ముంబయి: భారత టెలికాం రంగంలో అనేక రికార్డులను సృష్టించిన రిలయెన్స్ జియో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన ఫెరారీ, కోకాకోలా వంటి కంపెనీల సరసన రిలయన్స్ జియో నిలచింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన(స్ట్రాంగెస్ట్) బ్రాండ్స్‌లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ఘనత దక్కింది. మొదటి స్థానంలో వీచాట్(చైనా) ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన ఎస్ బిఈఆర్ బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఇండియాకు చెందిన రిలయెన్స్ జియో ఉండటం విశేషం.(చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త!)
2016లో స్థాపించిన జియో అతి తక్కువ కాలంలోనే జియో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా నిలిచింది. అలాగే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా ఉంది. ప్రస్తుతం జియోకు దాదాపు 40 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. మార్కెటింగ్ పెట్టుబడి, వాటాదారుల ఈక్విటీ, వ్యాపార పనితీరు వంటి కొలమానాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ మార్కెట్ రీసెర్చ్ ర్యాంకింగ్ ఇచ్చిందని తెలిపింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే వీటిలో జియో అత్యధికంగా స్కోర్ చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది. అలాగే బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్ టాప్ 25లో మన దేశానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 25వ స్థానంలో ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment