కోకాకోలాకు వందెకరాలు | The government issued orders | Sakshi
Sakshi News home page

కోకాకోలాకు వందెకరాలు

Jun 14 2016 8:59 AM | Updated on Sep 4 2017 2:23 AM

హిందుస్థాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం వద్ద

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రూ.1375 కోట్లతో ఏర్పాటు
పదేళ్లలో 3,645 మందికి ఉపాధి

విశాఖపట్నం : హిందుస్థాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం వద్ద వందెకరాలు కేటాయిస్తూ వాణిజ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోలోమన్  ఆరోక్యరాజు సోమవారం జీవో ఎంఎస్ నెం. 82ను జారీ చేశారు. రూ.1375 కోట్ల పెట్టుబడులతో ఈ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. పదేళ్ల కాలపరిమితిలో మూడు విడతల్లో 3,645 మందికి ఉపాధి కల్పించనున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఈ పాజెక్టు ఏర్పాటు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను టెక్నికల్ కన్సల్టెంట్‌కు పంపారు.


కన్సల్టెంట్ సిఫార్సు మేరకు ఈ కంపెనీకి రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇండస్ట్రియల్ పార్కులో భూమి కేటాయిస్తూ స్టేట్ లెవల్ ల్యాండ్ ఎలాంట్ మెంట్ కమిటీలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కార్యదర్శి పేర్కొన్నారు. నిర్ణీత గడువు పదేళ్లలోగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కమిట్‌మెంట్ ప్రకారం ఉపాధి కల్పించకపోతే భూమి కేటాయింపు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేలా సబ్జెక్టు టు కండీషన్స్‌తో ల్యాండ్ ఎలాట్ చేస్తున్నామన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement