ఇక్కడొక వ్యక్తి రెస్టారెంట్ బిల్‌ని చిల్లర పైసలతో చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్న రెస్టారెంట్‌లోని వ్యక్తులంతా ఒక్కసారిగా అతని వైపు విచిత్రంగా చూస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ముంబైకి చెందిన సిద్ధేష్ లోకరే అనే వ్యక్తి తాజ్‌మహల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లి చిల్లర డబ్బులతో బిల్ పే చేయాలనుకుంటాడు. అనుక్నుట్లుగానే రెస్టారెంట్‌కి వెళ్లాడు. రెస్టారెంట్‌కి వెళ్లాలంటే అక్కడ ఉన్నవాళ్లు మొదటగా చూసేది మన లుక్ అందుకని లోకర్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వెళ్లాడు.
అక్కడ తనకు నచ్చిన పిజ్జా, మాంక్‌టైల్ డ్రింక్‌ని ఆర్డర్ చేసి శుభ్రంగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్ పే చేసేందుకు అదే టేబుల్‌పై చిల్లర నాణేలను లెక్క పెట్టుకుంటూ వరుసగా పేర్చి ఉంచాడు. ఇంతలో సర్వర్ వస్తాడు అతను వాటిని చూసి నవ్వుతూ తీసుకుని వెళ్లిపోతాడు. చివర్లో లోకర్ అతన్ని లెక్కచూసుకోమంటే పర్వాలేదు లెక్కపెట్టుకుంటాం అని నవ్వుతూ బదులిస్తాడు. ఈ వీడియోకి మిత్రమా డాలర్‌తో చెల్లిస్తామా లేక మరేదైనా అనేది విషయం కాదు కేవలం బిల్ పే చేయడం ముఖ్యం అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. అంతేకాదు చివర్లో మనం ఒక రెస్టారెంట్‌కో లేదా ఎక్కడికైనా మనల్ని ప్రజలందరూ గమనిస్తారన్న భయంతో లేనిపోని హంగులకు పోతామే తప్ప మనం ఎలా ఉన్నామో అలా కనిపించేందుకు అస్సలు ఇష్టపడం.
పైగా ఇలా చేస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఇతరులకు నచ్చినట్లు ఉంటే మనకు నచ్చిన విధంగా ఉండటం మర్చిపోతుంటాం అని ఒక చక్కని సందేశం కూడా ఇచ్చాడు. ఐతే ఈ స్టంట్‌ని చూసి నెటిజన్లు.. "మంచి సందేశం. మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. మనమే ఇతరులను అనుకరిస్తూ మనకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాం." ఇది నిజం అంటూ సదరు వ్యక్తిని మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో కామెంట్లు పెట్టారు.
(చదవండి: 'విజిల్ విలేజ్'! అక్కడ గ్రామస్తులు పేర్లు ఎలా ఉంటాయంటే.)
Comments
Please login to add a commentAdd a comment