Bill payments
-
TGSPDCL: ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి
సాక్షి,హైదరాబాద్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా ఈజీగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్ యాప్స్ ఈ సేవలను నిలిపి వేశాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024 -
చిల్లర డబ్బులతో రెస్టారెంట్ బిల్ చెల్లింపు! వీడియో వైరల్
ఇక్కడొక వ్యక్తి రెస్టారెంట్ బిల్‌ని చిల్లర పైసలతో చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్న రెస్టారెంట్‌లోని వ్యక్తులంతా ఒక్కసారిగా అతని వైపు విచిత్రంగా చూస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ముంబైకి చెందిన సిద్ధేష్ లోకరే అనే వ్యక్తి తాజ్‌మహల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లి చిల్లర డబ్బులతో బిల్ పే చేయాలనుకుంటాడు. అనుక్నుట్లుగానే రెస్టారెంట్‌కి వెళ్లాడు. రెస్టారెంట్‌కి వెళ్లాలంటే అక్కడ ఉన్నవాళ్లు మొదటగా చూసేది మన లుక్ అందుకని లోకర్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన పిజ్జా, మాంక్టైల్ డ్రింక్‌ని ఆర్డర్ చేసి శుభ్రంగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్ పే చేసేందుకు అదే టేబుల్‌పై చిల్లర నాణేలను లెక్క పెట్టుకుంటూ వరుసగా పేర్చి ఉంచాడు. ఇంతలో సర్వర్ వస్తాడు అతను వాటిని చూసి నవ్వుతూ తీసుకుని వెళ్లిపోతాడు. చివర్లో లోకర్ అతన్ని లెక్కచూసుకోమంటే పర్వాలేదు లెక్కపెట్టుకుంటాం అని నవ్వుతూ బదులిస్తాడు. ఈ వీడియోకి మిత్రమా డాలర్‌తో చెల్లిస్తామా లేక మరేదైనా అనేది విషయం కాదు కేవలం బిల్ పే చేయడం ముఖ్యం అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. అంతేకాదు చివర్లో మనం ఒక రెస్టారెంట్‌కో లేదా ఎక్కడికైనా మనల్ని ప్రజలందరూ గమనిస్తారన్న భయంతో లేనిపోని హంగులకు పోతామే తప్ప మనం ఎలా ఉన్నామో అలా కనిపించేందుకు అస్సలు ఇష్టపడం. పైగా ఇలా చేస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఇతరులకు నచ్చినట్లు ఉంటే మనకు నచ్చిన విధంగా ఉండటం మర్చిపోతుంటాం అని ఒక చక్కని సందేశం కూడా ఇచ్చాడు. ఐతే ఈ స్టంట్‌ని చూసి నెటిజన్లు.. "మంచి సందేశం. మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. మనమే ఇతరులను అనుకరిస్తూ మనకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాం." ఇది నిజం అంటూ సదరు వ్యక్తిని మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: 'విజిల్ విలేజ్'! అక్కడ గ్రామస్తులు పేర్లు ఎలా ఉంటాయంటే.) -
ఆర్థిక మంత్రికే కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కష్టాలు.. వీడియో వైరల్
He Scan His Bank Card On A Bar Code: చాలా పెద్ద హోదాలోని వ్యక్తులు ఒక్కొసారి తికమక పడో లేక కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే చాలా తెలివతక్కుగా ప్రవర్తిస్తుంటారు. అది కూడా చాలా సింపుల్ విషయాల్లో చేస్తుంటారు. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎంత విచిత్రమైన పని చేశాడో చూడండి. వివరాల్లోకెళ్తే...బ్రిటిష్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపులతో ఇబ్బందులు పడ్డారు. ఆయన ఒక దుకాణానికి వెళ్లి కోకాకోలా టిన్ని కొన్నారు. బిల్ పే చేసేటప్పడూ మనం కొన్న వస్తువును దుకాణదారుడు బార్కోడ్ మిషన్‌తో స్కాన్ చేయడం సహజం. అయితే ఆ మంత్రి బార్కోడ్ మిషన్ వద్ద తన ఏటీఎం కార్డుని పెడతారు. దీంతో సదరు దుకాణదారుడు సార్ కోకాకోలాని పెట్టండి అని అంటాడు. ఇంతకీ రిషి ఎవరంటే...రిచ్మండ్కు చెందిన కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుడు మాత్రమే గాక తదుపరి ఎన్నికల్లో ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్థానంలో బుక్మేకర్లకు ఇష్టమైన వ్యక్తి కూడా. అంతేకాదండోయ్ ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి భర్త కూడా. chancellor of the exchequer doesn’t know how to use contactless my head’s gone pic.twitter.com/h2yBKVMu2K — lucy (@LMAsaysno) March 23, 2022 (చదవండి: పెంపుడు కుక్క ఐతే మాత్రం మరీ ఇలాంటి పేరా!... మండిపడతున్న నెటిజన్లు) -
మారని తీరు.. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రూ.కోటికి పైగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా కరెంటును యధావిధిగా వాడుకోవడంతో శాఖ అధికారులు హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)పై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు నమోదు చేశారు. దీంతో హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్తు శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇటీవల అధికారులు బకాయిల విషయమై హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసినా.. చెల్లించకపోవడంతో సరఫరా నిలిపేశారు. చదవండి: (Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..?) -
రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్.. ఏకంగా..
How To Secure Digital Payment Transactions Safe Expert Suggestions: ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడానికి గీత (పేరు మార్చడమైనది) తన స్నేహితులతో రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆర్డర్ ఇచ్చినవన్నీ టేబుల్ మీద అందంగా అమర్చారు అక్కడి వెయిటర్లు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడి పదార్థాలను ఆస్వాదించారు. ఇక చివర్లో వెయిటర్ బిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అది చూసిన గీత తన బ్యాగ్‌లో నుంచి క్రెడిట్ కార్డు తీసి, బిల్ ఉన్న బుక్‌లో పెట్టి వెయిటర్ని పిలిచి, పిన్ నెంబర్ కూడా చెప్పి, స్వైప్ చేసి తీసుకురమ్మంది. వెయిటర్ బిల్ పే చేసి, ఆమె కార్డును ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. పది రోజులు గడిచాయి. తన క్రెడిట్ కార్డు నుంచి అరవై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. షాక్ అయ్యింది గీత. తను ఎక్కడ ట్రాన్సాక్షన్స్ చేసిందో కూడా అర్థం కాలేదు. వేరే రాష్ట్రంలో తను షాపింగ్ చేసినట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే షాపింగ్ ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పారు. మోసం జరిగిందనుకుంటే వెంటనే కార్డు బ్లాక్ చేసుకోమని, మరో కార్డుకు అప్లై చేయమని సూచించారు. క్రెడిట్ కార్డు తన వద్దే ఉంటే అసలు మోసం ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు గీతకు. ∙∙ నగదును మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్కెట్లోకి వచ్చేశాం. లావాదేవీలన్నీ చాలావరకు డిజిటల్ మార్గంలోనే జరుగుతున్నాయి. ఫలితంగా మోసగాళ్లు డిజిటల్ నుంచే పుట్టుకు వస్తున్నారు. ఏ విధంగా మన వద్ద ఉన్న మొత్తాన్ని రాబట్టాలో రకరకాల మార్గాల ద్వారా వ్యూహాలను పన్నుతున్నారు. గీతకు మోసం ఎక్కడ జరిగిందంటే.. రెస్టారెంట్ లో వెయిటర్‌కు బిల్ పే చేయమని కార్డు, పిన్ నెంబర్ ఇచ్చేసింది. దీంతో ఆ వెయిటర్ రెస్టారెంట్ స్వైప్ మిషన్ కన్నా ముందు అరచేతిలో పట్టేంత ఉన్న తన మరో మిషన్‌లో స్వైప్ చేశాడు. దీంతో కార్డులో ఉన్న చిప్ ద్వారా ఆ డేటా అతని మిషన్‌లోకి చేరింది. అటు తర్వాత రెస్టారెంట్ బిల్ పే చేసి, తిరిగి ఆ కార్డును ఆమెకు ఇచ్చేశాడు. ఆ వెయిటర్ అలా డేటా సేకరించడానికి మోసగాళ్లు అతనితో ముందుగానే ‘డీల్’ కుదుర్చుకున్నారు. దీంతో గీత కార్డు వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. పది రోజుల తర్వాత గీత కార్డు బిల్ మొత్తం కట్టేశాక, క్రెడిట్ బ్యాలన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని గ్రహించిన మోసగాళ్లు అంత మొత్తాన్ని ఆమె కార్డు ద్వారా దొంగిలించేశారు. ∙∙ కార్డ్ స్కిమ్, కాపీ, క్లోన్... డేటా ద్వారా కొత్త కార్డులను తయారు చేసే ముఠాలు తయారవుతున్నాయి. ఎక్కువగా రొమేనియన్స్ చేసే ఈ మోసాలు ఇప్పుడు ఇతరులూ చేస్తున్నారు. డార్క్ వెబ్‌లో స్కిమ్మర్, బ్లాక్ కార్డ్ మేకర్స్ కూడా లభించడం, అచ్చం క్రెడిట్/ డెబిట్ కార్డులను పోలి ఉన్నవి తయారుచే సుకోవడం కూడా మోసం చేయడానికి రాచమార్గం. కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలంటే... ► మీ కార్డుల వివరాలకు ఎట్టి పరిస్థితులో మీరే రక్షకులు. ► కార్డు ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ మిషన్ ద్వారా మీ కార్డు నుంచి డెబిట్ చేశాక, ఎంత మొత్తం డెబిట్ చేశారో రిటైలర్ ను అడగండి. ► కొత్త కార్డులు వచ్చిన వెంటనే, ఆ కార్డుపైన సంతకం చేయాల్సిన చోట తప్పనిసరిగా సంతకం చేయండి. ► బిల్లు చెల్లించి, రశీదు తీసుకున్నాక ఒకసారి ఆన్లైన్ స్టేట్మెంట్లో సరిచూసుకోవాలి. ► కార్డు లావాదేవీల ద్వారా పొందిన రశీదులను, మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తపరచుకోవడాన్ని విస్మరించకూడదు. ► మీ కార్డులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. నగదు, మనీ పర్సుల్లానే జాగ్రత్త పరుచుకోవాలి. ► కార్డు మీద పిన్ నెంబర్ రాయకూడదు. అలాగే పిన్ నెంబర్ ఎవరికీ చెప్పకూడదు. ► ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నప్పుడు మీరు ఉపయోగించే సిస్టమ్ యాంటీవైరస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉన్నదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఇంటర్నెట్ ద్వారా నమ్మకమైన సైట్స్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు మాత్రమే చేయండి. అందుకు భద్రతా నియమాలు పాటించండి. ► ఎక్స్పైరీ డేట్ అయిపోయాక వాటి స్థానంలోకి రీప్లేస్మెంట్ కార్డ్స్ వస్తాయి. ఇలాంటప్పుడు పాత కార్డులను అలాగే పడేయకుండా వాటిలో ఉన్న మాగ్నెటిక్ చిప్‌ను తొలగించాలి. అలాగే ఉపయోగంలో లేని కార్డులను బ్లాక్ చేయాలి. ► లావాదేవీలు జరిపిన తర్వాత పిన్నెంబర్ను మార్చుకోవడం మంచిది. రివార్డ్ పాయింట్స్ రిడెమ్షన్ గురించి అయినా, కార్డు సమాచారం గురించైనా వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తులకు సివివి/ఓటీపీ/క్యూ ఆర్ కోడ్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకుకు సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఈ గోప్యతా వివరాలను అడగరు. కాబట్టి, గోప్యతా వివరాల పట్ల జాగ్రత్త అవసరం. కార్డు ద్వారా చేసే పేమెంట్ (పిఒఎస్) కార్డు స్కిమ్మింగ్ (మీ వివరాలను కార్డు నుంచి రాబట్టే పరికరం) ఎక్కువగా రిటెయిల్ ఔట్లెట్స్, బార్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ టికెట్ మెషిన్స్, పెట్రోల్ స్టేషన్లలో జరిగే అవకాశాలు ఎక్కువ. ► కార్డు ద్వారా నగదు బదిలీ చేసే సమయంలో మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ చేసేటప్పుడు మీ కార్డు మీకు కనిపించాలనే విషయం స్పష్టంగా చెప్పండి. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా మోసాలు ఎలా జరుగుతాయంటే..? ► మోసగాళ్ల దగ్గర స్టోర్ కార్డ్ రీడర్ మిషన్, దొంగ కార్డు మిషన్ రెండూ ఉంటాయి. ∙మీరు కార్డు ఇవ్వగానే కార్డు స్కిమ్మర్ చేసి, డేటా దొంగిలిస్తారు ∙ఎటిఎమ్ మిషన్లలో అయితే.. కీ బోర్డ్ ప్లేస్‌లో మోసగాళ్లు మరో కీ బోర్డ్‌ను ఇన్స్టాల్ చేస్తారు. ∙స్వైపింగ్ మిషన్‌కు సూక్ష్మమైన కెమెరాను సెట్ చేస్తారు. ఎటిఎమ్‌లలో కార్డును ఉపయోగిస్తుంటే.. ► కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారి నుంచి జాగ్రత్త. ► మీ పిన్ నెంబర్ మీ నగదుకు కవచం అనే విషయం మర్చిపోవద్దు ► కార్డు పనిచేయనప్పుడు, మిషన్‌లో ఉండిపోయినప్పుడు వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలి ► ట్యాంపరింగ్ సంకేతాలు ఏమైనా కనిపిస్తే ఎటిఎమ్ కార్డును ఉపయోగించవద్దు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Most Famous Afghanistan Refugee: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి -
డిజిటల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: ఆన్లైన్ విధానంలో విద్యుత్ బిల్లుల చెల్లింపుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. బిల్లు వసూలు కేంద్రాలను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రతినెలా వచ్చే బిల్లులను వినియోగదారుడికి మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక మీదట తేలికగా డిస్కమ్ సైట్‌కు లింక్ అయ్యి, గేట్ వే ద్వారా బిల్లులు చెల్లించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సులభం ► రాష్ట్రంలో 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.43,447 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు జరుగుతాయి. ఇందులో రూ.26,431 కోట్లు వినియోగదారుల నుంచి వసూలవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.3,102 కోట్లు, మిగతా మొత్తం ఇతర సబ్సిడీల రూపంలో డిస్కమ్‌ల ఖాతాల్లో చేరతాయి. ► ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ మీటర్లు పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన రూ.26,431 కోట్ల రెవెన్యూ సమస్యగా మారుతోంది. రెవెన్యూ కేంద్రాల నిర్వాహణకు డిస్కమ్‌లు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలు ఈ ఖర్చును తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. ► కరోనా నేపథ్యంలో రెవెన్యూ కేంద్రాలకు వెళ్లి బిల్లు కట్టే సంప్రదాయ వినియోగదారులు చెల్లింపులు ఆపేస్తున్నారు. ఎక్కువ సేపు లైన్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీనివల్ల డిస్కమ్‌ల రెవెన్యూ తగ్గిపోతున్నాయి. గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే దాదాపు 38 శాతం రెవెన్యూ వసూళ్లు తగ్గినట్టు తేలింది. ► క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అవసరమైతే గ్రామ సచివాలయం వలంటీర్లను ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ► మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా పూర్తిస్థాయిలో ఆన్లైన్ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇక అక్కడ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’!
కాన్బెరా: తమ మాధ్యమాలలో కనిపించే వార్తలకు, వార్తాకథనాలకు సంబంధించి ఆయా ఆస్ట్రేలియన్ వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా కొత్త చట్టం తీసుకువస్తోంది. సంబంధిత బిల్లుపై వచ్చేవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ జరగనుంది. డిసెంబర్ నెలలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఈ బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి, ముసాయిదా బిల్లులో ఎలాంటి మార్పులు అవసరం లేదని శుక్రవారం నివేదిక ఇచ్చింది. ఈ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’ ఆచరణ సాధ్యం కాదన్న గూగుల్, ఫేస్‌బుక్‌ల వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై కనిపించే వార్తలకు సంబంధిత ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది. తమ యూజర్లు ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తలను షేర్ చేసుకోకుండా నిషేధిస్తామని ఫేస్బుక్ కూడా పేర్కొంది. -
అజాగ్రత్తకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, అమరావతి: నిత్య జీవితంలో డిజిటల్ కార్యకలాపాలు సర్వసాధారణంగా మారిపోయాయి. నగదు లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి వాటిని మెజారిటీ వ్యక్తులు ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే పూర్తి చేస్తున్నారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నగదు లావాదేవీలపై ఆధారపడడం కంటే ఈ విధానంలోనే చెల్లింపులు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. లావాదేవీలను చక్కబెట్టే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా అత్యధిక శాతం మంది వినియోగదారులు పట్టించుకోవడం లేదు. నెటిజన్లలో ఏకంగా 52% మంది సైబర్ భద్రతను పట్టించుకోవడం లేదని ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ సంస్థ ఓఎల్ఎక్స్ వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన ‘ఇంటర్నెట్ బిహేవియర్’ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. – ఆన్లైన్ కార్యకలాపాల సమయంలో నెటిజన్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బయటకు చెప్పకూడని విషయాలను వెల్లడిస్తున్నారు. – సోషల్ మీడియా సాధనాలైన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ వంటి వాటిలో తమ పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని తేలింది. – ఏకంగా 52 శాతం మంది తమ ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత చిరునామా, ఇతర సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. – 26 శాతం మంది బ్యాంక్ లావాదేవీల సమయంలో తమకు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్ట్‌వర్డ్)లను కూడా నిర్లక్ష్యంగా షేర్ చేస్తున్నారు. – బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, వాటి పాస్వర్డ్లు, యూపీఐ పిన్, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను 22% మంది ఇతరులతో పంచుకుంటున్నారు. – 73 శాతం మంది టరŠమ్స్ అండ్ కండీషన్స్‌ను (నిబంధనలు–షరతులు), లీగల్ గైడ్‌లైన్స్‌ను చదవడంలేదు. వీటిని పరిశీలించకుండానే ఆమోదించడం, స్కిప్ చేయడం వంటివి చేస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే ఆయా ఇంటర్నెట్ సర్వీసెస్‌ను సైన్ చేసే సమయంలో పూర్తిగా చదువుతున్నారు. – 61 శాతం మంది నెలలో ఐదు కంటె ఎక్కువసార్లు ఆన్లైన్ ద్వారా డబ్బు బదిలీ చేయడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం చేస్తున్నారు. ఇక 37 శాతం మంది మాత్రమే ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకుంటున్నారు. – 60 శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో పట్టించుకోవడంలేదు. – సర్వే కోసం.. 15 నుంచి 55 సంవత్సరాల వయసున్న 7,500 మంది ఇంటర్నెట్ వినియోగదారులను విశ్లేషించినట్లు ఓఎల్ఎక్స్ పేర్కొంది. -
పేటీఎంతో మరింత సులభంగా చెల్లింపులు..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంటి దగ్గర నుంచే తమ విద్యుత్, వాటర్, ఇతర బిల్లులను పేటీఎం యాప్ ద్వారా సులభంగా చెల్లించవచ్చని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ తెలిపారు. ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్‌ను పేటీఎం యాప్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) వంటి అత్యవసరాల బిల్లులను పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ‘‘బిల్లులను చెల్లించడానికి సంబంధింత వెబ్సైట్లకు మారాల్సిన అవసరం లేకుండానే వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఐకాన్ల నుంచి ఎంపిక చేసుకునే విధంగా రూపొందించాం. వినియోగదారులు తమ మొబైల్, డీటీహెచ్ రీచార్జ్‌లు, ఎలక్ట్రిసిటీ , క్రెడిట్ కార్డ్ వంటి చెల్లింపులు చేసేందుకు ఈ నూతన యాప్ ఉపయోగపడుతుంది. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఉన్నాయి. బీమా సేవలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బై ఇన్సూరెన్స్ ట్యాబ్ ఉంటుందని’’ వివరించారు. తమ అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ బిల్లును కొద్ది నిమిషాల్లోనే చెల్లించవచ్చన్నారు. సొసైటీ / అపార్ట్ మెంట్ పే టీఎం యాప్ లో నమోదు కాకున్నా కూడా కొన్ని సరళమైన స్టెప్స్ ద్వారా చెల్లింపులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. పేటీఎం యాప్ ఇంటర్ఫేస్ను పునరుద్ధరించామని.. తద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలు సులభంగా ఎసెన్సియల్ పేమెంట్ ఐకాన్‌ను చూడగలుగుతారన్నారు. కరోనాపై సమాచారంతో పాటు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని... దీంతో వివిధ సోషల్ మీడియా వేదికల్లో అవాస్తవ సమాచారం కారణంగా తప్పుదారి పట్టకుండా ఉంటారన్నారు. వివిధ జాతీయ, ప్రాంతీయ మీడియా పబ్లికేషన్లకు సంబంధించి ఉచిత యాక్సెన్‌ను కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ సాయంతో యూజర్లు ఈ వైరస్‌కు తమ రిస్క్ ఫ్యాక్టర్ గురించి పరీక్షించుకోవచ్చన్నారు. సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత చర్యలు పాటించవచ్చన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పేటీఎం పలు కార్యక్రమాలను ప్రారంభించిందని.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పీఎం కేర్ ఫండ్ కోసం రూ.500 కోట్లను అందించేందుకు తమ కంపెనీ విరాళాలు సేకరిస్తోందని పేర్కొన్నారు. అదనంగా కూలీలకు ఆహారం అందించేందుకు కూడా విరాళాలు సేకరిస్తున్నామన్నారు. కేవీఎన్ ఫౌండేషన్ కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. -
నోట్ల రద్దు GHMCకి కలిసొచ్చింది..
-
మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టిన జనం
-
ఒక్కరోజే రూ.50 కోట్ల ఆదాయం
-
జీహెచ్ఎంసీకి కలిసొచ్చింది..
పాత నోట్లతో బిల్లుల చెల్లింపులు ఒక్కరోజే రూ.50 కోట్ల ఆదాయం ఈ నెల 14 వరకు అవకాశం... సిటీబ్యూరో : పాత పెద్దనోట్ల రద్దు పథకం ఎవరికెలా ఉన్నా జీహెచ్ఎంసీకి మాత్రం ఆయాచిత వరంగా మారింది. అసలే ఖజానా లోటుతో సిబ్బంది జీతభత్యాలకు సైతం అల్లాడుతున్న జీహెచ్ఎంసీకి శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.50 కోట్లు ఖజానాకు చేరారుు. దీంతో వచ్చేనెల జీతాల చెల్లింపులకు పెద్దగా ఇబ్బంది ఉండదని జీహెచ్ఎంసీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారుు. గత కొంతకాలంగా వివిధ కారణాలతో జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందుల్లో పడటం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి జీతాల చెల్లింపుల సమయానికి ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈనెల గడిస్తే.. డిసెంబర్ ఒకటోతేదీ నాటికి జీతాలు ఎలా చెల్లించాలా అని ఆందోళనలో ఉన్న ఉన్నతాధికారులకు పెద్దనోట్ల రద్దును పురస్కరించుకొని స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఫీజులకు పాతనోట్లు అనుమతించే అవకాశం ఇవ్వడం కొత్త ఆశలు రేకెత్తించింది. వారు ఊహించినట్లుగా శుక్రవారం ఒక్కరోజే రూ. 100 కోట్లు రాకపోరుునప్పటికీ భారీ మొత్తమే ఖజానాకు చేరింది. ఇక దినవారీ ఆదాయం ఎలాగూ రానుండటంతో వచ్చేనెల జీతాలకు ఇబ్బందులుండవని అధికారులు లెక్కలు వేస్తున్నారు. హమ్మయ్య.. ! జీహెచ్ఎంసీకి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు గ్రాంట్లు రాకపోవడం.. మరోవైపు జీహెచ్ఎంసీ ఖజానా నుంచే ఆర్టీసీకి రూ. 330 కోట్లు చెల్లించడం, రూ. 1200 లోపు వారికి ఆస్తిపన్ను మినహారుుంపునివ్వడం తదితర కారణాలతో గతంలో రూ. 800కోట్ల మిగులు నిధులతో ఉన్న జీహెచ్ఎంసీ ఖజానా దివాళా తీసింది. గత రెండు మూడు నెలలుగా జీతాల చెల్లింపులకు సైతం పలు ఇబ్బందులు పడుతున్నారు. . పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తేవడంతో జీహెచ్ఎంసీకి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన గ్రాంట్లలో రూ. 145 కోట్లు రావడంతో నవంబర్ జీతాల చెల్లింపుల గండం గట్టెక్కారు. ఇక డిసెంబర్లో జీతాలను ఎలా చెల్లించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ పథకం ద్వారా భారీ ఆదాయం వచ్చింది. 14 వరకు అవకాశం రద్దరుున రూ. 500, 1000 నోట్లతో వివిధరకాల పన్నులు, ఫీజులు చెల్లించే ఆవకాశాన్ని ఈనెల 14 వరకు పొడిగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను, నల్లాబిల్లు, ట్రేడ్ లెసైన్సులు, తదితర ప్రభుత్వ బిల్లుల్ని పాత పెద్ద నోట్లతో చెల్లించుకోవచ్చునన్నారు. మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజెన్ సర్వీస్సెంటర్లలో ఈ పన్నులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. -
ఖజానాకు తాళం ఇంకెన్నాళ్లు..?
ఇందూరు : ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఫ్రీజింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ విధించిన ఫ్రీజింగ్‌తో ఏ బిల్లులకు మోక్షం కలగడం లేదు. జూన్ 22న అమల్లోకి వచ్చిన ఫ్రీజింగ్ కొద్ది రోజుల పాటు తొలగిపోయింది. అయితే మళ్లీ జూలై మొదటి వారంలో ఆర్థిక శాఖ ఫ్రీజింగ్‌ను అమల్లోకి తెచ్చింది. నాటి నుంచి నేటి వరకు ట్రెజరీకి వేసిన తాళాలను ఆర్థిక శాఖ తెరవకపోవడంతో లెక్క లేనన్ని బిల్లులు చెల్లింపులకు నోచుకోలేవు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు ట్రెజరీ కార్యాలయం చుట్టూ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తం 40 రకాల హెడ్ అకౌంట్లకు చెందిన బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. కాగా గ్రీన్‌చానల్ ద్వారా ప్రభుత్వ పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సామాజిక పెన్షన్ల పథకాల నిధులకు సైతం తాళం పడింది. ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల క్రితం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన బిల్లులే మంజూరు చేయలేదంటే రాష్ట్ర సర్కారు ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉందో అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ఆర్థిక సంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు ఫ్రీజింగ్ నిబంధనను పెట్టడం, రెండు రోజుల పాటు తీసేసి మళ్లీ కొనసాగించడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సర ముగింపు సమయంలో ఫ్రీజింగ్‌ను పెడతారు, కానీ ఇలా నెల రెండు నెలల పాటు కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ఆంక్షలు పెట్టి బిల్లులు నిలుపుదల చేయలేదని అంటున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకు సైతం.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధులకు సైతం ఫ్రీజింగ్ తప్పలేదు. నెలకు పైగా వాటికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన స్కాలర్ షిప్‌లు, పంచాయతీల 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ పథకాల నిధులకు కూడా బ్రేక్ పడింది. ఉద్యోగుల జీపీఎఫ్, పెన్షన్లు, భవనాల, వాహన అద్దెలు, డైట్ చార్జీలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు ఇలా చాలా వాటిని ట్రెజరీ అధికారులు తిప్పి పంపిస్తున్నారు. బిల్లులు చేసినా పాస్ కాకుండా బ్యాంక్‌కు సంబంధించిన సర్వర్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ నిలిపివేసింది. రుణమాఫీయే కారణం ట్రెజరీలో ఫ్రీజింగ్ నిబంధన అమలు కావడానికి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉండడం ఒక కారణమైతే, రెండో కారణం రైతులకు పంట రుణాలమాఫీ కూడా ప్రధాన కారణమేనని ట్రెజరీ అధికారులు అంటున్నారు. రుణమాఫీకి జిల్లాకు ఇప్పటి వరకు రూ. 196 కోట్లు మంజూరు కాగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 98 కోట్ల చెల్లింపులు జరిగాయి. మిగతా నిధులు కూడా చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో ఇతర ఏ బిల్లులును పాస్ చేయడానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ట్రెజరికి విధించిన ఫ్రీజింగ్ నిబంధన ఇప్పట్లో తొలిగే విధంగా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలపడడం, రుణమాఫీ నిధులు చెల్లింపులు పూర్తయిన తరువాతే అన్ని బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు నెలల వరకు ఫ్రీజింగ్ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంక్షలు ఎప్పుటి వరకు ఉంటాయో చెప్పలేం.. – ప్రభాకర్ రెడ్డి, జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారి ఆర్థిక శాఖ విధించిన ఫ్రీజింగ్ ఆంక్షలను అమలు చేస్తున్నాం. కొన్ని రోజులుగా ఫ్రీజింగ్ కొనసాగుతూనే ఉంది. రెండు మూడు బిల్లుల తప్పా మరే ఇతర బిల్లులను పాస్ చేయడం లేదు. ఉద్యోగులు తెచ్చిన బిల్లులను తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నాం. ఫ్రీజింగ్ నిబంధన ఎప్పుడు తొలగిస్తారనే విషయాన్ని ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు వస్తే తప్ప కచ్చితంగా చెప్పలేం. -
బిల్లు రాకపాయె..ఇల్లు ఆగిపాయె!
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో ఆందోళన ఆర్నెళ్లుగా విడుదల కాని బిల్లులు నిర్మాణ రంగంపై ప్రభావం కూలీలకు ఉపాధి కూడా కరువే కొత్త పథకంపైనే ఆశలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలి చిపోయాయి. ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందు కు రావడం లేదు. సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక ధరలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోగా, ఇంటి నిర్మాణాలు సైతం నిలిచిపోవడంతో పనులు దొరక్క కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థిలు నెలకొన్నాయి. ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు బిల్లులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే బిల్లుల చెల్లింపులు మాత్రం అందని ద్రాక్షగా మారాయి. జిల్లాలో సుమారు 1.57 లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. జిల్లాలో మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, అవి ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే 84,168 ఇండ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇండ్లు ప్రాథమిక దశలో ఉండగా, 15,390 ఇండ్లు బేస్మిట్ లెవల్లో, 1,689 ఇండల్లు లెంట ల్ లెవల్లో , రూఫ్ లెవల్లో 5,398 ఇండ్లు ఉన్నాయి. మరో 29,433 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జి ల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,28,391 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది మా ర్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు రూ. 55,340 లక్షలు విడుదల చేసింది. అయితే గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధి దారులకు బిల్లులు చెల్లిస్తారు. బిల్లుల చెల్లింపు ఇలా.. ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి మొత్తం 75 సిమెంట్ బస్తాలు ఇస్తారు. ఇవి గాక బేస్మిట్ లెవల్‌కు రూ.12,380, చార్జీల రూపంలో రూ. 2,100, రూఫ్ లెవల్‌కు రూ. 25,220, చార్జీల రూపంలో రూ. 1100, ప్లాస్టింగ్ లెవల్‌కు రూ.14,400, అదనపు చార్జీల రూపంలో రూ. వెయ్యి కలిపి మొత్తం రూ. 70 వేలు మంజూరు చేసేవారు. పట్టణ ప్రాంతాల్లో 75 సిమెంట్ బస్తాలు, బేసిక్ లెవల్‌కు రూ. 12,380, అదనపు చార్జీలు రూ. 5,100, రూఫ్ లెవల్‌కు రూ. 32,120, అదనపు చార్జీల కింద రూ. 1200, ప్లాస్టరింగ్‌కు రూ. 11,200 ఇరత్రా కలిపి మొత్తం రూ. 80 వేలు చెల్లించేవారు. అదే ఎస్సీ, ఎస్టీల ఇండ్ల నిర్మాణాలకు 75 సిమెంట్ బస్తాలతో పాటు బేసిక్ లెవల్‌కు రూ. 17,380, అదనపు చార్జీలకు రూ. 200, రూఫ్ లెవల్‌కు రూ.34,670 అదనపు చార్జీల రూపంలో రూ.1650, ప్లాస్టరింగ్‌కు రూ. 33,900 అదనపు చార్జీల కింద రు. 1500 మొత్తం కలిపి రూ. 1.05 లక్షలు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.05 లక్షలు, ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 70 వేలు, పట్టణ ప్రాంతల్లో రూ. 80 వేలు చెల్లించేవారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 85 వేలు, ఇతరులకు రూ. 55వేలు మాత్రమే చెల్లించారు. గృ హ నిర్మాణ సామాగ్రి పెరగడంతో ఇళ్ళ నిర్మాణానికి లబ్దిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారు. కలగానే సొంతిల్లు సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకున్న లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసినా బిల్లులు మాత్రం చేతికి అందలేదు. జిల్లాలో మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు అధికారులు లబ్దిదారులకు బిల్లులు చెల్లించలేదు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇండ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన లబ్ధిదారులు తమ ఇండ్లను మధ్యలోనే నిలిపివేశారు. నిర్మాణాలు పూర్తయితే బిల్లులు వస్తాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు బిల్లులు చేతికి అందక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పైగా అధికారులు జిల్లా గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి నివేదిక తయారు చేసిసే పనిలో నిమగ్నమయ్యారు. రూ. 3.5 లక్షలపై ఆశలు ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ. 3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపె డాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చి నెలలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తింపజేస్తారా ? అంటూ చర్చించుకొంటున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు.