయితే నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను నిరోధించడానికి నికోలస్ నిరాకరించారు. మరోవైపు ఈ విషయంలో ఒకవైపు చర్చలు జరుగుతుండగా, రాత్రికి రాత్రికి టిక్‌టాక్ డౌన్లోడ్లపై నిషేధం ఎలా విధిస్తారంటూ ఆదివారం నాటి విచారణలో టిక్‌టాక్ తరపు న్యాయవాది జాన్ ఈ హాల్ వాదించారు. (టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం) భద్రత, గోప్యత ఆందోళన నేపథ్యంలో అమెరికా టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను ట్రంప్ నిషేధం విధించింది. ఇందులో భాగంగా ట్రంప్ నిర్ణయంపై వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశాయి. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పరిధులు దాటి టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారని ఆరోపించాయి. భద్రత, గోప్యత విషయంలో పౌరుల ప్రయోజనాలను కాపాడుతున్నామన్న తమ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని వాదిస్తున్నాయి. కాగా చైనా యాప్స్ నిషేధానికి సంబంధించి ట్రంప్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా కోర్టులు ఆదేశాలివ్వడం ఇది రెండవసారి. గతవారం వీచాట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై కాలిఫోర్నియా కోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. -
వీచాట్ బ్యాన్ : ట్రంప్ సర్కారుకు షాక్
వాషింగ్టన్ : అమెరికాలో చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ నిషేధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో వీచాట్ మేసేజింగ్ యాప్ డౌన్లోడ్పై విధించిన నిషేధం అమలుకు అమెరికా కోర్టు బ్రేక్ వేసింది. ఈ నిషేధాన్ని ఆపాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛపై ఆందోళన రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది. అమెరికాలో 19 మిలియన్ల క్రియాశీల వినియోగదారులున్న వీచాట్ తాజా పరిణామంపై స్పందించేందుకు నిరాకరించింది. అయితే ఈ తీర్పు వీచాట్ కు స్వల్పకాలిక ఉపశమనమని రిచ్మండ్ విశ్వవిద్యాలయం న్యాయ ప్రొఫెసర్ కార్ల్ టోబియాస్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసి మళ్లీ గెలిచినా, గెలిస్తే, ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేయవచ్చన్నారు. రానున్నఅధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చనే నమ్మకంతో కేవలం వారు సమయాన్ని కోరుకుంటున్నారన్నారు. చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌ల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ట్రంప్ సర్కారు వాటిని గత ఆదివారం నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సిన నిషేధం అమలకు కొద్ది గంటలముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిలిచిపోయింది. వీచాట్ యాప్ టెక్నాలజీ దిగ్గజం టెన్సెంట్ సంస్థ చైనాకు చెందినది. (టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన) -
టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన
బీజింగ్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సోషల్‌మీడియా యాప్‌లు టిక్‌టాక్, వీ చాట్లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా శనివారం స్పందించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంతత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బెదిరింపులను మానుకోవాలని, (దాని) తప్పుడు చర్యలను నిలిపివేయాలని.. న్యాయమైన, పారదర్శక అంతర్జాతీయ నియమాలను, ఆర్డర్లను ఖచ్చితంగా పాటించాలని చైనా అమెరికాను కోరుతోంది అని తెలిపింది. అంతేకాక అమెరికా తనదైన మార్గంలో వెళ్లాలని పట్టుబడుతుంటే, చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా తెలిపింది. అమెరికా జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, టెన్సెంట్ యాజమాన్యంలోని వీచాట్ యాప్ ఆదివారం నుంచి అగ్రరాజ్యంలో తన కార్యాచరణను కోల్పోతుంది. ఇక టిక్‌టాక్‌పై ప్రసస్తుతం అప్డేట్ ఇన్స్టాల్ చేయకుండా నిషేధం విదించారు. కాకపోతే నవంబర్ 12 వరకు టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయవచ్చు. (చదవండి: అందుకే ఆ యాప్స్‌పై నిషేధం) సెప్టెంబర్ 15లోపు, టిక్‌టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. -
టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషే«ధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. టిక్ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. -
అందుకే ఆ యాప్స్‌పై నిషేధం
వాషింగ్టన్: చైనీస్ యాప్‌లు టిక్‌టాక్, వీచాట్‌పై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని, ఇకపై ఎవరూ ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసే వీల్లేదని పేర్కొంది. ఈ మేరకు కామర్స్ సెక్రటరీ విల్బర్ రోస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలకు చెందిన ఈ యాప్‌లను ఉపయోగించడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం తదితర అంశాలపై ప్రభావం చూపుతాయనే కారణంగా వీటిని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అమెరికా- చైనాల మధ్య దౌత్య, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్ దేశ యాప్‌లు, కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు అగ్రరాజ్యం సిద్ధమైన సంగతి తెలిసిందే.(చదవండి: మళ్లీ యూఎస్ వీక్- ఐపీవోకు టిక్‌టాక్) ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేనిపక్షంలో దాన్ని నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. దీంతో ఈ వీడియో షేరింగ్ యాప్ అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు తొలుత మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా చర్చలు ఫలించలేదు. దీంతో ఒరాకిల్ రంగంలోకి దిగింది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరిపింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ గురవారం వెల్లడించారు. చైనా కంపెనీ బైట్‌డాన్స్‌కు మెజారిటీ వాటా, ఒరాకిల్ సంస్థకు మైనారిటీ వాటా ప్రకారం కుదరనున్న ఒప్పందానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం. -
‘సూపర్ యాప్’ల కోసం పడరాని పాట్లు!
సాక్షి, న్యూఢిల్లీ : వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పేటీఎం, పేపాల్, బుక్‌మైషో, మేక్మైట్రిప్, గోఐబీబో, స్విగ్గీ, యెల్ప్, ఉబర్, కిండిల్.. తదితర యాప్‌లన్నీ ఒకే యాప్ పరిధిలోకి వస్తే దాన్ని ఏమంటామ్ ? సూపర్ యాప్ అంటాం. చైనాలో ప్రసిద్ధి చెందిన ‘వియ్‌చాట్’ అలాంటిదే. వివిధ యాప్‌లు చేసే పని ఆ ఒక్క యాప్ చేస్తోంది. ఆ తరహాలోనే భారత్‌లో కూడా సూపర్ యాప్‌ను సృష్టించేందుకు డిజిటల్ చెల్లింపుల యాప్ ‘పేటీఎం’, క్యాబ్ సర్వీసుల బుకింగ్ యాప్ ‘ఓలా’ నుంచి టెలికాం సర్వీసుల దిగ్గజం ‘రిలయెన్స్ జియో’ వరకు పలు సంస్థలు 2019 సంవత్సరంలో తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే ఏ కంపెనీ కూడా ఇంతవరకు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయాయి ? ఎందుకు ? వియ్‌చాట్ ఆవిర్భావం చైనాకు చెందిన ‘టెన్సెంట్’ కంపెనీ 2011లో ‘వియ్‌చాట్’ పేరిట సోషల్ మీడియాను ప్రవేశపెట్టింది. ఏడాది తిరక్కుండానే అందులో పది కోట్ల మంది యూజర్లు చేరారు. ఈ లక్ష్యాన్ని చేరడానికి ‘ఫేస్బుక్’కు నాలుగేళ్లు, ట్విట్టర్‌కు ఐదేళ్లు పట్టింది. ప్రస్తుతం ‘వియ్‌చాట్’కు నెలవారి యూజర్లు వంద కోట్లు దాటారు. సందేశ సర్వీసుతో ప్రారంభమైన వియ్‌చాట్‌లో 2013లో ‘డిజిటల్ వాలెట్’ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వరుసగా అన్ని ఫీచర్లను ప్రవేశ పెడుతూ వచ్చారు. ఇప్పుడందులో ఆన్లైన్ సినిమా బుకింగ్‌లతోపాటు ఆన్లైన్ షాపింగ్, రైలు, బస్సు, విమాన సర్వీసులు, క్యాబ్ సర్వీసుల బుకింగ్, ఫుడ్ ఆర్డర్లతోపాటు డాక్టర్ల అప్పాయింట్మెంట్స్ నుంచి విదేశాల వీసాల వరకు వివిధ సేవలను అందిస్తోంది. చైనా నుంచి గూగుల్ సేవలను తప్పించిన తొలినాళ్లలోనే ‘వియ్‌చాట్’ రావడం ఎంతో కలిసి వచ్చింది. వియ్చాట్తోపాటు చైనాకు చెందిన ఆన్లైన్ ఆర్థిక వ్యవహారాల దిగ్గజ సంస్థ ‘యాంట్ ఫైనాన్సియల్’కు చెందిన ‘అలీపే’ కూడా సూపర్ యాప్ తరహాలో పలు సేవలను అందిస్తోంది. దీనికి ఒక్క చైనాలోనే 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీంతోపాటు చైనాలో ఒకటి, రెండు చిన్న సూపర్ యాప్‌లు కూడా పనిచేస్తున్నాయి. చైనాకు వెలుపల ఇండోనేసియాకు చెందిన ‘గో జెక్’ యాప్ మొదట క్యాబ్ సర్వీసులకే పరిమితంకాగా, తర్వాత డెలివరీ సర్వీసులను కూడా ప్రవేశపెట్టింది. దీనికి ‘గో పే’ పేరిట చెల్లింపుల యాప్ కూడా ఉంది. దీనికి పోటీగా ఆసియాకు చెందిన ‘గ్రాబ్’ క్యాబ్ సర్వీసుల నుంచి బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించింది. భారత సంస్థల ప్రయత్నాలు భారత్‌లో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ అయిన ‘పేటీఎం’ సినిమా టిక్కెట్ల బుకింగ్‌లతోపాటు విమాన టిక్కెట్ల బుక్కింగ్లను ప్రవేశపెట్టింది. రెండేళ్ల క్రితం మెస్సేజ్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఈ యాప్ ఇప్పుడు ఆహార పదార్థాలను కూడా డెలివరి చేస్తోంది. సూపర్ యాప్‌గా దీన్ని తీర్చిదిద్దే సామర్థ్యం కంపెనీ యజామాని విజయ్ శేఖర్ శర్మకు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. టెలికామ్ దిగ్గజ సంస్థ ‘రిలయెన్స్ జియో’ 2018లో మ్యూజిక్ యాప్ ‘సావన్’ను కొనుగోలు చేసి దాన్ని తన సొంత యాప్ ‘జియో మ్యూజిక్’తో అనుసంధానించింది. అదనంగా జియో టీవీ, జియో న్యూస్ కలిగిన ఈ సంస్థ ఇటీవలనే ఈ కామర్స్ యాప్ ‘ఫిండ్’ను కొనుగోలు చేసింది. మంచి టెక్నికల్ టీమ్‌తోపాటు మంచి సరఫరా చైన్, ఇంటెర్నెట్ యూజర్లను కలిగిన ఈ సంస్థకు సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసే సామర్థ్యం, అవకాశాలు కూడా ఉన్నాయి. ఓలా, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు కూడా సూపర్ యాప్ దిశగా ప్రయత్నాలు చేశాయి. కవిన్ భారతి మిట్టల్ ‘హైక్ మెస్సెంజర్’ ద్వారా అలాంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆశించినా ఫలితాల ఎందుకు రాలేదు? సూపర్ యాప్ దిశగా దేశంలో భారతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి ప్రధాన కారణం నైసర్గికంగా, సంస్కృతిపరంగా, భాషాపరంగా భిన్నత్వం ఉండడం. దేశంలో పలు మతాలు, భాషలతోపాటు పలు సంస్కృతులు ఉన్నాయి. చైనాలో ఒకే జాతి, ఒకే భాషా వారికి ప్రధానంగా కలిసి వచ్చిన అవకాశం. పైగా చైనా దేశస్థుల్లో 85 శాతం మంది నాస్తికులు. అక్కడ దేశ ప్రజలందరిని కలుపుకొని ఒక్క చైనా భాషలోనే ‘వియ్‌చాట్’ను రూపొందించారు. భారత్‌లో పలు భాషల్లో, పలు వర్షన్లను తీసుకరావడం అన్ని విధాల భారం అవుతుంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ ‘జీబీ’ సామర్థ్యం అవసరం అవుతుంది. 8 నుంచి 16 జీబీ, 2జీ రామ్ సామర్థ్యం కలిగి దాదాపు ఏడు వేల రూపాయలకు దొరికే స్మార్ట్ఫోన్లనే సగటు భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తారు. యాప్ చూసి కొనుగోలు చేయకుండా ఆచితూచి, పలువురిని అడిగి కొనుగోలు చేసే మనస్థత్వం భారతీయులది. అపరిచితులను అంత త్వరగా విశ్వసించరు. చైనా దేశస్థులు అపరిచితులను కూడా అట్టే నమ్మేస్తారనడానికి ‘వియ్‌చాట్’లో ప్రవేశ పెట్టిన ‘షేక్’ ఫీచర్ సాక్ష్యం. అపరిచితులతో స్నేహం చేయాలనుకునే వారు మొబైల్ ఫోన్‌ను ‘షేక్’ చేస్తే చాలు. వారిమధ్య పరిచయం, ఆ తర్వాత స్నేహ బంధం బలపడుతుంది. దీనికి చైనాలో అంతులేని ఆదరణ ఉన్నది. పైగా భారతీయుల డేటాకు చట్టపరమైన రక్షణ ఇంకా సమకూరలేదు. -
ఫేస్బుక్ హవా తగ్గుతోంది !
న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ముఖ్యంగా ఫేస్బుక్ హవా తగ్గుతోంది. మిత్రులతో కమ్యూనికేషన్ల కోసం ఫేస్బుక్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కంటే కూడా వుయ్ చాట్, వాట్సాప్‌లను వినియోగించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో ఈ పోకడ అధికంగా ఉందని గ్లోబల్వెబ్ ఇండెక్స్(జీడబ్ల్యూఐ) రీసెర్చ్ తెలిపింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 42 వేల మంది(5,000 మంది భారతీయులు)పై నిర్వహించిన సర్వే ముఖ్యాంశాలు..., సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల యాక్సెస్ ప్రపంచవ్యాప్తంగా 187 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 242 శాతం పెరిగింది. ఇంటర్నెట్ను ఉపయోగించే వాళ్లలో 83 శాతం మందికి ఫేస్బుక్ అకౌంట్లున్నాయి. వీరిలో 47 శాతం మంది మాత్రమే వీటిని చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే, ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న వాళ్లలో 93 శాతానికి ఫేస్బుక్ ఖాతాలున్నాయి. వీటిని చురుకుగా ఉపయోగిస్తున్నవారు 48 శాతం మాత్రమే. ఫేస్బుక్ ద్వారా మిత్రులకు మెసేజ్‌లు పంపే వారి సంఖ్య తగ్గుతోంది. గత ఏడాది క్యూ1లో 51.2 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య అదే ఏడాది క్యూ4లో 40 కోట్లకు, ఈ ఏడాది క్యూ3లో 31.3 కోట్లకు తగ్గింది. వుయ్‌చాట్, వాట్సాప్‌ల వంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది క్యూ1లో 44.6 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య అదే ఏడాది క్యూ4లో 53.8 కోట్లకు, ఈ ఏడాది క్యూ3లో 61.6 కోట్లకు పెరుగుతోంది. -
2 కోట్ల 'వ్యభిచార' అకౌంట్లకు వీచాట్ చెక్!
బీజింగ్: వ్యభిచార కార్యకాలాపాలను అరికట్టేందుకు సుమారు 2 కోట్ల అకౌంట్లను తొలగించినట్టు చైనాలోని ప్రఖ్యాత ఇన్స్ స్టాంట్ మెసేజ్ సర్వీస్ వీచాట్ సంస్థ వెల్లడించింది. ఆన్ లైన్ లో అసభ్య కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా 'వ్యభిచార' సంబంధిత అకౌంట్లను మూసివేసినట్టు సంస్థ తెలిపింది. అన్ లైన్ లో వస్తువుల భూటకపు అమ్మకాలు సాగిస్తున్న మరో 30 వేల అకౌంట్లపై కూడా వేటు వేసినట్టు వీచాట్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత మూడు నెలలుగా సైబర్ నేరాలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. శృంగార, అసభ్యకరమైన సైబర్ నేరాలుతోపాటు, ఇంటర్నెట్ లో వైరస్ వ్యాప్తి చేసే కార్యక్రమాలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. సైబర్ నేరాలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే విధంగా వీచాట్ కు చెందిన ట్రాన్సెంట్ కంపెనీ 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది.