resturant
-
Virat Kohli: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సిటీలో కోహ్లి రెస్టారెంట్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఈ ఢిల్లీ బ్యాటర్.. వన్ 8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఆతిథ్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అద్బుతమైన మెనూతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న వన్ 8 కమ్యూన్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టంనగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ 8 కమ్యూన్లో కోహ్లి భాగస్వామి వర్తిక్ తిహారా మాట్లాడుతూ.. ‘‘సౌత్‌లో మొదట బెంగళూరులో మా రెస్టారెంట్ ఓపెన్ చేశాం.అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ ఆరంభించాం. కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్ కోసం ఇటీవలే ఇక్కడికి వచ్చాడు కూడా! ఇక్కడి ఫుడ్, సిటీ వైబ్.. అన్నీ తను చాలా ఎంజాయ్ చేస్తాడు. కుదిరితే మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభిస్తాం’’ అని ‘సాక్షి’కి తెలిపారు.అతడి ఫేవరెట్ డిష్ ఇదేఅదే విధంగా.. గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల స్థానిక రుచులతో తమ మెనూను నింపేశామని.. ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీతో పాటు సోయా హలీం ఇక్కడ మరో స్పెషాలిటీ అని తెలిపారు. కోహ్లికి ఉన్న అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫుడ్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వర్తిక్ తిహారా పేర్కొన్నారు.ఇక విరాట్ కోహ్లి వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాడని.. మష్రూమ్ డిమ్సమ్ అతడి ఫేవరెట్ డిష్ అని తెలిపారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని రకాల వంటకాలను కోహ్లి ఆస్వాదిస్తాడని పేర్కొన్నారు. రికార్డుల రారాజుగా పేరొందిన రన్‌మెషీన్ కోహ్లి ఫిట్నెస్, డైట్ విషయంలో పక్కాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.భోజనం బాగుందంటూ కితాబులుఇదిలా ఉంటే.. వన్ 8 కమ్యూన్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో కొలువు దీరింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇప్పటికే కింగ్ కోహ్లి అభిమానులు ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారు. ఫుడ్, పార్టీ ప్లేస్ అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయని.. భోజనం కూడా చాలా రుచిగా ఉందని చెబుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్ -
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
-
‘శాడిస్ట్ బాస్‌కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్‌తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో.. రెస్టారెంట్‌లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్‌కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్‌కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్‌లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్‌లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్‌తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్‌లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్‌కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
చిల్లర డబ్బులతో రెస్టారెంట్ బిల్ చెల్లింపు! వీడియో వైరల్
ఇక్కడొక వ్యక్తి రెస్టారెంట్ బిల్‌ని చిల్లర పైసలతో చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్న రెస్టారెంట్‌లోని వ్యక్తులంతా ఒక్కసారిగా అతని వైపు విచిత్రంగా చూస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ముంబైకి చెందిన సిద్ధేష్ లోకరే అనే వ్యక్తి తాజ్‌మహల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లి చిల్లర డబ్బులతో బిల్ పే చేయాలనుకుంటాడు. అనుక్నుట్లుగానే రెస్టారెంట్‌కి వెళ్లాడు. రెస్టారెంట్‌కి వెళ్లాలంటే అక్కడ ఉన్నవాళ్లు మొదటగా చూసేది మన లుక్ అందుకని లోకర్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన పిజ్జా, మాంక్టైల్ డ్రింక్‌ని ఆర్డర్ చేసి శుభ్రంగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్ పే చేసేందుకు అదే టేబుల్‌పై చిల్లర నాణేలను లెక్క పెట్టుకుంటూ వరుసగా పేర్చి ఉంచాడు. ఇంతలో సర్వర్ వస్తాడు అతను వాటిని చూసి నవ్వుతూ తీసుకుని వెళ్లిపోతాడు. చివర్లో లోకర్ అతన్ని లెక్కచూసుకోమంటే పర్వాలేదు లెక్కపెట్టుకుంటాం అని నవ్వుతూ బదులిస్తాడు. ఈ వీడియోకి మిత్రమా డాలర్‌తో చెల్లిస్తామా లేక మరేదైనా అనేది విషయం కాదు కేవలం బిల్ పే చేయడం ముఖ్యం అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. అంతేకాదు చివర్లో మనం ఒక రెస్టారెంట్‌కో లేదా ఎక్కడికైనా మనల్ని ప్రజలందరూ గమనిస్తారన్న భయంతో లేనిపోని హంగులకు పోతామే తప్ప మనం ఎలా ఉన్నామో అలా కనిపించేందుకు అస్సలు ఇష్టపడం. పైగా ఇలా చేస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఇతరులకు నచ్చినట్లు ఉంటే మనకు నచ్చిన విధంగా ఉండటం మర్చిపోతుంటాం అని ఒక చక్కని సందేశం కూడా ఇచ్చాడు. ఐతే ఈ స్టంట్‌ని చూసి నెటిజన్లు.. "మంచి సందేశం. మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. మనమే ఇతరులను అనుకరిస్తూ మనకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాం." ఇది నిజం అంటూ సదరు వ్యక్తిని మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: 'విజిల్ విలేజ్'! అక్కడ గ్రామస్తులు పేర్లు ఎలా ఉంటాయంటే.) -
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!
Doctors amputate teen's legs, fingers: సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అంటే సాధారణంగా వాంతులవడం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. ఫుడ్ పాయిజినింగ్ కారణంగా ఒక్కొసారి కొన్ని కేసుల్లో ప్రాణంతకం కూడా కావచ్చు కానీ చాలావరకు సురక్షితంగా బయటపడతారు. కానీ ఇక్కడొక వ్యక్తికి ఫుడ్ పాయిజినింగ్ అతని జీవితాన్ని అత్యంత విషాదమయంలోకి నెట్టేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని వేడిచేసుకుని తినడం అతనికి అలవాటు. ఎప్పటిలాగానే రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఫ్రిజ్‌లోంచి తీసి వేడిచేసుకుని తిన్నాడు. అయితే అతను తిన్నవెంటనే వాంతులు చేసుకుని తీవ్ర అశ్వస్థకు గురైయ్యాడు. దీంతో అతని స్నేహితుడు ఆసుపత్రితో జాయిన్ చేశాడు. ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపట్లోనే అతని బీపీ పడిపోయి పరిస్థితి క్రిటికల్ అయిపోయింది. దీంతో వైద్యులు అతనికి వైద్యా పరీక్షలు నిర్వహించారు. కానీ అతనికి ఏమైందో అసలు అర్థం కాలేదు. కాసేపటకికి అతని శరీరం దద్దుర్లుగా మారి ఎర్రగా గాయాలు ఏర్పడటం తీవ్ర నోప్పి రావడం జరిగింది. దీంతో అతన్ని హెలికాప్టర్ సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం యూఎస్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ వైద్యులు మెనింగోకాకల్ అనే అంటు వ్యాధి వచ్చినట్లు తెలిపారు. అయితే మెనింగోకాకల్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ టీకాతో నివారించవచ్చు. మెనింగోకోకల్ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారని డాక్టర్లు తెలిపారు. కానీ రోగికి అతని మిడిల్ స్కూల్ వయసులో మెనింగోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నాడని అయితే అతను 16 ఏళ్ల ప్రాయంలో తీసుకోవల్సిన రెండు డోసుల వ్యాక్సిన్‌ని తీసుకోలేదని వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కి గురవ్వడంతో కాలి వేళ్లను చేతి వేళ్లను తీసేశారు. ప్రమాదవశాత్తు ఆ ఇన్ఫెక్షన్ మెదడుకి వ్యాపించలేదు. అయితే ఆ టీనేజర్ ఇప్పుడు కోలుకున్నాడు గానీ ఆ వ్యాధి కారణంగా ఇప్పుడు చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండి. అలాగే ఏదైనా ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం వేడి చేసితినేటప్పుడూ కాస్త ఆలోచించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్ అయిన డాక్టర్లు!) -
హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ!
సరిగ్గా పదేళ్ల క్రితం ఓపెన్ గాంగ్నమ్ స్టైల్ అంటూ కొరియన్ పాప్ సింగర్ సై పాడిన పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతో బీటీఎస్ గ్యాంగ్‌కి ఇండియాలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకి మన దగ్గర సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ఇప్పుడా ఫ్యాన్స్ కోసం మన భాగ్యనగరంలో కొరియన్ రెస్టారెంట్లో వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలు, పాప్ మ్యూజిక్ తర్వాత హంగ్బేస్డ్ నటులైన బ్రూస్లీ, జాకీచాన్లకే ఇండియాలో పెద్ద ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. వారి తర్వాత జెట్లీ, టోనీజాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలు, కొరియన్ నటులను ఇండియన్లు సొంతం చేసుకుంటున్నారు. కే డ్రామాతో పాపులరైన కొరియన్ వెబ్ సిరీస్‌లకు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. కే డ్రామాలో నటులు ఉపయోగించే గార్మెంట్స్, స్టైలింగ్ ఇప్పటికే కాలేజీ అమ్మాయిల్లో పాపులర్ అవ్వగా గత ఏడాది కాలంగా ఆ నటులు తాగే డ్రింక్స్, తినే ఫుడ్ ఐటమ్స్‌కి ఎంటైర్ యూత్‌లో డిమాండ్ పెరిగింది. ఏకంగా రెస్టారెంట్ కే డ్రామాలకు ఉన్న ఫ్యాన్‌బేస్‌ని, యూత్‌లో ఉన్న క్రేజ్‌ని ఆధారం చేసుకుని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కొరియన్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న చో మిన్ యున్ అనే కొరియన్ మహిళ గోగుర్యో పేరుతో ఈ రెస్టారెంట్‌ని మాదాపూర్‌లో ప్రారంభించింది. భారీ మెనూ గోగుర్యో రెస్టారెంట్లో ఫేమస్ కొరియన్ వంటకాలైన జాప్చో, బిబిమ్బాప్, కిమ్బాప్, రమ్యున్, కిమ్చీ ప్యాన్‌కేక్, గ్రిల్ల్డ్ మీట్ ఇలా పలు రకాలైన 11 పేజీలతో కూడి భారీ మెనూని అందిస్తోంది చో మిన్ యున్. ఒకేసారి 80 మంది వెళ్లి ఆస్వాదించేలా ఈ రెస్టారెంట్‌ని తీర్చిదిద్దారు. రెస్టారెంట్ వాల్స్‌పై బే సూజి లాంటి కొరియన్ స్టార్స్ పోస్టర్స్ చూస్తూ స్పీకర్లలో బీటీఎస్ మ్యూజిక్‌ని వింటూ నోరూరించే కొరియన్ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు హైదరాబాదీలు. బిర్యానీ ఒక్కటే కాదు కాస్మోపాటిలన్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. ఆ తర్వాత సౌతిండియన్ తాలిని అందించే హోటళ్లు కోకొళ్లుగా ఉన్నాయి. వీటి తర్వాత ఇటాలియన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లు వచ్చాయి. ఆ తర్వాత రాయలసీమ రుచులు, పల్లె రుచులు, తెలంగాణ రుచులు పేరుతో దేశీ వంటకాలు కూడా ఫేమస్ అయ్యాయి. వాటా వ్యాపారం పుంజుకుంది. ఇక చైనీస్ రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు గల్లీగల్లీకి వెలిశాయి. ఐనప్పటికీ కొరియన్ క్యూజిన్ జాడలు ఇప్పటి వరకు లేవు. కేవలం యూబ్యూబ్‌లో బీటీఎస్, ఓటీటీలో కే డ్రామాల మూలంగా స్థానికంగా ఏర్పడిన ఫ్యాన్ బేస్ కోసమే ఇప్పుడు కొరియన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. చదవండి:ఈ ఫుడ్ డెలివరీ యాప్‌తో బరువు తగ్గుతారు! -
బార్లు,రెస్టారెంట్లు,నైట్‌క్లబ్‌లకు క్యూ కట్టిన నార్వే ప్రజలు
-
జొమాటో ఐపీవో... రిటైల్ ఇన్వెస్టర్ల 5 రెట్ల స్పందన
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లలో టేబుల్స్ బుకింగ్ తదితర సేవల్లో ఉన్న జొమాటో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఐపీవో బుధవారం ప్రారంభం కాగా.. రెండో రోజైన గురువారం సాయంత్రం 5 గంటల వరకు కంపెనీ ఆఫర్ చేస్తున్న షేర్లతో పోలిస్తే 5 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 71.92 కోట్ల షేర్లకు గాను 344.76 కోట్ల షేర్లకు (4.8 రెట్లు) దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజే ఆఫర్ చేస్తున్న షేర్లకు పూర్తిగా బిడ్లు దాఖలు కావడం గమనార్హం. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం కోటా (12.95 కోట్ల షేర్లు) కేటాయించగా.. 34.88 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే 4.7 రెట్ల అధిక స్పందన వచి్చంది. సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీ) కోటా 7 రెట్ల అధిక స్పందన అందుకుంది. శుక్రవారంతో ఐపీవో ముగియనుంది. -
బర్గర్ కింగ్.. బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ తొలి రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా 85 శాతం ప్రీమియంతో రూ. 111 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. వెరసి రూ. 51లాభంతో లిసయ్యింది. తదుపరి రూ. 119 వరకూ ఎగసింది. ప్రస్తుతం రూ. 111 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇటీవలే ముగిసిన బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
డిన్నర్ చేస్తుండగా వచ్చి కాల్పులు జరిపాడు
పెరూ: అది పెరూలోని హ్వారల్ అనే ప్రాంతంలోని ఓ చికెన్ రెస్టారెంటు. క్రిస్మస్ నేపథ్యంలో కస్టమర్లతో నిండుగా ఉంది. అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కటి విందు ఆరగిస్తూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి సాధారణ వ్యక్తిలా వచ్చాడు. నేరుగా జేబులో నుంచి తుపాకీ తీసి అతి సమీపం నుంచి గురిపెట్టాడు. టకటకా అలెగ్రీ రివేరా (32), రాఫెల్ త్రినిడాడ్ (37) అనే ఇద్దరు వ్యక్తులపై ఫైరింగ్ చేశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో అప్పటి వరకు సరదా నిండిన ఆ రెస్టారెంటును ఒక్కసారిగా భయం అలుముకుంది. తాను డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోవడంతోనే వారిపై అతడు కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు. పెరూలో దారుణం చోటుచేసుకుంది.