
ఐపీఎల్ స్పాన్సర్ గా కోకాకోలా!
న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు స్పాన్సర్ గా వ్యవహరించేందుకు ప్రముఖ శీతలపానీయ కంపెనీ కోకాకోలా ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఐపీఎల్ లోని కొన్ని జట్లతో చర్చలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లను కలిసిన కోకాకోలా యాజమాన్యం.. మరికొన్ని జట్లతో చర్చించిన పిదప నిర్ణయం తీసుకోనుంది. గతంలో ఐపీఎల్ కు స్పాన్సర్ గా కోకాకోలా వ్యవహరించినా.. 2012లో బీసీసీఐతో పెప్పీ ఒప్పందం కుదుర్చుకుని మూడేళ్ల పాటు స్పాన్సర్ గా కొనసాగింది. కాగా, ఇటీవల పెప్పీ తన స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగింది.
బీసీసీఐతో ఒప్పందం ప్రకారం 2017 వరకు పెప్పీ స్పాన్సర్ గా కొనసాగాల్సి ఉంది. దీనికోసం బోర్డుతో రూ.396 కోట్ల భారీ మొత్తంతో డీల్ కుదుర్చుకుంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఐపీఎల్ ప్రతిష్టకు అపఖ్యాతి ఏర్పడిందన్న కారణంతో ఈ కూల్‌డ్రింక్ కంపెనీ తన మనసు మార్చుకుని స్సాన్సర్షిప్ నుంచి తప్పుకుంది.