ఆర్థిక మంత్రికే కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కష్టాలు.. వీడియో వైరల్‌ | Viral Video: Rishi Sunak Struggled With Contactless Payment | Sakshi
Sakshi News home page

viral video: ఆర్థిక మంత్రికే కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కష్టాలు.. వీడియో వైరల్‌

Mar 24 2022 9:17 PM | Updated on Mar 24 2022 9:37 PM

Viral Video: Rishi Sunak Struggled With Contactless Payment  - Sakshi

బ్రిటిష్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కష్టాలు. పాపం బార్‌కోడ్‌ మిషన్‌ వద్ద ఏటీఎం కార్డు పెట్టి తికమక పడుతున్న మంత్రి

He Scan His Bank Card On A Bar Code: చాలా పెద్ద హోదాలోని వ్యక్తులు ఒక్కొసారి తికమక పడో లేక కన్ఫ్యూజ్‌  అ‍వ్వడం వల్లే చాలా తెలివతక్కుగా ప్రవర్తిస్తుంటారు. అది కూడా చాలా సింపుల్‌ విషయాల్లో చేస్తుంటారు. అచ్చం అలానే ఒక ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఎంత విచిత్రమైన పని చేశాడో చూడండి.

వివరాల్లోకెళ్తే...బ్రిటిష్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపులతో ఇ‍బ్బందులు పడ్డారు. ఆయన ఒక దుకాణానికి వెళ్లి కోకాకోలా టిన్‌ని కొన్నారు. బిల్‌ పే చేసేటప్పడూ మనం కొన్న వస్తువును దుకాణదారుడు బార్‌కోడ్‌ మిషన్‌తో స్కాన్‌ చేయడం సహజం. అయితే ఆ మంత్రి బార్‌కోడ్‌ మిషన్‌ వద్ద తన ఏటీఎం కార్డుని పెడతారు.

దీంతో సదరు దుకాణదారుడు సార్‌ కోకాకోలాని పెట్టండి అని అంటాడు. ఇంతకీ రిషి ఎవరంటే...రిచ్‌మండ్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుడు మాత్రమే గాక తదుపరి ఎన్నికల్లో ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్థానంలో బుక్‌మేకర్‌లకు ఇష్టమైన వ్యక్తి కూడా. అంతేకాదండోయ్‌ ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి భర్త కూడా.

(చదవండి: పెంపుడు కుక్క ఐతే మాత్రం మరీ ఇలాంటి పేరా!... మండిపడతున్న నెటిజన్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement