Coca-Cola
-
దేశీ మార్కెట్‌పై గ్లోబల్ దిగ్గజాల కన్ను
ముంబై: కన్జూమర్ ప్రొడక్టుల గ్లోబల్ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్ యూనిలీవర్, లారియల్ దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్ ప్రొడక్ట్ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి. మార్కెట్‌ను మించుతూ సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్ ప్రొడక్టుల దిగ్గజం లారియల్ పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది. పానీయాలకు భళా 2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్ జోప్ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. రెండంకెల వృద్ధి 2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్ మార్కెట్లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్ అమ్మకాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది. -
రెండేళ్లలో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా మాజా
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని మాజా సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. -
రెండేళ్లలో ఆ టార్గెట్‌ని చేరుకుంటాం: కోకా–కోలా
వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని ‘మాజా’ సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. చదవండి: అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే -
ఆర్థిక మంత్రికే కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కష్టాలు.. వీడియో వైరల్
He Scan His Bank Card On A Bar Code: చాలా పెద్ద హోదాలోని వ్యక్తులు ఒక్కొసారి తికమక పడో లేక కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే చాలా తెలివతక్కుగా ప్రవర్తిస్తుంటారు. అది కూడా చాలా సింపుల్ విషయాల్లో చేస్తుంటారు. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎంత విచిత్రమైన పని చేశాడో చూడండి. వివరాల్లోకెళ్తే...బ్రిటిష్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపులతో ఇబ్బందులు పడ్డారు. ఆయన ఒక దుకాణానికి వెళ్లి కోకాకోలా టిన్ని కొన్నారు. బిల్ పే చేసేటప్పడూ మనం కొన్న వస్తువును దుకాణదారుడు బార్కోడ్ మిషన్‌తో స్కాన్ చేయడం సహజం. అయితే ఆ మంత్రి బార్కోడ్ మిషన్ వద్ద తన ఏటీఎం కార్డుని పెడతారు. దీంతో సదరు దుకాణదారుడు సార్ కోకాకోలాని పెట్టండి అని అంటాడు. ఇంతకీ రిషి ఎవరంటే...రిచ్మండ్కు చెందిన కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుడు మాత్రమే గాక తదుపరి ఎన్నికల్లో ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్థానంలో బుక్మేకర్లకు ఇష్టమైన వ్యక్తి కూడా. అంతేకాదండోయ్ ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి భర్త కూడా. chancellor of the exchequer doesn’t know how to use contactless my head’s gone pic.twitter.com/h2yBKVMu2K — lucy (@LMAsaysno) March 23, 2022 (చదవండి: పెంపుడు కుక్క ఐతే మాత్రం మరీ ఇలాంటి పేరా!... మండిపడతున్న నెటిజన్లు) -
కోకాకోలా సముద్రం.. ఈత కూడ కొట్టొచ్చు.. ఎక్కడంటే?
Brazil Coco Cola River Facts: ప్రపంచంలో మనకు తెలియని, ఊహలకు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ భూమి మొత్తం వింతలు విశేషాలతో నిండి ఉంది. మనకు తెలిసే వరకు అది ఏదైనా ఒక ఆశ్చర్యమే. మరి కోకాకోలా ప్రవహించే మహాసముద్రం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి కోకాకోలా సముద్రం కూడా ఉందా, నిజమేనా అనుకుంటున్నారా. అవును, మీరు విన్నది నిజమే. బ్రెజిల్‌లోని రియో గ్రాండే డెల్ నార్టేలోని కోకా కోలా సరస్సు ఉంది. అక్కడ మీరు ఈత కూడా కొట్టవచ్చు. ఇక్కడి సరుస్సులోని నీరు అచ్చం కోకా కోలా డ్రింక్ కలర్లోనే ఉంటాయి. ఈ ప్రదేశంలోని నీటి ముదురు గోధుమ మరియు నలుపు రంగు, ఇది ఖచ్చితంగా కోకా కోలా వలె కనిపిస్తుంది. ఒక్కసారి మనం అ లేక్ వద్దకు వెళితే నీటికి బదులు కోకాకోలానే సరస్సులో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది.ఈ నీటిలో ఇనుము, అయోడిన్ గాఢత ఎక్కువ ఉండటం వల్ల ఈ నీటికి ఇలా రంగు ఉందని పరిశోధనల్లో తేలింది. దీని కారణంగానే ఇక్కడి నీటికి కోలా నీటిలా కనిపిస్తుంది. వేసవిలో బీచ్ జీవితాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఇక్కడకు వస్తారు. తీరంవైపు ఉన్న నీరు లేత ముదురు రంగులో కనిపిస్తుంది. అదే సముద్రంలోకి వెళితే ముదురు రంగులోకి మారుతుంది. నీటికి ఉన్న వింత రంగు కారణంగా ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది టూరిస్టులు తమ కుటుంబంతో విహారయాత్రకు రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతం టూరిస్టులతో నిత్యం సందడిగా ఉంటుంది. -
'రిలయెన్స్ జియో' మరో రికార్డ్
ముంబయి: భారత టెలికాం రంగంలో అనేక రికార్డులను సృష్టించిన రిలయెన్స్ జియో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన ఫెరారీ, కోకాకోలా వంటి కంపెనీల సరసన రిలయన్స్ జియో నిలచింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన(స్ట్రాంగెస్ట్) బ్రాండ్స్‌లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ఘనత దక్కింది. మొదటి స్థానంలో వీచాట్(చైనా) ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన ఎస్ బిఈఆర్ బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఇండియాకు చెందిన రిలయెన్స్ జియో ఉండటం విశేషం.(చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త!) 2016లో స్థాపించిన జియో అతి తక్కువ కాలంలోనే జియో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా నిలిచింది. అలాగే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా ఉంది. ప్రస్తుతం జియోకు దాదాపు 40 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. మార్కెటింగ్ పెట్టుబడి, వాటాదారుల ఈక్విటీ, వ్యాపార పనితీరు వంటి కొలమానాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ మార్కెట్ రీసెర్చ్ ర్యాంకింగ్ ఇచ్చిందని తెలిపింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే వీటిలో జియో అత్యధికంగా స్కోర్ చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది. అలాగే బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్ టాప్ 25లో మన దేశానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు 25వ స్థానంలో ఉండటం విశేషం. -
హార్లిక్స్ రేసులో కోకకోలా
న్యూఢిల్లీ: మాల్ట్ ఆధారిత హెల్త్ డ్రింక్ హార్లిక్స్ కొనుగోలు రేసులో తాజాగా కోక–కోలా కూడా చేరింది. గ్లాక్సో స్మిత్‌లైన్ (జీఎస్కే) కంపెనీ హార్లిక్స్ బ్రాండ్‌ను భారత్‌లో విక్రయానికి పెట్టింది. ఈ 145 ఏళ్ల బ్రాండ్‌ను 390 కోట్ల డాలర్లకు (300 కోట్ల పౌండ్లు)విక్రయించాలని జీఎస్కే యోచిస్తోందని ఇంగ్లాండ్‌కు చెందిన సండే టెలిగ్రాఫ్ వెల్లడించింది. హార్లిక్స్ బ్రాండ్‌ను చేజిక్కించుకోవడానికి అంతర్జాతీయ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజ సంస్థలు–నెస్లే, క్రాఫ్ట్ హీంజ్ తదితర సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా కోక–కోలా కూడా ఈ రేసులో చేరిందని సమాచారం. కాగా ఊహాజనిత వార్తలపై వ్యాఖ్యానించకూడదనేది తమ విధానమని కోకకోలా కంపెనీ పేర్కొంది. అమెరికాకు చెందిన కోక–కోలా కంపెనీ ఇటీవలనే ఇంగ్లాండ్‌కు చెందిన కోస్టా కాఫీ చెయిన్‌ను 500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కాగా హార్లిక్స్ కోక–కోలా పరమైతే కోకకోలా కంపెనీకి ఇది భారత్‌లో రెండో అతి పెద్ద కొనుగోలు అవుతుంది. గతంలో కోకకోలా కంపెనీ థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. హార్లిక్స్ విక్రయం ఎందుకంటే... నోవార్టిస్ కంపెనీకి చెందిన కన్సూమర్ హెల్త్‌కేర్ వ్యాపారంలో 36.5 శాతం వాటాను కొనుగోలు చేయాలని జీఎస్కే నిర్ణయించింది. ఈ వాటాను 920 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేయనున్నది. ఈ కొనుగోలుకు కావలసిన నగదును సమకూర్చుకోవడం కోసం జీఎస్కే కంపెనీ హార్లిక్స్, ఇతర బ్రాండ్లను విక్రయిస్తోంది. -
200-250 ఎగ్జిక్యూటివ్‌లపై వేటు
న్యూఢిల్లీ : గ్లోబల్ బెవరేజ్ దిగ్గజం కోకా-కోలా చరిత్రలోనే అతిపెద్ద మేనేజ్మెంట్ పునరుద్దరణ జరుగబోతుంది. భారత్‌లో 200 నుంచి 250 మంది సీనియర్, మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌లపై ఈ కంపెనీ వేటు వేయాలని చూస్తోంది. హిందూస్తాన్ కోకా-కోలా బెవరేజస్‌కు చెందిన పలువురు టాప్-ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయాన్ని ధృవీకరించారు. వీరిలో కొందరు తక్కువ సీనియర్ బాధ్యతలకు, మరికొందరు వేరే ప్రదేశాలకు మారతామని అడిగినట్టు హెచ్‌సీసీబీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. హెచ్‌సీసీబీ ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్న ఐదు జోన్ల మాదిరిగా కాకుండా ఏడు జోన్లను ఆపరేట్ చేయాలనుకుంటోంది. జోన్స్, ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి వీలుగా కంపెనీ తన కార్పొరేట్ సెంటర్ రిసోర్సస్‌ను పునర్వ్యస్థీకరిస్తోంది. ఈ క్రమంలోనే వందల కొద్దీ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించబోతుంది. ప్రస్తుతం రెడడెంట్‌గా ఉన్న ఉద్యోగాలను తొలగించడానికి ఈ పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఈ ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా హెచ్ఆర్, స్పెషల్ ప్రాజెక్టులు, రూట్-టూ-మార్కెట్, ప్రత్యామ్నాయ బెవరేజ్ వంటి కీలక పోస్టులపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఐటీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల ఎగ్జిక్యూటివ్‌లపై కూడా ప్రభావం చూపనుంది. గత రెండేళ్లుగా జోర్హట్(అస్సాం), బైరనిహాట్ (మేఘాలయ), కలేదారా (జైపూర్), విశాఖపట్నం(ఏపీ), మౌలా అలీ(తెలంగాణ), హాస్పెట్(కర్నాటక) ప్లాంట్లను హెచ్‌సీసీబీ మూసివేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెచ్‌సీసీబీ 21 ఫ్యాక్టరీలను కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2017 మార్చి ముగింపు వరకు కంపెనీ రూ.9,472 కోట్ల రెవెన్యూలను కలిగి ఉంది. -
ఇక కోకా-కోలా కాఫీ, పాలు కూడా..!
ప్రపంచంలోనే సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ గా విశేష ప్రాచుర్యం పొందిన కోకా-కోలా... తన బ్రేక్ ఫాస్ట్ పానీయాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాఫీ, మిల్క్ పానీయాలను తమ పోర్ట్ ఫోలియోలో బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్ లుగా అందించాలనుకుంటోంది. ప్యాకేజ్డ్ అరబికా కాఫీ బీన్స్ ను బ్రెజిలియన్ కన్సూమర్లకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. అట్లాంటాకు చెందిన ఈ కంపెనీ, స్థానిక టీ బ్రాండ్ లీయో పేరుతో ప్యాకేజ్డ్ బీన్స్ అమ్మకాలు నిర్వర్తించనుందని కోకా కోలా బ్రెజిల్ యూనిట్ గురువారం ప్రకటించింది. బీన్స్ ను కొనుగోలు చేసి, రోస్ట్ చేయడానికి కాఫీ ఎగుమతిదారి ట్రీస్టో కాంపానిహా డి కమర్సియో ఎక్స్ టీరియర్ తో కోకా-కోలా భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కోకా-కోలా దశాబ్దన్నర క్రితం నుంచి తన ప్రొడక్ట్ లను విస్తరించుకుంటూ వస్తుందని, జ్యూస్, టీ, మినరల్ వాటర్ వంటి వాటిని అందిస్తుందని బ్రెజిల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ శాండోర్ హెగెన్ చెప్పారు. ప్రస్తుతం కాఫీ, మిల్క్ ఉత్పత్తులను కూడా తమ పోర్ట్ ఫోలియోలో బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్ లుగా చేర్చాలనుకుంటున్నామని పేర్కొన్నారు. బ్రెజిల్ లో పాల ఉత్పత్తుల తయారీదారి లాటిసినోస్ వర్దె క్యాంపొ కంపెనీ కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. ప్రస్తుతం కాఫీ డ్రికర్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తున్న కంపెనీ, ఎక్స్ క్లూజివ్ గా అరబికా కాఫీని వారికి అందించాలని ప్లాన్ చేస్తోంది. అరబికా కాఫీని తయారుచేయడంలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. -
కోకాకోలాకు వందెకరాలు
► ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ► రూ.1375 కోట్లతో ఏర్పాటు ► పదేళ్లలో 3,645 మందికి ఉపాధి విశాఖపట్నం : హిందుస్థాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం వద్ద వందెకరాలు కేటాయిస్తూ వాణిజ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోలోమన్ ఆరోక్యరాజు సోమవారం జీవో ఎంఎస్ నెం. 82ను జారీ చేశారు. రూ.1375 కోట్ల పెట్టుబడులతో ఈ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. పదేళ్ల కాలపరిమితిలో మూడు విడతల్లో 3,645 మందికి ఉపాధి కల్పించనున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఈ పాజెక్టు ఏర్పాటు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను టెక్నికల్ కన్సల్టెంట్‌కు పంపారు. కన్సల్టెంట్ సిఫార్సు మేరకు ఈ కంపెనీకి రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇండస్ట్రియల్ పార్కులో భూమి కేటాయిస్తూ స్టేట్ లెవల్ ల్యాండ్ ఎలాంట్ మెంట్ కమిటీలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కార్యదర్శి పేర్కొన్నారు. నిర్ణీత గడువు పదేళ్లలోగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కమిట్మెంట్ ప్రకారం ఉపాధి కల్పించకపోతే భూమి కేటాయింపు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేలా సబ్జెక్టు టు కండీషన్స్‌తో ల్యాండ్ ఎలాట్ చేస్తున్నామన్నారు. -
చిన్నగా.. మది దోచాయ్!
దైనందిన జీవితాన్ని సాఫీగా, సౌకర్యవంతంగా గడుపుతూ.. ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందేందుకు మనిషి ఎన్నో రకాల వస్తువులను ఉపయోగించుకుంటాడు. గుండు సూది దగ్గర నుంచి పెద్దపెద్ద విమానాల వరకు ప్రతీది తన సౌకర్యం కోసమే. అలాంటి వాటిల్లో చిన్నచిన్న వస్తువులు సైతం పెద్దపెద్ద అవసరాలు తీరుస్తూ మానవ జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి! వాటిల్లో నిత్యం మన కళ్లముందు మెదిలే కొన్ని వస్తువుల కథాకమామిషు ఏంటో తెలుసుకుందామా మరి! టెడ్డీబేర్.. పిల్లలందరికీ ఇష్టమైంది. ప్రతి ఇంటా కొలువైందీ.. టెడ్డీబేర్ బొమ్మ. అసలు టెడ్డీబేర్‌కు ఆ పేరు అమెరికా అధ్యక్షుని వల్ల వచ్చిందని మీకు తెలుసా? దాని వెనకాల ఓ కథ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్వెల్ట్ ఉన్నప్పటి కథ ఇది. ఓ రోజు ఆయన వేటకు వెళ్లారు. తుపాకితో దేన్ని కాలుద్దామా అని చూస్తున్నంతలో అనుచరులు ఓ ఎలుగుబంటిని చూపించారు. తీరా గురిపెట్టి చూసేసరికి అదొక పిల్ల ఎలుగు పాపం. దాన్ని చూడగానే ఆయనకి జాలేసింది. కాల్చకుండా దాన్ని వదిలేశారు. ఈ సంఘటనపై ఆ మర్నాడు ఓ దినపత్రికలో కార్టూన్ వచ్చింది. అందరికీ తెగ నచ్చేసింది. దాంతో ఎన్నో పత్రికలు ప్రచురించాయి. అలా బోలెడు ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లోని ఓ బొమ్మల దుకాణం నడిపే ఒకావిడ ఆ కార్టూన్లో వేసిన ఎలుగబంటిలాగే జాలి ముఖం ఉండేలా ఓ దూది బొమ్మను తయారు చేసింది. దాన్ని అధ్యక్షునికి పంపి దీనికి మీ పేరు పెట్టుకోవచ్చా? అని లేఖ రాసింది. దానికి ఆయన ‘సరే’ అని జవాబు పంపారు. ఆయనకి ‘టెడ్డీ’అనే మరో వాడుకపేరు ఉండేది. కాబట్టి ఆవిడ తన షాపులో ఈ బొమ్మలు తయారు చేసి ‘టెడ్డీబేర్’ అని పేరు పెట్టారు. అలా టెడ్డీబేర్ బారసాల జరిగిందన్నమాట. ఆపై టెడ్డీ బేర్ బొమ్మలు విపరీతంగా అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి టెడ్డీబేర్ దేశవిదేశాల్లో పిల్లలకు ఎంతో ఇష్టమైపోయింది. టెడ్డీబేర్ మ్యూజియాలు కూడా అనేక దేశాల్లో ఉన్నాయి. కోకో కోలా.. మంచి నీళ్లు తాగడం మానేసి కోకో కోలా తాగుతున్నాం మనం. అంత పిచ్చి పట్టుకుంది మనకు కోకో కోలా మీద. ఈ కూల్‌డ్రింక్‌లో రసాయనాలు ఉన్నాయనీ అందువల్ల ఇది తాగితే ప్రమాదముందని ఒకప్పుడు పెద్దస్థాయిలో వార్తలొచ్చాయి. అయినప్పటికీ మనం దీనిని తాగడం మానలేదు. ప్రపంచం మొత్తాన్ని ఇంత తీవ్రంగా బానిసలుగా చేసుకున్న ఈ శీతలపానియాన్ని డాక్టర్ జాన్ పెంబరటన్ అనే ఆయన పెట్టారు. ఈయనది అమెరికాలోని అట్లాంటాలో ఉన్న జార్జియా పట్టణం. ఫార్మాసిస్ట్ అయిన ఆయన రకరకాల పానీయాలను తయారు చేసేవాడు. కోకా ఆకులను ఉపయోగించి ఆయన చేసిన ఫ్రెంచ్ వైన్ ఆ రోజుల్లో చాలా ఆదరణ పొందింది. అయితే 1885లో అట్లాంటాలో ఫ్రెంచ్ వైన్ వంటి మత్తు పానీయాలను నిషేధించారు. దాంతో పెంబర్టన్ రాబడిపోయింది. అప్పుడతడు మత్తుస్వభావం లేని కొత్త పానీయాన్ని కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన కోకా ఆకులకు, కోల నట్ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ యాసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జతచేసి 1886, మే 8న కోకో కోలాను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ పానీయాన్ని ఆయన ఫ్రాంక్ రాబిన్సన్, డేవిడ్‌రో అనే మిత్రులతో తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన మిత్రులతో గొడవ రావటంతో జాన్ ఆ ఫార్ములాను వాళ్లకు అమ్మేశాడు. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలాకు.. పెంబర్టన్ అసలు కోకో కోలాకు రుచిలో ఎంతో మార్పు వచ్చింది. కాలానుగుణంగా కోకో కోలా రుచి మార్చుకున్నా దాని ఫార్ములా ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంది. విజిటింగ్ కార్డ్.. విజిటింగ్ కార్డ్ సంప్రదాయం 15వ శతాబ్దంలో మొదలైందని చరిత్ర చెబుతోంది. ఆ రోజుల్లో జమిందారులు, రాజవంశీయులు తాము ఒక ప్రదేశానికి వెళ్లే ముందు తమ పేరు, హోదా, అడ్రసు...వగైరాలు రాసి ఉన్న పత్రం ఒకటి అక్కడకి దూతకిచ్చి పంపేవారు. అది చూసి అవతలి వారు..వస్తున్న వారి హోదాకి తగిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది. అంటే ఉన్నత హోదాలో ఉన్నవారు తమ కిందిస్థాయి వారికి తమ రాకగురించి తెలియజెప్పేందుకు పుట్టిందీ కార్డు. ఎవరైతే వస్తున్నారో వారి సమాచారం తెచ్చే కార్డు కాబట్టే విజిటింగ్ కార్డ్ అన్నారు. తరువాత విజిటింగ్ కార్డ్ అందరికీ సంబంధించిన అవసర వస్తువుగా మారింది. అయితే దీనిని పెద్దలు చిన్నవారికి పంపడం ఆగిపోయి..కిందిస్థాయి వారు పైస్థాయి వారికి తాము వచ్చిన విషయం తెలియజెప్పే సందేశ సమాచార పత్రంగా మారింది. ప్రస్తుతం విజిటింగ్ కార్డు..చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరిని ఎవరు సందర్శించినా ఇచ్చి పుచ్చుకునే కాగితం ముక్క అయిపోయింది. అడ్రస్, ఫోన్ నంబర్‌ను ఇచ్చిపుచ్చుకునే కార్డ్ ముక్కయింది. ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఫౌంటెన్ పెన్.. ఇవాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ.. ఇలా పెన్నును ఈ ఆకారంలో చూడటం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్లీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది. ఈ తలనొప్పిని పరిహరించిన వ్యక్తి ‘లూయిస్ ఇ. వాటర్‌మెన్’. అమెరికాలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఒకసారి పాలసీ తీసుకోవడానికి వచ్చిన పెద్ద మనిషి సంతకం చేయడానికి కలంను సిరాలో ముంచగా అది కాస్తా ఒలికి పేపర్లు పాడయ్యాయి. అది అపశకునంగా భావించిన ఆ పెద్దమనిషి పాలసీ చేయకుండానే వెళ్లి పోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాటర్‌మెన్ అసలు సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంక్ రిజర్వాయర్ ఉండేలా పెన్ తయారుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ‘ఫౌంటెన్ పెన్’ను 1884లో తయారుచేశాడు. ఇతడిలాగే మరికొందరు కూడా పెన్నులు తయారు చేసినా ప్రపంచానికి ఫౌంటెన్‌పెన్ సృష్టికర్తగా పరిచయమైంది వాటర్‌మెన్ మాత్రమే. పెన్నును జేబులో పెట్టుకునే వీలుగా క్లిప్‌ను తయారుచేసింది కూడా ఇయనే. -
రాజమండ్రి దగ్గర కోకాకోలా ప్లాంటు
♦ మాజాను బిలియన్ డాలర్ల బ్రాండ్‌గా మారుస్తాం ♦ దీన్ని ఇంకా 80 శాతం మంది రుచి చూడలేదు ♦ కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్ కిని ముంబై నుంచి మైలవరపు చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో ఉన్న గోపాలపురంలో కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోకాకోలా ప్రకటించింది. 2023 నాటికి తమ శీతల పానీయం ‘మాజా’ బ్రాండ్‌ను బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేసింది. మాజా బ్రాండ్ ఆరంభమై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్ కిని ఈ విషయాలు చెప్పారు. దేశంలో 20 శాతం మంది మాత్రమే ఇప్పటిదాకా మాజాను రుచి చూశారని, మిగిలిన 80 శాతం మందికీ దీన్ని చేరువ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రజలు సగటున నెలకు ఒకసారి మాత్రమే కూల్ డ్రింక్ తాగుతున్నారన్నారు. ఏపీలో 4కు చేరనున్నప్లాంట్ల సంఖ్య: మేకిన్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా వెంకటేశ్ తెలియజేశారు. ‘‘భారత్‌లో విస్తరణలో భాగంగా 2012-2020 మధ్య రూ.30,000 వేల కోట్లు ఖర్చు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటుతో అక్కడ మొత్తం ప్లాంట్ల సంఖ్య 4కి చేరుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్య 58కి పెరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం మాకు రెండు ప్లాంటున్నాయి’’ అని వివరించారు. మాజాకు 40 ఏళ్లు... పార్లే సంస్థ 1976లో తొలిసారి మాజాను భారత్‌కు పరిచయం చేసింది. అటు తర్వాత ఇది 1993లో కోకాకోలా ఇండియా వంశమైంది. పార్లే చేతిలో ఉన్నప్పుడు ఆరెంజ్, ఫైనాపిల్, మ్యాంగో వంటి ఫ్లేవర్‌లో లభ్యమయ్యే మాజా.. కోకాకోలా చేతికి వచ్చిన దగ్గరి నుంచి మ్యాంగో ఫ్లేవర్‌లో మాత్రమే లభిస్తోంది. అలాగే కోకాకోలాకు మాజాను కేవలం భారత్‌లో మాత్రమే విక్రయించే అధికారమే ఉంది. విదేశాల్లో విక్రయానికి పార్లే కోకాకోలాకు అనుమతి ఇవ్వలేదు. జైన్ ఇరిగేషన్‌తో భాగస్వామ్యం మామిడి రైతులకు అధిక ఆదాయం కల్పించే విధంగా కోకాకోలా.. జైన్ ఇరిగేషన్ సంస్థతో కలిసి ‘ఉన్నతి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కంపెనీ చిత్తూరులో రైతులతో కలిసి 1,000 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తోంది. దీన్ని ఏటా 2,000 ఎకరాల చొప్పున పెంచాలని కూడా కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఏటా 50 వేల మంది రైతుల నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల మామిడి గుజ్జును సేకరిస్తోంది. బిలియన్ బ్రాండ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతుల సంఖ్య లక్షకు, అదేవిధంగా ఉత్పత్తి 1.40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి చేరాల్సి ఉంటుంది. -
ఐపీఎల్ స్పాన్సర్ గా కోకాకోలా!
న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు స్పాన్సర్ గా వ్యవహరించేందుకు ప్రముఖ శీతలపానీయ కంపెనీ కోకాకోలా ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఐపీఎల్ లోని కొన్ని జట్లతో చర్చలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లను కలిసిన కోకాకోలా యాజమాన్యం.. మరికొన్ని జట్లతో చర్చించిన పిదప నిర్ణయం తీసుకోనుంది. గతంలో ఐపీఎల్ కు స్పాన్సర్ గా కోకాకోలా వ్యవహరించినా.. 2012లో బీసీసీఐతో పెప్పీ ఒప్పందం కుదుర్చుకుని మూడేళ్ల పాటు స్పాన్సర్ గా కొనసాగింది. కాగా, ఇటీవల పెప్పీ తన స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగింది. బీసీసీఐతో ఒప్పందం ప్రకారం 2017 వరకు పెప్పీ స్పాన్సర్ గా కొనసాగాల్సి ఉంది. దీనికోసం బోర్డుతో రూ.396 కోట్ల భారీ మొత్తంతో డీల్ కుదుర్చుకుంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఐపీఎల్ ప్రతిష్టకు అపఖ్యాతి ఏర్పడిందన్న కారణంతో ఈ కూల్‌డ్రింక్ కంపెనీ తన మనసు మార్చుకుని స్సాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. -
మోదీ నియోజకవర్గంలో కోకాకోలా చిచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజలు మంచినీళ్ల కోసం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కోకా కోలా బాట్లింగ్ కంపెనీ మూలంగానే తమకు తాగునీటి కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లని వారణాసి నియోజకవర్గం మెహ్దీతంజ్ మండలంలోని సుమారు 18 గ్రామ పంచాయితీలు ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. 1991లో ఇక్కడ నెలకొల్పిన కోకా కోలా కంపెనీ ప్లాంట్ మూలంగానే తమకు మంచినీళ్ల కరువు వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సదరు కంపెనీ భూగర్భజలాలు విపరీతంగా తోడేస్తూ ఉండడం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, అందుకే ఇక్కడినుంచి ఆ కోకా కోలా బాట్లింగ్ ప్లాంట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు ఆందోళనకు అధికారులు సహా, కాలిఫోర్నియా కు చెందిన భారతీయ స్వచ్ఛంద సంస్థ మద్దుతుగా నిలిచింది. ఇక్కడి నీటివనరులను కోకా కోలా కంపెనీ కొల్లగొడుతోందని, దీని మూలంగా తమ గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, రైతులు ఇబ్బందులనెదుర్కోవాల్సి వస్తోందని సంస్థ ప్రతినిది అమిత్ శ్రీ వాస్తవ వాదిస్తున్నారు. దీనిపై కోకా కోలా కంపెనీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయితే వీరి ఆరోపణలను కోకా కోలా కంపెనీ ఖండిస్తోంది. నీటి సమస్యకు తమ సంస్థ కారణం కానే కాదని వాదిస్తోంది. ఇక్కడి గ్రామాల్లోని నీటివనరుల పరిమితి క్రమేపీ క్షీణిస్తున్న మాట వాస్తవమేనని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సమర్పించిన ఇటీవలి నివేదిక చెబుతోంది. అయినప్పటికీ స్థానికంగా ఉన్న బోర్లు, బావులలో గృహ వినియోగానికి, గోధుమ, ఆవ తదితర పంటల అవసరాలకు సరిపడేంతగా ఉన్నాయని కూడా పేర్కొంది. -
కోక్ యాడ్లపై కోట్లు కుమ్మరిస్తున్న కోక కోలా
-
నంబర్ వన్ బ్రాండ్.. యాపిల్
న్యూయార్క్: ప్రపంచ అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్ అవతరించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన అత్యంత విలువైన అంతర్జాతీయ బ్రాండ్ల జాబితాలో 10,430 కోట్ల డాలర్ల (గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధి)విలువతో యాపిల్‌కు అగ్రస్థానం దక్కింది. యాపిల్ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. యాపిల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, కోక-కోలా, ఐబీఎం, గూగుల్‌లు నిలిచాయి. ఒక్క భారతీయ కంపెనీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఈ ఫోర్బ్స్ జాబితా వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., ఏ ఇతర బ్రాండ్ల విలువ కన్నా యాపిల్ బ్రాండ్ విలువ రెట్టింపుగా ఉండడం విశేషం. గత మూడేళ్లుగా మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువలో (5,670 కోట్ల డాలర్లు)పెద్దగా మార్పు లేదు. పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ నుంచి మొబైల్ బ్రాండ్‌గా మారడానికి చాలా కష్టాలు పడుతోంది. అయినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 34% సాధించి అత్యంత లాభదాయక అంతర్జాతీయ బ్రాండ్లలలో ఒకటిగా నిలిచింది. 5,490 కోట్ల డాలర్ల విలువతో కోక-కోలా మూడో స్థానంలోనూ, 5,070 కోట్ల డాలర్లతో ఐబీఎం నాలుగో స్థానంలోనూ, 4,730 కోట్ల డాలర్లతో గూగుల్ ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ఇక మొదటి పది స్థానాల్లో మెక్‌డొనాల్డ్స్(బ్రాండ్ విలువ 3,940 కోట్ల డాలర్లు), జనరల్ ఎలక్ట్రిక్(3,420 కోట్ల డాలర్లు), ఇంటెల్(3,090 కోట్ల డాలర్లు), శామ్సంగ్(2,950 కోట్ల డాలర్లు), లూయిస్ వ్యూటన్(2,840 కోట్ల డాలర్లు)చోటు సాధించాయి. గత ఏడాది 610 కోట్ల డాలర్లుగా ఉన్న బ్లాక్‌బెర్రీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 220 కోట్ల డాలర్లకు పడిపోవడంతో టాప్ 100 జాబితా నుంచి బ్లాక్‌బెర్రీని తొలగించారు. మూడేళ్ల క్రితం 2,730 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో 9వ స్థానంలో ఉన్న నోకియా కంపెనీ ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విలువతో 71వ స్థానానికి పడిపోయింది. ఈ టాప్ 100 బ్రాండ్లలో సగం అమెరికావే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ(9 కంపెనీలు), ఫ్రాన్స్(8), జపాన్(7) ఉన్నాయి. -
ఇండియాలో జోరు పెంచుతున్న కోలా కంపెనీలు
-
‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన
ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి కంబోడియా రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రధాని హున్ సెన్, ప్రతిపక్ష నేత శామ్ రైన్సీల మధ్య చర్చల వల్ల రాజకీయ ప్రతిష్టంభన తొలగినా, తొలగకపోయినా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. కపాలాల గుట్టల ఫొటోలతో ఒకప్పుడు మొదటి పేజీ వార్తగా ‘కళకళలాడిన’ కంబోడియా ఇప్పుడు ఎవరికీ పట్టని దేశం. అయినా ఈ మధ్య దానికి ప్రపంచ వార్తల్లో కాస్త చోటు దక్కింది. ఆగ్నేయ ఆసియాలోని ఆ నిరుపేద దేశంలో జూలై చివర్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని హున్ సెన్ మరోమారు ఎన్నిక కావడంలో విశేషమేమీ లేదు. క మ్యూనిస్టు ఖ్మేర్ రూజ్ రక్తసిక్త పాలనస్థానే వియత్నాం సైన్యం నిలిపిన (1985) ‘సోషలిస్టు’ ప్రభుత్వానికి ఆయన ప్రధాని. నాటి నుంచి ఆయనే ఆ దేశానికి తిరుగులేని రాజు. లాంఛనప్రాయపు దేశాధినేత రాజు నరోదమ్ సిహమొని సెప్టెంబర్ 23న హున్ చేత మరోమారు ప్రమాణ స్వీకారం చేయించేసరికి... కంబోడియా హఠాత్తుగా ఏకపార్టీ ప్రజాస్వామ్యంగా మారిపోయింది. పార్లమెంటులో ఉన్నవారంతా హున్ నేతృత్వంలోని కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) సభ్యులే! 1993లో మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి ప్రధాన ప్రతిపక్షమైన కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ) అస్తిత్వం పార్లమెంటులో నామమాత్రమే. ఈసారి ఎన్నికల్లో అది అందరి అంచనాలను మించి, 123 సీట్ల పార్లమెంటులో 55 స్థానాలను గెలుచుకొని హున్‌ను ఖంగు తినిపించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మీడియా ఎలుగెత్తింది. ఇరాన్‌లాంటి దేశాల్లో సంతృప్తికరంగా జరిగిన ఎన్నికలను సైతం అక్రమమని నానా అల్లరి చేసే పాశ్చాత్య దేశాల కళ్లకు కంబోడియా ఎన్నికలు ‘స్వేచ్ఛగా, సక్రమంగా’ జరిగినట్టే కనిపించాయి. ఎన్నికల అక్రమాలు అక్కడ అలవాటే. కాకపోతే ఈసారి అవి శృతిమించాయి. దీంతో సీఎన్ఆర్పీయే గాక, రాజు సిహమొని సైతం నిరసనకు దిగాల్సివచ్చింది. హున్ తమ గెలువును దౌర్జన్యంగా తస్కరించాడని నమ్ముతున్న సీఎన్‌ఆర్‌పీ ససేమిరా పార్లమెంటుకు హాజరుకానని భీష్మించుకు కూచుంది. దీంతో హున్ సొంత పార్టీ సభ్యులతోనే పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే గుడ్డిలో మెల్ల అన్నట్టున్న కంబోడియా ప్రజాస్వామ్యం పూర్తి గుడ్డిది అయ్యే ప్రమాదం ఉంది. మరో ఐదేళ్ల వరకు తమకు ఎదురులేకున్నా 2018 ఎన్నికల్లో ఓటమి తప్పదని హున్‌కు బెంగ. చేతికి అంది నోటికి కాకుండా పోయిన గెలుపు ఇక ఎన్నటికీ తమ మొఖం చూడదని సీఎన్ఆర్పీకి బెంగ. రెండు పార్టీల బెంగలకు కారణం ఒక్కటే... చెరకు! ఒకటిన్నర కోట్ల కంబోడియన్లలో అత్యధికులకు జీవనోపాధి వ్యవసాయమే. అత్యంత సారవంతమైన వరి పండించే భూములను, నీటి వనరులను గత కొన్నేళ్లుగా ‘చెరకు’ కబళించేస్తోంది. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు వారు సాగు చేస్తున్న భూములు వారివి కావని ప్లాంటేషన్ కంపెనీలు ‘కనువిప్పు’ కలిగిస్తున్నాయి. ఒకప్పుడు ఖ్మేర్ రూజ్ కమ్యూనిస్టులు పాత భూముల రికార్డులను తగులబెట్టేశారు. రైతులకు యాజమాన్య ధృవీకరణ పత్రాలు లేవు. దీంతో చెరకు ప్లాంటేషన్ల ఆక్రమణ నిరాఘాటంగా సాగుతోంది. అంతర్జాతీయ విపణిలో గత కొన్నేళ్లుగా చక్కెర ధరలు బాగా పెరిగాయి. 2020 నాటికి చెరకు డిమాండు 25 శాతానికి పైగానే పెరుగుతుందని అంచనా. బయో ఇంధనం మిథేన్‌గా కూడా చెరకు ప్రాధాన్యం పెరగుతోంది. దీంతో పాశ్చాత్య గుత్త సంస్థలు ఆగ్నేయ ఆసియాపై కన్నేశాయి. కంబోడియా, వియత్నాం, మైన్మార్, థాయ్‌లాండ్‌లలో గుత్తసంస్థల చెరకు ప్లాంటేషన్లు విస్తరిస్తున్నాయి. కంబోడియాలోలాగే అన్ని చోట్లా తరతమ స్థాయిల్లో రైతుల భూములను ప్లాంటేషన్లు మింగేస్తున్నాయి. కంబోడియా రైతుల నోళ్లల్లో మన్నుకొట్టి పండిస్తున్న చెరకు థాయ్‌ల్యాండ్‌లో చక్కెరగా మారి, యూరప్‌కు చేరుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారమే 2010 నాటికి కంబోడియాలోని 61 పెద్ద ప్లాంటేషన్లకు లక్ష హెక్టార్ల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఫలితంగా దాదాపు 7 లక్షల కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయి. నేతల, అధికారుల అండదండలతో విస్తరిస్తున్న చిన్న ప్లాంటేషన్లకు లెక్క లేదు. ప్రసుత్తం మధ్య కంబోడియాలోని కోమ్పాంగ్ స్ప్యూ రాష్ట్రంలోని పది గ్రామాల్లో చెరకు ప్లాంటేషన్ల వల్ల వీధినపడ్డ వెయ్యి కుటుంబాలు తమ భూముల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఈ రైతాంగ అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిఫలించింది. అందుకే భవిష్యత్తుపట్ల రెండు ప్రధాన పార్టీలకు బెంగ. రైతుల వద్ద భూ యాజమాన్యాన్ని రుజువుచే సే పత్రాలు లేవని, కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఎలాంటి చర్యలు తేసుకోలేమని ప్రభుత్వం సెలవిస్తోంది. ప్లాంటేషన్లకు భూములపై 99 ఏళ్ల హక్కులను దఖలు పరుస్తున్న ప్రభుత్వం ఏక పంటగా చెరకును దశాబ్దాలపాటు సాగుచేయడానికి అంగీకరిస్తోంది. భూసారం నశించిపోవడంతోపాటూ ఇది పర్యావరణానికి తీవ్ర హానిని చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2005 నుంచి విదేశాల్లో ప్రవాసంలో ఉండి దేశానికి తిరిగి వచ్చిన సీఎన్‌ఆర్‌పీ నేత శామ్ రైన్సీ సైతం ఈ ‘అభివృద్ధి’కి అనుకూలురే. కాబట్టి సీఎన్‌ఆర్‌పీ, సీపీపీల మధ్య అధికార పంపకం చర్చలు ఫలించినా ఫలించకున్నా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. - పిళ్లా వెంకటేశ్వరరావు